News In Pics: చిత్రం చెప్పే సంగతులు- 1 (03-10-22)

Updated : 03 Oct 2022 11:01 IST
1/23
తెల్లారక ముందే.. తెప్పలపై జలాశయంలోకి వెళ్తారు.. చేపల వేటలో భాగంగా నీటిలో వలలు వేసి వస్తారు.. రెండు గంటల విరామం ఇచ్చి మళ్లీ వేసిన వలల వద్దకు వెళ్లి చిక్కిన చేపల్ని తెచ్చుకుంటారు.. ఈ క్రమంలో గాలులతో అలలు వస్తే.. బతుకు జీవుడా అంటూ వెనుదిరుగుతారు.. ఇదీ ఖమ్మం జిల్లా పాలేరు జలాశయంలో మత్స్యకారుల బతుకు చిత్రం.. 4,540 ఎకరాల విస్తీర్ణమున్న జలాశయంలో 1,200 మంది మత్స్య సహకార సంఘం సభ్యులు చేపలు, రొయ్యల వేట ఆధారంగా జీవనం సాగిస్తున్నారు. 8 నెలలపాటు పెంపకం చేపట్టి ఏడాదిలో నాలుగు నెలలపాటు వేట సాగిస్తారు. తెల్లారక ముందే.. తెప్పలపై జలాశయంలోకి వెళ్తారు.. చేపల వేటలో భాగంగా నీటిలో వలలు వేసి వస్తారు.. రెండు గంటల విరామం ఇచ్చి మళ్లీ వేసిన వలల వద్దకు వెళ్లి చిక్కిన చేపల్ని తెచ్చుకుంటారు.. ఈ క్రమంలో గాలులతో అలలు వస్తే.. బతుకు జీవుడా అంటూ వెనుదిరుగుతారు.. ఇదీ ఖమ్మం జిల్లా పాలేరు జలాశయంలో మత్స్యకారుల బతుకు చిత్రం.. 4,540 ఎకరాల విస్తీర్ణమున్న జలాశయంలో 1,200 మంది మత్స్య సహకార సంఘం సభ్యులు చేపలు, రొయ్యల వేట ఆధారంగా జీవనం సాగిస్తున్నారు. 8 నెలలపాటు పెంపకం చేపట్టి ఏడాదిలో నాలుగు నెలలపాటు వేట సాగిస్తారు.
2/23
సాధారణంగా పామాయిల్‌ మొక్కలు భూమి నుంచి రెండు అడుగుల ఎత్తు పెరిగాక మొదలు భాగంలో గెలలు వేస్తాయి. కానీ.. అశ్వారావుపేటకు చెందిన కలపాల నాగయ్య అనే రైతు పొలంలోని ఓ ఆయిల్‌పాం చెట్టు మొదలు భాగం మూడేళ్లయినా పైకి పెరగలేదు. నేలను ఆనుకున్న ఆ మొదలు భాగంలోనే ఇలా గెలలు వేసిందా చెట్టు. 13 వరకు నాణ్యమైన గెలలు వచ్చాయి. వీటిని స్థానిక రైతులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. సాధారణంగా పామాయిల్‌ మొక్కలు భూమి నుంచి రెండు అడుగుల ఎత్తు పెరిగాక మొదలు భాగంలో గెలలు వేస్తాయి. కానీ.. అశ్వారావుపేటకు చెందిన కలపాల నాగయ్య అనే రైతు పొలంలోని ఓ ఆయిల్‌పాం చెట్టు మొదలు భాగం మూడేళ్లయినా పైకి పెరగలేదు. నేలను ఆనుకున్న ఆ మొదలు భాగంలోనే ఇలా గెలలు వేసిందా చెట్టు. 13 వరకు నాణ్యమైన గెలలు వచ్చాయి. వీటిని స్థానిక రైతులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.
3/23
ఆదివారం అర్ధరాత్రి కరీంనగర్‌ మహాశక్తి ఆలయంలో దాండియా నృత్యం చేస్తున్న సినీనటులు రాజశేఖర్, జీవిత. ఆదివారం అర్ధరాత్రి కరీంనగర్‌ మహాశక్తి ఆలయంలో దాండియా నృత్యం చేస్తున్న సినీనటులు రాజశేఖర్, జీవిత.
4/23
గార్లదిన్నె మండలం పెనకచర్ల జలాశయం సమీప ప్రాంతాల్లో మేత బాగా దొరుకుతుండటం వల్ల అనంత జిల్లా నలుమూలల నుంచే కాకుండా సరిహద్దు రాష్ట్రం కర్ణాటకలోని వివిధ ప్రాంతాల నుంచి గొర్రెల కాపరులు కుటుంబాలతో వచ్చి వర్షాకాలంలో ఇక్కడ గుడారాలు ఏర్పాటు చేసుకుంటారు. విద్యుత్ కోసం ప్రతి గుడారానికి ఒక సౌరపలకం ఏర్పాటు చేసుకున్నారు. దాంతో బల్బు వెలిగించుకోవటమే కాకుండా చరవాణుల ఛార్జింగ్‌కు సైతం ఉపయోగించుకుంటున్నారు. సౌరవిద్యుత్తు కాంతుల వల్ల అటవీ జంతువుల నుంచి తమకు, గొర్రెలకు బెడద తప్పిందని కాపరులు తెలిపారు.  గార్లదిన్నె మండలం పెనకచర్ల జలాశయం సమీప ప్రాంతాల్లో మేత బాగా దొరుకుతుండటం వల్ల అనంత జిల్లా నలుమూలల నుంచే కాకుండా సరిహద్దు రాష్ట్రం కర్ణాటకలోని వివిధ ప్రాంతాల నుంచి గొర్రెల కాపరులు కుటుంబాలతో వచ్చి వర్షాకాలంలో ఇక్కడ గుడారాలు ఏర్పాటు చేసుకుంటారు. విద్యుత్ కోసం ప్రతి గుడారానికి ఒక సౌరపలకం ఏర్పాటు చేసుకున్నారు. దాంతో బల్బు వెలిగించుకోవటమే కాకుండా చరవాణుల ఛార్జింగ్‌కు సైతం ఉపయోగించుకుంటున్నారు. సౌరవిద్యుత్తు కాంతుల వల్ల అటవీ జంతువుల నుంచి తమకు, గొర్రెలకు బెడద తప్పిందని కాపరులు తెలిపారు.
5/23
సికింద్రాబాద్‌ మహాకాళి ఆలయం వద్ద బతుకమ్మ వేడుకల్లో భాగంగా ఆదివారం రాత్రి జోగిని శ్యామలతో కలిసి ఆటలు ఆడుతున్న ఎమ్మెల్సీ కవిత. సికింద్రాబాద్‌ మహాకాళి ఆలయం వద్ద బతుకమ్మ వేడుకల్లో భాగంగా ఆదివారం రాత్రి జోగిని శ్యామలతో కలిసి ఆటలు ఆడుతున్న ఎమ్మెల్సీ కవిత.
6/23
2023లో గిన్నిస్‌ రికార్డు లక్ష్యంగా కోకాపేట వద్ద నిర్మాణంలో ఉన్న 23 కిలోమీటర్ల సైకిల్‌ ట్రాక్‌ను ఆదివారం హైదరాబాద్‌ సైకిల్‌ గ్రూప్‌ బాధ్యుడు రవీందర్‌ నేతృత్వంలోని పలువురు సైక్లిస్టులు సందర్శించారు. ట్రాక్‌కు సోలార్‌ పైకప్పు ఏర్పాటు చేస్తున్నందుకు మంత్రి కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలియజేశారు. 2023లో గిన్నిస్‌ రికార్డు లక్ష్యంగా కోకాపేట వద్ద నిర్మాణంలో ఉన్న 23 కిలోమీటర్ల సైకిల్‌ ట్రాక్‌ను ఆదివారం హైదరాబాద్‌ సైకిల్‌ గ్రూప్‌ బాధ్యుడు రవీందర్‌ నేతృత్వంలోని పలువురు సైక్లిస్టులు సందర్శించారు. ట్రాక్‌కు సోలార్‌ పైకప్పు ఏర్పాటు చేస్తున్నందుకు మంత్రి కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలియజేశారు.
7/23
దసరా పండగకు సొంతూళ్లకు వెళ్లేందుకు తెలుగు రాష్ట్రాల ప్రజలు భాగ్యనగరం నుంచి పల్లెబాట పట్టారు. హైదరాబాద్‌ - విజయవాడ జాతీయ రహదారిపై ఆదివారం వాహనాలు బారులుతీరాయి. శనివారం ఒక్కరోజే 46 వేల వాహనాలు పంతంగి టోల్‌ప్లాజా మీదుగా రాకపోకలు సాగించాయి. దసరా పండగకు సొంతూళ్లకు వెళ్లేందుకు తెలుగు రాష్ట్రాల ప్రజలు భాగ్యనగరం నుంచి పల్లెబాట పట్టారు. హైదరాబాద్‌ - విజయవాడ జాతీయ రహదారిపై ఆదివారం వాహనాలు బారులుతీరాయి. శనివారం ఒక్కరోజే 46 వేల వాహనాలు పంతంగి టోల్‌ప్లాజా మీదుగా రాకపోకలు సాగించాయి.
8/23
దసరా నవరాత్రుల నేపథ్యంలో మట్టితో మలచిన 45 అడుగుల దుర్గాదేవి భారీ విగ్రహాన్ని హైదరాబాద్‌లోని కోఠి ఇసామియాబజార్‌లో నెలకొల్పారు. ఇంతెత్తు ఈ ప్రతిమను విక్టోరియా క్రీడాస్థలంలో నీళ్ల ట్యాంకర్ల సాయంతో నిమజ్జనం చేయనున్నారు. దసరా నవరాత్రుల నేపథ్యంలో మట్టితో మలచిన 45 అడుగుల దుర్గాదేవి భారీ విగ్రహాన్ని హైదరాబాద్‌లోని కోఠి ఇసామియాబజార్‌లో నెలకొల్పారు. ఇంతెత్తు ఈ ప్రతిమను విక్టోరియా క్రీడాస్థలంలో నీళ్ల ట్యాంకర్ల సాయంతో నిమజ్జనం చేయనున్నారు.
9/23
శిల్పారామంలో ఆదివారం సాయంత్రం కళాప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. పవన్‌ శిష్యబృందం ప్రదర్శించిన భవానికౌతం, పుష్పాంజలి, నవజనార్ధన పారిజాతం అలరించాయి. శిల్పారామంలో ఆదివారం సాయంత్రం కళాప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. పవన్‌ శిష్యబృందం ప్రదర్శించిన భవానికౌతం, పుష్పాంజలి, నవజనార్ధన పారిజాతం అలరించాయి.
10/23
గాంధీ ఆసుపత్రి చెంత ఏర్పాటు చేసిన మహాత్ముని విగ్రహావిష్కరణ అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జ్ఞాపిక అందజేస్తున్న పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్, చిత్రంలో మంత్రులు హరీశ్‌రావు, తలసాని, ఉప్పల శ్రీనివాస్‌గుప్తా, దేశపతి శ్రీనివాస్‌. గాంధీ ఆసుపత్రి చెంత ఏర్పాటు చేసిన మహాత్ముని విగ్రహావిష్కరణ అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జ్ఞాపిక అందజేస్తున్న పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్, చిత్రంలో మంత్రులు హరీశ్‌రావు, తలసాని, ఉప్పల శ్రీనివాస్‌గుప్తా, దేశపతి శ్రీనివాస్‌.
11/23
12/23
శిఖరాల సోయగం.. కొండ వాగుల సందడి.. కనుచూపు మేర పచ్చదనం.. మధ్యలో వంపులు తిరుగుతూ కనిపించే అందమైన రోడ్లు.. అక్కడక్కడా దర్శనమిచ్చే గిరిజనులు.. వారి ఇళ్లు.. ఈ దృశ్యాలను చూడాలంటే రెండు కళ్లూ చాలవనుకోండి.. సాలూరు మండలంలోని కొఠియా ప్రాంతానికి వెళ్లే మార్గంలో ఈ అద్భుతాలు కనిపిస్తాయి. ఇటీవల వర్షాలకు అక్కడి కొండలన్నీ పచ్చదనంతో నిండి ఇలా ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. శిఖరాల సోయగం.. కొండ వాగుల సందడి.. కనుచూపు మేర పచ్చదనం.. మధ్యలో వంపులు తిరుగుతూ కనిపించే అందమైన రోడ్లు.. అక్కడక్కడా దర్శనమిచ్చే గిరిజనులు.. వారి ఇళ్లు.. ఈ దృశ్యాలను చూడాలంటే రెండు కళ్లూ చాలవనుకోండి.. సాలూరు మండలంలోని కొఠియా ప్రాంతానికి వెళ్లే మార్గంలో ఈ అద్భుతాలు కనిపిస్తాయి. ఇటీవల వర్షాలకు అక్కడి కొండలన్నీ పచ్చదనంతో నిండి ఇలా ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.
13/23
అరసవల్లి సూర్యనారాయణస్వామి మూలవిరాట్టును భానుడి కిరణాలు వరుసగా రెండోరోజు ఆదివారం కూడా పాక్షికంగా తాకాయి. ఉదయం 6.04 గంటలకు కిరణస్పర్శ ప్రారంభమై 6.08 గంటల వరకు నాలుగు నిమిషాలపాటు కొనసాగింది. అరసవల్లి సూర్యనారాయణస్వామి మూలవిరాట్టును భానుడి కిరణాలు వరుసగా రెండోరోజు ఆదివారం కూడా పాక్షికంగా తాకాయి. ఉదయం 6.04 గంటలకు కిరణస్పర్శ ప్రారంభమై 6.08 గంటల వరకు నాలుగు నిమిషాలపాటు కొనసాగింది.
14/23
సోమాజిగూడలోని హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం బతుకమ్మ వేడుకలు జరిగాయి. మంత్రి  సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొని మహిళా పాత్రికేయులతో కలిసి ఆడిపాడారు. సోమాజిగూడలోని హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం బతుకమ్మ వేడుకలు జరిగాయి. మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొని మహిళా పాత్రికేయులతో కలిసి ఆడిపాడారు.
15/23
గాంధీనగర్‌ ఆంధ్రా కేఫ్‌ చౌరస్తాలో భాజపా నేతలు విజయశాంతి, కె.లక్ష్మణ్‌ తదితరుల దాండియా గాంధీనగర్‌ ఆంధ్రా కేఫ్‌ చౌరస్తాలో భాజపా నేతలు విజయశాంతి, కె.లక్ష్మణ్‌ తదితరుల దాండియా
16/23
కారెక్కిన ఈ సైకిళ్లు చూస్తే.. కొని తీసుకెళుతున్నారేమో అనిపిస్తోంది కదూ. నానక్‌రామ్‌గూడలోని ఓఆర్‌ఆర్‌పై ఏర్పాటైన ట్రాక్‌కు ఔత్సాహిక సైక్లిస్టులు ఆదివారం వెళ్లి చెమటలు కక్కేలా సైకిళ్లను తొక్కిన అనంతరం ఇలా ఇళ్లకు తీసుకెళుతూ గచ్చిబౌలిలో కనిపించారు కారెక్కిన ఈ సైకిళ్లు చూస్తే.. కొని తీసుకెళుతున్నారేమో అనిపిస్తోంది కదూ. నానక్‌రామ్‌గూడలోని ఓఆర్‌ఆర్‌పై ఏర్పాటైన ట్రాక్‌కు ఔత్సాహిక సైక్లిస్టులు ఆదివారం వెళ్లి చెమటలు కక్కేలా సైకిళ్లను తొక్కిన అనంతరం ఇలా ఇళ్లకు తీసుకెళుతూ గచ్చిబౌలిలో కనిపించారు
17/23
చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా దసరా నవరాత్రుల చివరి రోజు రావణ సంహారం నిర్వహిస్తారు. పాతబస్తీలో నవీన్‌ అనే కళాకారుడు రావణుడి బొమ్మలు సిద్ధంచేస్తున్నారు. అడుగుకు రూ.500చొప్పున అడిగిన సైజులో రూపొందిస్తున్నట్లు తెలిపారు.  చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా దసరా నవరాత్రుల చివరి రోజు రావణ సంహారం నిర్వహిస్తారు. పాతబస్తీలో నవీన్‌ అనే కళాకారుడు రావణుడి బొమ్మలు సిద్ధంచేస్తున్నారు. అడుగుకు రూ.500చొప్పున అడిగిన సైజులో రూపొందిస్తున్నట్లు తెలిపారు.
18/23
 ఏపీలోని ఉమ్మడి ప.గో. జిల్లా కైకలూరుకు చెందిన తేజస్విని బీటెక్‌(మెకానికల్‌), ఎంటెక్‌ పూర్తి చేశారు. వివాహమయ్యాక నగరానికి వచ్చారు. ఇద్దరు సంతానం ఉన్నారు. టీఎస్‌ఆర్టీసీలో భారీ వాహనాలు నడిపే శిక్షణ ఇస్తున్నారని తెలియడంతో శిక్షణ కళాశాల ప్రిన్సిపల్‌ సుచరితను సంప్రదించారు. మేడ్చల్‌ జిల్లా హకీంపేటలోని శిక్షణ కేంద్రంలో నెల రోజులపాటు సాధన చేశారు. ఇప్పుడు ఏకంగా బస్సు నడిపేస్తున్నారు. తొలుత కొంచెం భయమేసినా, ఇప్పుడు నడిపేస్తున్నట్లు పేర్కొన్నారు. ఏపీలోని ఉమ్మడి ప.గో. జిల్లా కైకలూరుకు చెందిన తేజస్విని బీటెక్‌(మెకానికల్‌), ఎంటెక్‌ పూర్తి చేశారు. వివాహమయ్యాక నగరానికి వచ్చారు. ఇద్దరు సంతానం ఉన్నారు. టీఎస్‌ఆర్టీసీలో భారీ వాహనాలు నడిపే శిక్షణ ఇస్తున్నారని తెలియడంతో శిక్షణ కళాశాల ప్రిన్సిపల్‌ సుచరితను సంప్రదించారు. మేడ్చల్‌ జిల్లా హకీంపేటలోని శిక్షణ కేంద్రంలో నెల రోజులపాటు సాధన చేశారు. ఇప్పుడు ఏకంగా బస్సు నడిపేస్తున్నారు. తొలుత కొంచెం భయమేసినా, ఇప్పుడు నడిపేస్తున్నట్లు పేర్కొన్నారు.
19/23
20/23
 ‘సండే ఫన్‌డే’ సందర్భంగా ట్యాంక్‌బండ్‌కు ఆదివారం నగరవాసులు అధిక సంఖ్యలో తరలిచ్చారు. విద్యుత్తు దీపాల  వెలుగుల మధ్య సందడి చేశారు. ‘సండే ఫన్‌డే’ సందర్భంగా ట్యాంక్‌బండ్‌కు ఆదివారం నగరవాసులు అధిక సంఖ్యలో తరలిచ్చారు. విద్యుత్తు దీపాల వెలుగుల మధ్య సందడి చేశారు.
21/23
 వరంగల్‌ మహా నగరంలోని రోడ్డు సోయగమిది. హనుమకొండలోని పెద్దమ్మ గడ్డ సమీపంలో అక్షర కాలనీకి వెళ్లే రోడ్డు దుస్థితి ఇది. ప్రజలు నిత్యం నరకం అనుభవిస్తున్నారు. చిరుజల్లులకే బురద మయంగా మారుతోంది. వరంగల్‌ మహా నగరంలోని రోడ్డు సోయగమిది. హనుమకొండలోని పెద్దమ్మ గడ్డ సమీపంలో అక్షర కాలనీకి వెళ్లే రోడ్డు దుస్థితి ఇది. ప్రజలు నిత్యం నరకం అనుభవిస్తున్నారు. చిరుజల్లులకే బురద మయంగా మారుతోంది.
22/23
23/23
వరంగల్‌ కాశీబుగ్గ చౌరస్తా ఆదివారం పూల విక్రయాలతో కిక్కిరిసింది. సోమవారం సద్దుల బతుకమ్మను పురస్కరించుకుని బంతి, గునుగు, కల్వ పూలను విరివిగా కొన్నారు. వరంగల్‌ కాశీబుగ్గ చౌరస్తా ఆదివారం పూల విక్రయాలతో కిక్కిరిసింది. సోమవారం సద్దుల బతుకమ్మను పురస్కరించుకుని బంతి, గునుగు, కల్వ పూలను విరివిగా కొన్నారు.

మరిన్ని

ap-districts
ts-districts