News In Pics: చిత్రం చెప్పే సంగతులు-2(13-08-2022)

Updated : 13 Aug 2022 20:15 IST
1/30
ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన మెగా ఈవెంట్‌లో సైనికులు ద్విచక్రవాహనాలపై అదరగొట్టే విన్యాసాలు చేశారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన మెగా ఈవెంట్‌లో సైనికులు ద్విచక్రవాహనాలపై అదరగొట్టే విన్యాసాలు చేశారు.
2/30
3/30
4/30
5/30
నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు 26గేట్లను ఎత్తడంతో కృష్ణమ్మ పరవళ్లను తిలకించేందుకు సందర్శకులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. దీంతో సాగర్‌ పరిసరాల్లో సందడి నెలకొంది. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు 26గేట్లను ఎత్తడంతో కృష్ణమ్మ పరవళ్లను తిలకించేందుకు సందర్శకులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. దీంతో సాగర్‌ పరిసరాల్లో సందడి నెలకొంది.
6/30
7/30
8/30
9/30
భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో 750మీటర్ల జాతీయ జెండాతో తిరంగా ర్యాలీ నిర్వహించారు. భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో 750మీటర్ల జాతీయ జెండాతో తిరంగా ర్యాలీ నిర్వహించారు.
10/30
11/30
ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా విజయవాడలోని బందరు రోడ్డులో 20వేల మందితో స్ఫూర్తి ప్రదర్శన నిర్వహించారు. 3కిలోమీటర్ల జాతీయ జెండాతో ర్యాలీ తీశారు. కార్యక్రమంలో భాగంగా కళాకారులు ఇచ్చిన నృత్య ప్రదర్శన చూపరులను ఆకట్టుకుంది. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా విజయవాడలోని బందరు రోడ్డులో 20వేల మందితో స్ఫూర్తి ప్రదర్శన నిర్వహించారు. 3కిలోమీటర్ల జాతీయ జెండాతో ర్యాలీ తీశారు. కార్యక్రమంలో భాగంగా కళాకారులు ఇచ్చిన నృత్య ప్రదర్శన చూపరులను ఆకట్టుకుంది.
12/30
13/30
భారత క్రికెటర్‌ యజ్వేంద్ర చాహల్‌ తన ఫేవరేట్‌ పోజుతో దిగిన ఫొటోను ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. తనకు ఇష్టమైన బెంగళూరు చిన్నస్వామి స్టేడియం గ్రౌండ్‌లో తన ఫేవరేట్‌ పోజుతో ఫొటో తీసుకున్నట్లు తెలుపుతూ పోస్టు పెట్టారు. 2019 వన్డే వరల్డ్‌ కప్‌ సమయంలో చాహల్‌ మైదానంలో నేలపై సేదతీరుతున్నట్లు ఇచ్చిన స్టిల్‌ అప్పట్లో వైరల్‌గా మారింది. భారత క్రికెటర్‌ యజ్వేంద్ర చాహల్‌ తన ఫేవరేట్‌ పోజుతో దిగిన ఫొటోను ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. తనకు ఇష్టమైన బెంగళూరు చిన్నస్వామి స్టేడియం గ్రౌండ్‌లో తన ఫేవరేట్‌ పోజుతో ఫొటో తీసుకున్నట్లు తెలుపుతూ పోస్టు పెట్టారు. 2019 వన్డే వరల్డ్‌ కప్‌ సమయంలో చాహల్‌ మైదానంలో నేలపై సేదతీరుతున్నట్లు ఇచ్చిన స్టిల్‌ అప్పట్లో వైరల్‌గా మారింది.
14/30
ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా సైబరాబాద్‌ పోలీసుల ఆధ్వర్యంలో దుర్గం చెరువు నుంచి తిరంగా బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ఐకియా సర్కిల్‌, మెటల్‌ చార్మినార్‌, సైబర్ టవర్స్‌, రహేజా మైండ్‌ స్పేస్‌, టీహబ్‌, బయోడైవర్సిటీ మీదుగా గచ్చిబౌలి స్టేడియం వరకు 25కిలోమీటర్ల సాగింది. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా సైబరాబాద్‌ పోలీసుల ఆధ్వర్యంలో దుర్గం చెరువు నుంచి తిరంగా బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ఐకియా సర్కిల్‌, మెటల్‌ చార్మినార్‌, సైబర్ టవర్స్‌, రహేజా మైండ్‌ స్పేస్‌, టీహబ్‌, బయోడైవర్సిటీ మీదుగా గచ్చిబౌలి స్టేడియం వరకు 25కిలోమీటర్ల సాగింది.
15/30
16/30
హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ హర్‌ ఘర్‌ తిరంగాలో భాగంగా హైదరాబాద్‌ రామ్‌నగర్‌లోని తన ఇంటి వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు. హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ హర్‌ ఘర్‌ తిరంగాలో భాగంగా హైదరాబాద్‌ రామ్‌నగర్‌లోని తన ఇంటి వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు.
17/30
ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో నిర్వహించనున్న పరేడ్‌ కోసం గోల్కొండ కోట వద్ద పోలీసు సిబ్బంది రిహార్సల్స్‌ నిర్వహించారు. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో నిర్వహించనున్న పరేడ్‌ కోసం గోల్కొండ కోట వద్ద పోలీసు సిబ్బంది రిహార్సల్స్‌ నిర్వహించారు.
18/30
19/30
చండీగఢ్‌లోని క్రికెట్‌ స్టేడియంలో గవర్నర్‌ భన్వరీలాల్‌ పురోహిత్‌ ఆధ్వర్యంలో ప్రజలంతా జాతీయ జెండా ఆకారంలో నిల్చొని గిన్నిస్‌ రికార్డు నెలకొల్పారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మానవ హారం జెండాగా రికార్డు కైవసం చేసుంది. చండీగఢ్‌లోని క్రికెట్‌ స్టేడియంలో గవర్నర్‌ భన్వరీలాల్‌ పురోహిత్‌ ఆధ్వర్యంలో ప్రజలంతా జాతీయ జెండా ఆకారంలో నిల్చొని గిన్నిస్‌ రికార్డు నెలకొల్పారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మానవ హారం జెండాగా రికార్డు కైవసం చేసుంది.
20/30
21/30
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఓ రేసింగ్‌ కారును సినీ నటి నివేదా పేతురాజ్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు. ది గ్రేట్‌ ఫార్ములా కార్‌ రేసింగ్‌ ఫెస్టివల్‌లో హైదరాబాద్‌ భాగమవుతున్నందుకు ఆనందంగా ఉందని నివేదా పేతురాజ్‌ తెలిపారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ.. ఈ రేసు నవంబర్‌ 8న మొదలై డిసెంబర్‌ 11న ముగుస్తుందని తెలిపారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఓ రేసింగ్‌ కారును సినీ నటి నివేదా పేతురాజ్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు. ది గ్రేట్‌ ఫార్ములా కార్‌ రేసింగ్‌ ఫెస్టివల్‌లో హైదరాబాద్‌ భాగమవుతున్నందుకు ఆనందంగా ఉందని నివేదా పేతురాజ్‌ తెలిపారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ.. ఈ రేసు నవంబర్‌ 8న మొదలై డిసెంబర్‌ 11న ముగుస్తుందని తెలిపారు.
22/30
23/30
ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌ సందర్భంగా హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై మువ్వన్నెల జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఎంపీ కె.కేశవరావు, హైదరాబాద్‌ మేయర్‌ విజయలక్ష్మి, ఉపమేయర్‌ మోతె శ్రీలత, సీఎస్‌ సోమేశ్ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌ సందర్భంగా హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై మువ్వన్నెల జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఎంపీ కె.కేశవరావు, హైదరాబాద్‌ మేయర్‌ విజయలక్ష్మి, ఉపమేయర్‌ మోతె శ్రీలత, సీఎస్‌ సోమేశ్ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.
24/30
25/30
26/30
భారత స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఖమ్మం జడ్పీ సెంటర్‌ నుంచి 2కిలోమీటర్ల పొడవైన భారీ జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు.  సుమారు 10వేల మంది పాల్గొన్న ఈ కార్యక్రమానికి మంత్రి పువ్వాడ అజయ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భారత స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఖమ్మం జడ్పీ సెంటర్‌ నుంచి 2కిలోమీటర్ల పొడవైన భారీ జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. సుమారు 10వేల మంది పాల్గొన్న ఈ కార్యక్రమానికి మంత్రి పువ్వాడ అజయ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
27/30
28/30
జగిత్యాలకు చెందిన సూక్ష్మ కళాకారుడు దయాకర్‌ పక్షి ఈకపై భారతదేశ పటం, జాతీయజెండాలను తీర్చిదిద్ది ఆకట్టుకున్నారు.. జగిత్యాలకు చెందిన సూక్ష్మ కళాకారుడు దయాకర్‌ పక్షి ఈకపై భారతదేశ పటం, జాతీయజెండాలను తీర్చిదిద్ది ఆకట్టుకున్నారు..
29/30
భారత స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా హైదరాబాద్‌ నగరంలోని ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌లో తెదేపా అధినేత చంద్రబాబునాయుడు జాతీయ జెండాను ఆవిష్కరించారు. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు గడిచిన నేపథ్యంలో స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి. భారత స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా హైదరాబాద్‌ నగరంలోని ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌లో తెదేపా అధినేత చంద్రబాబునాయుడు జాతీయ జెండాను ఆవిష్కరించారు. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు గడిచిన నేపథ్యంలో స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి.
30/30

మరిన్ని