News In Pics: చిత్రం చెప్పే సంగతులు- 2 (04-10-22)

Updated : 04 Oct 2022 20:21 IST
1/20
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం మలయప్పస్వామి కల్కి అవతారంలో అశ్వవాహనంపై దర్శనమిచ్చారు. తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేశారు. వాహన సేవను చూసేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.   శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం మలయప్పస్వామి కల్కి అవతారంలో అశ్వవాహనంపై దర్శనమిచ్చారు. తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేశారు. వాహన సేవను చూసేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.  
2/20
3/20
శరన్నవ రాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం 9వ రోజు మహిషాసుర మర్దనిదేవి అలంకారంలో దర్శనమిస్తున్న కనకదుర్గమ్మకు తితిదే సారె సమర్పించింది. ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి దంపతులు పట్టు వస్త్రాలు తీసుకెళ్లగా.. దుర్గగుడి ఈవో డి.భ్రమరాంబ, జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఆలయ మర్యాదలతో వారికి పూర్ణకుంభ స్వాగతం పలికారు.  శరన్నవ రాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం 9వ రోజు మహిషాసుర మర్దనిదేవి అలంకారంలో దర్శనమిస్తున్న కనకదుర్గమ్మకు తితిదే సారె సమర్పించింది. ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి దంపతులు పట్టు వస్త్రాలు తీసుకెళ్లగా.. దుర్గగుడి ఈవో డి.భ్రమరాంబ, జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఆలయ మర్యాదలతో వారికి పూర్ణకుంభ స్వాగతం పలికారు.
4/20
5/20
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘RRR’ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించిన సంగతి తెలిసిందే. సినిమాలో భీమ్‌ పాత్రలో మెప్పించిన నటుడు ఎన్టీఆర్‌ను తాజాగా జపాన్‌ మీడియా ప్రతినిధులు ఇంటర్వ్యూ చేశారు. ఆ విషయాన్ని ట్విటర్‌ ద్వారా వెల్లడిస్తూ ఎన్టీఆర్‌ ఈ ఫొటోను పోస్టు చేశారు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘RRR’ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించిన సంగతి తెలిసిందే. సినిమాలో భీమ్‌ పాత్రలో మెప్పించిన నటుడు ఎన్టీఆర్‌ను తాజాగా జపాన్‌ మీడియా ప్రతినిధులు ఇంటర్వ్యూ చేశారు. ఆ విషయాన్ని ట్విటర్‌ ద్వారా వెల్లడిస్తూ ఎన్టీఆర్‌ ఈ ఫొటోను పోస్టు చేశారు.
6/20
దసరా పండగ రోజున తెరాస పార్టీని.. జాతీయ పార్టీగా మారుస్తున్న నేపథ్యంలో వరంగల్‌కు చెందిన ఓ తెరాస నేత హమాలీలకు కోళ్లు, మద్యం సీసాలు పంపిణీ చేశారు. తెరాస నాయకుడు రాజనాల శ్రీహరి వరంగల్‌ చౌరస్తాలో 200 మంది హమాలీలకు ఒక్కొక్కరికి ఒక కోడి, ఓ క్వార్టర్‌ సీసాను అందజేశారు. జాతీయపార్టీ సత్తా చాటి కేసీఆర్‌ ప్రధాని, కేటీఆర్‌ సీఎం కావాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు. దసరా పండగ రోజున తెరాస పార్టీని.. జాతీయ పార్టీగా మారుస్తున్న నేపథ్యంలో వరంగల్‌కు చెందిన ఓ తెరాస నేత హమాలీలకు కోళ్లు, మద్యం సీసాలు పంపిణీ చేశారు. తెరాస నాయకుడు రాజనాల శ్రీహరి వరంగల్‌ చౌరస్తాలో 200 మంది హమాలీలకు ఒక్కొక్కరికి ఒక కోడి, ఓ క్వార్టర్‌ సీసాను అందజేశారు. జాతీయపార్టీ సత్తా చాటి కేసీఆర్‌ ప్రధాని, కేటీఆర్‌ సీఎం కావాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు.
7/20
దసరా నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఆయన సతీమణి కావ్యతో కలిసి జూబ్లీహిల్స్‌ పెద్దమ్మ తల్లిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. దసరా నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఆయన సతీమణి కావ్యతో కలిసి జూబ్లీహిల్స్‌ పెద్దమ్మ తల్లిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
8/20
సద్దుల బతుకమ్మ వేడుక నేపథ్యంలో సోమవారం రాత్రి హుస్సేన్‌సాగర్లో భారీగా బతుకమ్మలను నిమజ్జనం చేశారు. దీంతో అక్కడ పూలన్నీ పేరుకుపోయాయి. వాటిని తొలగించే పనిలో పారిశుద్ధ్య కార్మికులు నిమగ్నమైన చిత్రాలివి. సద్దుల బతుకమ్మ వేడుక నేపథ్యంలో సోమవారం రాత్రి హుస్సేన్‌సాగర్లో భారీగా బతుకమ్మలను నిమజ్జనం చేశారు. దీంతో అక్కడ పూలన్నీ పేరుకుపోయాయి. వాటిని తొలగించే పనిలో పారిశుద్ధ్య కార్మికులు నిమగ్నమైన చిత్రాలివి.
9/20
10/20
హైదరాబాద్‌ నగరంలో ట్రాఫిక్‌ ఫోలీసులు ప్రవేశపెట్టిన ఆపరేషన్‌ ‘రోడ్‌ అబ్‌స్ట్రక్టివ్‌ పార్కింగ్‌ అండ్‌ ఎంక్రోచ్‌మెంట్‌’ (రోప్‌) విధానం సత్ఫలితాలనిస్తోంది. ట్రాఫిక్‌ కూడళ్ల వద్ద రెడ్‌లైట్‌ వెలిగినప్పుడు పాదచారులు అటూ, ఇటూ దాటేందుకున్న తెల్లగీతల (స్టాప్‌లైన్‌)ను లెక్కచేయకుండా దూసుకెళ్లేవారిపై ట్రాఫిక్‌ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నట్లు తెలియడంతో చాలా మంది వాహనదారులు అప్రమత్తమయ్యారు. జరిమానాలు చెల్లించడం కంటే నిబంధనలు పాటించడం మేలని అంతా స్టాప్‌లైన్‌ ముందే ఆగిపోతున్నారు. హైదరాబాద్ నగరంలోని కొన్ని కూడళ్ల వద్ద కనిపించిన దృశ్యాలివి. హైదరాబాద్‌ నగరంలో ట్రాఫిక్‌ ఫోలీసులు ప్రవేశపెట్టిన ఆపరేషన్‌ ‘రోడ్‌ అబ్‌స్ట్రక్టివ్‌ పార్కింగ్‌ అండ్‌ ఎంక్రోచ్‌మెంట్‌’ (రోప్‌) విధానం సత్ఫలితాలనిస్తోంది. ట్రాఫిక్‌ కూడళ్ల వద్ద రెడ్‌లైట్‌ వెలిగినప్పుడు పాదచారులు అటూ, ఇటూ దాటేందుకున్న తెల్లగీతల (స్టాప్‌లైన్‌)ను లెక్కచేయకుండా దూసుకెళ్లేవారిపై ట్రాఫిక్‌ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నట్లు తెలియడంతో చాలా మంది వాహనదారులు అప్రమత్తమయ్యారు. జరిమానాలు చెల్లించడం కంటే నిబంధనలు పాటించడం మేలని అంతా స్టాప్‌లైన్‌ ముందే ఆగిపోతున్నారు. హైదరాబాద్ నగరంలోని కొన్ని కూడళ్ల వద్ద కనిపించిన దృశ్యాలివి.
11/20
12/20
దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్ రామ్‌నగర్‌లోని తన నివాసంలో ఆయుధ పూజ చేస్తున్న హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్ రామ్‌నగర్‌లోని తన నివాసంలో ఆయుధ పూజ చేస్తున్న హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ
13/20
దేశవ్యాప్తంగా దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. అందులో భాగంగా గుజరాత్‌ రాష్ట్రం అహ్మదాబాద్‌లో నిర్వహించిన వేడుకలో ఓ వ్యక్తి ఇలా నాగదేవతను పోలిన ఆకారాన్ని తన శరీరం చుట్టూ తగిలించుకున్నాడు. ఆపై ప్రమిదల వెలుగులతో విన్యాసాలు చేయగా.. పలువురు ఆసక్తిగా తిలకించారు. దేశవ్యాప్తంగా దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. అందులో భాగంగా గుజరాత్‌ రాష్ట్రం అహ్మదాబాద్‌లో నిర్వహించిన వేడుకలో ఓ వ్యక్తి ఇలా నాగదేవతను పోలిన ఆకారాన్ని తన శరీరం చుట్టూ తగిలించుకున్నాడు. ఆపై ప్రమిదల వెలుగులతో విన్యాసాలు చేయగా.. పలువురు ఆసక్తిగా తిలకించారు.
14/20
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలోని లక్ష్మీతాయారు అమ్మవారు మంగళవారం మహాలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.	దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలోని లక్ష్మీతాయారు అమ్మవారు మంగళవారం మహాలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
15/20
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదోరోజు మహిషాసుర మర్దనిగా దుర్గమ్మ దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. అమ్మవారి సన్నిధిలో నిర్వహించిన కుంకుమార్చన సేవలో పలువురు భక్తులు పాల్గొన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదోరోజు మహిషాసుర మర్దనిగా దుర్గమ్మ దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. అమ్మవారి సన్నిధిలో నిర్వహించిన కుంకుమార్చన సేవలో పలువురు భక్తులు పాల్గొన్నారు.
16/20
17/20
18/20
తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు రథోత్సవం వేడుకగా నిర్వహించారు. తిరుమాడ వీధుల్లో రథంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీనివాసుడు విహరించారు. రథోత్సవాన్ని తిలకించేందుక పెద్ద ఎత్తున భక్తులు శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. 
తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు రథోత్సవం వేడుకగా నిర్వహించారు. తిరుమాడ వీధుల్లో రథంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీనివాసుడు విహరించారు. రథోత్సవాన్ని తిలకించేందుక పెద్ద ఎత్తున భక్తులు శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్నారు.
19/20
20/20

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని