News In Pics: చిత్రం చెప్పే సంగతులు - 1 (26-09-2022)

Updated : 26 Sep 2022 12:55 IST
1/35
చెరువులవెనం, తాజంగి, లంబసింగిలో ఆదివారం పర్యటకుల సందడి నెలకొంది. దూర ప్రాంతాల నుంచి ఇక్కడి అందాలు ఆస్వాదించేందుకు సందర్శకులు తరలివచ్చారు. శీతాకాలం ప్రారంభం కావడంతో పర్యటకుల తాకిడి పెరుగుతోంది. వాతావరణంలో మార్పుల కారణంగా పొగమంచు కొంత తక్కువగా కురిసింది.   చెరువులవెనం, తాజంగి, లంబసింగిలో ఆదివారం పర్యటకుల సందడి నెలకొంది. దూర ప్రాంతాల నుంచి ఇక్కడి అందాలు ఆస్వాదించేందుకు సందర్శకులు తరలివచ్చారు. శీతాకాలం ప్రారంభం కావడంతో పర్యటకుల తాకిడి పెరుగుతోంది. వాతావరణంలో మార్పుల కారణంగా పొగమంచు కొంత తక్కువగా కురిసింది.
2/35
సాధారణంగా కోడి పెట్టలు మాత్రమే పిల్లల సంరక్షణను చూస్తుంటాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో ఓ కోడి పుంజు పిల్లలను కంటికి రెప్పలా రక్షిస్తుండటం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పాశం నర్సయ్య తన ఇంట్లో కోళ్లను పెంచుతున్నాడు. 10 కోడి పిల్లలను సంరక్షిస్తున్న తల్లి (పెట్ట) శునకాల దాడిలో పక్షం రోజుల క్రితం హతమయింది. అప్పటి నుంచి ఓ పుంజు ఆ పిల్లల రక్షణ బాధ్యతలను చూస్తోంది. వెంటేసుకుని తిరుగుతూ గింజలను తినిపిస్తుంది. అపాయం నుంచి అప్రమత్తం చేస్తూ పిల్లలను కాపాడుతోంది.  సాధారణంగా కోడి పెట్టలు మాత్రమే పిల్లల సంరక్షణను చూస్తుంటాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో ఓ కోడి పుంజు పిల్లలను కంటికి రెప్పలా రక్షిస్తుండటం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పాశం నర్సయ్య తన ఇంట్లో కోళ్లను పెంచుతున్నాడు. 10 కోడి పిల్లలను సంరక్షిస్తున్న తల్లి (పెట్ట) శునకాల దాడిలో పక్షం రోజుల క్రితం హతమయింది. అప్పటి నుంచి ఓ పుంజు ఆ పిల్లల రక్షణ బాధ్యతలను చూస్తోంది. వెంటేసుకుని తిరుగుతూ గింజలను తినిపిస్తుంది. అపాయం నుంచి అప్రమత్తం చేస్తూ పిల్లలను కాపాడుతోంది.
3/35
ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురానికి చెందిన ముడిగె రాజు అనే రైతు ఆదివారం మిరప చేలో నాగలితో ఉదయం నుంచి సాయంత్రం వరకు దుక్కి దున్నాడు. సాయంత్రం ఇంటికి వచ్చే క్రమంలో నాగలిని ఎడ్లబండిలో పెట్టి తానే స్వయంగా భుజాన వేసుకొని కిలోమీటరు వరకు లాక్కెళ్లాడు.  వెనక కాడెద్దులు రోడ్డుకు ఇరువైపులా ఉన్న పచ్చిగడ్డిని మేసుకుంటూ వచ్చాయి. ఈ చిత్రాన్ని ‘న్యూస్‌టుడే’ తన కెమెరాలో బంధించింది. ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురానికి చెందిన ముడిగె రాజు అనే రైతు ఆదివారం మిరప చేలో నాగలితో ఉదయం నుంచి సాయంత్రం వరకు దుక్కి దున్నాడు. సాయంత్రం ఇంటికి వచ్చే క్రమంలో నాగలిని ఎడ్లబండిలో పెట్టి తానే స్వయంగా భుజాన వేసుకొని కిలోమీటరు వరకు లాక్కెళ్లాడు. వెనక కాడెద్దులు రోడ్డుకు ఇరువైపులా ఉన్న పచ్చిగడ్డిని మేసుకుంటూ వచ్చాయి. ఈ చిత్రాన్ని ‘న్యూస్‌టుడే’ తన కెమెరాలో బంధించింది.
4/35
వాగు ఒడ్డున ఈ బండలను చూస్తే ఒక దానిపై ఒకటి పేర్చినట్లు ఉన్నాయి. వాస్తవానికి వాగు నీరు.. వర్షం.. వాగు ప్రభావం కారణంగా కోతకు గురై బండలను పేర్చినట్లుగా కనిపిస్తున్నాయి. ఆదిలాబాద్‌ గ్రామీణ మండలంలోని చిద్దరి, సేవాదాస్‌నగర్‌ గ్రామాల మధ్య ప్రవహించే వాగుపై ఈ బండలు కనిపిస్తున్నాయి. ఇంద్రవెల్లి, ఆదిలాబాద్‌ తదితర మండలాల ప్రజలు వీటిని ఆసక్తిగా తిలకిస్తున్నారు.  వాగు ఒడ్డున ఈ బండలను చూస్తే ఒక దానిపై ఒకటి పేర్చినట్లు ఉన్నాయి. వాస్తవానికి వాగు నీరు.. వర్షం.. వాగు ప్రభావం కారణంగా కోతకు గురై బండలను పేర్చినట్లుగా కనిపిస్తున్నాయి. ఆదిలాబాద్‌ గ్రామీణ మండలంలోని చిద్దరి, సేవాదాస్‌నగర్‌ గ్రామాల మధ్య ప్రవహించే వాగుపై ఈ బండలు కనిపిస్తున్నాయి. ఇంద్రవెల్లి, ఆదిలాబాద్‌ తదితర మండలాల ప్రజలు వీటిని ఆసక్తిగా తిలకిస్తున్నారు.
5/35
పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో నాణేల ఇతివృత్తంతో ఏర్పాటు చేసిన దుర్గా పూజ మండపాన్ని ఆదివారం ప్రారంభించిన అనంతరం అమ్మవారికి పూజలు చేస్తున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో నాణేల ఇతివృత్తంతో ఏర్పాటు చేసిన దుర్గా పూజ మండపాన్ని ఆదివారం ప్రారంభించిన అనంతరం అమ్మవారికి పూజలు చేస్తున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ
6/35
7/35
హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌పై నిలిపి ఉంచిన ఈ బస్సు నగరంలో మహిళల కోసం ఏర్పాటు చేసిన సంచార మరుగుదొడ్డి. సేఫ్‌ సిటీ ప్రాజెక్ట్‌లో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఇలాంటి 12 బస్సులను గ్రేటర్‌ హైదరాబాద్‌లో అందుబాటులోకి తెచ్చారు. షీటీమ్స్‌ సహకారంతో జీహెచ్‌ఎంసీ ఈ బస్సులను పర్యవేక్షిస్తోంది. ఈ ఆధునిక బస్సులు వీఐపీల కోసమేనేమో అనే అనుమానంతో సాధారణ మహిళలు ఉపయోగించడానికి జంకుతుండడంతో బస్సు సిబ్బంది అక్కడి మహిళలకు అవగాహన కల్పిస్తున్నారు. హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌పై నిలిపి ఉంచిన ఈ బస్సు నగరంలో మహిళల కోసం ఏర్పాటు చేసిన సంచార మరుగుదొడ్డి. సేఫ్‌ సిటీ ప్రాజెక్ట్‌లో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఇలాంటి 12 బస్సులను గ్రేటర్‌ హైదరాబాద్‌లో అందుబాటులోకి తెచ్చారు. షీటీమ్స్‌ సహకారంతో జీహెచ్‌ఎంసీ ఈ బస్సులను పర్యవేక్షిస్తోంది. ఈ ఆధునిక బస్సులు వీఐపీల కోసమేనేమో అనే అనుమానంతో సాధారణ మహిళలు ఉపయోగించడానికి జంకుతుండడంతో బస్సు సిబ్బంది అక్కడి మహిళలకు అవగాహన కల్పిస్తున్నారు.
8/35
9/35
అడవుల్లో ఉండాల్సిన కోతులు జనావాసాలకు చేరి ముప్పుతిప్పలు పెడుతున్నాయి. కోతుల్ని భయపెట్టే కొండముచ్చులు(కొండెంగ) మాత్రం అడవుల్లోనే హాయిగా సంచరిస్తున్నాయి. కవ్వాల్‌ టైగర్‌ రిజర్వులో ఓ చెట్టుపై కూర్చుని ఊసులాడుకుంటున్న కొండెంగల చిత్రాల్ని రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్‌ తన కెమెరాలో బంధించారు. పొడవాటి వీటి తోకలు చెట్టు రంగులో కలిసిపోయి నేలను తాకుతున్నట్లు కనిపించాయి. మరో కొండముచ్చు చెట్టు వెనకాల దాక్కుని తొంగి చూస్తోంది. ఈ చిత్రాల్ని ఎంపీ సంతోష్‌ తన ట్విటర్‌ ఖాతాకు జతచేశారు. అడవుల్లో ఉండాల్సిన కోతులు జనావాసాలకు చేరి ముప్పుతిప్పలు పెడుతున్నాయి. కోతుల్ని భయపెట్టే కొండముచ్చులు(కొండెంగ) మాత్రం అడవుల్లోనే హాయిగా సంచరిస్తున్నాయి. కవ్వాల్‌ టైగర్‌ రిజర్వులో ఓ చెట్టుపై కూర్చుని ఊసులాడుకుంటున్న కొండెంగల చిత్రాల్ని రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్‌ తన కెమెరాలో బంధించారు. పొడవాటి వీటి తోకలు చెట్టు రంగులో కలిసిపోయి నేలను తాకుతున్నట్లు కనిపించాయి. మరో కొండముచ్చు చెట్టు వెనకాల దాక్కుని తొంగి చూస్తోంది. ఈ చిత్రాల్ని ఎంపీ సంతోష్‌ తన ట్విటర్‌ ఖాతాకు జతచేశారు.
10/35
11/35
ఒకప్పుడు సాగు నీరందించిన ఈ కాలువ ఇప్పుడు నగర మురుగును తీసుకెళ్లే డ్రైనేజీగా మారిపోయింది. ప్రస్తుతం కాల్వలో మురుగు ప్రవహిస్తుందో.. లేదో కూడా గుర్తించలేని పరిస్థితి. ప్లాస్టిక్‌ వ్యర్థాలు కాలువ పొడవునా పేరుకుపోయాయి. వర్షాలు వస్తే తూముల వద్ద వ్యర్థాలు అన్నీ పోగయి వరదనూ కదలనివ్వడం లేదు. ఇదీ.. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు నగరంలోని సర్వేపల్లి కాలువ దుస్థితి. కాలువకు పునర్‌ వైభవం తేవాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు. ఒకప్పుడు సాగు నీరందించిన ఈ కాలువ ఇప్పుడు నగర మురుగును తీసుకెళ్లే డ్రైనేజీగా మారిపోయింది. ప్రస్తుతం కాల్వలో మురుగు ప్రవహిస్తుందో.. లేదో కూడా గుర్తించలేని పరిస్థితి. ప్లాస్టిక్‌ వ్యర్థాలు కాలువ పొడవునా పేరుకుపోయాయి. వర్షాలు వస్తే తూముల వద్ద వ్యర్థాలు అన్నీ పోగయి వరదనూ కదలనివ్వడం లేదు. ఇదీ.. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు నగరంలోని సర్వేపల్లి కాలువ దుస్థితి. కాలువకు పునర్‌ వైభవం తేవాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు.
12/35
సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని సాయినగర్‌ కాలనీకి చెందిన మహిపాల్‌, మంజుల దంపతుల కుమార్తె చైతన్య పుట్టుకతోనే ఎడమ పాదం లేకపోవడం వల్ల కృత్రిమ కాలుతో నడుస్తోంది. తండ్రి మహిపాల్‌ అనారోగ్యంతో మంచానికే పరిమితమయ్యారు. ఆర్థిక స్తోమత లేక శస్త్ర చికిత్స చేయించుకోలేని పరిస్థితి. చైతన్య నిట్‌లో బీటెక్‌ చదవడానికి ఆర్థిక పరిస్థితి సహకరించడంలేదు. దీంతో ఆ కుటుంబం దాతల సహాయం కోరుతోంది. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని సాయినగర్‌ కాలనీకి చెందిన మహిపాల్‌, మంజుల దంపతుల కుమార్తె చైతన్య పుట్టుకతోనే ఎడమ పాదం లేకపోవడం వల్ల కృత్రిమ కాలుతో నడుస్తోంది. తండ్రి మహిపాల్‌ అనారోగ్యంతో మంచానికే పరిమితమయ్యారు. ఆర్థిక స్తోమత లేక శస్త్ర చికిత్స చేయించుకోలేని పరిస్థితి. చైతన్య నిట్‌లో బీటెక్‌ చదవడానికి ఆర్థిక పరిస్థితి సహకరించడంలేదు. దీంతో ఆ కుటుంబం దాతల సహాయం కోరుతోంది.
13/35
పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో ఆదివారం తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారిక పత్రిక ‘జాగో బంగ్లా’ రూపొందించిన దుర్గాపూజా పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సినీ నటీమణులు సయంతికా బెనర్జీ, శుభశ్రీ గంగూలీ. పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో ఆదివారం తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారిక పత్రిక ‘జాగో బంగ్లా’ రూపొందించిన దుర్గాపూజా పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సినీ నటీమణులు సయంతికా బెనర్జీ, శుభశ్రీ గంగూలీ.
14/35
వచ్చే ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో జరగనున్న ఫార్ములా - ఇ రేసింగ్‌లో పాల్గొనే కార్లు ఆదివారం నగరానికి చేరుకున్నాయి. ఏరో డైనమిక్‌ రూపంలో ఆకర్షణీయంగా కనిపించే ఈ కార్లు 3 సెకన్లలోనే 62 కి.మీ వేగాన్ని అందుకొంటాయి. గంటకు గరిష్ఠంగా 280 కి.మీ. వేగంతో దూసుకెళ్లగలవు. వీటిలో దుర్గం చెరువు వద్ద ప్రదర్శించిన ఓ కారు సందర్శకులను ఆకట్టుకుంది. వచ్చే ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో జరగనున్న ఫార్ములా - ఇ రేసింగ్‌లో పాల్గొనే కార్లు ఆదివారం నగరానికి చేరుకున్నాయి. ఏరో డైనమిక్‌ రూపంలో ఆకర్షణీయంగా కనిపించే ఈ కార్లు 3 సెకన్లలోనే 62 కి.మీ వేగాన్ని అందుకొంటాయి. గంటకు గరిష్ఠంగా 280 కి.మీ. వేగంతో దూసుకెళ్లగలవు. వీటిలో దుర్గం చెరువు వద్ద ప్రదర్శించిన ఓ కారు సందర్శకులను ఆకట్టుకుంది.
15/35
అసలే క్రికెట్‌.. ఆదివారం నగరం ఇండియా - ఆస్ట్రేలియా మ్యాచ్‌కు వేదిక కావడంతో మరింత క్రేజ్‌ ఏర్పడింది. ఈఎస్‌ఐ నుంచి మోతీనగర్‌ దారిలో రాజస్థాన్‌కు చెందిన ఓ కుటుంబం క్రికెట్‌ బ్యాట్లు తయారు చేసి విక్రయిస్తోంది. కొనుగోలుకు ఎక్కువ మంది ఆసక్తి చూపారు. అసలే క్రికెట్‌.. ఆదివారం నగరం ఇండియా - ఆస్ట్రేలియా మ్యాచ్‌కు వేదిక కావడంతో మరింత క్రేజ్‌ ఏర్పడింది. ఈఎస్‌ఐ నుంచి మోతీనగర్‌ దారిలో రాజస్థాన్‌కు చెందిన ఓ కుటుంబం క్రికెట్‌ బ్యాట్లు తయారు చేసి విక్రయిస్తోంది. కొనుగోలుకు ఎక్కువ మంది ఆసక్తి చూపారు.
16/35
వ్యవసాయరంగంపై తమ మక్కువ చాటుకున్నారు ఏపీలోని బాపట్ల, ప్రకాశం జిల్లాల కలెక్టర్లు విజయకృష్ణన్‌, దినేష్‌కుమార్‌ దంపతులు. తమ పిల్లలు, బంధువులతో కలిసి ఆదివారం ఉదయం బాపట్ల మండలం మురుకుండపాడు పొలాల వద్దకు వచ్చి.. కూలీలతో కలిసి వరినాట్లు వేశారు. వ్యవసాయరంగంపై తమ మక్కువ చాటుకున్నారు ఏపీలోని బాపట్ల, ప్రకాశం జిల్లాల కలెక్టర్లు విజయకృష్ణన్‌, దినేష్‌కుమార్‌ దంపతులు. తమ పిల్లలు, బంధువులతో కలిసి ఆదివారం ఉదయం బాపట్ల మండలం మురుకుండపాడు పొలాల వద్దకు వచ్చి.. కూలీలతో కలిసి వరినాట్లు వేశారు.
17/35
18/35
హైదరాబాద్‌ నగరంలో పెరిగిపోతున్న భవనాలతో కొండలు, చెరువులు తరిగిపోతున్నాయి. ఖాజాగూడ పరిసరాల్లో కొండ గుట్టలపై నుంచి కనిపిస్తున్న దృశ్యమిది. అభివృద్ధి పేరుతో సహజమైన రాతి గుట్టలు రాబోయే రోజుల్లో కనుమరుగయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్‌ నగరంలో పెరిగిపోతున్న భవనాలతో కొండలు, చెరువులు తరిగిపోతున్నాయి. ఖాజాగూడ పరిసరాల్లో కొండ గుట్టలపై నుంచి కనిపిస్తున్న దృశ్యమిది. అభివృద్ధి పేరుతో సహజమైన రాతి గుట్టలు రాబోయే రోజుల్లో కనుమరుగయ్యే అవకాశం ఉంది.
19/35
తెలంగాణ రాజధానిలో హుస్సేన్‌ సాగర్‌ ఒడ్డున ఎన్టీఆర్‌ గార్డెన్స్‌ సమీపంలో రూ.150 కోట్లు వెచ్చించి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేస్తున్న అంబేడ్కర్‌ భారీ విగ్రహానికి అమర్చనున్న బూట్లు. దిల్లీలో వీటిని తయారు చేయించి ప్రత్యేక వాహనాల్లో హైదరాబాద్‌కు తరలించారు. 11 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేస్తున్న ఈ విగ్రహం ఎత్తు 125 అడుగులు. బూట్లే దాదాపు 12 అడుగుల ఎత్తున్నాయి. తెలంగాణ రాజధానిలో హుస్సేన్‌ సాగర్‌ ఒడ్డున ఎన్టీఆర్‌ గార్డెన్స్‌ సమీపంలో రూ.150 కోట్లు వెచ్చించి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేస్తున్న అంబేడ్కర్‌ భారీ విగ్రహానికి అమర్చనున్న బూట్లు. దిల్లీలో వీటిని తయారు చేయించి ప్రత్యేక వాహనాల్లో హైదరాబాద్‌కు తరలించారు. 11 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేస్తున్న ఈ విగ్రహం ఎత్తు 125 అడుగులు. బూట్లే దాదాపు 12 అడుగుల ఎత్తున్నాయి.
20/35
హైదరాబాద్‌లోని పలు కూడళ్లు, డివైడర్లు సుందరీకరణకు నోచుకోలేదు. శేరిలింగంపల్లి జోనల్‌ పరిధిలో  డివైడర్లపై పిచ్చిమొక్కలు పెరిగిపోతున్నాయి. గచ్చిబౌలి ఇందిరానగర్‌ నుంచి బ్రహ్మకుమారి శాంతి సరోవర్, గోపీచంద్‌ అకాడమీ మార్గంలో, నల్లగండ్ల నుంచి గోపనపల్లి ప్రధాన రహదారి డివైడర్ల మధ్య ఇవి ఎక్కువగా ఉన్నాయి. హైదరాబాద్‌లోని పలు కూడళ్లు, డివైడర్లు సుందరీకరణకు నోచుకోలేదు. శేరిలింగంపల్లి జోనల్‌ పరిధిలో డివైడర్లపై పిచ్చిమొక్కలు పెరిగిపోతున్నాయి. గచ్చిబౌలి ఇందిరానగర్‌ నుంచి బ్రహ్మకుమారి శాంతి సరోవర్, గోపీచంద్‌ అకాడమీ మార్గంలో, నల్లగండ్ల నుంచి గోపనపల్లి ప్రధాన రహదారి డివైడర్ల మధ్య ఇవి ఎక్కువగా ఉన్నాయి.
21/35
22/35
 విజయవాడ ఎస్‌ఎస్‌ కన్వెన్షన్‌ హాల్‌లో ఆదివారం రాత్రి జరిగిన గార్బానైట్‌-2022 ప్రదర్శన అలరించింది. యువతులు పోటా పోటీగా దాండియా నృత్యాలు చేశారు. చిన్నారుల ఫ్యాషన్‌ షో ఆకట్టుకుంది. పురుషులు, మహిళలకు వేర్వేరుగా వస్త్రధారణ పోటీలు నిర్వహించారు. విజయవాడ ఎస్‌ఎస్‌ కన్వెన్షన్‌ హాల్‌లో ఆదివారం రాత్రి జరిగిన గార్బానైట్‌-2022 ప్రదర్శన అలరించింది. యువతులు పోటా పోటీగా దాండియా నృత్యాలు చేశారు. చిన్నారుల ఫ్యాషన్‌ షో ఆకట్టుకుంది. పురుషులు, మహిళలకు వేర్వేరుగా వస్త్రధారణ పోటీలు నిర్వహించారు.
23/35
బెల్లంకొండ బ్రాంచి కాలువపై త్రిపురాపురం వద్ద నిర్మించిన ఇనుప వంతెన శిథిలావస్థకు చేరింది. దశాబ్దాల క్రితం నిర్మించిన వంతెనపై బండలు, రేకులు తాత్కలికంగా ఉంచి వాటిని వస్త్ర పీలికలతో కట్టి రాకపోకలు సాగిస్తున్నారు. నిత్యం ఈ మార్గంలో పలు గ్రామాలకు చెందిన రైతులు బిక్కుబిక్కుమంటూ రాకపోకలు సాగిస్తున్నారు. ఎన్నెస్పీ అధికారులు తక్షణం స్పందించి చిన్నపాటి వంతెన నిర్మించాలని రైతులు కోరుతున్నారు. బెల్లంకొండ బ్రాంచి కాలువపై త్రిపురాపురం వద్ద నిర్మించిన ఇనుప వంతెన శిథిలావస్థకు చేరింది. దశాబ్దాల క్రితం నిర్మించిన వంతెనపై బండలు, రేకులు తాత్కలికంగా ఉంచి వాటిని వస్త్ర పీలికలతో కట్టి రాకపోకలు సాగిస్తున్నారు. నిత్యం ఈ మార్గంలో పలు గ్రామాలకు చెందిన రైతులు బిక్కుబిక్కుమంటూ రాకపోకలు సాగిస్తున్నారు. ఎన్నెస్పీ అధికారులు తక్షణం స్పందించి చిన్నపాటి వంతెన నిర్మించాలని రైతులు కోరుతున్నారు.
24/35
దసరా శరన్నవరాత్రులకు నగరంలో ఆలయాలు ముస్తాబయ్యాయి. రోజుకో రూపంలో అమ్మవార్లు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఆదివారం రాత్రి జూబ్లీహిల్స్‌ పెద్దమ్మ తల్లి ఆలయం విద్యుత్తు కాంతుల్లో తళుకులీనింది.  దసరా శరన్నవరాత్రులకు నగరంలో ఆలయాలు ముస్తాబయ్యాయి. రోజుకో రూపంలో అమ్మవార్లు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఆదివారం రాత్రి జూబ్లీహిల్స్‌ పెద్దమ్మ తల్లి ఆలయం విద్యుత్తు కాంతుల్లో తళుకులీనింది.
25/35
26/35
మ్యాచ్‌ ప్రారంభానికి ముందు సాధన చేస్తున్న విరాట్‌ కోహ్లి మ్యాచ్‌ ప్రారంభానికి ముందు సాధన చేస్తున్న విరాట్‌ కోహ్లి
27/35
క్రికెట్‌ అభిమానుల కేరింతలతో ఉప్పల్‌ పరిసరాలు మార్మోగాయి. ఆదివారం భారత్‌-ఆస్ట్రేలియా మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌కు అభిమానులు భారీగా తరలివచ్చారు. మువ్వన్నెల జెండాలు పట్టుకొని భారత జెర్సీలు ధరించి మైదానంలో సందడి చేశారు. నగరానికి చెందిన సినీ, రాజకీయ ప్రముఖులు మ్యాచ్‌ వీక్షించారు. క్రికెట్‌ అభిమానుల కేరింతలతో ఉప్పల్‌ పరిసరాలు మార్మోగాయి. ఆదివారం భారత్‌-ఆస్ట్రేలియా మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌కు అభిమానులు భారీగా తరలివచ్చారు. మువ్వన్నెల జెండాలు పట్టుకొని భారత జెర్సీలు ధరించి మైదానంలో సందడి చేశారు. నగరానికి చెందిన సినీ, రాజకీయ ప్రముఖులు మ్యాచ్‌ వీక్షించారు.
28/35
29/35
30/35
 ఉప్పల్‌ స్టేడియంలో ఆదివారం భారత్‌-ఆస్ట్రేలియా మధ్య జరిగిన టీ-20 క్రికెట్‌ మ్యాచ్‌కు అభిమానులు పోటెత్తారు.  ఆట ముగిశాక ఒకేసారి స్టేడియం నుంచి అందరూ బయటకు రావడంతో ఉప్పల్, రామంతాపూర్, హబ్సిగూడ, తార్నాక తదితర మార్గాల్లో ట్రాఫిక్‌  స్తంభించింది. రాత్రి 11-12 గంటల వరకూ రద్దీ వాతావరణం నెలకొంది. ఉప్పల్‌ స్టేడియంలో ఆదివారం భారత్‌-ఆస్ట్రేలియా మధ్య జరిగిన టీ-20 క్రికెట్‌ మ్యాచ్‌కు అభిమానులు పోటెత్తారు. ఆట ముగిశాక ఒకేసారి స్టేడియం నుంచి అందరూ బయటకు రావడంతో ఉప్పల్, రామంతాపూర్, హబ్సిగూడ, తార్నాక తదితర మార్గాల్లో ట్రాఫిక్‌ స్తంభించింది. రాత్రి 11-12 గంటల వరకూ రద్దీ వాతావరణం నెలకొంది.
31/35
 హైదరాబాద్‌ సైక్లింగ్‌ రివల్యూషన్‌ 2.0 పేరుతో ఆదివారం మాదాపూర్‌లోని దుర్గం చెరువు వద్ద నిర్వహించిన కార్యక్రమంలో పలువురు ఔత్సాహికులైన సైక్లిస్టులు పాల్గొన్నారు. వీరిలో చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ఉండడం విశేషం. వీరిలో ఆర్యాష్‌(మూడున్నరేళ్లు), సుభాష్‌పాండే(78) అందరినీ ఆకట్టుకున్నారు. కొందరు వారితో ఫొటోలు, స్వీయచిత్రాలు దిగారు. హైదరాబాద్‌ సైక్లింగ్‌ రివల్యూషన్‌ 2.0 పేరుతో ఆదివారం మాదాపూర్‌లోని దుర్గం చెరువు వద్ద నిర్వహించిన కార్యక్రమంలో పలువురు ఔత్సాహికులైన సైక్లిస్టులు పాల్గొన్నారు. వీరిలో చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ఉండడం విశేషం. వీరిలో ఆర్యాష్‌(మూడున్నరేళ్లు), సుభాష్‌పాండే(78) అందరినీ ఆకట్టుకున్నారు. కొందరు వారితో ఫొటోలు, స్వీయచిత్రాలు దిగారు.
32/35
33/35
శిల్పారామంలో ఆదివారం సాయంత్రం కళాకారులు ప్రదర్శించిన శాస్త్రీయ నృత్యం కనువిందుగా సాగింది. నాట్యగురువు చావలి బాలత్రిపుర సుందరి శిష్యబృందం చూడముచ్చటైన కూచిపూడి నృత్యాంశాలతో కళాప్రియులను ఆకట్టుకుంది. కీర్తనలకు అనుగుణంగా కళాకారులు లయబద్ధంగా విభిన్న నృత్యాంశాలను ప్రదర్శించి అలరించారు. నటేషకౌతం, కామాక్షిస్తుతి, అమ్మభ్రమరాంబ నృత్యాంశాలు ఆద్యంతం నయనానందకరంగా సాగాయి. అంతకుముందు నిర్వహించిన బతుకమ్మ ఆటపాటలో శిల్పారామం మహిళా సిబ్బంది, సందర్శకులు ఉత్సాహంగా పాలుపంచుకున్నారు.


శిల్పారామంలో ఆదివారం సాయంత్రం కళాకారులు ప్రదర్శించిన శాస్త్రీయ నృత్యం కనువిందుగా సాగింది. నాట్యగురువు చావలి బాలత్రిపుర సుందరి శిష్యబృందం చూడముచ్చటైన కూచిపూడి నృత్యాంశాలతో కళాప్రియులను ఆకట్టుకుంది. కీర్తనలకు అనుగుణంగా కళాకారులు లయబద్ధంగా విభిన్న నృత్యాంశాలను ప్రదర్శించి అలరించారు. నటేషకౌతం, కామాక్షిస్తుతి, అమ్మభ్రమరాంబ నృత్యాంశాలు ఆద్యంతం నయనానందకరంగా సాగాయి. అంతకుముందు నిర్వహించిన బతుకమ్మ ఆటపాటలో శిల్పారామం మహిళా సిబ్బంది, సందర్శకులు ఉత్సాహంగా పాలుపంచుకున్నారు.
34/35
35/35
 బతుకమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి. కూకట్‌పల్లిలో శనివారమే మొదలవ్వగా రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం నుంచి షురూ అయ్యాయి. రంగురంగుల పూలతో మహిళలు బతుకమ్మలను తయారు చేసి ఆటపాటలతో అలరించారు. బతుకమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి. కూకట్‌పల్లిలో శనివారమే మొదలవ్వగా రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం నుంచి షురూ అయ్యాయి. రంగురంగుల పూలతో మహిళలు బతుకమ్మలను తయారు చేసి ఆటపాటలతో అలరించారు.

మరిన్ని