News In Pics: చిత్రం చెప్పే సంగతులు- 1 (04-10-22)

Updated : 04 Oct 2022 07:28 IST
1/30
గండిపేట నుంచి ఎన్‌సీసీ మీదుగా కోకాపేట వెళ్లే సర్వీస్‌రోడ్డులో వీధిదీపాలు లేక అంధకారంగా మారింది. మలుపులున్న ఈ దారిలో వెళ్లాలంటే జనం జంకుతున్నారు. గండిపేట నుంచి ఎన్‌సీసీ మీదుగా కోకాపేట వెళ్లే సర్వీస్‌రోడ్డులో వీధిదీపాలు లేక అంధకారంగా మారింది. మలుపులున్న ఈ దారిలో వెళ్లాలంటే జనం జంకుతున్నారు.
2/30
సద్దుల బతుకమ్మ పండగ నేపథ్యంలో.. గుడిమల్కాపూర్‌ పూల మార్కెట్‌లో సోమవారం విపరీతమైన రద్దీ ఏర్పడింది. పూల విక్రయాలు, కొనుగోలు కోసం రైతులు, ప్రజలు మార్కెట్‌కి రావడంతో అడుగు వేయలేని పరిస్థితి నెలకొంది. సద్దుల బతుకమ్మ పండగ నేపథ్యంలో.. గుడిమల్కాపూర్‌ పూల మార్కెట్‌లో సోమవారం విపరీతమైన రద్దీ ఏర్పడింది. పూల విక్రయాలు, కొనుగోలు కోసం రైతులు, ప్రజలు మార్కెట్‌కి రావడంతో అడుగు వేయలేని పరిస్థితి నెలకొంది.
3/30
4/30
కేసీఆర్‌ జాతీయ పార్టీని స్వాగతిస్తూ ఒడిశాలోని పురి తీరంలో ఏర్పాటు చేసిన సైకత శిల్పం. కేసీఆర్‌ జాతీయ పార్టీని స్వాగతిస్తూ ఒడిశాలోని పురి తీరంలో ఏర్పాటు చేసిన సైకత శిల్పం.
5/30
సిద్దిపేటలో సోమవారం సద్దుల బతుకమ్మ సంబురం అంబరాన్నంటింది. కోమటిచెరువు (మినీ ట్యాంకుబండ్‌) ప్రాంగణం జనసంద్రంగా మారింది. రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు కుటుంబ సమేతంగా వేడుకలో పాల్గొన్నారు. ఆయన సరదాగా బోటును నడిపించగా సతీమణి శ్రీనిత, కుమార్తె వైష్ణవి సహా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, పోలీసు కమిషనర్‌ శ్వేత, ఎమ్మెల్సీ ఫారూఖ్‌ హుస్సేన్‌, బల్దియా అధ్యక్షురాలు మంజుల అందులో కూర్చున్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు.. సతీమణి శ్రీనితకు తామర పుష్పం అందించి శుభాకాంక్షలు తెలిపారు. సిద్దిపేటలో సోమవారం సద్దుల బతుకమ్మ సంబురం అంబరాన్నంటింది. కోమటిచెరువు (మినీ ట్యాంకుబండ్‌) ప్రాంగణం జనసంద్రంగా మారింది. రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు కుటుంబ సమేతంగా వేడుకలో పాల్గొన్నారు. ఆయన సరదాగా బోటును నడిపించగా సతీమణి శ్రీనిత, కుమార్తె వైష్ణవి సహా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, పోలీసు కమిషనర్‌ శ్వేత, ఎమ్మెల్సీ ఫారూఖ్‌ హుస్సేన్‌, బల్దియా అధ్యక్షురాలు మంజుల అందులో కూర్చున్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు.. సతీమణి శ్రీనితకు తామర పుష్పం అందించి శుభాకాంక్షలు తెలిపారు.
6/30
శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం జూబ్లీహిల్స్‌ పెద్దమ్మ తల్లి, బల్కంపేట ఎల్లమ్మ, సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాకాళి దుర్గాదేవిగా దర్శనమిచ్చారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం జూబ్లీహిల్స్‌ పెద్దమ్మ తల్లి, బల్కంపేట ఎల్లమ్మ, సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాకాళి దుర్గాదేవిగా దర్శనమిచ్చారు.
7/30
8/30
9/30
లక్ష గాజుల అలంకరణలో సనత్‌నగర్‌ కనకదుర్గ. లక్ష గాజుల అలంకరణలో సనత్‌నగర్‌ కనకదుర్గ.
10/30
చందానగర్‌లో మాగంటి శ్రీనివాస్‌ ఇంట్లో ఆదివారం రాత్రి ఒకేసారి 11 బ్రహ్మ కమలాలు విరబూశాయి. గతేడాది 3 రోజుల్లో 13 పూలు పూయగా ఈసారి ఒకేరోజు అత్యధికంగా పుష్పాలు వికసించడంతో కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. చందానగర్‌లో మాగంటి శ్రీనివాస్‌ ఇంట్లో ఆదివారం రాత్రి ఒకేసారి 11 బ్రహ్మ కమలాలు విరబూశాయి. గతేడాది 3 రోజుల్లో 13 పూలు పూయగా ఈసారి ఒకేరోజు అత్యధికంగా పుష్పాలు వికసించడంతో కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.
11/30
నగరంలో సద్దుల బతుకమ్మ వేడుకలు సోమవారం అంబరాన్ని తాకాయి. వాడవాడలా జరిగిన సంబరాల్లో మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పూలతో అందంగా పేర్చిన బతుకమ్మల చుట్టూ చేరి ఆడిపాడారు. రాష్ట్ర ప్రభుత్వం-భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియం నుంచి ట్యాంక్‌బండ్‌ వరకు అతివలు బతుకమ్మలతో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం అక్కడ నిమజ్జనం చేశారు. సాగర్‌ పరిసరాల్లో బాణసంచా వెలుగులు ఆకట్టుకున్నాయి. వేర్వేరు చోట్ల జరిగిన కార్యక్రమాల్లో ప్రముఖులు పాల్గొన్నారు. నగరంలో సద్దుల బతుకమ్మ వేడుకలు సోమవారం అంబరాన్ని తాకాయి. వాడవాడలా జరిగిన సంబరాల్లో మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పూలతో అందంగా పేర్చిన బతుకమ్మల చుట్టూ చేరి ఆడిపాడారు. రాష్ట్ర ప్రభుత్వం-భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియం నుంచి ట్యాంక్‌బండ్‌ వరకు అతివలు బతుకమ్మలతో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం అక్కడ నిమజ్జనం చేశారు. సాగర్‌ పరిసరాల్లో బాణసంచా వెలుగులు ఆకట్టుకున్నాయి. వేర్వేరు చోట్ల జరిగిన కార్యక్రమాల్లో ప్రముఖులు పాల్గొన్నారు.
12/30
హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేస్తున్న వనిత. హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేస్తున్న వనిత.
13/30
ఎల్బీస్టేడియం నుంచి లిబర్టీ మీదుగా ట్యాంక్‌ బండ్‌కు అతివల ప్రదర్శన. ఎల్బీస్టేడియం నుంచి లిబర్టీ మీదుగా ట్యాంక్‌ బండ్‌కు అతివల ప్రదర్శన.
14/30
ఎల్బీ స్టేడియంలో బతుకమ్మలతో ముస్లిం మహిళలు. ఎల్బీ స్టేడియంలో బతుకమ్మలతో ముస్లిం మహిళలు.
15/30
బతుకమ్మతో యువతి. బతుకమ్మతో యువతి.
16/30
కూకట్‌పల్లి ఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో  సద్దుల బతుకమ్మ ఆడుతున్న మహిళలు. కూకట్‌పల్లి ఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో సద్దుల బతుకమ్మ ఆడుతున్న మహిళలు.
17/30
బ్రిటన్‌కు చెందిన డూడుల్‌ కళాకారుడు సామ్‌ కాక్స్‌.. ఇంగ్లండ్‌లోని తన పన్నెండు గదుల భవనాన్ని స్వయంగా గీసిన కార్టూన్‌ డూడుల్స్‌తో అందంగా తయారు చేశాడు. సోమవారం తన భార్య అలెనాతో ఇలా చిత్రాలు దిగాడు. బ్రిటన్‌కు చెందిన డూడుల్‌ కళాకారుడు సామ్‌ కాక్స్‌.. ఇంగ్లండ్‌లోని తన పన్నెండు గదుల భవనాన్ని స్వయంగా గీసిన కార్టూన్‌ డూడుల్స్‌తో అందంగా తయారు చేశాడు. సోమవారం తన భార్య అలెనాతో ఇలా చిత్రాలు దిగాడు.
18/30
19/30
దుర్గామాత పూజ, దసరా పండుగను పురస్కరించుకుని సోమవారం బిహార్‌ రాజధాని పట్నా నుంచి సొంతూర్లకు వెళ్తున్న వారితో కిక్కిరిసిన రైలు దుర్గామాత పూజ, దసరా పండుగను పురస్కరించుకుని సోమవారం బిహార్‌ రాజధాని పట్నా నుంచి సొంతూర్లకు వెళ్తున్న వారితో కిక్కిరిసిన రైలు
20/30
ఇది అమెరికాలో భారీ గుమ్మడికాయ. బరువు 1,158.47 కిలోలు (2,554 పౌండ్లు). ఎమ్మెట్‌ ఆండ్రూ, స్టీవ్‌ ఆండ్రూజ్‌లు న్యూయార్క్‌లో  శనివారం ప్రదర్శించారు. ఇంతకుముందు 2,528 పౌండ్ల బరువుతో నమోదైన ‘ది గ్రేట్‌ పంప్కిన్‌’ రికార్డును ఇది అధిగమించింది. ఇది అమెరికాలో భారీ గుమ్మడికాయ. బరువు 1,158.47 కిలోలు (2,554 పౌండ్లు). ఎమ్మెట్‌ ఆండ్రూ, స్టీవ్‌ ఆండ్రూజ్‌లు న్యూయార్క్‌లో శనివారం ప్రదర్శించారు. ఇంతకుముందు 2,528 పౌండ్ల బరువుతో నమోదైన ‘ది గ్రేట్‌ పంప్కిన్‌’ రికార్డును ఇది అధిగమించింది.
21/30
గుజరాత్‌లోని సూరత్‌ ఉమియాధామ్‌ ఆలయం వద్ద సోమవారం రాత్రి ‘మహా ఆర్తి’లో పాల్గొన్న భక్తులు గుజరాత్‌లోని సూరత్‌ ఉమియాధామ్‌ ఆలయం వద్ద సోమవారం రాత్రి ‘మహా ఆర్తి’లో పాల్గొన్న భక్తులు
22/30
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ సబర్మతి ఆశ్రమంలో చరఖా తిప్పుతూ నూలు వడుకుతున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ సబర్మతి ఆశ్రమంలో చరఖా తిప్పుతూ నూలు వడుకుతున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
23/30
 పనికిరాని వివిధ రకాల ఇనుప వస్తువులతో అమ్మవారి రూపాలను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. మాదాపూర్‌లోని తెలంగాణ సాంస్కృతిక సారథి కార్యాలయంలో వీటిని ఏర్పాటు చేశారు. పనికిరాని వివిధ రకాల ఇనుప వస్తువులతో అమ్మవారి రూపాలను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. మాదాపూర్‌లోని తెలంగాణ సాంస్కృతిక సారథి కార్యాలయంలో వీటిని ఏర్పాటు చేశారు.
24/30
 సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో సోమవారం కాలి గాయానికి వైద్యం చేయించుకున్న ఈ వ్యక్తి రోడ్డుపైనే సొమ్మసిల్లి పడిపోయాడు. అయినా అతన్ని ఎవరూ లేపలేదు. సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో సోమవారం కాలి గాయానికి వైద్యం చేయించుకున్న ఈ వ్యక్తి రోడ్డుపైనే సొమ్మసిల్లి పడిపోయాడు. అయినా అతన్ని ఎవరూ లేపలేదు.
25/30
దుర్గం చెరువు వద్ద తీగల వంతెన కొత్త అందాలను సంతరించుకోనుంది. నగర పర్యటనకు వచ్చే సందర్శకులు చార్మినార్, బిర్లా టెంపుల్, హుస్సేన్‌సాగర్, గోల్కొండతోపాటు తీగల వంతెన చూడటానికి ఆసక్తి చూపుతున్నారు. సినిమా షూటింగ్‌లకు ఇదో ప్రత్యేక ప్రాంతంగా మారింది. ప్రభుత్వానికి ఫీజుల రూపంలో ఆదాయం సమకూరుతోంది. పర్యాటకులను మరింత ఆకట్టుకునే విధంగా ఈ వంతెన చుట్టూ కొత్త అందాలతో ముస్తాబు చేయాలని హెచ్‌ఎండీఏ నిర్ణయించింది. వంతెనకు రెండువైపులా దుర్గం చెరువులో రూ.8.03 కోట్లతో మ్యూజికల్‌ ఫౌంటెయిన్ల ఏర్పాటుకు టెండర్లు పిలిచింది. దుర్గం చెరువు వద్ద తీగల వంతెన కొత్త అందాలను సంతరించుకోనుంది. నగర పర్యటనకు వచ్చే సందర్శకులు చార్మినార్, బిర్లా టెంపుల్, హుస్సేన్‌సాగర్, గోల్కొండతోపాటు తీగల వంతెన చూడటానికి ఆసక్తి చూపుతున్నారు. సినిమా షూటింగ్‌లకు ఇదో ప్రత్యేక ప్రాంతంగా మారింది. ప్రభుత్వానికి ఫీజుల రూపంలో ఆదాయం సమకూరుతోంది. పర్యాటకులను మరింత ఆకట్టుకునే విధంగా ఈ వంతెన చుట్టూ కొత్త అందాలతో ముస్తాబు చేయాలని హెచ్‌ఎండీఏ నిర్ణయించింది. వంతెనకు రెండువైపులా దుర్గం చెరువులో రూ.8.03 కోట్లతో మ్యూజికల్‌ ఫౌంటెయిన్ల ఏర్పాటుకు టెండర్లు పిలిచింది.
26/30
దుర్గా మాత వైభవాన్ని కళ్లకుకడుతూ కూచిపూడి సంప్రదాయంలో కళాకారులు ప్రదర్శించిన నృత్యోత్సవం కనువిందు చేసింది. ఫ్యూచర్‌ టీచర్‌ అకాడమీ వార్షికోత్సవం, దసరా నృత్యోత్సవాన్ని సోమవారం బొగ్గులకుంట తెలంగాణ సారస్వత పరిషత్తులో ఘనంగా నిర్వహించారు. దుర్గా మాత వైభవాన్ని కళ్లకుకడుతూ కూచిపూడి సంప్రదాయంలో కళాకారులు ప్రదర్శించిన నృత్యోత్సవం కనువిందు చేసింది. ఫ్యూచర్‌ టీచర్‌ అకాడమీ వార్షికోత్సవం, దసరా నృత్యోత్సవాన్ని సోమవారం బొగ్గులకుంట తెలంగాణ సారస్వత పరిషత్తులో ఘనంగా నిర్వహించారు.
27/30
అది గ్రామ పంచాయతీ చెరువు.. సుమారు నాలుగు ఎకరాల విస్తీర్ణం.. వంద వరకు జామాయిల్‌ చెట్లు ఉంటాయి.. ప్రస్తుతం అక్కడ ఇటుక బట్టీల కోసం తవ్వుతున్న మట్టి కారణంగా చెట్లు నేలకొరుగుతున్నాయి. ఇప్పటికే దాదాపు సగం వరకు పడిపోగా మరికొన్ని కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. అద్దంకి మండలం తిమ్మాయపాలెంలోనిది ఈ దృశ్యం. పంచాయతీ అధికారుల దృష్టికి స్థానికులు ఈ అంశాన్ని తీసుకెళ్లినప్పటికీ ఫలితం కనిపించ లేదు. గ్రామస్థులు పోటాపోటీగా మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. దీని కారణంగా ఏళ్ల తరబడి పెంచిన వృక్షాలు కూలుతుండగా చుట్టూ పరిస్థితులు ప్రమాదకరంగా మారాయి. అది గ్రామ పంచాయతీ చెరువు.. సుమారు నాలుగు ఎకరాల విస్తీర్ణం.. వంద వరకు జామాయిల్‌ చెట్లు ఉంటాయి.. ప్రస్తుతం అక్కడ ఇటుక బట్టీల కోసం తవ్వుతున్న మట్టి కారణంగా చెట్లు నేలకొరుగుతున్నాయి. ఇప్పటికే దాదాపు సగం వరకు పడిపోగా మరికొన్ని కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. అద్దంకి మండలం తిమ్మాయపాలెంలోనిది ఈ దృశ్యం. పంచాయతీ అధికారుల దృష్టికి స్థానికులు ఈ అంశాన్ని తీసుకెళ్లినప్పటికీ ఫలితం కనిపించ లేదు. గ్రామస్థులు పోటాపోటీగా మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. దీని కారణంగా ఏళ్ల తరబడి పెంచిన వృక్షాలు కూలుతుండగా చుట్టూ పరిస్థితులు ప్రమాదకరంగా మారాయి.
28/30
 ప్యాపిలిలో నిర్మిస్తున్న జగనన్న కాలనీలోని  నిర్మాణాలకు లబ్ధిదారులు అవస్థలు పడుతున్నారు. జగనన్న కాలనీలో బోర్లు వేసి పైపులైన్‌ ఏర్పాటు చేసి 9 మినీట్యాంకులు నిర్మించారు. ఇందులో మూడు ట్యాంకులకు నీరు రావటం లేదని స్థానికులు వివరిస్తున్నారు. పునాదుల కోసం తవ్విన నీటిగుంతల్లో నిల్చిన వర్షం నీటిని తోడుకుని బిందెలతో తీసుకొచ్చి నిర్మాణాలకు వినియోగిస్తున్నారు. మరికొందరు సమీపంలోని ట్యాంకుల నుంచి బిందెలతో నీటిని మోసుకెళ్తున్నారు. ఈ విషయంపై గృహనిర్మాణశాఖ ఏఈ వెంకటేశ్‌ మాట్లాడుతూ రెండు ట్యాంకులకు నీరు రావడం లేదని, పైపులు దెబ్బతినటంతో సమస్య నెలకొందన్నారు. అక్కడికి వెళ్లి పరిశీలించి సంబంధిత గుత్తేదారుతో మాట్లాడి లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. ప్యాపిలిలో నిర్మిస్తున్న జగనన్న కాలనీలోని నిర్మాణాలకు లబ్ధిదారులు అవస్థలు పడుతున్నారు. జగనన్న కాలనీలో బోర్లు వేసి పైపులైన్‌ ఏర్పాటు చేసి 9 మినీట్యాంకులు నిర్మించారు. ఇందులో మూడు ట్యాంకులకు నీరు రావటం లేదని స్థానికులు వివరిస్తున్నారు. పునాదుల కోసం తవ్విన నీటిగుంతల్లో నిల్చిన వర్షం నీటిని తోడుకుని బిందెలతో తీసుకొచ్చి నిర్మాణాలకు వినియోగిస్తున్నారు. మరికొందరు సమీపంలోని ట్యాంకుల నుంచి బిందెలతో నీటిని మోసుకెళ్తున్నారు. ఈ విషయంపై గృహనిర్మాణశాఖ ఏఈ వెంకటేశ్‌ మాట్లాడుతూ రెండు ట్యాంకులకు నీరు రావడం లేదని, పైపులు దెబ్బతినటంతో సమస్య నెలకొందన్నారు. అక్కడికి వెళ్లి పరిశీలించి సంబంధిత గుత్తేదారుతో మాట్లాడి లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు.
29/30
30/30
 దసరా నేపథ్యంలో కర్నూలు బస్టాండు ప్రాంగణం ప్రయాణికులతో కిక్కిరిసింది. వారి సంఖ్యకు తగినన్ని బస్సులు లేకపోవడంతో సొంతూళ్లకు వెళ్లేందుకు ప్రయాణికులు గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. ఎలాగైనా సీటు దక్కించుకోవాలని కొందరు పడరాని పాట్లు పడుతున్నారు. బస్సు రాగానే సీటు కోసం కిటికీల నుంచి ఎక్కుతున్నారు. బస్సులో రద్దీ అధికమవడంతో మరికొందరు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. దసరా నేపథ్యంలో కర్నూలు బస్టాండు ప్రాంగణం ప్రయాణికులతో కిక్కిరిసింది. వారి సంఖ్యకు తగినన్ని బస్సులు లేకపోవడంతో సొంతూళ్లకు వెళ్లేందుకు ప్రయాణికులు గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. ఎలాగైనా సీటు దక్కించుకోవాలని కొందరు పడరాని పాట్లు పడుతున్నారు. బస్సు రాగానే సీటు కోసం కిటికీల నుంచి ఎక్కుతున్నారు. బస్సులో రద్దీ అధికమవడంతో మరికొందరు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు.

మరిన్ని