News In Pics: చిత్రం చెప్పే సంగతులు-2 (08-08-2022)

Updated : 08 Aug 2022 22:30 IST
1/23
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి సోమవారం వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు ఐదేళ్ల కాలంలో చేసిన సేవలను వివరిస్తూ రాసిన ‘ఇంటరాక్టింగ్‌‌-ఇన్వాల్వింగ్‌-ఇన్‌స్పైరింగ్‌’ పుస్తకాన్ని ప్రధాని మోదీ విడుదల చేశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి సోమవారం వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు ఐదేళ్ల కాలంలో చేసిన సేవలను వివరిస్తూ రాసిన ‘ఇంటరాక్టింగ్‌‌-ఇన్వాల్వింగ్‌-ఇన్‌స్పైరింగ్‌’ పుస్తకాన్ని ప్రధాని మోదీ విడుదల చేశారు.
2/23
3/23
ఇదేంటి.. ద్విచక్రవాహనాన్ని ఇంటిపై పార్కింగ్ చేశారనుకుంటున్నారా. అదేం లేదండి.. ఏలూరు పాత బస్టాండులోని ఆటోమొబైల్‌ దుకాణదారుడు పోతురాజు వినియోగదారులను, ప్రజలను ఆకర్షించేందుకు పాత ద్విచక్రవాహనానికి రంగులేసి ఇంటిపై ప్రదర్శనకు ఉంచాడు. దీంతో ఈ మార్గంలో వెళ్లే వారంతా ఈ దృశ్యాన్ని ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఇదేంటి.. ద్విచక్రవాహనాన్ని ఇంటిపై పార్కింగ్ చేశారనుకుంటున్నారా. అదేం లేదండి.. ఏలూరు పాత బస్టాండులోని ఆటోమొబైల్‌ దుకాణదారుడు పోతురాజు వినియోగదారులను, ప్రజలను ఆకర్షించేందుకు పాత ద్విచక్రవాహనానికి రంగులేసి ఇంటిపై ప్రదర్శనకు ఉంచాడు. దీంతో ఈ మార్గంలో వెళ్లే వారంతా ఈ దృశ్యాన్ని ఆసక్తిగా తిలకిస్తున్నారు.
4/23
వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ను రాజ్‌భవన్‌లో కలిశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ వివిధ అంశాలను ఆమెకు తెలిపారు. వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ను రాజ్‌భవన్‌లో కలిశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ వివిధ అంశాలను ఆమెకు తెలిపారు.
5/23
6/23
కర్నూలు నగరంలోని వీనస్‌ కాలనీలో వీనస్‌ పార్కును అన్ని హంగులతో తీర్చిదిద్దారు. పార్కులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 168 అడుగుల జాతీయ జెండా.. రాష్ట్రంలో రెండో స్థానంలో దేశంలో 8వ స్థానం దక్కించుకుంది. గాలివాటుకు చుట్టుపక్కల ప్రాంతాల్లో సైతం జెండా ఎగురుతున్న శబ్దం వినిపిస్తోందని స్థానికులు చెబుతున్నారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా జరుగుతున్న వేడుకల్లో కర్నూలుకే తలమానికంగా ఎగురుతున్న ఈ జెండా జాతీయ సమైక్యతను చాటుతోంది. కర్నూలు నగరంలోని వీనస్‌ కాలనీలో వీనస్‌ పార్కును అన్ని హంగులతో తీర్చిదిద్దారు. పార్కులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 168 అడుగుల జాతీయ జెండా.. రాష్ట్రంలో రెండో స్థానంలో దేశంలో 8వ స్థానం దక్కించుకుంది. గాలివాటుకు చుట్టుపక్కల ప్రాంతాల్లో సైతం జెండా ఎగురుతున్న శబ్దం వినిపిస్తోందని స్థానికులు చెబుతున్నారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా జరుగుతున్న వేడుకల్లో కర్నూలుకే తలమానికంగా ఎగురుతున్న ఈ జెండా జాతీయ సమైక్యతను చాటుతోంది.
7/23
హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో నిర్వహించిన స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో 85మంది వీణ వాయిద్యకారులు దేశభక్తి గీతాలను ఆలపించారు. ఇవి కార్యక్రమానికి హాజరైన వారిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో నిర్వహించిన స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో 85మంది వీణ వాయిద్యకారులు దేశభక్తి గీతాలను ఆలపించారు. ఇవి కార్యక్రమానికి హాజరైన వారిని ఎంతగానో ఆకట్టుకున్నాయి.
8/23
9/23
కరేబియన్‌ పర్యటనలో ఉన్న భారత క్రికెటర్‌ కృనాల్‌ పాండ్య వెస్టిండీస్‌ మాజీ క్రికెటర్‌ కీరన్‌ పొలార్డ్‌ను ఆయన నివాసంలో కలిశారు. ఈ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్న కృనాల్ పాండ్య.. మిత్రులు కుటుంబం వంటి వారని తెలుపుతూ పోస్టు పెట్టారు. కరేబియన్‌ పర్యటనలో ఉన్న భారత క్రికెటర్‌ కృనాల్‌ పాండ్య వెస్టిండీస్‌ మాజీ క్రికెటర్‌ కీరన్‌ పొలార్డ్‌ను ఆయన నివాసంలో కలిశారు. ఈ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్న కృనాల్ పాండ్య.. మిత్రులు కుటుంబం వంటి వారని తెలుపుతూ పోస్టు పెట్టారు.
10/23
11/23
ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ఏలూరు జిల్లాలోని దెందులూరులో బచ్చు రాంబొట్లు, ధనలక్ష్మి నర్సింగ్ కళాశాల ఆధ్వర్యంలో 106 అడుగుల భారీ జాతీయ జెండాను ప్రదర్శించారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ఏలూరు జిల్లాలోని దెందులూరులో బచ్చు రాంబొట్లు, ధనలక్ష్మి నర్సింగ్ కళాశాల ఆధ్వర్యంలో 106 అడుగుల భారీ జాతీయ జెండాను ప్రదర్శించారు.
12/23
13/23
హైదరాబాద్‌లోని సాలార్‌ జంగ్‌ మ్యూజియంలో స్వాతంత్ర్య సమరయోధుల చిత్రాలతో ఏర్పాటు చేసిన ప్రదర్శనను గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ ప్రారంభించారు. అనంతరం అక్కడ ఉన్న సమరయోధుల చిత్రాలను ఆమె తిలకించారు. హైదరాబాద్‌లోని సాలార్‌ జంగ్‌ మ్యూజియంలో స్వాతంత్ర్య సమరయోధుల చిత్రాలతో ఏర్పాటు చేసిన ప్రదర్శనను గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ ప్రారంభించారు. అనంతరం అక్కడ ఉన్న సమరయోధుల చిత్రాలను ఆమె తిలకించారు.
14/23
కామన్వెల్త్‌లో తొలిసారిగా నిర్వహించిన మహిళల క్రికెట్‌లో భారత్‌ రజత పతకం సాధించింది. ఈ సందర్భంగా సంబరాలకు సంబంధించిన ఫొటోను స్మృతీ మంధాన తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. తాము గోల్డ్‌తో రానందుకు క్షమించాలని.. మున్ముందు కచ్చితంగా గోల్డెన్‌ డేస్‌ వచ్చేలా ఆడతామని తెలుపుతూ పోస్టు పెట్టారు. అభిమానులిస్తున్న మద్దతుకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.. కామన్వెల్త్‌లో తొలిసారిగా నిర్వహించిన మహిళల క్రికెట్‌లో భారత్‌ రజత పతకం సాధించింది. ఈ సందర్భంగా సంబరాలకు సంబంధించిన ఫొటోను స్మృతీ మంధాన తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. తాము గోల్డ్‌తో రానందుకు క్షమించాలని.. మున్ముందు కచ్చితంగా గోల్డెన్‌ డేస్‌ వచ్చేలా ఆడతామని తెలుపుతూ పోస్టు పెట్టారు. అభిమానులిస్తున్న మద్దతుకు ఆమె ధన్యవాదాలు తెలిపారు..
15/23
16/23
కామన్వెల్త్‌ క్రీడల్లో భారత స్టార్‌ షట్లర్‌, తెలుగు తేజం పీవీ సింధు స్వర్ణం సాధించింది. తాజాగా బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌ విభాగం ఫైనల్స్‌లో సింధు.. కెనడా క్రీడాకారిణి మిచెలీ లీని ఓడించింది. తొలి గేమ్‌లో 21-15తో నెగ్గిన సింధు రెండో గేమ్‌ను 21-13తో కైవసం చేసుకుంది. దీంతో వరుస గేమ్స్‌లో ఆధిపత్యం చెలాయించి భారత్‌కు మరో పసిడి అందించింది. కామన్వెల్త్‌ క్రీడల్లో భారత స్టార్‌ షట్లర్‌, తెలుగు తేజం పీవీ సింధు స్వర్ణం సాధించింది. తాజాగా బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌ విభాగం ఫైనల్స్‌లో సింధు.. కెనడా క్రీడాకారిణి మిచెలీ లీని ఓడించింది. తొలి గేమ్‌లో 21-15తో నెగ్గిన సింధు రెండో గేమ్‌ను 21-13తో కైవసం చేసుకుంది. దీంతో వరుస గేమ్స్‌లో ఆధిపత్యం చెలాయించి భారత్‌కు మరో పసిడి అందించింది.
17/23
నంద్యాలకు చెందిన చిత్రకారుడు చింతపల్లె కోటేశ్‌ కాఫీ పొడితో భరతమాత చిత్రాన్ని తీర్చిదిద్దారు. ఇందులో 375 మంది స్వాతంత్ర్య సమరయోధులు, ప్రముఖుల చిత్రాలను పొందుపర్చారు. 15 అంగుళాల పొడవు, 11 అంగుళాల వెడల్పు గల డ్రాయింగ్‌ షీట్‌పై కాఫీ పొడిని నీటిలో కలిపి దీన్ని రూపొందించారు.. నంద్యాలకు చెందిన చిత్రకారుడు చింతపల్లె కోటేశ్‌ కాఫీ పొడితో భరతమాత చిత్రాన్ని తీర్చిదిద్దారు. ఇందులో 375 మంది స్వాతంత్ర్య సమరయోధులు, ప్రముఖుల చిత్రాలను పొందుపర్చారు. 15 అంగుళాల పొడవు, 11 అంగుళాల వెడల్పు గల డ్రాయింగ్‌ షీట్‌పై కాఫీ పొడిని నీటిలో కలిపి దీన్ని రూపొందించారు..
18/23
హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో బార్బేక్యూనేషన్‌ నూతన రెస్టారెంట్‌ను బిగ్‌ బాస్‌ ఫేం, సినీనటి హిమజ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె సరికొత్త రుచులను ఆస్వాదిస్తూ ఫొటోలకు పోజులిచ్చారు. హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో బార్బేక్యూనేషన్‌ నూతన రెస్టారెంట్‌ను బిగ్‌ బాస్‌ ఫేం, సినీనటి హిమజ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె సరికొత్త రుచులను ఆస్వాదిస్తూ ఫొటోలకు పోజులిచ్చారు.
19/23
20/23
తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ఆరో రోజుకు చేరింది. మసీద్‌ గూడెం నుంచి ఆయన ఇవాళ యాత్ర ప్రారంభించారు. శేరిల్లి, పెద్ద కొండూరు, చిన్న కొండూరు, చౌటుప్పల్‌ మున్సిపాలిటీ మీదుగా తాళ్ల సింగారం క్రాస్‌ రోడ్ వరకు ఆయన  యాత్ర సాగనుందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ఆరో రోజుకు చేరింది. మసీద్‌ గూడెం నుంచి ఆయన ఇవాళ యాత్ర ప్రారంభించారు. శేరిల్లి, పెద్ద కొండూరు, చిన్న కొండూరు, చౌటుప్పల్‌ మున్సిపాలిటీ మీదుగా తాళ్ల సింగారం క్రాస్‌ రోడ్ వరకు ఆయన యాత్ర సాగనుందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
21/23
హైదరాబాద్ మణికొండలో కె.ఎన్ గుప్తా గ్రూప్ ఆఫ్ హోటల్స్ హోటల్ కాస్టల్‌ను యువ కథానాయకుడు నిఖిల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అభిమానులతో కలిసి ఫొటోలకు పోజులిస్తూ ఆయన సందడి చేశారు. హైదరాబాద్ మణికొండలో కె.ఎన్ గుప్తా గ్రూప్ ఆఫ్ హోటల్స్ హోటల్ కాస్టల్‌ను యువ కథానాయకుడు నిఖిల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అభిమానులతో కలిసి ఫొటోలకు పోజులిస్తూ ఆయన సందడి చేశారు.
22/23
తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల పవిత్రోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్ఠ నిర్వహించారు.

 ఈ సందర్భంగా ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని సంపంగి ప్రకారంలోని యాగశాలకు వేంచేపు చేశారు. అనంతరం హోమాలు తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టారు.  తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల పవిత్రోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్ఠ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని సంపంగి ప్రకారంలోని యాగశాలకు వేంచేపు చేశారు. అనంతరం హోమాలు తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టారు.
23/23

మరిన్ని