News In Pics: చిత్రం చెప్పే సంగతులు-1 (14-08-2022)

Published : 14 Aug 2022 11:38 IST
1/30
ఇంటిలో ఎప్పటికప్పుడు సమయాన్ని సూచించే గడియారాలు కొత్త సొబగులు అద్దుకుంటున్నాయి. కొనుగోలుదారుల అభిరుచులకు తగినట్లు భిన్న రూపాల్లో వాటిని తయారు చేస్తూ అమ్మకందారులు అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ద్విచక్ర వాహనాల్లో పొందుపరచినట్లు రూపొందించిన గడియారాలు మార్కెట్లో ఆకర్షిస్తున్నాయి. వాటిలో కొన్ని ఇక్కడ చూడొచ్చు.  ఇంటిలో ఎప్పటికప్పుడు సమయాన్ని సూచించే గడియారాలు కొత్త సొబగులు అద్దుకుంటున్నాయి. కొనుగోలుదారుల అభిరుచులకు తగినట్లు భిన్న రూపాల్లో వాటిని తయారు చేస్తూ అమ్మకందారులు అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ద్విచక్ర వాహనాల్లో పొందుపరచినట్లు రూపొందించిన గడియారాలు మార్కెట్లో ఆకర్షిస్తున్నాయి. వాటిలో కొన్ని ఇక్కడ చూడొచ్చు.
2/30
3/30
4/30
5/30
ఆదోని పట్టణానికి చెందిన అశోక్‌ శ్రీనాథ్‌ అనే యువకుడు 0.2 మిల్లీమీటర్ల పరిమాణంలో జాతీయ జెండా తయారు చేశారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా పెన్ను నిబ్‌పై సూక్ష్మ కళతో దీనిని రూపొందించారు. ఆదోని పట్టణానికి చెందిన అశోక్‌ శ్రీనాథ్‌ అనే యువకుడు 0.2 మిల్లీమీటర్ల పరిమాణంలో జాతీయ జెండా తయారు చేశారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా పెన్ను నిబ్‌పై సూక్ష్మ కళతో దీనిని రూపొందించారు.
6/30
ఎగువనున్న జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. పది గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ జల సోయగాలను చూసేందుకు.. మల్లన్న దర్శనార్థం వచ్చే భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. వేలాది వాహనాలతో నల్లమల ఘాట్‌ రోడ్డుపై రద్దీ పెరిగింది. శనివారం రాత్రి వాహనాల లైట్ల కాంతులు నల్లమల కొండలకు కొత్త అందాలను తెచ్చాయి. ఈ దృశ్యం శ్రీగిరికి విద్యుదీపాలతో తోరణాలు కట్టారా అన్నట్లు కనువిందు చేస్తోంది.		ఎగువనున్న జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. పది గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ జల సోయగాలను చూసేందుకు.. మల్లన్న దర్శనార్థం వచ్చే భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. వేలాది వాహనాలతో నల్లమల ఘాట్‌ రోడ్డుపై రద్దీ పెరిగింది. శనివారం రాత్రి వాహనాల లైట్ల కాంతులు నల్లమల కొండలకు కొత్త అందాలను తెచ్చాయి. ఈ దృశ్యం శ్రీగిరికి విద్యుదీపాలతో తోరణాలు కట్టారా అన్నట్లు కనువిందు చేస్తోంది.
7/30
తమిళనాడు రాష్ట్రం మదురైకు చెందిన ‘గోల్డ్‌మెన్’ వరుచూర్‌ సెల్వం శనివారం చిత్తూరు నగరానికి వచ్చారు. ఏపీ మొదలియార్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ సురేశ్‌ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఆయన ఒంటి నిండా బంగారు ఆభరణాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తమిళనాడు రాష్ట్రం మదురైకు చెందిన ‘గోల్డ్‌మెన్’ వరుచూర్‌ సెల్వం శనివారం చిత్తూరు నగరానికి వచ్చారు. ఏపీ మొదలియార్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ సురేశ్‌ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఆయన ఒంటి నిండా బంగారు ఆభరణాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
8/30
కంకిపాడు లాకు రోడ్డులోని ఓ ఇంటి ముందు ఏర్పాటు చేసిన మహాత్ముని విగ్రహం గత 50 ఏళ్లుగా నిత్య పూజలందుకుంటోంది. ప్రముఖ కాంగ్రెస్‌ నాయకుడు దివంగత గాంధంశెట్టి కోటేశ్వరరావు 1972 ఆగస్టు 15న తన ఇంటి ఎదుట గాంధీ విగ్రహం నిర్మించగా.. అప్పటి పూర్వ కంకిపాడు ఎమ్మెల్యే అక్కినేని భాస్కరరావు దీనిని ఆవిష్కరించారు. దేవతా విగ్రహం రీతిలో నిత్యం శుభ్రం చేసి, పాదాల వద్ద పూలు పెట్టి నమస్కరించడం మూడు తరాల కుటుంబ సభ్యులకు జీవనంలో ఒక భాగమైంది. దీనికి తాము గర్వంగా భావిస్తుంటామని రెండో తరం ప్రతినిధి గాంధంశెట్టి పరమేశ్వరరావు ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.   కంకిపాడు లాకు రోడ్డులోని ఓ ఇంటి ముందు ఏర్పాటు చేసిన మహాత్ముని విగ్రహం గత 50 ఏళ్లుగా నిత్య పూజలందుకుంటోంది. ప్రముఖ కాంగ్రెస్‌ నాయకుడు దివంగత గాంధంశెట్టి కోటేశ్వరరావు 1972 ఆగస్టు 15న తన ఇంటి ఎదుట గాంధీ విగ్రహం నిర్మించగా.. అప్పటి పూర్వ కంకిపాడు ఎమ్మెల్యే అక్కినేని భాస్కరరావు దీనిని ఆవిష్కరించారు. దేవతా విగ్రహం రీతిలో నిత్యం శుభ్రం చేసి, పాదాల వద్ద పూలు పెట్టి నమస్కరించడం మూడు తరాల కుటుంబ సభ్యులకు జీవనంలో ఒక భాగమైంది. దీనికి తాము గర్వంగా భావిస్తుంటామని రెండో తరం ప్రతినిధి గాంధంశెట్టి పరమేశ్వరరావు ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.
9/30
దివిసీమలో సముద్రపు అలలకు హంసలదీవి రహదారి కోతకు గురవుతోంది. తుపానులు, వరదలకు, నదీ జలాలు సముద్రంలో కలవడం వల్ల కెరటాల పోటుకు రహదారి ఇలా ధ్వంసమైంది. కృష్ణా జిల్లా కోడూరు మండలం హంసలదీవి బీచ్‌లో కనిపించిన చిత్రమిది.


దివిసీమలో సముద్రపు అలలకు హంసలదీవి రహదారి కోతకు గురవుతోంది. తుపానులు, వరదలకు, నదీ జలాలు సముద్రంలో కలవడం వల్ల కెరటాల పోటుకు రహదారి ఇలా ధ్వంసమైంది. కృష్ణా జిల్లా కోడూరు మండలం హంసలదీవి బీచ్‌లో కనిపించిన చిత్రమిది.
10/30
ఖమ్మం జిల్లా తెల్దారుపల్లి ఉన్నత పాఠశాలలో పని చేస్తున్న చిత్రలేఖన ఉపాధ్యాయుడు పాము నాగేశ్వరరావు వజ్రోత్సవాల సందర్భంగా ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ లోగోను శనివారం బియ్యపు గింజలతో ఏర్పాటు చేశారు.  ఖమ్మం జిల్లా తెల్దారుపల్లి ఉన్నత పాఠశాలలో పని చేస్తున్న చిత్రలేఖన ఉపాధ్యాయుడు పాము నాగేశ్వరరావు వజ్రోత్సవాల సందర్భంగా ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ లోగోను శనివారం బియ్యపు గింజలతో ఏర్పాటు చేశారు.
11/30
వజ్రోత్సవాలలో భాగంగా ఒక్కొక్కరు తమ దేశభక్తిని ఒక్కో రీతిలో చాటుతుండగా నీటి పారుదల శాఖ అధికారులు వినూత్నంగా తమ దేశభక్తిని చాటారు. ఎల్‌ఎండీ జలాశయం స్పిల్‌ వే గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతుండగా ఆ స్పిల్‌ వే గేట్లపై శనివారం అధికారులు మువ్వన్నెల రంగులు కలిగిన విద్యుత్తు దీపాలను ఏర్పాటు చేశారు. దీంతో మువ్వన్నెల వెలుగుల్లో ఆరు గేట్ల నుంచి నీరు పరవళ్లు తొక్కుతుండడం ఆకట్టుకుంది.  సోమవారం వరకు విద్యుత్తు దీపాలను ఉంచుతున్నట్లు అధికారులు తెలిపారు.   


వజ్రోత్సవాలలో భాగంగా ఒక్కొక్కరు తమ దేశభక్తిని ఒక్కో రీతిలో చాటుతుండగా నీటి పారుదల శాఖ అధికారులు వినూత్నంగా తమ దేశభక్తిని చాటారు. ఎల్‌ఎండీ జలాశయం స్పిల్‌ వే గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతుండగా ఆ స్పిల్‌ వే గేట్లపై శనివారం అధికారులు మువ్వన్నెల రంగులు కలిగిన విద్యుత్తు దీపాలను ఏర్పాటు చేశారు. దీంతో మువ్వన్నెల వెలుగుల్లో ఆరు గేట్ల నుంచి నీరు పరవళ్లు తొక్కుతుండడం ఆకట్టుకుంది. సోమవారం వరకు విద్యుత్తు దీపాలను ఉంచుతున్నట్లు అధికారులు తెలిపారు.
12/30
సాధారణంగా పెళ్లి అనగానే బాజాభజంత్రీలు, వేద పండితుల మంత్రాలు వినిపిస్తాయి. ఆదిలాబాద్‌ పట్టణ శివారులో ఓ ఫంక్షన్‌ హాలులో జరిగిన వివాహ వేడుకలో జనగణమన జాతీయగీతం, భారతమాతాకీ జై నినాదాలు మారుమోగాయి. 75ఏళ్ల అమృతోత్సవ వేళ పట్టణంలోని భాగ్యనగర్‌కి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఎల్మల్‌వార్‌ సాయినాథ్, మహారాష్ట్ర ధర్మాబాద్‌కి చెందిన అభిజ్ఞ పెళ్లి వేడుకను ప్రత్యేకంగా జరుపుకొన్నారు. ముందుగా వారు జాతీయజెండాలు చేతబట్టి, హాజరైన బంధువులు, అతిథులతో కలిసి జాతీయ గీతం ఆలపించారు. ఆ తరువాతే ఒక్కటయ్యారు. సాధారణంగా పెళ్లి అనగానే బాజాభజంత్రీలు, వేద పండితుల మంత్రాలు వినిపిస్తాయి. ఆదిలాబాద్‌ పట్టణ శివారులో ఓ ఫంక్షన్‌ హాలులో జరిగిన వివాహ వేడుకలో జనగణమన జాతీయగీతం, భారతమాతాకీ జై నినాదాలు మారుమోగాయి. 75ఏళ్ల అమృతోత్సవ వేళ పట్టణంలోని భాగ్యనగర్‌కి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఎల్మల్‌వార్‌ సాయినాథ్, మహారాష్ట్ర ధర్మాబాద్‌కి చెందిన అభిజ్ఞ పెళ్లి వేడుకను ప్రత్యేకంగా జరుపుకొన్నారు. ముందుగా వారు జాతీయజెండాలు చేతబట్టి, హాజరైన బంధువులు, అతిథులతో కలిసి జాతీయ గీతం ఆలపించారు. ఆ తరువాతే ఒక్కటయ్యారు.
13/30
ప్రముఖ పారిశ్రామికవేత్త గ్రంథి మల్లికార్జునరావు మనుమడి వివాహం శనివారం హైదరాబాద్‌లో జరిగింది. వివాహ వేడుకకు తెదేపా అధినేత చంద్రబాబు హాజరయ్యారు. వధూవరులు సంతోష్‌, తరణలను ఆశీర్వదించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త గ్రంథి మల్లికార్జునరావు మనుమడి వివాహం శనివారం హైదరాబాద్‌లో జరిగింది. వివాహ వేడుకకు తెదేపా అధినేత చంద్రబాబు హాజరయ్యారు. వధూవరులు సంతోష్‌, తరణలను ఆశీర్వదించారు.
14/30
 విశాఖ తెలుగుతల్లి పైవంతెన వద్ద రోడ్డుపై ఏర్పడిన గుంత కారణంగా రవ్వా సుబ్బారావు అనే వ్యక్తి మృతి చెందడంతో మరెవరికీ అటువంటి ఆపద రాకూడదని భావించిన ఆయన కుటుంబీకులు శుక్రవారం దాన్ని కాంక్రీట్‌తో పూడ్చారు. దీనిపై శనివారం ‘ఈనాడు’లో ‘ఆ బాధ మరెవరికీ రావొద్దని’ శీర్షికతో చిత్ర వార్త ప్రచురితమైంది. దీనికి స్పందించిన జీవీఎంసీ అధికారులు కాంక్రీటుపై బీటీ లేయర్‌ వేసి గుంతను పూర్తిగా పూడ్చారు. ప్రమాదాలు జరగక ముందే ఈ పని చేసి ఉంటే బాగుండేదని పలువురు వాహనచోదకులు వ్యాఖ్యానించారు. విశాఖ తెలుగుతల్లి పైవంతెన వద్ద రోడ్డుపై ఏర్పడిన గుంత కారణంగా రవ్వా సుబ్బారావు అనే వ్యక్తి మృతి చెందడంతో మరెవరికీ అటువంటి ఆపద రాకూడదని భావించిన ఆయన కుటుంబీకులు శుక్రవారం దాన్ని కాంక్రీట్‌తో పూడ్చారు. దీనిపై శనివారం ‘ఈనాడు’లో ‘ఆ బాధ మరెవరికీ రావొద్దని’ శీర్షికతో చిత్ర వార్త ప్రచురితమైంది. దీనికి స్పందించిన జీవీఎంసీ అధికారులు కాంక్రీటుపై బీటీ లేయర్‌ వేసి గుంతను పూర్తిగా పూడ్చారు. ప్రమాదాలు జరగక ముందే ఈ పని చేసి ఉంటే బాగుండేదని పలువురు వాహనచోదకులు వ్యాఖ్యానించారు.
15/30
16/30
శనివారం రాత్రి త్రివర్ణ వెలుగుల్లో శ్రీశైలం జలాశయం ఆనకట్ట శనివారం రాత్రి త్రివర్ణ వెలుగుల్లో శ్రీశైలం జలాశయం ఆనకట్ట
17/30
శనివారం రాత్రి మువన్నెల కాంతుల్లో మెరిసిపోతున్న నాగార్జునసాగర్‌ జలాశయం శనివారం రాత్రి మువన్నెల కాంతుల్లో మెరిసిపోతున్న నాగార్జునసాగర్‌ జలాశయం
18/30
కేంద్ర పాలితమైన పుదుచ్చేరిలోని సాగర గర్భంలో జాతీయ జెండా ఆవిష్కరించారు. పుదుచ్చేరికి చెందిన స్కూబా డైవింగ్‌ కోచ్‌ అరవింద్‌ పలు సందర్భాల్లో కడలి గర్భంలో విన్యాసాలు చేస్తుంటారు. స్వాతంత్య్ర అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా అరియాంకుప్పంలోని సముద్రంలో 75 అడుగుల లోతున జాతీయ జెండా ఎగురవేశారు. ఈ విన్యాసాన్ని చెన్నై నీలాంకరై బీచ్‌లోనూ చేశారు. కేంద్ర పాలితమైన పుదుచ్చేరిలోని సాగర గర్భంలో జాతీయ జెండా ఆవిష్కరించారు. పుదుచ్చేరికి చెందిన స్కూబా డైవింగ్‌ కోచ్‌ అరవింద్‌ పలు సందర్భాల్లో కడలి గర్భంలో విన్యాసాలు చేస్తుంటారు. స్వాతంత్య్ర అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా అరియాంకుప్పంలోని సముద్రంలో 75 అడుగుల లోతున జాతీయ జెండా ఎగురవేశారు. ఈ విన్యాసాన్ని చెన్నై నీలాంకరై బీచ్‌లోనూ చేశారు.
19/30
ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి జగన్‌ నివాసంపై శనివారం త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిపై, ప్రతి సముదాయంపై త్రివర్ణ పతాకం రెపరెపలాడేలా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు కోటి జాతీయ జెండాలను రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసినట్టు సీఎం కార్యాలయం తెలిపింది. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి జగన్‌ నివాసంపై శనివారం త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిపై, ప్రతి సముదాయంపై త్రివర్ణ పతాకం రెపరెపలాడేలా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు కోటి జాతీయ జెండాలను రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసినట్టు సీఎం కార్యాలయం తెలిపింది.
20/30
ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమాన్ని శనివారం విజయవాడలో నిర్వహించారు. మహాత్మాగాంధీ రోడ్డులో బెంజిసర్కిల్‌ నుంచి కంట్రోల్‌ రూం వరకు మూడున్నర కిలోమీటర్ల మువ్వన్నెల జెండాను ప్రదర్శించారు. సుమారు 20 వేల మందికి పైగా విద్యార్థులు పతాకాన్ని నగరంలో ఊరేగించారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమాన్ని శనివారం విజయవాడలో నిర్వహించారు. మహాత్మాగాంధీ రోడ్డులో బెంజిసర్కిల్‌ నుంచి కంట్రోల్‌ రూం వరకు మూడున్నర కిలోమీటర్ల మువ్వన్నెల జెండాను ప్రదర్శించారు. సుమారు 20 వేల మందికి పైగా విద్యార్థులు పతాకాన్ని నగరంలో ఊరేగించారు.
21/30
తిరుచానూరు నవజీవన్‌ అంధుల పాఠశాల విద్యార్థులు శనివారం జాతీయ జెండాలతో ర్యాలీ తీశారు. శ్రీపద్మావతి అమ్మవారి పుష్కరిణి మీదుగా మాడ వీధుల నుంచి ప్రదర్శన నిర్వహించారు. దైవభక్తి, దేశభక్తి కలిసిన వాతావరణంలో భారత్‌ మాతాకీ జై అనే నినాదాలు అక్కడి వారి గుండెల్ని ఉప్పొంగేలా చేశాయి. భక్తులూ ప్రదర్శనలో పాల్గొనడంతో చిన్నారుల్లో ఉత్సాహం రెట్టింపయింది. తిరుచానూరు నవజీవన్‌ అంధుల పాఠశాల విద్యార్థులు శనివారం జాతీయ జెండాలతో ర్యాలీ తీశారు. శ్రీపద్మావతి అమ్మవారి పుష్కరిణి మీదుగా మాడ వీధుల నుంచి ప్రదర్శన నిర్వహించారు. దైవభక్తి, దేశభక్తి కలిసిన వాతావరణంలో భారత్‌ మాతాకీ జై అనే నినాదాలు అక్కడి వారి గుండెల్ని ఉప్పొంగేలా చేశాయి. భక్తులూ ప్రదర్శనలో పాల్గొనడంతో చిన్నారుల్లో ఉత్సాహం రెట్టింపయింది.
22/30
భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకుని కళాకారులు జాతీయ నాయకుల విగ్రహాల తయారీలో నిమగ్నమయ్యారు. హైదరాబాద్‌ శంషాబాద్‌ విమానాశ్రయ సమీపంలోని ఓ విగ్రహాల తయారీ కేంద్రంలో జాతిపిత మహాత్మాగాంధీ, భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ తదితర విగ్రహాలు రూపుదిద్దుకుంటున్నాయి. భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకుని కళాకారులు జాతీయ నాయకుల విగ్రహాల తయారీలో నిమగ్నమయ్యారు. హైదరాబాద్‌ శంషాబాద్‌ విమానాశ్రయ సమీపంలోని ఓ విగ్రహాల తయారీ కేంద్రంలో జాతిపిత మహాత్మాగాంధీ, భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ తదితర విగ్రహాలు రూపుదిద్దుకుంటున్నాయి.
23/30
రాజ్‌భవన్‌లో రెడ్‌క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన తిరంగా ప్రదర్శనలో విద్యార్థులతో గవర్నర్‌ తమిళిసై రాజ్‌భవన్‌లో రెడ్‌క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన తిరంగా ప్రదర్శనలో విద్యార్థులతో గవర్నర్‌ తమిళిసై
24/30
నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో 750 మీటర్ల జాతీయ జెండాతో నిర్వహించిన ర్యాలీ నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో 750 మీటర్ల జాతీయ జెండాతో నిర్వహించిన ర్యాలీ
25/30
స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా జాతీయ జెండాలతో భారీ ర్యాలీలు నిర్వహించారు. సంగారెడ్డిలో నిర్వహించిన ఫ్రీడం ర్యాలీలో మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. జాతీయ జెండా చేబూని ఆయన ముందు నడుస్తుండగా ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్‌ తదితరులు అనుసరించారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా జాతీయ జెండాలతో భారీ ర్యాలీలు నిర్వహించారు. సంగారెడ్డిలో నిర్వహించిన ఫ్రీడం ర్యాలీలో మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. జాతీయ జెండా చేబూని ఆయన ముందు నడుస్తుండగా ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్‌ తదితరులు అనుసరించారు.
26/30
మరమగ్గంపై సిల్కు నూలుతో నేసిన వస్త్రంపై జాతీయ గీతం, మూడు రంగుల్లో భారత దేశపటాన్ని తయారు చేశారు సిరిసిల్లకు చెందిన హరిప్రసాద్‌. అయిదు రోజులపాటు శ్రమించి.. ఎలక్ట్రానిక్‌ జకార్డ్‌ మగ్గంపై రెండు మీటర్ల పొడవు, 47 అంగుళాల వెడల్పుతో ఈ ప్రత్యేక వస్త్రాన్ని తయారు చేశారు. మరమగ్గంపై సిల్కు నూలుతో నేసిన వస్త్రంపై జాతీయ గీతం, మూడు రంగుల్లో భారత దేశపటాన్ని తయారు చేశారు సిరిసిల్లకు చెందిన హరిప్రసాద్‌. అయిదు రోజులపాటు శ్రమించి.. ఎలక్ట్రానిక్‌ జకార్డ్‌ మగ్గంపై రెండు మీటర్ల పొడవు, 47 అంగుళాల వెడల్పుతో ఈ ప్రత్యేక వస్త్రాన్ని తయారు చేశారు.
27/30
జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్‌ స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా 12 గంటల పాటు శ్రమించి బియ్యపు గింజ మధ్యలో బంగారు జాతీయ పతాకాన్ని అమర్చారు. ఈ చిత్రాన్ని సూక్ష్మదర్శిని ద్వారా వీక్షించవచ్చు. జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్‌ స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా 12 గంటల పాటు శ్రమించి బియ్యపు గింజ మధ్యలో బంగారు జాతీయ పతాకాన్ని అమర్చారు. ఈ చిత్రాన్ని సూక్ష్మదర్శిని ద్వారా వీక్షించవచ్చు.
28/30
శనివారం రాత్రి త్రివర్ణ కాంతుల్లో వెలుగులీనుతున్న చార్మినార్‌
శనివారం రాత్రి త్రివర్ణ కాంతుల్లో వెలుగులీనుతున్న చార్మినార్‌
29/30
పంజాబ్‌లోని చండీగఢ్‌ విశ్వవిద్యాలయ విద్యార్థులు జాతీయ జెండా ఆకారంలో ఇలా నిలుచొని గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్‌లో చోటు సంపాదించారు. జాతీయ పతాకంలోని మూడు రంగుల దుస్తులు ధరించిన 5,885 మంది విద్యార్థులు ఎగురుతున్న జాతీయజెండా మాదిరిగా మైదానంలో బారులు తీరారు. ఇప్పటివరకు యూఏఈ పేరుపై ఉన్న రికార్డును వీరు అధిగమించారు. పంజాబ్‌లోని చండీగఢ్‌ విశ్వవిద్యాలయ విద్యార్థులు జాతీయ జెండా ఆకారంలో ఇలా నిలుచొని గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్‌లో చోటు సంపాదించారు. జాతీయ పతాకంలోని మూడు రంగుల దుస్తులు ధరించిన 5,885 మంది విద్యార్థులు ఎగురుతున్న జాతీయజెండా మాదిరిగా మైదానంలో బారులు తీరారు. ఇప్పటివరకు యూఏఈ పేరుపై ఉన్న రికార్డును వీరు అధిగమించారు.
30/30
స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఫ్రీడం రన్‌ ఉత్సాహంగా సాగింది. పాల్గొన్నవారంతా జాతీయ పతాకాన్ని చేబూని స్వాతంత్య్ర స్ఫూర్తిని చాటారు. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో వజ్రోత్సవ నిర్వహణ కమిటీ ఛైర్మన్‌ కె.కేశవరావు, మంత్రులు శ్రీనివాస్‌యాదవ్‌, మహమూద్‌ అలీ, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, హైదరాబాద్‌ మేయర్‌ విజయలక్ష్మి, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఫ్రీడం రన్‌ ఉత్సాహంగా సాగింది. పాల్గొన్నవారంతా జాతీయ పతాకాన్ని చేబూని స్వాతంత్య్ర స్ఫూర్తిని చాటారు. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో వజ్రోత్సవ నిర్వహణ కమిటీ ఛైర్మన్‌ కె.కేశవరావు, మంత్రులు శ్రీనివాస్‌యాదవ్‌, మహమూద్‌ అలీ, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, హైదరాబాద్‌ మేయర్‌ విజయలక్ష్మి, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని

ap-districts
ts-districts