News In Pics: చిత్రం చెప్పే సంగతులు - 2 (22-09-2022)

Updated : 22 Sep 2022 21:27 IST
1/31
ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ యోగా ప్రాధాన్యతను తెలిపేందుకు మణికొండ పురపాలక సంఘం పరిధిలోని అలకాపురి 100 ఫీట్ల రోడ్డు మార్గంలో యోగాసనాల బొమ్మలను తీర్చిదిద్దుతున్నారు. ఇవి చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ యోగా ప్రాధాన్యతను తెలిపేందుకు మణికొండ పురపాలక సంఘం పరిధిలోని అలకాపురి 100 ఫీట్ల రోడ్డు మార్గంలో యోగాసనాల బొమ్మలను తీర్చిదిద్దుతున్నారు. ఇవి చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
2/31
3/31
భారత్‌-ఆస్ట్రేలియా టీ20.. కొవిడ్‌ తర్వాత భాగ్యనగరంలో జరగనున్న మొదటి  క్రికెట్‌ మ్యచ్‌ కావడంతో క్రికెట్‌ ప్రేమికులకు పండగలా మారింది. టికెట్లు దొరకవేమో అన్న భయం కొందరిలో ఉంది. దీనికి తోడు వరుణదేవుడు ఈ రోజు ఓ జల్లు కురిపించి మరింత ఉత్కంఠ పెంచాడు. దీంతో మ్యాచ్‌ జరిగే స్టేడియంలో సిబ్బంది పిచ్‌ను రోలింగ్‌ చేసి రక్షణ కోసం పట్టాలతో కప్పి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.. భారత్‌-ఆస్ట్రేలియా టీ20.. కొవిడ్‌ తర్వాత భాగ్యనగరంలో జరగనున్న మొదటి క్రికెట్‌ మ్యచ్‌ కావడంతో క్రికెట్‌ ప్రేమికులకు పండగలా మారింది. టికెట్లు దొరకవేమో అన్న భయం కొందరిలో ఉంది. దీనికి తోడు వరుణదేవుడు ఈ రోజు ఓ జల్లు కురిపించి మరింత ఉత్కంఠ పెంచాడు. దీంతో మ్యాచ్‌ జరిగే స్టేడియంలో సిబ్బంది పిచ్‌ను రోలింగ్‌ చేసి రక్షణ కోసం పట్టాలతో కప్పి జాగ్రత్తలు తీసుకుంటున్నారు..
4/31
5/31
6/31
తిరుమలకు చెందిన మైక్రో ఆర్టిస్ట్‌ పల్లి చిరంజీవి కాఫీపౌడర్‌తో 50 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పుతో వేంకటేశ్వరస్వామి చిత్తరువును అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇందుకుగాను ఆయనకు వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌లో చోటు లభించింది. గురువారం స్థానిక కల్యాణవేదికలో ఆయన శ్రీవారి చిత్రాన్ని తీర్చిదిద్దారు. దీన్ని పరిశీలించిన వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ ఇండియా చీఫ్‌ కోఆర్డినేటర్‌ బింగి నరేంద్రగౌడ్, అంతర్జాతీయ ప్రతినిధి భైరమ్‌ కృష్ణాలు చిరంజీవికి జ్ఞాపిక, ధ్రువపత్రాన్ని అందజేశారు. తిరుమలకు చెందిన మైక్రో ఆర్టిస్ట్‌ పల్లి చిరంజీవి కాఫీపౌడర్‌తో 50 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పుతో వేంకటేశ్వరస్వామి చిత్తరువును అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇందుకుగాను ఆయనకు వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌లో చోటు లభించింది. గురువారం స్థానిక కల్యాణవేదికలో ఆయన శ్రీవారి చిత్రాన్ని తీర్చిదిద్దారు. దీన్ని పరిశీలించిన వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ ఇండియా చీఫ్‌ కోఆర్డినేటర్‌ బింగి నరేంద్రగౌడ్, అంతర్జాతీయ ప్రతినిధి భైరమ్‌ కృష్ణాలు చిరంజీవికి జ్ఞాపిక, ధ్రువపత్రాన్ని అందజేశారు.
7/31
8/31
సికింద్రాబాద్‌ జింఖానా గ్రౌండ్‌ వద్ద భారత్‌-ఆస్ట్రేలియా క్రికెట్‌ మ్యాచ్‌ టికెట్ల కోసం జనం తరలిరావడంతో గురువారం మధ్యాహ్నం ప్రధాన రహదారిపై ట్రాఫిక్‌ నిలిచిపోయింది. దీంతో సికింద్రాబాద్‌ వైఎంసీఏ నుంచి బేగంపేట వరకు వాహనాలు చాలా నెమ్మదిగా కదిలాయి. సికింద్రాబాద్‌ జింఖానా గ్రౌండ్‌ వద్ద భారత్‌-ఆస్ట్రేలియా క్రికెట్‌ మ్యాచ్‌ టికెట్ల కోసం జనం తరలిరావడంతో గురువారం మధ్యాహ్నం ప్రధాన రహదారిపై ట్రాఫిక్‌ నిలిచిపోయింది. దీంతో సికింద్రాబాద్‌ వైఎంసీఏ నుంచి బేగంపేట వరకు వాహనాలు చాలా నెమ్మదిగా కదిలాయి.
9/31
10/31
కరాటే ఛాంపియన్‌ కార్తీక్‌రెడ్డి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశాడు. కార్తీక్‌ ఇటీవల కామన్వెల్త్‌ ఛాంపియన్‌షిప్‌లో అండర్‌-16, 70 కేజీల కుమిటేలో స్వర్ణ పతకం సాధించాడు‌. లాస్‌వేగాస్‌లో నిర్వహించిన యూఎస్‌ఏ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు‌. దీంతో సీఎం అతడిని అభినందించి రూ.10లక్షల నగదు ప్రోత్సాహకం ప్రకటించారు. కరాటే ఛాంపియన్‌ కార్తీక్‌రెడ్డి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశాడు. కార్తీక్‌ ఇటీవల కామన్వెల్త్‌ ఛాంపియన్‌షిప్‌లో అండర్‌-16, 70 కేజీల కుమిటేలో స్వర్ణ పతకం సాధించాడు‌. లాస్‌వేగాస్‌లో నిర్వహించిన యూఎస్‌ఏ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు‌. దీంతో సీఎం అతడిని అభినందించి రూ.10లక్షల నగదు ప్రోత్సాహకం ప్రకటించారు.
11/31
సినీ నటి ప్రియాంక చోప్రా తన కుమార్తె మాల్టీ మేరీతో కలిసి మాతృత్వపు మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్న ఫొటోలను ఇన్‌స్టా ఖాతాలో పంచుకున్నారు. ఈ ఫొటోలకు ఆమె ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. ప్రియాంక చోప్రా, నిక్‌ జోనాస్‌ దంపతులు సరోగసి పద్ధతిలో బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. సినీ నటి ప్రియాంక చోప్రా తన కుమార్తె మాల్టీ మేరీతో కలిసి మాతృత్వపు మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్న ఫొటోలను ఇన్‌స్టా ఖాతాలో పంచుకున్నారు. ఈ ఫొటోలకు ఆమె ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. ప్రియాంక చోప్రా, నిక్‌ జోనాస్‌ దంపతులు సరోగసి పద్ధతిలో బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.
12/31
13/31
‘గిఫ్ట్‌ ఏ స్మైల్‌’ కార్యక్రమంలో భాగంగా మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో 850 మంది విద్యార్థులకు డిజిటల్‌ ట్యాబ్‌లను అందజేశారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థినులు మంత్రితో కలిసి సంబరంగా సెల్ఫీలు తీసుకున్నారు. ‘గిఫ్ట్‌ ఏ స్మైల్‌’ కార్యక్రమంలో భాగంగా మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో 850 మంది విద్యార్థులకు డిజిటల్‌ ట్యాబ్‌లను అందజేశారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థినులు మంత్రితో కలిసి సంబరంగా సెల్ఫీలు తీసుకున్నారు.
14/31
15/31
మంత్రి, సినీనటి రోజా విజయవాడ కనకదుర్గను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆలయ అధికారులు ఆమెకు లాంఛనంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం అమ్మవారి తీర్థప్రసాదాలను మంత్రికి అందజేశారు. మంత్రి, సినీనటి రోజా విజయవాడ కనకదుర్గను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆలయ అధికారులు ఆమెకు లాంఛనంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం అమ్మవారి తీర్థప్రసాదాలను మంత్రికి అందజేశారు.
16/31
17/31
సినీ నటి షిర్లీ సేథియా గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం సినీనటులు విక్టరీ వెంకటేశ్‌, రాజ్‌కుమార్‌రావు, శిల్పాశెట్టిలను ఆమె ఛాలెంజ్‌కు నామినేట్‌ చేశారు. నాగశౌర్య, షిర్లీ సేథియా జంటగా నటించిన ‘కృష్ణ వ్రింద విహారి’ సినిమా ఈ నెల 23న థియేటర్లలో విడుదల కానుంది. సినీ నటి షిర్లీ సేథియా గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం సినీనటులు విక్టరీ వెంకటేశ్‌, రాజ్‌కుమార్‌రావు, శిల్పాశెట్టిలను ఆమె ఛాలెంజ్‌కు నామినేట్‌ చేశారు. నాగశౌర్య, షిర్లీ సేథియా జంటగా నటించిన ‘కృష్ణ వ్రింద విహారి’ సినిమా ఈ నెల 23న థియేటర్లలో విడుదల కానుంది.
18/31
19/31
బుధ, గురువారాల్లో నిర్వహించిన మూడు వేర్వేరు దాడుల్లో 13మంది ఎర్రచందనం స్మగ్లర్లను తిరుపతి టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది అరెస్టు చేసింది. వారి నుంచి 23 ఎర్రచందనం దుంగలు, నాలుగు గొడ్డళ్లు, ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్‌ఫోర్స్‌ ఎస్పీ మేడా సుందరరావు తెలిపారు. బుధ, గురువారాల్లో నిర్వహించిన మూడు వేర్వేరు దాడుల్లో 13మంది ఎర్రచందనం స్మగ్లర్లను తిరుపతి టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది అరెస్టు చేసింది. వారి నుంచి 23 ఎర్రచందనం దుంగలు, నాలుగు గొడ్డళ్లు, ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్‌ఫోర్స్‌ ఎస్పీ మేడా సుందరరావు తెలిపారు.
20/31
ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరును వైఎస్‌ఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీగా మార్చడాన్ని ఖండిస్తూ తిరుపతి జిల్లాలోని చంద్రగిరి క్లాక్‌ టవర్‌ వద్ద తెదేపా నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పులివర్తి నాని పాల్గొన్నారు. ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరును వైఎస్‌ఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీగా మార్చడాన్ని ఖండిస్తూ తిరుపతి జిల్లాలోని చంద్రగిరి క్లాక్‌ టవర్‌ వద్ద తెదేపా నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పులివర్తి నాని పాల్గొన్నారు.
21/31
ప్యూర్టోరికోలోని సలినాస్‌లో ఫియోనా హరికేన్‌ ప్రభావంతో భారీవర్షాలు కురిశాయి. దీంతో ఓ ఇల్లు ఇలా పునాదితో సహా కుంగిపోయింది. ప్యూర్టోరికోలోని సలినాస్‌లో ఫియోనా హరికేన్‌ ప్రభావంతో భారీవర్షాలు కురిశాయి. దీంతో ఓ ఇల్లు ఇలా పునాదితో సహా కుంగిపోయింది.
22/31
23/31
అఫ్గాన్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకోవడంతో ఆ దేశంలో ఆర్థిక సంక్షోభం నెలకొంది. దీంతో తమ చిన్నారులను పోషించుకోలేక పలువురు తల్లిదండ్రులు వారిని పనిలోకి తీసుకెళ్తున్నారు. కాబుల్‌ శివారులో నిర్వహిస్తున్న ఇటుక బట్టీల్లో పని చేస్తున్న పిల్లలు వీరు.
అఫ్గాన్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకోవడంతో ఆ దేశంలో ఆర్థిక సంక్షోభం నెలకొంది. దీంతో తమ చిన్నారులను పోషించుకోలేక పలువురు తల్లిదండ్రులు వారిని పనిలోకి తీసుకెళ్తున్నారు. కాబుల్‌ శివారులో నిర్వహిస్తున్న ఇటుక బట్టీల్లో పని చేస్తున్న పిల్లలు వీరు.
24/31
25/31
26/31
27/31
కమల్‌హాసన్‌ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా ‘భారతీయుడు 2’ చిత్రీకరణ మళ్లీ మొదలైంది. శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్‌ పలు కారణాలతో నిలిచిపోయింది. రామ్‌ చరణ్‌ #RC15 (వర్కింగ్‌ టైటిల్‌) షూటింగ్‌లో శంకర్‌.. ‘విక్రమ్‌’ సినిమాతో కమల్ బిజీ కావడంతో ‘భారతీయుడు 2’ సినిమాపై పలు సందేహాలు నెలకొన్నాయి. తాజాగా కమల్‌, శంకర్‌ కలిసి సెట్లో ఉన్న ఓ ఫొటో బయటకు రావడంతో ఈ సినిమాపై అభిమానులకు క్లారిటీ వచ్చేసింది.  కమల్‌హాసన్‌ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా ‘భారతీయుడు 2’ చిత్రీకరణ మళ్లీ మొదలైంది. శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్‌ పలు కారణాలతో నిలిచిపోయింది. రామ్‌ చరణ్‌ #RC15 (వర్కింగ్‌ టైటిల్‌) షూటింగ్‌లో శంకర్‌.. ‘విక్రమ్‌’ సినిమాతో కమల్ బిజీ కావడంతో ‘భారతీయుడు 2’ సినిమాపై పలు సందేహాలు నెలకొన్నాయి. తాజాగా కమల్‌, శంకర్‌ కలిసి సెట్లో ఉన్న ఓ ఫొటో బయటకు రావడంతో ఈ సినిమాపై అభిమానులకు క్లారిటీ వచ్చేసింది.
28/31
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి విలేజ్‌లో అధికారులు బతుకమ్మ చీరల పంపిణీ చేపట్టారు. దాదాపు 100 మంది మహిళలు చీరలు తీసుకొనేందుకు వచ్చారు. ఒక్కసారిగా వర్షం రావడంతో సగం మంది ఇళ్లకు వెళ్లిపోయారు. మిగిలిన వారు వర్షం పడుతున్నా గుడారాల కింద నిల్చొని చీరలు తీసుకొనేందుకు సిద్ధమయ్యారు. దీంతో అధికారులు పంపిణీ కొనసాగించారు. కౌంటర్‌ వద్ద తమ వంతు వచ్చే వరకు వేచి చూసి మహిళలు చీరలు తీసుకున్నారు. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి విలేజ్‌లో అధికారులు బతుకమ్మ చీరల పంపిణీ చేపట్టారు. దాదాపు 100 మంది మహిళలు చీరలు తీసుకొనేందుకు వచ్చారు. ఒక్కసారిగా వర్షం రావడంతో సగం మంది ఇళ్లకు వెళ్లిపోయారు. మిగిలిన వారు వర్షం పడుతున్నా గుడారాల కింద నిల్చొని చీరలు తీసుకొనేందుకు సిద్ధమయ్యారు. దీంతో అధికారులు పంపిణీ కొనసాగించారు. కౌంటర్‌ వద్ద తమ వంతు వచ్చే వరకు వేచి చూసి మహిళలు చీరలు తీసుకున్నారు.
29/31
30/31
ఈ నెల 25న ఉప్పల్‌ స్టేడియంలో భారత్‌-ఆసీస్‌ మ్యాచ్‌ జరగనున్న నేపథ్యంలో టికెట్ల విక్రయాలకు హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) ఏర్పాట్లు చేసింది. సికింద్రాబాద్‌లోని జింఖానా మైదానంలో టికెట్లు విక్రయిస్తున్నారు. మ్యాచ్‌ టికెట్ల కోసం వేలాదిగా క్రికెట్‌ అభిమానులు తరలిరావడంతో పోలీసులు వారిని నియంత్రించే క్రమంలో అక్కడ స్వల్ప తొక్కిసలాట జరిగింది. ఈ నెల 25న ఉప్పల్‌ స్టేడియంలో భారత్‌-ఆసీస్‌ మ్యాచ్‌ జరగనున్న నేపథ్యంలో టికెట్ల విక్రయాలకు హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) ఏర్పాట్లు చేసింది. సికింద్రాబాద్‌లోని జింఖానా మైదానంలో టికెట్లు విక్రయిస్తున్నారు. మ్యాచ్‌ టికెట్ల కోసం వేలాదిగా క్రికెట్‌ అభిమానులు తరలిరావడంతో పోలీసులు వారిని నియంత్రించే క్రమంలో అక్కడ స్వల్ప తొక్కిసలాట జరిగింది.
31/31

మరిన్ని