News In Pics: చిత్రం చెప్పే సంగతులు- 1 (02-10-22)

Updated : 02 Oct 2022 11:41 IST
1/15
ఇదేంటీ ట్రాఫిక్‌ పోలీసు ఉండాల్సిన పాయింట్‌లో కొండముచ్చు కూర్చుందని ఆశ్చర్యపోతున్నారా? ఈ సరదా దృశ్యం మెదక్‌ పట్టణంలోని ర.భ. కార్యాలయం వద్ద శనివారం కనిపించగా ‘న్యూస్‌టుడే’ ‘క్లిక్‌’మనిపించింది. దాదాపు అరగంట సేపు తానే ట్రాఫిక్‌ విధులు నిర్వహిస్తునట్లుగా ఆహార్యం ప్రదర్శించడంతో అటుగా వెళ్తున్న వాహనదారులు ఆశ్చర్యంగా చూస్తూ, నవ్వుతూ ముందుకుసాగారు. ఇదేంటీ ట్రాఫిక్‌ పోలీసు ఉండాల్సిన పాయింట్‌లో కొండముచ్చు కూర్చుందని ఆశ్చర్యపోతున్నారా? ఈ సరదా దృశ్యం మెదక్‌ పట్టణంలోని ర.భ. కార్యాలయం వద్ద శనివారం కనిపించగా ‘న్యూస్‌టుడే’ ‘క్లిక్‌’మనిపించింది. దాదాపు అరగంట సేపు తానే ట్రాఫిక్‌ విధులు నిర్వహిస్తునట్లుగా ఆహార్యం ప్రదర్శించడంతో అటుగా వెళ్తున్న వాహనదారులు ఆశ్చర్యంగా చూస్తూ, నవ్వుతూ ముందుకుసాగారు.
2/15
నిజామాబాద్‌ జిల్లా నందిపేట్‌ మండల కేంద్రం పాతూర్‌లో ఓంకార రూపిని సంఘం ఆధ్వర్యంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శనివారం అమ్మవారు లక్ష్మీదేవి రూపంలో దర్శనమిచ్చారు. భక్తులు రూ.1.16 కోట్లతో మండపాన్ని అలంకరించారు. నిజామాబాద్‌ జిల్లా నందిపేట్‌ మండల కేంద్రం పాతూర్‌లో ఓంకార రూపిని సంఘం ఆధ్వర్యంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శనివారం అమ్మవారు లక్ష్మీదేవి రూపంలో దర్శనమిచ్చారు. భక్తులు రూ.1.16 కోట్లతో మండపాన్ని అలంకరించారు.
3/15
పర్యావరణంపై అవగాహన కల్పిస్తూ ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్‌ స్పూన్లతో అస్సాంలోని ధుబ్రిలో ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహం. పర్యావరణంపై అవగాహన కల్పిస్తూ ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్‌ స్పూన్లతో అస్సాంలోని ధుబ్రిలో ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహం.
4/15
అమీర్‌పేటలోని జీహెచ్‌ఎంసీ మైదానంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో చిన్నారులతో కలిసి కోలాటం ఆడుతున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అమీర్‌పేటలోని జీహెచ్‌ఎంసీ మైదానంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో చిన్నారులతో కలిసి కోలాటం ఆడుతున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
5/15
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రం స్టోన్‌హౌస్‌పేటలోని వాసవీ కన్యకాపరమేశ్వరి దేవస్థానం శనివారం స్వర్ణాభరణ శోభతో అలరారింది. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారితోపాటు గర్భాలయాన్ని స్వర్ణాభరణాలతో అలకరించారు. భక్తుల నుంచి సేకరించిన దాదాపు 10 కిలోల స్వర్ణాభరణాలను అలంకరణకు వినియోగించారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రం స్టోన్‌హౌస్‌పేటలోని వాసవీ కన్యకాపరమేశ్వరి దేవస్థానం శనివారం స్వర్ణాభరణ శోభతో అలరారింది. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారితోపాటు గర్భాలయాన్ని స్వర్ణాభరణాలతో అలకరించారు. భక్తుల నుంచి సేకరించిన దాదాపు 10 కిలోల స్వర్ణాభరణాలను అలంకరణకు వినియోగించారు.
6/15
నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కాటేదాన్‌ టీఎన్జీవోస్‌ కాలనీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారిని శనివారం రూ.72లక్షలతో అలంకరించారు. ఐదువందలు, రెండువందలు, వంద, రెండువేల నోట్లతో కళకళలాడింది. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కాటేదాన్‌ టీఎన్జీవోస్‌ కాలనీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారిని శనివారం రూ.72లక్షలతో అలంకరించారు. ఐదువందలు, రెండువందలు, వంద, రెండువేల నోట్లతో కళకళలాడింది.
7/15
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో శనివారం జరిగిన సద్దుల బతుకమ్మ వేడుకలకు గవర్నర్‌ తమిళిసై హాజరయ్యారు. తొలుత ఆలయానికి చేరుకున్న గవర్నర్‌కు కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, ఎస్పీ రాహుల్‌ హెగ్డే పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో శనివారం జరిగిన సద్దుల బతుకమ్మ వేడుకలకు గవర్నర్‌ తమిళిసై హాజరయ్యారు. తొలుత ఆలయానికి చేరుకున్న గవర్నర్‌కు కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, ఎస్పీ రాహుల్‌ హెగ్డే పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు.
8/15
ఇంట్లోని ప్రతి వస్తువూ కళాత్మకంగా, ఆకర్షణీయంగా ఉండాలన్న అభిరుచి ప్రజల్లో పెరిగిపోతోంది. హైదరాబాద్‌ నగర శివారు మహేశ్వరంలో ఓ వ్యక్తి తన విల్లాలో ఇలా చెక్కతో తయారు చేసిన ఫ్యాన్‌ను అమర్చుకున్నారు. వేరే దేశం నుంచి దిగుమతి చేసుకున్న ఈ ఫ్యాన్‌ గదిలోని ఉష్ణోగ్రత, తేమ ఆధారంగా వేగాన్ని హెచ్చుతగ్గులు చేసుకుంటుంది. ఈ ఫ్యాన్‌ ఎంతో ‘చెక్క’గా ఉంది కదూ..! ఇంట్లోని ప్రతి వస్తువూ కళాత్మకంగా, ఆకర్షణీయంగా ఉండాలన్న అభిరుచి ప్రజల్లో పెరిగిపోతోంది. హైదరాబాద్‌ నగర శివారు మహేశ్వరంలో ఓ వ్యక్తి తన విల్లాలో ఇలా చెక్కతో తయారు చేసిన ఫ్యాన్‌ను అమర్చుకున్నారు. వేరే దేశం నుంచి దిగుమతి చేసుకున్న ఈ ఫ్యాన్‌ గదిలోని ఉష్ణోగ్రత, తేమ ఆధారంగా వేగాన్ని హెచ్చుతగ్గులు చేసుకుంటుంది. ఈ ఫ్యాన్‌ ఎంతో ‘చెక్క’గా ఉంది కదూ..!
9/15
దసరా నేపథ్యంలో విద్యార్థులు, వివిధ జిల్లాల నుంచి నగరానికి బతుకుదెరువుకొచ్చిన ప్రజలు శనివారం సొంతూర్లకు పయనమయ్యారు. బోడుప్పల్‌ బస్టాప్‌లో బస్సుల కోసం ప్రయాణికుల ఎదురుచూపులు  దసరా నేపథ్యంలో విద్యార్థులు, వివిధ జిల్లాల నుంచి నగరానికి బతుకుదెరువుకొచ్చిన ప్రజలు శనివారం సొంతూర్లకు పయనమయ్యారు. బోడుప్పల్‌ బస్టాప్‌లో బస్సుల కోసం ప్రయాణికుల ఎదురుచూపులు
10/15
ఉప్పల్‌ రింగు రోడ్డులో ట్రాఫిక్‌ రద్దీ ఉప్పల్‌ రింగు రోడ్డులో ట్రాఫిక్‌ రద్దీ
11/15
జగన్మాత సేవలో భక్తులు తరిస్తున్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నగరంలోని ప్రధాన ఆలయాల్లో అమ్మవార్లు రోజుకో అలంకరణలో దర్శనమిస్తున్నారు. గాజుల అలంకరణలో బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి మూలవిరాట్‌ జగన్మాత సేవలో భక్తులు తరిస్తున్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నగరంలోని ప్రధాన ఆలయాల్లో అమ్మవార్లు రోజుకో అలంకరణలో దర్శనమిస్తున్నారు. గాజుల అలంకరణలో బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి మూలవిరాట్‌
12/15
తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్‌ నగరంలో ప్రతిష్ఠించేందుకు 1500 కిలోల కంచుతో తయారైన 10 అడుగుల ఎత్తున్న ‘ధ్యాన గాంధీ’ విగ్రహం శనివారం గుంటూరు జిల్లా తెనాలి నుంచి తరలివెళ్లింది. పట్టణంలోని వహాబ్‌రోడ్డులో ఉన్న సూర్య శిల్పశాలలో శిల్పులు కాటూరి వేంకటేశ్వరరావు, రవిచంద్రలు విగ్రహాన్ని సహజత్వం ఉట్టిపడేలా రూపొందించారు. మంత్రి గంగుల కమలాకర్‌ ఆధ్వర్యంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు శిల్పులు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్‌ నగరంలో ప్రతిష్ఠించేందుకు 1500 కిలోల కంచుతో తయారైన 10 అడుగుల ఎత్తున్న ‘ధ్యాన గాంధీ’ విగ్రహం శనివారం గుంటూరు జిల్లా తెనాలి నుంచి తరలివెళ్లింది. పట్టణంలోని వహాబ్‌రోడ్డులో ఉన్న సూర్య శిల్పశాలలో శిల్పులు కాటూరి వేంకటేశ్వరరావు, రవిచంద్రలు విగ్రహాన్ని సహజత్వం ఉట్టిపడేలా రూపొందించారు. మంత్రి గంగుల కమలాకర్‌ ఆధ్వర్యంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు శిల్పులు చెప్పారు.
13/15
సికింద్రాబాద్‌ మోండామార్కెట్‌ వెనక గేటు దుస్థితి ఇది.  పక్కనే ఉన్న ఓ గోడను చీల్చుకొని వచ్చిన చెట్టు వేర్లు ఏకంగా మార్కెట్‌ ప్రవేశద్వారం చుట్టూ అల్లుకున్నాయి. వేర్ల ధాటికి ప్రవేశద్వారం గోడలకు పగుళ్లు వచ్చాయి. ఇటీవల కురిసిన వర్షాలకు గేటు గోడలు తడిసి ఎప్పుడు కూలుతుందోనని భయంతో స్థానికులు అటుగా వెళ్లడానికి జంకుతున్నారు. సికింద్రాబాద్‌ మోండామార్కెట్‌ వెనక గేటు దుస్థితి ఇది. పక్కనే ఉన్న ఓ గోడను చీల్చుకొని వచ్చిన చెట్టు వేర్లు ఏకంగా మార్కెట్‌ ప్రవేశద్వారం చుట్టూ అల్లుకున్నాయి. వేర్ల ధాటికి ప్రవేశద్వారం గోడలకు పగుళ్లు వచ్చాయి. ఇటీవల కురిసిన వర్షాలకు గేటు గోడలు తడిసి ఎప్పుడు కూలుతుందోనని భయంతో స్థానికులు అటుగా వెళ్లడానికి జంకుతున్నారు.
14/15
సికింద్రాబాద్‌లో దాండియా ఆడుతున్న సెయింట్‌ జోసెఫ్‌ కళాశాల విద్యార్థినులు సికింద్రాబాద్‌లో దాండియా ఆడుతున్న సెయింట్‌ జోసెఫ్‌ కళాశాల విద్యార్థినులు
15/15
జమ్మూలోని ఓ పాఠశాలలో మహాత్మాగాంధీ చిత్రపటానికి శనివారం విద్యార్థుల పుష్పాంజలి జమ్మూలోని ఓ పాఠశాలలో మహాత్మాగాంధీ చిత్రపటానికి శనివారం విద్యార్థుల పుష్పాంజలి

మరిన్ని