News In Pics: చిత్రం చెప్పే సంగతులు-2(14-08-2022)

Published : 14 Aug 2022 20:38 IST
1/32
విజయవాడ ఎంజీ రోడ్డులో సేవలందిస్తున్న మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ లబ్బిపేట బ్రాంచిని స్థానిక కళాంజలి షోరూమ్‌ కాంప్లెక్స్‌లోని నూతన సముదాయంలోకి మార్చారు. ఇందుకు సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆ సంస్థ ఎండీ శైలజా కిరణ్‌ పాల్గొని మాట్లాడారు. మార్గదర్శి ప్రజల విశ్వాసాన్ని చురగొంటూ 60ఏళ్లుగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తోందని ఆమె తెలిపారు. విజయవాడ ఎంజీ రోడ్డులో సేవలందిస్తున్న మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ లబ్బిపేట బ్రాంచిని స్థానిక కళాంజలి షోరూమ్‌ కాంప్లెక్స్‌లోని నూతన సముదాయంలోకి మార్చారు. ఇందుకు సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆ సంస్థ ఎండీ శైలజా కిరణ్‌ పాల్గొని మాట్లాడారు. మార్గదర్శి ప్రజల విశ్వాసాన్ని చురగొంటూ 60ఏళ్లుగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తోందని ఆమె తెలిపారు.
2/32
3/32
భారత స్వతంత్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని దుర్గం చెరువులో మువ్వన్నెల తెరచాపలు కట్టుకొని క్రీడాకారులు సెయిలింగ్‌ చేశారు. భారత స్వతంత్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని దుర్గం చెరువులో మువ్వన్నెల తెరచాపలు కట్టుకొని క్రీడాకారులు సెయిలింగ్‌ చేశారు.
4/32
5/32
హైదరాబాద్‌ బేగంపేటలోని ఓ ఐస్‌క్రీమ్‌ పార్లర్‌లో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మువ్వన్నెల ఐస్‌క్రీమ్‌ను లాంచ్‌ చేశారు. కార్యక్రమంలో బిగ్‌బాస్‌ ఫేమ్‌ స్రవంతి చొక్కారపు, నటి రితికా చక్రవర్తి, మోడల్స్‌ పాల్గొని ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు. హైదరాబాద్‌ బేగంపేటలోని ఓ ఐస్‌క్రీమ్‌ పార్లర్‌లో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మువ్వన్నెల ఐస్‌క్రీమ్‌ను లాంచ్‌ చేశారు. కార్యక్రమంలో బిగ్‌బాస్‌ ఫేమ్‌ స్రవంతి చొక్కారపు, నటి రితికా చక్రవర్తి, మోడల్స్‌ పాల్గొని ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.
6/32
7/32
కరోనా ప్రభావం కారణంగా కొంతకాలంగా నిలిపేసిన సన్‌డే-ఫన్‌డే కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆదివారం సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై రాకపోకలను నిలిపేసి సందర్శకులను మాత్రమే అనుమతించారు. నగరవాసులు పెద్దఎత్తున తరలిరావడంతో ట్యాంక్‌బండ్‌పై సందడి నెలకొంది. కరోనా ప్రభావం కారణంగా కొంతకాలంగా నిలిపేసిన సన్‌డే-ఫన్‌డే కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆదివారం సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై రాకపోకలను నిలిపేసి సందర్శకులను మాత్రమే అనుమతించారు. నగరవాసులు పెద్దఎత్తున తరలిరావడంతో ట్యాంక్‌బండ్‌పై సందడి నెలకొంది.
8/32
9/32
10/32
హైదరాబాద్ అంటే తనకు ఎంతో ఇష్టమని మిస్ ఇండియా 2022 విజేత సినీశెట్టి అన్నారు. ఇనార్బిట్‌మాల్‌లోని ఓ షోరూమ్‌లో నూతన మోడల్‌ పాదరక్షలను ఆమె ప్రారంభించారు. సినీ శెట్టితో పాటు మిస్‌ ఇండియా మొదటి, రెండో రన్నరప్‌ రూబల్ షెకావత్, షినాతా చౌహాన్‌లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హైదరాబాద్ అంటే తనకు ఎంతో ఇష్టమని మిస్ ఇండియా 2022 విజేత సినీశెట్టి అన్నారు. ఇనార్బిట్‌మాల్‌లోని ఓ షోరూమ్‌లో నూతన మోడల్‌ పాదరక్షలను ఆమె ప్రారంభించారు. సినీ శెట్టితో పాటు మిస్‌ ఇండియా మొదటి, రెండో రన్నరప్‌ రూబల్ షెకావత్, షినాతా చౌహాన్‌లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
11/32
12/32
13/32
తన మనమరాలు రుద్రి ‘హర్‌ ఘర్‌ తిరంగా’లో భాగంగా ఇంటిపై జెండా ఎగురవేసిన ఫొటోను కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. తన మనమరాలు రుద్రి ‘హర్‌ ఘర్‌ తిరంగా’లో భాగంగా ఇంటిపై జెండా ఎగురవేసిన ఫొటోను కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు.
14/32
టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ఆకుల శ్రీజ గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటి హరిత స్ఫూర్తి చాటారు. ఇటీవల జరిగిన కామన్వెల్త్‌ క్రీడల్లో తెలుగమ్మాయి ఆకుల శ్రీజ, సీనియర్‌ ఆటగాడు శరత్‌ కమల్‌తో కలిసి టేబుల్‌ టెన్నిస్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌లో స్వర్ణం గెలిచారు. టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ఆకుల శ్రీజ గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటి హరిత స్ఫూర్తి చాటారు. ఇటీవల జరిగిన కామన్వెల్త్‌ క్రీడల్లో తెలుగమ్మాయి ఆకుల శ్రీజ, సీనియర్‌ ఆటగాడు శరత్‌ కమల్‌తో కలిసి టేబుల్‌ టెన్నిస్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌లో స్వర్ణం గెలిచారు.
15/32
16/32
అర్జెంటీనాలోని బ్యూనస్‌ ఎయిర్స్‌లో ఇంటర్నేషనల్‌ హంటింగ్‌, ఫిషింగ్‌, వెపన్స్‌ ఫెయిర్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ కొనుగోలుదారుడు అక్కడి బుల్లెట్లను పరిశీలిస్తూ కనిపించాడు. అర్జెంటీనాలోని బ్యూనస్‌ ఎయిర్స్‌లో ఇంటర్నేషనల్‌ హంటింగ్‌, ఫిషింగ్‌, వెపన్స్‌ ఫెయిర్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ కొనుగోలుదారుడు అక్కడి బుల్లెట్లను పరిశీలిస్తూ కనిపించాడు.
17/32
పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహిస్తున్న ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ వేడుకలకు మంత్రి కేటీఆర్‌ హాజరయ్యారు. కాలికి గాయం అయిన తరువాత ఆయన తొలిసారిగా ఈ కార్యక్రమానికి హాజరు కావడం విశేషం. పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహిస్తున్న ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ వేడుకలకు మంత్రి కేటీఆర్‌ హాజరయ్యారు. కాలికి గాయం అయిన తరువాత ఆయన తొలిసారిగా ఈ కార్యక్రమానికి హాజరు కావడం విశేషం.
18/32
ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆదివారం ఆలేరు నియోజకవర్గం గుండాల మండలంలోని వివిధ గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా పల్లెజనం ఆయనకు కోలాటాలతో స్వాగతం పలికారు. ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆదివారం ఆలేరు నియోజకవర్గం గుండాల మండలంలోని వివిధ గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా పల్లెజనం ఆయనకు కోలాటాలతో స్వాగతం పలికారు.
19/32
20/32
ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్ర ఆసక్తికర ఫొటోను తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. ఇందులో ఇద్దరు వృద్ధులు తమ శక్తికి మించి కృషి చేస్తూ స్తంభానికి జాతీయ జెండాను కడుతున్నారు. ‘స్వాతంత్ర్య దినోత్సవం గురించి ఇంత హడావుడి ఎందుకు అని మీకనిపిస్తే.. ఈ ఇద్దరినీ అడగండి. వాళ్లే చెబుతారు స్వాతంత్ర్యం గొప్పతనాన్ని. మీకింకా ఎవరి ఉపన్యాసాలు అవసరం లేదు’ అని తెలుపుతూ పోస్టు పెట్టారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్ర ఆసక్తికర ఫొటోను తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. ఇందులో ఇద్దరు వృద్ధులు తమ శక్తికి మించి కృషి చేస్తూ స్తంభానికి జాతీయ జెండాను కడుతున్నారు. ‘స్వాతంత్ర్య దినోత్సవం గురించి ఇంత హడావుడి ఎందుకు అని మీకనిపిస్తే.. ఈ ఇద్దరినీ అడగండి. వాళ్లే చెబుతారు స్వాతంత్ర్యం గొప్పతనాన్ని. మీకింకా ఎవరి ఉపన్యాసాలు అవసరం లేదు’ అని తెలుపుతూ పోస్టు పెట్టారు.
21/32
ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ఒంగోలులో ప్రజాప్రతినిధులు, విద్యార్థులు 3కిలోమీటర్ల భారీ జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రులు మేరుగ నాగార్జున, ఆదిమూలపు సురేశ్‌, ఎంపీ మాగుంట శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, ఎస్పీ మల్లికా గార్గ్‌ తదితరులు పాల్గొన్నారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ఒంగోలులో ప్రజాప్రతినిధులు, విద్యార్థులు 3కిలోమీటర్ల భారీ జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రులు మేరుగ నాగార్జున, ఆదిమూలపు సురేశ్‌, ఎంపీ మాగుంట శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, ఎస్పీ మల్లికా గార్గ్‌ తదితరులు పాల్గొన్నారు.
22/32
23/32
ఇటీవల హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌లను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా పోలీసు స్టేషన్‌కు రెండు చొప్పున ద్విచక్రవాహనాలను అందజేశారు. ఈ వాహనాల సాయంతో ట్రాఫిక్‌ పోలీసులు నో పార్కింగ్‌తో పాటు రద్దీ ఉన్నచోట్ల ఎప్పటికప్పుడు ట్రాఫిక్‌ సమాచారం తెలుసుకొని వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చేస్తున్నారు. కూకట్‌పల్లిలో ట్రాఫిక్‌ టాస్క్‌ఫోర్స్‌ వాహనంపై వెళ్తున్న కానిస్టేబుల్‌ను చిత్రంలో చూడవచ్చు. ఇటీవల హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌లను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా పోలీసు స్టేషన్‌కు రెండు చొప్పున ద్విచక్రవాహనాలను అందజేశారు. ఈ వాహనాల సాయంతో ట్రాఫిక్‌ పోలీసులు నో పార్కింగ్‌తో పాటు రద్దీ ఉన్నచోట్ల ఎప్పటికప్పుడు ట్రాఫిక్‌ సమాచారం తెలుసుకొని వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చేస్తున్నారు. కూకట్‌పల్లిలో ట్రాఫిక్‌ టాస్క్‌ఫోర్స్‌ వాహనంపై వెళ్తున్న కానిస్టేబుల్‌ను చిత్రంలో చూడవచ్చు.
24/32
ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ముషీరాబాద్‌లో 75మీటర్ల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న భాజపా ఎంపీ లక్ష్మణ్‌.. పార్టీ శ్రేణులతో కలిసి సరదాగా నృత్యం చేశారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ముషీరాబాద్‌లో 75మీటర్ల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న భాజపా ఎంపీ లక్ష్మణ్‌.. పార్టీ శ్రేణులతో కలిసి సరదాగా నృత్యం చేశారు.
25/32
26/32
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గత ఐదు రోజులుగా వరుస సెలవులు, వివాహాల నేపథ్యంలో భక్తులు తిరుమలకు పెద్దఎత్తున తరలివస్తున్నారు. శనివారం రాత్రి నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. ఆరు కిలోమీటర్లకు పైగా క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. శ్రీవారి దర్శనానికి 48గంటలకు పైగా సమయం పడుతోందని తితిదే ప్రకటించింది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గత ఐదు రోజులుగా వరుస సెలవులు, వివాహాల నేపథ్యంలో భక్తులు తిరుమలకు పెద్దఎత్తున తరలివస్తున్నారు. శనివారం రాత్రి నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. ఆరు కిలోమీటర్లకు పైగా క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. శ్రీవారి దర్శనానికి 48గంటలకు పైగా సమయం పడుతోందని తితిదే ప్రకటించింది.
27/32
28/32
ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా మంబయి నగరంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. అందులో పాల్గొన్న ఓ చిన్నారిని చూసి ముచ్చటపడి ఓ ఎన్‌ఎస్‌జీ కమాండో అతడితో సెల్ఫీ తీసుకుంటున్న దృశ్యమిది. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా మంబయి నగరంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. అందులో పాల్గొన్న ఓ చిన్నారిని చూసి ముచ్చటపడి ఓ ఎన్‌ఎస్‌జీ కమాండో అతడితో సెల్ఫీ తీసుకుంటున్న దృశ్యమిది.
29/32
స్వాతంత్ర్య భారత వజ్రోత్సవాల స్ఫూర్తి ఊరూరా వెల్లివిరుస్తోంది. హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ జెండాలను పంపిణీ చేస్తున్నాయి. అలా రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో ఓ రైతుకు జెండా అందజేయగా.. ఆయన తన ఎద్దుల కాడికి దాన్ని కట్టుకొని భార్యతో కలిసి పొలంలో విత్తనాలు నాటే పనిలో నిమగ్నమైన చిత్రమిది. స్వాతంత్ర్య భారత వజ్రోత్సవాల స్ఫూర్తి ఊరూరా వెల్లివిరుస్తోంది. హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ జెండాలను పంపిణీ చేస్తున్నాయి. అలా రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో ఓ రైతుకు జెండా అందజేయగా.. ఆయన తన ఎద్దుల కాడికి దాన్ని కట్టుకొని భార్యతో కలిసి పొలంలో విత్తనాలు నాటే పనిలో నిమగ్నమైన చిత్రమిది.
30/32
హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌లోని తన నివాసంలో తెదేపా అధినేత చంద్రబాబు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం భద్రతా సిబ్బందికి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ శుభాకాంక్షలు తెలిపారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌లోని తన నివాసంలో తెదేపా అధినేత చంద్రబాబు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం భద్రతా సిబ్బందికి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ శుభాకాంక్షలు తెలిపారు.
31/32
32/32
నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్ తాజా చిత్రం ‘బింబిసార‌’ ఈ ఆగ‌స్టు 5న విడుద‌లైంది. తాజాగా నందమూరి బాల‌కృష్ణ బింబిసార చిత్రాన్ని వీక్షించారు. సినిమా చాలా బాగుందని.. కల్యాణ్ రామ్‌కు, దర్శకుడు వ‌శిష్ఠ, బింబిసార చిత్రబృందానికి బాలయ్య అభినందనలు తెలిపారు. నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్ తాజా చిత్రం ‘బింబిసార‌’ ఈ ఆగ‌స్టు 5న విడుద‌లైంది. తాజాగా నందమూరి బాల‌కృష్ణ బింబిసార చిత్రాన్ని వీక్షించారు. సినిమా చాలా బాగుందని.. కల్యాణ్ రామ్‌కు, దర్శకుడు వ‌శిష్ఠ, బింబిసార చిత్రబృందానికి బాలయ్య అభినందనలు తెలిపారు.

మరిన్ని

ap-districts
ts-districts