News In Pics: చిత్రం చెప్పే సంగతులు-2(11-08-2022)

Updated : 11 Aug 2022 22:07 IST
1/29
ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో కూచిపూడి నృత్య ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు కళాకారులు ఇచ్చిన ప్రదర్శన చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో కూచిపూడి నృత్య ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు కళాకారులు ఇచ్చిన ప్రదర్శన చూపరులను విశేషంగా ఆకట్టుకుంది.
2/29
3/29
హైదరాబాద్‌లోని హైటెక్స్‌ పరిసరాల్లో గురువారం సాయంత్రం వర్షం కురిసిన అనంతరం ఆకాశంలో ఇంద్రధనుస్సు కనువిందు చేసింది. కాసేపటికి రెండో వరుసలో కూడా కొద్దిసేపు కనిపించింది. అప్పుడే కార్యాలయాల నుంచి వెళ్తున్న ఉద్యోగులు ఇంద్రధనుస్సును తిలకిస్తూ తమ ఫోన్లలో ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. హైదరాబాద్‌లోని హైటెక్స్‌ పరిసరాల్లో గురువారం సాయంత్రం వర్షం కురిసిన అనంతరం ఆకాశంలో ఇంద్రధనుస్సు కనువిందు చేసింది. కాసేపటికి రెండో వరుసలో కూడా కొద్దిసేపు కనిపించింది. అప్పుడే కార్యాలయాల నుంచి వెళ్తున్న ఉద్యోగులు ఇంద్రధనుస్సును తిలకిస్తూ తమ ఫోన్లలో ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు.
4/29
5/29
6/29
ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా తిరంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి భాజపా కార్యకర్తలతో కలిసి బుల్లెట్టు బండిపై సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు ర్యాలీగా వచ్చారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా తిరంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి భాజపా కార్యకర్తలతో కలిసి బుల్లెట్టు బండిపై సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు ర్యాలీగా వచ్చారు.
7/29
8/29
ఎగువ నుంచి వస్తున్న వరద ఉద్ధృతి కారణంగా నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు వద్ద మొత్తం 26 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి వస్తున్న వరద ఉద్ధృతి కారణంగా నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు వద్ద మొత్తం 26 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
9/29
10/29
11/29
మెహదీపట్నం రైతుబజార్ పరిసరాల్లోని పండ్ల వ్యాపారులంతా భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా తమ తోపుడు బండ్లపై జాతీయ జెండాలను కట్టుకొని దేశభక్తిని చాటుతున్నారు. ప్రధాన రహదారి మార్గంలో వెళ్లే వారంతా దీన్ని ఆసక్తిగా గమనిస్తున్నారు. మెహదీపట్నం రైతుబజార్ పరిసరాల్లోని పండ్ల వ్యాపారులంతా భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా తమ తోపుడు బండ్లపై జాతీయ జెండాలను కట్టుకొని దేశభక్తిని చాటుతున్నారు. ప్రధాన రహదారి మార్గంలో వెళ్లే వారంతా దీన్ని ఆసక్తిగా గమనిస్తున్నారు.
12/29
13/29
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో హైలైఫ్‌ ఎగ్జిబిషన్‌ కర్టెన్‌రైజర్‌ ఈవెంట్‌ నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు మోడల్స్‌ పాల్గొని ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో హైలైఫ్‌ ఎగ్జిబిషన్‌ కర్టెన్‌రైజర్‌ ఈవెంట్‌ నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు మోడల్స్‌ పాల్గొని ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.
14/29
15/29
రక్షాబంధన్ పర్వదినం సందర్భంగా మంత్రులు తానేటి వనిత, విడదల రజనీ, మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ, విజయవాడ మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి తదితరులు సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి రాఖీ కట్టారు. మరోవైపు ఈశ్వరీయ బ్రహ్మకూమారి ప్రతినిధి రాజయోగిని బ్రహ్మకుమారి శాంత దీదీజీ సెప్టెంబర్‌లో మౌంట్‌ అబూలో జరిగే గ్లోబల్‌ సమ్మిట్‌కు సీఎంను ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయనకు రాఖీ కట్టి పండగ శుభాకాంక్షలు తెలిపారు.. రక్షాబంధన్ పర్వదినం సందర్భంగా మంత్రులు తానేటి వనిత, విడదల రజనీ, మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ, విజయవాడ మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి తదితరులు సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి రాఖీ కట్టారు. మరోవైపు ఈశ్వరీయ బ్రహ్మకూమారి ప్రతినిధి రాజయోగిని బ్రహ్మకుమారి శాంత దీదీజీ సెప్టెంబర్‌లో మౌంట్‌ అబూలో జరిగే గ్లోబల్‌ సమ్మిట్‌కు సీఎంను ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయనకు రాఖీ కట్టి పండగ శుభాకాంక్షలు తెలిపారు..
16/29
. .
17/29
18/29
వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా కొడంగల్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె అక్కడి వ్యవసాయ కూలీలతో కలిసి వరి నాట్లు వేసి కార్యకర్తల్లో జోష్‌ పెంచారు. వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా కొడంగల్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె అక్కడి వ్యవసాయ కూలీలతో కలిసి వరి నాట్లు వేసి కార్యకర్తల్లో జోష్‌ పెంచారు.
19/29
ఆజాదీకా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా పాఠశాల విద్యార్థులు కర్నూలులోని కృష్ణానగర్‌ నుంచి కొండారెడ్డి బురుజు వరకు 500మీటర్ల భారీ జాతీయ జెండాతో ప్రదర్శన నిర్వహించారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా పాఠశాల విద్యార్థులు కర్నూలులోని కృష్ణానగర్‌ నుంచి కొండారెడ్డి బురుజు వరకు 500మీటర్ల భారీ జాతీయ జెండాతో ప్రదర్శన నిర్వహించారు.
20/29
21/29
ఆజాదీకా అమృత్ మహోత్సవాల్లో భాగంగా గురువారం కరీంనగర్‌లో విద్యార్థులు జాతీయ జెండాలతో పెద్దఎత్తున ర్యాలీ తీశారు. ఆజాదీకా అమృత్ మహోత్సవాల్లో భాగంగా గురువారం కరీంనగర్‌లో విద్యార్థులు జాతీయ జెండాలతో పెద్దఎత్తున ర్యాలీ తీశారు.
22/29
23/29
రక్షాబంధన్‌ పర్వదినం పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోదీకి పలువురు చిన్నారులు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. రక్షాబంధన్‌ పర్వదినం పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోదీకి పలువురు చిన్నారులు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.
24/29
25/29
ఎగువన కృష్ణా పరివాహక ప్రాంతాల నుంచి వరద ఉద్ధృతి పెరగడంతో శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్న దృశ్యాలను తిలకించేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు. ఎగువన కృష్ణా పరివాహక ప్రాంతాల నుంచి వరద ఉద్ధృతి పెరగడంతో శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్న దృశ్యాలను తిలకించేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు.
26/29
27/29
సంస్కృతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని తారామతి బారాదారిలో ‘రాఖీ విత్ సోల్జర్స్’ కార్యక్రమం నిర్వహించారు. 150 మంది జవాన్లకు 60 మంది కళాశాల విద్యార్థినులు రాఖీలు కట్టి.. మిఠాయిలు తినిపించారు. సంస్కృతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని తారామతి బారాదారిలో ‘రాఖీ విత్ సోల్జర్స్’ కార్యక్రమం నిర్వహించారు. 150 మంది జవాన్లకు 60 మంది కళాశాల విద్యార్థినులు రాఖీలు కట్టి.. మిఠాయిలు తినిపించారు.
28/29
హైదరాబాద్‌లోని ముషీరాబాద్ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ అనాథ చిన్నారుల మధ్య రాఖీ పౌర్ణమి వేడుకలు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు, మహిళలు ఆయనకు రాఖీ కట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. అంతకుముందు పాఠశాల ఆవరణలో గవర్నర్‌ మొక్కలు నాటారు. హైదరాబాద్‌లోని ముషీరాబాద్ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ అనాథ చిన్నారుల మధ్య రాఖీ పౌర్ణమి వేడుకలు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు, మహిళలు ఆయనకు రాఖీ కట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. అంతకుముందు పాఠశాల ఆవరణలో గవర్నర్‌ మొక్కలు నాటారు.
29/29

మరిన్ని