చిత్రం చెప్పే సంగతులు-1 (16-08-2022)

Published : 16 Aug 2022 05:35 IST
1/8
నార్వేలోని గుడ్‌బ్రాండ్స్‌ డాలెన్‌లో లాగెన్‌ నదిపై కూలిపోయిన వంతెన నార్వేలోని గుడ్‌బ్రాండ్స్‌ డాలెన్‌లో లాగెన్‌ నదిపై కూలిపోయిన వంతెన
2/8
భారత స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా పంజాబ్‌లోని వాఘా సరిహద్దులో బీఎస్‌ఎఫ్‌ అధికారులకు మిఠాయిలు పంపిణీ చేస్తున్న పాకిస్థాన్‌ సైనికులు భారత స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా పంజాబ్‌లోని వాఘా సరిహద్దులో బీఎస్‌ఎఫ్‌ అధికారులకు మిఠాయిలు పంపిణీ చేస్తున్న పాకిస్థాన్‌ సైనికులు
3/8
దిల్లీలోని ఎర్రకోట వద్ద స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్న తెదేపా ఎంపీలు రామ్మోహన్‌నాయుడు, కనకమేడల రవీంద్రకుమార్‌ దిల్లీలోని ఎర్రకోట వద్ద స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్న తెదేపా ఎంపీలు రామ్మోహన్‌నాయుడు, కనకమేడల రవీంద్రకుమార్‌
4/8
ఐఎన్‌ఎస్‌ సుమేథ నౌక విధుల్లో భాగంగా ఆస్ట్రేలియాలోని పెర్త్‌ తీరంలో ఆగింది. ఈ నౌకపై నిర్వహించిన భారత స్వాతంత్ర్య దినోత్సవంలో రాయల్‌ ఆస్ట్రేలియా నేవీ, భారత్‌ నేవీ అధికారులు పాల్గొన్నారు ఐఎన్‌ఎస్‌ సుమేథ నౌక విధుల్లో భాగంగా ఆస్ట్రేలియాలోని పెర్త్‌ తీరంలో ఆగింది. ఈ నౌకపై నిర్వహించిన భారత స్వాతంత్ర్య దినోత్సవంలో రాయల్‌ ఆస్ట్రేలియా నేవీ, భారత్‌ నేవీ అధికారులు పాల్గొన్నారు
5/8
పంద్రాగస్టు సందర్భంగా మధ్యప్రదేశ్‌కు చెందిన పర్వతారోహకురాలు భావనా దేహరియా(30)... ఐరోపాలో అత్యంత ఎత్తయిన మౌంట్‌ ఎల్బ్రస్‌ను అధిరోహించారు. సోమవారం తెల్లవారుజామున అక్కడ త్రివర్ణ పతాకం ఎగురవేశారు. రష్యా-జార్జియా సరిహద్దుల్లో, సముద్ర మట్టానికి 5,642 మీటర్ల ఎత్తున ఎల్బ్రస్‌ శిఖరాగ్రం ఉంది. మైనస్‌ 25 డిగ్రీల సెల్సియస్‌ కంటే తక్కువ ఉష్ణోగ్రత, ఈదురు గాలులకు తోడు దృశ్య సామీప్యత తక్కువగా ఉన్న పరిస్థితుల్లో తన బృందంతో కలిసి ఈ సాహస యాత్రను పూర్తిచేసినట్టు భావన వెల్లడించారు. పంద్రాగస్టు సందర్భంగా మధ్యప్రదేశ్‌కు చెందిన పర్వతారోహకురాలు భావనా దేహరియా(30)... ఐరోపాలో అత్యంత ఎత్తయిన మౌంట్‌ ఎల్బ్రస్‌ను అధిరోహించారు. సోమవారం తెల్లవారుజామున అక్కడ త్రివర్ణ పతాకం ఎగురవేశారు. రష్యా-జార్జియా సరిహద్దుల్లో, సముద్ర మట్టానికి 5,642 మీటర్ల ఎత్తున ఎల్బ్రస్‌ శిఖరాగ్రం ఉంది. మైనస్‌ 25 డిగ్రీల సెల్సియస్‌ కంటే తక్కువ ఉష్ణోగ్రత, ఈదురు గాలులకు తోడు దృశ్య సామీప్యత తక్కువగా ఉన్న పరిస్థితుల్లో తన బృందంతో కలిసి ఈ సాహస యాత్రను పూర్తిచేసినట్టు భావన వెల్లడించారు.
6/8
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పాతర్లపాడు గ్రామానికి చెందిన కల్లు గీత కార్మికుల ఆధ్వర్యంలో స్వాతంత్య్ర వేడుకలను సోమవారం వినూత్నంగా నిర్వహించారు. గ్రామంలోని గీత కార్మికులంతా ఏకమై తాము ధరించే ముత్తాడితో గ్రామశివారులో ఉన్న కాటమయ్య ఆలయం వద్దకు చేరుకున్నారు. అక్కడున్న పొడవైన తాటిచెట్టుపైకి ఎక్కి జాతీయ పతాకాలను చేతపట్టుకొని అరగంట పాటు అలరించారు. కిందికి దిగిన తరవాత పతాకాలను ఎగురవేస్తూ జాతీయ గీతాలాపన చేశారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పాతర్లపాడు గ్రామానికి చెందిన కల్లు గీత కార్మికుల ఆధ్వర్యంలో స్వాతంత్య్ర వేడుకలను సోమవారం వినూత్నంగా నిర్వహించారు. గ్రామంలోని గీత కార్మికులంతా ఏకమై తాము ధరించే ముత్తాడితో గ్రామశివారులో ఉన్న కాటమయ్య ఆలయం వద్దకు చేరుకున్నారు. అక్కడున్న పొడవైన తాటిచెట్టుపైకి ఎక్కి జాతీయ పతాకాలను చేతపట్టుకొని అరగంట పాటు అలరించారు. కిందికి దిగిన తరవాత పతాకాలను ఎగురవేస్తూ జాతీయ గీతాలాపన చేశారు.
7/8
మూడు రంగుల విద్యుత్‌ కాంతులతో సిడ్నీలోని ఒపెరా హౌస్‌ మూడు రంగుల విద్యుత్‌ కాంతులతో సిడ్నీలోని ఒపెరా హౌస్‌
8/8
రామోజీ ఫిల్మ్‌సిటీలో సోమవారం స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. కార్పొరేట్‌ భవనం ఎదుట రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఫిల్మ్‌ సిటీ ఎండీ విజయేశ్వరి, ఇతర ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రామోజీ ఫిల్మ్‌సిటీలో సోమవారం స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. కార్పొరేట్‌ భవనం ఎదుట రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఫిల్మ్‌ సిటీ ఎండీ విజయేశ్వరి, ఇతర ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని