News In Pics: చిత్రం చెప్పే సంగతులు

Updated : 01 Oct 2022 13:04 IST
1/16
కర్నూలు నగరంలోని సంతోష్‌నగర్‌ ప్రాంతంలో జాతీయ రహదారి పక్కనే ఉన్న సర్వీసు రహదారి అధ్వానంగా మారింది. జాతీయ రహదారి పై వంతెన పనులు జరుగుతుండటంతో వాహనాలన్నింటినీ సర్వీసు రోడ్డుపైకి మళ్లించారు. ప్రతిరోజూ వేలాది వాహనాలు వెళుతుండటం.. మరమ్మతుల గురించి పట్టించుకోకపోవడంతో అడుగడుగునా గుంతలమయంగా మారింది. కర్నూలు నగరంలోని సంతోష్‌నగర్‌ ప్రాంతంలో జాతీయ రహదారి పక్కనే ఉన్న సర్వీసు రహదారి అధ్వానంగా మారింది. జాతీయ రహదారి పై వంతెన పనులు జరుగుతుండటంతో వాహనాలన్నింటినీ సర్వీసు రోడ్డుపైకి మళ్లించారు. ప్రతిరోజూ వేలాది వాహనాలు వెళుతుండటం.. మరమ్మతుల గురించి పట్టించుకోకపోవడంతో అడుగడుగునా గుంతలమయంగా మారింది.
2/16
వైయస్‌ఆర్‌ జిల్లా కడప నగరంలో గురువారం రాత్రి కురిసిన వర్షానికి ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. వర్షం కురిసిన ప్రతీసారి ఆర్టీసీ బస్టాండ్‌ కూడలి మొదలుకొని వై జంక్షన్‌ వరకు రోడ్లు నదీ ప్రవాహాన్ని తలపిస్తుంటున్నాయి. తవ్విన గోతులు, తెరిచి ఉంచిన మ్యాన్‌హోళ్లు కనిపించక వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. శుక్రవారం ఓ వాహనదారుడు అదుపుతప్పి మ్యాన్‌హోల్‌లో పడిపోయారు. అక్కడున్న యువకులు అతడిని రక్షించారు. వైయస్‌ఆర్‌ జిల్లా కడప నగరంలో గురువారం రాత్రి కురిసిన వర్షానికి ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. వర్షం కురిసిన ప్రతీసారి ఆర్టీసీ బస్టాండ్‌ కూడలి మొదలుకొని వై జంక్షన్‌ వరకు రోడ్లు నదీ ప్రవాహాన్ని తలపిస్తుంటున్నాయి. తవ్విన గోతులు, తెరిచి ఉంచిన మ్యాన్‌హోళ్లు కనిపించక వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. శుక్రవారం ఓ వాహనదారుడు అదుపుతప్పి మ్యాన్‌హోల్‌లో పడిపోయారు. అక్కడున్న యువకులు అతడిని రక్షించారు.
3/16
పార్వతీపురం జిల్లా కేంద్రంలోని 20, 21 వార్డుల పరిధిలో జనశక్తి కాలనీకి వెళ్లే మార్గంలో అంబేడ్కర్, బుద్ధుడు, జ్యోతిబా ఫులే తదితర విగ్రహాలను నాస్తిక సమాజ సభ్యుడు యాళ్ల సూర్యనారాయణ కొన్నేళ్ల క్రితం ఏర్పాటు చేశారు. ఆయన మృతి చెందిన తర్వాత ఆ విగ్రహాలను పట్టించుకునే నాథులే కరవయ్యారు. అందరినీ ఆకర్షించే వాటి చుట్టూ పనికిరాని మొక్కలు పెరగడంతో పరిసరాలు అధ్వానంగా మారాయి. పార్వతీపురం జిల్లా కేంద్రంలోని 20, 21 వార్డుల పరిధిలో జనశక్తి కాలనీకి వెళ్లే మార్గంలో అంబేడ్కర్, బుద్ధుడు, జ్యోతిబా ఫులే తదితర విగ్రహాలను నాస్తిక సమాజ సభ్యుడు యాళ్ల సూర్యనారాయణ కొన్నేళ్ల క్రితం ఏర్పాటు చేశారు. ఆయన మృతి చెందిన తర్వాత ఆ విగ్రహాలను పట్టించుకునే నాథులే కరవయ్యారు. అందరినీ ఆకర్షించే వాటి చుట్టూ పనికిరాని మొక్కలు పెరగడంతో పరిసరాలు అధ్వానంగా మారాయి.
4/16
బతుకమ్మ సంబురాలు ఊరూవాడా ఉత్సాహంగా సాగుతున్నాయి. భక్తుల మదిలో ఆధ్యాత్మిక సౌరభాలు పంచుతున్నాయి. ఇదే క్రమంలో హైదరాబాద్‌ వెంగళరావునగర్‌లోని తెలంగాణ రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ శాఖ కమిషనరేట్‌లో శుక్రవారం నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో అవిభక్త కవలలు వీణ, వాణి పాల్గొన్నారు. సహచరులతో కలసి ఆడిపాడారు. బతుకమ్మ సంబురాలు ఊరూవాడా ఉత్సాహంగా సాగుతున్నాయి. భక్తుల మదిలో ఆధ్యాత్మిక సౌరభాలు పంచుతున్నాయి. ఇదే క్రమంలో హైదరాబాద్‌ వెంగళరావునగర్‌లోని తెలంగాణ రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ శాఖ కమిషనరేట్‌లో శుక్రవారం నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో అవిభక్త కవలలు వీణ, వాణి పాల్గొన్నారు. సహచరులతో కలసి ఆడిపాడారు.
5/16
నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సముద్రంలోపల నీటిలో బొమ్మల ప్రదర్శన ఏర్పాటైంది. వీజీపీకి చెందిన కళాకారుల బృందం సముద్ర జీవరాశులకు హాని కలకుండా బొమ్మలను అలంకరించారు. సముద్రపు నీటిలో బొమ్మలు పాడవకుండా అమర్చడం ఇదే మొదటిసారని వీజీపీ గ్రూపు సంస్థల మేనేజింగ్‌ డైరెక్టర్‌ రవిదాస్‌ పేర్కొన్నారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సముద్రంలోపల నీటిలో బొమ్మల ప్రదర్శన ఏర్పాటైంది. వీజీపీకి చెందిన కళాకారుల బృందం సముద్ర జీవరాశులకు హాని కలకుండా బొమ్మలను అలంకరించారు. సముద్రపు నీటిలో బొమ్మలు పాడవకుండా అమర్చడం ఇదే మొదటిసారని వీజీపీ గ్రూపు సంస్థల మేనేజింగ్‌ డైరెక్టర్‌ రవిదాస్‌ పేర్కొన్నారు.
6/16
ఉక్రెయిన్‌లోని నాలుగు ప్రాంతాల విలీనం సందర్భంగా రష్యా రాజధాని మాస్కోలోని రెడ్‌ స్క్వేర్‌ వద్ద శుక్రవారం నిర్వహించిన సంబరాలకు భారీగా తరలివచ్చిన ప్రజలు. ఉక్రెయిన్‌లోని నాలుగు ప్రాంతాల విలీనం సందర్భంగా రష్యా రాజధాని మాస్కోలోని రెడ్‌ స్క్వేర్‌ వద్ద శుక్రవారం నిర్వహించిన సంబరాలకు భారీగా తరలివచ్చిన ప్రజలు.
7/16
శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహబూబ్‌నగర్‌ బ్రాహ్మణవాడలోని శ్రీవాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారు శుక్రవారం మహాలక్ష్మిగా దర్శనమిచ్చారు. పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అమ్మవారిని రూ.5,55,55,555 విలువైన కరెన్సీతో అలంకరించారు. తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. వాసవీమాత గర్భగుడిని, ఆలయ ప్రాంగణాన్నీ కరెన్సీ నోట్లు, నాణేలతో తీర్చిదిద్దారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహబూబ్‌నగర్‌ బ్రాహ్మణవాడలోని శ్రీవాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారు శుక్రవారం మహాలక్ష్మిగా దర్శనమిచ్చారు. పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అమ్మవారిని రూ.5,55,55,555 విలువైన కరెన్సీతో అలంకరించారు. తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. వాసవీమాత గర్భగుడిని, ఆలయ ప్రాంగణాన్నీ కరెన్సీ నోట్లు, నాణేలతో తీర్చిదిద్దారు.
8/16
ఇయన్‌ హరికేన్‌ బీభత్సం కారణంగా ఫ్లోరిడా రాష్ట్రంలోని ఫోర్ట్‌ మయర్స్‌ తీరంలోకి కొట్టుకొచ్చిన పడవలు. ఇయన్‌ హరికేన్‌ బీభత్సం కారణంగా ఫ్లోరిడా రాష్ట్రంలోని ఫోర్ట్‌ మయర్స్‌ తీరంలోకి కొట్టుకొచ్చిన పడవలు.
9/16
దేశంలోనే తొలిసారిగా నగరంలో ప్రతిష్ఠాత్మకంగా జరగనున్న అంతర్జాతీయ ఫార్ములా ఈ కారు రేసింగ్‌ కోసం నెక్లెస్‌ రోడ్డులో 2.8 కిమీ. మార్గం అనుకూలంగా ఉండటంతో హెచ్‌ఎండీఏ అధికారులు ట్రాక్‌ నిర్మాణం మొదలుపెట్టారు. దేశంలోనే తొలిసారిగా నగరంలో ప్రతిష్ఠాత్మకంగా జరగనున్న అంతర్జాతీయ ఫార్ములా ఈ కారు రేసింగ్‌ కోసం నెక్లెస్‌ రోడ్డులో 2.8 కిమీ. మార్గం అనుకూలంగా ఉండటంతో హెచ్‌ఎండీఏ అధికారులు ట్రాక్‌ నిర్మాణం మొదలుపెట్టారు.
10/16
ప్లాస్టిక్‌ వ్యర్ధాలు మూగజీవాలకు ఎంత హానికరమో ఈ చిత్రం చూస్తే తెలుస్తుంది. ఆహారం కోసం ప్లాస్టిక్‌ డబ్బాలో తలదూర్చిందో శునకం. తిన్నాక డబ్బాలో నుంచి తల బయటకు రాక అవస్థలు పడుతోంది. హయత్‌ నగర్‌లో కనిపించిన చిత్రమిది. ప్లాస్టిక్‌ వ్యర్ధాలు మూగజీవాలకు ఎంత హానికరమో ఈ చిత్రం చూస్తే తెలుస్తుంది. ఆహారం కోసం ప్లాస్టిక్‌ డబ్బాలో తలదూర్చిందో శునకం. తిన్నాక డబ్బాలో నుంచి తల బయటకు రాక అవస్థలు పడుతోంది. హయత్‌ నగర్‌లో కనిపించిన చిత్రమిది.
11/16
గచ్చిబౌలి ఇందిరానగర్‌ నుంచి శాంతి సరోవర్‌ రహదారి ఇరుపక్కలా  కొందరు గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారు. వినోదపు డిష్‌ యాంటీనాలను ఎవరికి వారు ఇలా వరుసగా రహదారిలో డివైడర్‌ మధ్య చిన్న చెట్ల చెంత ఏర్పాటు చేసుకున్నారు. గచ్చిబౌలి ఇందిరానగర్‌ నుంచి శాంతి సరోవర్‌ రహదారి ఇరుపక్కలా కొందరు గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారు. వినోదపు డిష్‌ యాంటీనాలను ఎవరికి వారు ఇలా వరుసగా రహదారిలో డివైడర్‌ మధ్య చిన్న చెట్ల చెంత ఏర్పాటు చేసుకున్నారు.
12/16
శంషాబాద్‌ నర్కూడ  సమీపంలోని అమ్మపల్లి దేవాలయ ప్రాంగణంలో శుక్రవారం రాత్రి బతుకమ్మ వేడుకలు జరిగాయి. అమెరికా కాన్సుల్‌ జనరల్‌ జెన్నిఫర్‌ లార్సన్‌తో కలిసి ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. తర్వాత కోనేరులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. శంషాబాద్‌ నర్కూడ సమీపంలోని అమ్మపల్లి దేవాలయ ప్రాంగణంలో శుక్రవారం రాత్రి బతుకమ్మ వేడుకలు జరిగాయి. అమెరికా కాన్సుల్‌ జనరల్‌ జెన్నిఫర్‌ లార్సన్‌తో కలిసి ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. తర్వాత కోనేరులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు.
13/16
హైదరాబాద్‌ నగరంలో ఆలయాలు జగన్మాత స్మరణతో మార్మోగుతున్నాయి. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం నగరంలో పలు ప్రధాన ఆలయాల్లో అమ్మవార్లు ప్రత్యేక అలంకారాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. స్కందమాతగా లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి . హైదరాబాద్‌ నగరంలో ఆలయాలు జగన్మాత స్మరణతో మార్మోగుతున్నాయి. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం నగరంలో పలు ప్రధాన ఆలయాల్లో అమ్మవార్లు ప్రత్యేక అలంకారాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. స్కందమాతగా లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి .
14/16
బంగారు పట్టుచీర, నగదుతో బల్కంపేట ఎల్లమ్మ తల్లి మూలవిరాట్‌ అలంకరణ. బంగారు పట్టుచీర, నగదుతో బల్కంపేట ఎల్లమ్మ తల్లి మూలవిరాట్‌ అలంకరణ.
15/16
మహాలక్ష్మి రూపంలో బల్కంపేట ఎల్లమ్మ మహాలక్ష్మి రూపంలో బల్కంపేట ఎల్లమ్మ
16/16
లలితాదేవి అలంకరణలో జూబ్లీహిల్స్‌ పెద్దమ్మతల్లి. లలితాదేవి అలంకరణలో జూబ్లీహిల్స్‌ పెద్దమ్మతల్లి.

మరిన్ని