News In Pics: చిత్రం చెప్పే సంగతులు-2(10-08-2022)

Updated : 10 Aug 2022 22:26 IST
1/33
తిరుమల శ్రీవారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన పవిత్రోత్సవాలు బుధవారం రాత్రి పూర్ణాహుతితో ముగిశాయి. ఉత్సవాల్లో  భాగంగా బుధవారం ఉదయం రుత్వికులు హోమాలు నిర్వహించారు. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారు ఆలయ మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన పవిత్రోత్సవాలు బుధవారం రాత్రి పూర్ణాహుతితో ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం రుత్వికులు హోమాలు నిర్వహించారు. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారు ఆలయ మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించారు.
2/33
3/33
భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా సికింద్రాబాద్‌ క్లాక్‌ టవర్‌ను విద్యుద్దీపాలతో అందంగా అలంకరించారు. భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా సికింద్రాబాద్‌ క్లాక్‌ టవర్‌ను విద్యుద్దీపాలతో అందంగా అలంకరించారు.
4/33
5/33
ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా రవీంద్రభారతిలో కళాకారులు ఇచ్చిన భారతీయం నృత్య రూపకం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా రవీంద్రభారతిలో కళాకారులు ఇచ్చిన భారతీయం నృత్య రూపకం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
6/33
7/33
ఆజాదీకా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా ఒంగోలులోని కిమ్స్‌ ఆసుపత్రి సర్కిల్ వద్ద జాతీయ రహదారి పైవంతెన స్తంభాలకు స్వాతంత్ర్య సమరయోధుల చిత్రాలను తీర్చిదిద్దుతున్నారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా ఒంగోలులోని కిమ్స్‌ ఆసుపత్రి సర్కిల్ వద్ద జాతీయ రహదారి పైవంతెన స్తంభాలకు స్వాతంత్ర్య సమరయోధుల చిత్రాలను తీర్చిదిద్దుతున్నారు.
8/33
9/33
ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా కర్నూలులోని కొండారెడ్డి బురుజు వద్ద పాఠశాల విద్యార్థులు జాతీయ జెండాలతో ప్రదర్శన నిర్వహించారు. సుమారు 1,400మంది విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొని దేశభక్తిని చాటారు. పలువురు విద్యార్థులు స్వాతంత్ర్య సమరయోధుల వేషధారణలో హాజరై ఆకట్టుకున్నారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా కర్నూలులోని కొండారెడ్డి బురుజు వద్ద పాఠశాల విద్యార్థులు జాతీయ జెండాలతో ప్రదర్శన నిర్వహించారు. సుమారు 1,400మంది విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొని దేశభక్తిని చాటారు. పలువురు విద్యార్థులు స్వాతంత్ర్య సమరయోధుల వేషధారణలో హాజరై ఆకట్టుకున్నారు.
10/33
11/33
భారత స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకల నేపథ్యంలో టీఎస్‌ఆర్టీసీ ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీ వరకు బస్‌స్టేషన్లలో ప్రతిరోజు ఉదయం 11గంటలకు ప్రయాణికులు, ఉద్యోగులు, సిబ్బంది కలిసి జాతీయ గీతాలాపన చేసే కార్యక్రమం చేపట్టారు. దీంతో పాటు వివిధ ప్రాంతాలకు నడుపుతున్న ఆర్టీసీ బస్సులపై స్వాతంత్ర్య సమరయోధుల చిత్రాలను తీర్చిదిద్దారు. హైదరాబాద్‌లోని ఎంజీబీస్‌తో పాటు కొల్లాపూర్‌లో జాతీయ గీతం ఆలపిస్తున్న దృశ్యాలను ఈ చిత్రాల్లో చూడవచ్చు. భారత స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకల నేపథ్యంలో టీఎస్‌ఆర్టీసీ ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీ వరకు బస్‌స్టేషన్లలో ప్రతిరోజు ఉదయం 11గంటలకు ప్రయాణికులు, ఉద్యోగులు, సిబ్బంది కలిసి జాతీయ గీతాలాపన చేసే కార్యక్రమం చేపట్టారు. దీంతో పాటు వివిధ ప్రాంతాలకు నడుపుతున్న ఆర్టీసీ బస్సులపై స్వాతంత్ర్య సమరయోధుల చిత్రాలను తీర్చిదిద్దారు. హైదరాబాద్‌లోని ఎంజీబీస్‌తో పాటు కొల్లాపూర్‌లో జాతీయ గీతం ఆలపిస్తున్న దృశ్యాలను ఈ చిత్రాల్లో చూడవచ్చు.
12/33
13/33
14/33
అనంతపురం జిల్లాలో ఈ ఏడాది టమాట పంట రైతులు తీవ్ర నష్టాల పాలయ్యారు. మార్కెట్‌లో ధరలు తీవ్రంగా పతనం కావడం, నాణ్యత లేదంటూ వ్యాపారులు తిరస్కరించడంతో  రైతులు టమాటలను జాతీయరహదారి పక్కనే పారబోసి వెళ్లిపోయారు. సుమారు 10రోజులుగా ఇదే పరిస్థితి నెలకొనటంతో జిల్లాలోని కక్కలపల్లి మార్కెట్‌ పరిసర ప్రాంతాలన్నీ టమాట గుట్టలతో నిండిపోయాయి. జాతీయ రహదారి పక్కన ఖాళీ ప్రదేశాల్లోనూ టన్నుల కొద్ది టమాటలను పారబోశారు. ఇలా గుట్టలుగా పడేసిన టమాటలను చూసి పలువురు అయ్యో పాపం అనుకుంటున్నారు. గత వారం రోజుల్లో జిల్లావ్యాప్తంగా సుమారు 1,000 టన్నులకు పైగా టమాటలను రైతులు పారబోశారు. అనంతపురం జిల్లాలో ఈ ఏడాది టమాట పంట రైతులు తీవ్ర నష్టాల పాలయ్యారు. మార్కెట్‌లో ధరలు తీవ్రంగా పతనం కావడం, నాణ్యత లేదంటూ వ్యాపారులు తిరస్కరించడంతో రైతులు టమాటలను జాతీయరహదారి పక్కనే పారబోసి వెళ్లిపోయారు. సుమారు 10రోజులుగా ఇదే పరిస్థితి నెలకొనటంతో జిల్లాలోని కక్కలపల్లి మార్కెట్‌ పరిసర ప్రాంతాలన్నీ టమాట గుట్టలతో నిండిపోయాయి. జాతీయ రహదారి పక్కన ఖాళీ ప్రదేశాల్లోనూ టన్నుల కొద్ది టమాటలను పారబోశారు. ఇలా గుట్టలుగా పడేసిన టమాటలను చూసి పలువురు అయ్యో పాపం అనుకుంటున్నారు. గత వారం రోజుల్లో జిల్లావ్యాప్తంగా సుమారు 1,000 టన్నులకు పైగా టమాటలను రైతులు పారబోశారు.
15/33
16/33
నెల్లూరులో బారాషహీద్ దర్గా వద్ద రెండో రోజు బుధవారం రొట్టెల పండగ సందడిగా సాగింది. ఈ సందర్భంగా భక్తులు స్వర్ణాల చెరువులో ప్రార్థనలు చేసి రొట్టెలు మార్చుకున్నారు. నెల్లూరులో బారాషహీద్ దర్గా వద్ద రెండో రోజు బుధవారం రొట్టెల పండగ సందడిగా సాగింది. ఈ సందర్భంగా భక్తులు స్వర్ణాల చెరువులో ప్రార్థనలు చేసి రొట్టెలు మార్చుకున్నారు.
17/33
18/33
19/33
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు బుధవారం పార్లమెంటు ఆవరణలో సీతా అశోక మొక్కను నాటారు. సీతా అశోక వృక్షాన్ని భారత దేశ సంస్కృతిలో భాగంగా పరిగణిస్తారు. దీనికి ఔషధ గుణాలు సైతం మెండుగా ఉన్నాయి. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు బుధవారం పార్లమెంటు ఆవరణలో సీతా అశోక మొక్కను నాటారు. సీతా అశోక వృక్షాన్ని భారత దేశ సంస్కృతిలో భాగంగా పరిగణిస్తారు. దీనికి ఔషధ గుణాలు సైతం మెండుగా ఉన్నాయి.
20/33
ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా పుల్వామాలో విద్యార్థులు, ప్రజలు జాతీయ జెండాలతో పెద్దఎత్తున ర్యాలీ తీశారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా పుల్వామాలో విద్యార్థులు, ప్రజలు జాతీయ జెండాలతో పెద్దఎత్తున ర్యాలీ తీశారు.
21/33
22/33
లైగర్‌ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సినీనటుడు విజయ్‌ దేవరకొండ గుజరాత్‌లోని వడోదర వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడి సంప్రదాయ వంటకం ‘గుజరాతీ తాళీ’ని రుచి చూశారు. ఈ ఫొటోను తన ఇన్‌స్టా ఖాతాలో పంచుకున్న విజయ్‌ దేవరకొండ.. ది గ్రేట్‌ గుజరాతీ తాళీ అని పోస్టు పెట్టారు. గుజరాతీ తాళీలో సాధారణంగా అన్నం, పప్పు, పూరీ, వివిధ రకాల కూరలు, రొట్టె, పచ్చళ్లు, పాపడాలు, గులాబ్‌జామ్‌ ఉంటాయి. విజయ్‌ దేవరకొండ, అనన్య పాండే జంటగా నటించిన లైగర్‌ ఈ నెల 25న థియేటర్లలో విడుదల కానుంది. లైగర్‌ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సినీనటుడు విజయ్‌ దేవరకొండ గుజరాత్‌లోని వడోదర వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడి సంప్రదాయ వంటకం ‘గుజరాతీ తాళీ’ని రుచి చూశారు. ఈ ఫొటోను తన ఇన్‌స్టా ఖాతాలో పంచుకున్న విజయ్‌ దేవరకొండ.. ది గ్రేట్‌ గుజరాతీ తాళీ అని పోస్టు పెట్టారు. గుజరాతీ తాళీలో సాధారణంగా అన్నం, పప్పు, పూరీ, వివిధ రకాల కూరలు, రొట్టె, పచ్చళ్లు, పాపడాలు, గులాబ్‌జామ్‌ ఉంటాయి. విజయ్‌ దేవరకొండ, అనన్య పాండే జంటగా నటించిన లైగర్‌ ఈ నెల 25న థియేటర్లలో విడుదల కానుంది.
23/33
మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను హైదరాబాద్‌ బ్రహ్మకుమారీల సంస్థ ఇన్‌ఛార్జి కుల్దీప్‌ బెహన్‌జీ మర్యాదపూర్వకంగా కలిశారు. రక్షాబంధన్‌ సందర్భంగా ఆయనకు రాఖీ కట్టి తన అభిమానాన్ని చాటుకున్నారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను హైదరాబాద్‌ బ్రహ్మకుమారీల సంస్థ ఇన్‌ఛార్జి కుల్దీప్‌ బెహన్‌జీ మర్యాదపూర్వకంగా కలిశారు. రక్షాబంధన్‌ సందర్భంగా ఆయనకు రాఖీ కట్టి తన అభిమానాన్ని చాటుకున్నారు.
24/33
25/33
వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను దిల్లీలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శ్రీవారి జ్ఞాపికను బహూకరించారు. అనంతరం అక్కడి గాంధీ స్మృతి స్థల్‌ను సందర్శించి మహాత్ముడికి నివాళి అర్పించారు. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను దిల్లీలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శ్రీవారి జ్ఞాపికను బహూకరించారు. అనంతరం అక్కడి గాంధీ స్మృతి స్థల్‌ను సందర్శించి మహాత్ముడికి నివాళి అర్పించారు.
26/33
27/33
ప్రపంచ సింహాల దినోత్సవం సందర్భంగా సింహాలను కాపాడాలని కోరుతూ ఉపరాష్ట్రపతి కార్యాలయం తన అధికారిక ట్విటర్‌ ఖాతాలో సింహాల ఫొటోలు పంచుకుంది. మానవులు అడవులను నాశనం చేస్తున్న కారణంగా వాటి ఉనికికే ముప్పు ఏర్పడిందని తెలిపింది. ప్రతి ఒక్కరూ సింహాల సంరక్షణకు కృషి చేయాలని కోరింది. భారతదేశ సంప్రదాయంలో సింహాన్ని న్యాయానికి, ధైర్యానికి, వీరత్వానికి ప్రతీకగా చూస్తారని చెప్పింది. ప్రపంచ సింహాల దినోత్సవం సందర్భంగా సింహాలను కాపాడాలని కోరుతూ ఉపరాష్ట్రపతి కార్యాలయం తన అధికారిక ట్విటర్‌ ఖాతాలో సింహాల ఫొటోలు పంచుకుంది. మానవులు అడవులను నాశనం చేస్తున్న కారణంగా వాటి ఉనికికే ముప్పు ఏర్పడిందని తెలిపింది. ప్రతి ఒక్కరూ సింహాల సంరక్షణకు కృషి చేయాలని కోరింది. భారతదేశ సంప్రదాయంలో సింహాన్ని న్యాయానికి, ధైర్యానికి, వీరత్వానికి ప్రతీకగా చూస్తారని చెప్పింది.
28/33
29/33
తిరుమల శ్రీవారి ఆలయంలో స్వామివారికి బుధవారం ఘనంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీవారికి చక్రస్నానం, ప్రత్యేక పూజలు చేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలో స్వామివారికి బుధవారం ఘనంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీవారికి చక్రస్నానం, ప్రత్యేక పూజలు చేశారు.
30/33
31/33
తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర 8వ రోజుకు చేరింది. నకిరేకల్‌ నియోజకవర్గంలోని సుంకేనాపల్లి నుంచి చిట్టెడుగూడెం మీదుగా ఆయన యాత్ర సాగుతోంది. మార్గమధ్యలో కల్లు గీత కార్మికులు ఆయన్ను కలిశారు. తమ సమస్యలు విన్నవించిన అనంతరం కల్లు రుచి చూడాల్సిందిగా బండి సంజయ్‌ను కోరారు. అంగీకరించి ఆయన ఇలా లొట్టిలో కల్లు తాగారు. తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర 8వ రోజుకు చేరింది. నకిరేకల్‌ నియోజకవర్గంలోని సుంకేనాపల్లి నుంచి చిట్టెడుగూడెం మీదుగా ఆయన యాత్ర సాగుతోంది. మార్గమధ్యలో కల్లు గీత కార్మికులు ఆయన్ను కలిశారు. తమ సమస్యలు విన్నవించిన అనంతరం కల్లు రుచి చూడాల్సిందిగా బండి సంజయ్‌ను కోరారు. అంగీకరించి ఆయన ఇలా లొట్టిలో కల్లు తాగారు.
32/33
ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా హైదరాబాద్‌ కోఠిలోని కేంబ్రిడ్జి పాఠశాలకు చెందిన విద్యార్థులు 800 అడుగుల పొడవైన జాతీయ జెండాతో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు భారతమాత, గాంధీ, సుభాష్‌ చంద్రబోస్‌ వేషధారణలో ఆకట్టుకున్నారు. కోఠి, రాంకోఠి, సుల్తాన్‌బజార్‌ మార్గంలో ర్యాలీ చేశారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా హైదరాబాద్‌ కోఠిలోని కేంబ్రిడ్జి పాఠశాలకు చెందిన విద్యార్థులు 800 అడుగుల పొడవైన జాతీయ జెండాతో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు భారతమాత, గాంధీ, సుభాష్‌ చంద్రబోస్‌ వేషధారణలో ఆకట్టుకున్నారు. కోఠి, రాంకోఠి, సుల్తాన్‌బజార్‌ మార్గంలో ర్యాలీ చేశారు.
33/33

మరిన్ని