News In Pics: చిత్రం చెప్పే సంగతులు-2(12-08-2022)

Updated : 12 Aug 2022 20:13 IST
1/27
తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్ర‌వారం రాత్రి శ్రావ‌ణ పౌర్ణమి గరుడసేవ వైభ‌వంగా జరిగింది. సర్వాలంకార భూషితుడైన మలయప్ప స్వామివారు ధగధగ మెరిసిపోతున్న గరుడునిపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్ర‌వారం రాత్రి శ్రావ‌ణ పౌర్ణమి గరుడసేవ వైభ‌వంగా జరిగింది. సర్వాలంకార భూషితుడైన మలయప్ప స్వామివారు ధగధగ మెరిసిపోతున్న గరుడునిపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.
2/27
3/27
హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ బేగంపేటలోని దేవ్‌నార్‌ అంధుల పాఠశాలలోని విద్యార్థులతో కలిసి రక్షాబంధన్‌ వేడుకలు చేసుకున్నారు. హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ బేగంపేటలోని దేవ్‌నార్‌ అంధుల పాఠశాలలోని విద్యార్థులతో కలిసి రక్షాబంధన్‌ వేడుకలు చేసుకున్నారు.
4/27
ఆజాదీకా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా రాజమహేంద్రవరం నగరంలో 5.2కిలోమీటర్ల భారీ జాతీయ జెండాను ప్రదర్శించారు. కార్యక్రమంలో విద్యార్థులు, నాయకులు, ఉద్యోగులు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా రాజమహేంద్రవరం నగరంలో 5.2కిలోమీటర్ల భారీ జాతీయ జెండాను ప్రదర్శించారు. కార్యక్రమంలో విద్యార్థులు, నాయకులు, ఉద్యోగులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
5/27
6/27
సీఎం కేసిఆర్ మనుమడు, మనుమరాలు రక్షా బంధన్ వేడుకల్లో పాల్గొన్నారు. తన అన్న హిమాన్షుకు చెల్లె అలేఖ్య రాఖీ కట్టింది. ఈ సందర్భంగా తమ మనుమడు, మనుమరాలును నిండు నూరేళ్లు వర్ధిల్లాలని సీఎం కేసిఆర్, శోభమ్మ దంపతులు నిండు మనసుతో దీవించారు. సీఎం కేసిఆర్ మనుమడు, మనుమరాలు రక్షా బంధన్ వేడుకల్లో పాల్గొన్నారు. తన అన్న హిమాన్షుకు చెల్లె అలేఖ్య రాఖీ కట్టింది. ఈ సందర్భంగా తమ మనుమడు, మనుమరాలును నిండు నూరేళ్లు వర్ధిల్లాలని సీఎం కేసిఆర్, శోభమ్మ దంపతులు నిండు మనసుతో దీవించారు.
7/27
బ్రసెల్స్‌లో శుక్రవారం ఫ్లవర్‌ కార్పెట్‌ను ఏర్పాటు చేశారు. 1971 నుంచి ఏటా ఇక్కడ ఫ్లవర్‌ కార్పెట్‌ ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది. 120 మందికి పైగా వాలంటీర్లు సుమారు 4గంటలపాటు శ్రమించి 4లక్షలకుపైగా పూలతో ఈ కార్పెట్‌ను తీర్చిదిద్దారు. బ్రసెల్స్‌లో శుక్రవారం ఫ్లవర్‌ కార్పెట్‌ను ఏర్పాటు చేశారు. 1971 నుంచి ఏటా ఇక్కడ ఫ్లవర్‌ కార్పెట్‌ ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది. 120 మందికి పైగా వాలంటీర్లు సుమారు 4గంటలపాటు శ్రమించి 4లక్షలకుపైగా పూలతో ఈ కార్పెట్‌ను తీర్చిదిద్దారు.
8/27
శ్రావణ శుక్రవారం, రాఖీ పౌర్ణమి సందర్భంగా విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయాన్ని పూలతో అందంగా అలంకరించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. శ్రావణ శుక్రవారం, రాఖీ పౌర్ణమి సందర్భంగా విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయాన్ని పూలతో అందంగా అలంకరించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు.
9/27
ప్రగతిభవన్‌లో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. సీఎం కేసీఆర్‌కు వారి అక్కలు లలితమ్మ, లక్ష్మమ్మ, జయమ్మ, చెల్లెలు వినోదమ్మ రాఖీలు కట్టి రక్షాబంధన్‌ వేడుకలు జరుపుకొన్నారు. రాఖీ పండుగ సందర్భంగా తనకు రాఖీలు కట్టిన అక్కలకు సీఎం కేసీఆర్‌ పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రగతిభవన్‌లో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. సీఎం కేసీఆర్‌కు వారి అక్కలు లలితమ్మ, లక్ష్మమ్మ, జయమ్మ, చెల్లెలు వినోదమ్మ రాఖీలు కట్టి రక్షాబంధన్‌ వేడుకలు జరుపుకొన్నారు. రాఖీ పండుగ సందర్భంగా తనకు రాఖీలు కట్టిన అక్కలకు సీఎం కేసీఆర్‌ పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు.
10/27
ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది 100 మీటర్ల పొడవైన జాతీయ జెండాను ప్రదర్శించారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది 100 మీటర్ల పొడవైన జాతీయ జెండాను ప్రదర్శించారు.
11/27
12/27
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సతీమణి కావ్యరెడ్డి బర్కత్‌పురా చౌరస్తా వద్ద విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌కు రాఖీ కట్టి మిఠాయి తినిపించారు. తోబుట్టువులకు దూరంగా ఉండి విధుల్లో నిమగ్నమైన తనకు రాఖీ కట్టడంతో ఆయన భావోద్వేగానికి గురయ్యారు. అంతకు ముందు కావ్యరెడ్డి భాజపా నాయకులతో కలిసి నల్లకుంటలో ఓ దివ్యాంగుడికి రాఖీ కట్టారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సతీమణి కావ్యరెడ్డి బర్కత్‌పురా చౌరస్తా వద్ద విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌కు రాఖీ కట్టి మిఠాయి తినిపించారు. తోబుట్టువులకు దూరంగా ఉండి విధుల్లో నిమగ్నమైన తనకు రాఖీ కట్టడంతో ఆయన భావోద్వేగానికి గురయ్యారు. అంతకు ముందు కావ్యరెడ్డి భాజపా నాయకులతో కలిసి నల్లకుంటలో ఓ దివ్యాంగుడికి రాఖీ కట్టారు.
13/27
14/27
15/27
ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా హైదరాబాద్‌లోని తిలక్‌నగర్‌లో దివ్యాంగులు జాతీయ జెండాలతో ర్యాలీ చేసి దేశభక్తిని చాటారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా హైదరాబాద్‌లోని తిలక్‌నగర్‌లో దివ్యాంగులు జాతీయ జెండాలతో ర్యాలీ చేసి దేశభక్తిని చాటారు.
16/27
తిరుపతి రూరల్‌ మండల పరిధి పేరూరులోని వకుళామాత ఆలయ ప్రాంగణంలో మూడు రోజులపాటు లక్ష్మీనారాయణ యజ్ఞం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా మొదటి రోజు శుక్రవారం నిర్వహించిన వరలక్ష్మీ పూజలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప పాల్గొన్నారు. తిరుపతి రూరల్‌ మండల పరిధి పేరూరులోని వకుళామాత ఆలయ ప్రాంగణంలో మూడు రోజులపాటు లక్ష్మీనారాయణ యజ్ఞం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా మొదటి రోజు శుక్రవారం నిర్వహించిన వరలక్ష్మీ పూజలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప పాల్గొన్నారు.
17/27
18/27
ఎగువ నుంచి కృష్ణా నదిలోకి వరదనీరు వస్తుండటంతో ప్రకాశం బ్యారేజీ వద్ద నీటిమట్టం భారీగా పెరిగింది. దీంతో బ్యారేజీ వద్ద అధికారులు పూర్తిస్థాయి అప్రమత్తత ప్రకటించారు. స్నానఘట్టాల వద్దకు సందర్శకులను అనుమతించడం లేదు. నదికి ఇరువైపులా పోలీసు పికెటింగ్‌ ఏర్పాట్లు చేశారు. బ్యారేజీలోని మొత్తం 70 గేట్లను ఎత్తి 4.44లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి కృష్ణా నదిలోకి వరదనీరు వస్తుండటంతో ప్రకాశం బ్యారేజీ వద్ద నీటిమట్టం భారీగా పెరిగింది. దీంతో బ్యారేజీ వద్ద అధికారులు పూర్తిస్థాయి అప్రమత్తత ప్రకటించారు. స్నానఘట్టాల వద్దకు సందర్శకులను అనుమతించడం లేదు. నదికి ఇరువైపులా పోలీసు పికెటింగ్‌ ఏర్పాట్లు చేశారు. బ్యారేజీలోని మొత్తం 70 గేట్లను ఎత్తి 4.44లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
19/27
20/27
హైదరాబాద్‌లోని టోలిచౌకి ఇలాహీ మసీదు వద్ద  శుక్రవారం ప్రార్థనల అనంతరం ముస్లింలు, స్థానికులు జాతీయ జెండాలతో ప్రదర్శన నిర్వహించారు. హైదరాబాద్‌లోని టోలిచౌకి ఇలాహీ మసీదు వద్ద శుక్రవారం ప్రార్థనల అనంతరం ముస్లింలు, స్థానికులు జాతీయ జెండాలతో ప్రదర్శన నిర్వహించారు.
21/27
22/27
ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలో భారీ జాతీయ జెండాతో ప్రదర్శన ఇచ్చారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలో భారీ జాతీయ జెండాతో ప్రదర్శన ఇచ్చారు.
23/27
24/27
రక్షాబంధన్‌ పర్వదినం పురస్కరించుకొని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన సోదరుడు, మంత్రి కేటీఆర్‌కు రాఖీ కట్టి పండగ శుభాకాంక్షలు తెలిపారు. రక్షాబంధన్‌ పర్వదినం పురస్కరించుకొని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన సోదరుడు, మంత్రి కేటీఆర్‌కు రాఖీ కట్టి పండగ శుభాకాంక్షలు తెలిపారు.
25/27
26/27
ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తన ట్విటర్‌ ఖాతాలో ఏనుగుల ఫొటోలను పంచుకున్నారు. ఆసియాలోని 60శాతం ఏనుగులు భారతదేశంలోనే ఉండటం గొప్ప విషయమని తెలుపుతూ పోస్టు పెట్టారు. గత 8ఏళ్లుగా పాటిస్తున్న సంరక్షణ విధానాలతో ఏనుగుల సంఖ్య పెరిగిందని ప్రధాని తెలిపారు. ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తన ట్విటర్‌ ఖాతాలో ఏనుగుల ఫొటోలను పంచుకున్నారు. ఆసియాలోని 60శాతం ఏనుగులు భారతదేశంలోనే ఉండటం గొప్ప విషయమని తెలుపుతూ పోస్టు పెట్టారు. గత 8ఏళ్లుగా పాటిస్తున్న సంరక్షణ విధానాలతో ఏనుగుల సంఖ్య పెరిగిందని ప్రధాని తెలిపారు.
27/27

మరిన్ని