News In Pics: చిత్రం చెప్పే సంగతులు - 1 (29-09-2022)

Updated : 29 Sep 2022 12:51 IST
1/21
అనంతపురంలోని ఆజాద్‌ నగర్‌లో దసరా శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా మూడో రోజు అమ్మవారు మహాలక్ష్మి అలంకరణలో దర్శనమిచ్చారు. నగరంలోని ఐదో రోడ్డు పెద్దమ్మ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన అమ్మవారి ప్రతిమను భక్తులు కరెన్సీ నోట్లతో అలంకరించారు.  అనంతపురంలోని ఆజాద్‌ నగర్‌లో దసరా శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా మూడో రోజు అమ్మవారు మహాలక్ష్మి అలంకరణలో దర్శనమిచ్చారు. నగరంలోని ఐదో రోడ్డు పెద్దమ్మ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన అమ్మవారి ప్రతిమను భక్తులు కరెన్సీ నోట్లతో అలంకరించారు.
2/21
గాజువాక వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారిని బుధవారం ప్రత్యేకంగా అలంకరించారు. 11 కిలోల పత్తిని ఉపయోగించి అయిదుగురు అర్చకులు, 16 మంది మహిళలు సుమారు 7 గంటల పాటు శ్రమించి కలువ పువ్వుల మాదిరిగా దండలు సిద్ధం చేసి.. దసరా ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి అలంకరణ చేశారు. గాజువాక వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారిని బుధవారం ప్రత్యేకంగా అలంకరించారు. 11 కిలోల పత్తిని ఉపయోగించి అయిదుగురు అర్చకులు, 16 మంది మహిళలు సుమారు 7 గంటల పాటు శ్రమించి కలువ పువ్వుల మాదిరిగా దండలు సిద్ధం చేసి.. దసరా ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి అలంకరణ చేశారు.
3/21
పెద్దేముల్‌ మండలంలోని ఆత్కూరు గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ విగ్రహం చెట్ల పొదల మధ్యన దర్శనమిస్తోంది. విగ్రహ ఏర్పాటు కోసం స్థలం కేటాయించక పోవడంతో తెచ్చి ఇలా వదిలేశారు. ఎవరూ పట్టించుకోక పోవడంతో విగ్రహం చుట్టూ పిచ్చి మొక్కలు చుట్టూ పెరిగాయి.  
పెద్దేముల్‌ మండలంలోని ఆత్కూరు గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ విగ్రహం చెట్ల పొదల మధ్యన దర్శనమిస్తోంది. విగ్రహ ఏర్పాటు కోసం స్థలం కేటాయించక పోవడంతో తెచ్చి ఇలా వదిలేశారు. ఎవరూ పట్టించుకోక పోవడంతో విగ్రహం చుట్టూ పిచ్చి మొక్కలు చుట్టూ పెరిగాయి.
4/21
పుట్టగొడుగులు సాధారణంగా పైన గొడుగులా ఉండి కింద కాండం ఉంటుంది. పెదగొల్లలపాలెంలో ఓ పుట్టగొడుగు వలయాకారంలో అందంగా ఉంటూ కనువిందు చేస్తోంది. బుడగ మాదిరిగా ఉంటూ పైనున్న గొడుగు నుంచి కింది కాండం వరకు వల వేసినట్లు కనిపిస్తోంది. దీనికి గల కారణం గురించి స్థానిక మండల వ్యవసాయాధికారి పి.సత్యనారాయణను ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా జన్యు ఉత్పరివర్తనం (మ్యుటేషన్‌) కారణంగా ఈ విధమైన ఆకారాలు వచ్చే అవకాశం ఉందన్నారు. దీని శాస్త్రీయనామం ఫల్లూస్‌ ఇంపుడికస్‌. దీనిని సాధారణ భాషలో బ్రైడల్‌వేవ్‌ మష్రూమ్‌ (ముస్తాబైన పెళ్లికూతురు పుట్టగొడుగు) అని కూడా అంటారన్నారు. తినేటప్పుడు కొంచెం చెడు వాసన వస్తుందన్నారు. పుట్టగొడుగులు సాధారణంగా పైన గొడుగులా ఉండి కింద కాండం ఉంటుంది. పెదగొల్లలపాలెంలో ఓ పుట్టగొడుగు వలయాకారంలో అందంగా ఉంటూ కనువిందు చేస్తోంది. బుడగ మాదిరిగా ఉంటూ పైనున్న గొడుగు నుంచి కింది కాండం వరకు వల వేసినట్లు కనిపిస్తోంది. దీనికి గల కారణం గురించి స్థానిక మండల వ్యవసాయాధికారి పి.సత్యనారాయణను ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా జన్యు ఉత్పరివర్తనం (మ్యుటేషన్‌) కారణంగా ఈ విధమైన ఆకారాలు వచ్చే అవకాశం ఉందన్నారు. దీని శాస్త్రీయనామం ఫల్లూస్‌ ఇంపుడికస్‌. దీనిని సాధారణ భాషలో బ్రైడల్‌వేవ్‌ మష్రూమ్‌ (ముస్తాబైన పెళ్లికూతురు పుట్టగొడుగు) అని కూడా అంటారన్నారు. తినేటప్పుడు కొంచెం చెడు వాసన వస్తుందన్నారు.
5/21
 గుంటూరు  జిల్లా వ్యాప్తంగా బుధవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. గుంటూరు నగరంలోని పలు రహదారులు జలమయమయ్యాయి. ఎటుచూసినా రహదారులు చెరువులను తలపించాయి. పెదకాకాని, పొన్నూరు, తాడికొండ, మేడికొండూరు, ఫిరంగిపురం, కొల్లిపర తదితర మండలాల్లో వర్షం కురిసింది. గుంటూరు జిల్లా వ్యాప్తంగా బుధవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. గుంటూరు నగరంలోని పలు రహదారులు జలమయమయ్యాయి. ఎటుచూసినా రహదారులు చెరువులను తలపించాయి. పెదకాకాని, పొన్నూరు, తాడికొండ, మేడికొండూరు, ఫిరంగిపురం, కొల్లిపర తదితర మండలాల్లో వర్షం కురిసింది.
6/21
7/21
8/21
నిజామాబాద్‌ నుంచి బాన్సువాడ వెళ్లే ప్రధాన రహదారి గుంతలమయంగా మారింది. ఇటీవల కురిసిన వర్షాలకు నిజామాబాద్‌ నుంచి చందూరు శివారు వరకు సుమారుగా 20 కి.మీ. పరిధిలో 200 వరకు గుంతలు ఏర్పడ్డాయి. పలుచోట్ల రహదారి కోతకు గురైంది. ఈ మార్గంలో రోజూ వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. రాత్రి సమయంలో గుంతలు కనిపించక ద్విచక్రవాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. వర్ని నుంచి చందూరు వరకు ఉన్నట్లు రెండు వరుసల రహదారిగా మార్చేలా ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని వారు కోరుతున్నారు. నిజామాబాద్‌ నుంచి బాన్సువాడ వెళ్లే ప్రధాన రహదారి గుంతలమయంగా మారింది. ఇటీవల కురిసిన వర్షాలకు నిజామాబాద్‌ నుంచి చందూరు శివారు వరకు సుమారుగా 20 కి.మీ. పరిధిలో 200 వరకు గుంతలు ఏర్పడ్డాయి. పలుచోట్ల రహదారి కోతకు గురైంది. ఈ మార్గంలో రోజూ వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. రాత్రి సమయంలో గుంతలు కనిపించక ద్విచక్రవాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. వర్ని నుంచి చందూరు వరకు ఉన్నట్లు రెండు వరుసల రహదారిగా మార్చేలా ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని వారు కోరుతున్నారు.
9/21
10/21
11/21
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో కోతుల గుంపులను చూస్తే ప్రజలు వణికిపోతున్నారు. పొలాల్లో విచ్చలవిడిగా తిరిగి పంటలను నాశనం చేస్తున్నాయి. ఇళ్లపై తిరుగుతూ చేతికి అందినవి పట్టుకొని వెళ్లిపోతున్నాయి. అలాంటి ఈ కోతుల గుంపు బుధవారం ఉదయం గుడిహత్నూర్‌ వెళ్లే జాతీయ రహదారిపై వరుసగా కూర్చొని ఉంది. వచ్చి పోయే వాహనాలవైపు చూస్తూ.. అక్కడే కూర్చున్నాయి. అటుగా వెళ్లే వారు కొందరు వేసే పండ్లు, ఇతర తినుబండారాలు తింటూ అక్కడే అటు ఇటూ తిరుగుతున్నాయి. అటుగా వెళ్లే ద్విచక్ర వాహనదారులు మాత్రం ఈ కోతుల గుంపులను చూసి బెదిరిపోయారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో కోతుల గుంపులను చూస్తే ప్రజలు వణికిపోతున్నారు. పొలాల్లో విచ్చలవిడిగా తిరిగి పంటలను నాశనం చేస్తున్నాయి. ఇళ్లపై తిరుగుతూ చేతికి అందినవి పట్టుకొని వెళ్లిపోతున్నాయి. అలాంటి ఈ కోతుల గుంపు బుధవారం ఉదయం గుడిహత్నూర్‌ వెళ్లే జాతీయ రహదారిపై వరుసగా కూర్చొని ఉంది. వచ్చి పోయే వాహనాలవైపు చూస్తూ.. అక్కడే కూర్చున్నాయి. అటుగా వెళ్లే వారు కొందరు వేసే పండ్లు, ఇతర తినుబండారాలు తింటూ అక్కడే అటు ఇటూ తిరుగుతున్నాయి. అటుగా వెళ్లే ద్విచక్ర వాహనదారులు మాత్రం ఈ కోతుల గుంపులను చూసి బెదిరిపోయారు.
12/21
తమ పొలాల వరకు కాలువ, రోడ్డు సౌకర్యం కల్పించాలని దశాబ్దాలుగా ఆ రైతులు చేసిన విన్నపాలను ఏ పాలకుడూ పట్టించుకోలేదు. దీంతో విసిగిపోయిన అన్నదాతలు తమ శ్రమను నమ్ముకొని కార్యక్షేత్రంలోకి దిగారు. సొంతంగా తామే కాలువను తవ్వుకున్నారు. రహదారి పనులు సైతం మొదలుపెట్టారు. ఇదీ శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బోగోలు మండలంలోని తాళ్లూరు రైతుల ఐక్యతకు దర్పణం. సొంతంగా చందాలు వేసుకొని ర.భ రోడ్డు దగ్గర నుంచి 650 మీటర్ల పొడవు, 6 మీటర్ల వెడల్పు రోడ్డు ఏర్పాటు పనులు ప్రారంభించారు. పొక్లెయినరుతో పంట కాలువ తీశారు.  తమ పొలాల వరకు కాలువ, రోడ్డు సౌకర్యం కల్పించాలని దశాబ్దాలుగా ఆ రైతులు చేసిన విన్నపాలను ఏ పాలకుడూ పట్టించుకోలేదు. దీంతో విసిగిపోయిన అన్నదాతలు తమ శ్రమను నమ్ముకొని కార్యక్షేత్రంలోకి దిగారు. సొంతంగా తామే కాలువను తవ్వుకున్నారు. రహదారి పనులు సైతం మొదలుపెట్టారు. ఇదీ శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బోగోలు మండలంలోని తాళ్లూరు రైతుల ఐక్యతకు దర్పణం. సొంతంగా చందాలు వేసుకొని ర.భ రోడ్డు దగ్గర నుంచి 650 మీటర్ల పొడవు, 6 మీటర్ల వెడల్పు రోడ్డు ఏర్పాటు పనులు ప్రారంభించారు. పొక్లెయినరుతో పంట కాలువ తీశారు.
13/21
నంద్యాల జిల్లా బనగానపల్లి పట్టణంలోని బనగానపల్లి-నంద్యాల ప్రధాన రహదారిలోని ఎంపీడీవో కార్యాలయ సమీపంలో రహదారి గుంతలు పడి అధ్వానంగా మారింది. సుమారు 100 మీటర్ల దారిలో 100కు పైగా గుంతలు ఉండటం గమనార్హం. అధికారులు నామమాత్రంగా మరమ్మతులు చేస్తుండటంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. సమీపంలోనే వివిధ ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నా పట్టించుకున్న నాథుడే లేరని పట్టణ ప్రజలు వాపోతున్నారు. వర్షం పడిందంటే మరీ దారుణంగా ఉంటుంది. నంద్యాల జిల్లా బనగానపల్లి పట్టణంలోని బనగానపల్లి-నంద్యాల ప్రధాన రహదారిలోని ఎంపీడీవో కార్యాలయ సమీపంలో రహదారి గుంతలు పడి అధ్వానంగా మారింది. సుమారు 100 మీటర్ల దారిలో 100కు పైగా గుంతలు ఉండటం గమనార్హం. అధికారులు నామమాత్రంగా మరమ్మతులు చేస్తుండటంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. సమీపంలోనే వివిధ ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నా పట్టించుకున్న నాథుడే లేరని పట్టణ ప్రజలు వాపోతున్నారు. వర్షం పడిందంటే మరీ దారుణంగా ఉంటుంది.
14/21
కృష్ణాజిల్లా కేంద్రం మచిలీపట్నాన్ని వర్షం ముంచెత్తింది. నగరంలోని ప్రధాన రహదారులన్నీ కాలువల్లా తయారయ్యాయి.  బస్టాండ్‌లో నీరు చేరి చెరువును తలపించింది. జిల్లా వ్యాప్తంగా సగటు వర్షపాతం 2.06 సెంటీమీటర్లు నమోదు కాగా ఒక్క మచిలీపట్నంలోనే 14.08 సెంటీమీటర్ల వర్షం కురవడం గమనార్హం. కృష్ణాజిల్లా కేంద్రం మచిలీపట్నాన్ని వర్షం ముంచెత్తింది. నగరంలోని ప్రధాన రహదారులన్నీ కాలువల్లా తయారయ్యాయి. బస్టాండ్‌లో నీరు చేరి చెరువును తలపించింది. జిల్లా వ్యాప్తంగా సగటు వర్షపాతం 2.06 సెంటీమీటర్లు నమోదు కాగా ఒక్క మచిలీపట్నంలోనే 14.08 సెంటీమీటర్ల వర్షం కురవడం గమనార్హం.
15/21
16/21
హైదరాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో వీల్‌ఛైర్లు ఉన్నా సమయానికి అందజేసే సిబ్బంది కరవయ్యారు. నడవలేని రోగులు ఇబ్బందులు పడుతూనే సహాయకులతో కలిసి వెళుతున్నారు. కొందరు తామే ఉపకరణాలు తీసుకొని రోగులను తీసుకెళుతున్నారు.  హైదరాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో వీల్‌ఛైర్లు ఉన్నా సమయానికి అందజేసే సిబ్బంది కరవయ్యారు. నడవలేని రోగులు ఇబ్బందులు పడుతూనే సహాయకులతో కలిసి వెళుతున్నారు. కొందరు తామే ఉపకరణాలు తీసుకొని రోగులను తీసుకెళుతున్నారు.
17/21
తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో బతుకమ్మ సంబరాల్లో భాగంగా రవీంద్రభారతిలో నిర్వహించిన ‘దేవీ వైభవ నృత్యోత్సవం’ బుధవారం ముగిసింది. ఈ సందర్భంగా నాట్యగురువులు ప్రదర్శించిన నృత్యాంశాలు ప్రేక్షకులను సమ్మోహితుల్ని చేశాయి. తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో బతుకమ్మ సంబరాల్లో భాగంగా రవీంద్రభారతిలో నిర్వహించిన ‘దేవీ వైభవ నృత్యోత్సవం’ బుధవారం ముగిసింది. ఈ సందర్భంగా నాట్యగురువులు ప్రదర్శించిన నృత్యాంశాలు ప్రేక్షకులను సమ్మోహితుల్ని చేశాయి.
18/21
మాదాపూర్‌ తెలంగాణ సాంస్కృతిక సారథి కార్యాలయ ప్రాంగణంలో బతుకమ్మ సంబరాలు మాదాపూర్‌ తెలంగాణ సాంస్కృతిక సారథి కార్యాలయ ప్రాంగణంలో బతుకమ్మ సంబరాలు
19/21
బతుకమ్మ సంబరాలు హైదరాబాద్‌ నగరంలో ఘనంగా జరుగుతున్నాయి. బుధవారం కాలనీలతోపాటు కార్యాలయాల్లో వేడుకలు జరిగాయి. ఆడపడుచులు పూలతో చక్కగా పేర్చిన బతుకమ్మల చుట్టూ చేరి ఆడి పాడి సందడి చేశారు. ఖైరతాబాద్‌ మింట్‌ కాంపౌండ్‌లో బతుకమ్మ ఆడుతున్న ఉద్యోగినులు. బతుకమ్మ సంబరాలు హైదరాబాద్‌ నగరంలో ఘనంగా జరుగుతున్నాయి. బుధవారం కాలనీలతోపాటు కార్యాలయాల్లో వేడుకలు జరిగాయి. ఆడపడుచులు పూలతో చక్కగా పేర్చిన బతుకమ్మల చుట్టూ చేరి ఆడి పాడి సందడి చేశారు. ఖైరతాబాద్‌ మింట్‌ కాంపౌండ్‌లో బతుకమ్మ ఆడుతున్న ఉద్యోగినులు.
20/21
తెలంగాణ శాసనసభ, మండలి కార్యాలయాల వద్ద బుధవారం బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, సురభి వాణీదేవి, ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డితో పాటు అధికారిణులు, ఉద్యోగినులు, పలువురు కార్పొరేటర్లు, మహిళా కార్యకర్తలు ఉత్సవాల్లో పాల్గొన్నారు. బతుకమ్మలను అందంగా పేర్చి శాసనసభ ఆవరణలో పెట్టి ఆటపాటలతో అలరించారు. తెలంగాణ శాసనసభ, మండలి కార్యాలయాల వద్ద బుధవారం బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, సురభి వాణీదేవి, ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డితో పాటు అధికారిణులు, ఉద్యోగినులు, పలువురు కార్పొరేటర్లు, మహిళా కార్యకర్తలు ఉత్సవాల్లో పాల్గొన్నారు. బతుకమ్మలను అందంగా పేర్చి శాసనసభ ఆవరణలో పెట్టి ఆటపాటలతో అలరించారు.
21/21
భగత్‌సింగ్‌ 115వ జయంతిని పురస్కరించుకుని బుధవారం చండీగఢ్‌ విమానాశ్రయానికి  భగత్‌సింగ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంగా నామకరణం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌, కేంద్ర పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి వీకే సింగ్‌, పంజాబ్‌ గవర్నర్‌ బన్వారీలాల్‌ పురోహిత్‌, హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, పంజాబ్‌ ముఖ్యమంత్రి  భగవంత్‌ మాన్‌ తదితరులు హాజరయ్యారు. భగత్‌సింగ్‌ 115వ జయంతిని పురస్కరించుకుని బుధవారం చండీగఢ్‌ విమానాశ్రయానికి భగత్‌సింగ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంగా నామకరణం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌, కేంద్ర పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి వీకే సింగ్‌, పంజాబ్‌ గవర్నర్‌ బన్వారీలాల్‌ పురోహిత్‌, హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ తదితరులు హాజరయ్యారు.

మరిన్ని