News In Pics: చిత్రం చెప్పే సంగతులు- 1 (05-10-22)

Updated : 05 Oct 2022 10:48 IST
1/26
పోలీసుల బందోబస్తు మధ్య నిత్యం తీరిక లేకుండా గడిపే మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి మంగళవారం సాయంత్రం సరదాగా బుల్లెట్‌ బండిపై చక్కర్లు కొట్టారు. మనవరాలు, తన వ్యక్తిగత సహాయకుడి కుమారుడితో కలిసి సామాన్యుడిలా నిర్మల్‌లోని శివాజీచౌక్, అక్కడి నుంచి కొండాపూర్‌ మీదుగా తిరిగి ఇంటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి అందరికీ దసరా పండగ శుభాకాంక్షలు తెలిపారు. విజయానికి ప్రతీకగా నిర్వహించుకునే ఈ పండగ ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షించారు.  


పోలీసుల బందోబస్తు మధ్య నిత్యం తీరిక లేకుండా గడిపే మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి మంగళవారం సాయంత్రం సరదాగా బుల్లెట్‌ బండిపై చక్కర్లు కొట్టారు. మనవరాలు, తన వ్యక్తిగత సహాయకుడి కుమారుడితో కలిసి సామాన్యుడిలా నిర్మల్‌లోని శివాజీచౌక్, అక్కడి నుంచి కొండాపూర్‌ మీదుగా తిరిగి ఇంటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి అందరికీ దసరా పండగ శుభాకాంక్షలు తెలిపారు. విజయానికి ప్రతీకగా నిర్వహించుకునే ఈ పండగ ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షించారు.
2/26
విజయవాడ కనకదుర్గమ్మకు మొక్కు సమర్పించేందుకు పాదయాత్రగా వచ్చే భవానీలు తీరా గుడి వద్దకు వచ్చాక పడిగాపులు పడాల్సి వస్తోంది. కాళ్లు కాలిపోతున్నా.. రాళ్లు గుచ్చుకొని రక్తం కారుతున్నా.. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు క్యూలైన్లలో నిల్చోవాల్సి వస్తోంది. భవానీల కోసం ప్రత్యేక క్యూ లైను ఏర్పాటు చేయలేదు. రోజుల పాటు నడిచి వచ్చిన వారినీ సాధారణ క్యూ లైన్ల నుంచే పంపుతున్నారు. హోమగుండం, దీక్షా విరమణకూ ఏర్పాట్లు చేయలేదు. కనీసం దుస్తులు, పూజా సామగ్రినీ ఘాట్ల నుంచి ఎప్పటికప్పుడు తొలగించడం లేదు. విజయవాడ కనకదుర్గమ్మకు మొక్కు సమర్పించేందుకు పాదయాత్రగా వచ్చే భవానీలు తీరా గుడి వద్దకు వచ్చాక పడిగాపులు పడాల్సి వస్తోంది. కాళ్లు కాలిపోతున్నా.. రాళ్లు గుచ్చుకొని రక్తం కారుతున్నా.. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు క్యూలైన్లలో నిల్చోవాల్సి వస్తోంది. భవానీల కోసం ప్రత్యేక క్యూ లైను ఏర్పాటు చేయలేదు. రోజుల పాటు నడిచి వచ్చిన వారినీ సాధారణ క్యూ లైన్ల నుంచే పంపుతున్నారు. హోమగుండం, దీక్షా విరమణకూ ఏర్పాట్లు చేయలేదు. కనీసం దుస్తులు, పూజా సామగ్రినీ ఘాట్ల నుంచి ఎప్పటికప్పుడు తొలగించడం లేదు.
3/26
4/26
తమిళనాడులోని కాంచీపురం జిల్లా శ్రీపెరుంబుదూర్‌ తాలూకా శివపురం గ్రామంలో కాళ్లు లేని మేకపిల్ల పుట్టింది. గ్రామానికి చెందిన వసంత మహాలింగం మందలోని ఓ మేక సోమవారం రాత్రి రెండు పిల్లలను ఈనింది. ఒక పిల్ల బాగానే ఉంది. మరో దానికి మాత్రం కాళ్లు లేవు. ఇందుకు జన్యు లోపాలే కారణమని పశువైద్యులు తెలిపారు. మేకపిల్లను చూసేందుకు పరిసర ప్రజలు పెద్దఎత్తున వచ్చారు. తమిళనాడులోని కాంచీపురం జిల్లా శ్రీపెరుంబుదూర్‌ తాలూకా శివపురం గ్రామంలో కాళ్లు లేని మేకపిల్ల పుట్టింది. గ్రామానికి చెందిన వసంత మహాలింగం మందలోని ఓ మేక సోమవారం రాత్రి రెండు పిల్లలను ఈనింది. ఒక పిల్ల బాగానే ఉంది. మరో దానికి మాత్రం కాళ్లు లేవు. ఇందుకు జన్యు లోపాలే కారణమని పశువైద్యులు తెలిపారు. మేకపిల్లను చూసేందుకు పరిసర ప్రజలు పెద్దఎత్తున వచ్చారు.
5/26
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహానికి తీరని అవమానం జరిగింది.. అనుమతిలేనిచోట నెలకొల్పారంటూ ఆయన విగ్రహాన్ని తొలగించిన గుంటూరు నగరపాలక సంస్థ అధికారులు దానిని తీసుకువెళ్లి ఓ టాయ్‌లెట్‌ డబ్బా ఆసరాతో నిలిపి ఉంచడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి గొప్ప వ్యక్తికి ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు. గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహానికి తీరని అవమానం జరిగింది.. అనుమతిలేనిచోట నెలకొల్పారంటూ ఆయన విగ్రహాన్ని తొలగించిన గుంటూరు నగరపాలక సంస్థ అధికారులు దానిని తీసుకువెళ్లి ఓ టాయ్‌లెట్‌ డబ్బా ఆసరాతో నిలిపి ఉంచడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి గొప్ప వ్యక్తికి ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు.
6/26
దసరా నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో మంగళవారం అర్ధరాత్రి వరకు భక్తులతో కిటకిటలాడుతున్న నెల్లూరులోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం దసరా నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో మంగళవారం అర్ధరాత్రి వరకు భక్తులతో కిటకిటలాడుతున్న నెల్లూరులోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం
7/26
8/26
9/26
కరీంనగర్‌లో దేవి నవరాత్రోత్సవాల్లో భాగంగా తొమ్మిదో రోజు మహానవమి సందర్భంగా మహాశక్తి ఆలయంలో మహిషాసురమర్దిని దేవి రూపంలో, పసుపు కొమ్ముల అలంకరణతో మహాదుర్గ అమ్మవారు దర్శనమిచ్చారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ రాత్రి  భక్తజన సందోహం మధ్య మహిషాసుర సంహార లీలను ప్రారంభించారు. దేవాలయంలో అర్ధరాత్రి వరకు దాండియా ఆటలు కొనసాగాయి. కరీంనగర్‌లో దేవి నవరాత్రోత్సవాల్లో భాగంగా తొమ్మిదో రోజు మహానవమి సందర్భంగా మహాశక్తి ఆలయంలో మహిషాసురమర్దిని దేవి రూపంలో, పసుపు కొమ్ముల అలంకరణతో మహాదుర్గ అమ్మవారు దర్శనమిచ్చారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ రాత్రి భక్తజన సందోహం మధ్య మహిషాసుర సంహార లీలను ప్రారంభించారు. దేవాలయంలో అర్ధరాత్రి వరకు దాండియా ఆటలు కొనసాగాయి.
10/26
11/26
12/26
ఒంగోలులోని గంటపాలెం పార్వతమ్మ ఆలయం వద్ద మంగళవారం అర్ధరాత్రి అమ్మవారి ఊరేగింపు కనుల పండువగా సాగింది. నగరవాసులు వేలాదిగా హాజరై భక్తిశ్రద్ధలతో ఈ వేడుక నిర్వహించారు. ఒంగోలులోని గంటపాలెం పార్వతమ్మ ఆలయం వద్ద మంగళవారం అర్ధరాత్రి అమ్మవారి ఊరేగింపు కనుల పండువగా సాగింది. నగరవాసులు వేలాదిగా హాజరై భక్తిశ్రద్ధలతో ఈ వేడుక నిర్వహించారు.
13/26
14/26
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం మలయప్పస్వామి కల్కి అవతారంలో అశ్వవాహనంపై దర్శనమిచ్చారు. ఈ వాహనసేవలో విశ్రాంత సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, ఆయన సతీమణి శివమాల పాల్గొన్నారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం మలయప్పస్వామి కల్కి అవతారంలో అశ్వవాహనంపై దర్శనమిచ్చారు. ఈ వాహనసేవలో విశ్రాంత సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, ఆయన సతీమణి శివమాల పాల్గొన్నారు.
15/26
 క్రమటోర్స్క్‌లో రష్యా దాడి అనంతరం క్షిపణి అవశేషాలను తొలగిస్తున్న ఉక్రెయిన్‌ సిబ్బంది 
క్రమటోర్స్క్‌లో రష్యా దాడి అనంతరం క్షిపణి అవశేషాలను తొలగిస్తున్న ఉక్రెయిన్‌ సిబ్బంది
16/26
 దుబాయ్‌లో మంగళవారం ప్రారంభించిన హిందూ దేవాలయం దుబాయ్‌లో మంగళవారం ప్రారంభించిన హిందూ దేవాలయం
17/26
దసరా నవరాత్రుల్లో భాగంగా గుజరాత్‌ రాజధాని గాంధీనగర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో దీపాలు పట్టుకుని శివుడి రూపాన్ని రూపొందించిన భక్తులు	దసరా నవరాత్రుల్లో భాగంగా గుజరాత్‌ రాజధాని గాంధీనగర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో దీపాలు పట్టుకుని శివుడి రూపాన్ని రూపొందించిన భక్తులు
18/26
 అమెరికాలోని అమెజాన్‌ నదిలో కనిపించే సకర్‌మౌత్‌ క్యాట్‌ఫిష్‌ మరోమారు బిహార్‌లో కనిపించింది. పశ్చిమ చంపారన్‌ జిల్లాలోని బగాహా బ్లాక్‌ చందేర్‌పుర్‌-రత్వాల్‌ పంచాయతీ పరిధిలోని రొహువా నదిలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడి వలకు ఈ చేప చిక్కింది.  మాంసాహారి అయిన ఈ చేప భారతీయ నదిలో కనిపించడంపై మత్స్యకారులు ఆందోళన వ్యక్తంచేశారు. గతంలోనూ సకర్‌మౌత్‌ క్యాట్‌ఫిష్‌ బగాహా బ్లాక్‌లో కనిపించింది.  అమెరికాలోని అమెజాన్‌ నదిలో కనిపించే సకర్‌మౌత్‌ క్యాట్‌ఫిష్‌ మరోమారు బిహార్‌లో కనిపించింది. పశ్చిమ చంపారన్‌ జిల్లాలోని బగాహా బ్లాక్‌ చందేర్‌పుర్‌-రత్వాల్‌ పంచాయతీ పరిధిలోని రొహువా నదిలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడి వలకు ఈ చేప చిక్కింది. మాంసాహారి అయిన ఈ చేప భారతీయ నదిలో కనిపించడంపై మత్స్యకారులు ఆందోళన వ్యక్తంచేశారు. గతంలోనూ సకర్‌మౌత్‌ క్యాట్‌ఫిష్‌ బగాహా బ్లాక్‌లో కనిపించింది.
19/26
20/26
దసరా సందర్భంగా విశాఖ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో మంగళవారం రైల్వే స్టేషన్‌ కిటకిటలాడింది. పెద్ద సంఖ్యలో భక్తులు విజయవాడ కనకదుర్గ దర్శనానికి వెళుతుండటంతో రద్దీ కనిపించింది. మరో వైపు పలు రైళ్లు ఆలస్యంగా నడవడంతో ప్రయాణికులు వేచి చూడాల్సి వచ్చింది. పండగ పూజా సామగ్రి కొనుగోలుదారులతో నగరంలోని పలు మార్కెట్లు సందడిగా కనిపించాయి. దసరా సందర్భంగా విశాఖ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో మంగళవారం రైల్వే స్టేషన్‌ కిటకిటలాడింది. పెద్ద సంఖ్యలో భక్తులు విజయవాడ కనకదుర్గ దర్శనానికి వెళుతుండటంతో రద్దీ కనిపించింది. మరో వైపు పలు రైళ్లు ఆలస్యంగా నడవడంతో ప్రయాణికులు వేచి చూడాల్సి వచ్చింది. పండగ పూజా సామగ్రి కొనుగోలుదారులతో నగరంలోని పలు మార్కెట్లు సందడిగా కనిపించాయి.
21/26
22/26
 సింహాచలం అప్పన్న కొండపై మంగళవారం ప్రకృతి అందాలు భక్తులను ఎంతగానో అలరించాయి. ఓ వైపు చిరు జల్లులు...అదే సమయంలో గిరి శిఖరాలను తాకే మేఘాలు....మరో వైపు కొండ పైనుంచి దూకే జలపాతాలు కనువిందు చేశాయి.  మంచుతెరల మధ్య నుంచి కొండపైకి వచ్చిన వాహనాలు లైట్ల వెలుగుల్లో జాగ్రత్తగా ముందుకు సాగాయి.  సింహాచలం అప్పన్న కొండపై మంగళవారం ప్రకృతి అందాలు భక్తులను ఎంతగానో అలరించాయి. ఓ వైపు చిరు జల్లులు...అదే సమయంలో గిరి శిఖరాలను తాకే మేఘాలు....మరో వైపు కొండ పైనుంచి దూకే జలపాతాలు కనువిందు చేశాయి. మంచుతెరల మధ్య నుంచి కొండపైకి వచ్చిన వాహనాలు లైట్ల వెలుగుల్లో జాగ్రత్తగా ముందుకు సాగాయి.
23/26
 ట్యాంక్‌బండ్‌ పండగ శోభను సంతరించుకొంది. దారి మొత్తాన్ని రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించడంతో ఆ కాంతులన్నీ  పక్కనే ఉన్న సాగర్‌లో ప్రతిబింబిస్తూ ఆకట్టుకుంటోంది. ట్యాంక్‌బండ్‌ పండగ శోభను సంతరించుకొంది. దారి మొత్తాన్ని రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించడంతో ఆ కాంతులన్నీ పక్కనే ఉన్న సాగర్‌లో ప్రతిబింబిస్తూ ఆకట్టుకుంటోంది.
24/26
 దసరా ఉత్సవాల్లో రావణ దహనమే కీలకం. పలుచోట్ల ఈ వేడుకను ఘనంగా నిర్వహిస్తారు. ఇందుకోసం నగరంలో పలువురు కళాకారులు పది తలల రావణుడి బొమ్మలను తయారు చేసి సిద్ధంగా ఉంచారు. దసరా ఉత్సవాల్లో రావణ దహనమే కీలకం. పలుచోట్ల ఈ వేడుకను ఘనంగా నిర్వహిస్తారు. ఇందుకోసం నగరంలో పలువురు కళాకారులు పది తలల రావణుడి బొమ్మలను తయారు చేసి సిద్ధంగా ఉంచారు.
25/26
 తెలంగాణలోని ఎమ్మెల్యేలంతా కొలువుదీరే అసెంబ్లీ ఎదురుగా మురుగు తిష్ఠ వేసింది. మూడు వారాలుగా ముక్కుపుటాలు అదురుతున్నా పట్టించుకునే వారు లేక.. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.


తెలంగాణలోని ఎమ్మెల్యేలంతా కొలువుదీరే అసెంబ్లీ ఎదురుగా మురుగు తిష్ఠ వేసింది. మూడు వారాలుగా ముక్కుపుటాలు అదురుతున్నా పట్టించుకునే వారు లేక.. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
26/26
 నానక్‌రాంగూడ కూడలిలో హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(హెచ్‌ఎండీఏ), హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ లిమిటెడ్‌(హెచ్ జీసీఎల్‌) కార్యాలయం సమీపంలో ఇనుము తుక్కుతో 12 అడుగుల ఎత్తున మానవ విగ్రహాలను ఏర్పాటు చేశారు. వీటిని మంగళవారం సాయంత్రం పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ ప్రారంభించారు. ట్విటర్‌లో పోస్ట్‌ చేసిన ఈ చిత్రానికి ‘కల్లోలం మధ్య ప్రశాంతత జంట శిల్పాలు’ అనే క్యాప్షన్‌ను జోడించారు. నానక్‌రాంగూడ కూడలిలో హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(హెచ్‌ఎండీఏ), హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ లిమిటెడ్‌(హెచ్ జీసీఎల్‌) కార్యాలయం సమీపంలో ఇనుము తుక్కుతో 12 అడుగుల ఎత్తున మానవ విగ్రహాలను ఏర్పాటు చేశారు. వీటిని మంగళవారం సాయంత్రం పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ ప్రారంభించారు. ట్విటర్‌లో పోస్ట్‌ చేసిన ఈ చిత్రానికి ‘కల్లోలం మధ్య ప్రశాంతత జంట శిల్పాలు’ అనే క్యాప్షన్‌ను జోడించారు.

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని