News In Pics: చిత్రం చెప్పే సంగతులు - 2 (19-09-2022)

Updated : 19 Sep 2022 20:41 IST
1/22
హైదరాబాద్‌ మధురానగర్‌ కాలనీలోని ఓ పాఠశాల యాజమాన్యం విద్యార్థుల చదువులు, ఆటపాటలకు సంబంధించిన ఫొటోలను పాఠశాల చుట్టూ, మెట్ల మార్గం పైన వారికి స్ఫూర్తిని కలిగించేలా ఏర్పాటు చేస్తోంది. ఈ ఫొటోలకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ముగ్ధులవుతున్నారు. హైదరాబాద్‌ మధురానగర్‌ కాలనీలోని ఓ పాఠశాల యాజమాన్యం విద్యార్థుల చదువులు, ఆటపాటలకు సంబంధించిన ఫొటోలను పాఠశాల చుట్టూ, మెట్ల మార్గం పైన వారికి స్ఫూర్తిని కలిగించేలా ఏర్పాటు చేస్తోంది. ఈ ఫొటోలకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ముగ్ధులవుతున్నారు.
2/22
నంద్యాల జిల్లా జూపాడుబంగ్లాకు చెందిన వెంకటేశ్వరరావు తన 3ఎకరాల్లో సాగు చేసిన బంతిపూలను అమరావతి రైతుల పాదయాత్రకు పంపిస్తున్నట్లు తెలిపారు. ఏటా బంతిపూల సాగు చేపడుతున్నట్లు ఆయన చెప్పారు. ఈ తోట ఆ విరగబూసి ఆ మార్గంలో వెళ్లే వారికి కనువిందు చేస్తోంది. నంద్యాల జిల్లా జూపాడుబంగ్లాకు చెందిన వెంకటేశ్వరరావు తన 3ఎకరాల్లో సాగు చేసిన బంతిపూలను అమరావతి రైతుల పాదయాత్రకు పంపిస్తున్నట్లు తెలిపారు. ఏటా బంతిపూల సాగు చేపడుతున్నట్లు ఆయన చెప్పారు. ఈ తోట ఆ విరగబూసి ఆ మార్గంలో వెళ్లే వారికి కనువిందు చేస్తోంది.
3/22
4/22
విజయవాడలో హైలైఫ్‌ ఎగ్జిబిషన్‌ కర్టెన్‌రైజర్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు మోడల్స్‌ పాల్గొని ర్యాంప్‌ వాక్‌ చేయడంతో ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు. విజయవాడలో హైలైఫ్‌ ఎగ్జిబిషన్‌ కర్టెన్‌రైజర్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు మోడల్స్‌ పాల్గొని ర్యాంప్‌ వాక్‌ చేయడంతో ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.
5/22
6/22
7/22
8/22
భారత్‌ జోడో యాత్రలో భాగంగా కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కేరళలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన స్థానికులతో కలిసి స్నేక్ బోట్‌ రోయింగ్‌ రేసులో పాల్గొని సందడి చేశారు. భారత్‌ జోడో యాత్రలో భాగంగా కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కేరళలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన స్థానికులతో కలిసి స్నేక్ బోట్‌ రోయింగ్‌ రేసులో పాల్గొని సందడి చేశారు.
9/22
10/22
హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అజహరుద్దీన్‌ గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ను రాజ్‌భవన్‌లో కలిశారు. సెప్టెంబర్‌ 25న హైదరాబాద్‌లో జరగనున్న భారత్‌-ఆస్ట్రేలియా టీ20 క్రికెట్‌ మ్యాచ్‌కు ఆమెను ఆహ్వానించారు. హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అజహరుద్దీన్‌ గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ను రాజ్‌భవన్‌లో కలిశారు. సెప్టెంబర్‌ 25న హైదరాబాద్‌లో జరగనున్న భారత్‌-ఆస్ట్రేలియా టీ20 క్రికెట్‌ మ్యాచ్‌కు ఆమెను ఆహ్వానించారు.
11/22
12/22
అయోధ్య జిల్లాలోని పూర్వ గ్రామంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు గుడి కట్టారు. ఇందులో యోగి బాణం, విల్లుతో రాముడి అవతారంలో ఉండటం విశేషం. అయోధ్యకు చెందిన ప్రభాకర్‌ మౌర్య ఈ ఆలయాన్ని నిర్మించారు. అయోధ్య రామాలయాన్ని నిర్మించే వ్యక్తిని పూజిస్తానని గతంలో చేసుకున్న మొక్కులో భాగంగా ఆయన ఈ ఆలయాన్ని నిర్మించారు. అయోధ్య జిల్లాలోని పూర్వ గ్రామంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు గుడి కట్టారు. ఇందులో యోగి బాణం, విల్లుతో రాముడి అవతారంలో ఉండటం విశేషం. అయోధ్యకు చెందిన ప్రభాకర్‌ మౌర్య ఈ ఆలయాన్ని నిర్మించారు. అయోధ్య రామాలయాన్ని నిర్మించే వ్యక్తిని పూజిస్తానని గతంలో చేసుకున్న మొక్కులో భాగంగా ఆయన ఈ ఆలయాన్ని నిర్మించారు.
13/22
దివంగత నటుడు కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవిని వైఎస్‌ విజయమ్మ పరామర్శించారు. అనంతరం కృష్ణంరాజు చిత్రపటానికి నివాళి అర్పించారు. దివంగత నటుడు కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవిని వైఎస్‌ విజయమ్మ పరామర్శించారు. అనంతరం కృష్ణంరాజు చిత్రపటానికి నివాళి అర్పించారు.
14/22
15/22
హైదరాబాద్‌ నగరంలో సోమవారం సూర్యుడి చుట్టూ వరదగూడు(వరదగుడి) కనిపించి ఆకట్టుకుంది. హైదరాబాద్‌ నగరంలో సోమవారం సూర్యుడి చుట్టూ వరదగూడు(వరదగుడి) కనిపించి ఆకట్టుకుంది.
16/22
ఫియోనా హరికేన్‌ ప్రభావంతో ప్యూర్టో రికోలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో అక్కడి కెయెలో ఓ ఇల్లు ఇలా వరద నీటిలో మునిగింది. అందులో చిక్కుకున్న ముగ్గురిని కాపాడేందుకు సహాయక దళాలు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఫియోనా హరికేన్‌ ప్రభావంతో ప్యూర్టో రికోలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో అక్కడి కెయెలో ఓ ఇల్లు ఇలా వరద నీటిలో మునిగింది. అందులో చిక్కుకున్న ముగ్గురిని కాపాడేందుకు సహాయక దళాలు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
17/22
18/22
జపాన్‌లో నన్మడొల్‌ తుపాను ప్రభావంతో భారీవర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి అకి తీరంలో కెరటాలు ఉవ్వెత్తున ఎగిసి పడ్డాయి. జపాన్‌లో నన్మడొల్‌ తుపాను ప్రభావంతో భారీవర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి అకి తీరంలో కెరటాలు ఉవ్వెత్తున ఎగిసి పడ్డాయి.
19/22
హైదరాబాద్‌ తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని రావిర్యాల పెద్దచెరువులో చేప పిల్లలను వదులుతున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి. హైదరాబాద్‌ తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని రావిర్యాల పెద్దచెరువులో చేప పిల్లలను వదులుతున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి.
20/22
హైదరాబాద్ నగరంలోని పార్కుల్లో సందర్శకులను ఆకట్టుకొనేందుకు వైవిధ్యమైన బల్లలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందిరా పార్క్‌లో గుర్రం ఆకారంలో ఈ బల్లను ఏర్పాటు చేయగా.. ఓ చిన్నారి దానిపై ఎక్కి ఇలా మురిసిపోయింది. 
హైదరాబాద్ నగరంలోని పార్కుల్లో సందర్శకులను ఆకట్టుకొనేందుకు వైవిధ్యమైన బల్లలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందిరా పార్క్‌లో గుర్రం ఆకారంలో ఈ బల్లను ఏర్పాటు చేయగా.. ఓ చిన్నారి దానిపై ఎక్కి ఇలా మురిసిపోయింది.
21/22
తిరుమలలో ఆర్టీసీ ఎలక్ట్రిక్‌ బస్సుతో ట్రయల్ రన్‌ నిర్వహించారు. ఆర్టీసీ నిపుణులు అందులో ప్రయాణిస్తూ తిరుపతి నుంచి రెండో కనుమ దారి గుండా తిరుమలకు చేరుకున్నారు. ఎత్తైన ప్రదేశాలు, మలుపుల వద్ద బస్సు పనితీరును పరిశీలించారు. తిరుమల కొండపై కాలుష్యాన్ని తగ్గించే ఉద్దేశంతో ఈ బస్సు సర్వీసులను త్వరలో ప్రవేశపెట్టనున్నారు. 
తిరుమలలో ఆర్టీసీ ఎలక్ట్రిక్‌ బస్సుతో ట్రయల్ రన్‌ నిర్వహించారు. ఆర్టీసీ నిపుణులు అందులో ప్రయాణిస్తూ తిరుపతి నుంచి రెండో కనుమ దారి గుండా తిరుమలకు చేరుకున్నారు. ఎత్తైన ప్రదేశాలు, మలుపుల వద్ద బస్సు పనితీరును పరిశీలించారు. తిరుమల కొండపై కాలుష్యాన్ని తగ్గించే ఉద్దేశంతో ఈ బస్సు సర్వీసులను త్వరలో ప్రవేశపెట్టనున్నారు.
22/22
బ్రిటన్‌ రాణి ఎలిజబెత్ 2 అంత్యక్రియల్లో పాల్గొనేందుకు లండన్‌ వెళ్లిన భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కింగ్ ఛార్లెస్‌ 3ను పరామర్శించారు. బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌లో ఆయనను కలిసి రాణి మృతిపట్ల సంతాపం తెలిపారు. బ్రిటన్‌ రాణి ఎలిజబెత్ 2 అంత్యక్రియల్లో పాల్గొనేందుకు లండన్‌ వెళ్లిన భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కింగ్ ఛార్లెస్‌ 3ను పరామర్శించారు. బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌లో ఆయనను కలిసి రాణి మృతిపట్ల సంతాపం తెలిపారు.

మరిన్ని