News In Pics: చిత్రం చెప్పే సంగతులు- 2 (01-10-22)

Updated : 01 Oct 2022 20:11 IST
1/25
నెల్లూరు శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో అమ్మవారిని బంగారు ఆభరణాలతో అలంకరించారు. నెల్లూరు శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో అమ్మవారిని బంగారు ఆభరణాలతో అలంకరించారు.
2/25
3/25
4/25
పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ హీరోగా, క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం హరిహర వీరమల్లు. ఇప్పటికే కొంత భాగం షూటింగ్‌ పూర్తయింది. ఈ నెల 17 నుంచి మరో షెడ్యూల్‌ మొదలు కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం వర్క్‌షాప్‌ నిర్వహించగా.. పవన్‌కల్యాణ్‌ వివిధ సన్నివేశాల గురించి క్రిష్‌తో చర్చించారు. పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ హీరోగా, క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం హరిహర వీరమల్లు. ఇప్పటికే కొంత భాగం షూటింగ్‌ పూర్తయింది. ఈ నెల 17 నుంచి మరో షెడ్యూల్‌ మొదలు కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం వర్క్‌షాప్‌ నిర్వహించగా.. పవన్‌కల్యాణ్‌ వివిధ సన్నివేశాల గురించి క్రిష్‌తో చర్చించారు.
5/25
6/25
టెస్లా సంస్థ.. తాము తయారు చేసిన హ్యూమనాయిడ్‌ రోబో ‘ఆప్టిమస్‌’ ప్రోటోటైప్‌ను ప్రదర్శించింది. ఈ సందర్భంగా రోబో వేదికపై చేతులు ఊపి సందడి చేసింది. రానున్న కొన్నేళ్లలో దీన్ని పూర్తిస్థాయి రోబోగా తీర్చిదిద్ది మార్కెట్లోకి తేనున్నట్లు ఎలాన్‌ మస్క్‌ తెలిపారు. టెస్లా సంస్థ.. తాము తయారు చేసిన హ్యూమనాయిడ్‌ రోబో ‘ఆప్టిమస్‌’ ప్రోటోటైప్‌ను ప్రదర్శించింది. ఈ సందర్భంగా రోబో వేదికపై చేతులు ఊపి సందడి చేసింది. రానున్న కొన్నేళ్లలో దీన్ని పూర్తిస్థాయి రోబోగా తీర్చిదిద్ది మార్కెట్లోకి తేనున్నట్లు ఎలాన్‌ మస్క్‌ తెలిపారు.
7/25
8/25
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉదయ్‌ ఉమేశ్ లలిత్‌ శనివారం సాయంత్రం తిరుమల శ్రీవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అంతకు ముందు తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ఎ.వి.ధర్మారెడ్డి ఆయనకు లాంఛనంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం సీజేఐకి తీర్థప్రసాదాలు అందజేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉదయ్‌ ఉమేశ్ లలిత్‌ శనివారం సాయంత్రం తిరుమల శ్రీవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అంతకు ముందు తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ఎ.వి.ధర్మారెడ్డి ఆయనకు లాంఛనంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం సీజేఐకి తీర్థప్రసాదాలు అందజేశారు.
9/25
10/25
కూకట్‌పల్లికి చెందిన నాయినేని శ్రీవైష్ణవి, శ్రీనైనా బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా బంగారు బతుకమ్మను తీసుకువచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. తమ తాత సీహెచ్‌ జనార్ధనరావు పండగ కానుకగా దీన్ని ఇచ్చినట్లు వారు తెలిపారు. కిలోన్నర వెండికి పూలడిజైన్‌తో బంగారు పూత వేయించి బతుకమ్మను తయారు చేసినట్లు వివరించారు. బతుకమ్మ ఆడేందుకు వచ్చిన మహిళలు, యువతులు దీన్ని ఆసక్తిగా చూశారు. కూకట్‌పల్లికి చెందిన నాయినేని శ్రీవైష్ణవి, శ్రీనైనా బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా బంగారు బతుకమ్మను తీసుకువచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. తమ తాత సీహెచ్‌ జనార్ధనరావు పండగ కానుకగా దీన్ని ఇచ్చినట్లు వారు తెలిపారు. కిలోన్నర వెండికి పూలడిజైన్‌తో బంగారు పూత వేయించి బతుకమ్మను తయారు చేసినట్లు వివరించారు. బతుకమ్మ ఆడేందుకు వచ్చిన మహిళలు, యువతులు దీన్ని ఆసక్తిగా చూశారు.
11/25
12/25
ఒంగోలులో శనివారం భారీవర్షం కురిసింది. దీంతో ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతం జలమయమై వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.. ఒంగోలులో శనివారం భారీవర్షం కురిసింది. దీంతో ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతం జలమయమై వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు..
13/25
ప్రముఖ హాస్యనటుడు అల్లు రామలింగయ్య జ్ఞాపకార్థం హైదరాబాద్‌లో నిర్మాత అల్లు అరవింద్‌ నిర్మించిన అల్లు స్టూడియోస్‌ ప్రారంభోత్సవ కార్యక్రమం శనివారం వేడుకగా జరిగింది. అల్లు రామలింగయ్య శత జయంతిని పురస్కరించుకొని నిర్వహించిన ఈ కార్యక్రమంలో మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొని స్టూడియోని ప్రారంభించారు. కార్యక్రమంలో అల్లు అర్జున్‌, అల్లు శిరీష్‌, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ప్రముఖ హాస్యనటుడు అల్లు రామలింగయ్య జ్ఞాపకార్థం హైదరాబాద్‌లో నిర్మాత అల్లు అరవింద్‌ నిర్మించిన అల్లు స్టూడియోస్‌ ప్రారంభోత్సవ కార్యక్రమం శనివారం వేడుకగా జరిగింది. అల్లు రామలింగయ్య శత జయంతిని పురస్కరించుకొని నిర్వహించిన ఈ కార్యక్రమంలో మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొని స్టూడియోని ప్రారంభించారు. కార్యక్రమంలో అల్లు అర్జున్‌, అల్లు శిరీష్‌, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
14/25
15/25
16/25
నాని హీరోగా శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘దసరా’. ఈ సినిమా ఫస్ట్‌ సింగిల్‌ ‘ధూమ్‌ధామ్‌ దోస్తానా’ను దసరా కానుకగా ఈ నెల 3న విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇందుకు సంబంధించిన పోస్టర్‌లో నాని గడ్డంతో ఊర మాస్‌ లుక్‌లో కనిపించారు.. నాని హీరోగా శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘దసరా’. ఈ సినిమా ఫస్ట్‌ సింగిల్‌ ‘ధూమ్‌ధామ్‌ దోస్తానా’ను దసరా కానుకగా ఈ నెల 3న విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇందుకు సంబంధించిన పోస్టర్‌లో నాని గడ్డంతో ఊర మాస్‌ లుక్‌లో కనిపించారు..
17/25
వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర నర్సాపూర్‌ నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆమె ముంతాయిపల్లి తండా వద్ద పొలం దున్నుతున్న రైతును కలిసి కష్టాలు తెలుసుకున్నారు. అనంతరం ఆమె సైతం నాగలితో దుక్కి దున్నారు. వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర నర్సాపూర్‌ నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆమె ముంతాయిపల్లి తండా వద్ద పొలం దున్నుతున్న రైతును కలిసి కష్టాలు తెలుసుకున్నారు. అనంతరం ఆమె సైతం నాగలితో దుక్కి దున్నారు.
18/25
19/25
ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా తిరుమల శ్రీవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా తిరుమల శ్రీవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
20/25
తిరుమల శ్రీవారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం స్వామివారు మోహినీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. తిరుమల శ్రీవారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం స్వామివారు మోహినీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
21/25
22/25
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్మ అమ్మవారు మహాలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్మ అమ్మవారు మహాలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
23/25
24/25
దసరా పండగ సందర్భంగా హైదరాబాద్‌ నుంచి గ్రామాలకు వెళ్లే ప్రయాణికులతో గౌలిగూడలోని మహాత్మా గాంధీ బస్‌స్టాప్‌ సందడిగా కనిపించింది. దసరా పండగ సందర్భంగా హైదరాబాద్‌ నుంచి గ్రామాలకు వెళ్లే ప్రయాణికులతో గౌలిగూడలోని మహాత్మా గాంధీ బస్‌స్టాప్‌ సందడిగా కనిపించింది.
25/25

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు