News In Pics : చిత్రం చెప్పే సంగతులు -(17-11-2022)

Updated : 17 Nov 2022 12:54 IST
1/19
అనంతపురం శింగనమల చెరువు మరువ వద్ద గత రెండు నెలలుగా నీటి ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ప్రవాహం కాస్త తగ్గడంతో రహదారి ఛిద్రమై శిథిలాలు బయటకు కనిపిస్తున్నాయి.  కొన్ని చోట్ల గుంతలు పడటంతో సూచికగా రాళ్లు ఏర్పాటు చేశారు. పాచీ పేరుకుపోవడంతో వాహనదారులు జారిపడుతున్నారు.. అనంతపురం శింగనమల చెరువు మరువ వద్ద గత రెండు నెలలుగా నీటి ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ప్రవాహం కాస్త తగ్గడంతో రహదారి ఛిద్రమై శిథిలాలు బయటకు కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల గుంతలు పడటంతో సూచికగా రాళ్లు ఏర్పాటు చేశారు. పాచీ పేరుకుపోవడంతో వాహనదారులు జారిపడుతున్నారు..
2/19
పల్నాడు జిల్లా దుర్గిలో కొలువైన వేణుగోపాలస్వామి దేవాలయ కూడలిలో మంగళవారం రాత్రి అయ్యప్ప పడి పూజ వైభవంగా నిర్వహించారు. అయ్యప్ప, కనకదుర్గ, శివ, నిదానంపాటి అమ్మవారి దీక్షాధారులు భారీగా పాల్గొని భజనలు చేశారు. హోమగుండం నుంచి పలువురు స్వాములు నడిచారు. పల్నాడు జిల్లా దుర్గిలో కొలువైన వేణుగోపాలస్వామి దేవాలయ కూడలిలో మంగళవారం రాత్రి అయ్యప్ప పడి పూజ వైభవంగా నిర్వహించారు. అయ్యప్ప, కనకదుర్గ, శివ, నిదానంపాటి అమ్మవారి దీక్షాధారులు భారీగా పాల్గొని భజనలు చేశారు. హోమగుండం నుంచి పలువురు స్వాములు నడిచారు.
3/19
నిత్యావసరాలకైనా.. అత్యవసరానికైనా.. పట్టణానికి వెళ్లాలన్నా.. ఆ గ్రామస్థులు గోముఖిని దాటాల్సిందే. వర్షాలు అయినా.. వరద అయినా.. తప్పదు. అదెక్కడ అనుకుంటున్నారా.. పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరు మండలం పట్టుచెన్నూరు పంచాయతీ కోమటివలస. ఇదే మండలంలోని శిఖపరువు గ్రామానికి వచ్చే ‘ఇంటింటికీ రేషన్‌ బియ్యం’ వాహనం వద్దకు ప్రతి నెలా వెళ్లి తిరిగి సరకుతో కాలినడకన సుమారు రెండు కి.మీ. దూరంలో ఉన్న సొంతూరు చేరుకుంటారు. మధ్యలో గోముఖి దాటుకుంటూ శిఖరాగ్రాన ఉన్న గ్రామానికి అతికష్టం మీద నడుచుకుంటూ వెళ్తున్నారు. నిత్యావసరాలకైనా.. అత్యవసరానికైనా.. పట్టణానికి వెళ్లాలన్నా.. ఆ గ్రామస్థులు గోముఖిని దాటాల్సిందే. వర్షాలు అయినా.. వరద అయినా.. తప్పదు. అదెక్కడ అనుకుంటున్నారా.. పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరు మండలం పట్టుచెన్నూరు పంచాయతీ కోమటివలస. ఇదే మండలంలోని శిఖపరువు గ్రామానికి వచ్చే ‘ఇంటింటికీ రేషన్‌ బియ్యం’ వాహనం వద్దకు ప్రతి నెలా వెళ్లి తిరిగి సరకుతో కాలినడకన సుమారు రెండు కి.మీ. దూరంలో ఉన్న సొంతూరు చేరుకుంటారు. మధ్యలో గోముఖి దాటుకుంటూ శిఖరాగ్రాన ఉన్న గ్రామానికి అతికష్టం మీద నడుచుకుంటూ వెళ్తున్నారు.
4/19
పొట్టకూటి కోసం పిల్లాపాపలతో కలిసి వలస వెళ్తున్నారు కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని జంబ్గి గ్రామానికి చెందిన కూలీలు. ఏటా నవంబరు నెలలో నిజామాబాద్‌ జిల్లా సాలూర్, బోధన్‌ గ్రామాల్లో చెరకు కొట్టేందుకు వెళుతుంటారు. బుధవారం బీర్కూర్‌ మీదుగా 20 బండ్లపై కూలీలు వెళ్తున్న చిత్రాన్ని న్యూస్‌టుడే క్లిక్‌మనిపించింది. ఒక టన్నుకు రూ.600 కూలీ వస్తుందని, తిరిగి హోలీకి ఇంటికి వెళ్తామని వారు చెప్పారు. పొట్టకూటి కోసం పిల్లాపాపలతో కలిసి వలస వెళ్తున్నారు కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని జంబ్గి గ్రామానికి చెందిన కూలీలు. ఏటా నవంబరు నెలలో నిజామాబాద్‌ జిల్లా సాలూర్, బోధన్‌ గ్రామాల్లో చెరకు కొట్టేందుకు వెళుతుంటారు. బుధవారం బీర్కూర్‌ మీదుగా 20 బండ్లపై కూలీలు వెళ్తున్న చిత్రాన్ని న్యూస్‌టుడే క్లిక్‌మనిపించింది. ఒక టన్నుకు రూ.600 కూలీ వస్తుందని, తిరిగి హోలీకి ఇంటికి వెళ్తామని వారు చెప్పారు.
5/19
ఫార్ములా ఈ రేస్‌ ట్రాక్‌ ఏర్పాటు నేపథ్యంలో బుధవారం నుంచి ఐదు రోజుల పాటు ఎన్టీఆర్‌ మార్గ్‌ రోడ్డులో ట్రాఫిక్‌ ఆంక్షలు మొదలయ్యాయి. ఈ మార్గంలో ఎవరూ వెళ్లకుండా బారికేడ్లు పెట్టారు ట్రాఫిక్‌ను మళ్లించడంతో ఖైరతాబాద్‌ నుంచి లక్డీకాపూల్‌ రోడ్డులో ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ఫార్ములా ఈ రేస్‌ ట్రాక్‌ ఏర్పాటు నేపథ్యంలో బుధవారం నుంచి ఐదు రోజుల పాటు ఎన్టీఆర్‌ మార్గ్‌ రోడ్డులో ట్రాఫిక్‌ ఆంక్షలు మొదలయ్యాయి. ఈ మార్గంలో ఎవరూ వెళ్లకుండా బారికేడ్లు పెట్టారు ట్రాఫిక్‌ను మళ్లించడంతో ఖైరతాబాద్‌ నుంచి లక్డీకాపూల్‌ రోడ్డులో ట్రాఫిక్‌ నిలిచిపోయింది.
6/19
ఖాజాగూడ నుంచి గచ్చిబౌలి లింకు రహదారి పక్కన పాదబాటపై భారీ స్తంభాలను వదిలేశారు. నెలల తరబడి అలానే ఉంచడంతో నిత్యం అక్కడికి వస్తోన్న పాదచారులు, ఉదయం పరుగు తీసేవారు బిక్కుబిక్కుమంటూ రహదారి పైకి రావాల్సిన పరిస్థితి. ఖాజాగూడ నుంచి గచ్చిబౌలి లింకు రహదారి పక్కన పాదబాటపై భారీ స్తంభాలను వదిలేశారు. నెలల తరబడి అలానే ఉంచడంతో నిత్యం అక్కడికి వస్తోన్న పాదచారులు, ఉదయం పరుగు తీసేవారు బిక్కుబిక్కుమంటూ రహదారి పైకి రావాల్సిన పరిస్థితి.
7/19
మెదక్‌ జిల్లాలో వరిధాన్యం విక్రయాలకు అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో తూకం పూర్తవడం నుంచి మిల్లుల్లో ధాన్యం దింపే వరకు రైతులదే బాధ్యత కాగా.. ధాన్యం రవాణా చేసే లారీల డ్రైవర్లు బస్తాకు రూ.10 వసూలు చేస్తున్నారు. సమయానికీ రావడం లేదు. దీంతో చాలా మంది రైతులు తామే ట్రాక్టర్లను కిరాయికి తీసుకొని తూకం వేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తున్నారు. మెదక్‌ జిల్లా అల్లాదుర్గం మండలంలోని గడిపెద్దాపూర్‌ మిల్లు వద్ద ఎప్పుడు చూసినా దాదాపు 50కి పైగా ధాన్యం ట్రాక్టర్లు కనిపిస్తున్నాయి. మెదక్‌ జిల్లాలో వరిధాన్యం విక్రయాలకు అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో తూకం పూర్తవడం నుంచి మిల్లుల్లో ధాన్యం దింపే వరకు రైతులదే బాధ్యత కాగా.. ధాన్యం రవాణా చేసే లారీల డ్రైవర్లు బస్తాకు రూ.10 వసూలు చేస్తున్నారు. సమయానికీ రావడం లేదు. దీంతో చాలా మంది రైతులు తామే ట్రాక్టర్లను కిరాయికి తీసుకొని తూకం వేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తున్నారు. మెదక్‌ జిల్లా అల్లాదుర్గం మండలంలోని గడిపెద్దాపూర్‌ మిల్లు వద్ద ఎప్పుడు చూసినా దాదాపు 50కి పైగా ధాన్యం ట్రాక్టర్లు కనిపిస్తున్నాయి.
8/19
కీసర నుంచి ఈసీఐఎల్‌కి వెళ్లే ఆర్టీసీ బస్సులో బుధవారం ఓ విద్యార్థి ప్రమాదమని తెలిసినా వెనకాల పైన అంచు పట్టుకొని నిలబడి ప్రయాణించారు. ఆ వీడియో సామాజిక మాధ్యమంలో వైరలయ్యింది. ‘ప్రాణంతో చెలగాటం అవసరమా...’ అంటూ పలువురు వాపోయారు. పాఠశాలలు, కళాశాలల వేళ అదనంగా బస్సు సర్వీసులు నడిపి విద్యార్థులు ప్రమాదాల బారినపడకుండా చూడాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. కీసర నుంచి ఈసీఐఎల్‌కి వెళ్లే ఆర్టీసీ బస్సులో బుధవారం ఓ విద్యార్థి ప్రమాదమని తెలిసినా వెనకాల పైన అంచు పట్టుకొని నిలబడి ప్రయాణించారు. ఆ వీడియో సామాజిక మాధ్యమంలో వైరలయ్యింది. ‘ప్రాణంతో చెలగాటం అవసరమా...’ అంటూ పలువురు వాపోయారు. పాఠశాలలు, కళాశాలల వేళ అదనంగా బస్సు సర్వీసులు నడిపి విద్యార్థులు ప్రమాదాల బారినపడకుండా చూడాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
9/19
ఓవైపు పారబోసిన వ్యర్థాలను తింటున్న పశువులు.. మరోవైపు దర్జాగా తిష్ఠ వేసిన ఆటోవాలాలు.. ఇదీ లాలాపేటలోని ప్రధాన రహదారిపై ఉన్న బస్టాపు దుస్థితి. మంగళవారం సంత జరగటం వల్ల వచ్చే వ్యర్థాలను ఇలా బస్టాపు ప్రాంగణంలో వదిలేసి వెళ్లారు. దీంతో అధ్వానంగా ఉన్న బస్టాప్‌లో ప్రయాణికులు నిలుచోలేక ఇబ్బంది పడుతున్నారు. ఓవైపు పారబోసిన వ్యర్థాలను తింటున్న పశువులు.. మరోవైపు దర్జాగా తిష్ఠ వేసిన ఆటోవాలాలు.. ఇదీ లాలాపేటలోని ప్రధాన రహదారిపై ఉన్న బస్టాపు దుస్థితి. మంగళవారం సంత జరగటం వల్ల వచ్చే వ్యర్థాలను ఇలా బస్టాపు ప్రాంగణంలో వదిలేసి వెళ్లారు. దీంతో అధ్వానంగా ఉన్న బస్టాప్‌లో ప్రయాణికులు నిలుచోలేక ఇబ్బంది పడుతున్నారు.
10/19
కూకట్‌పల్లిలోని చిత్తారమ్మ దేవాలయం వడ్డేపల్లి ఎన్‌క్లేవ్‌ చౌరస్తా వద్ద నిత్యం ఉదయం, సాయంత్రం భారీగా ట్రాఫిక్‌ స్తంభిస్తోంది. నియంత్రణ లేక ఏ వాహనం ఎటు పోతుందో తెలియని పరిస్థితి. కూకట్‌పల్లిలోని చిత్తారమ్మ దేవాలయం వడ్డేపల్లి ఎన్‌క్లేవ్‌ చౌరస్తా వద్ద నిత్యం ఉదయం, సాయంత్రం భారీగా ట్రాఫిక్‌ స్తంభిస్తోంది. నియంత్రణ లేక ఏ వాహనం ఎటు పోతుందో తెలియని పరిస్థితి.
11/19
ఛార్జింగ్‌ అయిపోవడంతో బ్యాటరీ ఆటో కూకట్‌పల్లిలో రోడ్డ్డు మధ్యలో ఆగింది. అటుగా వెళ్తున్న మరో బ్యాటరీ ఆటో డ్రైవర్‌ వెనక నుంచి కాలితో నెడుతూ వెళ్లడం కనిపించింది. ఛార్జింగ్‌ అయిపోవడంతో బ్యాటరీ ఆటో కూకట్‌పల్లిలో రోడ్డ్డు మధ్యలో ఆగింది. అటుగా వెళ్తున్న మరో బ్యాటరీ ఆటో డ్రైవర్‌ వెనక నుంచి కాలితో నెడుతూ వెళ్లడం కనిపించింది.
12/19
గొల్లభామ జాతి కీటకాలు ఎక్కువగా ఆయా ప్రాంతాల వాతావరణానికి తగ్గ రంగుల్లో కలిసిపోయి సంచరిస్తుంటాయి. పరీక్షగా చూస్తేగానీ గుర్తుపట్టలేం. అలా బుధవారం విశాఖపట్నం కంచరపాలెంలోని జాతీయ రహదారి పక్కన మొక్కలపై ఉన్న గొల్లభామ చెంతకు వెళ్లగా...ఒక్కసారిగా పడగ విప్పినట్లు మెడ పైకి లేపి క్షణాల్లో అక్కడి నుంచి వెళ్లిపోయింది. గొల్లభామ జాతి కీటకాలు ఎక్కువగా ఆయా ప్రాంతాల వాతావరణానికి తగ్గ రంగుల్లో కలిసిపోయి సంచరిస్తుంటాయి. పరీక్షగా చూస్తేగానీ గుర్తుపట్టలేం. అలా బుధవారం విశాఖపట్నం కంచరపాలెంలోని జాతీయ రహదారి పక్కన మొక్కలపై ఉన్న గొల్లభామ చెంతకు వెళ్లగా...ఒక్కసారిగా పడగ విప్పినట్లు మెడ పైకి లేపి క్షణాల్లో అక్కడి నుంచి వెళ్లిపోయింది.
13/19
ఓ రైతు వినూత్న ఆలోచన లాభాల సిరులు కురిపిస్తోంది. చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం గాంధీపురం గ్రామానికి చెందిన నర్సరీ రైతు ప్రకాష్‌.. ఎకరా పొలంలో చామంతి సాగు చేస్తున్నారు. మొగ్గలు రాకుండా ఉండేందుకు పొలంలో దాదాపు 500 వరకు ఎల్‌ఈడీ బల్బులను ఏర్పాటు చేశారు. 90 శాతం మొక్కలకు వెలుతురు ఉండేలా రాత్రి సమయాల్లో బల్బులను వేసి వెలుగులు పంచుతున్నారు. ఓ రైతు వినూత్న ఆలోచన లాభాల సిరులు కురిపిస్తోంది. చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం గాంధీపురం గ్రామానికి చెందిన నర్సరీ రైతు ప్రకాష్‌.. ఎకరా పొలంలో చామంతి సాగు చేస్తున్నారు. మొగ్గలు రాకుండా ఉండేందుకు పొలంలో దాదాపు 500 వరకు ఎల్‌ఈడీ బల్బులను ఏర్పాటు చేశారు. 90 శాతం మొక్కలకు వెలుతురు ఉండేలా రాత్రి సమయాల్లో బల్బులను వేసి వెలుగులు పంచుతున్నారు.
14/19
 కొండపోచమ్మ సాగర్‌ ప్రాజెక్టులోకి 12 టీఎంసీలను నింపారు. దీంతో నిండు కుండలా మారిన ప్రాజెక్టు చూపర్లను ఆకట్టుకుంటోంది. కొండపోచమ్మ సాగర్‌ ప్రాజెక్టులోకి 12 టీఎంసీలను నింపారు. దీంతో నిండు కుండలా మారిన ప్రాజెక్టు చూపర్లను ఆకట్టుకుంటోంది.
15/19
 నటశేఖర కృష్ణ కడసారి చూపు కోసం అభిమానులు భారీగా తరలివచ్చారు. వందలాది చిత్రాలతో తమను అలరించి దిగంతాలకేగిన సూపర్‌స్టార్‌కు తుది వీడ్కోలు పలికేందుకు వచ్చిన వారితో బుధవారం జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానం రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. అంతకుముందు పలువురు ప్రముఖులు మహేష్‌బాబు,     కుటుంబసభ్యులను పరామర్శించారు. నటశేఖర కృష్ణ కడసారి చూపు కోసం అభిమానులు భారీగా తరలివచ్చారు. వందలాది చిత్రాలతో తమను అలరించి దిగంతాలకేగిన సూపర్‌స్టార్‌కు తుది వీడ్కోలు పలికేందుకు వచ్చిన వారితో బుధవారం జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానం రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. అంతకుముందు పలువురు ప్రముఖులు మహేష్‌బాబు, కుటుంబసభ్యులను పరామర్శించారు.
16/19
అన్నవరం సత్యదేవుని నామస్మరణతో రత్నగిరి మార్మోగింది. స్వామివారి పడిపూజ బుధవారం రాత్రి వేడుకగా జరిగింది. సత్య దీక్ష చేపట్టిన భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని పూజలు చేశారు. అన్నవరం సత్యదేవుని నామస్మరణతో రత్నగిరి మార్మోగింది. స్వామివారి పడిపూజ బుధవారం రాత్రి వేడుకగా జరిగింది. సత్య దీక్ష చేపట్టిన భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని పూజలు చేశారు.
17/19
 అనకాపల్లి జిల్లా కశింకోటలో పడమటమ్మ పుట్టుక మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి పెద్ద సంఖ్యలో మహిళలు సారె సమర్పించారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన బిందెల నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనకాపల్లి జిల్లా కశింకోటలో పడమటమ్మ పుట్టుక మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి పెద్ద సంఖ్యలో మహిళలు సారె సమర్పించారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన బిందెల నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
18/19
విశాఖపట్నంలో తూర్పు నౌకాదళానికి (ఈఎన్‌సీ) చెందిన నేవల్‌ ఎయిర్‌స్టేషన్‌ ‘ఐఎన్‌ఎస్‌ డేగా’ ఏర్పాటు చేసి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక లోగో ఆవిష్కరిస్తున్న నేవీ అధికారులు విశాఖపట్నంలో తూర్పు నౌకాదళానికి (ఈఎన్‌సీ) చెందిన నేవల్‌ ఎయిర్‌స్టేషన్‌ ‘ఐఎన్‌ఎస్‌ డేగా’ ఏర్పాటు చేసి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక లోగో ఆవిష్కరిస్తున్న నేవీ అధికారులు
19/19
అమెరికాలోని ఫ్లోరిడాలో బుధవారం ప్రయోగించిన నాసా మూన్‌ రాకెట్‌ ‘ఆర్టెమిస్‌-1’ నుంచి కనిపిస్తున్న భూగోళం. అమెరికాలోని ఫ్లోరిడాలో బుధవారం ప్రయోగించిన నాసా మూన్‌ రాకెట్‌ ‘ఆర్టెమిస్‌-1’ నుంచి కనిపిస్తున్న భూగోళం.

మరిన్ని