News In Pics: చిత్రం చెప్పే సంగతులు - 2 (07-08-2022)

Updated : 07 Aug 2022 22:29 IST
1/22
తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలకు ఆదివారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ చేశారు. సాయంత్రం సేనాధిపతివారిని వసంత మండపానికి వేంచేపు చేసి మృత్సంగ్రహణం, ఆస్థానం నిర్వహించారు. అనంతరం సంపంగి ప్రాకారంలోని యాగశాలలో వైదిక కార్యక్రమాలు చేపట్టారు. కార్యక్రమంలో తితిదే ఈవో ఎ.వి.ధ‌ర్మారెడ్డి దంపతులు పాల్గొన్నారు. శ్రీవారి ఆలయంలో ఆగస్టు 8 నుంచి 10వ తేదీ వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలకు ఆదివారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ చేశారు. సాయంత్రం సేనాధిపతివారిని వసంత మండపానికి వేంచేపు చేసి మృత్సంగ్రహణం, ఆస్థానం నిర్వహించారు. అనంతరం సంపంగి ప్రాకారంలోని యాగశాలలో వైదిక కార్యక్రమాలు చేపట్టారు. కార్యక్రమంలో తితిదే ఈవో ఎ.వి.ధ‌ర్మారెడ్డి దంపతులు పాల్గొన్నారు. శ్రీవారి ఆలయంలో ఆగస్టు 8 నుంచి 10వ తేదీ వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు.
2/22
గచ్చిబౌలి గ్లోబల్‌ పీస్‌ ఆడిటోరియంలో  గరికపాటి సాన్వీ కూచిపూడి నృత్యంలో రంగప్రవేశం చేశారు. ఈ సందర్భంగా ఆమె ఇచ్చిన ప్రదర్శన చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. గచ్చిబౌలి గ్లోబల్‌ పీస్‌ ఆడిటోరియంలో గరికపాటి సాన్వీ కూచిపూడి నృత్యంలో రంగప్రవేశం చేశారు. ఈ సందర్భంగా ఆమె ఇచ్చిన ప్రదర్శన చూపరులను విశేషంగా ఆకట్టుకుంది.
3/22
4/22
తెలంగాణలో ఆదివారం ఎస్సై రాత పరీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో పరీక్షకు ఆలస్యమవుతోందని ఆందోళన చెందుతున్న ఓ అభ్యర్థిని కూకట్‌పల్లి ఎస్సై శంకర్‌ సకాలంలో చేరేలా సహాయం చేశారు. ఓ కానిస్టేబుల్‌ ద్విచక్రవాహనంపై అభ్యర్థిని పరీక్ష కేంద్రానికి పంపారు. దీంతో ఎస్సై శంకర్‌ను నెటిజన్లు అభినందిస్తున్నారు.. తెలంగాణలో ఆదివారం ఎస్సై రాత పరీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో పరీక్షకు ఆలస్యమవుతోందని ఆందోళన చెందుతున్న ఓ అభ్యర్థిని కూకట్‌పల్లి ఎస్సై శంకర్‌ సకాలంలో చేరేలా సహాయం చేశారు. ఓ కానిస్టేబుల్‌ ద్విచక్రవాహనంపై అభ్యర్థిని పరీక్ష కేంద్రానికి పంపారు. దీంతో ఎస్సై శంకర్‌ను నెటిజన్లు అభినందిస్తున్నారు..
5/22
తెలంగాణ అమ్మాయి, ప్రపంచ ఛాంపియన్‌ నిఖత్‌ జరీన్ కామన్వెల్త్‌ క్రీడల్లో స్వర్ణం సాధించింది. 48-50 కేజీల (లైట్‌ ఫ్లై) విభాగంలో నార్తన్‌ ఐర్లాండ్‌కు చెందిన కార్లే మెక్‌న్యూయ్‌పై అద్భుత విజయం సాధించి పసిడి పతకం నెగ్గింది. తెలంగాణ అమ్మాయి, ప్రపంచ ఛాంపియన్‌ నిఖత్‌ జరీన్ కామన్వెల్త్‌ క్రీడల్లో స్వర్ణం సాధించింది. 48-50 కేజీల (లైట్‌ ఫ్లై) విభాగంలో నార్తన్‌ ఐర్లాండ్‌కు చెందిన కార్లే మెక్‌న్యూయ్‌పై అద్భుత విజయం సాధించి పసిడి పతకం నెగ్గింది.
6/22
కామన్వెల్త్‌ పోటీల్లో భారత మహిళల హాకీ జట్టు కాంస్య పతకాన్ని సాధించింది. న్యూజిలాండ్‌తో జరిగిన పోరులో పెనాల్టీ షుటవుట్‌లో 2-1 తేడాతో బారత మహిళలు విజయం సాధించారు. ఈ సందర్భంగా మ్యాచ్‌ అనంతరం క్రీడాకారిణులు సెల్ఫీలు తీసుకుంటూ విజయానందాన్ని ఆస్వాదించారు. కామన్వెల్త్‌ పోటీల్లో భారత మహిళల హాకీ జట్టు కాంస్య పతకాన్ని సాధించింది. న్యూజిలాండ్‌తో జరిగిన పోరులో పెనాల్టీ షుటవుట్‌లో 2-1 తేడాతో బారత మహిళలు విజయం సాధించారు. ఈ సందర్భంగా మ్యాచ్‌ అనంతరం క్రీడాకారిణులు సెల్ఫీలు తీసుకుంటూ విజయానందాన్ని ఆస్వాదించారు.
7/22
8/22
ఉపరాష్ట్రపతి ఎన్నికలో గెలుపొందిన జగదీప్‌ ధన్‌ఖడ్‌ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని ఉపరాష్ట్రపతి భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జగదీప్‌ ధన్‌ఖడ్‌కు వెంకయ్యనాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలో గెలుపొందిన జగదీప్‌ ధన్‌ఖడ్‌ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని ఉపరాష్ట్రపతి భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జగదీప్‌ ధన్‌ఖడ్‌కు వెంకయ్యనాయుడు శుభాకాంక్షలు తెలిపారు.
9/22
కామన్వెల్త్‌ క్రీడల్లో భారత అథ్లెట్లు సత్తా చాటుతున్నారు. పురుషుల ట్రిపుల్‌ జంప్‌ విభాగంలో ఇద్దరు అథ్లెట్లు మొదటి రెండు స్థానాల్లో నిలవడం విశేషం. ఎల్దోస్‌ పాల్‌ 17.03మీటర్లు దూకి పసిడి సాధించగా.. మన దేశానికే చెందిన అబ్దుల్లా అబూబకర్‌ నరంగోలింటెవిడ్‌ 17.02 మీటర్లు దూకి రజతం సాధించాడు. భారత్‌కే చెందిన ప్రవీణ్ చిత్రవేల్‌ నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. కామన్వెల్త్‌ క్రీడల్లో భారత అథ్లెట్లు సత్తా చాటుతున్నారు. పురుషుల ట్రిపుల్‌ జంప్‌ విభాగంలో ఇద్దరు అథ్లెట్లు మొదటి రెండు స్థానాల్లో నిలవడం విశేషం. ఎల్దోస్‌ పాల్‌ 17.03మీటర్లు దూకి పసిడి సాధించగా.. మన దేశానికే చెందిన అబ్దుల్లా అబూబకర్‌ నరంగోలింటెవిడ్‌ 17.02 మీటర్లు దూకి రజతం సాధించాడు. భారత్‌కే చెందిన ప్రవీణ్ చిత్రవేల్‌ నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు.
10/22
హర్‌ ఘర్‌ తిరంగాలో భాగంగా ఈ నెల 13 నుంచి 15వరకు ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌ నగరంలోని వివిధ కార్పొరేట్‌ సంస్థలు, రాజకీయ పార్టీలు పెద్దఎత్తున జెండాలు కొనుగోలు చేసి వాటికి కర్రలు తొడిగే పనులను నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానం పక్కన నివసించే పేదలకు అప్పగించాయి. పాఠశాలలకు శనివారం హాఫ్‌డే, ఆదివారం సెలవు కావడంతో చిన్నారులు తల్లిదండ్రులకు పనిలో సహకరిస్తూ సందడి చేశారు. హర్‌ ఘర్‌ తిరంగాలో భాగంగా ఈ నెల 13 నుంచి 15వరకు ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌ నగరంలోని వివిధ కార్పొరేట్‌ సంస్థలు, రాజకీయ పార్టీలు పెద్దఎత్తున జెండాలు కొనుగోలు చేసి వాటికి కర్రలు తొడిగే పనులను నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానం పక్కన నివసించే పేదలకు అప్పగించాయి. పాఠశాలలకు శనివారం హాఫ్‌డే, ఆదివారం సెలవు కావడంతో చిన్నారులు తల్లిదండ్రులకు పనిలో సహకరిస్తూ సందడి చేశారు.
11/22
12/22
కామన్‌వెల్త్‌ గేమ్స్‌ క్రికెట్‌ విభాగంలో శనివారం నిర్వహించిన సెమీఫైనల్‌ మ్యాచ్‌లో భారత మహిళల టీమ్‌ ఇంగ్లాండ్‌ను ఓడించి ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా టీమిండియా క్రీడాకారిణులు విన్నింగ్‌ సెల్ఫీ తీసుకొని సంబరాన్ని పంచుకున్నారు. కామన్‌వెల్త్‌ గేమ్స్‌ క్రికెట్‌ విభాగంలో శనివారం నిర్వహించిన సెమీఫైనల్‌ మ్యాచ్‌లో భారత మహిళల టీమ్‌ ఇంగ్లాండ్‌ను ఓడించి ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా టీమిండియా క్రీడాకారిణులు విన్నింగ్‌ సెల్ఫీ తీసుకొని సంబరాన్ని పంచుకున్నారు.
13/22
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ భూదాన్‌ పోచంపల్లిలో పర్యటించారు. చేనేత కార్మికుల కష్టనష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ స్వయంగా చేనేత మగ్గంపై కొంత సమయం పని చేశారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ భూదాన్‌ పోచంపల్లిలో పర్యటించారు. చేనేత కార్మికుల కష్టనష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ స్వయంగా చేనేత మగ్గంపై కొంత సమయం పని చేశారు.
14/22
కర్నూలు జిల్లాలోని ఆదోని కూరగాయల మార్కెట్‌లోకి తెల్లగా నిగనిగలాడే వంకాయలు అమ్మకానికి వస్తున్నాయి. నిజానికి వంకాయలు ఆకుపచ్చ, ఊదా రంగులో ఉంటాయి. ఇవి మాత్రం తెలుపు రంగులో అందరినీ ఆకర్షిస్తున్నాయి. పోషక విలువలు ఎక్కువగా ఉండటం వల్ల ఈ ‘విత్‌ ఒకే’ కుటుంబానికి చెందిన వంకాయలు తెల్లగా మారతాయని ఆదోని ఉద్యానవన శాఖ అధికారి హరేంద్ర తెలిపారు. మామూలు వంకాయలతో పోలిస్తే వీటిలో పొటాషియం, కాపర్, మెగ్నీషియం, బీ విటమిన్ పుష్కలంగా ఉంటాయని చెప్పారు.. కర్నూలు జిల్లాలోని ఆదోని కూరగాయల మార్కెట్‌లోకి తెల్లగా నిగనిగలాడే వంకాయలు అమ్మకానికి వస్తున్నాయి. నిజానికి వంకాయలు ఆకుపచ్చ, ఊదా రంగులో ఉంటాయి. ఇవి మాత్రం తెలుపు రంగులో అందరినీ ఆకర్షిస్తున్నాయి. పోషక విలువలు ఎక్కువగా ఉండటం వల్ల ఈ ‘విత్‌ ఒకే’ కుటుంబానికి చెందిన వంకాయలు తెల్లగా మారతాయని ఆదోని ఉద్యానవన శాఖ అధికారి హరేంద్ర తెలిపారు. మామూలు వంకాయలతో పోలిస్తే వీటిలో పొటాషియం, కాపర్, మెగ్నీషియం, బీ విటమిన్ పుష్కలంగా ఉంటాయని చెప్పారు..
15/22
16/22
కోనసీమ తిరుమల వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం పవిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. కోనసీమ తిరుమల వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం పవిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు.
17/22
రాఖీ పండగ సందర్భంగా మైథిలి ట్రస్టు ఫౌండేషన్‌ మహిళలు నారాయణగూడ ఠాణాలో పోలీసులకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ పండగ సందర్భంగా మైథిలి ట్రస్టు ఫౌండేషన్‌ మహిళలు నారాయణగూడ ఠాణాలో పోలీసులకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు.
18/22
19/22
దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌ సాంస్కృతిక కేంద్రంలో నిర్వహించిన నీతి ఆయోగ్‌ పాలక మండలి సమావేశానికి హాజరైన ఏపీ సీఎం జగన్‌ను పలకరిస్తున్న ప్రధాని నరేంద్రమోదీ దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌ సాంస్కృతిక కేంద్రంలో నిర్వహించిన నీతి ఆయోగ్‌ పాలక మండలి సమావేశానికి హాజరైన ఏపీ సీఎం జగన్‌ను పలకరిస్తున్న ప్రధాని నరేంద్రమోదీ
20/22
ఇటీవల కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన దాసోజు శ్రవణ్‌ భాజపాలో చేరారు. దిల్లీలో ఆ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ తరుణ్‌చుగ్‌ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్‌, మాజీ ఎంపీ వివేక్‌, సీనియర్‌ నేత మురళీధర్‌రావు తదితర నేతలు పాల్గొన్నారు. పార్టీలో చేరిన అనంతరం శ్రవణ్‌కు భాజపా నేతలు అభినందనలు తెలిపారు. ఇటీవల కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన దాసోజు శ్రవణ్‌ భాజపాలో చేరారు. దిల్లీలో ఆ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ తరుణ్‌చుగ్‌ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్‌, మాజీ ఎంపీ వివేక్‌, సీనియర్‌ నేత మురళీధర్‌రావు తదితర నేతలు పాల్గొన్నారు. పార్టీలో చేరిన అనంతరం శ్రవణ్‌కు భాజపా నేతలు అభినందనలు తెలిపారు.
21/22
సైబరాబాద్‌లో ట్రాఫిక్‌ టాస్క్‌ ఫోర్స్‌ సేవలు ప్రారంభమయ్యాయి. సీపీ స్టీఫెన్ రవీంద్ర జెండా ఊపి ఆరు బైక్‌లను ప్రారంభించారు. సైబరాబాద్‌ పరిధిలో పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు సీపీ తెలిపారు. సైబరాబాద్‌లో ట్రాఫిక్‌ టాస్క్‌ ఫోర్స్‌ సేవలు ప్రారంభమయ్యాయి. సీపీ స్టీఫెన్ రవీంద్ర జెండా ఊపి ఆరు బైక్‌లను ప్రారంభించారు. సైబరాబాద్‌ పరిధిలో పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు సీపీ తెలిపారు.
22/22
మహాత్మాగాందీ ప్రస్థానంపై పరిశోధన సాగించేవారు....ఆయన గొప్పతనం తెలుసుకోవాలని ఆసక్తి ఉన్న వారు ఎందరో విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ‘గాంధియన్‌ స్టడీస్‌ సెంటర్‌’కు వస్తుంటారు. అలాంటి వారిని ఇక్కడున్న గాంధీ బొమ్మ ఎంతగానో ఆకట్టుకుంటోంది. కొన్ని రసాయనాలు కలిపి కేవలం కాగితంతో ఫైన్‌ఆర్ట్స్‌ పూర్వ విద్యార్థులు రూపొందించి అందించగా ఇక్కడ ఏర్పాటు చేశారు.  మహాత్మాగాందీ ప్రస్థానంపై పరిశోధన సాగించేవారు....ఆయన గొప్పతనం తెలుసుకోవాలని ఆసక్తి ఉన్న వారు ఎందరో విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ‘గాంధియన్‌ స్టడీస్‌ సెంటర్‌’కు వస్తుంటారు. అలాంటి వారిని ఇక్కడున్న గాంధీ బొమ్మ ఎంతగానో ఆకట్టుకుంటోంది. కొన్ని రసాయనాలు కలిపి కేవలం కాగితంతో ఫైన్‌ఆర్ట్స్‌ పూర్వ విద్యార్థులు రూపొందించి అందించగా ఇక్కడ ఏర్పాటు చేశారు.

మరిన్ని