News In Pics: చిత్రం చెప్పే సంగతులు - 2 (24-09-2022)

Updated : 24 Sep 2022 20:07 IST
1/23
విశాఖ ఉక్కు కర్మాగారంలో ద్రవం ఉక్కు లీకేజీతో ఇలా నిప్పులు చిమ్ముతూ నేల పాలైంది. విశాఖ ఉక్కు కర్మాగారంలో ద్రవం ఉక్కు లీకేజీతో ఇలా నిప్పులు చిమ్ముతూ నేల పాలైంది.
2/23
ఆదివారం ఉప్పల్‌లో జరగనున్న మూడో టీ20 మ్యాచ్‌ కోసం భారత్‌, ఆస్ట్రేలియా ఆటగాళ్లు హైదరాబాద్‌లోని శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి వారంతా పార్క్‌ హయాత్, తాజ్‌ కృష్ణా హోటళ్లకు బయలుదేరారు. ఆదివారం ఉప్పల్‌లో జరగనున్న మూడో టీ20 మ్యాచ్‌ కోసం భారత్‌, ఆస్ట్రేలియా ఆటగాళ్లు హైదరాబాద్‌లోని శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి వారంతా పార్క్‌ హయాత్, తాజ్‌ కృష్ణా హోటళ్లకు బయలుదేరారు.
3/23
4/23
5/23
హైదరాబాద్‌లోని హామ్‌స్టెక్‌ కళాశాలకు చెందిన డిజైనింగ్‌ విద్యార్థులు తయారు చేసిన వివిధ రకాల వస్తువులను మాదాపూర్‌లోని ఎన్‌ కన్వెన్షన్‌లో ప్రదర్శించారు. ఈ సందర్భంగా పలువురు మోడల్స్‌ నిర్వహించిన ర్యాంప్‌వాక్‌ చూపరులను ఆకట్టుకుంది. హైదరాబాద్‌లోని హామ్‌స్టెక్‌ కళాశాలకు చెందిన డిజైనింగ్‌ విద్యార్థులు తయారు చేసిన వివిధ రకాల వస్తువులను మాదాపూర్‌లోని ఎన్‌ కన్వెన్షన్‌లో ప్రదర్శించారు. ఈ సందర్భంగా పలువురు మోడల్స్‌ నిర్వహించిన ర్యాంప్‌వాక్‌ చూపరులను ఆకట్టుకుంది.
6/23
7/23
8/23
హైదరాబాద్‌లోని కర్మాన్‌ఘాట్‌లో శాన్వీ, ధ్రువ విద్యాసంస్థల స్నాతకోత్సవ వేడుక నిర్వహించారు. కార్యక్రమంలో విద్యార్థినులు తమ నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. హైదరాబాద్‌లోని కర్మాన్‌ఘాట్‌లో శాన్వీ, ధ్రువ విద్యాసంస్థల స్నాతకోత్సవ వేడుక నిర్వహించారు. కార్యక్రమంలో విద్యార్థినులు తమ నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు.
9/23
10/23
11/23
12/23
హాంగ్‌కాంగ్‌లో ఓ వేడుకలో భాగంగా అగ్నిమాపక దళం, అంబులెన్స్‌ అకాడమీల సంయుక్త ఆధ్వర్యంలో పరేడ్‌ నిర్వహించారు  ఈ సందర్భంగా ఓ శునకం కార్డియో పల్మోనరీ రెసిస్టేషన్‌-సీపీఆర్‌(అత్యవసర పరిస్థితుల్లో శ్వాస ఆగినప్పుడు ఛాతిని తట్టి అందించే వైద్యం)ను ఇచ్చే విధానాన్ని చూపిస్తూ కనిపించింది. హాంగ్‌కాంగ్‌లో ఓ వేడుకలో భాగంగా అగ్నిమాపక దళం, అంబులెన్స్‌ అకాడమీల సంయుక్త ఆధ్వర్యంలో పరేడ్‌ నిర్వహించారు ఈ సందర్భంగా ఓ శునకం కార్డియో పల్మోనరీ రెసిస్టేషన్‌-సీపీఆర్‌(అత్యవసర పరిస్థితుల్లో శ్వాస ఆగినప్పుడు ఛాతిని తట్టి అందించే వైద్యం)ను ఇచ్చే విధానాన్ని చూపిస్తూ కనిపించింది.
13/23
పోలీసుల ఆంక్షల మధ్యే అమరావతి రైతుల పాదయాత్ర కొనసాగుతోంది. పాదయాత్ర చేస్తున్న రాజధాని రైతులకు స్థానికుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుండడంతో ఇతర ప్రాంతాల నేతలను రాకుండా ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గుడివాడ పట్టణంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా సుమారు 300మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. పట్టణంలోని కీలక ప్రాంతాల్లో పోలీసులు కవాతు నిర్వహించారు. పోలీసుల ఆంక్షల మధ్యే అమరావతి రైతుల పాదయాత్ర కొనసాగుతోంది. పాదయాత్ర చేస్తున్న రాజధాని రైతులకు స్థానికుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుండడంతో ఇతర ప్రాంతాల నేతలను రాకుండా ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గుడివాడ పట్టణంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా సుమారు 300మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. పట్టణంలోని కీలక ప్రాంతాల్లో పోలీసులు కవాతు నిర్వహించారు.
14/23
15/23
కరీంనగర్‌లోని ఎన్జీవో ఆడిటోరియంలో శనివారం పోషణ్ అభియాన్‌లో భాగంగా పోషకాహార పంపిణీ నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు మహిళలు, యువతులు పాల్గొని బతుకమ్మ వేడుకలు చేసుకున్నారు.. కరీంనగర్‌లోని ఎన్జీవో ఆడిటోరియంలో శనివారం పోషణ్ అభియాన్‌లో భాగంగా పోషకాహార పంపిణీ నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు మహిళలు, యువతులు పాల్గొని బతుకమ్మ వేడుకలు చేసుకున్నారు..
16/23
17/23
అంబర్‌పేట ప్రేమ్‌నగర్‌లోని ఓ పాఠశాల ఆవరణలో బతుకమ్మ సంబరాలు అంబర్‌పేట ప్రేమ్‌నగర్‌లోని ఓ పాఠశాల ఆవరణలో బతుకమ్మ సంబరాలు
18/23
అంబర్‌పేటలోని సెయింట్ ఆడమ్స్ హైస్కూల్‌లో.. అంబర్‌పేటలోని సెయింట్ ఆడమ్స్ హైస్కూల్‌లో..
19/23
హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ ఆయుర్వేద ఆసుపత్రి వద్ద కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి నూతన అంబులెన్స్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా అంబులెన్స్‌ను నడిపారు. హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ ఆయుర్వేద ఆసుపత్రి వద్ద కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి నూతన అంబులెన్స్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా అంబులెన్స్‌ను నడిపారు.
20/23
21/23
గచ్చిబౌలిలోని ఐఎస్‌బీలో జరిగిన లీడర్‌ షిప్‌ సమ్మిట్‌-2022కు జస్టిస్‌ ఎన్వీ రమణ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన అక్కడి ప్రిజమ్‌పై సంతకం చేశారు. గచ్చిబౌలిలోని ఐఎస్‌బీలో జరిగిన లీడర్‌ షిప్‌ సమ్మిట్‌-2022కు జస్టిస్‌ ఎన్వీ రమణ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన అక్కడి ప్రిజమ్‌పై సంతకం చేశారు.
22/23
శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జునస్వామిని దర్శించుకోవడానికి వెళ్తున్న ఎమ్మెల్సీ కవితకు కల్వకుర్తి వద్ద తెలంగాణ జాగృతి కార్యకర్తలు, నాయకులు ఘనస్వాగతం పలికారు. శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జునస్వామిని దర్శించుకోవడానికి వెళ్తున్న ఎమ్మెల్సీ కవితకు కల్వకుర్తి వద్ద తెలంగాణ జాగృతి కార్యకర్తలు, నాయకులు ఘనస్వాగతం పలికారు.
23/23

మరిన్ని

ap-districts
ts-districts