News In Pics: చిత్రం చెప్పే సంగతులు -1 (01-09-2022)

...

Updated : 01 Sep 2022 22:14 IST
1/27
హైదరాబాద్‌లోని సూరారం చెరువులో గణనాథుడిని నిమజ్జనం చేయడానికి వచ్చిన ఓ వ్యక్తి చివరిసారి తన విగ్రహాన్ని ఇలా ఫొటో తీస్తూ కనిపించాడు. హైదరాబాద్‌లోని సూరారం చెరువులో గణనాథుడిని నిమజ్జనం చేయడానికి వచ్చిన ఓ వ్యక్తి చివరిసారి తన విగ్రహాన్ని ఇలా ఫొటో తీస్తూ కనిపించాడు.
2/27
రాజమహేంద్రవరంలోని కోటిలింగాలఘాట్‌ రోడ్డులో ద్విచక్రవాహనంపై కొలువుదీరిన గణనాథుడు రాజమహేంద్రవరంలోని కోటిలింగాలఘాట్‌ రోడ్డులో ద్విచక్రవాహనంపై కొలువుదీరిన గణనాథుడు
3/27
కోల్‌కతాలోని దుర్గాపూజను యునెస్కో గుర్తించిన నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో దుర్గామాత మట్టి విగ్రహాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ పాల్గొన్నారు. కోల్‌కతాలోని దుర్గాపూజను యునెస్కో గుర్తించిన నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో దుర్గామాత మట్టి విగ్రహాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ పాల్గొన్నారు.
4/27
5/27
6/27
వివిధ అభివృద్ధి పనులకు భూమిపూజ, ప్రారంభోత్సవాల కోసం ప్రధాని నరేంద్ర మోదీ కేరళ వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడి కాలడి గ్రామంలోని ఆదిశంకరాచార్యుడి జన్మస్థలాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. వివిధ అభివృద్ధి పనులకు భూమిపూజ, ప్రారంభోత్సవాల కోసం ప్రధాని నరేంద్ర మోదీ కేరళ వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడి కాలడి గ్రామంలోని ఆదిశంకరాచార్యుడి జన్మస్థలాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
7/27
8/27
9/27
10/27
విశాఖపట్నంలోని ఏబీఎన్‌ కళాశాల సమీప కోడిపందాల వీధిలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ కౌలు రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయం చెక్కులు అందిస్తున్న రూపంలో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ గణనాథుడి మండపానికి పవన్‌ ఫ్యాన్స్‌ ముగ్ధులవుతున్నారు. విశాఖపట్నంలోని ఏబీఎన్‌ కళాశాల సమీప కోడిపందాల వీధిలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ కౌలు రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయం చెక్కులు అందిస్తున్న రూపంలో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ గణనాథుడి మండపానికి పవన్‌ ఫ్యాన్స్‌ ముగ్ధులవుతున్నారు.
11/27
భారత క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌.. క్రికెటర్లు హార్దిక్‌ పాండ్య, కృనాల్ పాండ్యలతో కలిసి దిగిన ఫొటోలను ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. ‘ప్రజలు, ప్రాంతాలు, జ్ఞాపకాలు, బ్లర్రుడ్‌ ఫొటోలు’ అని పోస్టు పెట్టారు. భారత క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌.. క్రికెటర్లు హార్దిక్‌ పాండ్య, కృనాల్ పాండ్యలతో కలిసి దిగిన ఫొటోలను ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. ‘ప్రజలు, ప్రాంతాలు, జ్ఞాపకాలు, బ్లర్రుడ్‌ ఫొటోలు’ అని పోస్టు పెట్టారు.
12/27
13/27
మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహానికి గురువారం తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ప్రత్యేక పూజలు చేశారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహానికి గురువారం తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ప్రత్యేక పూజలు చేశారు.
14/27
పవన్‌కల్యాణ్‌ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం హరిహర వీరమల్లు. పవన్‌కల్యాణ్‌ జన్మదినం సందర్భంగా శుక్రవారం సాయంత్రం 5.45గంటలకు ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్‌(పవర్ గ్లాన్స్‌) విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ట్విటర్‌ వేదికగా పోస్టు పెట్టింది. ‘స్వాగతిస్తుంది సమరపథం.. దూసుకొస్తుంది వీరమల్లు విజయరథం’ అని తెలిపింది. పవన్‌కల్యాణ్‌ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం హరిహర వీరమల్లు. పవన్‌కల్యాణ్‌ జన్మదినం సందర్భంగా శుక్రవారం సాయంత్రం 5.45గంటలకు ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్‌(పవర్ గ్లాన్స్‌) విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ట్విటర్‌ వేదికగా పోస్టు పెట్టింది. ‘స్వాగతిస్తుంది సమరపథం.. దూసుకొస్తుంది వీరమల్లు విజయరథం’ అని తెలిపింది.
15/27
పాకిస్థాన్‌ సింధు ప్రావిన్స్‌లోని శికర్‌పుర్‌ జిల్లాలో వరదలకు ఇల్లు కూలిపోవడంతో ఓ వ్యక్తి తన సామగ్రిని వరద నుంచి కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ముంపు ప్రాంతాల్లో నిలిచిన వరద కారణంగా ప్రజలు వ్యాధుల బారిన పడే ప్రమాదముందని అక్కడి అధికారులు తెలిపారు. వరద బాధితులకు స్వచ్ఛమైన నీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. పాకిస్థాన్‌ సింధు ప్రావిన్స్‌లోని శికర్‌పుర్‌ జిల్లాలో వరదలకు ఇల్లు కూలిపోవడంతో ఓ వ్యక్తి తన సామగ్రిని వరద నుంచి కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ముంపు ప్రాంతాల్లో నిలిచిన వరద కారణంగా ప్రజలు వ్యాధుల బారిన పడే ప్రమాదముందని అక్కడి అధికారులు తెలిపారు. వరద బాధితులకు స్వచ్ఛమైన నీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
16/27
మనీలాలోని జపనీస్‌ ఎంబసీ ఎదుట పలువురు మెరైన్‌ వైల్డ్‌ లైఫ్‌ అడ్వకేట్స్‌ వినూత్నంగా డాల్ఫిన్‌ తలలను పోలిన టోపీలను ధరించి నిరసన తెలిపారు. డాల్ఫిన్ల మృతికి కారణమయ్యే ఫిషరీస్‌ డ్రైవ్‌ను జపాన్‌లోని తైజీలో పునఃప్రారంభించడాన్ని వ్యతిరేకిస్తూ వారు ఈ కార్యక్రమం చేపట్టారు. మనీలాలోని జపనీస్‌ ఎంబసీ ఎదుట పలువురు మెరైన్‌ వైల్డ్‌ లైఫ్‌ అడ్వకేట్స్‌ వినూత్నంగా డాల్ఫిన్‌ తలలను పోలిన టోపీలను ధరించి నిరసన తెలిపారు. డాల్ఫిన్ల మృతికి కారణమయ్యే ఫిషరీస్‌ డ్రైవ్‌ను జపాన్‌లోని తైజీలో పునఃప్రారంభించడాన్ని వ్యతిరేకిస్తూ వారు ఈ కార్యక్రమం చేపట్టారు.
17/27
ఆస్ట్రేలియాలో ‘పిచ్‌బ్లాక్‌ 22’ ప్రదర్శనలో భాగంగా వివిధ దేశాలు సంయుక్త వైమానిక విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. ఇందులో పాల్గొన్న భారత వైమానిక దళం యుద్ధవిమానాలతో చేసిన విన్యాసాలు అబ్బురపరిచాయి.. ఆస్ట్రేలియాలో ‘పిచ్‌బ్లాక్‌ 22’ ప్రదర్శనలో భాగంగా వివిధ దేశాలు సంయుక్త వైమానిక విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. ఇందులో పాల్గొన్న భారత వైమానిక దళం యుద్ధవిమానాలతో చేసిన విన్యాసాలు అబ్బురపరిచాయి..
18/27
19/27
ముంబయిలోని విలే పార్లే పోలీస్‌స్టేషన్లో ఈ వినూత్న గణనాయకుడి విగ్రహం ఏర్పాటు చేశారు. నేరాలు, సైబర్‌ నేరాలు, ట్రాఫిక్‌ నియమాలపై ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ ‘పోలీస్‌ బప్పా’ను ఏర్పాటు చేశామని అక్కడి సిబ్బంది తెలిపారు. ఇక్కడే చిత్రీకరించిన ఓ పాటను ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ ఆవిష్కరించారు. ముంబయిలోని విలే పార్లే పోలీస్‌స్టేషన్లో ఈ వినూత్న గణనాయకుడి విగ్రహం ఏర్పాటు చేశారు. నేరాలు, సైబర్‌ నేరాలు, ట్రాఫిక్‌ నియమాలపై ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ ‘పోలీస్‌ బప్పా’ను ఏర్పాటు చేశామని అక్కడి సిబ్బంది తెలిపారు. ఇక్కడే చిత్రీకరించిన ఓ పాటను ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ ఆవిష్కరించారు.
20/27
21/27
ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా వైతెపా అధినేత్రి వైయస్ షర్మిల నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం బల్మూర్ మండలంలో పర్యటిస్తున్నారు. ప్రజా సమస్యలు తెలుసుకొంటూ ముందుకు సాగుతున్నారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా వైతెపా అధినేత్రి వైయస్ షర్మిల నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం బల్మూర్ మండలంలో పర్యటిస్తున్నారు. ప్రజా సమస్యలు తెలుసుకొంటూ ముందుకు సాగుతున్నారు.
22/27
ఉక్రెయిన్‌లోని క్రమటోర్స్క్‌ పట్టణంపై గత జులై నెలలో రష్యా బాంబు దాడులు జరిపింది. దీంతో అక్కడి ఓ పాఠశాల భవంతిలోని గ్రంథాలయంలో పాఠ్య పుస్తకాలు ఇలా చెల్లా చెదురుగా పడిపోయాయి. ఇటీవల అందులోకి ప్రవేశించిన గ్రంథాలయ నిర్వాహకురాలు రైసా కృప్‌చెంకో ఇలా పుస్తకాలను సేకరించారు. పాఠశాలలు ప్రారంభమైతే విద్యార్థులకు ఇవి పనికొస్తాయనే ఉద్దేశంతో సేకరిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఉక్రెయిన్‌లోని క్రమటోర్స్క్‌ పట్టణంపై గత జులై నెలలో రష్యా బాంబు దాడులు జరిపింది. దీంతో అక్కడి ఓ పాఠశాల భవంతిలోని గ్రంథాలయంలో పాఠ్య పుస్తకాలు ఇలా చెల్లా చెదురుగా పడిపోయాయి. ఇటీవల అందులోకి ప్రవేశించిన గ్రంథాలయ నిర్వాహకురాలు రైసా కృప్‌చెంకో ఇలా పుస్తకాలను సేకరించారు. పాఠశాలలు ప్రారంభమైతే విద్యార్థులకు ఇవి పనికొస్తాయనే ఉద్దేశంతో సేకరిస్తున్నట్లు ఆమె తెలిపారు.
23/27
విశాఖలోని గాజువాక లంక మైదానంలో 89 అడుగుల భారీ గణపతి కొలువుదీరాడు. దీంతో విశాఖ నలుమూలల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఎస్వీ ఎంటర్‌ప్రైజెస్‌ ఆధ్వర్యంలో 18 రోజులపాటు ఇక్కడ వేడుకలు నిర్వహించనున్నారు. విశాఖలోని గాజువాక లంక మైదానంలో 89 అడుగుల భారీ గణపతి కొలువుదీరాడు. దీంతో విశాఖ నలుమూలల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఎస్వీ ఎంటర్‌ప్రైజెస్‌ ఆధ్వర్యంలో 18 రోజులపాటు ఇక్కడ వేడుకలు నిర్వహించనున్నారు.
24/27
ముంబయి మహా నగరంలో 70 కిలోల బంగారం, 350 కిలోల వెండితో తయారు చేసిన గణపతి విగ్రహం ఏర్పాటు చేశారు. దీని నిర్మాణానికి రూ.200 కోట్లకు పైగా ఖర్చయినట్లు సమాచారం. ముంబయి మహా నగరంలో 70 కిలోల బంగారం, 350 కిలోల వెండితో తయారు చేసిన గణపతి విగ్రహం ఏర్పాటు చేశారు. దీని నిర్మాణానికి రూ.200 కోట్లకు పైగా ఖర్చయినట్లు సమాచారం.
25/27
వినాయక చవితి సందర్భంగా కొంత మంది చిన్నారులు తమ సృజనకు పదును పెడుతున్నారు. హనుమకొండ జిల్లా బాలసముద్రంలోని గురుకుల పాఠశాలకు చెందిన 5వ తరగతి విద్యార్థిని యశస్విని మందార పత్రాలతో వినాయక రూపం తయారు చేసింది. చిన్నారి ప్రతిభను స్థానికులు, ఉపాధ్యాయులు అభినందిస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా కొంత మంది చిన్నారులు తమ సృజనకు పదును పెడుతున్నారు. హనుమకొండ జిల్లా బాలసముద్రంలోని గురుకుల పాఠశాలకు చెందిన 5వ తరగతి విద్యార్థిని యశస్విని మందార పత్రాలతో వినాయక రూపం తయారు చేసింది. చిన్నారి ప్రతిభను స్థానికులు, ఉపాధ్యాయులు అభినందిస్తున్నారు.
26/27
కాలిఫోర్నియాలోని కాస్టాయిక్‌లో భారీ కార్చిచ్చు రేగింది. ఆ సమయంలో గాలులు తీవ్రంగా వీయడంతో అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హెలికాప్టర్ల సహాయంతో మంటలు ఆర్పేందుకు యత్నిస్తున్నారు. 
కాలిఫోర్నియాలోని కాస్టాయిక్‌లో భారీ కార్చిచ్చు రేగింది. ఆ సమయంలో గాలులు తీవ్రంగా వీయడంతో అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హెలికాప్టర్ల సహాయంతో మంటలు ఆర్పేందుకు యత్నిస్తున్నారు.
27/27

మరిన్ని