News In Pics: చిత్రం చెప్పే సంగతులు (13-08-2022)

Updated : 13 Aug 2022 13:20 IST
1/21
ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా మన్యంలోని ప్రతి పల్లెలో మువ్వన్నెల జెండా రెపరెపలాడుతోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం లంకపాకలులో వాలంటీరు లక్ష్మి ఆధ్వర్యంలో శుక్రవారం రైతులు, పిల్లలు జెండాలతో దేశభక్తి చాటుకున్నారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా మన్యంలోని ప్రతి పల్లెలో మువ్వన్నెల జెండా రెపరెపలాడుతోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం లంకపాకలులో వాలంటీరు లక్ష్మి ఆధ్వర్యంలో శుక్రవారం రైతులు, పిల్లలు జెండాలతో దేశభక్తి చాటుకున్నారు.
2/21
కృష్ణమ్మ పరవళ్లు అన్నదాతల్లో కలవరాన్ని నింపింది. ముందస్తుగా వరద సమాచారం అందుకున్న రైతులు శుక్రవారం అప్రమత్తమయ్యారు. పంటనష్టాన్ని తగ్గించుకునే దిశగా చర్యలు చేపట్టారు. ప్రాణాలకు తెగించి చేతికందిన పంటను కాపాడునేందుకు వారు ప్రయత్నించారు. వరద నీటిలోనే దొండ, కాకర, సొర, వంగ తదితర కాయకూరలను కోసి, మార్కెట్‌కు తరలిస్తున్నారు. ముంపులోనే మొక్కజొన్న (కండెలు) కోతలు చేపట్టారు. కట్టకింద పల్లపు ప్రాంతాల్లో సాగుచేసిన కంద, అరటి, పసుపు, నిమ్మ తదితర పంటతోటల్లోకి వరదనీరు చేరుతోంది.. కృష్ణమ్మ పరవళ్లు అన్నదాతల్లో కలవరాన్ని నింపింది. ముందస్తుగా వరద సమాచారం అందుకున్న రైతులు శుక్రవారం అప్రమత్తమయ్యారు. పంటనష్టాన్ని తగ్గించుకునే దిశగా చర్యలు చేపట్టారు. ప్రాణాలకు తెగించి చేతికందిన పంటను కాపాడునేందుకు వారు ప్రయత్నించారు. వరద నీటిలోనే దొండ, కాకర, సొర, వంగ తదితర కాయకూరలను కోసి, మార్కెట్‌కు తరలిస్తున్నారు. ముంపులోనే మొక్కజొన్న (కండెలు) కోతలు చేపట్టారు. కట్టకింద పల్లపు ప్రాంతాల్లో సాగుచేసిన కంద, అరటి, పసుపు, నిమ్మ తదితర పంటతోటల్లోకి వరదనీరు చేరుతోంది..
3/21
దాదాపు ఎనిమిదేళ్ల క్రితం విశాఖపై విరుచుకుపడిన హుద్‌హుద్‌ తుపాను తీవ్రతను ఇప్పటికీ ప్రజలు మరచిపోలేదు. నాడు కుప్పకూలిన మహా వృక్షాలెన్నో. అలాంటి వాటిలో ఒకటి విశాఖపట్నం కైలాసపురం పోర్టు స్కూలు ప్రాంతంలోని ఈ చెట్టు. పడిపోయిన తరువాత అడ్డుగా ఉన్న కొమ్మలను కొట్టేసి దీనిని అలా వదిలేశారు. భూమిలోకి  వేర్లు ఉండటంతో పడిన చెట్టు ఆధారంగా అప్పటికే ఉన్న కొమ్మలు పెద్దవై వృక్షాల్లా మారాయి. మరిన్ని కొత్త చిగుళ్లు కొమ్మలై ఎదిగి ఔరా అనిపిస్తున్నాయి. దాదాపు ఎనిమిదేళ్ల క్రితం విశాఖపై విరుచుకుపడిన హుద్‌హుద్‌ తుపాను తీవ్రతను ఇప్పటికీ ప్రజలు మరచిపోలేదు. నాడు కుప్పకూలిన మహా వృక్షాలెన్నో. అలాంటి వాటిలో ఒకటి విశాఖపట్నం కైలాసపురం పోర్టు స్కూలు ప్రాంతంలోని ఈ చెట్టు. పడిపోయిన తరువాత అడ్డుగా ఉన్న కొమ్మలను కొట్టేసి దీనిని అలా వదిలేశారు. భూమిలోకి వేర్లు ఉండటంతో పడిన చెట్టు ఆధారంగా అప్పటికే ఉన్న కొమ్మలు పెద్దవై వృక్షాల్లా మారాయి. మరిన్ని కొత్త చిగుళ్లు కొమ్మలై ఎదిగి ఔరా అనిపిస్తున్నాయి.
4/21
5/21
నల్గొండ జిల్లా చింతపల్లిలో సాయిబాబా ఆలయంలో శుక్రవారం మధ్యాహ్నం హారతి తరువాత జెండా ఎగురవేసి జనగణమన ఆలపిస్తున్న దృశ్యం. గుడి నిర్మాణం జరిగినప్పటి నుంచి నిత్యం మధ్యాహ్నం హారతి తరువాత ఇదే విధంగా దేశభక్తిని చాటుతున్నారు. ప్రతి గురువారం ఉదయం హరతి తరువాత జనగణమన ఆలపిస్తున్నట్లు అక్కడి సిబ్బంది తెలిపారు. దేశం వజ్రోత్సవాలు జరుపుకొంటున్న సమయంలో గుడిలో దేశభక్తి చాటుతుండటం విశేషమే.. నల్గొండ జిల్లా చింతపల్లిలో సాయిబాబా ఆలయంలో శుక్రవారం మధ్యాహ్నం హారతి తరువాత జెండా ఎగురవేసి జనగణమన ఆలపిస్తున్న దృశ్యం. గుడి నిర్మాణం జరిగినప్పటి నుంచి నిత్యం మధ్యాహ్నం హారతి తరువాత ఇదే విధంగా దేశభక్తిని చాటుతున్నారు. ప్రతి గురువారం ఉదయం హరతి తరువాత జనగణమన ఆలపిస్తున్నట్లు అక్కడి సిబ్బంది తెలిపారు. దేశం వజ్రోత్సవాలు జరుపుకొంటున్న సమయంలో గుడిలో దేశభక్తి చాటుతుండటం విశేషమే..
6/21
శుక్రవారం రక్షాబంధన్‌ సందర్భంగా జిల్లా కేంద్రంలోని జడ్పీహెచ్‌ఎస్‌ బాలుర పాఠశాలలో గ్రీన్‌ కోర్‌ కమిటీ ఆధ్వర్యంలో వృక్ష రక్షాబంధన్‌ జరుపుకొన్నారు. పర్యావరణ హిత పదార్థాలతో తయారు చేసిన రాఖీలను హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు, వృక్షాలకు కట్టి ఆలింగనం చేసుకున్నారు. శుక్రవారం రక్షాబంధన్‌ సందర్భంగా జిల్లా కేంద్రంలోని జడ్పీహెచ్‌ఎస్‌ బాలుర పాఠశాలలో గ్రీన్‌ కోర్‌ కమిటీ ఆధ్వర్యంలో వృక్ష రక్షాబంధన్‌ జరుపుకొన్నారు. పర్యావరణ హిత పదార్థాలతో తయారు చేసిన రాఖీలను హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు, వృక్షాలకు కట్టి ఆలింగనం చేసుకున్నారు.
7/21
ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్‌ ఏరియా జీఎం కార్యాలయంలో అధికారులు, నాయకులు, సిబ్బంది జాతీయ జెండాలను ప్రదర్శించి తమ దేశభక్తిని చాటుకున్నారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్‌ ఏరియా జీఎం కార్యాలయంలో అధికారులు, నాయకులు, సిబ్బంది జాతీయ జెండాలను ప్రదర్శించి తమ దేశభక్తిని చాటుకున్నారు.
8/21
భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ సంబరాలను ఆదిలాబాద్‌ జిల్లాలో ఆదివాసీలు అంబరంగా జరుపుకొన్నారు. చించుఘాట్‌ గ్రామంలో శుక్రవారం ఎద్దుల బండిపై నిర్వహించిన ర్యాలీలో చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ జాతీయ జెండాలను చేత బూని పాల్గొన్నారు. భారత్‌ మాతాకీ జై అంటూ నినాదాలతో హోరెత్తించారు. అనంతరం రైతులతో కలిసి ఓ పంట చేనులో జెండా ఆవిష్కరించారు. భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ సంబరాలను ఆదిలాబాద్‌ జిల్లాలో ఆదివాసీలు అంబరంగా జరుపుకొన్నారు. చించుఘాట్‌ గ్రామంలో శుక్రవారం ఎద్దుల బండిపై నిర్వహించిన ర్యాలీలో చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ జాతీయ జెండాలను చేత బూని పాల్గొన్నారు. భారత్‌ మాతాకీ జై అంటూ నినాదాలతో హోరెత్తించారు. అనంతరం రైతులతో కలిసి ఓ పంట చేనులో జెండా ఆవిష్కరించారు.
9/21
నిర్మల్ జిల్లా పాలనాధికారి కార్యాలయంలో పాలనాధికారి ముషారఫ్‌ అలీ ఫారుఖీ శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. పలువురు మహిళా ఉద్యోగులు పాలనాధికారికి, అదనపు పాలనాధికారులు రాంబాబు, హేమంత్‌ బోర్కడేకు రాఖీలు కట్టారు. త్రివర్ణ పతాకాన్ని తలపించేలా మూడు రంగుల్లో ఉన్న రాఖీలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. నిర్మల్ జిల్లా పాలనాధికారి కార్యాలయంలో పాలనాధికారి ముషారఫ్‌ అలీ ఫారుఖీ శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. పలువురు మహిళా ఉద్యోగులు పాలనాధికారికి, అదనపు పాలనాధికారులు రాంబాబు, హేమంత్‌ బోర్కడేకు రాఖీలు కట్టారు. త్రివర్ణ పతాకాన్ని తలపించేలా మూడు రంగుల్లో ఉన్న రాఖీలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి.
10/21
11/21
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం చిన్నమెట్‌పల్లి గ్రామంలో యువరైతు సందిరెడ్డి తిరుపతిరెడ్డి తాను సాగు చేసిన 4 ఎకరాల మక్కచేనులో శుక్రవారం ఉదయం మూడు రంగుల బెలూన్ల తోరణం కట్టి, జాతీయ పతకం ఆవిష్కరించి వందనం చేశారు. ఈ సందర్భంగా సర్పంచి, ఎంపీటీసీ సభ్యుడు, రైతులు ఆయనను అభినందించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం చిన్నమెట్‌పల్లి గ్రామంలో యువరైతు సందిరెడ్డి తిరుపతిరెడ్డి తాను సాగు చేసిన 4 ఎకరాల మక్కచేనులో శుక్రవారం ఉదయం మూడు రంగుల బెలూన్ల తోరణం కట్టి, జాతీయ పతకం ఆవిష్కరించి వందనం చేశారు. ఈ సందర్భంగా సర్పంచి, ఎంపీటీసీ సభ్యుడు, రైతులు ఆయనను అభినందించారు.
12/21
ఖమ్మం నగరానికి చెందిన బోలగాని త్రివేది.. రాఖీ కట్టడానికి వచ్చిన తన సోదరికి రూ.56 వేల విలువైన నాణేలతో తులాభారం వేసి ప్రేమాభిమానాలను చాటుకున్నాడు. హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేసే బసవ నారాయణ, అరుణ దంపతులకు ఇద్దరు సంతానం. కుమార్తె రణశ్రీ పుట్టిన 12 ఏళ్ల తర్వాత త్రివేది జన్మించాడు. దీంతో తమ్ముడిని ప్రేమగా పెంచిందా అక్క. ఈ క్రమంలో తమ్ముడు తన అక్కపై ప్రేమను వినూత్నంగా వ్యక్తం చేయాలనుకున్నాడు. బంధుమిత్రులను పిలిచి తులాభారం ఏర్పాటు చేశాడు. ఖమ్మం నగరానికి చెందిన బోలగాని త్రివేది.. రాఖీ కట్టడానికి వచ్చిన తన సోదరికి రూ.56 వేల విలువైన నాణేలతో తులాభారం వేసి ప్రేమాభిమానాలను చాటుకున్నాడు. హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేసే బసవ నారాయణ, అరుణ దంపతులకు ఇద్దరు సంతానం. కుమార్తె రణశ్రీ పుట్టిన 12 ఏళ్ల తర్వాత త్రివేది జన్మించాడు. దీంతో తమ్ముడిని ప్రేమగా పెంచిందా అక్క. ఈ క్రమంలో తమ్ముడు తన అక్కపై ప్రేమను వినూత్నంగా వ్యక్తం చేయాలనుకున్నాడు. బంధుమిత్రులను పిలిచి తులాభారం ఏర్పాటు చేశాడు.
13/21
అడవులను కాపాడుకునేందుకు జగిత్యాల జిల్లాలో వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. సారంగాపూర్‌లో వృక్షాబంధన్‌ పేరుతో చెట్లకు రాఖీలు కట్టే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్‌ రవి, ఎస్పీ సింధుశర్మ, ఎమ్మెల్యే సంజయ్‌, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు శుక్రవారం ప్రారంభించారు. అడవులను కాపాడుకునేందుకు జగిత్యాల జిల్లాలో వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. సారంగాపూర్‌లో వృక్షాబంధన్‌ పేరుతో చెట్లకు రాఖీలు కట్టే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్‌ రవి, ఎస్పీ సింధుశర్మ, ఎమ్మెల్యే సంజయ్‌, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు శుక్రవారం ప్రారంభించారు.
14/21
ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా రాజస్థాన్‌ విద్యార్థులు చరిత్ర సృష్టించారు. శుక్రవారం రాష్ట్ర రాజధాని జైపుర్‌తోపాటు వివిధ ప్రాంతాల్లో కోటి మందికి పైగా    విద్యార్థులు ఒకే సమయంలో దేశభక్తి గీతాలను  ఆలపించి ‘వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లోకి ఎక్కారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా రాజస్థాన్‌ విద్యార్థులు చరిత్ర సృష్టించారు. శుక్రవారం రాష్ట్ర రాజధాని జైపుర్‌తోపాటు వివిధ ప్రాంతాల్లో కోటి మందికి పైగా విద్యార్థులు ఒకే సమయంలో దేశభక్తి గీతాలను ఆలపించి ‘వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లోకి ఎక్కారు.
15/21
శ్రావణ శుక్రవారం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం తాళ్లపూడిలోని నవదుర్గాదేవి ఆలయంలో అమ్మవారిని లక్ష గాజులతో విశేషంగా అలంకరించారు.
- న్యూస్‌టుడే, తాళ్లపూడి శ్రావణ శుక్రవారం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం తాళ్లపూడిలోని నవదుర్గాదేవి ఆలయంలో అమ్మవారిని లక్ష గాజులతో విశేషంగా అలంకరించారు. - న్యూస్‌టుడే, తాళ్లపూడి
16/21
భారీ వర్షాలకు మూసారాంబాగ్‌ వద్ద  మూసీ వంతెనపై రక్షణ ఫెన్సింగ్‌ కొట్టుకుపోయింది. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. రక్షణ లేకపోవడం, మూసీలో ప్రవాహ వేగం అధికంగా ఉండటంతో వాహనదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. భారీ వర్షాలకు మూసారాంబాగ్‌ వద్ద మూసీ వంతెనపై రక్షణ ఫెన్సింగ్‌ కొట్టుకుపోయింది. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. రక్షణ లేకపోవడం, మూసీలో ప్రవాహ వేగం అధికంగా ఉండటంతో వాహనదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
17/21
ఉప్పల్‌ చౌరస్తా దాటి బోడుప్పల్‌ మీదుగా ఘట్‌కేసర్‌ వైపు ప్రయాణమంటే వాహన చోదకులకు వణుకు పుడుతోంది. నత్తనడకను మరపిస్తున్న పైవంతెన పనులకు తోడు వర్షాలతో ఈ మార్గంలో ప్రయాణం నరకాన్ని తలపిస్తోంది. ఉప్పల్‌ చౌరస్తా దాటి బోడుప్పల్‌ మీదుగా ఘట్‌కేసర్‌ వైపు ప్రయాణమంటే వాహన చోదకులకు వణుకు పుడుతోంది. నత్తనడకను మరపిస్తున్న పైవంతెన పనులకు తోడు వర్షాలతో ఈ మార్గంలో ప్రయాణం నరకాన్ని తలపిస్తోంది.
18/21
విశాలమైన మర్రి చెట్టు.. ఆ నీడలో ఆహ్లాదకరంగా బెంచీలు.. చూసేందుకు ఏ ఉద్యానమో అనుకునేరు? బడంగ్‌పేట మున్సిపాలిటీ పరిధిలోని నాదర్‌గుల్‌ గ్రామ శ్మశాన వాటిక ఇది. అంత్యక్రియల అనంతరం బంధువులు సేద తీరేందుకు ఇలా వసతులు కల్పించారు. విశాలమైన మర్రి చెట్టు.. ఆ నీడలో ఆహ్లాదకరంగా బెంచీలు.. చూసేందుకు ఏ ఉద్యానమో అనుకునేరు? బడంగ్‌పేట మున్సిపాలిటీ పరిధిలోని నాదర్‌గుల్‌ గ్రామ శ్మశాన వాటిక ఇది. అంత్యక్రియల అనంతరం బంధువులు సేద తీరేందుకు ఇలా వసతులు కల్పించారు.
19/21
సోదర సోదరీమణుల ఆప్యాయతానుబంధాలకు ప్రతీకగా నిలిచే రాఖీ పౌర్ణమి వేడుకలు నగరంలో శుక్రవారం వైభవంగా జరిగాయి. ప్రతి ఇంట్లో సందడి నెలకొంది.  ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్‌ కుమారుడు హిమాన్షుకు రాఖీ కడుతున్న సోదరి అలేఖ్య. చిత్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్‌ సతీమణి శైలిమ సోదర సోదరీమణుల ఆప్యాయతానుబంధాలకు ప్రతీకగా నిలిచే రాఖీ పౌర్ణమి వేడుకలు నగరంలో శుక్రవారం వైభవంగా జరిగాయి. ప్రతి ఇంట్లో సందడి నెలకొంది. ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్‌ కుమారుడు హిమాన్షుకు రాఖీ కడుతున్న సోదరి అలేఖ్య. చిత్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్‌ సతీమణి శైలిమ
20/21
బెల్జియం రాజధాని బ్రసెల్స్‌లో శుక్రవారం ఫ్లవర్‌ కార్పెట్‌ను ఏర్పాటు చేశారు. 120 మందికి పైగా వాలంటీర్లు 4గంటలపాటు శ్రమించి 4లక్షలకుపైగా పూలతో ఈ కార్పెట్‌ను తీర్చిదిద్దారు. 1971 నుంచి ఏటా ఇక్కడ ఫ్లవర్‌ కార్పెట్‌ ఏర్పాటు చేయడం ఆనవాయితీ. బెల్జియం రాజధాని బ్రసెల్స్‌లో శుక్రవారం ఫ్లవర్‌ కార్పెట్‌ను ఏర్పాటు చేశారు. 120 మందికి పైగా వాలంటీర్లు 4గంటలపాటు శ్రమించి 4లక్షలకుపైగా పూలతో ఈ కార్పెట్‌ను తీర్చిదిద్దారు. 1971 నుంచి ఏటా ఇక్కడ ఫ్లవర్‌ కార్పెట్‌ ఏర్పాటు చేయడం ఆనవాయితీ.
21/21
 ‘వృక్ష సురక్షా దివస్‌’ సందర్భంగా శుక్రవారం పట్నాలో చెట్టుకు రాఖీ కడుతున్న బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ ‘వృక్ష సురక్షా దివస్‌’ సందర్భంగా శుక్రవారం పట్నాలో చెట్టుకు రాఖీ కడుతున్న బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు