News In Pics: చిత్రం చెప్పే సంగతులు - 1 (22-09-2022)

Updated : 22 Sep 2022 11:17 IST
1/16
విశాఖ కేజీహెచ్‌లో కొన్ని సమస్యలు రోగులతో పాటు కుటుంబ సభ్యులకు, వైద్య సిబ్బందికి పరీక్షగా మారుతున్నాయి. అంతర్గత దారులు దారుణంగా తయారై నిత్యం ఆపసోపాలు తప్పటం లేదు. బుధవారం ఇక్కడి కొండపైన ఉన్న ఓ విభాగం నుంచి మరో విభాగానికి రోగిని తీసుకువెళ్లే క్రమంలో అడుగడుగునా హడలిపోయారు. దారి సరిగా లేకపోవడంతో స్ట్రెచర్‌పైన ఉన్న రోగిని ఆరుగురు వ్యక్తులు చాలా జాగ్రత్తగా తీసుకువెళ్లారు. స్ట్రెచర్‌ చక్రాలు ఏ మాత్రం అదుపు తప్పినా...విరిగినా ఇక్కట్లు తప్పవు. ఉత్తరాంధ్ర జిల్లాలకు ఎంతో కీలకమైన కేజీహెచ్‌లో అంతర్గత దారులకు మరమ్మతులు చేయించాలని ఇప్పటికే పలువురు విన్నవించారు. విశాఖ కేజీహెచ్‌లో కొన్ని సమస్యలు రోగులతో పాటు కుటుంబ సభ్యులకు, వైద్య సిబ్బందికి పరీక్షగా మారుతున్నాయి. అంతర్గత దారులు దారుణంగా తయారై నిత్యం ఆపసోపాలు తప్పటం లేదు. బుధవారం ఇక్కడి కొండపైన ఉన్న ఓ విభాగం నుంచి మరో విభాగానికి రోగిని తీసుకువెళ్లే క్రమంలో అడుగడుగునా హడలిపోయారు. దారి సరిగా లేకపోవడంతో స్ట్రెచర్‌పైన ఉన్న రోగిని ఆరుగురు వ్యక్తులు చాలా జాగ్రత్తగా తీసుకువెళ్లారు. స్ట్రెచర్‌ చక్రాలు ఏ మాత్రం అదుపు తప్పినా...విరిగినా ఇక్కట్లు తప్పవు. ఉత్తరాంధ్ర జిల్లాలకు ఎంతో కీలకమైన కేజీహెచ్‌లో అంతర్గత దారులకు మరమ్మతులు చేయించాలని ఇప్పటికే పలువురు విన్నవించారు.
2/16
3/16
విశాఖ జిల్లా దొండపర్తిలో 102 అడుగుల వినాయక విగ్రహాన్ని బుధవారం ఉన్న చోటే నీళ్లతో కరిగించి నిమజ్జన ప్రక్రియ పూర్తి చేశారు.  విశాఖ జిల్లా దొండపర్తిలో 102 అడుగుల వినాయక విగ్రహాన్ని బుధవారం ఉన్న చోటే నీళ్లతో కరిగించి నిమజ్జన ప్రక్రియ పూర్తి చేశారు.
4/16
సాయంత్రం అయిందంటే చాలా గ్రామాలకు చేరేందుకు ఉరుకులు, పరుగులు.. తొందరగా వెళ్లేందుకు కాదు.. ఎక్కడ బస్సు వెళ్లిపోతుందోనని. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రం నుంచి దుగ్గేరు గ్రామానికి వెళ్లేందుకు సాయంత్రం ఒక్కటే ఆర్టీసీ బస్సు ఉంటుంది. దీంతో విద్యార్థులు, ఉద్యోగులు, ప్రయాణికులు తమ స్వగ్రామాలకు చేరుకునేందుకు నిత్యం ఇబ్బంది పడుతున్నారు. వాహనం ప్రయాణికులతో నిండడంతో ఫుట్‌రెస్ట్, వెనుకనున్న నిచ్చెన, వాహనంపైకి ఎక్కి ప్రమాదకరంగా ప్రయాణం చేస్తున్నారు. దీనిపై ఆర్టీసీ జిల్లా ప్రజా రవాణా అధికారి సుధాకర్‌ వద్ద ‘న్యూస్‌టుడే’ ప్రస్తావించగా పరిశీలించి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. సాయంత్రం అయిందంటే చాలా గ్రామాలకు చేరేందుకు ఉరుకులు, పరుగులు.. తొందరగా వెళ్లేందుకు కాదు.. ఎక్కడ బస్సు వెళ్లిపోతుందోనని. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రం నుంచి దుగ్గేరు గ్రామానికి వెళ్లేందుకు సాయంత్రం ఒక్కటే ఆర్టీసీ బస్సు ఉంటుంది. దీంతో విద్యార్థులు, ఉద్యోగులు, ప్రయాణికులు తమ స్వగ్రామాలకు చేరుకునేందుకు నిత్యం ఇబ్బంది పడుతున్నారు. వాహనం ప్రయాణికులతో నిండడంతో ఫుట్‌రెస్ట్, వెనుకనున్న నిచ్చెన, వాహనంపైకి ఎక్కి ప్రమాదకరంగా ప్రయాణం చేస్తున్నారు. దీనిపై ఆర్టీసీ జిల్లా ప్రజా రవాణా అధికారి సుధాకర్‌ వద్ద ‘న్యూస్‌టుడే’ ప్రస్తావించగా పరిశీలించి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
5/16
కనుచూపు మేర కొండలు, పచ్చని చెట్లు.. వాటిమధ్య ముత్యాలహారంలా జలపాతాలు. సుమనోహరంగా కనిపించే వాగులు... మోతుగూడెం ప్రాంతం సొంతం. ప్రకృతి ప్రేమికుల మనసు ఈ ప్రాంతాన్ని చూడగానే తన్మయత్వంతో పులకించిపోతుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చుట్టుపక్కల ప్రాంతాల్లోని జలపాతాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. పొల్లూరు ఎగువ, దిగువ, సుకుమామిడి, సీలేరు సమీపంలోని ఐస్‌గెడ్డ జలపాతాలు జాలువారుతున్న జలసవ్వడితో చూపరులను కట్టిపడేస్తున్నాయి. కనుచూపు మేర కొండలు, పచ్చని చెట్లు.. వాటిమధ్య ముత్యాలహారంలా జలపాతాలు. సుమనోహరంగా కనిపించే వాగులు... మోతుగూడెం ప్రాంతం సొంతం. ప్రకృతి ప్రేమికుల మనసు ఈ ప్రాంతాన్ని చూడగానే తన్మయత్వంతో పులకించిపోతుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చుట్టుపక్కల ప్రాంతాల్లోని జలపాతాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. పొల్లూరు ఎగువ, దిగువ, సుకుమామిడి, సీలేరు సమీపంలోని ఐస్‌గెడ్డ జలపాతాలు జాలువారుతున్న జలసవ్వడితో చూపరులను కట్టిపడేస్తున్నాయి.
6/16
7/16
ఉపాధ్యాయుల ఆన్‌లైన్‌ హాజరు నమోదుకు మన్యంలో ఇబ్బందులు తప్పడం లేదు. ప్రతి ఉపాధ్యాయుడు తమ చరవాణిలో సెల్ఫీ అప్‌లోడ్‌ చేసి హాజరు నమోదు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. గిరిజన ప్రాంతంలో నెట్‌వర్క్‌ సమస్యతో ఉపాధ్యాయులు కొండలు, గుట్టలు ఎక్కాల్సి వస్తోంది. అడ్డతీగల మండలం డి.భీమవరం బాలుర ఆశ్రమ పాఠశాలలో 14 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. పాఠశాల వద్ద నెట్వర్క్‌ లేకపోవడంతో బుధవారం వీరంతా ఊరి చివర కొండపైకి వెళ్లి హాజరు నమోదు చేసుకున్నారు. ఉపాధ్యాయుల ఆన్‌లైన్‌ హాజరు నమోదుకు మన్యంలో ఇబ్బందులు తప్పడం లేదు. ప్రతి ఉపాధ్యాయుడు తమ చరవాణిలో సెల్ఫీ అప్‌లోడ్‌ చేసి హాజరు నమోదు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. గిరిజన ప్రాంతంలో నెట్‌వర్క్‌ సమస్యతో ఉపాధ్యాయులు కొండలు, గుట్టలు ఎక్కాల్సి వస్తోంది. అడ్డతీగల మండలం డి.భీమవరం బాలుర ఆశ్రమ పాఠశాలలో 14 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. పాఠశాల వద్ద నెట్వర్క్‌ లేకపోవడంతో బుధవారం వీరంతా ఊరి చివర కొండపైకి వెళ్లి హాజరు నమోదు చేసుకున్నారు.
8/16
పోషకాలున్న ఆహారాన్ని తీసుకుంటేనే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని మెదక్‌ జిల్లా స్త్రీ, శిశు సంక్షేమాధికారిణి బ్రహ్మాజీ, చేగుంట ఎంపీపీ మాసుల శ్రీనివాస్‌ అన్నారు. బుధవారం చేగుంటలో ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో మండల స్థాయి పోషకాహార వారోత్సవాలు నిర్వహించారు. మహిళలకు అవగాహన కోసం కూరగాయలతో బతుకమ్మ తయారు చేసి ఆసక్తి కలిగేలా వివరించారు. పోషకాలున్న ఆహారాన్ని తీసుకుంటేనే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని మెదక్‌ జిల్లా స్త్రీ, శిశు సంక్షేమాధికారిణి బ్రహ్మాజీ, చేగుంట ఎంపీపీ మాసుల శ్రీనివాస్‌ అన్నారు. బుధవారం చేగుంటలో ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో మండల స్థాయి పోషకాహార వారోత్సవాలు నిర్వహించారు. మహిళలకు అవగాహన కోసం కూరగాయలతో బతుకమ్మ తయారు చేసి ఆసక్తి కలిగేలా వివరించారు.
9/16
తూప్రాన్‌కు చెందిన ఇద్దరు మహిళలు ఈత చెట్టు ఎక్కి కల్లు తీశారు. బుధవారం తూప్రాన్‌లో కల్లు విక్రయాలకు  అనుమతి ఇచ్చేందుకు ఆబ్కారీశాఖ అధికారులు ఈ పరీక్ష నిర్వహించారు. ఇందులో పట్టణానికి చెందిన నిర్మలాగౌడ్, స్రవంతి పాల్గొన్నారు.  తూప్రాన్‌కు చెందిన ఇద్దరు మహిళలు ఈత చెట్టు ఎక్కి కల్లు తీశారు. బుధవారం తూప్రాన్‌లో కల్లు విక్రయాలకు అనుమతి ఇచ్చేందుకు ఆబ్కారీశాఖ అధికారులు ఈ పరీక్ష నిర్వహించారు. ఇందులో పట్టణానికి చెందిన నిర్మలాగౌడ్, స్రవంతి పాల్గొన్నారు.
10/16
వేలమైళ్ల దూరం నుంచి ఏటా వలస వచ్చే సైబీరియన్‌ కొంగలు... స్థానికంగా కనిపించే తెల్లకొంగలు... వీటికి తోడు చేపల్ని ఆబగా ఆరగించే నీటికాకులు.. ఇలా రకరకాల పక్షులు ఒకేచోట చేరితే కనువిందే కదా? పుల్లాపుడకా నోటితో కరచుకుని వచ్చి చక్కగా అవి గూళ్లు కట్టుకునే పద్ధతులు, పక్కనున్న కొలనులో చేపలను వేటాడుతూ..పిల్ల్లల్ని పెంచే తీరుతెన్నులు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలం రామచంద్రాపురం సమీప కుంటలోని చెట్లపై అవి కలసిమెలసి జీవిస్తున్నాయి. వేలమైళ్ల దూరం నుంచి ఏటా వలస వచ్చే సైబీరియన్‌ కొంగలు... స్థానికంగా కనిపించే తెల్లకొంగలు... వీటికి తోడు చేపల్ని ఆబగా ఆరగించే నీటికాకులు.. ఇలా రకరకాల పక్షులు ఒకేచోట చేరితే కనువిందే కదా? పుల్లాపుడకా నోటితో కరచుకుని వచ్చి చక్కగా అవి గూళ్లు కట్టుకునే పద్ధతులు, పక్కనున్న కొలనులో చేపలను వేటాడుతూ..పిల్ల్లల్ని పెంచే తీరుతెన్నులు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలం రామచంద్రాపురం సమీప కుంటలోని చెట్లపై అవి కలసిమెలసి జీవిస్తున్నాయి.
11/16
ఆదిలాబాద్‌ జిల్లా సిరికొండ మండలంలోని ఈ పల్లెలో నాలుగేళ్ల కిందట, పోలీసుల సహకారంతో పాఠశాలను ఏర్పాటుచేసి వాలంటీరును నియమించారు. ఆర్నెల్ల తర్వాత.. అప్పటి అధికారులు బదిలీపై వెళ్లడంతో మళ్లీ పాత కష్టాలే మొదలయ్యాయి. సమస్యను గుర్తించిన సిరికొండకు చెందిన యువసేన సభ్యులు విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపాలని సంకల్పించారు. తలో కొంత మొత్తం వేసుకుని రెండు నెలల కిందట ఓ ఇంటి ఆవరణలో పాఠశాల ప్రారంభించారు. విద్యా వాలంటీరుకు నెలకు రూ.4,000 వంతున వేతనమిస్తున్నారు. ఇప్పటి వరకు పాఠశాల అంటే ఎలా ఉంటుందో తెలియని చిన్నారులు బడి సమయం అయిందంటే చాలు.. చదువుకునేందుకు పరుగులు తీస్తున్నారు. ఆదిలాబాద్‌ జిల్లా సిరికొండ మండలంలోని ఈ పల్లెలో నాలుగేళ్ల కిందట, పోలీసుల సహకారంతో పాఠశాలను ఏర్పాటుచేసి వాలంటీరును నియమించారు. ఆర్నెల్ల తర్వాత.. అప్పటి అధికారులు బదిలీపై వెళ్లడంతో మళ్లీ పాత కష్టాలే మొదలయ్యాయి. సమస్యను గుర్తించిన సిరికొండకు చెందిన యువసేన సభ్యులు విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపాలని సంకల్పించారు. తలో కొంత మొత్తం వేసుకుని రెండు నెలల కిందట ఓ ఇంటి ఆవరణలో పాఠశాల ప్రారంభించారు. విద్యా వాలంటీరుకు నెలకు రూ.4,000 వంతున వేతనమిస్తున్నారు. ఇప్పటి వరకు పాఠశాల అంటే ఎలా ఉంటుందో తెలియని చిన్నారులు బడి సమయం అయిందంటే చాలు.. చదువుకునేందుకు పరుగులు తీస్తున్నారు.
12/16
13/16
ఈ చిత్రంలో కనిపిస్తున్న కేరళకు చెందిన డాక్టర్‌ ఆనంద్‌ కక్కడ్‌(34) రష్యా రాజధాని మాస్కోలో పేరుగాంచిన ఆయుర్వేద వైద్యుడు. ఇందులో ఏముంది విశేషం అంటారా? ఆయన ఓ యూట్యూబర్, వ్లాగర్‌. అంతేకాదండోయ్‌ మంచి గాయకుడు, మృదంగ విద్వాంసుడు కూడా. ఇప్పుడవన్నీ ఎందుకంటారా? సుప్రసిద్ధ గురువాయూర్‌లోని కృష్ణ దేవాలయానికి తదుపరి ప్రధాన అర్చకుడు(మెల్‌శాంతి) కాబోతున్నారు. ఈ మేరకు గతవారం నిర్వహించిన డ్రా ద్వారా ఎంపికయ్యారు. వచ్చే నెల నుంచి ఆరు నెలలపాటు ఆయన ఈ విధులు నిర్వహిస్తారు. ఈ చిత్రంలో కనిపిస్తున్న కేరళకు చెందిన డాక్టర్‌ ఆనంద్‌ కక్కడ్‌(34) రష్యా రాజధాని మాస్కోలో పేరుగాంచిన ఆయుర్వేద వైద్యుడు. ఇందులో ఏముంది విశేషం అంటారా? ఆయన ఓ యూట్యూబర్, వ్లాగర్‌. అంతేకాదండోయ్‌ మంచి గాయకుడు, మృదంగ విద్వాంసుడు కూడా. ఇప్పుడవన్నీ ఎందుకంటారా? సుప్రసిద్ధ గురువాయూర్‌లోని కృష్ణ దేవాలయానికి తదుపరి ప్రధాన అర్చకుడు(మెల్‌శాంతి) కాబోతున్నారు. ఈ మేరకు గతవారం నిర్వహించిన డ్రా ద్వారా ఎంపికయ్యారు. వచ్చే నెల నుంచి ఆరు నెలలపాటు ఆయన ఈ విధులు నిర్వహిస్తారు.
14/16
ఉక్రెయిన్‌లోని ఖర్కివ్‌లో బుధవారం రష్యా క్షిపణి దాడులతో ధ్వంసమైన రైలు బోగీలు ఉక్రెయిన్‌లోని ఖర్కివ్‌లో బుధవారం రష్యా క్షిపణి దాడులతో ధ్వంసమైన రైలు బోగీలు
15/16
సౌర కుటుంబంలోని నెఫ్ట్యూన్‌ గ్రహమిది. చుట్టూ వలయాలతో మెరిసిపోతున్న ఈ గ్రహం ఫొటోను అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ- నాసా ప్రయోగించిన జేమ్స్‌ వెబ్‌ స్పేస్‌ టెలిస్కోప్‌ (జేడబ్ల్యూఎస్‌టీ) తీసింది. 1989లో వాయేజర్‌ వ్యోమనౌక నెఫ్ట్యూన్‌కు సమీపంగా ప్రయాణించి.. దాని స్పష్టమైన ఫొటోలను అందించింది. ఆ తర్వాత మళ్లీ ఆ గ్రహానికి సంబంధించిన అత్యంత స్పష్టమైన చిత్రాలు అందుబాటులోకి రావడం ఇదే మొదటిసారి. సౌర కుటుంబంలోని నెఫ్ట్యూన్‌ గ్రహమిది. చుట్టూ వలయాలతో మెరిసిపోతున్న ఈ గ్రహం ఫొటోను అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ- నాసా ప్రయోగించిన జేమ్స్‌ వెబ్‌ స్పేస్‌ టెలిస్కోప్‌ (జేడబ్ల్యూఎస్‌టీ) తీసింది. 1989లో వాయేజర్‌ వ్యోమనౌక నెఫ్ట్యూన్‌కు సమీపంగా ప్రయాణించి.. దాని స్పష్టమైన ఫొటోలను అందించింది. ఆ తర్వాత మళ్లీ ఆ గ్రహానికి సంబంధించిన అత్యంత స్పష్టమైన చిత్రాలు అందుబాటులోకి రావడం ఇదే మొదటిసారి.
16/16
 పేదలకు 5 రూపాయలకే అన్నం పెట్టి ఆకలి తీర్చాలని గత తెదేపా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసింది. ప్రభుత్వం మారటంతో వాటిని మూసివేశారు. చిత్తూరు జిల్లా కేంద్రంలోని పారిశ్రామికవాడ సమీపంలో ఉన్న అన్న క్యాంటీన్‌ను సచివాలయ కార్యాలయంగా మార్చారు. ఇప్పటి వరకు అద్దె భవనంలో ఉన్న 6వ డివిజన్‌ సచివాలయాన్ని నాలుగు రోజుల క్రితం అన్న క్యాంటీన్‌లోకి మార్చారు. పేదలకు 5 రూపాయలకే అన్నం పెట్టి ఆకలి తీర్చాలని గత తెదేపా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసింది. ప్రభుత్వం మారటంతో వాటిని మూసివేశారు. చిత్తూరు జిల్లా కేంద్రంలోని పారిశ్రామికవాడ సమీపంలో ఉన్న అన్న క్యాంటీన్‌ను సచివాలయ కార్యాలయంగా మార్చారు. ఇప్పటి వరకు అద్దె భవనంలో ఉన్న 6వ డివిజన్‌ సచివాలయాన్ని నాలుగు రోజుల క్రితం అన్న క్యాంటీన్‌లోకి మార్చారు.

మరిన్ని