చిత్రం చెప్పే సంగతులు-2 (18-08-2022)

Published : 18 Aug 2022 22:12 IST
1/32
భారత స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా రవీంద్రభారతిలో తెలుగు యూనివర్సిటీ ఆధ్వర్యంలో నాట్య రామణియకం పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కళాకారులు ఇచ్చిన నృత్య ప్రదర్శన చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. భారత స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా రవీంద్రభారతిలో తెలుగు యూనివర్సిటీ ఆధ్వర్యంలో నాట్య రామణియకం పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కళాకారులు ఇచ్చిన నృత్య ప్రదర్శన చూపరులను విశేషంగా ఆకట్టుకుంది.
2/32
3/32
తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను కృష్ణుడు, గోపికల వేషధారణలో అలంకరించి సంబరపడిపోయారు. కృష్ణుడి వేషధారణలో ఉన్న చిన్నారి గోవుకు మేత వేస్తున్న చిత్రం హైదరాబాద్‌లోని బేగం బజార్‌లో కనిపించింది. తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను కృష్ణుడు, గోపికల వేషధారణలో అలంకరించి సంబరపడిపోయారు. కృష్ణుడి వేషధారణలో ఉన్న చిన్నారి గోవుకు మేత వేస్తున్న చిత్రం హైదరాబాద్‌లోని బేగం బజార్‌లో కనిపించింది.
4/32
తిరుపతిలో కృష్ణుడి వేషధారణలో ఆకట్టుకున్న చిన్నారి తిరుపతిలో కృష్ణుడి వేషధారణలో ఆకట్టుకున్న చిన్నారి
5/32
6/32
కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై, మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప శ్రీవారి దర్శనార్థం గురువారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు. జీఎంఆర్ అతిథి గృహంలో బస చేసిన వీరిని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. వారిని శాలువాలతో సత్కరించి స్వామివారి ప్రతిమలను బహూకరించారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై, మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప శ్రీవారి దర్శనార్థం గురువారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు. జీఎంఆర్ అతిథి గృహంలో బస చేసిన వీరిని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. వారిని శాలువాలతో సత్కరించి స్వామివారి ప్రతిమలను బహూకరించారు.
7/32
8/32
ప్రధాని నరేంద్ర మోదీ గురువారం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రధాని నరేంద్ర మోదీ గురువారం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
9/32
10/32
ఒక చిత్రం ఎన్నో భావాల మిళితం. కలకాలం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకం. భావోద్వేగాలకు ప్రతిబింబం. అలసిన మనసుకు సాంత్వనం. ఇలా ఎన్నెన్నో అర్థాల కలబోతే ఫొటో. శుక్రవారం ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం. ఈ సందర్భంగా ఏలూరు, పశ్చిమగోదావరిలో ఇటీవల ఆవిష్కృతమైన కొన్ని చిత్రాలివి. ఏలూరులో ఓ ఇంటి పిల్లర్‌పై బల్బులా కనిపిస్తున్న సూర్యుడిని ఫొటోలో చూడవచ్చు.. ఒక చిత్రం ఎన్నో భావాల మిళితం. కలకాలం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకం. భావోద్వేగాలకు ప్రతిబింబం. అలసిన మనసుకు సాంత్వనం. ఇలా ఎన్నెన్నో అర్థాల కలబోతే ఫొటో. శుక్రవారం ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం. ఈ సందర్భంగా ఏలూరు, పశ్చిమగోదావరిలో ఇటీవల ఆవిష్కృతమైన కొన్ని చిత్రాలివి. ఏలూరులో ఓ ఇంటి పిల్లర్‌పై బల్బులా కనిపిస్తున్న సూర్యుడిని ఫొటోలో చూడవచ్చు..
11/32
పేరుపాలెం బీచ్‌లో తెల్లని కెరటం పేరుపాలెం బీచ్‌లో తెల్లని కెరటం
12/32
ఏలూరు మండలం మాధవపురంలోని పక్షుల ఆవాస కేంద్రంలో నేలకొరిగిన విదేశీ విహంగం ఏలూరు మండలం మాధవపురంలోని పక్షుల ఆవాస కేంద్రంలో నేలకొరిగిన విదేశీ విహంగం
13/32
నిజామాబాద్‌ జిల్లాలోని చింతలూరు గ్రామానికి చెందిన రైతు చిన్నికృష్ణుడు తన తల్లిదండ్రులపై ఉన్న ప్రేమను వినూత్న రీతిలో చాటుకున్నాడు. తన వ్యవసాయ క్షేత్రంలో నెల రోజులకు పైగా కష్టపడి 36 రకాల వరి వంగడాల నారుతో తల్లి భూదేవి, తండ్రి ముత్తన్న చిత్రాలను తీర్చిదిద్దాడు. నిజామాబాద్‌ జిల్లాలోని చింతలూరు గ్రామానికి చెందిన రైతు చిన్నికృష్ణుడు తన తల్లిదండ్రులపై ఉన్న ప్రేమను వినూత్న రీతిలో చాటుకున్నాడు. తన వ్యవసాయ క్షేత్రంలో నెల రోజులకు పైగా కష్టపడి 36 రకాల వరి వంగడాల నారుతో తల్లి భూదేవి, తండ్రి ముత్తన్న చిత్రాలను తీర్చిదిద్దాడు.
14/32
హరియాణాలోని చండీ మందిర్‌లో భారత్‌-వియత్నాం దేశాలు సయుక్త సైనిక విన్యాసాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా సైనికులు హెలికాప్టర్ల నుంచి వేలాడుతూ.. ఆయుధాలను ప్రయోగిస్తూ చూపరులను ఆకట్టుకున్నారు. హరియాణాలోని చండీ మందిర్‌లో భారత్‌-వియత్నాం దేశాలు సయుక్త సైనిక విన్యాసాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా సైనికులు హెలికాప్టర్ల నుంచి వేలాడుతూ.. ఆయుధాలను ప్రయోగిస్తూ చూపరులను ఆకట్టుకున్నారు.
15/32
16/32
మహారాష్ట్రలోని రాయ్‌గడ్‌ జిల్లా హరిహరేశ్వర తీరంలో ఓ బోటు లభ్యమైంది. పోలీసులు ఇందులోని 3 ఏకే-47 తుపాకులను స్వాధీనం చేసుకొని ఘటనపై విచారణ చేపట్టారు. ఇది ఆస్ట్రేలియావాసి జేమ్స్‌ హెర్బర్ట్‌కు చెందిన బోటు అని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ తెలిపారు. కొన్ని నెలల క్రితం బోటు ఇంజిన్‌ పాడవడంతో అందులో ప్రయాణిస్తున్న వ్యక్తులను ఓ కొరియన్‌ పడవ ద్వారా సురక్షితంగా బయటకు పంపినట్లు చెప్పారు. భారీ వర్షాల కారణంగా పడవను బయటకు తెచ్చేందుకు వీలు కాలేదని ఆయన వివరించారు. మహారాష్ట్రలోని రాయ్‌గడ్‌ జిల్లా హరిహరేశ్వర తీరంలో ఓ బోటు లభ్యమైంది. పోలీసులు ఇందులోని 3 ఏకే-47 తుపాకులను స్వాధీనం చేసుకొని ఘటనపై విచారణ చేపట్టారు. ఇది ఆస్ట్రేలియావాసి జేమ్స్‌ హెర్బర్ట్‌కు చెందిన బోటు అని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ తెలిపారు. కొన్ని నెలల క్రితం బోటు ఇంజిన్‌ పాడవడంతో అందులో ప్రయాణిస్తున్న వ్యక్తులను ఓ కొరియన్‌ పడవ ద్వారా సురక్షితంగా బయటకు పంపినట్లు చెప్పారు. భారీ వర్షాల కారణంగా పడవను బయటకు తెచ్చేందుకు వీలు కాలేదని ఆయన వివరించారు.
17/32
18/32
వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలం బుద్దారం గండిలో 45 అడుగుల ఎత్తైన ఆంజనేయస్వామి విగ్రహాన్ని మంత్రి నిరంజన్‌రెడ్డి ఆవిష్కరించారు. వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలం బుద్దారం గండిలో 45 అడుగుల ఎత్తైన ఆంజనేయస్వామి విగ్రహాన్ని మంత్రి నిరంజన్‌రెడ్డి ఆవిష్కరించారు.
19/32
కృష్ణాష్టమి పర్వదినం సందర్భంగా హైదరాబాద్‌లోని మన్సూరాబాద్‌లో చిన్నారులు కృష్ణుడు, గోపికల వేషధారణలో ఆకట్టుకున్నారు. వేడుకల్లో భాగంగా ఉట్టి కొట్టి సంబరాలు చేసుకున్నారు. కృష్ణాష్టమి పర్వదినం సందర్భంగా హైదరాబాద్‌లోని మన్సూరాబాద్‌లో చిన్నారులు కృష్ణుడు, గోపికల వేషధారణలో ఆకట్టుకున్నారు. వేడుకల్లో భాగంగా ఉట్టి కొట్టి సంబరాలు చేసుకున్నారు.
20/32
21/32
బీజింగ్‌లోని ఇచుయాంగ్‌ ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌, ఎగ్జిబిషన్‌ సెంటర్లో ‘వరల్డ్‌ రోబోట్‌ కాన్ఫరెన్స్‌’ నిర్వహిస్తున్నారు. అందులో ప్రదర్శనకు ఉంచిన సబ్‌మెరైన్‌, డాగ్‌, వీల్‌ఛైర్‌ తరహా రోబోలు ఆకట్టుకున్నాయి. చిన్నారులు వాటితో ఆటలు ఆడుతూ సందడి చేశారు. దివ్యాంగులకు ఉపయుక్తంగా ఉండే రోబో లెగ్స్‌, వీల్‌ఛైర్లు ఇందులో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. బీజింగ్‌లోని ఇచుయాంగ్‌ ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌, ఎగ్జిబిషన్‌ సెంటర్లో ‘వరల్డ్‌ రోబోట్‌ కాన్ఫరెన్స్‌’ నిర్వహిస్తున్నారు. అందులో ప్రదర్శనకు ఉంచిన సబ్‌మెరైన్‌, డాగ్‌, వీల్‌ఛైర్‌ తరహా రోబోలు ఆకట్టుకున్నాయి. చిన్నారులు వాటితో ఆటలు ఆడుతూ సందడి చేశారు. దివ్యాంగులకు ఉపయుక్తంగా ఉండే రోబో లెగ్స్‌, వీల్‌ఛైర్లు ఇందులో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
22/32
23/32
24/32
25/32
కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ గురువారం ముంబయిలో ఎలక్ట్రిక్‌ డబుల్‌ డెక్కర్‌ బస్సును ప్రారంభించి అందులో కొంత దూరం ప్రయాణించారు. పునరుత్పాదక ఇంధన వినియోగంలో ఇదో విప్లవమని ఆయన తెలిపారు. ఇది భారత్‌లో మొట్ట మొదటి ఎలక్ట్రిక్‌ డబుల్‌ డెక్కర్‌ బస్సు కావడం విశేషం. కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ గురువారం ముంబయిలో ఎలక్ట్రిక్‌ డబుల్‌ డెక్కర్‌ బస్సును ప్రారంభించి అందులో కొంత దూరం ప్రయాణించారు. పునరుత్పాదక ఇంధన వినియోగంలో ఇదో విప్లవమని ఆయన తెలిపారు. ఇది భారత్‌లో మొట్ట మొదటి ఎలక్ట్రిక్‌ డబుల్‌ డెక్కర్‌ బస్సు కావడం విశేషం.
26/32
27/32
సర్దార్‌ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పాదయాత్ర శిబిరం వద్ద ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. సర్దార్‌ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పాదయాత్ర శిబిరం వద్ద ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.
28/32
మెహదీపట్నంలోని భోజగుట్టపై పిచ్చుక గూళ్లలా కన్పిస్తున్న పేదల ఇళ్లు ఇవి. శ్రీరాంనగర్‌ బస్తీ, శివాజీ నగర్‌ బస్తీ కలిసి దాదాపు 1200 కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నాయి. గుట్టకు మరో వైపు నిర్మిస్తున్న రెండు పడక గదుల ఇళ్ల కేటాయింపులో కొందరి పేర్లు మాత్రమే అధికారులు నమోదు చేశారు. దీంతో తమకు మరో చోట ఇళ్లు ఇవ్వకపోయినా ఫర్వాలేదు కానీ, ప్రస్తుతం ఉంటున్న ఇళ్లకైనా పట్టా ఇస్తే సొంతంగా కొత్త ఇళ్లు నిర్మించుకొనేందుకు వీలుంటుందని ఈ బస్తీవాసులు కోరుతున్నారు. మెహదీపట్నంలోని భోజగుట్టపై పిచ్చుక గూళ్లలా కన్పిస్తున్న పేదల ఇళ్లు ఇవి. శ్రీరాంనగర్‌ బస్తీ, శివాజీ నగర్‌ బస్తీ కలిసి దాదాపు 1200 కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నాయి. గుట్టకు మరో వైపు నిర్మిస్తున్న రెండు పడక గదుల ఇళ్ల కేటాయింపులో కొందరి పేర్లు మాత్రమే అధికారులు నమోదు చేశారు. దీంతో తమకు మరో చోట ఇళ్లు ఇవ్వకపోయినా ఫర్వాలేదు కానీ, ప్రస్తుతం ఉంటున్న ఇళ్లకైనా పట్టా ఇస్తే సొంతంగా కొత్త ఇళ్లు నిర్మించుకొనేందుకు వీలుంటుందని ఈ బస్తీవాసులు కోరుతున్నారు.
29/32
30/32
హైదరాబాద్‌లోని పీవీ నరసింహారావు మార్గ్‌-నెక్లెస్‌ రోడ్డు పీపుల్స్‌ ప్లాజాలో ఏర్పాటు చేసిన నర్సరీ మేళాను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన స్టాళ్లలోని మొక్కలను పరిశీలించారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చొరవతో రాష్ట్రంలో పచ్చదనం పెరిగిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని పీవీ నరసింహారావు మార్గ్‌-నెక్లెస్‌ రోడ్డు పీపుల్స్‌ ప్లాజాలో ఏర్పాటు చేసిన నర్సరీ మేళాను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన స్టాళ్లలోని మొక్కలను పరిశీలించారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చొరవతో రాష్ట్రంలో పచ్చదనం పెరిగిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.
31/32
32/32
వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర మక్తల్ నియోజకవర్గంలో 125వ రోజు కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆమె ఊట్కూరు మండలంలోని ఓ రైతు పొలంలో అడుగుపెట్టారు. నాగలి పట్టి పొలం దున్నారు. రైతులు, కూలీలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర మక్తల్ నియోజకవర్గంలో 125వ రోజు కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆమె ఊట్కూరు మండలంలోని ఓ రైతు పొలంలో అడుగుపెట్టారు. నాగలి పట్టి పొలం దున్నారు. రైతులు, కూలీలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు.

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని