News In Pics: చిత్రం చెప్పే సంగతులు-2 (17-08-2022)

Published : 17 Aug 2022 21:03 IST
1/27
హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలంగాణ ఆదివాసీల పండగ తీజ్‌ను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఓయూ విద్యార్థులతో కలిసి ఈస్ట్‌ జోన్‌ డీసీపీ చక్రవర్తి, ఓయూ ఇన్‌స్పెక్టర్‌ రమేశ్‌ నాయక్‌ నృత్యాలు చేశారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలంగాణ ఆదివాసీల పండగ తీజ్‌ను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఓయూ విద్యార్థులతో కలిసి ఈస్ట్‌ జోన్‌ డీసీపీ చక్రవర్తి, ఓయూ ఇన్‌స్పెక్టర్‌ రమేశ్‌ నాయక్‌ నృత్యాలు చేశారు.
2/27
3/27
4/27
వినాయకచవితి పర్వదినం కోసం హైదరాబాద్‌లో పలువురు కళాకారులు పర్యావరణ హితమైన మట్టి వినాయకులను తీర్చిదిద్దుతూ కనిపించారు. వినాయకచవితి పర్వదినం కోసం హైదరాబాద్‌లో పలువురు కళాకారులు పర్యావరణ హితమైన మట్టి వినాయకులను తీర్చిదిద్దుతూ కనిపించారు.
5/27
6/27
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు వైతెపా అధ్యక్షురాలు షర్మిల హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు వైతెపా అధ్యక్షురాలు షర్మిల హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
7/27
ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా ఆసక్తికర ఫొటోను తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. ఇది సాకర్‌ లీగ్‌ అని, తాను కచ్చితంగా ఫాలో అవుతానని పోస్టు పెట్టారు. ఇదో అందమైన ప్రీమియర్‌ సోలార్‌ లీగ్‌ అని తెలిపారు. నిజానికి ఈ ఫొటోలు తీసిన వాళ్ల సృజనాత్మకతను ఎవరైనా మెచ్చుకొని తీరాల్సిందే. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా ఆసక్తికర ఫొటోను తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. ఇది సాకర్‌ లీగ్‌ అని, తాను కచ్చితంగా ఫాలో అవుతానని పోస్టు పెట్టారు. ఇదో అందమైన ప్రీమియర్‌ సోలార్‌ లీగ్‌ అని తెలిపారు. నిజానికి ఈ ఫొటోలు తీసిన వాళ్ల సృజనాత్మకతను ఎవరైనా మెచ్చుకొని తీరాల్సిందే.
8/27
స్పెయిన్‌లోని బీజిస్‌లో కార్చిచ్చు సంభవించింది. దీంతో అగ్నిమాపక దళానికి చెందిన హెలికాప్టర్లు మంటలను ఆర్పేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. ఈ ఒక్క ఏడాదిలోనే స్పెయిన్‌లో 2.75లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో కార్చిచ్చులు సంభవించినట్లు అక్కడి అధికారులు తెలిపారు. ఇది దేశంలో ఒక ఏడాది సరాసరి సగటు కార్చిచ్చుల విస్తీర్ణం 67వేల హెక్టార్లకు నాలుగు రెట్లు అని వివరించారు.. స్పెయిన్‌లోని బీజిస్‌లో కార్చిచ్చు సంభవించింది. దీంతో అగ్నిమాపక దళానికి చెందిన హెలికాప్టర్లు మంటలను ఆర్పేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. ఈ ఒక్క ఏడాదిలోనే స్పెయిన్‌లో 2.75లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో కార్చిచ్చులు సంభవించినట్లు అక్కడి అధికారులు తెలిపారు. ఇది దేశంలో ఒక ఏడాది సరాసరి సగటు కార్చిచ్చుల విస్తీర్ణం 67వేల హెక్టార్లకు నాలుగు రెట్లు అని వివరించారు..
9/27
10/27
బ్రిటన్‌ ప్రధాని పదవికి పోటీ చేస్తున్న భారత సంతతి వ్యక్తి రిషి సునాక్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా థేల్స్‌ డిఫెన్స్‌ సిస్టమ్ ప్లాంట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి నుంచి ఉక్రెయిన్‌కు సరఫరా చేయనున్న యాంటీ టాంక్‌ లాంచర్‌ను ఆయన పరిశీలించారు. బ్రిటన్‌ ప్రధాని పదవికి పోటీ చేస్తున్న భారత సంతతి వ్యక్తి రిషి సునాక్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా థేల్స్‌ డిఫెన్స్‌ సిస్టమ్ ప్లాంట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి నుంచి ఉక్రెయిన్‌కు సరఫరా చేయనున్న యాంటీ టాంక్‌ లాంచర్‌ను ఆయన పరిశీలించారు.
11/27
ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌, హర్‌ ఘర్‌ తిరంగాలో భాగంగా హైదరాబాద్‌లోని శిల్పారామంలో తెలుగు స్వాతంత్ర్య సమరయోధుల ఫొటో ఎగ్జిబిషన్‌ ప్రారంభించారు. కార్యక్రమానికి పలు పాఠశాలల విద్యార్థులు, నగరవాసులు హాజరై ఫ్రీడమ్‌ ఫైటర్స్‌కు చెయ్యెత్తి జై కొట్టారు.. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌, హర్‌ ఘర్‌ తిరంగాలో భాగంగా హైదరాబాద్‌లోని శిల్పారామంలో తెలుగు స్వాతంత్ర్య సమరయోధుల ఫొటో ఎగ్జిబిషన్‌ ప్రారంభించారు. కార్యక్రమానికి పలు పాఠశాలల విద్యార్థులు, నగరవాసులు హాజరై ఫ్రీడమ్‌ ఫైటర్స్‌కు చెయ్యెత్తి జై కొట్టారు..
12/27
13/27
పర్యావరణ శాస్త్రవేత్త బ్రియాన్‌ బెడ్రోసియాన్‌ యూఎస్‌లోని వ్యోమింగ్‌ రాష్ట్రంలో ఓ గద్దకు ట్రాకింగ్‌ పరికరాన్ని అమర్చి తిరిగి దాని గూటికి చేర్చారు. అక్కడ వేట, వాహనాలు ఢీకొనడం కారణంగా గద్దలు పెద్ద సంఖ్యలో మృతి చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో వాటి మనుగడును కనిపెడుతూ.. సంఖ్యను లెక్కపెట్టేందుకు గద్దలకు ట్రాకింగ్‌ వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నారు. పర్యావరణ శాస్త్రవేత్త బ్రియాన్‌ బెడ్రోసియాన్‌ యూఎస్‌లోని వ్యోమింగ్‌ రాష్ట్రంలో ఓ గద్దకు ట్రాకింగ్‌ పరికరాన్ని అమర్చి తిరిగి దాని గూటికి చేర్చారు. అక్కడ వేట, వాహనాలు ఢీకొనడం కారణంగా గద్దలు పెద్ద సంఖ్యలో మృతి చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో వాటి మనుగడును కనిపెడుతూ.. సంఖ్యను లెక్కపెట్టేందుకు గద్దలకు ట్రాకింగ్‌ వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నారు.
14/27
ఇండోనేషియాలో 77వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా జకర్తాలోని ఆంకోల్‌ బీచ్‌లో గ్రీజ్డ్‌ పోల్‌ క్లైంబింగ్‌ పోటీలు నిర్వహించారు. గ్రీజు రాసిన స్తంభాన్ని చాకచక్యంగా ఎక్కి పైన ఉంచిన బహుమతులు ఇందులో పాల్గొనేవారు తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇండోనేషియాలో 77వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా జకర్తాలోని ఆంకోల్‌ బీచ్‌లో గ్రీజ్డ్‌ పోల్‌ క్లైంబింగ్‌ పోటీలు నిర్వహించారు. గ్రీజు రాసిన స్తంభాన్ని చాకచక్యంగా ఎక్కి పైన ఉంచిన బహుమతులు ఇందులో పాల్గొనేవారు తెచ్చుకోవాల్సి ఉంటుంది.
15/27
16/27
విజయ్‌ దేవరకొండ, అనన్య పాండే జంటగా నటించిన సినిమా లైగర్‌. ఈ నెల 25న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా విజయ్‌ దేవరకొండ అమ్మ తన ఇంటి వద్ద సినిమా విజయం సాధించాలని ప్రత్యేక పూజలు చేశారు. చిత్రబృందంతో పాటు తన కుమారుడు విజయ్‌ దేవరకొండను ఆశీర్వదించారు. విజయ్‌ దేవరకొండ, అనన్య పాండే జంటగా నటించిన సినిమా లైగర్‌. ఈ నెల 25న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా విజయ్‌ దేవరకొండ అమ్మ తన ఇంటి వద్ద సినిమా విజయం సాధించాలని ప్రత్యేక పూజలు చేశారు. చిత్రబృందంతో పాటు తన కుమారుడు విజయ్‌ దేవరకొండను ఆశీర్వదించారు.
17/27
18/27
సత్యసాయి జిల్లాలోని హిందూపురంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సందడి చేశారు. నియోజకవర్గంలో రెండు రోజుల పర్యటనకు విచ్చేసిన ఆయనకు తూముకుంట చెక్‌పోస్ట్‌ వద్ద తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. అనంతరం బాలయ్య తన సతీమణి వసుంధరాదేవితో కలిసి హిందూపురం గ్రామీణ మండలం చలివెందలలో ఎన్టీఆర్‌ ఆరోగ్య రథాన్ని ప్రారంభించారు. సత్యసాయి జిల్లాలోని హిందూపురంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సందడి చేశారు. నియోజకవర్గంలో రెండు రోజుల పర్యటనకు విచ్చేసిన ఆయనకు తూముకుంట చెక్‌పోస్ట్‌ వద్ద తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. అనంతరం బాలయ్య తన సతీమణి వసుంధరాదేవితో కలిసి హిందూపురం గ్రామీణ మండలం చలివెందలలో ఎన్టీఆర్‌ ఆరోగ్య రథాన్ని ప్రారంభించారు.
19/27
తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల మండలంలో ప్రజా సంగ్రామయాత్ర చేస్తున్నారు. ఇవాళ అప్పిరెడ్డిపల్లి క్రాస్‌రోడ్ వద్ద ఆయన పాదయాత్ర వెయ్యి కిలోమీటర్ల మైలురాయిని చేరింది. ఈ సందర్భంగా ఆయన మొక్క నాటి పైలాన్‌ను ఆవిష్కరించారు. తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల మండలంలో ప్రజా సంగ్రామయాత్ర చేస్తున్నారు. ఇవాళ అప్పిరెడ్డిపల్లి క్రాస్‌రోడ్ వద్ద ఆయన పాదయాత్ర వెయ్యి కిలోమీటర్ల మైలురాయిని చేరింది. ఈ సందర్భంగా ఆయన మొక్క నాటి పైలాన్‌ను ఆవిష్కరించారు.
20/27
21/27
22/27
స్వాతంత్ర్య భారత వజ్రోత్సవంలో భాగంగా హైదరాబాద్‌ నగరంలోని అగ్నిమాపక సిబ్బంది భారీ ర్యాలీ చేపట్టారు. వారు వినియోగించే అగ్నిమాపక వాహనాలతో చార్మినార్‌ నుంచి ఉప్పల్‌ వరకు ప్రదర్శన నిర్వహించారు. హబ్సిగూడ వద్ద కనిపించిన దృశ్యాలివి. స్వాతంత్ర్య భారత వజ్రోత్సవంలో భాగంగా హైదరాబాద్‌ నగరంలోని అగ్నిమాపక సిబ్బంది భారీ ర్యాలీ చేపట్టారు. వారు వినియోగించే అగ్నిమాపక వాహనాలతో చార్మినార్‌ నుంచి ఉప్పల్‌ వరకు ప్రదర్శన నిర్వహించారు. హబ్సిగూడ వద్ద కనిపించిన దృశ్యాలివి.
23/27
24/27
నటి సోనాలీ బింద్రే అట్లాంటా పర్యటనకు వెళ్లారు. అక్కడి అందమైన ప్రదేశాలను చుట్టేస్తూ ట్రిప్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె లేత గులాబీ, పసిడి వర్ణం కలగలిసిన సల్వార్‌ కమీజ్‌ ధరించిన చిత్రాలను తన ఇన్‌స్టా ఖాతాలో పంచుకున్నారు. ‘ఓ అమ్మాయిని మీరు భారత్‌ నుంచి దూరంగా తీసుకురావచ్చు.. కానీ, ఆమె నుంచి భారతీయతను విడదీయలేరు’ అంటూ వాటికి కాప్షన్‌ జోడించింది. నటి సోనాలీ బింద్రే అట్లాంటా పర్యటనకు వెళ్లారు. అక్కడి అందమైన ప్రదేశాలను చుట్టేస్తూ ట్రిప్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె లేత గులాబీ, పసిడి వర్ణం కలగలిసిన సల్వార్‌ కమీజ్‌ ధరించిన చిత్రాలను తన ఇన్‌స్టా ఖాతాలో పంచుకున్నారు. ‘ఓ అమ్మాయిని మీరు భారత్‌ నుంచి దూరంగా తీసుకురావచ్చు.. కానీ, ఆమె నుంచి భారతీయతను విడదీయలేరు’ అంటూ వాటికి కాప్షన్‌ జోడించింది.
25/27
26/27
నాలుగు దశాబ్దాలుగా రజనీకాంత్‌ సూపర్‌ స్టార్‌గా వెలుగొందుతున్నారు. 1975లో దర్శకుడు కె.బాలచందర్‌ చిత్రం అపూర్వ రాగంగళ్‌ ద్వారా రజనీ కాంత్‌ నటుడిగా పరిచయం అయ్యారు. ఆయన నట ప్రస్థానం మొదలుపెట్టి 47 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రజనీ.. ఆయన సతీమణి లత సమక్షంలో కేక్‌ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. నాలుగు దశాబ్దాలుగా రజనీకాంత్‌ సూపర్‌ స్టార్‌గా వెలుగొందుతున్నారు. 1975లో దర్శకుడు కె.బాలచందర్‌ చిత్రం అపూర్వ రాగంగళ్‌ ద్వారా రజనీ కాంత్‌ నటుడిగా పరిచయం అయ్యారు. ఆయన నట ప్రస్థానం మొదలుపెట్టి 47 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రజనీ.. ఆయన సతీమణి లత సమక్షంలో కేక్‌ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.
27/27
స్వాతంత్ర్య భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా తెలంగాణ భవన్లో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత రక్తదానం చేశారు. ఎంపీ కేశవరావు, మేయర్‌ విజయలక్ష్మి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, మాగంటి గోపీనాథ్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వాతంత్ర్య భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా తెలంగాణ భవన్లో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత రక్తదానం చేశారు. ఎంపీ కేశవరావు, మేయర్‌ విజయలక్ష్మి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, మాగంటి గోపీనాథ్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని