News In Pics: చిత్రం చెప్పే సంగతులు-1(11-08-2022)

Published : 11 Aug 2022 12:39 IST
1/36
ఏదైనా పని మీద ప్రజలెవరైనా ఆ కార్యాలయానికి వెళ్తే... ముందుకు రావొద్దు అంటూ ప్రధాన ద్వారం వద్ద సిబ్బంది వారిస్తుంటారు. పైకప్పు రేకులు జారి పడుతున్నాయ్‌.. అంటూ జాగ్రత్తలు తెలియజేస్తుంటారు. ఇదీ గాజువాక పట్టణ నడిబొడ్డున ఉన్న పౌరసరఫరాలశాఖ ‘విశాఖ సర్కిల్‌-3 కార్యాలయం’ దుస్థితి. కాలం చెల్లిన భవనంలో సహాయ సరఫరాల అధికారి(ఏఎస్‌ఓ), చెకింగ్‌ ఇన్‌స్పెక్టర్లు, జూనియర్‌ అసిస్టెంట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు బిక్కుబిక్కుమంటూనే విధులు నిర్వహిస్తున్నారు.  

ఏదైనా పని మీద ప్రజలెవరైనా ఆ కార్యాలయానికి వెళ్తే... ముందుకు రావొద్దు అంటూ ప్రధాన ద్వారం వద్ద సిబ్బంది వారిస్తుంటారు. పైకప్పు రేకులు జారి పడుతున్నాయ్‌.. అంటూ జాగ్రత్తలు తెలియజేస్తుంటారు. ఇదీ గాజువాక పట్టణ నడిబొడ్డున ఉన్న పౌరసరఫరాలశాఖ ‘విశాఖ సర్కిల్‌-3 కార్యాలయం’ దుస్థితి. కాలం చెల్లిన భవనంలో సహాయ సరఫరాల అధికారి(ఏఎస్‌ఓ), చెకింగ్‌ ఇన్‌స్పెక్టర్లు, జూనియర్‌ అసిస్టెంట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు బిక్కుబిక్కుమంటూనే విధులు నిర్వహిస్తున్నారు.
2/36
ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీకి వేదికైన విశాఖలోని ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్‌ స్టేడియం బురదమయంగా మారింది. ఈనెల 14వ తేదీ నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల యువకులు ఈ మైదానంలో జరిగే పరుగు పోటీల్లో పాల్గొననున్నారు. బురద ఇలాగే ఉంటే పరుగు తీసే సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పలువురు ఆందోళన చెందుతున్నారు. జీవీఎంసీ అధికారులు స్పందించి మైదానంలోని ట్రాక్‌ను సరి చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు. ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీకి వేదికైన విశాఖలోని ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్‌ స్టేడియం బురదమయంగా మారింది. ఈనెల 14వ తేదీ నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల యువకులు ఈ మైదానంలో జరిగే పరుగు పోటీల్లో పాల్గొననున్నారు. బురద ఇలాగే ఉంటే పరుగు తీసే సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పలువురు ఆందోళన చెందుతున్నారు. జీవీఎంసీ అధికారులు స్పందించి మైదానంలోని ట్రాక్‌ను సరి చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు.
3/36
ఆమదాలవలస మండలం గాజులకొల్లివలస సంగమేశ్వస్వామి కొండ వద్ద సైకత శిల్పి గేదెల హరికృష్ణ స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా బుధవారం సైకత శిల్పం రూపొందించారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబునాయుడు చిత్రాలను ఇసుకతో తీర్చిదిద్దారు. అదే ఈ చిత్రం.  


ఆమదాలవలస మండలం గాజులకొల్లివలస సంగమేశ్వస్వామి కొండ వద్ద సైకత శిల్పి గేదెల హరికృష్ణ స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా బుధవారం సైకత శిల్పం రూపొందించారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబునాయుడు చిత్రాలను ఇసుకతో తీర్చిదిద్దారు. అదే ఈ చిత్రం.
4/36
ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాలను పురస్కరించుకుని కాకినాడ ఐటీఐ విద్యార్థులు మహాత్ముని ప్రతిమను వినూత్నంగా తయారు చేశారు. వెల్డింగ్‌ విభాగానికి చెందిన విద్యార్థులు ఇనుప చువ్వలతో ఆకట్టుకునే విధంగా మహాత్ముని రూపాన్ని రూపొందించారు. దీనిని కళాశాల ప్రవేశ ద్వారం వద్ద ఏర్పాటు చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున కళాశాలలో ఈ ప్రతిమను ప్రత్యేకంగా ఉంచుతామని ప్రిన్సిపల్‌ వేణుగోపాలవర్మ తెలిపారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాలను పురస్కరించుకుని కాకినాడ ఐటీఐ విద్యార్థులు మహాత్ముని ప్రతిమను వినూత్నంగా తయారు చేశారు. వెల్డింగ్‌ విభాగానికి చెందిన విద్యార్థులు ఇనుప చువ్వలతో ఆకట్టుకునే విధంగా మహాత్ముని రూపాన్ని రూపొందించారు. దీనిని కళాశాల ప్రవేశ ద్వారం వద్ద ఏర్పాటు చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున కళాశాలలో ఈ ప్రతిమను ప్రత్యేకంగా ఉంచుతామని ప్రిన్సిపల్‌ వేణుగోపాలవర్మ తెలిపారు.
5/36
కాలువ వంతెనపై ఇల్లు నిర్మించారేంటి అనుకుంటున్నారా... ఇది కేవలం ఒక చోటనుంచి మరోచోటికి తరలించే రెడీమేడ్‌ ఇల్లు. ఉప్పలగుప్తం మండలంలోని రాఘవులపేటకు చెందిన ఆక్వారైతు చెరువుల వద్ద నివసించేందుకు సకల సౌకర్యాలతో కూడిన ఇంటిని కొనుగోలు చేసి తెచ్చుకున్నారు. చెరువుల వద్దకు వెళ్లే రహదారి వర్షాలకు పాడవడంతో ఇలా వంతెనపై దింపి తాత్కాలికంగా ఉంచారు. వంతెనపై నుంచి ప్రకృతి అందాలను తిలకించడానికి ఏర్పాటు చేసినట్లుగా ఉన్న దీనిని బుధవారం అటుగా పోయేవారు వీక్షించి స్వీయచిత్రాలు తీసుకుంటూ ఆనందిస్తున్నారు. కాలువ వంతెనపై ఇల్లు నిర్మించారేంటి అనుకుంటున్నారా... ఇది కేవలం ఒక చోటనుంచి మరోచోటికి తరలించే రెడీమేడ్‌ ఇల్లు. ఉప్పలగుప్తం మండలంలోని రాఘవులపేటకు చెందిన ఆక్వారైతు చెరువుల వద్ద నివసించేందుకు సకల సౌకర్యాలతో కూడిన ఇంటిని కొనుగోలు చేసి తెచ్చుకున్నారు. చెరువుల వద్దకు వెళ్లే రహదారి వర్షాలకు పాడవడంతో ఇలా వంతెనపై దింపి తాత్కాలికంగా ఉంచారు. వంతెనపై నుంచి ప్రకృతి అందాలను తిలకించడానికి ఏర్పాటు చేసినట్లుగా ఉన్న దీనిని బుధవారం అటుగా పోయేవారు వీక్షించి స్వీయచిత్రాలు తీసుకుంటూ ఆనందిస్తున్నారు.
6/36
‘నా దగ్గర ఇప్పుడు ఏమీ లేదయ్యో.. నన్నూ మధ్య తరగతి కిందే లెక్కేయండి’ అంటూ ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి సరదాగా వ్యాఖ్యానించారు. బుధవారం జలదంకి మండలం జమ్మలపాళెంలో నుడా రూపొందించిన జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌ లక్కీడ్రాకు ఆయన హాజరయ్యారు. ఆ సందర్భంగా అక్కడి ఎంఐజీ లేఅవుట్‌లో తనకూ ఓ మూలన రెండు ప్లాట్లు ఇవ్వాలని చమత్కరించారు. కోటీశ్వరుడిని అని భ్రమపడవద్దంటూ అధికారులను ఉద్దేశించి అన్నారు.  

‘నా దగ్గర ఇప్పుడు ఏమీ లేదయ్యో.. నన్నూ మధ్య తరగతి కిందే లెక్కేయండి’ అంటూ ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి సరదాగా వ్యాఖ్యానించారు. బుధవారం జలదంకి మండలం జమ్మలపాళెంలో నుడా రూపొందించిన జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌ లక్కీడ్రాకు ఆయన హాజరయ్యారు. ఆ సందర్భంగా అక్కడి ఎంఐజీ లేఅవుట్‌లో తనకూ ఓ మూలన రెండు ప్లాట్లు ఇవ్వాలని చమత్కరించారు. కోటీశ్వరుడిని అని భ్రమపడవద్దంటూ అధికారులను ఉద్దేశించి అన్నారు.
7/36
తహసీల్దారు కార్యాలయం బోర్డు పెట్టుకుని కూరగాయల కొట్టు నడుపుతున్నారేంటా అని ఆశ్చర్యపోతున్నారా..! అవనిగడ్డ తహసీల్దారు కార్యాలయ భవనం శిథిలమైందని దాదాపు రూ.90లక్షలతో తెదేపా హయాంలో నిర్మాణాన్ని ప్రారంభించారు. రెండేళ్లు దాటుతున్నా, చిన్నచిన్న పనులు ఉన్నాయని ఆ భవనాన్ని ప్రారంభించడం లేదు. కార్యాలయం ప్రారంభిస్తే తెదేపా ప్రభుత్వ ఖాతాలోకి ఘనత వెళ్తుందని భావించి రాజకీయ కోణంలో ఆపేశారని స్థానికులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. తహసీల్దారు కార్యాలయం బోర్డు పెట్టుకుని కూరగాయల కొట్టు నడుపుతున్నారేంటా అని ఆశ్చర్యపోతున్నారా..! అవనిగడ్డ తహసీల్దారు కార్యాలయ భవనం శిథిలమైందని దాదాపు రూ.90లక్షలతో తెదేపా హయాంలో నిర్మాణాన్ని ప్రారంభించారు. రెండేళ్లు దాటుతున్నా, చిన్నచిన్న పనులు ఉన్నాయని ఆ భవనాన్ని ప్రారంభించడం లేదు. కార్యాలయం ప్రారంభిస్తే తెదేపా ప్రభుత్వ ఖాతాలోకి ఘనత వెళ్తుందని భావించి రాజకీయ కోణంలో ఆపేశారని స్థానికులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు.
8/36
తుగ్గలి మండలం జి.ఎర్రగుడి పొలాల్లో వ్యవసాయ పనులు చేస్తున్న అదే గ్రామ రైతు కుటుంబానికి వజ్రం రూపంలో అదృష్టం వరించింది. టమాటా తోటలో బుధవారం కలుపు తీస్తుండగా రైతు కుమార్తెకు 10 క్యారెట్ల బరువున్న, విలువైన వజ్రం లభించింది. దాన్ని పెరవలి, జొన్నగిరి వ్యాపారులు కలిసి రూ.34 లక్షలకు కొనుగోలు చేసినట్లు సమాచారం. తుగ్గలి మండలం జి.ఎర్రగుడి పొలాల్లో వ్యవసాయ పనులు చేస్తున్న అదే గ్రామ రైతు కుటుంబానికి వజ్రం రూపంలో అదృష్టం వరించింది. టమాటా తోటలో బుధవారం కలుపు తీస్తుండగా రైతు కుమార్తెకు 10 క్యారెట్ల బరువున్న, విలువైన వజ్రం లభించింది. దాన్ని పెరవలి, జొన్నగిరి వ్యాపారులు కలిసి రూ.34 లక్షలకు కొనుగోలు చేసినట్లు సమాచారం.
9/36
శేషాచలకొండలపై బుధవారం మధ్యాహ్నం అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. భానుడి కిరణాలతో శేషాచల కొండలపై వెలుగునీడలు శ్రీవారి తిరునామంగా ఏర్పడింది. ఈ దృశ్యాన్ని భక్తులు వీక్షించి ఆనందించారు. సూర్యకిరణాలు మైసూర్‌గోపురం నుంచి శంఖుచక్రనామాల గోపురం కొండ వరకు ఏర్పడ్డాయి. వరుసగా ఉన్న మూడు కొండల్లో మధ్యకొండపై సూర్యకిరణాలు ఏర్పడటంతో ఈ నయనానందకర దృశ్యం కనిపించింది. శేషాచలకొండలపై బుధవారం మధ్యాహ్నం అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. భానుడి కిరణాలతో శేషాచల కొండలపై వెలుగునీడలు శ్రీవారి తిరునామంగా ఏర్పడింది. ఈ దృశ్యాన్ని భక్తులు వీక్షించి ఆనందించారు. సూర్యకిరణాలు మైసూర్‌గోపురం నుంచి శంఖుచక్రనామాల గోపురం కొండ వరకు ఏర్పడ్డాయి. వరుసగా ఉన్న మూడు కొండల్లో మధ్యకొండపై సూర్యకిరణాలు ఏర్పడటంతో ఈ నయనానందకర దృశ్యం కనిపించింది.
10/36
పెద్దపప్పూరు మండలం చిన్నపప్పూరు గ్రామం వద్ద పెన్నానదిపై కల్వర్టు వద్ద గతంలో వచ్చిన వరదలకు రహదారికి అనుసంధానంగా ఉన్న సిమెంటు చప్టాలు పగిలిపోయి ప్రమాదకరంగా మారింది. రహదారి పక్కనే ఈ శిథిలాలు ఉండటంతో పాటు రక్షణ ఏర్పాట్లు లేవు. దీంతో వాహనదారులు ప్రయాణం చేయాలంటే భయపడుతున్నారు.  పెద్దపప్పూరు మండలం చిన్నపప్పూరు గ్రామం వద్ద పెన్నానదిపై కల్వర్టు వద్ద గతంలో వచ్చిన వరదలకు రహదారికి అనుసంధానంగా ఉన్న సిమెంటు చప్టాలు పగిలిపోయి ప్రమాదకరంగా మారింది. రహదారి పక్కనే ఈ శిథిలాలు ఉండటంతో పాటు రక్షణ ఏర్పాట్లు లేవు. దీంతో వాహనదారులు ప్రయాణం చేయాలంటే భయపడుతున్నారు.
11/36
గుంతకల్లు మండలంలోని కసాపురం గ్రామంలో రైతులు బుధవారం తొమ్మిది గంటల్లో ఎద్దుల సహాయంతో 24 ఎకరాల్లో కంది విత్తనం వేసే కార్యక్రమాన్ని పూర్తిచేశారు. గ్రామానికి చెందిన రైతు లింగమూర్తి కుమారులు వసంత్, అంజి కాడెద్దుల సాయంతో రికార్డు స్థాయిలో కందిని విత్తారు. తెల్లవారు జామున 5 నుంచి మధ్యాహ్నం 2 గంటల్లోగా విత్తే కార్యక్రమాన్ని పూర్తిచేశామని చెప్పారు.  గుంతకల్లు మండలంలోని కసాపురం గ్రామంలో రైతులు బుధవారం తొమ్మిది గంటల్లో ఎద్దుల సహాయంతో 24 ఎకరాల్లో కంది విత్తనం వేసే కార్యక్రమాన్ని పూర్తిచేశారు. గ్రామానికి చెందిన రైతు లింగమూర్తి కుమారులు వసంత్, అంజి కాడెద్దుల సాయంతో రికార్డు స్థాయిలో కందిని విత్తారు. తెల్లవారు జామున 5 నుంచి మధ్యాహ్నం 2 గంటల్లోగా విత్తే కార్యక్రమాన్ని పూర్తిచేశామని చెప్పారు.
12/36
ఇరుకుగా పాఠశాల భవనం...పైగా శిథిలావస్థకు చేరడంతో నిత్యం ఇబ్బందులు తప్పడం లేదు. ఈ క్రమంలోనే పెచ్చులూడి పడ్డాయి. ఈ ఘటన రామాయంపేట ప్రభుత్వ బాలుర పాఠశాలలో బుధవారం చోటు చేసుకుంది. ఉదయం ప్రధానోపాధ్యాయుడి గది తాళం తీసి లోపలికి వెళ్లే సమయంలోనే పెచ్చులూడి కిందపడ్డాయి. ఆరో తరగతిలోనూ ఇదే పరిస్థితి. ఆ సమయంలో విద్యార్థులు దూరంగా ఉండటంతో తృటిలో ప్రమాదం తప్పింది.  

ఇరుకుగా పాఠశాల భవనం...పైగా శిథిలావస్థకు చేరడంతో నిత్యం ఇబ్బందులు తప్పడం లేదు. ఈ క్రమంలోనే పెచ్చులూడి పడ్డాయి. ఈ ఘటన రామాయంపేట ప్రభుత్వ బాలుర పాఠశాలలో బుధవారం చోటు చేసుకుంది. ఉదయం ప్రధానోపాధ్యాయుడి గది తాళం తీసి లోపలికి వెళ్లే సమయంలోనే పెచ్చులూడి కిందపడ్డాయి. ఆరో తరగతిలోనూ ఇదే పరిస్థితి. ఆ సమయంలో విద్యార్థులు దూరంగా ఉండటంతో తృటిలో ప్రమాదం తప్పింది.
13/36
14/36
రద్దీ ప్రదేశాల్లో ఏర్పడిన పైపులైన్ల లీకేజీల కారణంగా వాహనచోదకులు ప్రమాదాల బారినపడుతున్నారు. పాల్వంచ అంబేడ్కర్‌ కూడలి నుంచి ఆంజనేయస్వామి గుడికి వెళ్లే రహదారి ప్రారంభంలో తాగునీటి ప్రధాన పైపులైన్‌కు నెలన్నర క్రితం లీకేజీ ఏర్పడింది. నీటి సరఫరా జరిగిన ప్రతిసారీ గుంత కూడా పెరుగుతూ వచ్చింది. బుధవారం ఓ వాహనదారుడు సాధారణ గుంత అనుకుని వాహనాన్ని నడపడంతో ఇలా ఇరుక్కుపోయింది. రద్దీ ప్రదేశాల్లో ఏర్పడిన పైపులైన్ల లీకేజీల కారణంగా వాహనచోదకులు ప్రమాదాల బారినపడుతున్నారు. పాల్వంచ అంబేడ్కర్‌ కూడలి నుంచి ఆంజనేయస్వామి గుడికి వెళ్లే రహదారి ప్రారంభంలో తాగునీటి ప్రధాన పైపులైన్‌కు నెలన్నర క్రితం లీకేజీ ఏర్పడింది. నీటి సరఫరా జరిగిన ప్రతిసారీ గుంత కూడా పెరుగుతూ వచ్చింది. బుధవారం ఓ వాహనదారుడు సాధారణ గుంత అనుకుని వాహనాన్ని నడపడంతో ఇలా ఇరుక్కుపోయింది.
15/36
కూసుమంచి మండలంలోని గట్టుసింగారం పరిధి గన్యాతండాలో రైతు భూక్యా వీరభద్రరావు డ్రాగన్‌ ఫ్రూట్స్‌ సాగు చేశారు. పంట చేతికి వచ్చినా మార్కెట్‌లో గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతే వాహనంలో ఖమ్మం తీసుకొచ్చి నేరుగా వినియోగదారులకు విక్రయిస్తున్నారు. కూసుమంచి మండలంలోని గట్టుసింగారం పరిధి గన్యాతండాలో రైతు భూక్యా వీరభద్రరావు డ్రాగన్‌ ఫ్రూట్స్‌ సాగు చేశారు. పంట చేతికి వచ్చినా మార్కెట్‌లో గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతే వాహనంలో ఖమ్మం తీసుకొచ్చి నేరుగా వినియోగదారులకు విక్రయిస్తున్నారు.
16/36
మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. బుధవారం భాజపా నేత సుహాసినిరెడ్డి తన కార్యకర్తలతో కలిసి ఆదిలాబాద్‌ జిల్లా అదనపు పాలనాధికారి నటరాజ్‌ను కలిసి సమస్యలను వివరిస్తున్న చిత్రాలను అక్కడ విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్‌ తన చరవాణిలో ఇలా ఫొటోలు తీసి, వివరాలను సైతం వెంటనే ఉన్నతాధికారులకు పంపించారు. ఆ చిత్రమే ఇది. మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. బుధవారం భాజపా నేత సుహాసినిరెడ్డి తన కార్యకర్తలతో కలిసి ఆదిలాబాద్‌ జిల్లా అదనపు పాలనాధికారి నటరాజ్‌ను కలిసి సమస్యలను వివరిస్తున్న చిత్రాలను అక్కడ విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్‌ తన చరవాణిలో ఇలా ఫొటోలు తీసి, వివరాలను సైతం వెంటనే ఉన్నతాధికారులకు పంపించారు. ఆ చిత్రమే ఇది.
17/36
ఇంద్రవెల్లి మండలం దస్నాపూర్‌ పంచాయతీ పరిధిలోని రాంలింగంపేట్‌కు ఉన్న ఏకైక రహదారి బురదమయమై అధ్వానంగా ఉండటంతో అంబులెన్స్‌ రాలేని పరిస్థితి. పురిటినొప్పులతో బాధపడుతున్న తన భార్య సీడాం ధనలక్ష్మి ఆసుపత్రికి తీసుకెళ్దామని 108, అమ్మ ఒడి అంబులెన్స్‌లకు సోము చరవాణి ద్వారా సమచారమిచ్చినా రాలేమని జవాబు. అయిదు కి.మీ దూరంలోని పిట్టబొంగరం పీహెచ్‌సీకి తీసుకొస్తే రిమ్స్‌కు తరలిస్తామని సమాధానం చెప్పడంతో.. చేసేదేమి లేక ఇలా తన ద్విచక్ర వాహనంపై భార్య పిల్లలను ఎంతో జాగ్రత్తగా తీసుకెళ్లాడు. ఇంద్రవెల్లి మండలం దస్నాపూర్‌ పంచాయతీ పరిధిలోని రాంలింగంపేట్‌కు ఉన్న ఏకైక రహదారి బురదమయమై అధ్వానంగా ఉండటంతో అంబులెన్స్‌ రాలేని పరిస్థితి. పురిటినొప్పులతో బాధపడుతున్న తన భార్య సీడాం ధనలక్ష్మి ఆసుపత్రికి తీసుకెళ్దామని 108, అమ్మ ఒడి అంబులెన్స్‌లకు సోము చరవాణి ద్వారా సమచారమిచ్చినా రాలేమని జవాబు. అయిదు కి.మీ దూరంలోని పిట్టబొంగరం పీహెచ్‌సీకి తీసుకొస్తే రిమ్స్‌కు తరలిస్తామని సమాధానం చెప్పడంతో.. చేసేదేమి లేక ఇలా తన ద్విచక్ర వాహనంపై భార్య పిల్లలను ఎంతో జాగ్రత్తగా తీసుకెళ్లాడు.
18/36
ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా పల్నాడు జిల్లా నరసరావుపేటలో బుధవారం జాతీయ పతాక శోభాయాత్ర వైభవంగా సాగింది. కలెక్టర్‌ శివశంకర్‌, జేసీ శ్యాంప్రసాద్‌, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీలు కేఎస్‌ లక్ష్మణరావు, జంగా కృష్ణమూర్తి యాత్ర ప్రారంభించారు. పట్టణంలోని ఎస్‌ఎస్‌ఎన్‌ కళాశాల నుంచి సత్తెనపల్లిరోడ్డులోని క్రీడా ప్రాంగణం వరకూ ప్రదర్శన సాగింది. 1000 మీటర్ల జాతీయ పతాకంతో నిర్వహించిన ప్రదర్శనలో అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా పల్నాడు జిల్లా నరసరావుపేటలో బుధవారం జాతీయ పతాక శోభాయాత్ర వైభవంగా సాగింది. కలెక్టర్‌ శివశంకర్‌, జేసీ శ్యాంప్రసాద్‌, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీలు కేఎస్‌ లక్ష్మణరావు, జంగా కృష్ణమూర్తి యాత్ర ప్రారంభించారు. పట్టణంలోని ఎస్‌ఎస్‌ఎన్‌ కళాశాల నుంచి సత్తెనపల్లిరోడ్డులోని క్రీడా ప్రాంగణం వరకూ ప్రదర్శన సాగింది. 1000 మీటర్ల జాతీయ పతాకంతో నిర్వహించిన ప్రదర్శనలో అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
19/36
ఈ ఏడాది టమాటా సాగుతో అనంతపురం జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోయారు. మార్కెట్‌లో ధరలు లేకపోవడం, నాణ్యత లేదంటూ వ్యాపారులు తిరస్కరించడంతో రైతులు ఎక్కువ శాతం పారబోశారు. జిల్లాలోని కక్కలపల్లి మార్కెట్‌ పరిసర ప్రాంతాల్లో ఎటూ చూసినా కుప్పలు కుప్పలుగా పడేసిన టమాటానే కనిపిస్తోంది. గత వారం రోజుల్లో జిల్లా వ్యాప్తంగా దాదాపు వెయ్యి టన్నులకుపైగా సరకును పారబోసినట్లు అంచనా. ఈ ఏడాది టమాటా సాగుతో అనంతపురం జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోయారు. మార్కెట్‌లో ధరలు లేకపోవడం, నాణ్యత లేదంటూ వ్యాపారులు తిరస్కరించడంతో రైతులు ఎక్కువ శాతం పారబోశారు. జిల్లాలోని కక్కలపల్లి మార్కెట్‌ పరిసర ప్రాంతాల్లో ఎటూ చూసినా కుప్పలు కుప్పలుగా పడేసిన టమాటానే కనిపిస్తోంది. గత వారం రోజుల్లో జిల్లా వ్యాప్తంగా దాదాపు వెయ్యి టన్నులకుపైగా సరకును పారబోసినట్లు అంచనా.
20/36
ఒకేసారి 16వేల మంది విద్యార్థులు జాతీయగీతాన్ని ఆలపించి.. స్వాతంత్య్ర సంగ్రామ స్ఫూర్తిని చాటిచెప్పారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ జిల్లాలో విద్యార్థులంతా ఒక చోట చేరి.. జాతీయగీతాన్ని ఆలపించారు. ఇందుకోసం జిల్లా యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఒకేసారి 16వేల మంది విద్యార్థులు జాతీయగీతాన్ని ఆలపించి.. స్వాతంత్య్ర సంగ్రామ స్ఫూర్తిని చాటిచెప్పారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ జిల్లాలో విద్యార్థులంతా ఒక చోట చేరి.. జాతీయగీతాన్ని ఆలపించారు. ఇందుకోసం జిల్లా యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
21/36
ఇటుక మీద ఇటుక పేర్చి నిదానంగా నిర్మాణాలు పూర్తిచేసే కాలం కాదిది. ఆధునికత అండగా భారీ భవనాలను సైతం వీలైనంత వేగంగా కొలిక్కి తేవటం నేడు సాధ్యపడుతోంది. హైదరాబాద్‌ ఐటీ కారిడార్‌లో నాలెడ్జి సిటీ, గచ్చిబౌలి ప్రాంతాల్లో నిర్మిస్తున్న భారీ భవనాలు, కార్యాలయాలకు పునాదుల అనంతరం.. ఇనుప స్తంభాలనే పిల్లర్లుగా మార్చి, వాటికి అద్దాలు అమర్చి చకచకా నిర్మాణాలు కానిచ్చేస్తున్నారు. ఫలితంగా అనేక అంతస్తులతో ఏళ్ల తరబడి సాగే భారీ నిర్మాణాలూ ఏడాదిలోనే పూర్తయిపోతున్నాయి. సిబ్బందికి ఆహ్లాదకర వాతావరణంతో పాటు, పరిసరాలకు వినూత్న శోభ తెస్తున్నాయి. ఇటుక మీద ఇటుక పేర్చి నిదానంగా నిర్మాణాలు పూర్తిచేసే కాలం కాదిది. ఆధునికత అండగా భారీ భవనాలను సైతం వీలైనంత వేగంగా కొలిక్కి తేవటం నేడు సాధ్యపడుతోంది. హైదరాబాద్‌ ఐటీ కారిడార్‌లో నాలెడ్జి సిటీ, గచ్చిబౌలి ప్రాంతాల్లో నిర్మిస్తున్న భారీ భవనాలు, కార్యాలయాలకు పునాదుల అనంతరం.. ఇనుప స్తంభాలనే పిల్లర్లుగా మార్చి, వాటికి అద్దాలు అమర్చి చకచకా నిర్మాణాలు కానిచ్చేస్తున్నారు. ఫలితంగా అనేక అంతస్తులతో ఏళ్ల తరబడి సాగే భారీ నిర్మాణాలూ ఏడాదిలోనే పూర్తయిపోతున్నాయి. సిబ్బందికి ఆహ్లాదకర వాతావరణంతో పాటు, పరిసరాలకు వినూత్న శోభ తెస్తున్నాయి.
22/36
ఎగువన కృష్ణా పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం, నాగార్జున సాగర్‌ జలాశయాల గేట్లు ఎత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం 10 రేడియల్‌ గేట్లను 15 అడుగుల మేర ఎత్తి నాగార్జునసాగర్‌కు విడుదల చేశారు. శ్రీశైలం నుంచి వరద నీరు సాగర్‌ జలాశయానికి చేరడంతో ఎన్‌ఎస్పీ అధికారులు అక్కడి 20 గేట్లను 5 అడుగల మేరకు ఎత్తి నీటిని దిగువకు పంపిస్తున్నారు. రెండు జలాశయాల్లో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్న దృశ్యాలివి. ఎగువన కృష్ణా పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం, నాగార్జున సాగర్‌ జలాశయాల గేట్లు ఎత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం 10 రేడియల్‌ గేట్లను 15 అడుగుల మేర ఎత్తి నాగార్జునసాగర్‌కు విడుదల చేశారు. శ్రీశైలం నుంచి వరద నీరు సాగర్‌ జలాశయానికి చేరడంతో ఎన్‌ఎస్పీ అధికారులు అక్కడి 20 గేట్లను 5 అడుగల మేరకు ఎత్తి నీటిని దిగువకు పంపిస్తున్నారు. రెండు జలాశయాల్లో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్న దృశ్యాలివి.
23/36
24/36
25/36
తాండూరు మండల పరిధి గ్రామాల్లో ఇటీవల కురిసిన వర్షాలతో లోతట్టునున్న పొలాలు ముంపునకు గురై రైతులు నష్టపోవాల్సి వచ్చింది. ఇదే సమయంలో ఎగువనున్న పంట పొలాలు అందుకు భిన్నంగా పచ్చదనంతో ఆకట్టుకుంటున్నాయి. బిజ్వార్‌లో కంది, పెసర, జొన్న పొలాలు కనుచూపుమేరలో లేత ఆకుపచ్చని మొక్కలతో కనువిందు చేస్తున్నాయి. కళకళలాడుతున్న పొలాలను చూసి రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాండూరు మండల పరిధి గ్రామాల్లో ఇటీవల కురిసిన వర్షాలతో లోతట్టునున్న పొలాలు ముంపునకు గురై రైతులు నష్టపోవాల్సి వచ్చింది. ఇదే సమయంలో ఎగువనున్న పంట పొలాలు అందుకు భిన్నంగా పచ్చదనంతో ఆకట్టుకుంటున్నాయి. బిజ్వార్‌లో కంది, పెసర, జొన్న పొలాలు కనుచూపుమేరలో లేత ఆకుపచ్చని మొక్కలతో కనువిందు చేస్తున్నాయి. కళకళలాడుతున్న పొలాలను చూసి రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
26/36
ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమంలో భాగంగా తాండూరు పట్టణంలో రెండో రోజు ప్రధాన వీధుల్లో 75 మీటర్ల భారీ జాతీయ జెండాను ప్రదర్శించారు. భద్రేశ్వర దేవాలయం నుంచి వివిధ కూడళ్ల మీదుగా పతాకాన్ని ఊరేగించారు. విద్యార్థులు జాతీయ నినాదాలతో హోరెత్తించారు. ఆయా కార్యక్రమాల్లో పురపాలక సంఘం ఉపాధ్యక్షురాలు దీప, కౌన్సిలర్లు, పురపాలక సంఘం అధికారులు తదితరులున్నారు. స్వాతంత్య్ర స్ఫూర్తిని చాటాలన్నారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమంలో భాగంగా తాండూరు పట్టణంలో రెండో రోజు ప్రధాన వీధుల్లో 75 మీటర్ల భారీ జాతీయ జెండాను ప్రదర్శించారు. భద్రేశ్వర దేవాలయం నుంచి వివిధ కూడళ్ల మీదుగా పతాకాన్ని ఊరేగించారు. విద్యార్థులు జాతీయ నినాదాలతో హోరెత్తించారు. ఆయా కార్యక్రమాల్లో పురపాలక సంఘం ఉపాధ్యక్షురాలు దీప, కౌన్సిలర్లు, పురపాలక సంఘం అధికారులు తదితరులున్నారు. స్వాతంత్య్ర స్ఫూర్తిని చాటాలన్నారు.
27/36
ఓవైపు స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా నగరాన్ని త్రివర్ణ వెలుగుల్లో నింపుతుండగా జేఎన్‌టీయూ వంతెనపై వీధిదీపాలు వెలగడం లేదు. అంధకారంగా మారిన రహదారిపై వాహనాల లైట్లే దారి చూపుతున్నాయి. లక్షలు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన దీపాలు పనిచేయకపోయినా అధికారులు పట్టించుకోవడం లేదు. ఓవైపు స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా నగరాన్ని త్రివర్ణ వెలుగుల్లో నింపుతుండగా జేఎన్‌టీయూ వంతెనపై వీధిదీపాలు వెలగడం లేదు. అంధకారంగా మారిన రహదారిపై వాహనాల లైట్లే దారి చూపుతున్నాయి. లక్షలు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన దీపాలు పనిచేయకపోయినా అధికారులు పట్టించుకోవడం లేదు.
28/36
సికింద్రాబాద్‌ కార్ఖానా వద్ద బస్‌షెల్టర్‌లో ప్రకటనల కోసం ఏర్పాటు చేసిన బాక్స్‌లో పట్టపగలే వెలుగుతున్న ఎల్‌ఈడీ దీపాలు. ప్రకటనల కోసం బస్‌షెల్టర్‌ను కాంట్రాక్టు తీసుకున్న సంస్థలు ప్రకటనదారులను ఆకర్షించేందుకు నగరంలో ఇలా పలుచోట్ల విద్యుత్తు వృథా చేస్తున్నా అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. సికింద్రాబాద్‌ కార్ఖానా వద్ద బస్‌షెల్టర్‌లో ప్రకటనల కోసం ఏర్పాటు చేసిన బాక్స్‌లో పట్టపగలే వెలుగుతున్న ఎల్‌ఈడీ దీపాలు. ప్రకటనల కోసం బస్‌షెల్టర్‌ను కాంట్రాక్టు తీసుకున్న సంస్థలు ప్రకటనదారులను ఆకర్షించేందుకు నగరంలో ఇలా పలుచోట్ల విద్యుత్తు వృథా చేస్తున్నా అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు.
29/36
రాయదుర్గం ప్రాంతంలో రోడ్డు విస్తరణలో భాగంగా తొలగించిన చెట్లను దుర్గం చెరువు తీగల వంతెన పరిసరాల్లో నాటారు. ఇటీవల వర్షాలకు అవి మళ్లీ చిగురించి పచ్చదనాన్ని సంతరించుకున్నాయి. రాయదుర్గం ప్రాంతంలో రోడ్డు విస్తరణలో భాగంగా తొలగించిన చెట్లను దుర్గం చెరువు తీగల వంతెన పరిసరాల్లో నాటారు. ఇటీవల వర్షాలకు అవి మళ్లీ చిగురించి పచ్చదనాన్ని సంతరించుకున్నాయి.
30/36
31/36
32/36
33/36
34/36
35/36
36/36

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని