News In Pics: చిత్రం చెప్పే సంగతులు - 1 (27-09-2022)

Updated : 27 Sep 2022 04:51 IST
1/9
 మహారాష్ట్ర రాజధాని ముంబయిలో రహదారిపై పడిన గుంతలకు  సోమవారం రంగులు వేస్తున్న ‘వాచ్‌డాగ్‌ ఫౌండేషన్‌’ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు. నగరంలోని వివిధ రహదారులపై ఏర్పడిన గుంతలపై స్థానిక అధికారులు స్పందించేలా చేసేందుకే తాము ఈ కార్యక్రమం చేపట్టామని ఆ సంస్థ వెల్లడించింది. మహారాష్ట్ర రాజధాని ముంబయిలో రహదారిపై పడిన గుంతలకు సోమవారం రంగులు వేస్తున్న ‘వాచ్‌డాగ్‌ ఫౌండేషన్‌’ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు. నగరంలోని వివిధ రహదారులపై ఏర్పడిన గుంతలపై స్థానిక అధికారులు స్పందించేలా చేసేందుకే తాము ఈ కార్యక్రమం చేపట్టామని ఆ సంస్థ వెల్లడించింది.
2/9
దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా రైలు ప్రయాణికులకు అందించేందుకు ఐఆర్‌సీటీసీ సిద్ధం చేసిన థాలీ 


దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా రైలు ప్రయాణికులకు అందించేందుకు ఐఆర్‌సీటీసీ సిద్ధం చేసిన థాలీ
3/9
అనకాపల్లి, రాజయ్యపేట తీరంలో సోమవారం సాయంత్రం భారీ సుడిగాలి కనిపించింది. వేటకు వెళ్లిన మత్స్యకారులు సెల్‌ఫోన్‌లో ఫొటోలు తీశారు. దూరంగా ఆకాశాన్ని తాకుతున్నట్లుగా కనిపించిన భారీ సుడిగాలిని చూసి  భయాందోళనకు గురయ్యామన్నారు. అనకాపల్లి, రాజయ్యపేట తీరంలో సోమవారం సాయంత్రం భారీ సుడిగాలి కనిపించింది. వేటకు వెళ్లిన మత్స్యకారులు సెల్‌ఫోన్‌లో ఫొటోలు తీశారు. దూరంగా ఆకాశాన్ని తాకుతున్నట్లుగా కనిపించిన భారీ సుడిగాలిని చూసి భయాందోళనకు గురయ్యామన్నారు.
4/9
రాజమహేంద్రవరంలోని దేవీచౌక్‌లో దసరా ఉత్సవాలు సోమవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు స్వర్ణకవచ కనకదుర్గగా అమ్మవారిని అలంకరించి హారతులిచ్చారు.  రాజమహేంద్రవరంలోని దేవీచౌక్‌లో దసరా ఉత్సవాలు సోమవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు స్వర్ణకవచ కనకదుర్గగా అమ్మవారిని అలంకరించి హారతులిచ్చారు.
5/9
6/9
నిలిపి ఉంచిన స్కూటర్లు కావివి. గోడకు అతికించినవి. సికింద్రాబాద్‌ కర్బల మైదానంలో ఉన్న ఓ హోటల్‌ ముందు కౌంటర్‌కి ఇలా స్కూటర్‌ విడిభాగాలను తెచ్చి అమర్చారు. నిలిపి ఉంచిన స్కూటర్లు కావివి. గోడకు అతికించినవి. సికింద్రాబాద్‌ కర్బల మైదానంలో ఉన్న ఓ హోటల్‌ ముందు కౌంటర్‌కి ఇలా స్కూటర్‌ విడిభాగాలను తెచ్చి అమర్చారు.
7/9
గ్రాసం కోసి గేదెకు పెడుతున్నట్లుంది కదూ చిత్రం చూస్తే.. గచ్చిబౌలి ఐఎస్‌బీ పరిపాలనా భవనం వద్ద అలంకరణ కోసం ఏర్పాటు చేసిన బొమ్మ వద్ద మహిళ గడ్డి కోస్తుండగా కనిపించిందిలా గ్రాసం కోసి గేదెకు పెడుతున్నట్లుంది కదూ చిత్రం చూస్తే.. గచ్చిబౌలి ఐఎస్‌బీ పరిపాలనా భవనం వద్ద అలంకరణ కోసం ఏర్పాటు చేసిన బొమ్మ వద్ద మహిళ గడ్డి కోస్తుండగా కనిపించిందిలా
8/9
సోమాజిగూడ విద్యుత్తు సౌధలోని వాటర్‌ ఫౌంటెయిన్‌ ఇది. పైపులైన్లపై మువ్వన్నెల రంగుల్లో ఉండే మూతలు ఏర్పాటు చేశారు. చూపరులను ఇవి ఆకట్టుకుంటున్నాయి. 


సోమాజిగూడ విద్యుత్తు సౌధలోని వాటర్‌ ఫౌంటెయిన్‌ ఇది. పైపులైన్లపై మువ్వన్నెల రంగుల్లో ఉండే మూతలు ఏర్పాటు చేశారు. చూపరులను ఇవి ఆకట్టుకుంటున్నాయి.
9/9
 నగరంలో దేవీశరన్నవరాత్రులు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయాల్లో తొలిరోజు అమ్మవార్లను బాలాత్రిపుర సుందరీదేవిగా అలంకరించగా భక్తులు పూజలు చేశారు.  మండపాల్లోనూ  దుర్గమ్మలను ప్రతిష్ఠించారు. బాలాత్రిపుర సుందరీదేవిగా బల్కంపేట ఎల్లమ్మ, జూబ్లీహిల్స్‌ పెద్దమ్మ, సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాకాళి, చార్మినార్‌ భాగ్యలక్ష్మి అమ్మవార్లు. ఉజ్జయిని మహాకాళిని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ దర్శించుకున్నారు.  నగరంలో దేవీశరన్నవరాత్రులు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయాల్లో తొలిరోజు అమ్మవార్లను బాలాత్రిపుర సుందరీదేవిగా అలంకరించగా భక్తులు పూజలు చేశారు. మండపాల్లోనూ దుర్గమ్మలను ప్రతిష్ఠించారు. బాలాత్రిపుర సుందరీదేవిగా బల్కంపేట ఎల్లమ్మ, జూబ్లీహిల్స్‌ పెద్దమ్మ, సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాకాళి, చార్మినార్‌ భాగ్యలక్ష్మి అమ్మవార్లు. ఉజ్జయిని మహాకాళిని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ దర్శించుకున్నారు.

మరిన్ని

ap-districts
ts-districts