News In Pics: చిత్రం చెప్పే సంగతులు-2 (05-08-2022)

Published : 05 Aug 2022 12:46 IST
1/26
విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్‌ ఆళ్వా తెరాస ఎంపీలతో కలిసి గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా దిల్లీలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీలు సంతోశ్‌ కుమార్‌, కె.కేశవరావు, నామా నాగేశ్వరరావు, బీబీ పాటిల్‌ తదితరులు పాల్గొన్నారు. విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్‌ ఆళ్వా తెరాస ఎంపీలతో కలిసి గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా దిల్లీలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీలు సంతోశ్‌ కుమార్‌, కె.కేశవరావు, నామా నాగేశ్వరరావు, బీబీ పాటిల్‌ తదితరులు పాల్గొన్నారు.
2/26
3/26
మంత్రి, సినీ నటి రోజా శ్రావణ శుక్రవారం సందర్భంగా యాదాద్రి క్షేత్రాన్ని దర్శించుకొని వరలక్ష్మీ వ్రతం, కోటి కుంకుమార్చనలో పాల్గొన్నారు. మంత్రి, సినీ నటి రోజా శ్రావణ శుక్రవారం సందర్భంగా యాదాద్రి క్షేత్రాన్ని దర్శించుకొని వరలక్ష్మీ వ్రతం, కోటి కుంకుమార్చనలో పాల్గొన్నారు.
4/26
5/26
పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయి వివిధ అంశాలపై చర్చించారు. మరోవైపు దీదీ.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును రాష్ట్రపతి భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయి వివిధ అంశాలపై చర్చించారు. మరోవైపు దీదీ.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును రాష్ట్రపతి భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు.
6/26
7/26
ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌, హర్‌ ఘర్‌ తిరంగాలో భాగంగా విశాఖలోని ఆంధ్రా విశ్వవిద్యాలయంలో 500 అడుగుల భారీ జాతీయ జెండాను ప్రదర్శించారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌, హర్‌ ఘర్‌ తిరంగాలో భాగంగా విశాఖలోని ఆంధ్రా విశ్వవిద్యాలయంలో 500 అడుగుల భారీ జాతీయ జెండాను ప్రదర్శించారు.
8/26
9/26
స్విట్జర్లాండ్‌లోని రైన్‌ జలపాతం శుక్రవారం ఇలా పొంగిపొర్లుతూ కనిపించింది. యూరప్‌లోకెల్లా పొడవైన ఈ జలపాతం అందాలను చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు వస్తుంటారు. స్విట్జర్లాండ్‌లోని రైన్‌ జలపాతం శుక్రవారం ఇలా పొంగిపొర్లుతూ కనిపించింది. యూరప్‌లోకెల్లా పొడవైన ఈ జలపాతం అందాలను చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు వస్తుంటారు.
10/26
11/26
ఎగువ పరీవాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతోంది. జూరాల, సుంకేసుల, హంద్రీ జలాశయాల నుంచి 2,26,361 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతోంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు 5 గేట్లను పది అడుగుల మేర ఎత్తి 1,39,685 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం కుడి, ఎడమ జలవిద్యుత్‌ కేంద్రాల్లో విద్యుత్తు ఉత్పత్తి చేస్తూ 63,083 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. ఎగువ పరీవాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతోంది. జూరాల, సుంకేసుల, హంద్రీ జలాశయాల నుంచి 2,26,361 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతోంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు 5 గేట్లను పది అడుగుల మేర ఎత్తి 1,39,685 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం కుడి, ఎడమ జలవిద్యుత్‌ కేంద్రాల్లో విద్యుత్తు ఉత్పత్తి చేస్తూ 63,083 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు.
12/26
. .
13/26
14/26
ధరల పెరుగుదలను నిరసిస్తూ ఇండియన్‌ యూత్‌ కాంగ్రెస్‌ సభ్యులు ప్రధాని నరేంద్ర మోదీ ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. ధరల పెరుగుదలను నిరసిస్తూ ఇండియన్‌ యూత్‌ కాంగ్రెస్‌ సభ్యులు ప్రధాని నరేంద్ర మోదీ ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు.
15/26
16/26
కరేబియన్‌ పర్యటనలో ఉన్న భారత క్రికెటర్‌ హార్దిక్ పాండ్యా వెస్టిండీస్‌ మాజీ క్రికెటర్‌ కీరన్‌ పొలార్డ్‌ను కలిశారు. ఈ ఫొటోలను ట్విటర్‌లో పంచుకున్న హార్దిక్‌ పాండ్యా.. పొలార్డ్‌ ఇంటికి వెళ్లకుండా కరేబియన్‌ పర్యటన ఎప్పుడూ పూర్తి కాదని తెలుపుతూ పోస్టు పెట్టారు. పొలార్డ్‌, ఆయన కుటుంబం తన ఫేవరేట్‌ అని చెప్పారు. భారత్‌-వెస్టిండీస్‌ మధ్య వెస్టిండీస్‌లో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ జరుగుతున్న విషయం తెలిసిందే. కరేబియన్‌ పర్యటనలో ఉన్న భారత క్రికెటర్‌ హార్దిక్ పాండ్యా వెస్టిండీస్‌ మాజీ క్రికెటర్‌ కీరన్‌ పొలార్డ్‌ను కలిశారు. ఈ ఫొటోలను ట్విటర్‌లో పంచుకున్న హార్దిక్‌ పాండ్యా.. పొలార్డ్‌ ఇంటికి వెళ్లకుండా కరేబియన్‌ పర్యటన ఎప్పుడూ పూర్తి కాదని తెలుపుతూ పోస్టు పెట్టారు. పొలార్డ్‌, ఆయన కుటుంబం తన ఫేవరేట్‌ అని చెప్పారు. భారత్‌-వెస్టిండీస్‌ మధ్య వెస్టిండీస్‌లో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ జరుగుతున్న విషయం తెలిసిందే.
17/26
18/26
శ్రావణ శుక్రవారం సందర్భంగా చార్మినార్‌ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయానికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా చార్మినార్‌ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయానికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
19/26
20/26
21/26
తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి శుక్రవారం విజయవాడలోని కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి భ్రమరాంబ ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం అమ్మవారి ప్రసాదం, చిత్రపటం అందజేశారు. తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి శుక్రవారం విజయవాడలోని కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి భ్రమరాంబ ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం అమ్మవారి ప్రసాదం, చిత్రపటం అందజేశారు.
22/26
తెలంగాణ ఇంటి పార్టీ (తెఇపా) వ్యవస్థాపకుడు, రాష్ట్ర అధ్యక్షుడు డా.చెరుకు సుధాకర్‌ కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు.  తెలంగాణ ఇంటి పార్టీ (తెఇపా) వ్యవస్థాపకుడు, రాష్ట్ర అధ్యక్షుడు డా.చెరుకు సుధాకర్‌ కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు.
23/26
తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర నాలుగో రోజుకు చేరింది. భువనగిరి నియోజకవర్గం పెద్ద రావులపల్లి నుంచి ఇవాళ ఆయన యాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా భట్టుగూడెం-పెద్దరావులపల్లి గ్రామాల మధ్య ప్రవహిస్తున్న మూసీనదిని పరిశీలించారు. సీఎం కేసీఆర్‌ మూసీ ప్రక్షాళన హామీ నెరవేర్చక పోవడంతో కాలుష్య జలాల కంపును భరిస్తూ రైతులు సాగు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని విమర్శించారు. తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర నాలుగో రోజుకు చేరింది. భువనగిరి నియోజకవర్గం పెద్ద రావులపల్లి నుంచి ఇవాళ ఆయన యాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా భట్టుగూడెం-పెద్దరావులపల్లి గ్రామాల మధ్య ప్రవహిస్తున్న మూసీనదిని పరిశీలించారు. సీఎం కేసీఆర్‌ మూసీ ప్రక్షాళన హామీ నెరవేర్చక పోవడంతో కాలుష్య జలాల కంపును భరిస్తూ రైతులు సాగు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని విమర్శించారు.
24/26
25/26
హైదరాబాద్‌ పేట్లబుర్జు ఆస్పత్రిలో నిర్వహించిన తల్లి పాల వారోత్సవాలకు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారుల వార్డును పరిశీలించారు. శిశువుల తల్లితండ్రులతో మాట్లాడి వైద్యం అందుతున్న తీరును తెలుసుకున్నారు. హైదరాబాద్‌ పేట్లబుర్జు ఆస్పత్రిలో నిర్వహించిన తల్లి పాల వారోత్సవాలకు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారుల వార్డును పరిశీలించారు. శిశువుల తల్లితండ్రులతో మాట్లాడి వైద్యం అందుతున్న తీరును తెలుసుకున్నారు.
26/26

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని