News In Pics: చిత్రం చెప్పే సంగతులు

Updated : 30 Sep 2022 11:54 IST
1/30
వైయస్‌ఆర్‌ జిల్లా ప్రొద్దుటూరులో పట్టణ పేదలకు సొంతింటి కలను నెరవేర్చాలనే లక్ష్యం నీరుగారింది. టిడ్కో ఇళ్ల నిర్మాణ ప్రాంతాలను చూస్తే అడవిని తలపిస్తోంది. ఇళ్ల మధ్య కంప చెట్లు పెరిగాయి. వాననీరు నిలిచి పునాదులన్నీ కుంటలుగా మారాయి. కంప చెట్ల పొదల్లో పిల్లర్లు ఉండిపోయాయి. రూ.కోట్ల ప్రజాధనాన్ని వ్యయం చేసినప్పటికీ పేదల సొంతింటి కల నెరవేరక ఆ ప్రాంతమంతా కళావిహీనంగా మారింది.  

వైయస్‌ఆర్‌ జిల్లా ప్రొద్దుటూరులో పట్టణ పేదలకు సొంతింటి కలను నెరవేర్చాలనే లక్ష్యం నీరుగారింది. టిడ్కో ఇళ్ల నిర్మాణ ప్రాంతాలను చూస్తే అడవిని తలపిస్తోంది. ఇళ్ల మధ్య కంప చెట్లు పెరిగాయి. వాననీరు నిలిచి పునాదులన్నీ కుంటలుగా మారాయి. కంప చెట్ల పొదల్లో పిల్లర్లు ఉండిపోయాయి. రూ.కోట్ల ప్రజాధనాన్ని వ్యయం చేసినప్పటికీ పేదల సొంతింటి కల నెరవేరక ఆ ప్రాంతమంతా కళావిహీనంగా మారింది.
2/30
3/30
నల్లమల అభయారణ్యంలో కొండల పై నుంచి పడుతున్న జలధారలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొండలపై నుంచి నీటి ధార ఏకధాటిగా ప్రవహిస్తున్నాయి. బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి అచ్చంపేట మండలం ఉమామహేశ్వరం, మల్లెలతీర్థంలో జలధారలు పెరగడంతో భక్తులు, పర్యటకులు చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.  నల్లమల అభయారణ్యంలో కొండల పై నుంచి పడుతున్న జలధారలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొండలపై నుంచి నీటి ధార ఏకధాటిగా ప్రవహిస్తున్నాయి. బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి అచ్చంపేట మండలం ఉమామహేశ్వరం, మల్లెలతీర్థంలో జలధారలు పెరగడంతో భక్తులు, పర్యటకులు చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.
4/30
5/30
ఆకాశంలో మబ్బులు.. కింద జల వనరు, పక్కనే పొలాలు.. చుట్టూ ప్రకృతి పరవశింపజేసే అందాల మధ్య చెరువుగట్టుపై ఎండిన చెట్టు చూపరులను ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం కొండాపూర్‌ మండలం మల్కాపూర్‌ చెరువు కట్టపై కనిపించింది.   ఆకాశంలో మబ్బులు.. కింద జల వనరు, పక్కనే పొలాలు.. చుట్టూ ప్రకృతి పరవశింపజేసే అందాల మధ్య చెరువుగట్టుపై ఎండిన చెట్టు చూపరులను ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం కొండాపూర్‌ మండలం మల్కాపూర్‌ చెరువు కట్టపై కనిపించింది.
6/30
కొల్చారం మండలం రంగంపేట హనుమాన్‌ ఆలయంలో దీపాలంకరణ.. 


కొల్చారం మండలం రంగంపేట హనుమాన్‌ ఆలయంలో దీపాలంకరణ..
7/30
ఈ చిత్రంలోని క్రీడాకారులు ఏదో సిమెంటు నేలపై, ఎక్కడో మారుమూల ప్రాంతంలో క్రీడామైదానాలు లేక ఆడుతున్నారు అనుకున్నారా?. కానేకాదు... ఎంతోమంది జాతీయస్థాయి క్రీడాకారులను తయారుచేసిన విజయవాడ ఇందిరాగాంధీ క్రీడామైదానంలో పరిస్థితి ఇది. ఆగస్టు 15న స్వాతంత్య్ర వేడుకల కోసం కంకర, చిప్స్, బూడిద, ఫ్లైయాష్‌లతో రహదారులను ఏర్పాటుచేసి, నెలకుపైగా గడిచినా కనీసం తొలగించకుండా ఇలా వదిలేశారు. ఈ చిత్రంలోని క్రీడాకారులు ఏదో సిమెంటు నేలపై, ఎక్కడో మారుమూల ప్రాంతంలో క్రీడామైదానాలు లేక ఆడుతున్నారు అనుకున్నారా?. కానేకాదు... ఎంతోమంది జాతీయస్థాయి క్రీడాకారులను తయారుచేసిన విజయవాడ ఇందిరాగాంధీ క్రీడామైదానంలో పరిస్థితి ఇది. ఆగస్టు 15న స్వాతంత్య్ర వేడుకల కోసం కంకర, చిప్స్, బూడిద, ఫ్లైయాష్‌లతో రహదారులను ఏర్పాటుచేసి, నెలకుపైగా గడిచినా కనీసం తొలగించకుండా ఇలా వదిలేశారు.
8/30
దసరా సెలవుల నేపథ్యంలో ఉత్తరాంధ్ర ప్రాంతాల నుంచి వచ్చే వారితో విశాఖ  రైల్వేస్టేషన్‌ కిటకిటలాడుతోంది. మరో వైపు ఏ రైలు వచ్చినా కిక్కిరిసిపోయి కనిపిస్తోంది. దీంతో మరో రైలుకైనా వెళ్దాం అని పెద్ద సంఖ్యలో ప్రయాణికులు వేచి చూస్తున్నారు. బుధవారం రాత్రంతా రైల్వేస్టేషన్‌లోనే నిరీక్షించి...గురువారం తెల్లవారుజామున ప్రాంగణంలోనే నిద్రిస్తున్న వారిని చిత్రంలో చూడొచ్చు.  


దసరా సెలవుల నేపథ్యంలో ఉత్తరాంధ్ర ప్రాంతాల నుంచి వచ్చే వారితో విశాఖ రైల్వేస్టేషన్‌ కిటకిటలాడుతోంది. మరో వైపు ఏ రైలు వచ్చినా కిక్కిరిసిపోయి కనిపిస్తోంది. దీంతో మరో రైలుకైనా వెళ్దాం అని పెద్ద సంఖ్యలో ప్రయాణికులు వేచి చూస్తున్నారు. బుధవారం రాత్రంతా రైల్వేస్టేషన్‌లోనే నిరీక్షించి...గురువారం తెల్లవారుజామున ప్రాంగణంలోనే నిద్రిస్తున్న వారిని చిత్రంలో చూడొచ్చు.
9/30
తాము అమ్మాలనుకున్న వస్తువుల నాణ్యత ఎలా ఉంటుందో చెప్పేందుకు వ్యాపారులు రకరకాల ప్రయత్నాలు చేస్తారు. బొమ్మలు అమ్మే వారు కూడా పిల్లలను, పెద్దలను ఆకర్షించేందుకు తమ ఆలోచనకు పదును పెడుతున్నారు. ఆ బొమ్మల బలమెంతో చెప్పేందుకు వాటిపై రాళ్లు పెట్టి చూడమంటున్నారు. విశాఖ జిల్లా తాటిచెట్లపాలెంలో ఇదిగో ఇలా చేసి ఆకట్టుకున్నారు.   


తాము అమ్మాలనుకున్న వస్తువుల నాణ్యత ఎలా ఉంటుందో చెప్పేందుకు వ్యాపారులు రకరకాల ప్రయత్నాలు చేస్తారు. బొమ్మలు అమ్మే వారు కూడా పిల్లలను, పెద్దలను ఆకర్షించేందుకు తమ ఆలోచనకు పదును పెడుతున్నారు. ఆ బొమ్మల బలమెంతో చెప్పేందుకు వాటిపై రాళ్లు పెట్టి చూడమంటున్నారు. విశాఖ జిల్లా తాటిచెట్లపాలెంలో ఇదిగో ఇలా చేసి ఆకట్టుకున్నారు.
10/30
పెడన ఏపీఎస్‌ఆర్టీసీ బస్టేషన్‌ ఇది. బస్‌స్టేషన్‌ భవనంపైన పెద్ద అక్షరాలతో పేరు ఉండాల్సింది పోయి.. వైకాపా ప్రచార పోస్టర్‌ను పెద్దగా ఏర్పాటుచేశారు. బస్టేషన్‌ బోర్డు చిన్నగా అమర్చారు. నెలక్రితం సీఎం పర్యటన సందర్భంగా పెడన అంతా పెద్దపెద్ద పోస్టర్లు అమర్చారు. అప్పుడు ఆర్టీసీ బస్టాండుపై కూడా జయహో జగన్‌ అనే పెద్ద పోస్టరును తొలగించకపోవడం విమర్శకు తావిస్తోంది. పెడన ఏపీఎస్‌ఆర్టీసీ బస్టేషన్‌ ఇది. బస్‌స్టేషన్‌ భవనంపైన పెద్ద అక్షరాలతో పేరు ఉండాల్సింది పోయి.. వైకాపా ప్రచార పోస్టర్‌ను పెద్దగా ఏర్పాటుచేశారు. బస్టేషన్‌ బోర్డు చిన్నగా అమర్చారు. నెలక్రితం సీఎం పర్యటన సందర్భంగా పెడన అంతా పెద్దపెద్ద పోస్టర్లు అమర్చారు. అప్పుడు ఆర్టీసీ బస్టాండుపై కూడా జయహో జగన్‌ అనే పెద్ద పోస్టరును తొలగించకపోవడం విమర్శకు తావిస్తోంది.
11/30
దసరా సెలవులు రావడంతో నిర్మల్‌ జిల్లా వాస్తాపూర్‌లో సందడి నెలకొంది. అక్కడి జలపాతం, ప్రకృతి అందాలను తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు పోటెత్తుతున్నారు. ఘాట్‌ రోడ్డు అందాలను వీక్షిస్తూ సెల్ఫీలు, వీడియోలు తీసుకుంటూ సంబర పడుతున్నారు. జలపాతం వద్ద ఉత్సాహంగా గడుపుతున్నారు.  దసరా సెలవులు రావడంతో నిర్మల్‌ జిల్లా వాస్తాపూర్‌లో సందడి నెలకొంది. అక్కడి జలపాతం, ప్రకృతి అందాలను తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు పోటెత్తుతున్నారు. ఘాట్‌ రోడ్డు అందాలను వీక్షిస్తూ సెల్ఫీలు, వీడియోలు తీసుకుంటూ సంబర పడుతున్నారు. జలపాతం వద్ద ఉత్సాహంగా గడుపుతున్నారు.
12/30
ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్నకు ఇటీవల మాతృవియోగం కలిగింది. తరువాత ఆయన కొంత అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అయినా పరామర్శించడానికి వచ్చిన వారందరిని కలిశారు. రెండు రోజుల నుంచి జ్వర తీవ్రత పెరగడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఇంట్లోనే వైద్యం తీసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు అందించేందుకు గురువారం ఓ ప్రైవేటు ఫంక్షన్‌ హాలులో ఏర్పాటు చేసిన ఆసరా పింఛనుకార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓపిక లేకపోయినా మాట్లాడారు. ఆ సమయంలో కళ్ల నుంచి నీరు కారుతున్నా.. మరోవైపు చేతికి కినోల ఉన్నా.. కార్డుల పంపిణీలో లబ్ధిదారుల పేరును చూసి వారిని పిలిచి అందజేశారు.    ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్నకు ఇటీవల మాతృవియోగం కలిగింది. తరువాత ఆయన కొంత అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అయినా పరామర్శించడానికి వచ్చిన వారందరిని కలిశారు. రెండు రోజుల నుంచి జ్వర తీవ్రత పెరగడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఇంట్లోనే వైద్యం తీసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు అందించేందుకు గురువారం ఓ ప్రైవేటు ఫంక్షన్‌ హాలులో ఏర్పాటు చేసిన ఆసరా పింఛనుకార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓపిక లేకపోయినా మాట్లాడారు. ఆ సమయంలో కళ్ల నుంచి నీరు కారుతున్నా.. మరోవైపు చేతికి కినోల ఉన్నా.. కార్డుల పంపిణీలో లబ్ధిదారుల పేరును చూసి వారిని పిలిచి అందజేశారు.
13/30
14/30
 పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం రచ్చమల్లపాడులో శిర్డీ సాయిబాబా దేవాలయంలోని ధ్వజస్తంభంపై బుధవారం రాత్రి పిడుగు పడి రెండుగా చీలింది. 2000 ఆగస్టు 14న ఈ ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. పిడుగు ధాటికి ధ్వజస్తంభం పైనుంచి కింది వరకు నిలువునా రెండుగా చీలిపోయింది. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం రచ్చమల్లపాడులో శిర్డీ సాయిబాబా దేవాలయంలోని ధ్వజస్తంభంపై బుధవారం రాత్రి పిడుగు పడి రెండుగా చీలింది. 2000 ఆగస్టు 14న ఈ ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. పిడుగు ధాటికి ధ్వజస్తంభం పైనుంచి కింది వరకు నిలువునా రెండుగా చీలిపోయింది.
15/30
నోటిలో అడ్డంగా ఇరుక్కున్న నత్త పెంకును వదిలించుకోవడానికి ఓ పాము తీవ్ర అవస్థలు పడింది. మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్ర మండలం కోయిల్‌సాగర్‌ ఎడమ కాలువలో ఓ పాము నత్త పెంకును నోట కరచుకొని అటూ ఇటూ చక్కర్లు కొట్టింది. కొంతసేపటికి ఆ పెంకు నోటికి అడ్డంగా ఇరుక్కుపోవడంతో ఎంతో హైరానా పడింది. చివరికి జనం అలికిడికి తుర్రుమని తుప్పల్లోకి వెళ్లిపోయింది. ఆ దృశ్యాలను ‘ఈనాడు’ బంధించింది.
నోటిలో అడ్డంగా ఇరుక్కున్న నత్త పెంకును వదిలించుకోవడానికి ఓ పాము తీవ్ర అవస్థలు పడింది. మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్ర మండలం కోయిల్‌సాగర్‌ ఎడమ కాలువలో ఓ పాము నత్త పెంకును నోట కరచుకొని అటూ ఇటూ చక్కర్లు కొట్టింది. కొంతసేపటికి ఆ పెంకు నోటికి అడ్డంగా ఇరుక్కుపోవడంతో ఎంతో హైరానా పడింది. చివరికి జనం అలికిడికి తుర్రుమని తుప్పల్లోకి వెళ్లిపోయింది. ఆ దృశ్యాలను ‘ఈనాడు’ బంధించింది.
16/30
17/30
శ్రీకాకుళం జిల్లాలోని కోటబొమ్మాళిలో రెండు రోజులుగా జరుగుతున్న కొత్తమ్మతల్లి జాతర గురువారం ముగిసింది. చివరి రోజు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పోలీసు బందోబస్తు మధ్య ఊరేగింపుగా జంగిడి(నైవేద్యం)ని ఆలయానికి చేర్చారు. భక్తులు అమ్మవారికి ముర్రాటలు (కలశంలో పవిత్ర జలం) సమర్పించారు. శ్రీకాకుళం జిల్లాలోని కోటబొమ్మాళిలో రెండు రోజులుగా జరుగుతున్న కొత్తమ్మతల్లి జాతర గురువారం ముగిసింది. చివరి రోజు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పోలీసు బందోబస్తు మధ్య ఊరేగింపుగా జంగిడి(నైవేద్యం)ని ఆలయానికి చేర్చారు. భక్తులు అమ్మవారికి ముర్రాటలు (కలశంలో పవిత్ర జలం) సమర్పించారు.
18/30
కేసీ కాలువ పరిధిలో రైతులు వేలాది ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు. పొలాలకు నీటిని మళ్లించేందుకు పిల్ల కాలువలు లేవు. దీంతో కాలువ గట్లపై మోటార్లు పెట్టుకొని రెండు కిలోమీటర్ల మేర పైపులైన్లు ఏర్పాటు చేసుకుని నీటిని మళ్లించుకుంటున్నారు. కర్నూలు మండల పరిధిలోని నిడ్జూరు-ఆర్‌.కుంతలపాడు గ్రామాల మధ్య రైతులు.. ఇలా కాలువలో పైపులు వేసుకుని పంటలు పండించుకుంటున్నారు. కేసీ కాలువ పరిధిలో రైతులు వేలాది ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు. పొలాలకు నీటిని మళ్లించేందుకు పిల్ల కాలువలు లేవు. దీంతో కాలువ గట్లపై మోటార్లు పెట్టుకొని రెండు కిలోమీటర్ల మేర పైపులైన్లు ఏర్పాటు చేసుకుని నీటిని మళ్లించుకుంటున్నారు. కర్నూలు మండల పరిధిలోని నిడ్జూరు-ఆర్‌.కుంతలపాడు గ్రామాల మధ్య రైతులు.. ఇలా కాలువలో పైపులు వేసుకుని పంటలు పండించుకుంటున్నారు.
19/30
మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్ర మండలం గోప్లాపూర్‌ గ్రామానికి చెందిన రైతు వెంకటయ్య అర ఎకరాలో మూడేళ్లుగా బంతిపూలు సాగు చేస్తున్నారు. 70 రోజుల కిందట రూ.30 వేల పెట్టుబడితో బంతి సాగు ఆరంభించారు. గత వారం మొదటి దశలోనే 50 క్వింటాళ్ల పూలు అమ్మానని, పెట్టుబడి ఖర్చంతా వచ్చేసిందని అన్నారు. ప్రస్తుతం బంతిపూలకు బాగా డిమాండ్‌ ఉందని, కిలో వంద పలుకుతుందని తెలిపారు. మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్ర మండలం గోప్లాపూర్‌ గ్రామానికి చెందిన రైతు వెంకటయ్య అర ఎకరాలో మూడేళ్లుగా బంతిపూలు సాగు చేస్తున్నారు. 70 రోజుల కిందట రూ.30 వేల పెట్టుబడితో బంతి సాగు ఆరంభించారు. గత వారం మొదటి దశలోనే 50 క్వింటాళ్ల పూలు అమ్మానని, పెట్టుబడి ఖర్చంతా వచ్చేసిందని అన్నారు. ప్రస్తుతం బంతిపూలకు బాగా డిమాండ్‌ ఉందని, కిలో వంద పలుకుతుందని తెలిపారు.
20/30
రాజేంద్రనగర్‌ పరిధిలోని సులేమాన్‌నగర్‌ మీర్‌ఆలం లేక్‌ పార్కు సమీపంలో చెత్త, వ్యర్థాలను ఇటీవల బల్దియా పారిశుద్ధ్య సిబ్బంది పూర్తి స్థాయిలో తొలగించారు. మళ్లీ ఎవరూ చెత్త వేయకూడదన్న ఆలోచనతో ఈ ప్రాంతంలో బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నారు. రాజేంద్రనగర్‌ పరిధిలోని సులేమాన్‌నగర్‌ మీర్‌ఆలం లేక్‌ పార్కు సమీపంలో చెత్త, వ్యర్థాలను ఇటీవల బల్దియా పారిశుద్ధ్య సిబ్బంది పూర్తి స్థాయిలో తొలగించారు. మళ్లీ ఎవరూ చెత్త వేయకూడదన్న ఆలోచనతో ఈ ప్రాంతంలో బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నారు.
21/30
22/30
దిల్లీలో గురువారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ యు.యు.లలిత్‌, ఆయన సతీమణి అమిత.. సుప్రీంకోర్టు, హైకోర్టుల చరిత్రపై రూపొందించిన పుస్తకాలను జస్టిస్‌ లలిత్‌ రాష్ట్రపతికి బహూకరించారు. దిల్లీలో గురువారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ యు.యు.లలిత్‌, ఆయన సతీమణి అమిత.. సుప్రీంకోర్టు, హైకోర్టుల చరిత్రపై రూపొందించిన పుస్తకాలను జస్టిస్‌ లలిత్‌ రాష్ట్రపతికి బహూకరించారు.
23/30
కర్ణాటక సాంస్కృతిక నగరి.. మైసూరు దసరా సంబరాల్లో మునిగి తేలుతోంది. నవరాత్రులూ వేడుకలు కొనసాగనుండగా, గురువారం నగరమంతా విద్యుద్దీపాలతో కళకళలాడింది. రాజమందిరం కాంతులీనుతున్న వేళ.. పర్యాటకుల సందడి వర్ణనాతీతం. కర్ణాటక సాంస్కృతిక నగరి.. మైసూరు దసరా సంబరాల్లో మునిగి తేలుతోంది. నవరాత్రులూ వేడుకలు కొనసాగనుండగా, గురువారం నగరమంతా విద్యుద్దీపాలతో కళకళలాడింది. రాజమందిరం కాంతులీనుతున్న వేళ.. పర్యాటకుల సందడి వర్ణనాతీతం.
24/30
శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో ఇసుకతో తీర్చిదిద్దిన మండపం. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో ఇసుకతో తీర్చిదిద్దిన మండపం.
25/30
అన్నపూర్ణే.. సదాపూర్ణే.. దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా గురువారం పలు ఆలయాల్లో అమ్మవార్లను అన్నపూర్ణాదేవిగా అలంకరించారు. జూబ్లీహిల్స్‌ పెద్దమ్మను గజలక్ష్మీదేవిగా తీర్చిదిద్దారు. అన్నపూర్ణే.. సదాపూర్ణే.. దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా గురువారం పలు ఆలయాల్లో అమ్మవార్లను అన్నపూర్ణాదేవిగా అలంకరించారు. జూబ్లీహిల్స్‌ పెద్దమ్మను గజలక్ష్మీదేవిగా తీర్చిదిద్దారు.
26/30
27/30
28/30
కాళ్లకు బూట్లు వేసుకొని మురిసిపోతున్న శునకం విశాఖపట్నం రైల్వే న్యూ కాలనీలో కనిపించింది. కుక్కకు షూ ఏంటబ్బా..! అని అటు వెళ్తున్న వారూ ఆసక్తిగా గమనించారు. శునకం కాలివేళ్ల మధ్య మట్టి ఇరుక్కోకుండా దాన్ని యజమాని చేసిన ప్రయత్నం ఇది. వాటికి రక్షణగా ఉంటుందని ఇలా చేశారు. కాళ్లకు బూట్లు వేసుకొని మురిసిపోతున్న శునకం విశాఖపట్నం రైల్వే న్యూ కాలనీలో కనిపించింది. కుక్కకు షూ ఏంటబ్బా..! అని అటు వెళ్తున్న వారూ ఆసక్తిగా గమనించారు. శునకం కాలివేళ్ల మధ్య మట్టి ఇరుక్కోకుండా దాన్ని యజమాని చేసిన ప్రయత్నం ఇది. వాటికి రక్షణగా ఉంటుందని ఇలా చేశారు.
29/30
సికింద్రాబాద్‌ ప్రధాన రహదారిలో తరచూ ప్రమాదాలు జరిగి కొందరు మృత్యువాత పడుతున్నారు. చాలా మందికి ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన లేకుండానే వెళుతున్నారు. రెతిఫైల్‌ బస్‌ స్టేషన్‌ సమీపంలో.. ఎదురుగా వస్తున్న బస్సు సందులో నుంచే వాహనదారులు ప్రమాదకరంగా వెళుతున్న చిత్రమిది. సికింద్రాబాద్‌ ప్రధాన రహదారిలో తరచూ ప్రమాదాలు జరిగి కొందరు మృత్యువాత పడుతున్నారు. చాలా మందికి ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన లేకుండానే వెళుతున్నారు. రెతిఫైల్‌ బస్‌ స్టేషన్‌ సమీపంలో.. ఎదురుగా వస్తున్న బస్సు సందులో నుంచే వాహనదారులు ప్రమాదకరంగా వెళుతున్న చిత్రమిది.
30/30
బతుకమ్మ.. తెలంగాణ ఆడపడచులు తీరొక్క పూలను పేర్చి గౌరమ్మను భక్తిశ్రద్ధలతో కొలిచే వేడుక. ఈ పూల పండుగ రోజున కొలువుదీర్చేందుకు కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం కురిక్యాల గ్రామానికి చెందిన సముద్రాల ప్రభాకర్‌ అనే కళాకారుడు బతుకమ్మలతో తల్లీబిడ్డలు ఉన్న విగ్రహాలను ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతున్నారు. ఈ ఫైబర్‌ విగ్రహాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. బతుకమ్మ.. తెలంగాణ ఆడపడచులు తీరొక్క పూలను పేర్చి గౌరమ్మను భక్తిశ్రద్ధలతో కొలిచే వేడుక. ఈ పూల పండుగ రోజున కొలువుదీర్చేందుకు కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం కురిక్యాల గ్రామానికి చెందిన సముద్రాల ప్రభాకర్‌ అనే కళాకారుడు బతుకమ్మలతో తల్లీబిడ్డలు ఉన్న విగ్రహాలను ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతున్నారు. ఈ ఫైబర్‌ విగ్రహాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి.

మరిన్ని