News In Pics: చిత్రం చెప్పే సంగతులు-2(15-08-2022)

Published : 15 Aug 2022 20:01 IST
1/35
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఏపీ రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ రాజ్‌భవన్‌లో ఎట్‌హోం పేరిట తేనేటి విందు ఇచ్చారు. కార్యక్రమంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, అచ్చెన్నాయుడు, విజయవాడ ఎంపీ కేశినేని నాని తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఏపీ రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ రాజ్‌భవన్‌లో ఎట్‌హోం పేరిట తేనేటి విందు ఇచ్చారు. కార్యక్రమంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, అచ్చెన్నాయుడు, విజయవాడ ఎంపీ కేశినేని నాని తదితరులు పాల్గొన్నారు.
2/35
3/35
4/35
హైదరాబాద్‌లోని సమతా స్ఫూర్తి కేంద్రంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సమతా మూర్తి రామానుజాచార్యుల విగ్రహాన్ని మువ్వన్నెల రంగుల విద్యుద్దీపకాంతులతో అందంగా అలంకరించారు. హైదరాబాద్‌లోని సమతా స్ఫూర్తి కేంద్రంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సమతా మూర్తి రామానుజాచార్యుల విగ్రహాన్ని మువ్వన్నెల రంగుల విద్యుద్దీపకాంతులతో అందంగా అలంకరించారు.
5/35
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మూసాపేట గ్రీన్‌హిల్స్‌ రోడ్‌లోని రెయిన్‌బో విస్తా రాక్‌ గార్డెన్‌లో 2కిలోమీటర్ల భారీ జాతీయ పతాకంతో గేటెడ్‌ కమ్యూనిటీవాసులంతా ప్రదర్శన నిర్వహించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మూసాపేట గ్రీన్‌హిల్స్‌ రోడ్‌లోని రెయిన్‌బో విస్తా రాక్‌ గార్డెన్‌లో 2కిలోమీటర్ల భారీ జాతీయ పతాకంతో గేటెడ్‌ కమ్యూనిటీవాసులంతా ప్రదర్శన నిర్వహించారు.
6/35
7/35
ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి కుత్బుల్లాపూర్‌ పరిధిలోని గురుమూర్తి నగర్‌కు చెందిన వృద్ధుడు మహ్మద్‌ ఆఫ్టల్‌. ఈయనకు 63ఏళ్లు.. ఆగస్టు 15న జన్మించాడు. ఏటా స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవాల రోజున జాతీయ జెండాను ద్విచక్రవాహనానికి కట్టుకొని నగరమంతా సంచరిస్తుంటాడు. ఈక్రమంలో సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌ వద్ద ఈనాడు కెమెరాకు చిక్కాడు. ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి కుత్బుల్లాపూర్‌ పరిధిలోని గురుమూర్తి నగర్‌కు చెందిన వృద్ధుడు మహ్మద్‌ ఆఫ్టల్‌. ఈయనకు 63ఏళ్లు.. ఆగస్టు 15న జన్మించాడు. ఏటా స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవాల రోజున జాతీయ జెండాను ద్విచక్రవాహనానికి కట్టుకొని నగరమంతా సంచరిస్తుంటాడు. ఈక్రమంలో సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌ వద్ద ఈనాడు కెమెరాకు చిక్కాడు.
8/35
9/35
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బేగం బజార్‌లో ఓ పాఠశాల విద్యార్థులు భారీ జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బేగం బజార్‌లో ఓ పాఠశాల విద్యార్థులు భారీ జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు.
10/35
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ‘వన్‌ నేషన్‌- వన్‌ డ్యాన్స్‌’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఓ బాలుడు పజిల్స్‌ క్యూబ్‌లతో ప్రధాని మోదీ చిత్రాన్ని తీర్చిదిద్ది ఆకట్టుకున్నాడు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ‘వన్‌ నేషన్‌- వన్‌ డ్యాన్స్‌’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఓ బాలుడు పజిల్స్‌ క్యూబ్‌లతో ప్రధాని మోదీ చిత్రాన్ని తీర్చిదిద్ది ఆకట్టుకున్నాడు.
11/35
12/35
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా సత్ప్రవర్తన కలిగిన 175మంది ఖైదీలను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా సోమవారం రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి 55మంది ఖైదీలను విడుదల చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా సత్ప్రవర్తన కలిగిన 175మంది ఖైదీలను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా సోమవారం రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి 55మంది ఖైదీలను విడుదల చేశారు.
13/35
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌ సమీపంలోని బస్‌ భవన్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌, ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ విశ్రాంత ఉద్యోగులను సన్మానించారు. అనంతరం వారితో కలిసి నిజాం కాలం నాటి పురాతన బస్సులో ప్రయాణం చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌ సమీపంలోని బస్‌ భవన్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌, ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ విశ్రాంత ఉద్యోగులను సన్మానించారు. అనంతరం వారితో కలిసి నిజాం కాలం నాటి పురాతన బస్సులో ప్రయాణం చేశారు.
14/35
15/35
16/35
కాకినాడలోని పరేడ్‌ మైదానంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఫైరింజన్ల ద్వారా మువ్వన్నెల రంగుల నీటిని ప్రదర్శించి ఆకట్టుకున్నారు. కాకినాడలోని పరేడ్‌ మైదానంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఫైరింజన్ల ద్వారా మువ్వన్నెల రంగుల నీటిని ప్రదర్శించి ఆకట్టుకున్నారు.
17/35
హైదరాబాద్‌లోని బసవతారకం క్యాన్సర్‌ ఆసుపత్రిలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో సినీనటుడు బాలకృష్ణ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. హైదరాబాద్‌లోని బసవతారకం క్యాన్సర్‌ ఆసుపత్రిలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో సినీనటుడు బాలకృష్ణ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు.
18/35
19/35
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్‌ పరేడ్‌ గ్రౌండ్‌లోని అమరవీరుల స్తూపం వద్ద నివాళి అర్పించారు. ఈ సందర్భంగా దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికుల త్యాగాలను ఆయన కొనియాడారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్‌ పరేడ్‌ గ్రౌండ్‌లోని అమరవీరుల స్తూపం వద్ద నివాళి అర్పించారు. ఈ సందర్భంగా దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికుల త్యాగాలను ఆయన కొనియాడారు.
20/35
21/35
బాలీవుడ్‌ నటి ప్రీతి జింటా అమెరికాలో భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను నిర్వహించుకున్నారు. ఇందులో భాగంగా ఆమెతో పాటు తన కవల పిల్లలు జై, జియాలు జాతీయ జెండాలను పట్టుకొని దిగిన ఫొటోలను ఇన్‌స్టా ఖాతాలో పంచుకున్నారు. తన ఫాలోవర్లకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టు పెట్టారు. బాలీవుడ్‌ నటి ప్రీతి జింటా అమెరికాలో భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను నిర్వహించుకున్నారు. ఇందులో భాగంగా ఆమెతో పాటు తన కవల పిల్లలు జై, జియాలు జాతీయ జెండాలను పట్టుకొని దిగిన ఫొటోలను ఇన్‌స్టా ఖాతాలో పంచుకున్నారు. తన ఫాలోవర్లకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టు పెట్టారు.
22/35
23/35
24/35
ప్రముఖ సినీ నటుడు అల్లుఅర్జున్‌ తన నివాసం వద్ద నిర్వహించిన స్వాతంత్రోద్యమ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన గాంధీజీ చిత్రపటానికి నివాళి అర్పించారు. అనంతరం నిర్మాత అల్లు అరవింద్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రముఖ సినీ నటుడు అల్లుఅర్జున్‌ తన నివాసం వద్ద నిర్వహించిన స్వాతంత్రోద్యమ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన గాంధీజీ చిత్రపటానికి నివాళి అర్పించారు. అనంతరం నిర్మాత అల్లు అరవింద్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.
25/35
26/35
భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని దిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. జాతీయ జెండా స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలకు నిదర్శనమని ఆయన తెలిపారు. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని దిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. జాతీయ జెండా స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలకు నిదర్శనమని ఆయన తెలిపారు.
27/35
28/35
సికింద్రాబాద్‌లోని ఆర్‌ఆర్సీ గ్రౌండ్‌లో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో శునకాలు సాహస విన్యాసాలతో ఆకట్టుకున్నాయి. సికింద్రాబాద్‌లోని ఆర్‌ఆర్సీ గ్రౌండ్‌లో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో శునకాలు సాహస విన్యాసాలతో ఆకట్టుకున్నాయి.
29/35
30/35
31/35
ముంబయిలోని తన నివాసం ఆంటిలియాలో ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్‌ అధినేత ముకేశ్ అంబానీ స్వాతంత్ర్య వేడుకలు జరుపుకొన్నారు. ఆయన సతీమణి నీతా అంబానీ, మనవడు పృథ్వీ ఆకాశ్‌ అంబానీతో కలిసి త్రివర్ణ పతాకం చేతబూని ‘మా తుఝే సలాం’ అంటూ స్వతంత్ర భారతావనికి వందనం చేశారు.  ముంబయిలోని తన నివాసం ఆంటిలియాలో ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్‌ అధినేత ముకేశ్ అంబానీ స్వాతంత్ర్య వేడుకలు జరుపుకొన్నారు. ఆయన సతీమణి నీతా అంబానీ, మనవడు పృథ్వీ ఆకాశ్‌ అంబానీతో కలిసి త్రివర్ణ పతాకం చేతబూని ‘మా తుఝే సలాం’ అంటూ స్వతంత్ర భారతావనికి వందనం చేశారు.
32/35
75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ప్రజలు ఘనంగా జరుపుకొంటున్నారు. జాతీయ జెండాలు చేతబూని ‘యే హమారా తిరంగా’ అంటూ వీధుల్లో, రహదారులపై ప్రదర్శన చేస్తున్నారు. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌ వద్ద కనిపించిన సందడి ఇది. 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ప్రజలు ఘనంగా జరుపుకొంటున్నారు. జాతీయ జెండాలు చేతబూని ‘యే హమారా తిరంగా’ అంటూ వీధుల్లో, రహదారులపై ప్రదర్శన చేస్తున్నారు. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌ వద్ద కనిపించిన సందడి ఇది.
33/35
34/35
75వ స్వాతంత్య్ర వేడుకల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజ్‌ఘాట్‌ను సందర్శించారు. మహాత్ముడి సమాధిపై పూలు చల్లి ఆయన ఆశయాలను స్మరించుకున్నారు. అక్కడ నివాళులర్పించిన అనంతరం ప్రధాని ఎర్రకోటకు బయలుదేరి వెళ్లారు. 75వ స్వాతంత్య్ర వేడుకల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజ్‌ఘాట్‌ను సందర్శించారు. మహాత్ముడి సమాధిపై పూలు చల్లి ఆయన ఆశయాలను స్మరించుకున్నారు. అక్కడ నివాళులర్పించిన అనంతరం ప్రధాని ఎర్రకోటకు బయలుదేరి వెళ్లారు.
35/35

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని