News In Pics: చిత్రం చెప్పే సంగతులు- 2 (02-10-22)

Updated : 02 Oct 2022 20:22 IST
1/40
దక్షిణాఫ్రికా మధ్య గువాహటిలో జరుగుతున్న మ్యాచ్‌కు చిన్నపాటి అంతరాయం కలిగింది. భారత ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌, రోహిత్‌ శర్మ బ్యాటింగ్‌ చేస్తుండగా మైదానంలోకి పాము ప్రవేశించింది. దీంతో మ్యాచ్‌ను కాసేపు నిలిపేశారు. మైదానం సిబ్బంది వచ్చి పామును పట్టుకుని తీసుకెళ్లాక మ్యాచ్‌ తిరిగి ప్రారంభమైంది. దక్షిణాఫ్రికా మధ్య గువాహటిలో జరుగుతున్న మ్యాచ్‌కు చిన్నపాటి అంతరాయం కలిగింది. భారత ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌, రోహిత్‌ శర్మ బ్యాటింగ్‌ చేస్తుండగా మైదానంలోకి పాము ప్రవేశించింది. దీంతో మ్యాచ్‌ను కాసేపు నిలిపేశారు. మైదానం సిబ్బంది వచ్చి పామును పట్టుకుని తీసుకెళ్లాక మ్యాచ్‌ తిరిగి ప్రారంభమైంది.
2/40
ప్రభాస్ హీరోగా ఓంరౌత్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఆదిపురుష్‌’. ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసేందుకు చిత్రబృందం అయోధ్య వెళ్లింది. ఇందులో భాగంగా ప్రభాస్‌, కృతిసనన్‌, ఓంరౌత్‌ తదితరులు అయోధ్య రాముడిని దర్శించుకున్నారు. ప్రభాస్ హీరోగా ఓంరౌత్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఆదిపురుష్‌’. ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసేందుకు చిత్రబృందం అయోధ్య వెళ్లింది. ఇందులో భాగంగా ప్రభాస్‌, కృతిసనన్‌, ఓంరౌత్‌ తదితరులు అయోధ్య రాముడిని దర్శించుకున్నారు.
3/40
4/40
పంజాగుట్టలో ఏర్పాటు చేసిన ఓ నూతన డైమండ్స్‌ షోరూమ్‌ ప్రారంభోత్సవంలో సినీ నటి అనుపమ పరమేశ్వరన్‌ పాల్గొని సందడి చేశారు. ఆమెను చూసేందుకు అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. పంజాగుట్టలో ఏర్పాటు చేసిన ఓ నూతన డైమండ్స్‌ షోరూమ్‌ ప్రారంభోత్సవంలో సినీ నటి అనుపమ పరమేశ్వరన్‌ పాల్గొని సందడి చేశారు. ఆమెను చూసేందుకు అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు.
5/40
6/40
7/40
8/40
ఖైరతాబాద్‌లోని కూడలి వద్ద ఆదివారం సార్వజనిక స్థలాల పొగాకు ముక్త చట్టం అమలు 14వ వార్షికోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా జవహర్‌లాల్‌ నెహ్రూ ఫైన్‌ ఆర్ట్స్‌ కళాశాల విద్యార్థులు ధూమపానం వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ రోడ్డుపై పెయింటింగ్‌ వేశారు. ఈ పెయింటింగ్‌ ఆలోచించే విధంగా ఉండి చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. ఖైరతాబాద్‌లోని కూడలి వద్ద ఆదివారం సార్వజనిక స్థలాల పొగాకు ముక్త చట్టం అమలు 14వ వార్షికోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా జవహర్‌లాల్‌ నెహ్రూ ఫైన్‌ ఆర్ట్స్‌ కళాశాల విద్యార్థులు ధూమపానం వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ రోడ్డుపై పెయింటింగ్‌ వేశారు. ఈ పెయింటింగ్‌ ఆలోచించే విధంగా ఉండి చూపరులను విశేషంగా ఆకట్టుకుంది.
9/40
10/40
హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం నుంచి ట్యాంక్‌బండ్‌ వరకు సోమవారం 3వేల బతుకమ్మలతో ర్యాలీ చేయనున్నారు. ఇందులో భాగంగా ఆదివారం మహిళలు బతుకమ్మలను సిద్ధం చేస్తూ కనిపించారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం నుంచి ట్యాంక్‌బండ్‌ వరకు సోమవారం 3వేల బతుకమ్మలతో ర్యాలీ చేయనున్నారు. ఇందులో భాగంగా ఆదివారం మహిళలు బతుకమ్మలను సిద్ధం చేస్తూ కనిపించారు.
11/40
12/40
13/40
హైదరాబాద్‌లోని హైటెక్‌ సిటీలో హైలైఫ్‌ ఎగ్జిబిషన్‌ నిర్వహించారు. కార్యక్రమంలో బిగ్‌బాస్‌ ఫేమ్‌, నటి అషూరెడ్డి పాల్గొని ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు. హైదరాబాద్‌లోని హైటెక్‌ సిటీలో హైలైఫ్‌ ఎగ్జిబిషన్‌ నిర్వహించారు. కార్యక్రమంలో బిగ్‌బాస్‌ ఫేమ్‌, నటి అషూరెడ్డి పాల్గొని ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.
14/40
15/40
16/40
తెలంగాణలోనే అతిపెద్ద అమ్మవారి విగ్రహం కోఠి ఇస్లామియా బజార్‌లో ఏర్పాటు చేశారు. నవరాత్రుల సందర్భంగా ఇక్కడ ఓ భక్తుడు ఏర్పాటు చేసిన 45 అడుగుల అమ్మవారి మట్టి విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ విగ్రహం నిమజ్జనం విక్టోరియా ప్లే గ్రౌండ్‌లో నీళ్ల ట్యాంకర్లతో చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తెలంగాణలోనే అతిపెద్ద అమ్మవారి విగ్రహం కోఠి ఇస్లామియా బజార్‌లో ఏర్పాటు చేశారు. నవరాత్రుల సందర్భంగా ఇక్కడ ఓ భక్తుడు ఏర్పాటు చేసిన 45 అడుగుల అమ్మవారి మట్టి విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ విగ్రహం నిమజ్జనం విక్టోరియా ప్లే గ్రౌండ్‌లో నీళ్ల ట్యాంకర్లతో చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
17/40
లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి సందర్భంగా ఝార్ఖండ్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అంబా ప్రసాద్‌ ట్విటర్‌లో ఆయనకు సంబంధించిన ఈ అరుదైన ఫొటోను పంచుకొని నివాళి అర్పించారు. లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి సందర్భంగా ఝార్ఖండ్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అంబా ప్రసాద్‌ ట్విటర్‌లో ఆయనకు సంబంధించిన ఈ అరుదైన ఫొటోను పంచుకొని నివాళి అర్పించారు.
18/40
గాంధీ జయంతి సందర్భంగా ‘వోకల్‌ ఫర్‌ లోకల్‌’లో భాగంగా హైదరాబాద్‌లోని హైదర్‌గూడాలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఖాదీ వస్త్రాలను కొనుగోలు చేశారు. గాంధీ జయంతి సందర్భంగా ‘వోకల్‌ ఫర్‌ లోకల్‌’లో భాగంగా హైదరాబాద్‌లోని హైదర్‌గూడాలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఖాదీ వస్త్రాలను కొనుగోలు చేశారు.
19/40
పీవీ సింధు సూరత్‌లోని కిస్‌నా నేచర్‌ పార్కును సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె అక్కడి మకావ్‌ తదితర పక్షులతో పాటు పర్షియన్‌ పిల్లిని ముద్దు చేస్తూ సందడి చేశారు. పీవీ సింధు సూరత్‌లోని కిస్‌నా నేచర్‌ పార్కును సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె అక్కడి మకావ్‌ తదితర పక్షులతో పాటు పర్షియన్‌ పిల్లిని ముద్దు చేస్తూ సందడి చేశారు.
20/40
21/40
22/40
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
23/40
24/40
కర్నూలు జిల్లాలోని ఆదోని పట్టణానికి చెందిన అశోక్‌ శ్రీనాథ్‌ అనే యువకుడు సూక్ష్మ కళారూపంలో చరఖా, కళ్లజోడును రూపొందించాడు. జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా పెన్సిల్‌ మొనపై చరఖా, రాగితీగతో 0.4 మిల్లీమీటర్ల పరిమాణంలో కళ్లజోడును తీర్చిదిద్ది ఆకట్టుకున్నాడు. కర్నూలు జిల్లాలోని ఆదోని పట్టణానికి చెందిన అశోక్‌ శ్రీనాథ్‌ అనే యువకుడు సూక్ష్మ కళారూపంలో చరఖా, కళ్లజోడును రూపొందించాడు. జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా పెన్సిల్‌ మొనపై చరఖా, రాగితీగతో 0.4 మిల్లీమీటర్ల పరిమాణంలో కళ్లజోడును తీర్చిదిద్ది ఆకట్టుకున్నాడు.
25/40
26/40
గాంధీ జయంతి సందర్భంగా సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన 16అడుగుల బాపూజీ విగ్రహాన్ని సీఎం కేసీఆర్‌ ఆవిష్కరించారు. అనంతరం మహాత్ముడి సేవలను గుర్తు చేసి.. విగ్రహానికి నివాళి అర్పించారు. గాంధీ జయంతి సందర్భంగా సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన 16అడుగుల బాపూజీ విగ్రహాన్ని సీఎం కేసీఆర్‌ ఆవిష్కరించారు. అనంతరం మహాత్ముడి సేవలను గుర్తు చేసి.. విగ్రహానికి నివాళి అర్పించారు.
27/40
28/40
విశాఖలో ఏర్పాటు చేసిన ఓ నూతన నగల దుకాణం ప్రారంభోత్సవానికి సినీ నటి నిక్కీ గల్రానీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు. విశాఖలో ఏర్పాటు చేసిన ఓ నూతన నగల దుకాణం ప్రారంభోత్సవానికి సినీ నటి నిక్కీ గల్రానీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.
29/40
30/40
గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ‘బొటానికల్‌ గార్డెన్‌ వాకర్స్‌’ అసోసియేషన్‌ సభ్యులు ‘రన్‌ ఫర్‌ పీస్‌ 2022’ కార్యక్రమం నిర్వహించారు. ఎంపీ సంతోశ్‌కుమార్‌ ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి 10కె రన్‌ను ప్రారంభించారు. అక్కడే గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటారు. గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ‘బొటానికల్‌ గార్డెన్‌ వాకర్స్‌’ అసోసియేషన్‌ సభ్యులు ‘రన్‌ ఫర్‌ పీస్‌ 2022’ కార్యక్రమం నిర్వహించారు. ఎంపీ సంతోశ్‌కుమార్‌ ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి 10కె రన్‌ను ప్రారంభించారు. అక్కడే గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటారు.
31/40
32/40
అమెరికాలో ఇయన్‌ హరికేన్‌ సృష్టించిన బీభత్సానికి నిదర్శనం ఈ చిత్రం. ఫ్లోరిడాలోని ఫోర్ట్‌ మియర్స్‌ నుంచి పైన్‌ ఇలాండ్‌కు వెళ్లే వంతెన పూర్తిగా దెబ్బతింది. దీంతో ఇక్కడికి చేరుకోవాలంటే జల, వాయు మార్గంలో మాత్రమే వెళ్లాల్సిన అగత్యం ఏర్పడింది. అమెరికాలో ఇయన్‌ హరికేన్‌ సృష్టించిన బీభత్సానికి నిదర్శనం ఈ చిత్రం. ఫ్లోరిడాలోని ఫోర్ట్‌ మియర్స్‌ నుంచి పైన్‌ ఇలాండ్‌కు వెళ్లే వంతెన పూర్తిగా దెబ్బతింది. దీంతో ఇక్కడికి చేరుకోవాలంటే జల, వాయు మార్గంలో మాత్రమే వెళ్లాల్సిన అగత్యం ఏర్పడింది.
33/40
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి సన్నిధిలో నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నేడు ఐశ్వర్యలక్ష్మి అలంకారంలో లక్ష్మీతాయారు అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి సన్నిధిలో నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నేడు ఐశ్వర్యలక్ష్మి అలంకారంలో లక్ష్మీతాయారు అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు.
34/40
హైదరాబాద్‌ బోయిన్‌పల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్లో టీపీసీసీ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ ఎంపీ వీహెచ్‌ తదితరులు ఈ కార్యక్రమంలోని పాల్గొని మహాత్ముడి విగ్రహం వద్ద నివాళులర్పించారు.  
హైదరాబాద్‌ బోయిన్‌పల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్లో టీపీసీసీ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ ఎంపీ వీహెచ్‌ తదితరులు ఈ కార్యక్రమంలోని పాల్గొని మహాత్ముడి విగ్రహం వద్ద నివాళులర్పించారు.
35/40
తన నివాసంలో మహాత్ముడి చిత్రపటం వద్ద పూలు చల్లి నివాళులర్పిస్తున్న తెదేపా అధినేత చంద్రబాబునాయుడు తన నివాసంలో మహాత్ముడి చిత్రపటం వద్ద పూలు చల్లి నివాళులర్పిస్తున్న తెదేపా అధినేత చంద్రబాబునాయుడు
36/40
ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నేడు సరస్వతీదేవి అలంకారంలో కనకదుర్గమ్మ దర్శనమిచ్చారు. భక్తులు భారీగా తరలిరావడంతో వేకువజాము నుంచే క్యూలైన్లు నిండిపోయాయి. ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నేడు సరస్వతీదేవి అలంకారంలో కనకదుర్గమ్మ దర్శనమిచ్చారు. భక్తులు భారీగా తరలిరావడంతో వేకువజాము నుంచే క్యూలైన్లు నిండిపోయాయి.
37/40
38/40
39/40
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కనుల పండువగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం హనుమంత వాహనసేవను వైభవంగా నిర్వహించారు. తిరుమాడ వీధుల్లో నిర్వహించిన ఈ సేవలో మలయప్పస్వామి కోదండ రాముడి అవతారంలో హనుమంత వాహనంపై విహరిస్తూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. సేవను తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు.  తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కనుల పండువగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం హనుమంత వాహనసేవను వైభవంగా నిర్వహించారు. తిరుమాడ వీధుల్లో నిర్వహించిన ఈ సేవలో మలయప్పస్వామి కోదండ రాముడి అవతారంలో హనుమంత వాహనంపై విహరిస్తూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. సేవను తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. 
40/40

మరిన్ని

ap-districts
ts-districts