News In Pics: చిత్రం చెప్పే సంగతులు -2(23-09-2022)

Updated : 23 Sep 2022 20:59 IST
1/32
హైదరాబాద్‌లోని గ్రీన్‌పార్క్‌ హోటల్‌లో ఓ నగల దుకాణం నూతన బ్రాంచీకి సంబంధించిన ప్రారంభోత్సవ తేదీని ప్రకటించారు. కార్యక్రమంలో పలువురు మోడల్స్‌ పాల్గొని ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు. హైదరాబాద్‌లోని గ్రీన్‌పార్క్‌ హోటల్‌లో ఓ నగల దుకాణం నూతన బ్రాంచీకి సంబంధించిన ప్రారంభోత్సవ తేదీని ప్రకటించారు. కార్యక్రమంలో పలువురు మోడల్స్‌ పాల్గొని ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.
2/32
3/32
4/32
5/32
హైదరాబాద్‌లోని కోఠి మహిళా కళాశాలలో విద్యార్థినులు సంప్రదాయ వస్త్రధారణలో సందడిగా బతుకమ్మ పండగ చేసుకున్నారు. పూలతో బతుకమ్మలను పేర్చి వాటి చుట్టూ పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. హైదరాబాద్‌లోని కోఠి మహిళా కళాశాలలో విద్యార్థినులు సంప్రదాయ వస్త్రధారణలో సందడిగా బతుకమ్మ పండగ చేసుకున్నారు. పూలతో బతుకమ్మలను పేర్చి వాటి చుట్టూ పాటలు పాడుతూ నృత్యాలు చేశారు.
6/32
7/32
8/32
9/32
సోమాజీగూడలోని విద్యుత్‌ సౌదలో ఉన్న వాటర్‌ ఫౌంటెన్‌లో ఇటీవల జాతీయ జెండా రంగులతో డిజైనర్‌ చిత్రాలు ఏర్పాటు చేశారు. వీటిని చూసి పలువురు నగరవాసులు ముగ్ధులవుతున్నారు. సోమాజీగూడలోని విద్యుత్‌ సౌదలో ఉన్న వాటర్‌ ఫౌంటెన్‌లో ఇటీవల జాతీయ జెండా రంగులతో డిజైనర్‌ చిత్రాలు ఏర్పాటు చేశారు. వీటిని చూసి పలువురు నగరవాసులు ముగ్ధులవుతున్నారు.
10/32
11/32
ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో అక్కినేని నాగార్జున హీరోగా తెరకెక్కిన సినిమా ‘ది ఘోస్ట్‌’. ఈ నెల 25న కర్నూలులో నిర్వహించనున్న ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు నాగచైతన్య, అఖిల్‌ హాజరవుతున్నట్లు చిత్రబృందం తెలిపింది. ‘ది ఘోస్ట్‌’ అక్టోబర్‌ 5న థియేటర్లలో విడుదల కానుంది. ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో అక్కినేని నాగార్జున హీరోగా తెరకెక్కిన సినిమా ‘ది ఘోస్ట్‌’. ఈ నెల 25న కర్నూలులో నిర్వహించనున్న ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు నాగచైతన్య, అఖిల్‌ హాజరవుతున్నట్లు చిత్రబృందం తెలిపింది. ‘ది ఘోస్ట్‌’ అక్టోబర్‌ 5న థియేటర్లలో విడుదల కానుంది.
12/32
చిరంజీవి హీరోగా మోహన్‌రాజా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘గాడ్‌ఫాదర్‌’. ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబరు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా శుక్రవారం సెన్సార్‌ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైంది. సెన్సార్‌ బోర్డు ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్‌ ఇచ్చింది. చిరంజీవి హీరోగా మోహన్‌రాజా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘గాడ్‌ఫాదర్‌’. ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబరు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా శుక్రవారం సెన్సార్‌ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైంది. సెన్సార్‌ బోర్డు ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్‌ ఇచ్చింది.
13/32
ఇటీవల రిటైర్మెంట్‌ ప్రకటించిన టెన్నిస్‌ క్రీడాకారుడు రోజర్‌ ఫెదరర్‌ గురువారం రాత్రి లావర్ కప్ ప్రారంభోత్సవం సందర్భంగా ఇతర క్రీడాకారులతో కలిసి లండన్‌లో కలియతిరిగారు. అక్కడి లండన్ బ్రిడ్జి వద్ద జకోవిచ్‌, రాఫెల్ నాదల్, ఆండీ ముర్రే,లతో కలిసి దిగిన ఫొటోను ఫెదరర్‌ తన ఇన్‌స్టా ఖాతాలో పంచుకున్నారు. డిన్నర్‌కు మిత్రులతో కలిసి వెళ్తున్నట్లు తెలుపుతూ పోస్టు పెట్టారు. ఇటీవల రిటైర్మెంట్‌ ప్రకటించిన టెన్నిస్‌ క్రీడాకారుడు రోజర్‌ ఫెదరర్‌ గురువారం రాత్రి లావర్ కప్ ప్రారంభోత్సవం సందర్భంగా ఇతర క్రీడాకారులతో కలిసి లండన్‌లో కలియతిరిగారు. అక్కడి లండన్ బ్రిడ్జి వద్ద జకోవిచ్‌, రాఫెల్ నాదల్, ఆండీ ముర్రే,లతో కలిసి దిగిన ఫొటోను ఫెదరర్‌ తన ఇన్‌స్టా ఖాతాలో పంచుకున్నారు. డిన్నర్‌కు మిత్రులతో కలిసి వెళ్తున్నట్లు తెలుపుతూ పోస్టు పెట్టారు.
14/32
చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మూడో విడత వైఎస్‌ఆర్‌ చేయూత నిధులను విడుదల చేశారు. మొత్తంగా 26.39 లక్షల మందికి రూ.4,949 కోట్ల నిధులను నేరుగా వారి ఖాతాల్లో జమ చేశారు. ఈ పథకం ద్వారా పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ప్రభుత్వ ఆర్థిక సాయం అందనుంది. చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మూడో విడత వైఎస్‌ఆర్‌ చేయూత నిధులను విడుదల చేశారు. మొత్తంగా 26.39 లక్షల మందికి రూ.4,949 కోట్ల నిధులను నేరుగా వారి ఖాతాల్లో జమ చేశారు. ఈ పథకం ద్వారా పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ప్రభుత్వ ఆర్థిక సాయం అందనుంది.
15/32
మిస్‌ యూనివర్స్‌ హర్నాజ్‌ సంధు న్యూయార్క్‌ వీధుల్లో తెలుపు దుస్తుల్లో సందడి చేసిన ఫొటోలను తన ఇన్‌స్టా ఖాతాలో పంచుకున్నారు. ఈ ఫొటోలకు ఆమె ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. మిస్‌ యూనివర్స్‌ హర్నాజ్‌ సంధు న్యూయార్క్‌ వీధుల్లో తెలుపు దుస్తుల్లో సందడి చేసిన ఫొటోలను తన ఇన్‌స్టా ఖాతాలో పంచుకున్నారు. ఈ ఫొటోలకు ఆమె ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు.
16/32
17/32
తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడున్న భక్తులతో మాట్లాడి.. ఏర్పాట్లు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారితో కలిసి ఛైర్మన్‌ భోజనం చేశారు. తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడున్న భక్తులతో మాట్లాడి.. ఏర్పాట్లు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారితో కలిసి ఛైర్మన్‌ భోజనం చేశారు.
18/32
19/32
హైదరాబాద్‌ అబిడ్స్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై బతుకమ్మ వేడుకలు చేసుకున్నారు. పూలతో పేర్చిన బతుకమ్మల చుట్టూ ఆడిపాడారు. హైదరాబాద్‌ అబిడ్స్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై బతుకమ్మ వేడుకలు చేసుకున్నారు. పూలతో పేర్చిన బతుకమ్మల చుట్టూ ఆడిపాడారు.
20/32
21/32
22/32
కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ జోషి హైదరాబాద్‌లోని హైదర్‌నగర్‌ డివిజన్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన కృష్ణవేణినగర్‌లోని ఎస్సీ మోర్చా డివిజన్‌ అధ్యక్షుడు సిద్ధి నర్సింగ్‌ ఇంటికి వెళ్లారు. అక్కడే నాయకులతో కలిసి అల్పాహారం తీసుకున్నారు. కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ జోషి హైదరాబాద్‌లోని హైదర్‌నగర్‌ డివిజన్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన కృష్ణవేణినగర్‌లోని ఎస్సీ మోర్చా డివిజన్‌ అధ్యక్షుడు సిద్ధి నర్సింగ్‌ ఇంటికి వెళ్లారు. అక్కడే నాయకులతో కలిసి అల్పాహారం తీసుకున్నారు.
23/32
తిరుమలలోని మొదటి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద పునర్నిర్మించిన పార్కును తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డి కలిసి ప్రారంభించారు.
 సుందరంగా తీర్చిదిద్దిన ఈ పార్కు పరిసరాలు యాత్రికులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తిరుమలలోని మొదటి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద పునర్నిర్మించిన పార్కును తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డి కలిసి ప్రారంభించారు. సుందరంగా తీర్చిదిద్దిన ఈ పార్కు పరిసరాలు యాత్రికులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
24/32
25/32
శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా నెల్లూరు నగరంలోని తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి అష్టాదశ శోభాయాత్ర శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. ఈ సందర్భంగా వేద పండితులు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి దంపతులతో పాటు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు
. 
పసుపు నీరు చల్లుతూ.. తితిదే వాద్య, నాట్య, కోలాటాల, కళాకారుల ప్రదర్శనల నడుమ, మూడు పల్లకీలలో ఆది శంకరాచార్యులు, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు, అష్టాదశ శక్తి పీఠముల నుండి వచ్చిన పవిత్ర సామాగ్రిని ఉంచి శోభాయాత్ర చేశారు. శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా నెల్లూరు నగరంలోని తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి అష్టాదశ శోభాయాత్ర శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. ఈ సందర్భంగా వేద పండితులు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి దంపతులతో పాటు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు . పసుపు నీరు చల్లుతూ.. తితిదే వాద్య, నాట్య, కోలాటాల, కళాకారుల ప్రదర్శనల నడుమ, మూడు పల్లకీలలో ఆది శంకరాచార్యులు, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు, అష్టాదశ శక్తి పీఠముల నుండి వచ్చిన పవిత్ర సామాగ్రిని ఉంచి శోభాయాత్ర చేశారు.
26/32
27/32
28/32
చిత్తూరు జిల్లా కుప్పంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పర్యటిస్తున్నారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌ ద్వారా ఆయన కుప్పం చేరుకున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అడుగడుగునా పోలీసులు మోహరించి ట్రాఫిక్‌ ఆంక్షలు విధించడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని పాఠశాలల విద్యార్థులను ముఖ్యమంత్రి పర్యటనకు తీసుకొచ్చి ఎండలో నిలబెట్టారు. దీంతో విద్యార్థులు గంటల తరబడి ఎండలో నిల్చోలేక అవస్థలు పడ్డారు. చిత్తూరు జిల్లా కుప్పంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పర్యటిస్తున్నారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌ ద్వారా ఆయన కుప్పం చేరుకున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అడుగడుగునా పోలీసులు మోహరించి ట్రాఫిక్‌ ఆంక్షలు విధించడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని పాఠశాలల విద్యార్థులను ముఖ్యమంత్రి పర్యటనకు తీసుకొచ్చి ఎండలో నిలబెట్టారు. దీంతో విద్యార్థులు గంటల తరబడి ఎండలో నిల్చోలేక అవస్థలు పడ్డారు.
29/32
30/32
31/32
సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. సీజేఐగా పదవీ విరమణ చేశాక ఆయన తొలిసారి హైదరాబాద్‌కు వచ్చారు. విమానాశ్రయానికి చేరుకున్న జస్టిస్‌ ఎన్‌.వి.రమణ దంపతులకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ సహా పలువురు న్యాయమూర్తులు ఘనస్వాగతం పలికారు.  సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. సీజేఐగా పదవీ విరమణ చేశాక ఆయన తొలిసారి హైదరాబాద్‌కు వచ్చారు. విమానాశ్రయానికి చేరుకున్న జస్టిస్‌ ఎన్‌.వి.రమణ దంపతులకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ సహా పలువురు న్యాయమూర్తులు ఘనస్వాగతం పలికారు.
32/32

మరిన్ని