News In Pics: చిత్రం చెప్పే సంగతులు- 2 (05-10-22)

Updated : 05 Oct 2022 22:19 IST
1/23
‘గాడ్‌ఫాదర్‌’ విడుదలై మంచి టాక్‌ అందుకుంటున్న నేపథ్యంలో కథానాయకుడు చిరంజీవిని సన్నిహితులు అభినందనలతో ముంచెత్తుతున్నారు. దర్శకుడు మెహర్‌ రమేష్‌, మైత్రీ మూవీ మేకర్స్‌ టీమ్‌, దర్శకుడు హరీశ్‌ శంకర్‌ తదితరులు చిరును కలసి పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ‘గాడ్‌ఫాదర్‌’ విడుదలై మంచి టాక్‌ అందుకుంటున్న నేపథ్యంలో కథానాయకుడు చిరంజీవిని సన్నిహితులు అభినందనలతో ముంచెత్తుతున్నారు. దర్శకుడు మెహర్‌ రమేష్‌, మైత్రీ మూవీ మేకర్స్‌ టీమ్‌, దర్శకుడు హరీశ్‌ శంకర్‌ తదితరులు చిరును కలసి పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.
2/23
దసరా ఉత్సవాల సందర్భంగా కురుపాం కోటలో మాజీ కేంద్రమంత్రి వైరిచర్ల కిషోర్‌ చంద్రదేవ్‌ ఆయుధ పూజ నిర్వహించారు. దసరా ఉత్సవాల సందర్భంగా కురుపాం కోటలో మాజీ కేంద్రమంత్రి వైరిచర్ల కిషోర్‌ చంద్రదేవ్‌ ఆయుధ పూజ నిర్వహించారు.
3/23
చిరంజీవి హీరోగా నటించిన పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘గాడ్‌ ఫాదర్‌’. మోహన్‌రాజా దర్శకత్వం వహించిన ఈ సినిమా నేడు విడుదలైంది. సినీ ప్రేక్షకుల నుంచి మంచి టాక్‌ రావడంతో చిత్రబృందం కథానాయకుడు చిరంజీవిని కలిసి శుభాకాంక్షలు తెలిపింది. చిరంజీవి హీరోగా నటించిన పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘గాడ్‌ ఫాదర్‌’. మోహన్‌రాజా దర్శకత్వం వహించిన ఈ సినిమా నేడు విడుదలైంది. సినీ ప్రేక్షకుల నుంచి మంచి టాక్‌ రావడంతో చిత్రబృందం కథానాయకుడు చిరంజీవిని కలిసి శుభాకాంక్షలు తెలిపింది.
4/23
జై అమరావతి నినాదాలతో రైతుల మహాపాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలో సాగుతోంది. ఉదయం పెంటపాడు ఎస్టీవీఎన్‌ హిందూ ఉన్నత పాఠశాల నుంచి ప్రారంభమైంది. కె.పెంటపాడు, యానాలపల్లి, పరిమెళ్ల మీదుగా గణపవరం వెళ్లి సరిపల్లిలో ముగుస్తుంది. మొత్తం 15 కిమీ మేర యాత్ర సాగనుంది. జై అమరావతి నినాదాలతో రైతుల మహాపాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలో సాగుతోంది. ఉదయం పెంటపాడు ఎస్టీవీఎన్‌ హిందూ ఉన్నత పాఠశాల నుంచి ప్రారంభమైంది. కె.పెంటపాడు, యానాలపల్లి, పరిమెళ్ల మీదుగా గణపవరం వెళ్లి సరిపల్లిలో ముగుస్తుంది. మొత్తం 15 కిమీ మేర యాత్ర సాగనుంది.
5/23
మెగాస్టార్‌ చిరంజీవి అభిమానిగా.. ఆయన స్ఫూర్తితో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు సత్యదేవ్‌. ఆచార్య సినిమాలో ఆయనతో కలిసి పనిచేశారు. తాజాగా విడుదలైన గాడ్‌ఫాదర్‌లోనూ నటించారు. ఈ చిత్రంలో సత్యదేవ్‌ నటనకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. దాంతో భావోద్వేగానికి గురయిన సత్యదేవ్‌ ‘మీకు ఇంతకన్నా ఏం చెప్పగలను’ అంటూ తాను ‘గాడ్‌ ఫాదర్‌’ ప్రీ రిలీజ్‌ వేడుకలో చిరు చేతిని ముద్దాడిన ఫొటోను ట్విటర్‌లో పంచుకున్నారు. మెగాస్టార్‌ చిరంజీవి అభిమానిగా.. ఆయన స్ఫూర్తితో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు సత్యదేవ్‌. ఆచార్య సినిమాలో ఆయనతో కలిసి పనిచేశారు. తాజాగా విడుదలైన గాడ్‌ఫాదర్‌లోనూ నటించారు. ఈ చిత్రంలో సత్యదేవ్‌ నటనకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. దాంతో భావోద్వేగానికి గురయిన సత్యదేవ్‌ ‘మీకు ఇంతకన్నా ఏం చెప్పగలను’ అంటూ తాను ‘గాడ్‌ ఫాదర్‌’ ప్రీ రిలీజ్‌ వేడుకలో చిరు చేతిని ముద్దాడిన ఫొటోను ట్విటర్‌లో పంచుకున్నారు.
6/23
నంద్యాల జిల్లా కేంద్రంలోని సంజీవనగర్ రామాలయంలో వెలసిన శ్రీ వేంకటేశ్వరస్వామిని వక్క పూతతో అలంకరించారు. విజయదశమి నేపథ్యంలో భగవత్ సేవా సమాజ్ సభ్యులు ఈ అలంకరణ చేశారు. నంద్యాల జిల్లా కేంద్రంలోని సంజీవనగర్ రామాలయంలో వెలసిన శ్రీ వేంకటేశ్వరస్వామిని వక్క పూతతో అలంకరించారు. విజయదశమి నేపథ్యంలో భగవత్ సేవా సమాజ్ సభ్యులు ఈ అలంకరణ చేశారు.
7/23
శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జూబ్లీహిల్స్‌ పెద్దమ్మతల్లి ఆలయంలో భక్తుల కోలాహలం నెలకొంది. నగరం నలుమూలల నుంచి భక్తులు తరలిరావడంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జూబ్లీహిల్స్‌ పెద్దమ్మతల్లి ఆలయంలో భక్తుల కోలాహలం నెలకొంది. నగరం నలుమూలల నుంచి భక్తులు తరలిరావడంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి.
8/23
9/23
దసరా పర్వదినం సందర్భంగా అంబర్‌పేటలోని శ్రీ మహంకాళి దేవాలయాన్ని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సందర్శించారు. ఆయన సతీమణి కావ్యతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. పండగ సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. దసరా పర్వదినం సందర్భంగా అంబర్‌పేటలోని శ్రీ మహంకాళి దేవాలయాన్ని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సందర్శించారు. ఆయన సతీమణి కావ్యతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. పండగ సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.
10/23
11/23
కళియుగ వైకుంఠనాథుడైన శ్రీవేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో ఆఖరి ఘట్టమైన శ్రీవారి చక్రస్నానం ఘనంగా నిర్వహించారు. ఆలయ పుష్కరిణిలో నిర్వహించిన చక్రస్నానం కార్యక్రమంలో విశ్రాంత సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి. రమణ, తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కళియుగ వైకుంఠనాథుడైన శ్రీవేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో ఆఖరి ఘట్టమైన శ్రీవారి చక్రస్నానం ఘనంగా నిర్వహించారు. ఆలయ పుష్కరిణిలో నిర్వహించిన చక్రస్నానం కార్యక్రమంలో విశ్రాంత సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి. రమణ, తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
12/23
13/23
14/23
దసరా ఉత్సవాల చివరి రోజైన నేడు ఇంద్రకీలాద్రిపై కొలువైన కనక దుర్గ అమ్మవారు రాజరాజేశ్వరి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. చెరకుగడను వామహస్తంతో ధరించి దక్షిణ హస్తంతో అభయాన్ని ప్రసాదింపజేస్తున్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులుతీరారు. దసరా ఉత్సవాల చివరి రోజైన నేడు ఇంద్రకీలాద్రిపై కొలువైన కనక దుర్గ అమ్మవారు రాజరాజేశ్వరి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. చెరకుగడను వామహస్తంతో ధరించి దక్షిణ హస్తంతో అభయాన్ని ప్రసాదింపజేస్తున్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులుతీరారు.
15/23
16/23
దసరా ఉత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువైన కనక దుర్గ అమ్మవారిని తెదేపా అధినేత చంద్రబాబు సతీసమేతంగా దర్శించుకున్నారు. చంద్రబాబు దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టువస్త్రాలు సమర్పించారు.  దసరా ఉత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువైన కనక దుర్గ అమ్మవారిని తెదేపా అధినేత చంద్రబాబు సతీసమేతంగా దర్శించుకున్నారు. చంద్రబాబు దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టువస్త్రాలు సమర్పించారు.
17/23
18/23
దసరా పండగ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తన నివాసంలో కాంగ్రెస్‌ ముఖ్య నేతలకు అల్పాహార విందు ఏర్పాటు చేశారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, జోడో యాత్ర జాతీయ కన్వీనర్‌ దిగ్విజయ్‌సింగ్‌, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్‌, మాజీ ఎంపీలు కేవీపీ రామచంద్రరావు, రేణుకా చౌదరి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. దసరా పండగ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తన నివాసంలో కాంగ్రెస్‌ ముఖ్య నేతలకు అల్పాహార విందు ఏర్పాటు చేశారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, జోడో యాత్ర జాతీయ కన్వీనర్‌ దిగ్విజయ్‌సింగ్‌, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్‌, మాజీ ఎంపీలు కేవీపీ రామచంద్రరావు, రేణుకా చౌదరి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.
19/23
తెలంగాణ రాష్ట్ర సమితిని.. భారత్‌ రాష్ట్ర సమితిగా మారుస్తున్న నేపథ్యంలో హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌ వద్ద సందడి నెలకొంది. పరిసరాల్లో ఎటు చూసినా ‘దేశ్‌ కి నేత కేసీఆర్‌’ అంటూ ఫ్లెక్సీలు దర్శమిస్తున్నాయి. ఓ వ్యక్తి ఇలా తన శరీరంపై సీఎం కేసీఆర్‌ను కీర్తిస్తూ నినాదాలు రాసుకొచ్చాడు. మరో వైపు సీఎం కేసీఆర్‌ తెలంగాణ భవన్‌లో నిర్వహించే సమావేశానికి ఎమ్మెల్యేలు, మంత్రులు, తెరాస ముఖ్యనేతలు తరలివస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితిని.. భారత్‌ రాష్ట్ర సమితిగా మారుస్తున్న నేపథ్యంలో హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌ వద్ద సందడి నెలకొంది. పరిసరాల్లో ఎటు చూసినా ‘దేశ్‌ కి నేత కేసీఆర్‌’ అంటూ ఫ్లెక్సీలు దర్శమిస్తున్నాయి. ఓ వ్యక్తి ఇలా తన శరీరంపై సీఎం కేసీఆర్‌ను కీర్తిస్తూ నినాదాలు రాసుకొచ్చాడు. మరో వైపు సీఎం కేసీఆర్‌ తెలంగాణ భవన్‌లో నిర్వహించే సమావేశానికి ఎమ్మెల్యేలు, మంత్రులు, తెరాస ముఖ్యనేతలు తరలివస్తున్నారు.
20/23
21/23
22/23
ప్రకృతి.. ఎన్నో వింతల సమాహారం. అలాంటి వింతల్లో ఒకటి చిలీలో చోటు చేసుకుంది. కోపియాపో సమీపంలోని అటకామా ఎడారిలో ఇలా పువ్వులు పూశాయి. నమ్మశక్యంగా లేదు కదూ! కానీ ఇది నిజం. ప్రతి ఐదు నుంచి ఏడేళ్లకొకసారి ఆ ప్రాంతంలో విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయట. దాంతో అక్కడ కొన్ని పూల మొక్కలు పెరిగి.. అవి పువ్వులు విరబూస్తూ స్థానికులకు కనువిందు చేస్తున్నాయి. ప్రకృతి.. ఎన్నో వింతల సమాహారం. అలాంటి వింతల్లో ఒకటి చిలీలో చోటు చేసుకుంది. కోపియాపో సమీపంలోని అటకామా ఎడారిలో ఇలా పువ్వులు పూశాయి. నమ్మశక్యంగా లేదు కదూ! కానీ ఇది నిజం. ప్రతి ఐదు నుంచి ఏడేళ్లకొకసారి ఆ ప్రాంతంలో విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయట. దాంతో అక్కడ కొన్ని పూల మొక్కలు పెరిగి.. అవి పువ్వులు విరబూస్తూ స్థానికులకు కనువిందు చేస్తున్నాయి.
23/23

మరిన్ని