News In Pics: చిత్రం చెప్పే సంగతులు - 1 (18-09-2022)

Updated : 18 Sep 2022 11:32 IST
1/26
ఆటో నడుపుతూ.. చిరు నవ్వులు చిందిస్తున్నారు రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ. శనివారం సంగారెడ్డి పరేడ్‌ మైదానంలో నిర్వహించిన తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా దళితబంధు లబ్ధిదారులకు ఆటోలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, పాలనాధికారి శరత్, ఎస్పీ రమణకుమార్‌ తదితరులను ఎక్కించుకుని మహమూద్‌ అలీ కాసేపు ఆటో నడిపి.. అక్కడి వారిని ఉత్సాహ పరిచారు.  


ఆటో నడుపుతూ.. చిరు నవ్వులు చిందిస్తున్నారు రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ. శనివారం సంగారెడ్డి పరేడ్‌ మైదానంలో నిర్వహించిన తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా దళితబంధు లబ్ధిదారులకు ఆటోలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, పాలనాధికారి శరత్, ఎస్పీ రమణకుమార్‌ తదితరులను ఎక్కించుకుని మహమూద్‌ అలీ కాసేపు ఆటో నడిపి.. అక్కడి వారిని ఉత్సాహ పరిచారు.
2/26
విజయవాడ సిద్ధార్థ ఆడిటోరియంలో శనివారం ప్రదర్శించిన నందనార్‌ చరితం నృత్యరూపకం ఆకట్టుకుంది. అందులో భాగంగా శివతాండవం చేస్తున్న దీపానారాయణన్‌ సషీంద్రన్‌


విజయవాడ సిద్ధార్థ ఆడిటోరియంలో శనివారం ప్రదర్శించిన నందనార్‌ చరితం నృత్యరూపకం ఆకట్టుకుంది. అందులో భాగంగా శివతాండవం చేస్తున్న దీపానారాయణన్‌ సషీంద్రన్‌
3/26
ఇటీవల కురిసిన వర్షాలకు అనంతపురం జిల్లా శింగనమల చెరువు నిండి మరువ పారుతోంది. ప్రవాహం ధాటికి మండలంలోని పోతురాజుకాల్వ వద్ద రహదారి తెగింది. దీంతో ఈస్టునరసాపురం, సోదనపల్లి, పోతురాజుకాల్వ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పోతురాజుకాల్వ గ్రామ విద్యార్థులు సోదనపల్లిలో ఉన్న పాఠశాలకు వెళ్లాలంటే ప్రవాహాన్ని దాటి రావాలి. గత పది రోజులుగా దాదాపు 60 మంది విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ నీటి ప్రవాహాన్ని దాటుతున్నారు. 
ఇటీవల కురిసిన వర్షాలకు అనంతపురం జిల్లా శింగనమల చెరువు నిండి మరువ పారుతోంది. ప్రవాహం ధాటికి మండలంలోని పోతురాజుకాల్వ వద్ద రహదారి తెగింది. దీంతో ఈస్టునరసాపురం, సోదనపల్లి, పోతురాజుకాల్వ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పోతురాజుకాల్వ గ్రామ విద్యార్థులు సోదనపల్లిలో ఉన్న పాఠశాలకు వెళ్లాలంటే ప్రవాహాన్ని దాటి రావాలి. గత పది రోజులుగా దాదాపు 60 మంది విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ నీటి ప్రవాహాన్ని దాటుతున్నారు.
4/26
ఒంగోలు నగరంలో ప్రదర్శనగా సాగుతున్న అత్యవసర వాహనాలివి. రోగి భద్రతా దినోత్సవం సందర్భంగా దాదాపు 200 వరకు వాహనాలు ప్రధాన రహదార్లలో చైతన్యం కల్పిస్తూ ఇలా వెళ్లాయి. రమేష్‌ సంఘమిత్ర ఆసుపత్రి, అంబులెన్స్‌ అసోసియేషన్‌ సంయుక్తంగా దీనిని చేపట్టాయి. ‘అత్యవసర వాహనానికి దారి ఇవ్వండి.. మరో బ్రహ్మకండి’ అంటూ ఈ సందర్భంగా నినదించారు.  


ఒంగోలు నగరంలో ప్రదర్శనగా సాగుతున్న అత్యవసర వాహనాలివి. రోగి భద్రతా దినోత్సవం సందర్భంగా దాదాపు 200 వరకు వాహనాలు ప్రధాన రహదార్లలో చైతన్యం కల్పిస్తూ ఇలా వెళ్లాయి. రమేష్‌ సంఘమిత్ర ఆసుపత్రి, అంబులెన్స్‌ అసోసియేషన్‌ సంయుక్తంగా దీనిని చేపట్టాయి. ‘అత్యవసర వాహనానికి దారి ఇవ్వండి.. మరో బ్రహ్మకండి’ అంటూ ఈ సందర్భంగా నినదించారు.
5/26
విశాఖలోని కబేలా వద్ద మేకల్ని కోసినప్పుడు ఒక్కోసారి కడుపులో మేక పిల్లలు బతికే ఉంటాయి. అలాంటి వాటిని గవర కంచరపాలెంకు చెందిన రమేష్‌ కొనుగోలు చేస్తుంటారు. ఆ మేక పిల్లలకు తల్లిలేని లోటు తీరుస్తూ....తన ఆవు వద్దే పాలు తాగించి పెంచుతుంటారు. అలాంటి మేక పిల్లల్లో ఇదొకటి. విశాఖలోని కబేలా వద్ద మేకల్ని కోసినప్పుడు ఒక్కోసారి కడుపులో మేక పిల్లలు బతికే ఉంటాయి. అలాంటి వాటిని గవర కంచరపాలెంకు చెందిన రమేష్‌ కొనుగోలు చేస్తుంటారు. ఆ మేక పిల్లలకు తల్లిలేని లోటు తీరుస్తూ....తన ఆవు వద్దే పాలు తాగించి పెంచుతుంటారు. అలాంటి మేక పిల్లల్లో ఇదొకటి.
6/26
ఈ ఆదివారం కోడి కూరలోకి కొత్తిమీర లేకుండా సరిపెట్టుకోవాల్సిందే. ఎందుకంటే ఈ ఆకు సరఫరా తగ్గి.. ధర కొండెక్కి కూర్చుంది. సాధారణంగా కిలో రూ.80 నుంచి రూ.100 ఉండే కొత్తిమీర.. ప్రస్తుతం రూ.400 పలుకుతోంది. వరంగల్‌, ఖమ్మం మార్కెట్లకు కర్ణాటక నుంచి ఇది సరఫరా అవుతోంది. అక్కడ అధిక వర్షాల వల్ల పంట దెబ్బతినడంతో.. అరకొరగా వస్తున్న కొత్తిమీర కోసం వ్యాపారులు ఎగబడుతున్నారు. పలుచోట్ల శనివారం కిలో రూ.400 వరకూ పలికింది. మహబూబాబాద్‌ జిల్లాకు రోజుకు 20 క్వింటాళ్ల కొత్తిమీర అవసరం ఉండగా 5 క్వింటాళ్లకు మించి రావడంలేదని వ్యాపారులు తెలిపారు. ఈ ఆదివారం కోడి కూరలోకి కొత్తిమీర లేకుండా సరిపెట్టుకోవాల్సిందే. ఎందుకంటే ఈ ఆకు సరఫరా తగ్గి.. ధర కొండెక్కి కూర్చుంది. సాధారణంగా కిలో రూ.80 నుంచి రూ.100 ఉండే కొత్తిమీర.. ప్రస్తుతం రూ.400 పలుకుతోంది. వరంగల్‌, ఖమ్మం మార్కెట్లకు కర్ణాటక నుంచి ఇది సరఫరా అవుతోంది. అక్కడ అధిక వర్షాల వల్ల పంట దెబ్బతినడంతో.. అరకొరగా వస్తున్న కొత్తిమీర కోసం వ్యాపారులు ఎగబడుతున్నారు. పలుచోట్ల శనివారం కిలో రూ.400 వరకూ పలికింది. మహబూబాబాద్‌ జిల్లాకు రోజుకు 20 క్వింటాళ్ల కొత్తిమీర అవసరం ఉండగా 5 క్వింటాళ్లకు మించి రావడంలేదని వ్యాపారులు తెలిపారు.
7/26
ముతక రకం పాలిస్టర్‌, కాటన్‌ ఉత్పత్తుల స్థానంలోనే సిరిసిల్ల నేతన్నలు సరైన నైపుణ్యం, పట్టుదలతో కొత్త ఆవిష్కరణలు తీసుకువస్తున్నారు. ఇందుకోసం సాధారణ మరమగ్గాలకు డాబీ, జకార్డు పరికరాలు అమర్చి సూచించిన డిజైన్లలో పట్టు వస్త్రాలు నేస్తున్నారు. సిరిసిల్లకు చెందిన నేతన్న వెల్ది హరిప్రసాద్‌ తన యూనిట్‌లో రెండు మరమగ్గాలను ఎలక్ట్రానిక్‌ జకార్డులతో ఆధునికీకరించి పట్టు చీరలను తయారు చేస్తున్నారు.  ముతక రకం పాలిస్టర్‌, కాటన్‌ ఉత్పత్తుల స్థానంలోనే సిరిసిల్ల నేతన్నలు సరైన నైపుణ్యం, పట్టుదలతో కొత్త ఆవిష్కరణలు తీసుకువస్తున్నారు. ఇందుకోసం సాధారణ మరమగ్గాలకు డాబీ, జకార్డు పరికరాలు అమర్చి సూచించిన డిజైన్లలో పట్టు వస్త్రాలు నేస్తున్నారు. సిరిసిల్లకు చెందిన నేతన్న వెల్ది హరిప్రసాద్‌ తన యూనిట్‌లో రెండు మరమగ్గాలను ఎలక్ట్రానిక్‌ జకార్డులతో ఆధునికీకరించి పట్టు చీరలను తయారు చేస్తున్నారు.
8/26
9/26
రాజధాని అమరావతిలోని అనంతవరం గ్రామానికి చెందిన నాగేంద్రమ్మకు 76 ఏళ్లు, లక్ష్మికి 75 ఏళ్లు పూర్తయ్యాయి. వీరికి కుమారులు, కుమార్తెలు, మనవళ్లు, మునిమనవళ్లు ఉన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం వీరు రెండోసారి పాదయాత్రలో పాల్గొంటున్నారు. రైతుల మొదటి పాదయాత్రలో తుళ్లూరు నుంచి తిరుమల వరకు 45 రోజులు నడిచారు. ఇప్పుడు మహా పాదయాత్రలో అమరావతి నుంచి అరసవల్లి వరకు నడుస్తున్నారు. లక్ష్మి తన కోడలు, కుమార్తెతో కలిసి పాల్గొంటున్నారు. రాజధాని అమరావతిలోని అనంతవరం గ్రామానికి చెందిన నాగేంద్రమ్మకు 76 ఏళ్లు, లక్ష్మికి 75 ఏళ్లు పూర్తయ్యాయి. వీరికి కుమారులు, కుమార్తెలు, మనవళ్లు, మునిమనవళ్లు ఉన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం వీరు రెండోసారి పాదయాత్రలో పాల్గొంటున్నారు. రైతుల మొదటి పాదయాత్రలో తుళ్లూరు నుంచి తిరుమల వరకు 45 రోజులు నడిచారు. ఇప్పుడు మహా పాదయాత్రలో అమరావతి నుంచి అరసవల్లి వరకు నడుస్తున్నారు. లక్ష్మి తన కోడలు, కుమార్తెతో కలిసి పాల్గొంటున్నారు.
10/26
ప్రకృతి ప్రసాదిత కొండలు విశాఖ మహానగరంలో ఎంతో ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఓ వైపు నీలి సాగరం. ఎదురుగా పచ్చదనంతో అలరించే గిరులు. వీటి చెంతనే ఉన్న జనావాసాలు, భారీ బహుళ అంతస్తులు కనువిందు చేస్తుంటాయి. సింహాచలంలోని అప్పన్న కొండ శిఖరానికి చేరుకొని చూస్తే తూర్పు కనుమల్లో ఒదిగిన మధురవాడ ప్రాంతం ముచ్చటగొలుపుతోంది. ప్రకృతి ప్రసాదిత కొండలు విశాఖ మహానగరంలో ఎంతో ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఓ వైపు నీలి సాగరం. ఎదురుగా పచ్చదనంతో అలరించే గిరులు. వీటి చెంతనే ఉన్న జనావాసాలు, భారీ బహుళ అంతస్తులు కనువిందు చేస్తుంటాయి. సింహాచలంలోని అప్పన్న కొండ శిఖరానికి చేరుకొని చూస్తే తూర్పు కనుమల్లో ఒదిగిన మధురవాడ ప్రాంతం ముచ్చటగొలుపుతోంది.
11/26
నీటిపారుదల శాఖ అధికారులు నిర్లక్ష్యాన్ని వీడటం లేదు. పోలవరం ప్రాజెక్టు కుడి కాలువ పరిస్థితి చూస్తే ఇదీ అర్థమవుతోంది. ఇటీవల కురిసిన వర్షాలకు 6వ ప్యాకేజీ పరిధిలోని కృష్ణా జిల్లా గన్నవరం మండలం గొల్లనపల్లి గ్రామంలో కాలువ లైనింగ్‌ కొట్టుకుపోయింది. సూరంపల్లి శివారులో కాలువ ఎగువ నుంచి వచ్చే వర్షపు నీటి పారుదలకు సరైన సౌకర్యం కల్పించకపోవడంతో కట్టకు కోతలు పడుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటిపారుదల శాఖ అధికారులు నిర్లక్ష్యాన్ని వీడటం లేదు. పోలవరం ప్రాజెక్టు కుడి కాలువ పరిస్థితి చూస్తే ఇదీ అర్థమవుతోంది. ఇటీవల కురిసిన వర్షాలకు 6వ ప్యాకేజీ పరిధిలోని కృష్ణా జిల్లా గన్నవరం మండలం గొల్లనపల్లి గ్రామంలో కాలువ లైనింగ్‌ కొట్టుకుపోయింది. సూరంపల్లి శివారులో కాలువ ఎగువ నుంచి వచ్చే వర్షపు నీటి పారుదలకు సరైన సౌకర్యం కల్పించకపోవడంతో కట్టకు కోతలు పడుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
12/26
13/26
విజయవాడ నుంచి అమరావతి సచివాలయానికి వెళ్లే దారి దుస్థితి ఇది. ప్రకాశం బ్యారేజీ దాటిన తర్వాత ఉండవల్లి కరకట్ట, సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు, మందడం మీదుగా సచివాలయానికి వెళ్తుంది. ఈ మార్గం మీదుగానే సీఎం సహా మంత్రులు, ఉన్నతాధికారులు, సచివాలయ సిబ్బంది, ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. ఉండవల్లి కరకట్ట మీద దారి రెండు వైపులా కుంగిపోయింది. గుంతలు పడింది. సీడ్‌ యాక్సిస్‌ రోడ్డుపై మట్టి పేరుకుపోయింది. దుమ్ము లేస్తోంది. దీన్నుంచి మందడంలోకి వెళ్లే దారి గుంతలు పడింది. గోతులు ఎక్కువగా ఉండటం వల్ల నిత్యం ట్రాఫిక్‌ సమస్య ఏర్పడుతోంది. విజయవాడ నుంచి అమరావతి సచివాలయానికి వెళ్లే దారి దుస్థితి ఇది. ప్రకాశం బ్యారేజీ దాటిన తర్వాత ఉండవల్లి కరకట్ట, సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు, మందడం మీదుగా సచివాలయానికి వెళ్తుంది. ఈ మార్గం మీదుగానే సీఎం సహా మంత్రులు, ఉన్నతాధికారులు, సచివాలయ సిబ్బంది, ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. ఉండవల్లి కరకట్ట మీద దారి రెండు వైపులా కుంగిపోయింది. గుంతలు పడింది. సీడ్‌ యాక్సిస్‌ రోడ్డుపై మట్టి పేరుకుపోయింది. దుమ్ము లేస్తోంది. దీన్నుంచి మందడంలోకి వెళ్లే దారి గుంతలు పడింది. గోతులు ఎక్కువగా ఉండటం వల్ల నిత్యం ట్రాఫిక్‌ సమస్య ఏర్పడుతోంది.
14/26
విశాఖ చినముషిడివాడకు చెందిన షబ్బీర్‌ అహ్మద్‌ తన ఆలోచనను ఆచరణలోకి తీసుకువచ్చి ఉపాధి పొందుతున్నారు. విశాఖ నుంచి అరకు వెళ్లే దారిలో కార్లు, బైకులు, ఇతర వాహనాల టైర్లు పేలినా, పంక్చరైనా ఒక్కోసారి నిర్జన ప్రాంతాల్లో ఆగిపోవాల్సి వస్తుంది. అలాంటి వారి కోసమే అహ్మద్‌ ఓ రిక్షాను తయారు చేయించుకున్నారు. దీనికి డీజిల్‌ ఇంజిన్‌ అమర్చారు. రిక్షాపై గాలి నింపే యంత్రాన్ని ఏర్పాటు చేశారు. ఒకే ఇంజిన్‌తో అటు వాహనం, ఇటు గాలి నింపే యంత్రం పనిచేసేలా రూపొందించారు. ఫోన్‌ చేసిన వెంటనే వారున్న చోటుకే వెళ్లి వాహనాలకు మరమ్మతులు చేస్తానని పేర్కొన్నారు. విశాఖ చినముషిడివాడకు చెందిన షబ్బీర్‌ అహ్మద్‌ తన ఆలోచనను ఆచరణలోకి తీసుకువచ్చి ఉపాధి పొందుతున్నారు. విశాఖ నుంచి అరకు వెళ్లే దారిలో కార్లు, బైకులు, ఇతర వాహనాల టైర్లు పేలినా, పంక్చరైనా ఒక్కోసారి నిర్జన ప్రాంతాల్లో ఆగిపోవాల్సి వస్తుంది. అలాంటి వారి కోసమే అహ్మద్‌ ఓ రిక్షాను తయారు చేయించుకున్నారు. దీనికి డీజిల్‌ ఇంజిన్‌ అమర్చారు. రిక్షాపై గాలి నింపే యంత్రాన్ని ఏర్పాటు చేశారు. ఒకే ఇంజిన్‌తో అటు వాహనం, ఇటు గాలి నింపే యంత్రం పనిచేసేలా రూపొందించారు. ఫోన్‌ చేసిన వెంటనే వారున్న చోటుకే వెళ్లి వాహనాలకు మరమ్మతులు చేస్తానని పేర్కొన్నారు.
15/26
 రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో విశాఖలోని సింహాచలం అప్పన్న ఆలయం ఒకటి. నిత్యం భక్తులు మెట్ల మార్గంలో పసుపు, కుంకుమ రాస్తూ కొండపైకి వెళుతుంటారు. ఇంతటి కీలకమైన మెట్ల మార్గం ఇటీవల కురిసిన వర్షాలకు అధ్వానంగా మారింది. పలుచోట్ల నాచుపట్టి దారుణంగా తయారైంది. వరదకు కొట్టుకు వచ్చిన రాళ్లు మధ్యలో పేరుకుపోయి భక్తుల సహనానికి పరీక్ష పెడుతున్నాయి. కొండపై నుంచి దిగువకు పారే నీరు కొన్ని చోట్ల మెట్ల మార్గంలోకి రావడంతో ప్రమాదకర పరిస్థితులు ఎదురవుతున్నాయి. రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో విశాఖలోని సింహాచలం అప్పన్న ఆలయం ఒకటి. నిత్యం భక్తులు మెట్ల మార్గంలో పసుపు, కుంకుమ రాస్తూ కొండపైకి వెళుతుంటారు. ఇంతటి కీలకమైన మెట్ల మార్గం ఇటీవల కురిసిన వర్షాలకు అధ్వానంగా మారింది. పలుచోట్ల నాచుపట్టి దారుణంగా తయారైంది. వరదకు కొట్టుకు వచ్చిన రాళ్లు మధ్యలో పేరుకుపోయి భక్తుల సహనానికి పరీక్ష పెడుతున్నాయి. కొండపై నుంచి దిగువకు పారే నీరు కొన్ని చోట్ల మెట్ల మార్గంలోకి రావడంతో ప్రమాదకర పరిస్థితులు ఎదురవుతున్నాయి.
16/26
తూర్పు ఉక్రెయిన్‌లోని రష్యా మద్దతున్న వేర్పాటువాదుల నియంత్రణలో ఉన్న దొనెట్స్క్‌ ప్రాంతంలో దాడుల్లో దహనమవుతున్న వాహనం తూర్పు ఉక్రెయిన్‌లోని రష్యా మద్దతున్న వేర్పాటువాదుల నియంత్రణలో ఉన్న దొనెట్స్క్‌ ప్రాంతంలో దాడుల్లో దహనమవుతున్న వాహనం
17/26
ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని దిల్లీలోని కన్నాట్‌ప్లేస్‌లో ఓ రెస్టారెంట్‌ శనివారం అందుబాటులోకి తెచ్చిన 56 అంగుళాల థాలీ (ప్లేటు భోజనం) ఇది. 56 వంటకాలతో కూడిన ఈ భోజనం శనివారం నుంచి 10 రోజులపాటు వినియోగదారులకు అందుబాటులో ఉండనుంది. ఈ థాలీని ఎవరైనా 40 నిమిషాల్లో ఆరగిస్తే రూ.8.5 లక్షల నగదు బహుమతి ఇవ్వనున్నట్లు రెస్టారెంట్‌ యాజమాన్యం ప్రకటించింది. ఇద్దరు విజేతలను ఎంపిక చేసి కేదార్‌నాథ్‌ యాత్రకు కూడా పంపుతామని తెలిపింది.


ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని దిల్లీలోని కన్నాట్‌ప్లేస్‌లో ఓ రెస్టారెంట్‌ శనివారం అందుబాటులోకి తెచ్చిన 56 అంగుళాల థాలీ (ప్లేటు భోజనం) ఇది. 56 వంటకాలతో కూడిన ఈ భోజనం శనివారం నుంచి 10 రోజులపాటు వినియోగదారులకు అందుబాటులో ఉండనుంది. ఈ థాలీని ఎవరైనా 40 నిమిషాల్లో ఆరగిస్తే రూ.8.5 లక్షల నగదు బహుమతి ఇవ్వనున్నట్లు రెస్టారెంట్‌ యాజమాన్యం ప్రకటించింది. ఇద్దరు విజేతలను ఎంపిక చేసి కేదార్‌నాథ్‌ యాత్రకు కూడా పంపుతామని తెలిపింది.
18/26
 అన్నదాతల రెక్కల కష్టానికి ప్రతిరూపంగా పంట చేలు, కనుచూపు మేర పరుచుకున్న పచ్చదనం, ప్రకృతి ఒడిలో ఒదిగిన పల్లె ప్రకృతి రమణీయతకు అద్దం పడుతుంది. వాంకిడి మండలంలోని దొడ్డిగూడ గ్రామం దగ్గర ఈ దృశ్యం కనిపించింది. డోంగరగావ్‌ గుట్టు మీద నుంచి చూస్తే ఆహ్లాదకరమైన పరిసరాలు కనువిందు చేస్తున్నాయి. అన్నదాతల రెక్కల కష్టానికి ప్రతిరూపంగా పంట చేలు, కనుచూపు మేర పరుచుకున్న పచ్చదనం, ప్రకృతి ఒడిలో ఒదిగిన పల్లె ప్రకృతి రమణీయతకు అద్దం పడుతుంది. వాంకిడి మండలంలోని దొడ్డిగూడ గ్రామం దగ్గర ఈ దృశ్యం కనిపించింది. డోంగరగావ్‌ గుట్టు మీద నుంచి చూస్తే ఆహ్లాదకరమైన పరిసరాలు కనువిందు చేస్తున్నాయి.
19/26
 గాదిగూడ మండలంలోని అర్జుని భీంజీగూడ బోరుబావి నుంచి భూగర్భజలం ఉబికి వస్తోంది. ఇక్కడ చేతిపంపునకే బోరుబావి బిగించారు. విద్యుత్తు మోటారు ఆన్‌ చేయకుండానే నీరు పైకి వస్తున్న దృశ్యాన్ని ‘న్యూస్‌టుడే’ శనివారం క్లిక్‌మనిపించింది. గాదిగూడ మండలంలోని అర్జుని భీంజీగూడ బోరుబావి నుంచి భూగర్భజలం ఉబికి వస్తోంది. ఇక్కడ చేతిపంపునకే బోరుబావి బిగించారు. విద్యుత్తు మోటారు ఆన్‌ చేయకుండానే నీరు పైకి వస్తున్న దృశ్యాన్ని ‘న్యూస్‌టుడే’ శనివారం క్లిక్‌మనిపించింది.
20/26
  తెలంగాణ సమైక్యతా వజ్రోత్సవాల వేళ రెండు రోజులుగా ఖమ్మం పాత బస్టాండు ఎదుట  గాంధీ వేషధారణలో కన్పిస్తున్న ఈ బాలికను జనం ఆసక్తిగా గమనిస్తున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన దంపతులు దేవరపు శివ, మౌనిక కూతురు ఈ పదేళ్ల రేణుక. తమ కూతురు నోట్లో నాలుక లేకుండానే పుట్టిందని తల్లి మౌనిక తెలిపింది. మాట రాకున్నా తాను మాత్రం దారిలో గాంధీ వేషధారణలో పొద్దస్తమానం నిలుచుని కుటుంబాన్ని నిలబెడుతోంది. తెలంగాణ సమైక్యతా వజ్రోత్సవాల వేళ రెండు రోజులుగా ఖమ్మం పాత బస్టాండు ఎదుట గాంధీ వేషధారణలో కన్పిస్తున్న ఈ బాలికను జనం ఆసక్తిగా గమనిస్తున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన దంపతులు దేవరపు శివ, మౌనిక కూతురు ఈ పదేళ్ల రేణుక. తమ కూతురు నోట్లో నాలుక లేకుండానే పుట్టిందని తల్లి మౌనిక తెలిపింది. మాట రాకున్నా తాను మాత్రం దారిలో గాంధీ వేషధారణలో పొద్దస్తమానం నిలుచుని కుటుంబాన్ని నిలబెడుతోంది.
21/26
22/26
 జాతీయ సమైక్యతా  వజ్రోత్సవాలను పురస్కరించుకుని నగర పాలక సంస్థ హనుమకొండ జిల్లా సమీకృత కార్యాలయాల భవనం, ప్రధాన కూడళ్లను  విద్యుద్దీపాలతో అలంకరించింది. డ్రోన్‌తో తీసిన చిత్రాలను బల్దియా ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేసింది. జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను పురస్కరించుకుని నగర పాలక సంస్థ హనుమకొండ జిల్లా సమీకృత కార్యాలయాల భవనం, ప్రధాన కూడళ్లను విద్యుద్దీపాలతో అలంకరించింది. డ్రోన్‌తో తీసిన చిత్రాలను బల్దియా ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేసింది.
23/26
జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను పురస్కరించుకొని హనుమకొండ గోపాలపురానికి చెందిన సూక్ష్మ కళాకారుడు తాటికొండ శ్రీజిత్‌ 27 ఆభరణాలకు ఉపయోగించే రాళ్లతో ఒక సెంటిమీటర్‌ ఎత్తుగల జాతీయ జెండా రూపొందించాడు. ప్రస్తుతం శ్రీజిత్‌ నగరంలో బీటెక్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.  జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను పురస్కరించుకొని హనుమకొండ గోపాలపురానికి చెందిన సూక్ష్మ కళాకారుడు తాటికొండ శ్రీజిత్‌ 27 ఆభరణాలకు ఉపయోగించే రాళ్లతో ఒక సెంటిమీటర్‌ ఎత్తుగల జాతీయ జెండా రూపొందించాడు. ప్రస్తుతం శ్రీజిత్‌ నగరంలో బీటెక్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.
24/26
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల సందర్భంగా శనివారం దేవరుప్పులలో బాలయేసు పాఠశాల విద్యార్థులు 75 మీటర్ల పొడవైన జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. స్థానిక ప్రధాన చౌరస్తాలో తెలంగాణ సాయుధ పోరాట అమరవీరులకు  నివాళులర్పించారు. జాతీయ, రాష్ట్ర గీతాలు ఆలపించారు. కార్యక్రమంలో కరస్పాండెంట్ జేసురాజు, ఉపాధ్యాయులు రమాదేవి, ఖాజ, భాస్కర్, అనిత తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల సందర్భంగా శనివారం దేవరుప్పులలో బాలయేసు పాఠశాల విద్యార్థులు 75 మీటర్ల పొడవైన జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. స్థానిక ప్రధాన చౌరస్తాలో తెలంగాణ సాయుధ పోరాట అమరవీరులకు నివాళులర్పించారు. జాతీయ, రాష్ట్ర గీతాలు ఆలపించారు. కార్యక్రమంలో కరస్పాండెంట్ జేసురాజు, ఉపాధ్యాయులు రమాదేవి, ఖాజ, భాస్కర్, అనిత తదితరులు పాల్గొన్నారు.
25/26
 (ములుగు జిల్లా) వెంకటాపురం మండలంలో కర్షకులు పంటలను కాపాడుకునేందుకు నానాపాట్లు పడుతున్నారు. విద్యుత్తు నియంత్రికలను అమర్చకపోవడంతో సాగునీరు అందని పరిస్థితి ఉదయించింది. చేసేదేమీ లేక ట్యాంకర్ల ద్వారా నీటిని సేకరించుకుని ప్రతి మొక్కకు బిందెలతో అందిస్తున్నారు. వెంకటాపురం శివారులోని ఓ రైతు టమాట పంటకు కూలీల సాయంతో బిందెలతో నీటిని పోస్తున్న చిత్రాన్ని ‘న్యూస్‌టుడే’ ఛాయాగ్రాహకంలో బంధించింది. (ములుగు జిల్లా) వెంకటాపురం మండలంలో కర్షకులు పంటలను కాపాడుకునేందుకు నానాపాట్లు పడుతున్నారు. విద్యుత్తు నియంత్రికలను అమర్చకపోవడంతో సాగునీరు అందని పరిస్థితి ఉదయించింది. చేసేదేమీ లేక ట్యాంకర్ల ద్వారా నీటిని సేకరించుకుని ప్రతి మొక్కకు బిందెలతో అందిస్తున్నారు. వెంకటాపురం శివారులోని ఓ రైతు టమాట పంటకు కూలీల సాయంతో బిందెలతో నీటిని పోస్తున్న చిత్రాన్ని ‘న్యూస్‌టుడే’ ఛాయాగ్రాహకంలో బంధించింది.
26/26
 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం తన పుట్టిన రోజు సందర్భంగా 8 చీతాలను మధ్యప్రదేశ్‌లోని కునో జాతీయ పార్కులో వదిలిపెట్టారు. వీటిని నమీబియా నుంచి ప్రత్యేక విమానంలో తీసుకొచ్చారు. ఇవి 70 ఏళ్ల కిందటే మన దేశంలో అంతరించిపోయాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం తన పుట్టిన రోజు సందర్భంగా 8 చీతాలను మధ్యప్రదేశ్‌లోని కునో జాతీయ పార్కులో వదిలిపెట్టారు. వీటిని నమీబియా నుంచి ప్రత్యేక విమానంలో తీసుకొచ్చారు. ఇవి 70 ఏళ్ల కిందటే మన దేశంలో అంతరించిపోయాయి.

మరిన్ని