News In Pics: చిత్రం చెప్పే సంగతులు - 1 (28-09-2022)

Updated : 28 Sep 2022 10:49 IST
1/22
విజయవాడ దుర్గమ్మవారి దర్శనానికి భక్తులను వినాయకుని గుడిదగ్గర నుంచి క్యూలైన్లో రమ్మంటున్నారు. దీనికోసం భక్తులు పాదరక్షలు అక్కడే క్యూలైన్‌ చుట్టుపక్కల వదిలేసి వస్తున్నారు. అమ్మవారి దర్శనం అనంతరం కనకదుర్గానగర్‌ వరకు మాత్రమే ఎండనుంచి భక్తుల కాళ్లకు రక్షణగా పరదాలు ఏర్పాటుచేశారు. అది దాటి బయటకు రాగానే భక్తుల కాళ్లు కాలిపోతుండడంతో పిల్లలు పెద్దలు అనే తేడాలేకుండా పరుగులు తీస్తున్నారు. కనీసం వినాయకుని గుడివరకూ ఏదోఒక పరదాలనైనా భక్తుల కాళ్లు కాలకుండా ఏర్పాటుచేయాలని భక్తులు కోరుతున్నారు. విజయవాడ దుర్గమ్మవారి దర్శనానికి భక్తులను వినాయకుని గుడిదగ్గర నుంచి క్యూలైన్లో రమ్మంటున్నారు. దీనికోసం భక్తులు పాదరక్షలు అక్కడే క్యూలైన్‌ చుట్టుపక్కల వదిలేసి వస్తున్నారు. అమ్మవారి దర్శనం అనంతరం కనకదుర్గానగర్‌ వరకు మాత్రమే ఎండనుంచి భక్తుల కాళ్లకు రక్షణగా పరదాలు ఏర్పాటుచేశారు. అది దాటి బయటకు రాగానే భక్తుల కాళ్లు కాలిపోతుండడంతో పిల్లలు పెద్దలు అనే తేడాలేకుండా పరుగులు తీస్తున్నారు. కనీసం వినాయకుని గుడివరకూ ఏదోఒక పరదాలనైనా భక్తుల కాళ్లు కాలకుండా ఏర్పాటుచేయాలని భక్తులు కోరుతున్నారు.
2/22
3/22
4/22
మన్యం అందాలు ప్రకృతి ప్రేమికులను మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు సమీపంలోని వంజంగి మేఘాల కొండపై మంగళవారం మంచు సోయగాలు ఆకట్టుకుంటున్నాయి. మంచు తెరలు చీల్చుకుంటూ సూరోదయ సన్నివేశం సందర్శకులను కట్టిపడేసింది.                 


మన్యం అందాలు ప్రకృతి ప్రేమికులను మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు సమీపంలోని వంజంగి మేఘాల కొండపై మంగళవారం మంచు సోయగాలు ఆకట్టుకుంటున్నాయి. మంచు తెరలు చీల్చుకుంటూ సూరోదయ సన్నివేశం సందర్శకులను కట్టిపడేసింది.
5/22
దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జహీరాబాద్‌లోని ఎస్‌బీహెచ్‌ కాలనీలో ప్రతిష్ఠించిన అమ్మవారి మండపాన్ని మంగళవారం 108 పోలెలు(భక్షాల)లతో అలంకరించారు. మంగళవారం అత్యధికులు అమ్మవారికి నైవేద్యంగా భక్షాలు సమర్పించడంతోపాటు ప్రత్యేకంగా అలంకరించి మొక్కులు చెల్లించుకున్నారు. దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జహీరాబాద్‌లోని ఎస్‌బీహెచ్‌ కాలనీలో ప్రతిష్ఠించిన అమ్మవారి మండపాన్ని మంగళవారం 108 పోలెలు(భక్షాల)లతో అలంకరించారు. మంగళవారం అత్యధికులు అమ్మవారికి నైవేద్యంగా భక్షాలు సమర్పించడంతోపాటు ప్రత్యేకంగా అలంకరించి మొక్కులు చెల్లించుకున్నారు.
6/22
తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరు అంటుంటారు.. కానీ ఇక్కడ ఎలుకలు భయపడుతున్నాయి. వరిపంట సాగు చేసిన రైతులను ఎలుకలు తీవ్రంగా నష్టం చేస్తున్నాయి. జగిత్యాల జిల్లా సారంగాపూర్‌కు చెందిన  రైతు పిట్టల రాజు తన వరిపంటను ఎలుకల నుంచి కాపాడుకునేందుకు పొలం మధ్యలో తాటి ఆకులను అక్కడక్కడ నాటాడు. దీంతో ఆకులు గాలికి ఊగడంతో వాటి చప్పుళ్లతో ఎలుకలు పరారవుతున్నాయి. ఖర్చు లేకుండా ఎలుకల భారీ నుంచి కాపాడుకోవడంతో ఇతర రైతులు అదే పద్ధతిని అనుకరిస్తున్నారు.    

తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరు అంటుంటారు.. కానీ ఇక్కడ ఎలుకలు భయపడుతున్నాయి. వరిపంట సాగు చేసిన రైతులను ఎలుకలు తీవ్రంగా నష్టం చేస్తున్నాయి. జగిత్యాల జిల్లా సారంగాపూర్‌కు చెందిన రైతు పిట్టల రాజు తన వరిపంటను ఎలుకల నుంచి కాపాడుకునేందుకు పొలం మధ్యలో తాటి ఆకులను అక్కడక్కడ నాటాడు. దీంతో ఆకులు గాలికి ఊగడంతో వాటి చప్పుళ్లతో ఎలుకలు పరారవుతున్నాయి. ఖర్చు లేకుండా ఎలుకల భారీ నుంచి కాపాడుకోవడంతో ఇతర రైతులు అదే పద్ధతిని అనుకరిస్తున్నారు.
7/22
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు హైదరాబాద్‌ నగరంలో వైభవంగా కొనసాగుతున్నాయి. మంగళవారం ఆలయాల్లో అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. జూబ్లీహిల్స్‌ పెద్దమ్మతల్లి  గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. 


దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు హైదరాబాద్‌ నగరంలో వైభవంగా కొనసాగుతున్నాయి. మంగళవారం ఆలయాల్లో అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. జూబ్లీహిల్స్‌ పెద్దమ్మతల్లి గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
8/22
దిల్లీలో మంగళవారం కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి క్యూఆర్‌ కోడ్‌తో కూడిన కార్డును అందిస్తున్న కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ ఛైర్మన్‌ మధుసూదన్‌ మిస్త్రీ దిల్లీలో మంగళవారం కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి క్యూఆర్‌ కోడ్‌తో కూడిన కార్డును అందిస్తున్న కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ ఛైర్మన్‌ మధుసూదన్‌ మిస్త్రీ
9/22
మూడు గ్రామాలకు తాగునీరు.. దాదాపు 250 ఎకరాలకు సాగునీరందించే చెరువు గ్రానైట్‌ వ్యర్థాలతో కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. బాపట్ల జిల్లా బల్లికురవ మండల కేంద్రంలోని చెన్నుపల్లి చెరువులో యథేచ్ఛగా గ్రానైట్‌ వ్యర్థాలను పోసి ఆక్రమిస్తున్నా అధికారులకు పట్టడం లేదు. ఈ విషయమై చీరాల ఆర్డీవో సరోజిని వివరణ కోరగా.. వెంటనే విచారించి ఆక్రమణలు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. మూడు గ్రామాలకు తాగునీరు.. దాదాపు 250 ఎకరాలకు సాగునీరందించే చెరువు గ్రానైట్‌ వ్యర్థాలతో కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. బాపట్ల జిల్లా బల్లికురవ మండల కేంద్రంలోని చెన్నుపల్లి చెరువులో యథేచ్ఛగా గ్రానైట్‌ వ్యర్థాలను పోసి ఆక్రమిస్తున్నా అధికారులకు పట్టడం లేదు. ఈ విషయమై చీరాల ఆర్డీవో సరోజిని వివరణ కోరగా.. వెంటనే విచారించి ఆక్రమణలు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
10/22
ఈ చిత్రంలోని బాలిక పేరు షేక్‌ ఫరీదాబాను. పుట్టుకతోనే రెండు చేతులు లేవు. కాళ్లతో కూడా అందరిలా నడవలేని పరిస్థితి. అయినా మనోవేదనకు గురికాకుండా ముందుకు సాగుతోంది. కాలి వేళ్లు తోడుగా అక్షరాలు దిద్దుతోంది. చేతితో రాసినంత అందంగానే ముత్యాల్లా అక్షరాలు రాస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. ఈ బాలిక స్వస్థలం కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని శివశంకర్‌నగర్‌. తల్లిదండ్రులు షేక్‌ మహమ్మద్‌ జాఫర్‌, షేక్‌ నసీంబాను. ‘తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు అండగా నిలుస్తూ నన్ను ప్రోత్సహించడం వల్ల కాలివేళ్లతో రాయడం నేర్చుకున్నా. ఉన్నత చదువులు చదివి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకుంటున్నా’ అని ఫరీదాబాను ఆత్మవిశ్వాసంతో చెబుతోంది. ఈ చిత్రంలోని బాలిక పేరు షేక్‌ ఫరీదాబాను. పుట్టుకతోనే రెండు చేతులు లేవు. కాళ్లతో కూడా అందరిలా నడవలేని పరిస్థితి. అయినా మనోవేదనకు గురికాకుండా ముందుకు సాగుతోంది. కాలి వేళ్లు తోడుగా అక్షరాలు దిద్దుతోంది. చేతితో రాసినంత అందంగానే ముత్యాల్లా అక్షరాలు రాస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. ఈ బాలిక స్వస్థలం కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని శివశంకర్‌నగర్‌. తల్లిదండ్రులు షేక్‌ మహమ్మద్‌ జాఫర్‌, షేక్‌ నసీంబాను. ‘తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు అండగా నిలుస్తూ నన్ను ప్రోత్సహించడం వల్ల కాలివేళ్లతో రాయడం నేర్చుకున్నా. ఉన్నత చదువులు చదివి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకుంటున్నా’ అని ఫరీదాబాను ఆత్మవిశ్వాసంతో చెబుతోంది.
11/22
12/22
వంగ తోటలో కాయలు తెంపాలంటే ఎవరైనా ఒళ్లు వంచాల్సిందే... అవే కాయలు అందనంత ఎత్తులో ఉంటే ఆశ్చర్యమే. అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం అంగళ్లుకు చెందిన ఆకుల లీలావతి పెరట్లోని వంగ మొక్క ఏకంగా ఏడడుగులు పెరిగింది. ఇదేదో హైబ్రీడ్‌ మొక్క అనుకుంటే పొరపాటే. యాదృచ్ఛికంగా వేసిన విత్తనాల్లో ఒకటి ఇలా ఏపుగా ఎదిగింది. ప్రతినెలా అయిదు కిలోల కాయలు కూడా ఇస్తోంది. చెట్టుకు సరైన పోషకాలు అందితే ఇలా ఎదగడంతో పాటు దిగుబడులు కూడా ఇస్తాయని ఉద్యాన అధికారులు చెబుతున్నారు. వంగ తోటలో కాయలు తెంపాలంటే ఎవరైనా ఒళ్లు వంచాల్సిందే... అవే కాయలు అందనంత ఎత్తులో ఉంటే ఆశ్చర్యమే. అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం అంగళ్లుకు చెందిన ఆకుల లీలావతి పెరట్లోని వంగ మొక్క ఏకంగా ఏడడుగులు పెరిగింది. ఇదేదో హైబ్రీడ్‌ మొక్క అనుకుంటే పొరపాటే. యాదృచ్ఛికంగా వేసిన విత్తనాల్లో ఒకటి ఇలా ఏపుగా ఎదిగింది. ప్రతినెలా అయిదు కిలోల కాయలు కూడా ఇస్తోంది. చెట్టుకు సరైన పోషకాలు అందితే ఇలా ఎదగడంతో పాటు దిగుబడులు కూడా ఇస్తాయని ఉద్యాన అధికారులు చెబుతున్నారు.
13/22
తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాల్లో భాగంగా రవీంద్రభారతి ప్రధాన మందిరంలో నిర్వహిస్తున్న ‘దేవి వైభవ నృత్యోత్సవం’ ప్రేక్షకులకు కనువిందు చేస్తోంది. మంగళవారం నాట్య గురువులు మంజుల రామస్వామి, పసుమర్తి రామలింగశాస్త్రి తమ శిష్యబృందంతో కూచిపూడి, భరతనాట్యం, పేరిణి ప్రకాష్‌ పేరిణి ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాల్లో భాగంగా రవీంద్రభారతి ప్రధాన మందిరంలో నిర్వహిస్తున్న ‘దేవి వైభవ నృత్యోత్సవం’ ప్రేక్షకులకు కనువిందు చేస్తోంది. మంగళవారం నాట్య గురువులు మంజుల రామస్వామి, పసుమర్తి రామలింగశాస్త్రి తమ శిష్యబృందంతో కూచిపూడి, భరతనాట్యం, పేరిణి ప్రకాష్‌ పేరిణి ప్రదర్శనతో ఆకట్టుకున్నారు.
14/22
మంగళవారం సాయంత్రం భారీవర్షం ధాటికి హైదరాబాద్‌ సచివాలయం తెలుగుతల్లి పైవంతెన వద్ద వాగును తలపిస్తున్న రహదారి మంగళవారం సాయంత్రం భారీవర్షం ధాటికి హైదరాబాద్‌ సచివాలయం తెలుగుతల్లి పైవంతెన వద్ద వాగును తలపిస్తున్న రహదారి
15/22
 దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తెలంగాణలోని నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ మండలం సాలూరలో కొలువుదీరిన 25 తలలున్న దుర్గాదేవి ప్రతిమ భక్తులను ఆకట్టుకుంటోంది. అమ్మవారి విగ్రహం విభిన్నంగా ఉండాలని గ్రామస్థులు భావించారు. మహారాష్ట్రలోని యావత్మాల్‌ జిల్లా ఉమర్‌ఖేడ్‌ నుంచి దాన్ని తెప్పించి ప్రతిష్ఠించారు. దేవీమాతను వీక్షించేందుకు భక్తులు అధికసంఖ్యలో తరలివస్తున్నారు. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తెలంగాణలోని నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ మండలం సాలూరలో కొలువుదీరిన 25 తలలున్న దుర్గాదేవి ప్రతిమ భక్తులను ఆకట్టుకుంటోంది. అమ్మవారి విగ్రహం విభిన్నంగా ఉండాలని గ్రామస్థులు భావించారు. మహారాష్ట్రలోని యావత్మాల్‌ జిల్లా ఉమర్‌ఖేడ్‌ నుంచి దాన్ని తెప్పించి ప్రతిష్ఠించారు. దేవీమాతను వీక్షించేందుకు భక్తులు అధికసంఖ్యలో తరలివస్తున్నారు.
16/22
తమిళనాడులోని హోసూరులో టాటా ఎలక్ట్రానిక్స్‌లో చేరేందుకు ఝార్ఖండ్‌ రాజధాని రాంచీ నుంచి మంగళవారం ప్రత్యేక రైలులో బయలుదేరిన గిరిజన బాలికలతో మాట్లాడుతున్న కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి అర్జున్‌ ముండా తమిళనాడులోని హోసూరులో టాటా ఎలక్ట్రానిక్స్‌లో చేరేందుకు ఝార్ఖండ్‌ రాజధాని రాంచీ నుంచి మంగళవారం ప్రత్యేక రైలులో బయలుదేరిన గిరిజన బాలికలతో మాట్లాడుతున్న కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి అర్జున్‌ ముండా
17/22
పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దుర్గా పూజ మండపంలో తీర్చిదిద్దిన ‘ధునాచీ’ ఆకృతి. పూజల సందర్భంగా ధూపం వేసేందుకు ఉపయోగించే ధునాచీలను భారీ సంఖ్యలో ఉపయోగించి ఈ ఆకారాన్ని తీర్చిదిద్దడం విశేషం. పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దుర్గా పూజ మండపంలో తీర్చిదిద్దిన ‘ధునాచీ’ ఆకృతి. పూజల సందర్భంగా ధూపం వేసేందుకు ఉపయోగించే ధునాచీలను భారీ సంఖ్యలో ఉపయోగించి ఈ ఆకారాన్ని తీర్చిదిద్దడం విశేషం.
18/22
 ఇది ఒడిశాలోని చాందీపుర్‌లో ఐటీఆర్‌ నుంచి  మంగళవారం విజయవంతంగా ప్రయోగించిన అత్యంత స్వల్పశ్రేణి గగనతల రక్షణ వ్యవస్థ క్షిపణి.  హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేసే డీఆర్‌డీవో పరిశోధన కేంద్రం దీన్ని రూపొందించింది. ఇది ఒడిశాలోని చాందీపుర్‌లో ఐటీఆర్‌ నుంచి మంగళవారం విజయవంతంగా ప్రయోగించిన అత్యంత స్వల్పశ్రేణి గగనతల రక్షణ వ్యవస్థ క్షిపణి. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేసే డీఆర్‌డీవో పరిశోధన కేంద్రం దీన్ని రూపొందించింది.
19/22
 ఉపాధ్యాయ దంపతుల బదిలీలు వెంటనే చేపట్టాలని రాష్ట్ర స్పౌజ్‌ ఫోరం బాధ్యులు ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం హనుమకొండలోని ఆర్ట్స్, సైన్స్‌ కళాశాల ఆడిటోరియం ఎదుట వారు ఆవేదన సభ నిర్వహించారు. ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, ఖమ్మం, సూర్యాపేట, రంగారెడ్డి, సిద్దిపేట తదితర జిల్లాల నుంచి పిల్లలతోపాటు ఉపాధ్యాయ దంపతులు కార్యక్రమానికి తరలివచ్చారు. బతుకమ్మ ఆడుతూ వినూత్నంగా నిరసన తెలిపారు. ఉపాధ్యాయ దంపతుల బదిలీలు వెంటనే చేపట్టాలని రాష్ట్ర స్పౌజ్‌ ఫోరం బాధ్యులు ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం హనుమకొండలోని ఆర్ట్స్, సైన్స్‌ కళాశాల ఆడిటోరియం ఎదుట వారు ఆవేదన సభ నిర్వహించారు. ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, ఖమ్మం, సూర్యాపేట, రంగారెడ్డి, సిద్దిపేట తదితర జిల్లాల నుంచి పిల్లలతోపాటు ఉపాధ్యాయ దంపతులు కార్యక్రమానికి తరలివచ్చారు. బతుకమ్మ ఆడుతూ వినూత్నంగా నిరసన తెలిపారు.
20/22
ఇదేదో కార్పొరేట్‌ కంపెనీకి చెందిన కార్యాలయం అనుకుంటున్నారా.. అలా అనుకుంటే పొరబడినట్లే..  రణస్థలం మండలం పాతర్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. డాక్టర్‌ రెడ్డీస్‌ ఫౌండేషన్‌ రూ.36 లక్షలతో పీహెచ్‌సీని ఆధునికీకరించారు. అన్ని హంగులు కల్పించి కార్పొరేట్‌ స్థాయిలో తీర్చిదిద్దారు. కాన్పుల గది, రోగులు వేచి ఉండేందుకు సౌకర్యాలు, టోకెన్‌ సిస్టమ్, ఇతర వసతులు కల్పించారు. కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ మంగళవారం ప్రారంభించారు. ఫౌండేషన్‌ ప్రతినిధులను అభినందించారు. నిర్వహణ కూడా అంతే అందంగా ఉండాలని ఆకాంక్షించారు. ఇదేదో కార్పొరేట్‌ కంపెనీకి చెందిన కార్యాలయం అనుకుంటున్నారా.. అలా అనుకుంటే పొరబడినట్లే.. రణస్థలం మండలం పాతర్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. డాక్టర్‌ రెడ్డీస్‌ ఫౌండేషన్‌ రూ.36 లక్షలతో పీహెచ్‌సీని ఆధునికీకరించారు. అన్ని హంగులు కల్పించి కార్పొరేట్‌ స్థాయిలో తీర్చిదిద్దారు. కాన్పుల గది, రోగులు వేచి ఉండేందుకు సౌకర్యాలు, టోకెన్‌ సిస్టమ్, ఇతర వసతులు కల్పించారు. కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ మంగళవారం ప్రారంభించారు. ఫౌండేషన్‌ ప్రతినిధులను అభినందించారు. నిర్వహణ కూడా అంతే అందంగా ఉండాలని ఆకాంక్షించారు.
21/22
22/22
 పాతబస్తీ గౌలిగూడ చమన్‌ వద్ద ఉన్న పురాతన ఇళ్లు ఇవి. నగరంలో  పలు చోట్ల పురాతన భవనాలు భారీ వర్షాలకు తడిసి ప్రమాదకరంగా మారుతున్నాయి. పాతబస్తీ గౌలిగూడ చమన్‌ వద్ద ఉన్న పురాతన ఇళ్లు ఇవి. నగరంలో పలు చోట్ల పురాతన భవనాలు భారీ వర్షాలకు తడిసి ప్రమాదకరంగా మారుతున్నాయి.

మరిన్ని