News In Pics: చిత్రం చెప్పే సంగతులు -1(23-09-2022)

Published : 23 Sep 2022 10:42 IST
1/21
కొండపాక మండలం దుద్దెడ గ్రామ శివారులో బర్రె గడ్డి మేస్తోంది. పొడువాటి తాడు కట్టినా ఆ పశువు ఒక్కోసారి తెంపేసుకొని పంట పొలాల్లోకి దిగుతోంది. ఇది గమనించిన రైతు తన ఇంట్లో ఉండే శునకానికి కాపలా కాసే అలవాటు చేశారు. తన పని తాను చూసుకుంటుంటారు. రోజూ దూరంగా ఉండి మేత మేసే గేదెను చూడటం ఏమిటో.. అనుకుందో ఏమో శునకం వెంటనే పశువుపై ఎక్కి కూర్చొంది. అది మేస్తూ ఉండటం.. శునకం కాపలా కాయడం ఏకకాలంలో జరిగాయి. బర్రె మేత పూర్తవగానే శునకం కిందికి దిగి వెళ్లిపోయింది. 


కొండపాక మండలం దుద్దెడ గ్రామ శివారులో బర్రె గడ్డి మేస్తోంది. పొడువాటి తాడు కట్టినా ఆ పశువు ఒక్కోసారి తెంపేసుకొని పంట పొలాల్లోకి దిగుతోంది. ఇది గమనించిన రైతు తన ఇంట్లో ఉండే శునకానికి కాపలా కాసే అలవాటు చేశారు. తన పని తాను చూసుకుంటుంటారు. రోజూ దూరంగా ఉండి మేత మేసే గేదెను చూడటం ఏమిటో.. అనుకుందో ఏమో శునకం వెంటనే పశువుపై ఎక్కి కూర్చొంది. అది మేస్తూ ఉండటం.. శునకం కాపలా కాయడం ఏకకాలంలో జరిగాయి. బర్రె మేత పూర్తవగానే శునకం కిందికి దిగి వెళ్లిపోయింది.
2/21
అక్కడి గ్రామస్థులు ఏ రోగమొచ్చినా చికిత్సకు ఆరోగ్య కేంద్రానికి వెళ్లేందుకు భయపడుతున్నారు.. కారణం శిథిల భవనంలో సేవలు అందిస్తుండడమే. ఇదీ పాచిపెంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం దుస్థితి. ప్రవేశ ద్వారానికి ఆనుకుని కొన్నేళ్ల కిందట నిర్మించిన రెండు భవనాలు శిథిలావస్థకు చేరాయి. నేడో, రేపో కూలేందుకు సిద్ధం ఉన్నాయని గ్రామస్థులు చెబుతున్నారు. దీనిపై పీహెచ్‌సీ వైద్యురాలు పీవీ లక్ష్మిని ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా తొలగింపు కోసం ఉన్నతాధికారులకు నివేదించామన్నారు.  అక్కడి గ్రామస్థులు ఏ రోగమొచ్చినా చికిత్సకు ఆరోగ్య కేంద్రానికి వెళ్లేందుకు భయపడుతున్నారు.. కారణం శిథిల భవనంలో సేవలు అందిస్తుండడమే. ఇదీ పాచిపెంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం దుస్థితి. ప్రవేశ ద్వారానికి ఆనుకుని కొన్నేళ్ల కిందట నిర్మించిన రెండు భవనాలు శిథిలావస్థకు చేరాయి. నేడో, రేపో కూలేందుకు సిద్ధం ఉన్నాయని గ్రామస్థులు చెబుతున్నారు. దీనిపై పీహెచ్‌సీ వైద్యురాలు పీవీ లక్ష్మిని ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా తొలగింపు కోసం ఉన్నతాధికారులకు నివేదించామన్నారు.
3/21
చినుకు పడితే చాలు.. మహారాష్ట్ర సరిహద్దు గుల్లాతండాకు వెళ్లే రోడ్డంతా చిత్తడిగా మారుతోంది. వాహన టైర్లు బురదలో కూరుకుపోయి కదలని పరిస్థితి నెలకొంటోంది. గురువారం హనేగావ్‌ నుంచి బిచ్కుందకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు బురదలో దిగబడి గంటసేపు నిలిచిపోయింది. స్థానికులు ట్రాక్టరుకు తాడు కట్టి బస్సును బయటకు తీశారు. ఈ రోడ్డు నిర్మాణానికి రూ.12.50 కోట్ల నిధులు మంజూరైతే 2016లో శంకుస్థాపన చేశారు. పనులు నత్తనడకన సాగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చినుకు పడితే చాలు.. మహారాష్ట్ర సరిహద్దు గుల్లాతండాకు వెళ్లే రోడ్డంతా చిత్తడిగా మారుతోంది. వాహన టైర్లు బురదలో కూరుకుపోయి కదలని పరిస్థితి నెలకొంటోంది. గురువారం హనేగావ్‌ నుంచి బిచ్కుందకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు బురదలో దిగబడి గంటసేపు నిలిచిపోయింది. స్థానికులు ట్రాక్టరుకు తాడు కట్టి బస్సును బయటకు తీశారు. ఈ రోడ్డు నిర్మాణానికి రూ.12.50 కోట్ల నిధులు మంజూరైతే 2016లో శంకుస్థాపన చేశారు. పనులు నత్తనడకన సాగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
4/21
భారీ వర్షాలకు పెద్దవాగు ప్రవహించి డోకూర్‌ చెరువు నిండిపోయింది. చెరువు నీటితో దేవరకద్ర పట్టణ కేంద్రానికి సమీప నల్లలబావి వద్ద వాగు నిండుగా ప్రవహిస్తోంది. ఈ వాగు దాటి దాదాపు 300 మంది రైతులు పొలాల వద్దకు వెళ్లేందుకు భుజాల వరకు వస్తున్న నీటిలో కొంతదూరం నడిచి, మరికొంత దూరం ఈదుతూ నిత్యం సాహసమే చేయాల్సి వస్తోంది. తమ పొలాల్లో పనులకు కూలీలు రాలేని పరిస్థితి ఏర్పడి తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  భారీ వర్షాలకు పెద్దవాగు ప్రవహించి డోకూర్‌ చెరువు నిండిపోయింది. చెరువు నీటితో దేవరకద్ర పట్టణ కేంద్రానికి సమీప నల్లలబావి వద్ద వాగు నిండుగా ప్రవహిస్తోంది. ఈ వాగు దాటి దాదాపు 300 మంది రైతులు పొలాల వద్దకు వెళ్లేందుకు భుజాల వరకు వస్తున్న నీటిలో కొంతదూరం నడిచి, మరికొంత దూరం ఈదుతూ నిత్యం సాహసమే చేయాల్సి వస్తోంది. తమ పొలాల్లో పనులకు కూలీలు రాలేని పరిస్థితి ఏర్పడి తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
5/21
విజయదశమి పూజలకు గుమ్మడి కాయలు సిద్ధంగా ఉన్నాయి. కొత్తపేట వద్ద ఫుట్‌పాత్‌పై గుమ్మడి కాయలను కుప్పలుగా పోసి విక్రయానికి పెట్టారు. విజయదశమి పూజలకు గుమ్మడి కాయలు సిద్ధంగా ఉన్నాయి. కొత్తపేట వద్ద ఫుట్‌పాత్‌పై గుమ్మడి కాయలను కుప్పలుగా పోసి విక్రయానికి పెట్టారు.
6/21
దుమ్ముతో నిండిన ఈ రహదారిని చూశారా? నగరంలో అడపాదడపా పలుచోట్ల ఇలాంటి దృశ్యాలు కనిపిస్తూనే ఉంటాయి. బోర్లు వేసే వారి ఇష్టారాజ్యానికి ఇలా వదిలేయడంతో ఆ రోజంతా వాహనదారులకే కాకుండా చుట్టుపక్కల వారికీ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గురువారం మణికొండలో స్థానిక నేతాజీ పార్కు వద్ద కనిపించిన చిత్రం ఇది. దుమ్ముతో నిండిన ఈ రహదారిని చూశారా? నగరంలో అడపాదడపా పలుచోట్ల ఇలాంటి దృశ్యాలు కనిపిస్తూనే ఉంటాయి. బోర్లు వేసే వారి ఇష్టారాజ్యానికి ఇలా వదిలేయడంతో ఆ రోజంతా వాహనదారులకే కాకుండా చుట్టుపక్కల వారికీ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గురువారం మణికొండలో స్థానిక నేతాజీ పార్కు వద్ద కనిపించిన చిత్రం ఇది.
7/21
ఖైరతాబాద్‌ వెంగళరావునగర్‌ డివిజన్‌ మధురానగర్‌ కాలనీలోని ఓ పాఠశాల గోడలపై చిన్నారుల చదువు, ఆటపాటలకు సంబంధించిన చిత్రాలు ఇలా ఏర్పాటు చేశారు. అటుగా వెళ్లేవారు ఆసక్తిగా చూస్తున్నారు. ఖైరతాబాద్‌ వెంగళరావునగర్‌ డివిజన్‌ మధురానగర్‌ కాలనీలోని ఓ పాఠశాల గోడలపై చిన్నారుల చదువు, ఆటపాటలకు సంబంధించిన చిత్రాలు ఇలా ఏర్పాటు చేశారు. అటుగా వెళ్లేవారు ఆసక్తిగా చూస్తున్నారు.
8/21
కూకట్‌పల్లిలో గురువారం బతుకమ్మ చీరల పంపిణీ జరుగుతుండగా మహిళలు పెద్దఎత్తున వచ్చారు. మధ్యాహ్నం వర్షం కురుస్తుండటంతో కొందరు తడుస్తూ, మరికొందరు గొడుగులు పట్టుకుని ఇబ్బందులు పడుతూ కనిపించారు. బాలానగర్‌ డివిజన్‌ వార్డు కార్యాలయం, వినాయకనగర్, ఫిరోజ్‌గూడ తదితర ప్రాంతాల్లో గురువారం కార్పొరేటర్‌ ఆవుల రవీందర్‌రెడ్డి బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. కూకట్‌పల్లిలో గురువారం బతుకమ్మ చీరల పంపిణీ జరుగుతుండగా మహిళలు పెద్దఎత్తున వచ్చారు. మధ్యాహ్నం వర్షం కురుస్తుండటంతో కొందరు తడుస్తూ, మరికొందరు గొడుగులు పట్టుకుని ఇబ్బందులు పడుతూ కనిపించారు. బాలానగర్‌ డివిజన్‌ వార్డు కార్యాలయం, వినాయకనగర్, ఫిరోజ్‌గూడ తదితర ప్రాంతాల్లో గురువారం కార్పొరేటర్‌ ఆవుల రవీందర్‌రెడ్డి బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు.
9/21
10/21
11/21
12/21
వర్షం కురుస్తున్న సమయంలో మొక్కల్ని నాటితే అవి ఏపుగా పెరిగే అవకాశం ఉంది. మోడువారే అవకాశం తక్కువ. నాటిన ప్రతి మొక్క బతకాలని.. చినుకులు కురుస్తున్న సమయంలో జీహెచ్‌ఎంసీ సిబ్బంది హడావుడిగా సైబర్‌ టవర్స్‌ ప్రాంతంలో నాటేందుకు తీసుకెళ్తున్నారిలా. వర్షం కురుస్తున్న సమయంలో మొక్కల్ని నాటితే అవి ఏపుగా పెరిగే అవకాశం ఉంది. మోడువారే అవకాశం తక్కువ. నాటిన ప్రతి మొక్క బతకాలని.. చినుకులు కురుస్తున్న సమయంలో జీహెచ్‌ఎంసీ సిబ్బంది హడావుడిగా సైబర్‌ టవర్స్‌ ప్రాంతంలో నాటేందుకు తీసుకెళ్తున్నారిలా.
13/21
నల్లగండ్ల నుంచి గోపనపల్లి మార్గం అపర్ణ వద్ద కూడలిలో ఏర్పాటు చేసిన ట్రాఫిక్‌ సిగ్నళ్లు పనిచేయడం లేదు. నిరుపయోగంగా ఉంటున్నాయి. వినియోగంలోకి తీసుకువస్తే రాకపోకల నియంత్రణ మరింత సులువు అవుతుంది. మరోవైపు గచ్చిబౌలి ఐఐఐటీ కూడలి వద్ద ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ పక్కన పదుల సంఖ్యలో ట్రాఫిక్‌ ఐలాండ్స్‌ను పక్కన పెట్టేశారు. నల్లగండ్ల నుంచి గోపనపల్లి మార్గం అపర్ణ వద్ద కూడలిలో ఏర్పాటు చేసిన ట్రాఫిక్‌ సిగ్నళ్లు పనిచేయడం లేదు. నిరుపయోగంగా ఉంటున్నాయి. వినియోగంలోకి తీసుకువస్తే రాకపోకల నియంత్రణ మరింత సులువు అవుతుంది. మరోవైపు గచ్చిబౌలి ఐఐఐటీ కూడలి వద్ద ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ పక్కన పదుల సంఖ్యలో ట్రాఫిక్‌ ఐలాండ్స్‌ను పక్కన పెట్టేశారు.
14/21
15/21
ఆరోగ్య సాధనలో యోగాసనాల ఆవశ్యకత అందరికీ తెలిసిందే. కొందరే ఒళ్లు వంచుతుండగా మరికొందరు వాటి జోలికి వెళ్లడంలేదు. ప్రతి ఒక్కరికీ వాటి మేలు చాటిచెప్పేలా మణికొండ పురపాలిక, 12 సూర్య నమస్కారాలతో కూడిన ఆసనాలను అలకాపురి కాలనీ వద్ద ఏర్పాటు చేయిస్తోంది. ఆరోగ్య సాధనలో యోగాసనాల ఆవశ్యకత అందరికీ తెలిసిందే. కొందరే ఒళ్లు వంచుతుండగా మరికొందరు వాటి జోలికి వెళ్లడంలేదు. ప్రతి ఒక్కరికీ వాటి మేలు చాటిచెప్పేలా మణికొండ పురపాలిక, 12 సూర్య నమస్కారాలతో కూడిన ఆసనాలను అలకాపురి కాలనీ వద్ద ఏర్పాటు చేయిస్తోంది.
16/21
సికింద్రాబాద్‌లోని బాంటియా గార్డెన్‌లో గురువారం దాండియా రాస్‌ ఉత్సాహంగా సాగింది. గుజరాతి సంస్కృతిని ప్రతిబింబించే వస్త్రాలతో యువతులు సందడి చేశారు. ఈ నెల 26 నుంచి ఆక్టోబరు 4 వరకు ఇది కొనసాగనుంది. సికింద్రాబాద్‌లోని బాంటియా గార్డెన్‌లో గురువారం దాండియా రాస్‌ ఉత్సాహంగా సాగింది. గుజరాతి సంస్కృతిని ప్రతిబింబించే వస్త్రాలతో యువతులు సందడి చేశారు. ఈ నెల 26 నుంచి ఆక్టోబరు 4 వరకు ఇది కొనసాగనుంది.
17/21
ఎన్టీఆర్‌ మార్గ్‌లోని కాలిబాటను ఏటా తవ్వేస్తున్నారు. ఓ సారి టైల్స్‌తో నిర్మించారు. మళ్లీ తవ్వేసి ఫేవర్డ్‌ బ్రిక్స్‌తో నిర్మించారు. మరోసారి తవ్వేసి గ్రానైట్‌ కొంత, టైల్స్‌ కొంత దూరం నిర్మించారు. తాజాగా కాలిబాటతో పాటు తారురోడ్డును తవ్వేస్తున్నారు ఎన్టీఆర్‌ మార్గ్‌లోని కాలిబాటను ఏటా తవ్వేస్తున్నారు. ఓ సారి టైల్స్‌తో నిర్మించారు. మళ్లీ తవ్వేసి ఫేవర్డ్‌ బ్రిక్స్‌తో నిర్మించారు. మరోసారి తవ్వేసి గ్రానైట్‌ కొంత, టైల్స్‌ కొంత దూరం నిర్మించారు. తాజాగా కాలిబాటతో పాటు తారురోడ్డును తవ్వేస్తున్నారు
18/21
గాంధీ జయంతి సమీపిస్తున్న వేళ.. ముషీరాబాద్‌ గాంధీ ఆసుపత్రి ముందు మహాత్ముడి విగ్రహం చెంత ఆధునికీకరణ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. గాంధీ జయంతి సమీపిస్తున్న వేళ.. ముషీరాబాద్‌ గాంధీ ఆసుపత్రి ముందు మహాత్ముడి విగ్రహం చెంత ఆధునికీకరణ పనులు చురుగ్గా జరుగుతున్నాయి.
19/21
గుడిమల్కాపూర్‌ పూల మార్కెట్‌లో చిత్రమిది. ఇక్కడ కొని అంగట్లో అమ్మేవారు నలిగిన, వాడిపోయిన పూలు తీసుకోరు. పెద్ద వ్యాపారులు వాటిని పారబోస్తారు. వాటిని కొందరు ఇలా సేకరించి రేకులుగా విడదీసి అలంకరణలు, శవయాత్రలు, సమాధుల వద్ద ఉంచే వారికి అమ్ముతుంటారు. గుడిమల్కాపూర్‌ పూల మార్కెట్‌లో చిత్రమిది. ఇక్కడ కొని అంగట్లో అమ్మేవారు నలిగిన, వాడిపోయిన పూలు తీసుకోరు. పెద్ద వ్యాపారులు వాటిని పారబోస్తారు. వాటిని కొందరు ఇలా సేకరించి రేకులుగా విడదీసి అలంకరణలు, శవయాత్రలు, సమాధుల వద్ద ఉంచే వారికి అమ్ముతుంటారు.
20/21
చిన్న వర్షానికే నిల్వ చేరిన నీటిలో ఆకట్టుకునేలా ప్రతిఫలిస్తున్న వాయిద్యాలివి. సికింద్రాబాద్‌ సంగీత్‌ చౌరస్తా వద్ద నగర సుందరీకరణలో భాగంగా ఏర్పాటుచేసిన వాయిద్యాల బొమ్మల చిత్రమిది.   చిన్న వర్షానికే నిల్వ చేరిన నీటిలో ఆకట్టుకునేలా ప్రతిఫలిస్తున్న వాయిద్యాలివి. సికింద్రాబాద్‌ సంగీత్‌ చౌరస్తా వద్ద నగర సుందరీకరణలో భాగంగా ఏర్పాటుచేసిన వాయిద్యాల బొమ్మల చిత్రమిది.
21/21
స్విట్జర్లాండ్‌లోని జ్యురిక్‌లో గురువారం ఆకట్టుకున్న 186 కిలోల బంగారు క్యూబ్‌ ఇది. 24 క్యారెట్ల బంగారంతో నిక్లస్‌ క్యాస్టెల్లో అనే కళాకారుడు ‘ద క్యాస్టెల్లో క్యూబ్‌’ పేరుతో ఈ కళాఖండానికి ప్రాణం పోశారు. స్విట్జర్లాండ్‌లోని జ్యురిక్‌లో గురువారం ఆకట్టుకున్న 186 కిలోల బంగారు క్యూబ్‌ ఇది. 24 క్యారెట్ల బంగారంతో నిక్లస్‌ క్యాస్టెల్లో అనే కళాకారుడు ‘ద క్యాస్టెల్లో క్యూబ్‌’ పేరుతో ఈ కళాఖండానికి ప్రాణం పోశారు.

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని