News In Pics: చిత్రం చెప్పే సంగతులు- 2 (30-09-22)

Updated : 30 Sep 2022 22:30 IST
1/37
ఖమ్మంలోని జమ్మిబండలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారి విగ్రహాన్ని కరెన్సీ నోట్లతో అలంకరించారు. ఖమ్మంలోని జమ్మిబండలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారి విగ్రహాన్ని కరెన్సీ నోట్లతో అలంకరించారు.
2/37
3/37
గుంటూరులో ఏర్పాటు చేసిన రెండు వేర్వేరు వస్త్ర దుకాణ ప్రారంభోత్సవాల్లో సినీ తారలు మెహరీన్‌, కేతికా శర్మ పాల్గొని సందడి చేశారు. వీరిని చూసేందుకు అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. గుంటూరులో ఏర్పాటు చేసిన రెండు వేర్వేరు వస్త్ర దుకాణ ప్రారంభోత్సవాల్లో సినీ తారలు మెహరీన్‌, కేతికా శర్మ పాల్గొని సందడి చేశారు. వీరిని చూసేందుకు అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు.
4/37
5/37
6/37
7/37
8/37
తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం సాయంత్రం స్వామివారు సర్వభూపాల వాహనంపై ఆలయ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం సాయంత్రం స్వామివారు సర్వభూపాల వాహనంపై ఆలయ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు.
9/37
10/37
11/37
దసరా, బతుకమ్మ పండగలకు స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికులతో సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ ఇలా కిక్కిరిసి కనిపించింది. విశాఖపట్నం, విజయనగరం మీదుగా వెళ్లే హౌరా ఎక్స్‌ప్రెస్‌ రైలు బోగిలో కాస్త స్థలం కోసం ప్రయాణికులు ఎగబడుతూ కనిపించారు. దసరా, బతుకమ్మ పండగలకు స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికులతో సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ ఇలా కిక్కిరిసి కనిపించింది. విశాఖపట్నం, విజయనగరం మీదుగా వెళ్లే హౌరా ఎక్స్‌ప్రెస్‌ రైలు బోగిలో కాస్త స్థలం కోసం ప్రయాణికులు ఎగబడుతూ కనిపించారు.
12/37
13/37
14/37
15/37
చిరంజీవి హీరోగా మోహన్‌రాజా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘గాడ్‌ ఫాదర్‌’. ఈ సినిమా హిందీ ట్రైలర్‌ను శనివారం మధ్యాహ్నం 2గంటలకు ముంబయిలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ‘గాడ్‌ఫాదర్‌’ దసరా కానుకగా అక్టోబర్‌ 5న థియేటర్లలో విడుదల కానుంది. చిరంజీవి హీరోగా మోహన్‌రాజా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘గాడ్‌ ఫాదర్‌’. ఈ సినిమా హిందీ ట్రైలర్‌ను శనివారం మధ్యాహ్నం 2గంటలకు ముంబయిలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ‘గాడ్‌ఫాదర్‌’ దసరా కానుకగా అక్టోబర్‌ 5న థియేటర్లలో విడుదల కానుంది.
16/37
తిరుమలలో శుక్రవారం ఆకాశం మేఘావృతమై ఉండటంతో శ్రీవారి ఆలయం ఇలా మేఘాల కడలి ఒడ్డున ఉందా అన్నట్లు అందంగా కనిపించింది. తిరుమలలో శుక్రవారం ఆకాశం మేఘావృతమై ఉండటంతో శ్రీవారి ఆలయం ఇలా మేఘాల కడలి ఒడ్డున ఉందా అన్నట్లు అందంగా కనిపించింది.
17/37
మంత్రి కేటీఆర్‌ తెలంగాణ ఉద్యమ కాలం నాటి తన ఫొటోలను ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. ఈ సెప్టెంబర్‌తో తాను ప్రజాసేవలోకి వచ్చి 16 ఏళ్లయినట్లు తెలుపుతూ పోస్టు పెట్టారు. తెలంగాణ ప్రజలు, కార్యకర్తలు తనకు, పార్టీకి ఇస్తున్న మద్దతు గొప్పదని తెలిపారు. మంత్రి కేటీఆర్‌ తెలంగాణ ఉద్యమ కాలం నాటి తన ఫొటోలను ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. ఈ సెప్టెంబర్‌తో తాను ప్రజాసేవలోకి వచ్చి 16 ఏళ్లయినట్లు తెలుపుతూ పోస్టు పెట్టారు. తెలంగాణ ప్రజలు, కార్యకర్తలు తనకు, పార్టీకి ఇస్తున్న మద్దతు గొప్పదని తెలిపారు.
18/37
19/37
హైదరాబాద్‌ హైటెక్‌సిటీలోని హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్లో ‘ద గ్రాండ్‌ దివాలీ బజారియా’ పేరుతో సూత్ర ఎగ్జిబిషన్‌ ఏర్పాటైంది. సినీనటి, వ్యాఖ్యాత వర్షిణి సౌందరరాజన్‌ ఈ ప్రదర్శన ప్రారంభించారు. ఈ సందర్భంగా మోడళ్లు, ఫ్యాషన్‌ ప్రియులు ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు. హైదరాబాద్‌ హైటెక్‌సిటీలోని హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్లో ‘ద గ్రాండ్‌ దివాలీ బజారియా’ పేరుతో సూత్ర ఎగ్జిబిషన్‌ ఏర్పాటైంది. సినీనటి, వ్యాఖ్యాత వర్షిణి సౌందరరాజన్‌ ఈ ప్రదర్శన ప్రారంభించారు. ఈ సందర్భంగా మోడళ్లు, ఫ్యాషన్‌ ప్రియులు ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.
20/37
21/37
22/37
కర్నూలు నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట రజకులు ఆందోళన నిర్వహించారు. కార్పొరేషన్‌ అధికారులు గురువారం లారీలో తమ గాడిదలను తీసుకెళ్లారని ఆరోపిస్తూ ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ క్రమంలో వారు నగర పాలక సంస్థ కార్యాలయంలోకి గాడిదలను తీసుకెళ్లారు. ఆపై అధికారులతో వాగ్వాదానికి దిగారు. కర్నూలు నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట రజకులు ఆందోళన నిర్వహించారు. కార్పొరేషన్‌ అధికారులు గురువారం లారీలో తమ గాడిదలను తీసుకెళ్లారని ఆరోపిస్తూ ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ క్రమంలో వారు నగర పాలక సంస్థ కార్యాలయంలోకి గాడిదలను తీసుకెళ్లారు. ఆపై అధికారులతో వాగ్వాదానికి దిగారు.
23/37
నిఖిల్, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా నటించిన ‘కార్తికేయ-2’ సినిమా యూఎస్‌లోని థియేటర్లలో విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో అక్కడ వేడుకల్ని నిర్వహించారు. కార్యక్రమంలో చిత్ర నిర్మాత విశ్వప్రసాద్‌ పాల్గొన్నారు. నిఖిల్, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా నటించిన ‘కార్తికేయ-2’ సినిమా యూఎస్‌లోని థియేటర్లలో విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో అక్కడ వేడుకల్ని నిర్వహించారు. కార్యక్రమంలో చిత్ర నిర్మాత విశ్వప్రసాద్‌ పాల్గొన్నారు.
24/37
25/37
తెలంగాణ సీఎం కేసీఆర్‌ తన సతీమణి శోభతో కలిసి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో మంత్రి జగదీశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ తన సతీమణి శోభతో కలిసి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో మంత్రి జగదీశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
26/37
27/37
రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండల కేంద్రంలో దివంగత నేత జైపాల్‌రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎంపీలు రాములు, ఆర్‌.కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండల కేంద్రంలో దివంగత నేత జైపాల్‌రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎంపీలు రాములు, ఆర్‌.కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.
28/37
ప్రధాని నరేంద్ర మోదీ అహ్మదాబాద్‌లోని కలుపుర్ నుంచి దూరదర్శన్‌ కేంద్రం స్టేషన్‌ వరకు మెట్రో రైలులో ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులు, ప్రయాణికులతో సరదాగా ముచ్చటించారు. ప్రధాని నరేంద్ర మోదీ అహ్మదాబాద్‌లోని కలుపుర్ నుంచి దూరదర్శన్‌ కేంద్రం స్టేషన్‌ వరకు మెట్రో రైలులో ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులు, ప్రయాణికులతో సరదాగా ముచ్చటించారు.
29/37
30/37
పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ హీరోగా, క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం హరిహర వీరమల్లు. 17వ శతాబ్దంనాటి చారిత్రక కథనంతో తెరకెక్కనున్న ఈ భారీ బడ్జెట్‌ పాన్ ఇండియా యాక్షన్‌ చిత్రాన్ని ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. ఇప్పటికే కొంత భాగం షూటింగ్‌ పూర్తయింది. వచ్చే నెల 17 నుంచి మరో షెడ్యూల్‌ మొదలు కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం వర్క్‌షాప్‌ నిర్వహించగా.. పవన్‌, సంగీత దర్శకుడు కీరవాణి హాజరయ్యారు. పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ హీరోగా, క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం హరిహర వీరమల్లు. 17వ శతాబ్దంనాటి చారిత్రక కథనంతో తెరకెక్కనున్న ఈ భారీ బడ్జెట్‌ పాన్ ఇండియా యాక్షన్‌ చిత్రాన్ని ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. ఇప్పటికే కొంత భాగం షూటింగ్‌ పూర్తయింది. వచ్చే నెల 17 నుంచి మరో షెడ్యూల్‌ మొదలు కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం వర్క్‌షాప్‌ నిర్వహించగా.. పవన్‌, సంగీత దర్శకుడు కీరవాణి హాజరయ్యారు.
31/37
గుజరాత్‌ రాష్ట్రం అహ్మదాబాద్‌లో జాతీయ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌తో తెలంగాణ క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను కేంద్రమంత్రికి వివరించారు. ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు ఈ భేటీలో పాల్గొన్నారు.  గుజరాత్‌ రాష్ట్రం అహ్మదాబాద్‌లో జాతీయ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌తో తెలంగాణ క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను కేంద్రమంత్రికి వివరించారు. ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు ఈ భేటీలో పాల్గొన్నారు.
32/37
ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఐదోరోజు లలితా త్రిపుర సుందరీదేవి అలంకారంలో కనకదుర్గమ్మ దర్శనమిచ్చారు. భక్తులు భారీగా తరలిరావడంతో క్యూలైన్లు నిండిపోయాయి. ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఐదోరోజు లలితా త్రిపుర సుందరీదేవి అలంకారంలో కనకదుర్గమ్మ దర్శనమిచ్చారు. భక్తులు భారీగా తరలిరావడంతో క్యూలైన్లు నిండిపోయాయి.
33/37
34/37
అమరావతి పరిరక్షణే లక్ష్యంగా రాజధాని ప్రాంత రైతులు, మహిళలు చేపట్టిన మహాపాదయాత్ర ఏలూరు జిల్లాలో ఉత్సాహంగా సాగుతోంది. 19వ రోజుకు చేరుకున్న పాదయాత్ర.. దెందులూరు నియోజకవర్గం పెరుగ్గూడెం నుంచి ప్రారంభమై ద్వారకా తిరుమల మండలం నక్క పంగిడిగూడెం వద్ద గోపాలపురం నియోజవర్గంలో ప్రవేశించింది.  అమరావతి పరిరక్షణే లక్ష్యంగా రాజధాని ప్రాంత రైతులు, మహిళలు చేపట్టిన మహాపాదయాత్ర ఏలూరు జిల్లాలో ఉత్సాహంగా సాగుతోంది. 19వ రోజుకు చేరుకున్న పాదయాత్ర.. దెందులూరు నియోజకవర్గం పెరుగ్గూడెం నుంచి ప్రారంభమై ద్వారకా తిరుమల మండలం నక్క పంగిడిగూడెం వద్ద గోపాలపురం నియోజవర్గంలో ప్రవేశించింది.
35/37
36/37
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కనుల పండువగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం కల్పవృక్ష వాహన సేవను వైభవంగా నిర్వహించారు. తిరుమాడ వీధుల్లో నిర్వహించిన ఈ సేవలో శ్రీవారు కల్పవృక్ష వాహనం పైనుంచి భక్తులకు అభయ ప్రదానం చేశారు. సేవను తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు.  తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కనుల పండువగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం కల్పవృక్ష వాహన సేవను వైభవంగా నిర్వహించారు. తిరుమాడ వీధుల్లో నిర్వహించిన ఈ సేవలో శ్రీవారు కల్పవృక్ష వాహనం పైనుంచి భక్తులకు అభయ ప్రదానం చేశారు. సేవను తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. 
37/37

మరిన్ని

ap-districts
ts-districts