చిత్రం చెప్పే సంగతులు-1 (19-08-2022)

Updated : 19 Aug 2022 11:12 IST
1/20
నల్లబెల్లి శివారు రేగులకుంట చెరువులో కొంగలు సంధ్యా సమయంలో సందడి చేస్తున్నాయి. సాయంత్రం వేళ చెరువు వద్దకు చేరుకొని చెట్ల కొమ్మలపై వాలి చూపరులను కట్టిపడేస్తున్నాయి. కొమ్మకొమ్మకో కొంగ సేదదీరి తెల్లని పుష్పాల వలే గోచరిస్తూ బాటసారులకు కనువిందు చేస్తున్నాయి. గురువారం ‘న్యూస్‌టుడే’ తన కెమెరాలో బంధించిన చిత్రమిది.   నల్లబెల్లి శివారు రేగులకుంట చెరువులో కొంగలు సంధ్యా సమయంలో సందడి చేస్తున్నాయి. సాయంత్రం వేళ చెరువు వద్దకు చేరుకొని చెట్ల కొమ్మలపై వాలి చూపరులను కట్టిపడేస్తున్నాయి. కొమ్మకొమ్మకో కొంగ సేదదీరి తెల్లని పుష్పాల వలే గోచరిస్తూ బాటసారులకు కనువిందు చేస్తున్నాయి. గురువారం ‘న్యూస్‌టుడే’ తన కెమెరాలో బంధించిన చిత్రమిది.
2/20
‘నో హెల్మెట్‌ నో పెట్రోల్‌’ ఆదేశాలు నగరంలోని ఏ పెట్రోల్‌ బంకుల్లోనూ పూర్తిస్థాయిలో అమలవ్వడం లేదు. ఈ నెల 15 నుంచి శిరస్త్రాణం ధరించని వారి వాహనంలో పెట్రోల్‌ పోయొద్దని బంకు యజమానులకు పోలీస్‌ కమిషనరేట్‌ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చినా.. బంకు యజమానులు పట్టించుకోకపోవడంతో ఆచరణ నీరుగారిపోతోంది. ‘నో హెల్మెట్‌ నో పెట్రోల్‌’ ఆదేశాలు నగరంలోని ఏ పెట్రోల్‌ బంకుల్లోనూ పూర్తిస్థాయిలో అమలవ్వడం లేదు. ఈ నెల 15 నుంచి శిరస్త్రాణం ధరించని వారి వాహనంలో పెట్రోల్‌ పోయొద్దని బంకు యజమానులకు పోలీస్‌ కమిషనరేట్‌ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చినా.. బంకు యజమానులు పట్టించుకోకపోవడంతో ఆచరణ నీరుగారిపోతోంది.
3/20
4/20
అమ్మానాన్నలపై తనకున్న ప్రేమకు చిహ్నంగా వరిపైరుతో వారి చిత్రాన్ని ఆవిష్కరించారు నిజామాబాద్‌ జిల్లా జక్రాన్‌పల్లి మండలం చింతలూర్‌కు చెందిన ఆదర్శ రైతు చిన్నికృష్ణుడు. మొదట.. తన తల్లిదండ్రులు భూదేవి, ముత్తెన్న చిత్రాలను ఎకరం విస్తీర్ణంలో బొమ్మ గీయించారు. అనంతరం బంగారు గులాబీ, పంచరత్న, చింతలూర్‌ సన్నాలు రకం వరి వంగడాలతో వరినారు పెంచారు. 24 రోజుల తర్వాత కూలీలతో నిర్దేశించిన స్థానాల్లో నాట్లు వేయించారు. ‘ప్రస్తుతం నాట్లు వేసి 20 రోజులు అయింది. పంట కోతకు వచ్చేకొద్దీ చిత్రాలు మరింత స్పష్టంగా కనిపిస్తాయని’ చిన్నికృష్ణుడు ‘న్యూస్‌టుడే’కు వెల్లడించారు.  అమ్మానాన్నలపై తనకున్న ప్రేమకు చిహ్నంగా వరిపైరుతో వారి చిత్రాన్ని ఆవిష్కరించారు నిజామాబాద్‌ జిల్లా జక్రాన్‌పల్లి మండలం చింతలూర్‌కు చెందిన ఆదర్శ రైతు చిన్నికృష్ణుడు. మొదట.. తన తల్లిదండ్రులు భూదేవి, ముత్తెన్న చిత్రాలను ఎకరం విస్తీర్ణంలో బొమ్మ గీయించారు. అనంతరం బంగారు గులాబీ, పంచరత్న, చింతలూర్‌ సన్నాలు రకం వరి వంగడాలతో వరినారు పెంచారు. 24 రోజుల తర్వాత కూలీలతో నిర్దేశించిన స్థానాల్లో నాట్లు వేయించారు. ‘ప్రస్తుతం నాట్లు వేసి 20 రోజులు అయింది. పంట కోతకు వచ్చేకొద్దీ చిత్రాలు మరింత స్పష్టంగా కనిపిస్తాయని’ చిన్నికృష్ణుడు ‘న్యూస్‌టుడే’కు వెల్లడించారు.
5/20
చార్మినార్‌ అందం నాలుగు వందల ఏళ్లయినా చెక్కు చెదరలేదు. అప్పట్లో నిర్మానుష్యంగా ఉన్న ఈ ప్రాంతం కాలక్రమంలో కాంక్రీట్‌ జంగిల్‌గా మారింది. నాంపల్లిలో ఓ ఎత్తయిన భవనం పైనుంచి  ఇలా కనువిందు చేస్తోంది. చార్మినార్‌ అందం నాలుగు వందల ఏళ్లయినా చెక్కు చెదరలేదు. అప్పట్లో నిర్మానుష్యంగా ఉన్న ఈ ప్రాంతం కాలక్రమంలో కాంక్రీట్‌ జంగిల్‌గా మారింది. నాంపల్లిలో ఓ ఎత్తయిన భవనం పైనుంచి ఇలా కనువిందు చేస్తోంది.
6/20
షేక్‌పేట దర్గా నుంచి మహాప్రస్థానం మీదుగా ఫిలింనగర్‌ రోడ్డునంబరు 78 రహదారిపై తారు, సిమెంట్‌ కుప్పలుగా పడి వాహనదారులు అవస్థలు పడుతున్నారు. తారు వల్ల కొందరు జారిపడుతుండగా.. కంకర సిమెంట్‌తో దుమ్ము లేచి ముందున్నది కనబడడం లేదని పలువురు వాపోతున్నారు. షేక్‌పేట దర్గా నుంచి మహాప్రస్థానం మీదుగా ఫిలింనగర్‌ రోడ్డునంబరు 78 రహదారిపై తారు, సిమెంట్‌ కుప్పలుగా పడి వాహనదారులు అవస్థలు పడుతున్నారు. తారు వల్ల కొందరు జారిపడుతుండగా.. కంకర సిమెంట్‌తో దుమ్ము లేచి ముందున్నది కనబడడం లేదని పలువురు వాపోతున్నారు.
7/20
అధికారుల నిర్లక్ష్యానికి ఉదాహరణ ఈ చిత్రం.. బాలానగర్‌-జీడిమెట్ల రహదారిపై కొత్తగా సైకిల్‌ ట్రాక్‌ నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగా ఓవైపు వర్షాలు పడుతుండగానే.. మరోవైపు ట్రాక్‌పై రంగు వేయడంతో.. అది కొట్టుకుపోయి ఇలా వెలిసిపోయింది. అధికారుల నిర్లక్ష్యానికి ఉదాహరణ ఈ చిత్రం.. బాలానగర్‌-జీడిమెట్ల రహదారిపై కొత్తగా సైకిల్‌ ట్రాక్‌ నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగా ఓవైపు వర్షాలు పడుతుండగానే.. మరోవైపు ట్రాక్‌పై రంగు వేయడంతో.. అది కొట్టుకుపోయి ఇలా వెలిసిపోయింది.
8/20
ఇంత ప్రమాదకరంగా ప్రయాణిస్తున్న ఈ పిల్లలంతా విద్యార్థులే. వజ్రోత్సవాల సందర్భంగా వివిధ పాఠశాలల నుంచి విద్యార్థులకు గాంధీ సినిమా చూపించడానికి ఇలా ట్రాలీ ఆటోలో కుక్కి తీసుకెళ్తున్నారు. ముషీరాబాద్‌ రోడ్డులో కనిపించిందీ దృశ్యం. 


ఇంత ప్రమాదకరంగా ప్రయాణిస్తున్న ఈ పిల్లలంతా విద్యార్థులే. వజ్రోత్సవాల సందర్భంగా వివిధ పాఠశాలల నుంచి విద్యార్థులకు గాంధీ సినిమా చూపించడానికి ఇలా ట్రాలీ ఆటోలో కుక్కి తీసుకెళ్తున్నారు. ముషీరాబాద్‌ రోడ్డులో కనిపించిందీ దృశ్యం.
9/20
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం వంగలపూడికి చెందిన గుణ్నం సాయిరాం (25) పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తొలుత రాజమహేంద్రవరంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించారు. మెరుగైన చికిత్సకు బుధవారం సాయంత్రం కాకినాడ జీజీహెచ్‌లో చేర్చారు. అత్యవసర విభాగంలో ప్రాథమిక చికిత్స చేశాక.. ఐసీయూలో వైద్యం చేయాల్సి ఉన్నా పడకలు ఖాళీ లేక మూడో మెడికల్‌ వార్డులోకి తరలించారు. అప్పటికే వార్డులో బెడ్లన్నీ నిండిపోయాయి. ఒక్కో దానిపై ఇద్దరేసి చికిత్స పొందుతున్నారు. గత్యంతరం లేని పరిస్థితిలో స్పృహలో లేని సాయిరాంను మంచాల మధ్యే పడుకోబెట్టి చికిత్స అందించారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం వంగలపూడికి చెందిన గుణ్నం సాయిరాం (25) పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తొలుత రాజమహేంద్రవరంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించారు. మెరుగైన చికిత్సకు బుధవారం సాయంత్రం కాకినాడ జీజీహెచ్‌లో చేర్చారు. అత్యవసర విభాగంలో ప్రాథమిక చికిత్స చేశాక.. ఐసీయూలో వైద్యం చేయాల్సి ఉన్నా పడకలు ఖాళీ లేక మూడో మెడికల్‌ వార్డులోకి తరలించారు. అప్పటికే వార్డులో బెడ్లన్నీ నిండిపోయాయి. ఒక్కో దానిపై ఇద్దరేసి చికిత్స పొందుతున్నారు. గత్యంతరం లేని పరిస్థితిలో స్పృహలో లేని సాయిరాంను మంచాల మధ్యే పడుకోబెట్టి చికిత్స అందించారు.
10/20
పశ్చిమబెంగాల్‌లోని నదియా జిల్లాలో గురువారం జాతీయ జెండాలతో పడవల్లో ప్రయాణిస్తూ స్వాతంత్య్ర సంబరాలు చేసుకుంటున్న ప్రజలు. మ్యాప్‌ తయారీకి సంబంధించి బ్రిటిషర్లు చేసిన పొరపాటు కారణంగా ఇక్కడి కొన్ని ప్రాంతాలు తూర్పు పాకిస్థాన్‌ (ప్రస్తుత బంగ్లాదేశ్‌)లోకి వెళ్లిపోయాయి. అనంతరం ఆ తప్పులను సరిదిద్దడంతో ఆగస్టు 18, 1947న ఈ ప్రాంతాలు తిరిగి భారత్‌లో కలిసిపోయినట్లు ఇక్కడి ప్రజలు చెబుతారు. ఈ కారణంగానే నదియా జిల్లాలో బంగ్లాదేశ్‌ సరిహద్దుకు అనుకుని ఉన్న కొన్ని గ్రామాల ప్రజలు 1947 నుంచి ఇప్పటివరకు ఆగస్టు 18న స్వాతంత్య్ర దినోత్సవం నిర్వహించుకుంటున్నారు. పశ్చిమబెంగాల్‌లోని నదియా జిల్లాలో గురువారం జాతీయ జెండాలతో పడవల్లో ప్రయాణిస్తూ స్వాతంత్య్ర సంబరాలు చేసుకుంటున్న ప్రజలు. మ్యాప్‌ తయారీకి సంబంధించి బ్రిటిషర్లు చేసిన పొరపాటు కారణంగా ఇక్కడి కొన్ని ప్రాంతాలు తూర్పు పాకిస్థాన్‌ (ప్రస్తుత బంగ్లాదేశ్‌)లోకి వెళ్లిపోయాయి. అనంతరం ఆ తప్పులను సరిదిద్దడంతో ఆగస్టు 18, 1947న ఈ ప్రాంతాలు తిరిగి భారత్‌లో కలిసిపోయినట్లు ఇక్కడి ప్రజలు చెబుతారు. ఈ కారణంగానే నదియా జిల్లాలో బంగ్లాదేశ్‌ సరిహద్దుకు అనుకుని ఉన్న కొన్ని గ్రామాల ప్రజలు 1947 నుంచి ఇప్పటివరకు ఆగస్టు 18న స్వాతంత్య్ర దినోత్సవం నిర్వహించుకుంటున్నారు.
11/20
శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినం నేపథ్యంలో గురువారం ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథుర ఆలయం వద్ద భక్తుల సందడి శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినం నేపథ్యంలో గురువారం ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథుర ఆలయం వద్ద భక్తుల సందడి
12/20
దిల్లీలో గురువారం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తో ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. చిత్రంలో రామ్‌నాథ్‌ సతీమణి సవితా కోవింద్‌, కుమార్తె స్వాతీ కోవింద్‌. దిల్లీలో గురువారం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తో ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. చిత్రంలో రామ్‌నాథ్‌ సతీమణి సవితా కోవింద్‌, కుమార్తె స్వాతీ కోవింద్‌.
13/20
విద్యాకానుక పథకంలో ఇచ్చిన బూట్లు వేసుకునే భాగ్యం ఎప్పుడొస్తుందోనని తూర్పుగోదారి జిల్లా వెదుళ్లపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే.. ఈ బడికి వెళ్లే రాజమహేంద్రవరం-సీతానగరం ప్రధాన రహదారిని విస్తరణ పనుల్లో భాగంగా తవ్వేశారు. వర్షాలకు ఆ దారంతా బురదమయంగా మారింది. బూట్లు ఇచ్చినప్పటి నుంచి ఆ రోడ్డులో బురద లేని రోజు లేదు. కాలు పెడితే చాలు దిగబడిపోతోంది. దాంట్లో బూట్లతో నడవలేక విద్యార్థులు చెప్పులతోనే బడికి వస్తున్నారు. అదీనూ బురద ఎక్కువ ఉన్న చోట్ల చెప్పులనూ చేతపట్టుకొని వెళ్తున్నారు. ప్రస్తుతం రోడ్డు పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. త్వరగా పూర్తయ్యేలా చేస్తే బురద తిప్పలు తప్పుతాయని విద్యార్థులు తెలిపారు. విద్యాకానుక పథకంలో ఇచ్చిన బూట్లు వేసుకునే భాగ్యం ఎప్పుడొస్తుందోనని తూర్పుగోదారి జిల్లా వెదుళ్లపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే.. ఈ బడికి వెళ్లే రాజమహేంద్రవరం-సీతానగరం ప్రధాన రహదారిని విస్తరణ పనుల్లో భాగంగా తవ్వేశారు. వర్షాలకు ఆ దారంతా బురదమయంగా మారింది. బూట్లు ఇచ్చినప్పటి నుంచి ఆ రోడ్డులో బురద లేని రోజు లేదు. కాలు పెడితే చాలు దిగబడిపోతోంది. దాంట్లో బూట్లతో నడవలేక విద్యార్థులు చెప్పులతోనే బడికి వస్తున్నారు. అదీనూ బురద ఎక్కువ ఉన్న చోట్ల చెప్పులనూ చేతపట్టుకొని వెళ్తున్నారు. ప్రస్తుతం రోడ్డు పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. త్వరగా పూర్తయ్యేలా చేస్తే బురద తిప్పలు తప్పుతాయని విద్యార్థులు తెలిపారు.
14/20
చేతితో నీటిని అందుకునేలా కళకళలాడుతున్న ఈ వ్యవసాయ బావి హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం పెద్దాపూర్‌ గ్రామంలోనిది. ఈ గ్రామంలో వ్యవసాయ బావులన్నీ ఇలా నీటితో గంగాళాలను తలపిస్తున్నాయి. ఇటీవల భారీ వర్షాలకు చెరువులు, కుంటలు నిండి భూగర్భ జలాలు గణనీయంగా పెరగడంతో బావులు ఇలా కనిపిస్తున్నాయని నీటి రంగ నిపుణులు తెలిపారు.  చేతితో నీటిని అందుకునేలా కళకళలాడుతున్న ఈ వ్యవసాయ బావి హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం పెద్దాపూర్‌ గ్రామంలోనిది. ఈ గ్రామంలో వ్యవసాయ బావులన్నీ ఇలా నీటితో గంగాళాలను తలపిస్తున్నాయి. ఇటీవల భారీ వర్షాలకు చెరువులు, కుంటలు నిండి భూగర్భ జలాలు గణనీయంగా పెరగడంతో బావులు ఇలా కనిపిస్తున్నాయని నీటి రంగ నిపుణులు తెలిపారు.
15/20
న్యూయార్క్‌లోని మన్‌హట్టన్‌ అనగానే ఆకాశహర్మ్యాలు గుర్తుకు రావడం సహజం. అలాంటి వాటిలో విభిన్నమైనది స్టైన్‌వే టవర్‌. ప్రపంచంలోనే అత్యంత సన్నని ఆకాశహర్మ్యంగా ఇది గుర్తింపు పొందింది. 435 మీటర్ల (1,428 అడుగుల) ఎత్తున్న 84 అంతస్తుల ఈ టవర్‌ను న్యూయార్క్‌కు చెందిన ఆర్కిటెక్చర్‌ సంస్థ షాన్‌ ఆర్కిటెక్ట్స్‌ డిజైన్‌ చేసింది. ప్రచండ గాలుల సమయంలో ఈ భవనం పైభాగం స్వల్పంగా అటూఇటూ ఊగుతుంది. సాధారణంగా సన్నని భవనాల వెడల్పు, ఎత్తుల నిష్పత్తి 1: 10 ఉంటుంది. అలాంటిది స్టైన్‌వే  టవర్‌ నిర్మాణం నమ్మశక్యంకాని రీతిలో 1: 23.5 నిష్పత్తిలో పూర్తిచేయడం విశేషం. న్యూయార్క్‌లోని మన్‌హట్టన్‌ అనగానే ఆకాశహర్మ్యాలు గుర్తుకు రావడం సహజం. అలాంటి వాటిలో విభిన్నమైనది స్టైన్‌వే టవర్‌. ప్రపంచంలోనే అత్యంత సన్నని ఆకాశహర్మ్యంగా ఇది గుర్తింపు పొందింది. 435 మీటర్ల (1,428 అడుగుల) ఎత్తున్న 84 అంతస్తుల ఈ టవర్‌ను న్యూయార్క్‌కు చెందిన ఆర్కిటెక్చర్‌ సంస్థ షాన్‌ ఆర్కిటెక్ట్స్‌ డిజైన్‌ చేసింది. ప్రచండ గాలుల సమయంలో ఈ భవనం పైభాగం స్వల్పంగా అటూఇటూ ఊగుతుంది. సాధారణంగా సన్నని భవనాల వెడల్పు, ఎత్తుల నిష్పత్తి 1: 10 ఉంటుంది. అలాంటిది స్టైన్‌వే టవర్‌ నిర్మాణం నమ్మశక్యంకాని రీతిలో 1: 23.5 నిష్పత్తిలో పూర్తిచేయడం విశేషం.
16/20
కాలుష్య నియంత్రణ కోసం ప్రభుత్వం ఎంతగానో ప్రచారం చేస్తున్నా ఫలితం లేదు. దీనికి నిదర్శనమే ఈ చిత్రం. హైదరాబాద్‌లోని హుసేన్‌సాగర్‌ ప్రస్తుతం కాలుష్య కాసారంగా మారింది. ఇక్కడ నీరు నల్లని రంగులో కనిపిస్తుండగా ప్లాస్టిక్‌ వ్యర్థాలు తేలుతున్నాయి. ఈ క్రమంలోనే జలవిహార్‌ సమీపంలో తాబేలు నీటిలో నుంచి బయటకు వచ్చి ఓ చెక్కపైకి చేరింది. అదే సమయంలో ఆహారం కోసం పక్షులూ అక్కడికే చేరాయి. కాలుష్య నియంత్రణ కోసం ప్రభుత్వం ఎంతగానో ప్రచారం చేస్తున్నా ఫలితం లేదు. దీనికి నిదర్శనమే ఈ చిత్రం. హైదరాబాద్‌లోని హుసేన్‌సాగర్‌ ప్రస్తుతం కాలుష్య కాసారంగా మారింది. ఇక్కడ నీరు నల్లని రంగులో కనిపిస్తుండగా ప్లాస్టిక్‌ వ్యర్థాలు తేలుతున్నాయి. ఈ క్రమంలోనే జలవిహార్‌ సమీపంలో తాబేలు నీటిలో నుంచి బయటకు వచ్చి ఓ చెక్కపైకి చేరింది. అదే సమయంలో ఆహారం కోసం పక్షులూ అక్కడికే చేరాయి.
17/20
ఇటీవలి వర్షాలు ఉల్లి రైతును ఊపిరి తీసుకోకుండా చేస్తే.. అంత కష్టపడి పండించిన పంటకు ధర లేక అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం బోదెపాడుకు చెందిన రైతు ఈశ్వరయ్య రెండెకరాల్లో ఉల్లి సాగు చేశారు. ఎకరాకు 100 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. మార్కెల్లో ధర పడిపోవడంతో రవాణా ఖర్చులన్నా మిగులుతాయని పొలం వద్దే పంటను వ్యాపారులకు అమ్మేస్తున్నారు. కర్నూలు మార్కెట్‌కు తీసుకెళ్లినా క్వింటాలు ధర రూ.200 నుంచి రూ.600 మాత్రమే పలుకుతోంది. కష్టపడి యార్డుకు తీసుకెళ్లి.. పడిగాపులు పడటం ఎందుకని పొలం వద్దే విక్రయిస్తున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్‌లోకి మహారాష్ట్ర ఉల్లి రాకతో ఇక్కడి పంటకు గిట్టుబాటు దక్కడం లేదని రైతులు తెలిపారు. గురువారం మార్కెట్‌కు 2,329 క్వింటాళ్ల ఉల్లి వచ్చింది. ఇటీవలి వర్షాలు ఉల్లి రైతును ఊపిరి తీసుకోకుండా చేస్తే.. అంత కష్టపడి పండించిన పంటకు ధర లేక అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం బోదెపాడుకు చెందిన రైతు ఈశ్వరయ్య రెండెకరాల్లో ఉల్లి సాగు చేశారు. ఎకరాకు 100 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. మార్కెల్లో ధర పడిపోవడంతో రవాణా ఖర్చులన్నా మిగులుతాయని పొలం వద్దే పంటను వ్యాపారులకు అమ్మేస్తున్నారు. కర్నూలు మార్కెట్‌కు తీసుకెళ్లినా క్వింటాలు ధర రూ.200 నుంచి రూ.600 మాత్రమే పలుకుతోంది. కష్టపడి యార్డుకు తీసుకెళ్లి.. పడిగాపులు పడటం ఎందుకని పొలం వద్దే విక్రయిస్తున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్‌లోకి మహారాష్ట్ర ఉల్లి రాకతో ఇక్కడి పంటకు గిట్టుబాటు దక్కడం లేదని రైతులు తెలిపారు. గురువారం మార్కెట్‌కు 2,329 క్వింటాళ్ల ఉల్లి వచ్చింది.
18/20
డిజురీడూ అనేది ఆస్ట్రేలియాకు చెందిన 2500 ఏళ్ల కిందటి దేశీయ వాయిద్యం. హ్యాండ్‌పాన్‌ అనేది స్విట్జర్లాండ్‌లో హస్తకళా కళాకారులు తయారుచేసిన సంగీత పరికరం. వీటితో ఇటీవల హైదరాబాద్‌లో కొన్ని ప్రత్యేక కార్యక్రమాల్లో కచేరీలు ఏర్పాటు చేస్తున్నారు. ఇవి లోతైన ప్రతిధ్వని, కంపనాలతో మనసును హత్తుకునేలా ఆహ్లాదకర వాతావరణాన్ని సృష్టిస్తాయి. హైదరాబాద్‌కు చెందిన తేజ, సందీప్‌ దినకర్‌లు డిజురీడూ, హ్యాండ్‌పాన్‌లతో పలు కార్యక్రమాల్లో వీనులవిందైన సంగీతం అందిస్తున్నారు. డిజురీడూ అనేది ఆస్ట్రేలియాకు చెందిన 2500 ఏళ్ల కిందటి దేశీయ వాయిద్యం. హ్యాండ్‌పాన్‌ అనేది స్విట్జర్లాండ్‌లో హస్తకళా కళాకారులు తయారుచేసిన సంగీత పరికరం. వీటితో ఇటీవల హైదరాబాద్‌లో కొన్ని ప్రత్యేక కార్యక్రమాల్లో కచేరీలు ఏర్పాటు చేస్తున్నారు. ఇవి లోతైన ప్రతిధ్వని, కంపనాలతో మనసును హత్తుకునేలా ఆహ్లాదకర వాతావరణాన్ని సృష్టిస్తాయి. హైదరాబాద్‌కు చెందిన తేజ, సందీప్‌ దినకర్‌లు డిజురీడూ, హ్యాండ్‌పాన్‌లతో పలు కార్యక్రమాల్లో వీనులవిందైన సంగీతం అందిస్తున్నారు.
19/20
ఆహారం కోసం చూస్తున్న ఒక కొంగకు అది కనపడగానే అందుకునేందుకు తన ముక్కును మొత్తం ఇలా చటుక్కున నీటిలోకి ముంచింది. దీంతో ఆ క్షణంలో నీరు ఎగురుతుండగా ‘ఈనాడు’ కెమెరా క్లిక్‌ మనిపించింది. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ చెరువులో కనిపించింది. ఆహారం కోసం చూస్తున్న ఒక కొంగకు అది కనపడగానే అందుకునేందుకు తన ముక్కును మొత్తం ఇలా చటుక్కున నీటిలోకి ముంచింది. దీంతో ఆ క్షణంలో నీరు ఎగురుతుండగా ‘ఈనాడు’ కెమెరా క్లిక్‌ మనిపించింది. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ చెరువులో కనిపించింది.
20/20
ఆదిలాబాద్‌ జిల్లాలోని తలమడుగు మండలం దహెగామ, కోసాయి సమీపంలో రెండు కొండలు దట్టమైన చెట్లతో నిండి ఉంటాయి. చుట్టూ పచ్చదనం పర్చుకున్న వాటి మధ్య నుంచి వచ్చే రైళ్లలో ప్రయాణికులకు ప్రకృతి ఒడిలో పయనించినట్లు ఉంటుంది. ఆ సమయంలో ఎదురుగా ఉన్న పల్సి(బి) తండా గుట్టలపై నుంచి రైళ్లను చూస్తూ పర్యాటకులు మురిసిపోతుంటారు. ఆదిలాబాద్‌ జిల్లాలోని తలమడుగు మండలం దహెగామ, కోసాయి సమీపంలో రెండు కొండలు దట్టమైన చెట్లతో నిండి ఉంటాయి. చుట్టూ పచ్చదనం పర్చుకున్న వాటి మధ్య నుంచి వచ్చే రైళ్లలో ప్రయాణికులకు ప్రకృతి ఒడిలో పయనించినట్లు ఉంటుంది. ఆ సమయంలో ఎదురుగా ఉన్న పల్సి(బి) తండా గుట్టలపై నుంచి రైళ్లను చూస్తూ పర్యాటకులు మురిసిపోతుంటారు.

మరిన్ని