News In Pics: చిత్రం చెప్పే సంగతులు-1(10-08-2022)

Published : 10 Aug 2022 11:37 IST
1/35
విశాఖపట్నం ఆర్కేబీచ్‌లో తీరంలోని రహదారిలో సోలార్‌ దీపాల కాంతులు అలరిస్తున్నాయి. ‘స్మార్ట్‌సిటీ’లో భాగంగా ఏర్పాటు చేసిన విభిన్న ఆకృతుల్లోని స్తంభాలు... వాటిపై వెలుగులు ఆ ప్రాంతానికి సరికొత్త శోభను తెచ్చాయి. విశాఖపట్నం ఆర్కేబీచ్‌లో తీరంలోని రహదారిలో సోలార్‌ దీపాల కాంతులు అలరిస్తున్నాయి. ‘స్మార్ట్‌సిటీ’లో భాగంగా ఏర్పాటు చేసిన విభిన్న ఆకృతుల్లోని స్తంభాలు... వాటిపై వెలుగులు ఆ ప్రాంతానికి సరికొత్త శోభను తెచ్చాయి.
2/35
చేపను పట్టాలనే ఉత్సాహంతో పెలికాన్‌ పక్షిని దాటి ముందుకొచ్చింది ఓ కొంగ.  నీటిపై ఎగురుతూనే చేపను నోట కరుచుకొని తుర్రుమనేలోపే అది జారి నీటిలో పడింది. మండవల్లి మండలం పెదయడ్లగాడిలోని కొల్లేరులో కనిపించిన చిత్రమిది.  చేపను పట్టాలనే ఉత్సాహంతో పెలికాన్‌ పక్షిని దాటి ముందుకొచ్చింది ఓ కొంగ. నీటిపై ఎగురుతూనే చేపను నోట కరుచుకొని తుర్రుమనేలోపే అది జారి నీటిలో పడింది. మండవల్లి మండలం పెదయడ్లగాడిలోని కొల్లేరులో కనిపించిన చిత్రమిది.
3/35
ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా ప్రభుత్వ యంత్రాంగం జిల్లాలో ప్రత్యేక చర్యలు చేపడుతోంది. అందరిలోనూ దేశభక్తిని పెంపొందించేందుకు కృషి చేస్తున్నారు. అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయ గాలిగోపురానికి జాతీయ పతాకాల రంగులతో విద్యుద్దీపాల అలంకరణ చేశారు. ఇది చూపరులను ఆకర్షిస్తోంది. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా ప్రభుత్వ యంత్రాంగం జిల్లాలో ప్రత్యేక చర్యలు చేపడుతోంది. అందరిలోనూ దేశభక్తిని పెంపొందించేందుకు కృషి చేస్తున్నారు. అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయ గాలిగోపురానికి జాతీయ పతాకాల రంగులతో విద్యుద్దీపాల అలంకరణ చేశారు. ఇది చూపరులను ఆకర్షిస్తోంది.
4/35
అవనిగడ్డ నుంచి కోడూరు వెళ్లే ప్రధాన రహదారి ఇది. భారీ గోతులతో అధ్వానంగా మారినా పట్టించుకునే నాథుడే కరవయ్యాడు. రహదారి విస్తరణ, నిర్మాణం అని మాటలు చెబుతున్నారే తప్ప ఆచరణలోకి వచ్చేసరికి ప్రజాప్రతినిధులు విఫలమవుతున్నారని వాహనచోదకులు వాపోతున్నారు. ఈ మార్గంలో ప్రయాణించేవారికి వెనకాలే 108 రావాల్సిందేనని వాహన చోదకులు చెబుతుండగా వెనుకనే 108 వాహనం వస్తూ కనిపించిన చిత్రమిది. అవనిగడ్డ నుంచి కోడూరు వెళ్లే ప్రధాన రహదారి ఇది. భారీ గోతులతో అధ్వానంగా మారినా పట్టించుకునే నాథుడే కరవయ్యాడు. రహదారి విస్తరణ, నిర్మాణం అని మాటలు చెబుతున్నారే తప్ప ఆచరణలోకి వచ్చేసరికి ప్రజాప్రతినిధులు విఫలమవుతున్నారని వాహనచోదకులు వాపోతున్నారు. ఈ మార్గంలో ప్రయాణించేవారికి వెనకాలే 108 రావాల్సిందేనని వాహన చోదకులు చెబుతుండగా వెనుకనే 108 వాహనం వస్తూ కనిపించిన చిత్రమిది.
5/35
ఆజాదీ కా అమృత్‌ మహోత్సవంలో భాగంగా నగరంలో స్కేటింగ్‌ క్రీడాకారులు జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. డీఎస్‌ఏ స్టేడియం నుంచి కొండారెడ్డి బురుజు వరకు చిన్నారులు మంగళవారం స్కేటింగ్‌ చేస్తూ ప్రదర్శనలో పాల్గొన్నారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవంలో భాగంగా నగరంలో స్కేటింగ్‌ క్రీడాకారులు జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. డీఎస్‌ఏ స్టేడియం నుంచి కొండారెడ్డి బురుజు వరకు చిన్నారులు మంగళవారం స్కేటింగ్‌ చేస్తూ ప్రదర్శనలో పాల్గొన్నారు.
6/35
శాంతిపురం మండలం పెద్దూరు వద్ద తోటల్లోనే వదిలేసిన బంతిపూలు ఇవి. కుప్పం, పలమనేరు, పుంగనూరు నియోజకవర్గాల్లో దాదాపు వెయ్యి ఎకరాల్లో సాగు చేసిన బంతిపూలు తోటల్లోనే మగ్గిపోతున్నాయి. శ్రావణ మాసం వరుస పండుగలను దృష్టిలో ఉంచుకుని.. గంపెడు ఆశతో పండించిన బంతి (చెండుమల్లి) పూలకు ధరలు లేనందున కొనుగోలుదారులు ముందుకు రాని దుస్థితి. పెట్టుబడి చేతికందని పరిస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు. శాంతిపురం మండలం పెద్దూరు వద్ద తోటల్లోనే వదిలేసిన బంతిపూలు ఇవి. కుప్పం, పలమనేరు, పుంగనూరు నియోజకవర్గాల్లో దాదాపు వెయ్యి ఎకరాల్లో సాగు చేసిన బంతిపూలు తోటల్లోనే మగ్గిపోతున్నాయి. శ్రావణ మాసం వరుస పండుగలను దృష్టిలో ఉంచుకుని.. గంపెడు ఆశతో పండించిన బంతి (చెండుమల్లి) పూలకు ధరలు లేనందున కొనుగోలుదారులు ముందుకు రాని దుస్థితి. పెట్టుబడి చేతికందని పరిస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు.
7/35
దేవరుప్పుల మండలం కామారెడ్డిగూడెం గ్రామానికి చెందిన స్వర్ణకారుడు బియ్యం గింజ సైజులో బంగారంతో మువ్వన్నెల జాతీయ పతాకం రూపొందించారు. వృత్తిరీత్యా స్వర్ణకారుడైన తుడిమిల్ల మహేంద్రాచారి రెండున్నర గంటల్లో 50 మిల్లీ గ్రాముల బంగారంతో ఈ జాతీయ పతాకాన్ని రూపొందించినట్లు వివరించారు.   దేవరుప్పుల మండలం కామారెడ్డిగూడెం గ్రామానికి చెందిన స్వర్ణకారుడు బియ్యం గింజ సైజులో బంగారంతో మువ్వన్నెల జాతీయ పతాకం రూపొందించారు. వృత్తిరీత్యా స్వర్ణకారుడైన తుడిమిల్ల మహేంద్రాచారి రెండున్నర గంటల్లో 50 మిల్లీ గ్రాముల బంగారంతో ఈ జాతీయ పతాకాన్ని రూపొందించినట్లు వివరించారు.
8/35
జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం మాణిక్యపురం మాధ్యమిక పాఠశాల ఉపాధ్యాయుడు నిమ్మ జయపాల్‌రెడ్డి ఒరిగామి కళలో భాగంగా పేపర్‌తో బాలబాలికలు జాతీయ పతాకాన్ని చేబూనిన చిత్రం రూపొందించారు. జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం మాణిక్యపురం మాధ్యమిక పాఠశాల ఉపాధ్యాయుడు నిమ్మ జయపాల్‌రెడ్డి ఒరిగామి కళలో భాగంగా పేపర్‌తో బాలబాలికలు జాతీయ పతాకాన్ని చేబూనిన చిత్రం రూపొందించారు.
9/35
హనుమకొండలోని శ్రీనగర్‌కాలనీకి చెందిన డా.జగదీశ్వర్‌ప్రసాద్‌-శ్రీదేవి దంపతుల కూతురు డా.హర్షవర్ధని వివాహం డా.దయానంద్‌తో జరిగింది. మంగళవారం చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ వారి ఇంటికి వెళ్లి నూతన వధువును ఆశీర్వదించి జాతీయ జెండాను బహుమతిగా అందించారు. అనంతరం నూతన వధూవరులు ఇంటిపై జాతీయ జెండా ఎగురవేశారు. 


హనుమకొండలోని శ్రీనగర్‌కాలనీకి చెందిన డా.జగదీశ్వర్‌ప్రసాద్‌-శ్రీదేవి దంపతుల కూతురు డా.హర్షవర్ధని వివాహం డా.దయానంద్‌తో జరిగింది. మంగళవారం చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ వారి ఇంటికి వెళ్లి నూతన వధువును ఆశీర్వదించి జాతీయ జెండాను బహుమతిగా అందించారు. అనంతరం నూతన వధూవరులు ఇంటిపై జాతీయ జెండా ఎగురవేశారు.
10/35
సాధారణంగా గంగిరెద్దు వాళ్లు ఇళ్ల ముందుకు వచ్చి సన్నాయి వాయించి గంగిరెద్దును ఆడించి భిక్షాటన చేస్తూ బతుకుదెరువు సాగిస్తుంటారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రం వినాయక్‌నగర్‌లో సన్నాయి చప్పుడుకు బయటకు వచ్చిన ఇల్లాలు గంగిరెద్దు స్థానంలో కుక్కను చూసి ఆశ్చర్యపోయారు. అయినా ఆ ఇంటి సభ్యులు తోచిన సాయమందించారు. ఇదేంటని ఆ వ్యక్తిని ప్రశ్నించగా గంగిరెద్దులు దొరకడం లేదని, భిక్షాటనకు వెళ్లేందుకు తోడుంటుందని కుక్కను వెంట తెచ్చుకున్నట్లు పేర్కొన్నారు. సాధారణంగా గంగిరెద్దు వాళ్లు ఇళ్ల ముందుకు వచ్చి సన్నాయి వాయించి గంగిరెద్దును ఆడించి భిక్షాటన చేస్తూ బతుకుదెరువు సాగిస్తుంటారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రం వినాయక్‌నగర్‌లో సన్నాయి చప్పుడుకు బయటకు వచ్చిన ఇల్లాలు గంగిరెద్దు స్థానంలో కుక్కను చూసి ఆశ్చర్యపోయారు. అయినా ఆ ఇంటి సభ్యులు తోచిన సాయమందించారు. ఇదేంటని ఆ వ్యక్తిని ప్రశ్నించగా గంగిరెద్దులు దొరకడం లేదని, భిక్షాటనకు వెళ్లేందుకు తోడుంటుందని కుక్కను వెంట తెచ్చుకున్నట్లు పేర్కొన్నారు.
11/35
ఆజాదీకా అమృత్‌ మహోత్సవం సందర్భంగా అధికారులు జాతీయ పతాకాలను పంపిణీ చేస్తున్నారు. ఈ సందర్భంగా సదాశివపేటకు చెందిన రైతు గంగరాజు జెండాను తీసుకుని చేతపట్టుకుని ఎడ్లబండిపై వెళుతున్న దృశ్యం ఇలా ‘ఈనాడు’ కెమెరాకు చిక్కింది. ఆజాదీకా అమృత్‌ మహోత్సవం సందర్భంగా అధికారులు జాతీయ పతాకాలను పంపిణీ చేస్తున్నారు. ఈ సందర్భంగా సదాశివపేటకు చెందిన రైతు గంగరాజు జెండాను తీసుకుని చేతపట్టుకుని ఎడ్లబండిపై వెళుతున్న దృశ్యం ఇలా ‘ఈనాడు’ కెమెరాకు చిక్కింది.
12/35
ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు అడ్డాకుల మండలంలోని పెద్దవాగును దాటేందుకు వర్నె వద్ద తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వంతెన తెగిపోవడంతో గ్రామస్థులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. మండల కేంద్రమైన అడ్డాకులకు రావాలంటే కొత్తకోట మీదుగా 20 కిలోమీటర్లకు పైగా అదనంగా తిరిగి రావాల్సి వస్తోంది. మంగళవారం మొహర్రం కోసం హైదరాబాదులో వలస కూలీలుగా ఉపాధి పొందుతున్న మహేష్, శేఖర్‌లు కుటుంబ సభ్యులతో గ్రామానికి వచ్చారు. పెద్దవాగుపై తాత్కలిక వంతెన తెగిపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వారు చిన్నపిల్లలతో ఇలా ప్రమాదకరంగా వాగును దాటారు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు అడ్డాకుల మండలంలోని పెద్దవాగును దాటేందుకు వర్నె వద్ద తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వంతెన తెగిపోవడంతో గ్రామస్థులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. మండల కేంద్రమైన అడ్డాకులకు రావాలంటే కొత్తకోట మీదుగా 20 కిలోమీటర్లకు పైగా అదనంగా తిరిగి రావాల్సి వస్తోంది. మంగళవారం మొహర్రం కోసం హైదరాబాదులో వలస కూలీలుగా ఉపాధి పొందుతున్న మహేష్, శేఖర్‌లు కుటుంబ సభ్యులతో గ్రామానికి వచ్చారు. పెద్దవాగుపై తాత్కలిక వంతెన తెగిపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వారు చిన్నపిల్లలతో ఇలా ప్రమాదకరంగా వాగును దాటారు.
13/35
చొప్పదండి మండలంలోని పెద్ద కుర్మపల్లికి చెందిన మావురం మల్లికార్జున్‌రెడ్డి దేశభక్తిని చాటాలనే ఉద్దేశంతో గతేడాది ఆగస్టు 15న తన వరిపొలంలో భారతదేశ చిత్రపటాన్ని వరినాట్లతో ఏర్పాటు చేశారు. నాటి నుంచి నేటి వరకు పొలంలో నిత్యం జనగణమన పాడి, జెండా ఆవిష్కరణ చేస్తున్నారు. తన ఇంటిపైన సైతం జాతీయ పతాకం ఆవిష్కరించారు. చొప్పదండి మండలంలోని పెద్ద కుర్మపల్లికి చెందిన మావురం మల్లికార్జున్‌రెడ్డి దేశభక్తిని చాటాలనే ఉద్దేశంతో గతేడాది ఆగస్టు 15న తన వరిపొలంలో భారతదేశ చిత్రపటాన్ని వరినాట్లతో ఏర్పాటు చేశారు. నాటి నుంచి నేటి వరకు పొలంలో నిత్యం జనగణమన పాడి, జెండా ఆవిష్కరణ చేస్తున్నారు. తన ఇంటిపైన సైతం జాతీయ పతాకం ఆవిష్కరించారు.
14/35
భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల నేపథ్యంలో చొప్పదండి పట్టణంలోని ఆరోవార్డులో కౌన్సిలర్‌ వడ్లూరి గంగరాజు ఆధ్వర్యంలో 75 ఆకారంతో గుంతలు తవ్వి వాటిల్లో మొక్కలు నాటారు. వార్డు పరిధిలో ఫ్రీడమ్‌ పార్క్‌ ఏర్పాటులో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల నేపథ్యంలో చొప్పదండి పట్టణంలోని ఆరోవార్డులో కౌన్సిలర్‌ వడ్లూరి గంగరాజు ఆధ్వర్యంలో 75 ఆకారంతో గుంతలు తవ్వి వాటిల్లో మొక్కలు నాటారు. వార్డు పరిధిలో ఫ్రీడమ్‌ పార్క్‌ ఏర్పాటులో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు.
15/35
స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఖమ్మం నగరంలోని లకారం ట్యాంక్‌బండ్‌ వద్ద ఇటీవల ప్రారంభించిన తీగల వంతెన మూడు రంగుల దీపాలతో ముస్తాబయ్యింది. విద్యుత్‌ దీప కాంతులతో నగర వాసుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది.     స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఖమ్మం నగరంలోని లకారం ట్యాంక్‌బండ్‌ వద్ద ఇటీవల ప్రారంభించిన తీగల వంతెన మూడు రంగుల దీపాలతో ముస్తాబయ్యింది. విద్యుత్‌ దీప కాంతులతో నగర వాసుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది.
16/35
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో మొహర్రం ఊరేగింపులో దేశభక్తి వెల్లివిరిసింది. మువ్వన్నెల జెండాను పోలి ఉండేలా మూడు రంగులతో అలంకరించిన పీరీతో గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. రెడ్డిపాలెం నుంచి గొమ్మూరు ఈద్గా వరకు చేపట్టిన యాత్రలో మువ్వన్నెల పీరీని స్థానికులు ఆసక్తిగా తిలకించారు. 75 వసంతాల స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకుని ఇలా అలంకరించామని ముస్లిం మతపెద్దలు తెలిపారు. 


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో మొహర్రం ఊరేగింపులో దేశభక్తి వెల్లివిరిసింది. మువ్వన్నెల జెండాను పోలి ఉండేలా మూడు రంగులతో అలంకరించిన పీరీతో గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. రెడ్డిపాలెం నుంచి గొమ్మూరు ఈద్గా వరకు చేపట్టిన యాత్రలో మువ్వన్నెల పీరీని స్థానికులు ఆసక్తిగా తిలకించారు. 75 వసంతాల స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకుని ఇలా అలంకరించామని ముస్లిం మతపెద్దలు తెలిపారు.
17/35
 ఈ చిత్రం చూడండి.. ఎంత దారుణమో.. నిత్యం వందల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగించే అంతర్రాష్ట్ర రహదారిలోనే ఈ దుస్థితి.. సరుబుజ్జిలి మండల కేంద్రంలోనే శిమ్మకోనేరు నుంచి కూడలి వరకు ఇదే పరిస్థితి. చెరువును తలపిస్తున్నా ఎవరికీ పట్టింపులేదు.. గొయ్యి దాటేందుకు బస్సులు సైతం ఇలా ప్రమాదభరితంగా పయనించాల్సి వస్తోంది. ఈ చిత్రం చూడండి.. ఎంత దారుణమో.. నిత్యం వందల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగించే అంతర్రాష్ట్ర రహదారిలోనే ఈ దుస్థితి.. సరుబుజ్జిలి మండల కేంద్రంలోనే శిమ్మకోనేరు నుంచి కూడలి వరకు ఇదే పరిస్థితి. చెరువును తలపిస్తున్నా ఎవరికీ పట్టింపులేదు.. గొయ్యి దాటేందుకు బస్సులు సైతం ఇలా ప్రమాదభరితంగా పయనించాల్సి వస్తోంది.
18/35
విజయవాడ అయ్యప్పనగర్‌లోని లాల్‌ బహదూర్‌ శాస్త్రి రోడ్డులో గత కొన్ని రోజులుగా వీధి దీపాలు వెలగట్లేదు. దీంతో అంధకారం అలముకుంది. బందర్‌ రోడ్డుకు వెళ్లేందుకు విద్యార్థులు, మహిళలు ఈ మార్గంలోనే రాకపోకలు సాగిస్తుంటారు. చీకటిగా ఉండడంతో వారు ఇబ్బంది పడుతున్నారు. అధికారులు స్పందించి వెంటనే దీపాలు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. విజయవాడ అయ్యప్పనగర్‌లోని లాల్‌ బహదూర్‌ శాస్త్రి రోడ్డులో గత కొన్ని రోజులుగా వీధి దీపాలు వెలగట్లేదు. దీంతో అంధకారం అలముకుంది. బందర్‌ రోడ్డుకు వెళ్లేందుకు విద్యార్థులు, మహిళలు ఈ మార్గంలోనే రాకపోకలు సాగిస్తుంటారు. చీకటిగా ఉండడంతో వారు ఇబ్బంది పడుతున్నారు. అధికారులు స్పందించి వెంటనే దీపాలు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
19/35
ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో శ్రీశైలం జలాశయం నిండుకుండులా తొణికిసలాడుతోంది. మంగళవారం 8 రేడియల్‌ క్రస్ట్‌ గేట్లును 10 అడుగుల మేర పైకెత్తి 2,23,128 క్యూసెక్కుల ప్రవాహాన్ని కిందకు వదిలారు. జలవిద్యుత్తు కేంద్రాల ద్వారా 58,492 క్యూసెక్కుల ప్రవాహాన్ని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో శ్రీశైలం జలాశయం నిండుకుండులా తొణికిసలాడుతోంది. మంగళవారం 8 రేడియల్‌ క్రస్ట్‌ గేట్లును 10 అడుగుల మేర పైకెత్తి 2,23,128 క్యూసెక్కుల ప్రవాహాన్ని కిందకు వదిలారు. జలవిద్యుత్తు కేంద్రాల ద్వారా 58,492 క్యూసెక్కుల ప్రవాహాన్ని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు.
20/35
కృష్ణాజిల్లా పమిడిముక్కల మండలం గురజాడ గ్రామంలోని మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల పైకప్పు బాగా దెబ్బతింది. వర్షాలకు తరగతి గది పైకప్పులో నీటి చెమ్మ దిగి.. పెచ్చులూడి పడుతున్నాయి. విధిలేక విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆ భవనంలోనే ఉంటున్నారు. గడిచిన నెల రోజుల వ్యవధిలో విశాఖ మద్దిలపాలెంలోని ఓ పాఠశాలలో, అనకాపల్లి జిల్లా కశింకోట మండలంలోని ప్రాథమిక పాఠశాలలో పైకప్పు పెచ్చులూడి విద్యార్థులు గాయపడ్డారు. అలాంటి ప్రమాదం ఇక్కడ జరగకముందే గదులకు మరమ్మతులు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. కృష్ణాజిల్లా పమిడిముక్కల మండలం గురజాడ గ్రామంలోని మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల పైకప్పు బాగా దెబ్బతింది. వర్షాలకు తరగతి గది పైకప్పులో నీటి చెమ్మ దిగి.. పెచ్చులూడి పడుతున్నాయి. విధిలేక విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆ భవనంలోనే ఉంటున్నారు. గడిచిన నెల రోజుల వ్యవధిలో విశాఖ మద్దిలపాలెంలోని ఓ పాఠశాలలో, అనకాపల్లి జిల్లా కశింకోట మండలంలోని ప్రాథమిక పాఠశాలలో పైకప్పు పెచ్చులూడి విద్యార్థులు గాయపడ్డారు. అలాంటి ప్రమాదం ఇక్కడ జరగకముందే గదులకు మరమ్మతులు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
21/35
22/35
ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాలలో భాగంగా వనవాసీ కల్యాణ్‌ పరిషత్, జాతీయ గిరిజన కమిషన్, ఓయూ గిరిజన అధ్యాపకులు, విద్యార్థుల ఆధ్వర్యంలో ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ హాజరయ్యారు. గవర్నర్‌కు ఆదివాసీలు తమ సంప్రదాయ నృత్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాలలో భాగంగా వనవాసీ కల్యాణ్‌ పరిషత్, జాతీయ గిరిజన కమిషన్, ఓయూ గిరిజన అధ్యాపకులు, విద్యార్థుల ఆధ్వర్యంలో ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ హాజరయ్యారు. గవర్నర్‌కు ఆదివాసీలు తమ సంప్రదాయ నృత్యాలతో ఘనంగా స్వాగతం పలికారు.
23/35
24/35
ఛత్తీస్‌గఢ్‌లో దంచి కొడుతున్న వానలకు వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ నుంచి రాయ్‌పూర్‌ వెళ్తున్న ఓ మినీ లారీ మంగళవారం దంతరి జిల్లాలోని లోతట్టు వంతెనపై నుంచి వెళ్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు వరదలో చిక్కుకుంది. డ్రైవర్‌, క్లీనర్‌ సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. రెండు రోజులుగా ఆ రాష్ట్రంలో భారీ వర్షాలకు చాలా చోట్ల రహదారులు జలదిగ్భంధంలో చిక్కుకొని రాకపోకలు స్తంభించాయి. ఛత్తీస్‌గఢ్‌లో దంచి కొడుతున్న వానలకు వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ నుంచి రాయ్‌పూర్‌ వెళ్తున్న ఓ మినీ లారీ మంగళవారం దంతరి జిల్లాలోని లోతట్టు వంతెనపై నుంచి వెళ్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు వరదలో చిక్కుకుంది. డ్రైవర్‌, క్లీనర్‌ సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. రెండు రోజులుగా ఆ రాష్ట్రంలో భారీ వర్షాలకు చాలా చోట్ల రహదారులు జలదిగ్భంధంలో చిక్కుకొని రాకపోకలు స్తంభించాయి.
25/35
ఇటీవల భారీ వర్షాలకు రోడ్లపై గుంతలు ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కూకట్‌పల్లి మెట్రోకు వెళ్లే ప్రధాన రోడ్డ్డుపై ఇలా గుంతలుపడ్డాయి. విద్యుత్తు దీపాలు కూడా వెలగకపోవడంతో వాహనదారులు అదుపుతప్పి గాయాలపాలవుతున్నారు. ఇటీవల భారీ వర్షాలకు రోడ్లపై గుంతలు ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కూకట్‌పల్లి మెట్రోకు వెళ్లే ప్రధాన రోడ్డ్డుపై ఇలా గుంతలుపడ్డాయి. విద్యుత్తు దీపాలు కూడా వెలగకపోవడంతో వాహనదారులు అదుపుతప్పి గాయాలపాలవుతున్నారు.
26/35
కార్తికేయ-2 చిత్ర బృందం మంగళవారం విజయవాడలో సందడి చేసింది. ఈ నెల 13వ తేదీన చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో హీరో నిఖిల్, హీరోయిన్‌ అనుపమ పరమేశ్వరన్, కమెడియన్‌ శ్రీనివాసరెడ్డి.. పీవీపీ మాల్‌ను సందర్శించారు. ప్రేక్షకులతో మాట్లాడారు. అభిమానులు వారితో కలిసి సెల్ఫీలు దిగారు. కార్తికేయ-2 చిత్ర బృందం మంగళవారం విజయవాడలో సందడి చేసింది. ఈ నెల 13వ తేదీన చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో హీరో నిఖిల్, హీరోయిన్‌ అనుపమ పరమేశ్వరన్, కమెడియన్‌ శ్రీనివాసరెడ్డి.. పీవీపీ మాల్‌ను సందర్శించారు. ప్రేక్షకులతో మాట్లాడారు. అభిమానులు వారితో కలిసి సెల్ఫీలు దిగారు.
27/35
ఆజాదీకా అమృత్‌మహోత్సవ్‌లో భాగంగా విజయవాడ బెంజిసర్కిల్‌ పైవంతెన గోడలపై స్వాతంత్య్ర సమరయోధులు, పోరాట ఘట్టాల చిత్రాలను వేసిన దృశ్యం. ఆజాదీకా అమృత్‌మహోత్సవ్‌లో భాగంగా విజయవాడ బెంజిసర్కిల్‌ పైవంతెన గోడలపై స్వాతంత్య్ర సమరయోధులు, పోరాట ఘట్టాల చిత్రాలను వేసిన దృశ్యం.
28/35
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని విలీన మండలాల వాసులను గోదావరి, శబరి వరదలు మళ్లీ వణికిస్తున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో నదులు ఉగ్రరూపం దాలుస్తున్నాయి. వారం రోజుల క్రితమే ఇళ్లకు చేరుకున్న బాధితులు మరోసారి సామగ్రి సర్దుకుని పునరావాస కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. మంగళవారం దేవీపట్నంలోని గండిపోశమ్మ అమ్మవారి ఆలయం నీట మునిగింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని విలీన మండలాల వాసులను గోదావరి, శబరి వరదలు మళ్లీ వణికిస్తున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో నదులు ఉగ్రరూపం దాలుస్తున్నాయి. వారం రోజుల క్రితమే ఇళ్లకు చేరుకున్న బాధితులు మరోసారి సామగ్రి సర్దుకుని పునరావాస కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. మంగళవారం దేవీపట్నంలోని గండిపోశమ్మ అమ్మవారి ఆలయం నీట మునిగింది.
29/35
కడప-తాడిపత్రి జాతీయ రహదారిలో ‘ముద్దనూరు నుంచి చిత్రావతి’ వరకు 35 కిలోమీటర్ల పరిధిలో సుమారు 15 వంతెనలున్నాయి. వీటిలో తొమ్మిది వంతెనలపై ఏకంగా 139 గుంతలు ఏర్పడ్డాయి. పలు చోట్ల ఇనుపచువ్వలు తేలిపోయి ప్రమాదభరితంగా ఉన్నాయి. అధికారులు వెంటనే స్పందించి మరమ్మతులు చేయాలని వాహన చోదకులు కోరుతున్నారు. కడప-తాడిపత్రి జాతీయ రహదారిలో ‘ముద్దనూరు నుంచి చిత్రావతి’ వరకు 35 కిలోమీటర్ల పరిధిలో సుమారు 15 వంతెనలున్నాయి. వీటిలో తొమ్మిది వంతెనలపై ఏకంగా 139 గుంతలు ఏర్పడ్డాయి. పలు చోట్ల ఇనుపచువ్వలు తేలిపోయి ప్రమాదభరితంగా ఉన్నాయి. అధికారులు వెంటనే స్పందించి మరమ్మతులు చేయాలని వాహన చోదకులు కోరుతున్నారు.
30/35
రక్షా బంధన్‌ను పురస్కరించుకుని హరియాణాలోని ఫరీదాబాద్‌లో భారీ రాఖీని రూపొందించిన వృత్తి కళాశాల విద్యార్థినులు రక్షా బంధన్‌ను పురస్కరించుకుని హరియాణాలోని ఫరీదాబాద్‌లో భారీ రాఖీని రూపొందించిన వృత్తి కళాశాల విద్యార్థినులు
31/35
స్వాతంత్య్ర అమృతోత్సవాలను పురస్కరించుకుని దిల్లీలోని ఎర్రకోట వద్ద మువ్వన్నెల మురిపెం స్వాతంత్య్ర అమృతోత్సవాలను పురస్కరించుకుని దిల్లీలోని ఎర్రకోట వద్ద మువ్వన్నెల మురిపెం
32/35
హైదరాబాద్‌ నగరంలో రాఖీ పండుగ సందడి మొదలైంది. ఆయా ప్రాంతాల్లో  ప్రత్యేక దుకాణాలు ఏర్పాటు చేసి విక్రయిస్తున్నారు. జనరల్‌బజార్‌లో వరుసగా ఏర్పాటైన రాఖీ విక్రయ దుకాణాలు కిక్కిరిసి కనిపించాయి. హైదరాబాద్‌ నగరంలో రాఖీ పండుగ సందడి మొదలైంది. ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక దుకాణాలు ఏర్పాటు చేసి విక్రయిస్తున్నారు. జనరల్‌బజార్‌లో వరుసగా ఏర్పాటైన రాఖీ విక్రయ దుకాణాలు కిక్కిరిసి కనిపించాయి.
33/35
వర్షాలకు శంషాబాద్‌ సమీపంలోని నానాజీపూర్‌ చెరువు అలుగు పారుతుండడంతో చిన్నాపెద్దా తేడాలేకుండా ఇక్కడికి వస్తున్నారు. పలువురు యువకులు జాగ్రత్తలు తీసుకోకుండా నీటిలోకి దిగుతున్నారు. ఏటా జలపాతాలవద్ద  పలువురు యువకులు ప్రాణాలు కోల్పోతున్నారు. వర్షాలకు శంషాబాద్‌ సమీపంలోని నానాజీపూర్‌ చెరువు అలుగు పారుతుండడంతో చిన్నాపెద్దా తేడాలేకుండా ఇక్కడికి వస్తున్నారు. పలువురు యువకులు జాగ్రత్తలు తీసుకోకుండా నీటిలోకి దిగుతున్నారు. ఏటా జలపాతాలవద్ద పలువురు యువకులు ప్రాణాలు కోల్పోతున్నారు.
34/35
35/35
భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగురవేయాలన్న నినాదంతో మంగళవారం ఉపసభాపతి పద్మారావు, సీతాఫల్‌మండిలో ఇంటింటికి తిరిగి జాతీయ జెండాలు పంపిణీ చేశారు. సికింద్రాబాద్‌ జడ్సీ శ్రీనివాస్‌రెడ్డి, ఉపమేయర్‌ శ్రీలతారెడ్డి, కార్పొరేటర్‌ సామల హేమ పాల్గొన్నారు. నెక్లెస్‌ రోడ్‌లోని థ్రిల్‌ సిటీ వద్ద జరిగిన కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ జాతీయ పతాకాలను అందజేశారు. భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగురవేయాలన్న నినాదంతో మంగళవారం ఉపసభాపతి పద్మారావు, సీతాఫల్‌మండిలో ఇంటింటికి తిరిగి జాతీయ జెండాలు పంపిణీ చేశారు. సికింద్రాబాద్‌ జడ్సీ శ్రీనివాస్‌రెడ్డి, ఉపమేయర్‌ శ్రీలతారెడ్డి, కార్పొరేటర్‌ సామల హేమ పాల్గొన్నారు. నెక్లెస్‌ రోడ్‌లోని థ్రిల్‌ సిటీ వద్ద జరిగిన కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ జాతీయ పతాకాలను అందజేశారు.

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని