చిత్రం చెప్పే సంగతులు-2 (16-08-2022)

Published : 16 Aug 2022 20:05 IST
1/17
తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర 14వ రోజుకు చేరింది. విసునూరు నుంచి వడ్డెర కాలనీ, లక్ష్మీనారాయణపురం స్టేజ్, పాలకుర్తి, లక్ష్మీనారాయణపురం, తొర్రూరు, శాతపురం, ధర్మ తండా స్టేజ్ మీదుగా కడవెండి వరకు ఆయన యాత్ర సాగింది. దారి పొడవునా ప్రజా సమస్యలు తెలుసుకొంటూ బండి పాదయాత్ర చేశారు. తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర 14వ రోజుకు చేరింది. విసునూరు నుంచి వడ్డెర కాలనీ, లక్ష్మీనారాయణపురం స్టేజ్, పాలకుర్తి, లక్ష్మీనారాయణపురం, తొర్రూరు, శాతపురం, ధర్మ తండా స్టేజ్ మీదుగా కడవెండి వరకు ఆయన యాత్ర సాగింది. దారి పొడవునా ప్రజా సమస్యలు తెలుసుకొంటూ బండి పాదయాత్ర చేశారు.
2/17
3/17
చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాల్సిందిగా కోరుతూ పూతలపట్టు ఎమ్మెల్యే ఎం.ఎస్‌ బాబు.. సీఎం జగన్‌కు ఆహ్వానపత్రం అందజేశారు. సీఎం క్యాంప్‌ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో  కాణిపాకం దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్‌ ఎ.మోహన్‌రెడ్డి, ఆలయ ఈవో ఎం.వీ సురేశ్‌బాబు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాల్సిందిగా కోరుతూ పూతలపట్టు ఎమ్మెల్యే ఎం.ఎస్‌ బాబు.. సీఎం జగన్‌కు ఆహ్వానపత్రం అందజేశారు. సీఎం క్యాంప్‌ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాణిపాకం దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్‌ ఎ.మోహన్‌రెడ్డి, ఆలయ ఈవో ఎం.వీ సురేశ్‌బాబు పాల్గొన్నారు.
4/17
ఏపీ పౌరసరఫరాలశాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను దర్శించుకున్నారు. దర్శనానంతరం వేద పండితులు ఆయనకు ఆశీర్వచనం ఇచ్చి ప్రసాదం అందజేశారు. ఏపీ పౌరసరఫరాలశాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను దర్శించుకున్నారు. దర్శనానంతరం వేద పండితులు ఆయనకు ఆశీర్వచనం ఇచ్చి ప్రసాదం అందజేశారు.
5/17
చైనాకు చెందిన శాస్త్ర పరిశోధన నౌక యువాన్‌ వాంగ్ 5 శ్రీలంకలోని హంబన్‌టొటకు చేరుకుంది. ఈ నౌక రాకను కొన్ని వారాల ముందే పసిగట్టిన భారత్‌ తక్షణమే స్పందించి శ్రీలంకకు అభ్యంతరాలను తెలియజేసింది. అయితే తమ జలాల్లోకి ప్రవేశించిన తర్వాత ఆటోమేటిక్‌ ఐడెంటిఫికేషన్‌ సిస్టమ్‌ను ఆఫ్‌ చేయాలనే నిబంధనపై నౌక రాకకు అనుమతి ఇచ్చినట్లు కొలంబో అధికారులు చెబుతున్నారు. చైనాకు చెందిన శాస్త్ర పరిశోధన నౌక యువాన్‌ వాంగ్ 5 శ్రీలంకలోని హంబన్‌టొటకు చేరుకుంది. ఈ నౌక రాకను కొన్ని వారాల ముందే పసిగట్టిన భారత్‌ తక్షణమే స్పందించి శ్రీలంకకు అభ్యంతరాలను తెలియజేసింది. అయితే తమ జలాల్లోకి ప్రవేశించిన తర్వాత ఆటోమేటిక్‌ ఐడెంటిఫికేషన్‌ సిస్టమ్‌ను ఆఫ్‌ చేయాలనే నిబంధనపై నౌక రాకకు అనుమతి ఇచ్చినట్లు కొలంబో అధికారులు చెబుతున్నారు.
6/17
హైదరాబాద్‌ కూకట్‌పల్లి వద్ద ఈ ఉదయం సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా 4 కిలోమీటర్ల పొడవైన జాతీయ జెండాను ప్రదర్శించారు. కూకట్‌పల్లి నుంచి మూసాపేట వరకు జాతీయ పతాకం కనిపిస్తున్న ఈ దృశ్యం పలువురిని ఆకట్టుకుంది. హైదరాబాద్‌ కూకట్‌పల్లి వద్ద ఈ ఉదయం సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా 4 కిలోమీటర్ల పొడవైన జాతీయ జెండాను ప్రదర్శించారు. కూకట్‌పల్లి నుంచి మూసాపేట వరకు జాతీయ పతాకం కనిపిస్తున్న ఈ దృశ్యం పలువురిని ఆకట్టుకుంది.
7/17
8/17
జింబాబ్వేతో టీమ్‌ఇండియా మూడు వన్డేలు ఆడనుంది. గురువారం తొలి మ్యాచ్‌. ఇప్పటికే ఈ సిరీస్‌ కోసం భారత జట్టు హరారేలో అడుగుపెట్టింది. ప్రత్యర్థి పసికూనే అయినప్పటికీ కెప్టెన్‌ రోహిత్‌, కోహ్లి, పంత్‌, శ్రేయస్‌, బుమ్రా, షమి లాంటి ఆటగాళ్లు భారత జట్టులో లేరు. దీంతో మిగిలిన వారు గెలుపు మనదే కావాలని ఇలా మైదానంలో కృషి చేస్తున్నారు.
జింబాబ్వేతో టీమ్‌ఇండియా మూడు వన్డేలు ఆడనుంది. గురువారం తొలి మ్యాచ్‌. ఇప్పటికే ఈ సిరీస్‌ కోసం భారత జట్టు హరారేలో అడుగుపెట్టింది. ప్రత్యర్థి పసికూనే అయినప్పటికీ కెప్టెన్‌ రోహిత్‌, కోహ్లి, పంత్‌, శ్రేయస్‌, బుమ్రా, షమి లాంటి ఆటగాళ్లు భారత జట్టులో లేరు. దీంతో మిగిలిన వారు గెలుపు మనదే కావాలని ఇలా మైదానంలో కృషి చేస్తున్నారు.
9/17
10/17
విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ నివాసానికి ఏపీ సీఎం జగన్‌ వెళ్లారు. ఇటీవలే వాసుపల్లి కుమారుడు సూర్యకు రాశితో వివాహం జరిగింది. ఈ నూతన దంపతులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆశీర్వదించారు.  విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ నివాసానికి ఏపీ సీఎం జగన్‌ వెళ్లారు. ఇటీవలే వాసుపల్లి కుమారుడు సూర్యకు రాశితో వివాహం జరిగింది. ఈ నూతన దంపతులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆశీర్వదించారు.
11/17
దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటం వద్ద పూలు చల్లి నివాళులర్పిస్తున్న ఏపీ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటం వద్ద పూలు చల్లి నివాళులర్పిస్తున్న ఏపీ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు
12/17
దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించిన లెజెండరీ లీడర్ వాజ్‌పేయీ మాత్రమేనని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ వర్ధంతి సందర్భంగా రాజ్‌భవన్‌లోని దర్బార్ హాల్‌లో ఆయన చిత్రపటానికి గవర్నర్‌ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.  దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించిన లెజెండరీ లీడర్ వాజ్‌పేయీ మాత్రమేనని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ వర్ధంతి సందర్భంగా రాజ్‌భవన్‌లోని దర్బార్ హాల్‌లో ఆయన చిత్రపటానికి గవర్నర్‌ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
13/17
స్వాతంత్ర్య భారత వజ్రోత్సవాల్లో భాగంగా సీఎం కేసీఆర్‌ ఇచ్చిన పిలుపుమేరకు యావత్‌ తెలంగాణ జాతీయ గీతం ‘జనగణమన’తో మారుమోగింది. కరీంనగర్‌లోని గీతా భవన్‌ కూడలిలో విద్యార్థులు జాతీయ జెండాలు పట్టుకొని జాతీయగీతం ఆలపించారు. అదే సమయంలో కొందరు కొలిమి పని చేసే శ్రామికులు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొని దేశభక్తిని చాటారు. స్వాతంత్ర్య భారత వజ్రోత్సవాల్లో భాగంగా సీఎం కేసీఆర్‌ ఇచ్చిన పిలుపుమేరకు యావత్‌ తెలంగాణ జాతీయ గీతం ‘జనగణమన’తో మారుమోగింది. కరీంనగర్‌లోని గీతా భవన్‌ కూడలిలో విద్యార్థులు జాతీయ జెండాలు పట్టుకొని జాతీయగీతం ఆలపించారు. అదే సమయంలో కొందరు కొలిమి పని చేసే శ్రామికులు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొని దేశభక్తిని చాటారు.
14/17
15/17
తాను కదల్లేని స్థితిలో ఉన్నా.. భారతీయులందరి మనసులు కదిలించేలా ఈ చిత్రం గీశాడు దివ్యాంగ కళాకారుడు ఆయుష్‌ కుందాల్‌. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కాలితో కుంచె పట్టి భరత మాతకు జవాన్‌ సెల్యూట్ చేస్తున్న ఈ చిత్రాన్ని అందంగా తీర్చిదిద్దాడు. దీన్ని ఆయుష్‌ తన ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేయగా.. నెటిజన్ల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తాను కదల్లేని స్థితిలో ఉన్నా.. భారతీయులందరి మనసులు కదిలించేలా ఈ చిత్రం గీశాడు దివ్యాంగ కళాకారుడు ఆయుష్‌ కుందాల్‌. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కాలితో కుంచె పట్టి భరత మాతకు జవాన్‌ సెల్యూట్ చేస్తున్న ఈ చిత్రాన్ని అందంగా తీర్చిదిద్దాడు. దీన్ని ఆయుష్‌ తన ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేయగా.. నెటిజన్ల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
16/17
17/17
ఖమ్మం గ్రామీణ మండలం తెల్దారుపల్లిలో దారుణ హత్యకు గురైన తమ్మినేని కృష్ణయ్య మృతదేహం వద్ద మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నివాళులర్పించారు. భారీగా తరలివచ్చిన గ్రామస్థులతో పాటు ఆయన అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఖమ్మం గ్రామీణ మండలం తెల్దారుపల్లిలో దారుణ హత్యకు గురైన తమ్మినేని కృష్ణయ్య మృతదేహం వద్ద మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నివాళులర్పించారు. భారీగా తరలివచ్చిన గ్రామస్థులతో పాటు ఆయన అంతిమయాత్రలో పాల్గొన్నారు.

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని