News In Pics: చిత్రం చెప్పే సంగతులు-1 (17-08-2022)

Updated : 17 Aug 2022 11:42 IST
1/22
ప్రముఖ సినీ నటి ఊహ తన కుటుంబ సభ్యులతో మంగళవారం మోపిదేవి శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆమెతో పాటు కుమారులు రోహన్, రోషన్, కుమార్తె మేధ కూడా ఉన్నారు.


ప్రముఖ సినీ నటి ఊహ తన కుటుంబ సభ్యులతో మంగళవారం మోపిదేవి శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆమెతో పాటు కుమారులు రోహన్, రోషన్, కుమార్తె మేధ కూడా ఉన్నారు.
2/22
 వజ్రపుకొత్తూరు మండలం చీపురుపల్లి పంచాయతీ పరిధి డెప్పూరు గ్రామదేవత ఆలయం వద్ద మంగళవారం రాత్రి ఎలుగుబంటి హల్‌చల్‌ చేసింది. ప్రాంగణంలో కలియ తిరుగుతూ అలజడి రేపింది. ఇటీవల జరిగిన ఘటనలతో నేపథ్యంలో ఎలుగు మాట వింటేనే స్థానికులు భయపడుతున్నారు. దీంతో తలుపులు మూసుకొని ఇళ్లలోనే ఉండిపోయారు. కొంత సమయం తర్వాత ఎలుగు సమీప తోటల్లోకి వెళ్లిపోయినట్లు స్థానికులు పేర్కొన్నారు.  


వజ్రపుకొత్తూరు మండలం చీపురుపల్లి పంచాయతీ పరిధి డెప్పూరు గ్రామదేవత ఆలయం వద్ద మంగళవారం రాత్రి ఎలుగుబంటి హల్‌చల్‌ చేసింది. ప్రాంగణంలో కలియ తిరుగుతూ అలజడి రేపింది. ఇటీవల జరిగిన ఘటనలతో నేపథ్యంలో ఎలుగు మాట వింటేనే స్థానికులు భయపడుతున్నారు. దీంతో తలుపులు మూసుకొని ఇళ్లలోనే ఉండిపోయారు. కొంత సమయం తర్వాత ఎలుగు సమీప తోటల్లోకి వెళ్లిపోయినట్లు స్థానికులు పేర్కొన్నారు.
3/22
వైయస్‌ఆర్‌ జిల్లా ఒంటిమిట్ట మండల పరిధిలో పెన్నానది తీరం హరిత వర్ణ శోభితంతో కనువిందు చేస్తోంది. పినాకిని పరివాహకంలో ఉన్న పల్లెసీమలు పాడి పంటలకు నెలవు. చెంతనే పెన్నమ్మ పరుగులు తీస్తోంది. ఏటి ఒడ్డున ఉన్న సారవంతమైన భూముల్లో విస్తారంగా వరి పంట సాగు చేశారు. వేరుసెనగ, పసుపు, దోస, చామంతి, టమోటా, మామిడి, టేకు కూడా వేశారు. అడుగడుగునా పచ్చని సోయగం రా.. రామ్మంటూ స్వాగతం పలుకుతోంది.  వైయస్‌ఆర్‌ జిల్లా ఒంటిమిట్ట మండల పరిధిలో పెన్నానది తీరం హరిత వర్ణ శోభితంతో కనువిందు చేస్తోంది. పినాకిని పరివాహకంలో ఉన్న పల్లెసీమలు పాడి పంటలకు నెలవు. చెంతనే పెన్నమ్మ పరుగులు తీస్తోంది. ఏటి ఒడ్డున ఉన్న సారవంతమైన భూముల్లో విస్తారంగా వరి పంట సాగు చేశారు. వేరుసెనగ, పసుపు, దోస, చామంతి, టమోటా, మామిడి, టేకు కూడా వేశారు. అడుగడుగునా పచ్చని సోయగం రా.. రామ్మంటూ స్వాగతం పలుకుతోంది.
4/22
వరంగల్‌ కాశీబుగ్గ సొసైటీ కాలనీలోని మంచినీటి సరఫరా ట్యాంకు నిండిపోయి మంగళవారం పెద్ద మొత్తంలో మంచినీరు వృథాగా రోడ్ల వెంట ప్రవహించింది. వాటర్‌ ట్యాంకు నిర్వహణలో సాంకేతిక సమస్య కారణంగా విలువైన మంచి నీరు సొసైటీ కాలనీ, కాశీబుగ్గ ఏకలవ్య వీధిని చుట్టుముట్టేసింది. కుండపోత వర్షం కురిసినప్పుడు కూడా రానంతగా నీరు ప్రవహించి ఇళ్లలోకి  కూడా రావడంతో స్థానికులు ఆందోళనకు లోనయ్యారు.  వరంగల్‌ కాశీబుగ్గ సొసైటీ కాలనీలోని మంచినీటి సరఫరా ట్యాంకు నిండిపోయి మంగళవారం పెద్ద మొత్తంలో మంచినీరు వృథాగా రోడ్ల వెంట ప్రవహించింది. వాటర్‌ ట్యాంకు నిర్వహణలో సాంకేతిక సమస్య కారణంగా విలువైన మంచి నీరు సొసైటీ కాలనీ, కాశీబుగ్గ ఏకలవ్య వీధిని చుట్టుముట్టేసింది. కుండపోత వర్షం కురిసినప్పుడు కూడా రానంతగా నీరు ప్రవహించి ఇళ్లలోకి కూడా రావడంతో స్థానికులు ఆందోళనకు లోనయ్యారు.
5/22
6/22
నల్గొండ జిల్లా పీఏపల్లి మండలం కోదండాపురం మెట్రోవాటర్‌ ట్రీట్‌మెంటు ప్లాంటు నుంచి జంటనగరాలకు నీటిని సరఫరా చేసే మొదటి ఫేజ్‌ పైపులైన్‌ ఎయిర్‌వాల్వ్‌ నుంచి మంగళవారం ఉదయం కృష్ణమ్మ ఎగిసిపడింది. ప్లాంటులో మరమ్మతులు, పైపులైన్‌పై ఎయిర్‌ వాల్వ్‌ల మార్పిడికి నీటిని తొలగించే ప్రక్రియలో భాగంగా పీఏపల్లి మండలం రంగారెడ్డిగూడెం స్టేజీ వద్ద ఏఎమ్మార్పీ కాల్వపై ఎయిర్‌వాల్వ్‌ తొలగించడంతో ఇలా పెద్దఎత్తున నీరు విడుదలైంది.  నల్గొండ జిల్లా పీఏపల్లి మండలం కోదండాపురం మెట్రోవాటర్‌ ట్రీట్‌మెంటు ప్లాంటు నుంచి జంటనగరాలకు నీటిని సరఫరా చేసే మొదటి ఫేజ్‌ పైపులైన్‌ ఎయిర్‌వాల్వ్‌ నుంచి మంగళవారం ఉదయం కృష్ణమ్మ ఎగిసిపడింది. ప్లాంటులో మరమ్మతులు, పైపులైన్‌పై ఎయిర్‌ వాల్వ్‌ల మార్పిడికి నీటిని తొలగించే ప్రక్రియలో భాగంగా పీఏపల్లి మండలం రంగారెడ్డిగూడెం స్టేజీ వద్ద ఏఎమ్మార్పీ కాల్వపై ఎయిర్‌వాల్వ్‌ తొలగించడంతో ఇలా పెద్దఎత్తున నీరు విడుదలైంది.
7/22
దేశ స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా సిద్దిపేట పట్టణ పరిధి నర్సాపూర్‌లో గీత కార్మికులు తాటి చెట్టు పైకి ఎక్కి జాతీయ జెండాలను ప్రదర్శించి తమ దేశభక్తిని చాటుకున్నారు. 15 మంది కార్మికులు ఎక్కారు. అనంతరం జాతీయ గీతాలాపన చేశారు. ప్రదర్శనలో గౌడ సంఘం అధ్యక్షుడు ప్రభాకర్‌గౌడ్, సభ్యులు జనార్దన్, నారాయణ, శ్రీనివాస్, రామాగౌడ్, ఎల్లాగౌడ్‌ తదితరులు ఉన్నారు. దేశ స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా సిద్దిపేట పట్టణ పరిధి నర్సాపూర్‌లో గీత కార్మికులు తాటి చెట్టు పైకి ఎక్కి జాతీయ జెండాలను ప్రదర్శించి తమ దేశభక్తిని చాటుకున్నారు. 15 మంది కార్మికులు ఎక్కారు. అనంతరం జాతీయ గీతాలాపన చేశారు. ప్రదర్శనలో గౌడ సంఘం అధ్యక్షుడు ప్రభాకర్‌గౌడ్, సభ్యులు జనార్దన్, నారాయణ, శ్రీనివాస్, రామాగౌడ్, ఎల్లాగౌడ్‌ తదితరులు ఉన్నారు.
8/22
వజ్రోత్సవ వేళ.. ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఈత కొలనులో శిక్షకుడు కొమ్ము కృష్ణ, లైఫ్‌ గార్డులు వీజీఎస్‌.రాకేష్, వంశీకృష్ణ, స్వామి ఆధ్వర్యంలో దాదాపు 40 మంది సాధకులు జాతీయ జెండాలతో జల విన్యాసం చేశారు. వర్షాన్ని లెక్క చేయకుండా జెండాలు పట్టుకొని ఒంటి చేత్తో (బ్యాక్‌ స్ట్రోక్‌) ఈత కొట్టారు. వివిధ రకాల పిరమిడ్‌గా ఏర్పడ్డారు. వజ్రోత్సవ వేళ.. ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఈత కొలనులో శిక్షకుడు కొమ్ము కృష్ణ, లైఫ్‌ గార్డులు వీజీఎస్‌.రాకేష్, వంశీకృష్ణ, స్వామి ఆధ్వర్యంలో దాదాపు 40 మంది సాధకులు జాతీయ జెండాలతో జల విన్యాసం చేశారు. వర్షాన్ని లెక్క చేయకుండా జెండాలు పట్టుకొని ఒంటి చేత్తో (బ్యాక్‌ స్ట్రోక్‌) ఈత కొట్టారు. వివిధ రకాల పిరమిడ్‌గా ఏర్పడ్డారు.
9/22
స్వాతంత్య్ర వజ్రోత్సవాల వేళ ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు ప్రత్యేక వేషధారణతో తన దేశభక్తిని చాటుకున్నాడు. కోటపల్లి మండలం భావనపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు బొలిశెట్టి బుచ్చన్న జాతిపిత మహాత్మాగాంధీ వేషధారణతో ఆకట్టుకున్నాడు.  స్వాతంత్య్ర వజ్రోత్సవాల వేళ ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు ప్రత్యేక వేషధారణతో తన దేశభక్తిని చాటుకున్నాడు. కోటపల్లి మండలం భావనపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు బొలిశెట్టి బుచ్చన్న జాతిపిత మహాత్మాగాంధీ వేషధారణతో ఆకట్టుకున్నాడు.
10/22
ఆదిలాబాద్‌ గ్రామీణ మండలంలోని లాండసాంగ్వీ గ్రామానికి వెళ్లే రహదారి అధిక వర్షానికి ఏడు అడుగుల ఎత్తులో కోతకు గురైంది. లాండసాంగ్వీ, అర్లి(బి), అడతో పాటు పలు గ్రామాల ప్రజలు నిత్యం ఈ రహదారి గుండా రాకపోకలు సాగిస్తుంటారు. నెల రోజుల కిందట ప్రజాప్రతినిధులు, అధికారులు కోతకు గురైన ఈ రహదారిని పరిశీలించారు. ఆ తర్వాత పట్టించుకోవడం లేదు. దీంతో చోదకులు ప్రయాణించాలంటే జంకుతున్నారు.  ఆదిలాబాద్‌ గ్రామీణ మండలంలోని లాండసాంగ్వీ గ్రామానికి వెళ్లే రహదారి అధిక వర్షానికి ఏడు అడుగుల ఎత్తులో కోతకు గురైంది. లాండసాంగ్వీ, అర్లి(బి), అడతో పాటు పలు గ్రామాల ప్రజలు నిత్యం ఈ రహదారి గుండా రాకపోకలు సాగిస్తుంటారు. నెల రోజుల కిందట ప్రజాప్రతినిధులు, అధికారులు కోతకు గురైన ఈ రహదారిని పరిశీలించారు. ఆ తర్వాత పట్టించుకోవడం లేదు. దీంతో చోదకులు ప్రయాణించాలంటే జంకుతున్నారు.
11/22
దిల్లీలో మంగళవారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో భేటీ అయిన ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ దిల్లీలో మంగళవారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో భేటీ అయిన ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌
12/22
కర్నూలు జిల్లా హాల్వహర్వి మండలం మాచనూరు వద్ద కల్వర్టు వంతెన ఐదేళ్ల క్రితం కురిసిన వర్షాలకు ధ్వంసమైంది. నేటికీ ఆ శిథిలాలు అలానే ఉన్నాయి. అధికారులు, నాయకులెవ్వరికీ అక్కడో కొత్త కల్వర్టు నిర్మించాలనే ఆలోచనే రాలేదు. కనీసం అక్కడున్న శిథిలాలనూ తొలగించలేదు. ప్రజలు అటు నుంచి నడిచి వెళ్లేందుకూ సాధ్యం కావడం లేదు. దీంతో వాగులోంచి రాకపోకలు సాగిస్తున్నారు.  కర్నూలు జిల్లా హాల్వహర్వి మండలం మాచనూరు వద్ద కల్వర్టు వంతెన ఐదేళ్ల క్రితం కురిసిన వర్షాలకు ధ్వంసమైంది. నేటికీ ఆ శిథిలాలు అలానే ఉన్నాయి. అధికారులు, నాయకులెవ్వరికీ అక్కడో కొత్త కల్వర్టు నిర్మించాలనే ఆలోచనే రాలేదు. కనీసం అక్కడున్న శిథిలాలనూ తొలగించలేదు. ప్రజలు అటు నుంచి నడిచి వెళ్లేందుకూ సాధ్యం కావడం లేదు. దీంతో వాగులోంచి రాకపోకలు సాగిస్తున్నారు.
13/22
దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిగా జైల్లో ఉన్న వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు కోసం తూర్పుగోదావరి జడ్పీ సమావేశంలో కేటాయించిన సీటు. అనంతబాబు ఖైదీగా ఉన్నారని తెలిసినా.. ప్రొటోకాల్‌ ప్రకారం ముందు వరుసలో కుర్చీ వేయడం చర్చనీయాంశమైంది. దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిగా జైల్లో ఉన్న వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు కోసం తూర్పుగోదావరి జడ్పీ సమావేశంలో కేటాయించిన సీటు. అనంతబాబు ఖైదీగా ఉన్నారని తెలిసినా.. ప్రొటోకాల్‌ ప్రకారం ముందు వరుసలో కుర్చీ వేయడం చర్చనీయాంశమైంది.
14/22
ఓవైపు గోదావరి వరద, మరోవైపు విద్యుత్తు సరఫరా నిలిపివేతతో అంధకారంలో మగ్గుతున్నామని అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం మురుమూరు గ్రామస్థులు మంగళవారం ప్రధాన రహదారిపై కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. గ్రామాన్ని వరద చుట్టుముట్టిందని, బయటికి వెళ్లేందుకు దారులు మూసుకుపోయాయని వాపోయారు.  ఓవైపు గోదావరి వరద, మరోవైపు విద్యుత్తు సరఫరా నిలిపివేతతో అంధకారంలో మగ్గుతున్నామని అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం మురుమూరు గ్రామస్థులు మంగళవారం ప్రధాన రహదారిపై కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. గ్రామాన్ని వరద చుట్టుముట్టిందని, బయటికి వెళ్లేందుకు దారులు మూసుకుపోయాయని వాపోయారు.
15/22
వర్షాలకు పాత భవనాలు కూలి ప్రమాదాలు జరుగుతున్నాయి. అయినా జీహెచ్‌ఎంసీ అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. కోఠి నుంచి చాదర్‌ఘాట్‌ మార్గంలోని ఓ పాత భవంతిలో రావి మొక్క మొలిచి గోడలు బీటలు వారాయి. గోడలు కూలే అవకాశం ఉంది. వర్షాలకు పాత భవనాలు కూలి ప్రమాదాలు జరుగుతున్నాయి. అయినా జీహెచ్‌ఎంసీ అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. కోఠి నుంచి చాదర్‌ఘాట్‌ మార్గంలోని ఓ పాత భవంతిలో రావి మొక్క మొలిచి గోడలు బీటలు వారాయి. గోడలు కూలే అవకాశం ఉంది.
16/22
హైదరాబాద్‌ - మాదాపూర్‌ సైబర్‌ కూడలిలో జాతీయ గీతాలాపనకు నిలిచిన వాహనదారులు.. హైదరాబాద్‌ - మాదాపూర్‌ సైబర్‌ కూడలిలో జాతీయ గీతాలాపనకు నిలిచిన వాహనదారులు..
17/22
వేములవాడ రాజన్న ఆలయం వద్ద ఇలా.. వేములవాడ రాజన్న ఆలయం వద్ద ఇలా..
18/22
దేశమంతా స్వాతంత్ర్య అమృతోత్సవాలు జరుపుకొంటున్న వేళ.. కర్ణాటకలోని చామరాజ నగర్‌ జిల్లాకు చెందిన హనీ అనే బాలిక సైనికుడిగా పని చేసిన తండ్రి సమాధి ముందు వేణువుతో జాతీయగీతం ఆలపించింది. గౌడహళ్లి గ్రామవాసి, విశ్రాంత సైనికుడైన నవీన్‌ ఓ ప్రమాదంలో మరణించారు. అప్పటి నుంచీ ఆయన కుటుంబం ఏటా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా నివాళులర్పిస్తోంది. సోమవారం నవీన్‌ సమాధి ముందు హనీ వేణువుతో జాతీయ గీతాన్ని ఆలపిస్తూ అంజలి ఘటించింది. దేశమంతా స్వాతంత్ర్య అమృతోత్సవాలు జరుపుకొంటున్న వేళ.. కర్ణాటకలోని చామరాజ నగర్‌ జిల్లాకు చెందిన హనీ అనే బాలిక సైనికుడిగా పని చేసిన తండ్రి సమాధి ముందు వేణువుతో జాతీయగీతం ఆలపించింది. గౌడహళ్లి గ్రామవాసి, విశ్రాంత సైనికుడైన నవీన్‌ ఓ ప్రమాదంలో మరణించారు. అప్పటి నుంచీ ఆయన కుటుంబం ఏటా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా నివాళులర్పిస్తోంది. సోమవారం నవీన్‌ సమాధి ముందు హనీ వేణువుతో జాతీయ గీతాన్ని ఆలపిస్తూ అంజలి ఘటించింది.
19/22
స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ పిలుపు మేరకు తెలంగాణ వ్యాప్తంగా మంగళవారం ఉదయం 11.30 గంటలకు సామూహిక జాతీయ గీతాలాపన నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా రహదారులపై కూడళ్లలో వాహనాలను నిలిపివేసి.. వాహనదారులు, పోలీసులు ప్రజలు అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. చిత్రంలో జనగామలో జాతీయ గీతాలాపనలో పాల్గొన్న విద్యార్థులు, ప్రజలు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ పిలుపు మేరకు తెలంగాణ వ్యాప్తంగా మంగళవారం ఉదయం 11.30 గంటలకు సామూహిక జాతీయ గీతాలాపన నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా రహదారులపై కూడళ్లలో వాహనాలను నిలిపివేసి.. వాహనదారులు, పోలీసులు ప్రజలు అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. చిత్రంలో జనగామలో జాతీయ గీతాలాపనలో పాల్గొన్న విద్యార్థులు, ప్రజలు.
20/22
హైదరాబాద్‌ జుమేరాత్‌ బజార్‌లో రోడ్డుకి ఇరువైపులా ఉన్న ఎత్తైన రెండు భవనాలకు నిలువుగా వేలాడదీసిన పెద్ద జాతీయ పతాకం ఇది. హైదరాబాద్‌ జుమేరాత్‌ బజార్‌లో రోడ్డుకి ఇరువైపులా ఉన్న ఎత్తైన రెండు భవనాలకు నిలువుగా వేలాడదీసిన పెద్ద జాతీయ పతాకం ఇది.
21/22
అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రం పిట్స్‌బర్గ్‌లోని శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో ఆగస్టు 10 నుంచి 14 వరకు నక్షత్రశాంతి ఆగమోక్త ఆచారాలతో సహస్ర కలశాభిషేకం నిర్వహించారు. 25 మంది అర్చకుల ఆధ్వర్యంలో వేదమంత్ర పఠనం, శాంతిమంత్ర జపాలు చేశారు. అమెరికాలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రం పిట్స్‌బర్గ్‌లోని శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో ఆగస్టు 10 నుంచి 14 వరకు నక్షత్రశాంతి ఆగమోక్త ఆచారాలతో సహస్ర కలశాభిషేకం నిర్వహించారు. 25 మంది అర్చకుల ఆధ్వర్యంలో వేదమంత్ర పఠనం, శాంతిమంత్ర జపాలు చేశారు. అమెరికాలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు.
22/22
శ్రావణ మంగళవారం పురస్కరించుకొని నారాయణగూడలోని శ్రీ భూలక్ష్మీ దుర్గాదేవి ఆలయంలో అమ్మవారిని 30 రకాలు, 38,400 గాజులతో ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు పెద్దసంఖ్యలో దర్శించుకొని పూజలుచేశారు. శ్రావణ మంగళవారం పురస్కరించుకొని నారాయణగూడలోని శ్రీ భూలక్ష్మీ దుర్గాదేవి ఆలయంలో అమ్మవారిని 30 రకాలు, 38,400 గాజులతో ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు పెద్దసంఖ్యలో దర్శించుకొని పూజలుచేశారు.

మరిన్ని