News In Pics : చిత్రం చెప్పే సంగతులు - (19-11-2022)

Updated : 19 Nov 2022 13:13 IST
1/26
విజయనగరం జిల్లా పాలకొండ పట్టణంలోని శ్రీశయనవీధిలో సత్యసాయి శివం మందిరం రూపుదిద్దుకుంటోంది. ఇందులో భాగంగా పై కప్పుపై భారీ శివలింగాన్ని ఏర్పాటు చేశారు. ఈనెల 22న ఈ ఆలయాన్ని ప్రారంభించనున్నారు. విజయనగరం జిల్లా పాలకొండ పట్టణంలోని శ్రీశయనవీధిలో సత్యసాయి శివం మందిరం రూపుదిద్దుకుంటోంది. ఇందులో భాగంగా పై కప్పుపై భారీ శివలింగాన్ని ఏర్పాటు చేశారు. ఈనెల 22న ఈ ఆలయాన్ని ప్రారంభించనున్నారు.
2/26
సంగారెడ్డి జిల్లాలోని అమీన్‌పూర్‌ చెరువులో క్యాట్‌ఫిష్‌ పెరుగుతుండటంతో మత్స్యకారులు ఆందోళనకు గురవుతున్నారు. ఇవి ఇతర చిన్న చేపలను తినేయడమే కారణం. బయోడైవర్సిటీ(జీవ వైవిధ్యం) కింద గుర్తించిన చెరువు ఇది. గతంలో మాజీ డీజీపీ అనురాగ్‌కౌర్‌ జల వనరు సంరక్షణకు చర్యలు తీసుకున్నారు. నీరు స్వచ్ఛంగా ఉండటంతో స్వేచ్ఛగా విహరించాల్సిన చేపలు క్యాట్‌ఫిష్‌ ధాటికి మృత్యువాతపడుతున్నాయి. ఈ విషయమై సంగారెడ్డి జిల్లా మత్స్యశాఖ అధికారి సతీష్‌ను వివరణ కోరగా.. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. నీరు ఎండిపోయే వరకు ఏమీ చేయలేని పరిస్థితి అని పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లాలోని అమీన్‌పూర్‌ చెరువులో క్యాట్‌ఫిష్‌ పెరుగుతుండటంతో మత్స్యకారులు ఆందోళనకు గురవుతున్నారు. ఇవి ఇతర చిన్న చేపలను తినేయడమే కారణం. బయోడైవర్సిటీ(జీవ వైవిధ్యం) కింద గుర్తించిన చెరువు ఇది. గతంలో మాజీ డీజీపీ అనురాగ్‌కౌర్‌ జల వనరు సంరక్షణకు చర్యలు తీసుకున్నారు. నీరు స్వచ్ఛంగా ఉండటంతో స్వేచ్ఛగా విహరించాల్సిన చేపలు క్యాట్‌ఫిష్‌ ధాటికి మృత్యువాతపడుతున్నాయి. ఈ విషయమై సంగారెడ్డి జిల్లా మత్స్యశాఖ అధికారి సతీష్‌ను వివరణ కోరగా.. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. నీరు ఎండిపోయే వరకు ఏమీ చేయలేని పరిస్థితి అని పేర్కొన్నారు.
3/26
తెలంగాణ కశ్మీరంగా పిలిచే ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో కొన్ని రోజులుగా రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాయంత్రం నుంచే మంచు కురవడంతో పాటు చలిగాలులు వీస్తున్నాయి. ఉట్నూరు - జన్నారం మార్గమధ్యలో కవ్వాల్‌ అభయారణ్యంలో కురుస్తున్న మంచును చీల్చుకుంటూ వస్తున్న సూర్యకిరణాలు కనువిందు చేస్తున్నాయి. అటుగా ప్రయాణించే వారితో పాటు, ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటున్నాయి.. తెలంగాణ కశ్మీరంగా పిలిచే ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో కొన్ని రోజులుగా రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాయంత్రం నుంచే మంచు కురవడంతో పాటు చలిగాలులు వీస్తున్నాయి. ఉట్నూరు - జన్నారం మార్గమధ్యలో కవ్వాల్‌ అభయారణ్యంలో కురుస్తున్న మంచును చీల్చుకుంటూ వస్తున్న సూర్యకిరణాలు కనువిందు చేస్తున్నాయి. అటుగా ప్రయాణించే వారితో పాటు, ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటున్నాయి..
4/26
ఆదిలాబాద్‌ జిల్లా కుంటాల మండలంలోని దౌనెల్లి గ్రామంలోని భూమన్నకు చెందిన ఆవుకు శుక్రవారం తెల్లవారుజామున వింత దూడ జన్మించింది. సాధారణంగా కాలుకు రెండు గిట్టలు(డెక్కలు) ఉంటాయి. అయితే ఆ దూడ ముందు కాళ్లకు మూడు చొప్పున, వెనక కాళ్లకు నాలుగు చొప్పున ఉన్నాయి. మొత్తంగా కాలుకు రెండు చొప్పున 8 ఉండాల్సి ఉండగా 14 ఉన్నాయి. ఆదిలాబాద్‌ జిల్లా కుంటాల మండలంలోని దౌనెల్లి గ్రామంలోని భూమన్నకు చెందిన ఆవుకు శుక్రవారం తెల్లవారుజామున వింత దూడ జన్మించింది. సాధారణంగా కాలుకు రెండు గిట్టలు(డెక్కలు) ఉంటాయి. అయితే ఆ దూడ ముందు కాళ్లకు మూడు చొప్పున, వెనక కాళ్లకు నాలుగు చొప్పున ఉన్నాయి. మొత్తంగా కాలుకు రెండు చొప్పున 8 ఉండాల్సి ఉండగా 14 ఉన్నాయి.
5/26
వికారాబాద్‌ జిల్లా పరిగి మండలం చిగురాల్‌పల్లి రైతులు లఖ్నాపూర్‌ ప్రాజెక్టు పరిధి కిందకు వచ్చే పెద్దవాగు, చిన్నవాగు, హన్నారం వాగుల అవతల 500 ఎకరాలు సాగు చేసుకుంటున్నారు. పొలాలకు వెళ్లాలంటే వీరు ఈ మూడు వాగులు దాటాల్సిందే. రూ.4లక్షలకు పైగా చందాలు వేసుకుని కర్రల వంతెన నిర్మించినప్పటికీ.. ఇటీవల వర్షాలకు అది కొట్టుకుపోయింది. దీంతో ఇసుక బస్తాలను వాగులో వరుసగా పేర్చి వాటిపై నడుస్తూ పొలం పనులకు వెళ్తున్నారు. ప్రభుత్వం వంతెన నిర్మించాలని కోరుతున్నారు. వికారాబాద్‌ జిల్లా పరిగి మండలం చిగురాల్‌పల్లి రైతులు లఖ్నాపూర్‌ ప్రాజెక్టు పరిధి కిందకు వచ్చే పెద్దవాగు, చిన్నవాగు, హన్నారం వాగుల అవతల 500 ఎకరాలు సాగు చేసుకుంటున్నారు. పొలాలకు వెళ్లాలంటే వీరు ఈ మూడు వాగులు దాటాల్సిందే. రూ.4లక్షలకు పైగా చందాలు వేసుకుని కర్రల వంతెన నిర్మించినప్పటికీ.. ఇటీవల వర్షాలకు అది కొట్టుకుపోయింది. దీంతో ఇసుక బస్తాలను వాగులో వరుసగా పేర్చి వాటిపై నడుస్తూ పొలం పనులకు వెళ్తున్నారు. ప్రభుత్వం వంతెన నిర్మించాలని కోరుతున్నారు.
6/26
విశాఖ, అరకు ప్రాంతాలకు వచ్చే పర్యాటకుల సంఖ్య భారీగా పెరుగుతోంది. కొందరు ప్రకృతి నడుమ అడవుల్లో కొండలపై గడపాలనుకుంటున్నారు. అలాంటి వారి కోసమే సరికొత్త తరహా గుడారాలు అందుబాటులోకి వచ్చాయి. వీటిని వాహనాలపైనా, నేలపైనా ఏర్పాటు చేసుకోవచ్చు. విశాఖ, అరకు ప్రాంతాలకు వచ్చే పర్యాటకుల సంఖ్య భారీగా పెరుగుతోంది. కొందరు ప్రకృతి నడుమ అడవుల్లో కొండలపై గడపాలనుకుంటున్నారు. అలాంటి వారి కోసమే సరికొత్త తరహా గుడారాలు అందుబాటులోకి వచ్చాయి. వీటిని వాహనాలపైనా, నేలపైనా ఏర్పాటు చేసుకోవచ్చు.
7/26
ఉప్పల్‌లోని నాగోల్‌ మెట్రో స్టేషన్‌ బస్టాప్‌లో పైన వస్త్రం చిరిగింది. ఎండకు ప్రయాణికులు నానాయాతన పడుతున్నారు. అంతేకాక దాని ఎదుట కొందరు వాహనాలు నిలుపుతున్నారు. ఉప్పల్‌లోని నాగోల్‌ మెట్రో స్టేషన్‌ బస్టాప్‌లో పైన వస్త్రం చిరిగింది. ఎండకు ప్రయాణికులు నానాయాతన పడుతున్నారు. అంతేకాక దాని ఎదుట కొందరు వాహనాలు నిలుపుతున్నారు.
8/26
కార్తిక మాసోత్సవాల సందర్భంగా సనత్‌నగర్‌ హనుమాన్‌ దేవస్థానం ఆవరణలోని మల్లికార్జునస్వామి ఆలయంలో శుక్రవారం విశేష పూజలు నిర్వహించారు. ప్రధాన అర్చకులు రిపుంజయ్‌శర్మ పర్యవేక్షణలో స్వామివారికి వక్కలతో ప్రత్యేక అలంకారం నిర్వహించారు. కార్తిక మాసోత్సవాల సందర్భంగా సనత్‌నగర్‌ హనుమాన్‌ దేవస్థానం ఆవరణలోని మల్లికార్జునస్వామి ఆలయంలో శుక్రవారం విశేష పూజలు నిర్వహించారు. ప్రధాన అర్చకులు రిపుంజయ్‌శర్మ పర్యవేక్షణలో స్వామివారికి వక్కలతో ప్రత్యేక అలంకారం నిర్వహించారు.
9/26
జోడో యాత్రలో రాహుల్‌తో కలిసి నడుస్తున్న కార్గిల్‌ యుద్ధ వీరుడు నాయక్‌ దీప్‌చంద్‌. జోడో యాత్రలో రాహుల్‌తో కలిసి నడుస్తున్న కార్గిల్‌ యుద్ధ వీరుడు నాయక్‌ దీప్‌చంద్‌.
10/26
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును శుక్రవారం దిల్లీలో మర్యాదపూర్వకంగా కలిసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, ఆయన సతీమణి కల్పనా దాస్‌. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును శుక్రవారం దిల్లీలో మర్యాదపూర్వకంగా కలిసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, ఆయన సతీమణి కల్పనా దాస్‌.
11/26
ఏపుగా పెరిగిన రావిచెట్ల చెంతే మళ్లీ రావి మొక్కలు పెట్టి రక్షణగా ముళ్ల కంచెలు ఏర్పాటుచేసిన చిత్రమిది. నిజాం కళాశాల ముందు రహదారిలో ఈ పరిస్థితి కనిపించింది. ఏపుగా పెరిగిన రావిచెట్ల చెంతే మళ్లీ రావి మొక్కలు పెట్టి రక్షణగా ముళ్ల కంచెలు ఏర్పాటుచేసిన చిత్రమిది. నిజాం కళాశాల ముందు రహదారిలో ఈ పరిస్థితి కనిపించింది.
12/26
జేఎన్‌టీయూ చౌరస్తాలో సిగ్నల్‌ పడినా.. రోడ్డు దాటేందుకు పాదచారులు తీవ్ర అవస్థలు పడాల్సి వస్తోంది. ఈ కూడలిలోని రహదారిపై ఉన్న జీబ్రా గీతలపైనే స్టీరింగ్‌ ఆటోలను సంబంధిత డ్రైవర్లు నిలుపుతుండడమే ఇందుకు కారణం. 30 సెకన్ల వ్యవధిలోనే రోడ్డు దాటాల్సి రావడంతో.. ఉరుకులు పరుగులు పెడుతూ ఆటోల సందుల్లో నుంచి వెళ్లాల్సి వస్తోంది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జేఎన్‌టీయూ చౌరస్తాలో సిగ్నల్‌ పడినా.. రోడ్డు దాటేందుకు పాదచారులు తీవ్ర అవస్థలు పడాల్సి వస్తోంది. ఈ కూడలిలోని రహదారిపై ఉన్న జీబ్రా గీతలపైనే స్టీరింగ్‌ ఆటోలను సంబంధిత డ్రైవర్లు నిలుపుతుండడమే ఇందుకు కారణం. 30 సెకన్ల వ్యవధిలోనే రోడ్డు దాటాల్సి రావడంతో.. ఉరుకులు పరుగులు పెడుతూ ఆటోల సందుల్లో నుంచి వెళ్లాల్సి వస్తోంది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
13/26
మూడేళ్ల తర్వాత నగరంలో జరుగుతున్న ప్రొ కబడ్డీ లీగ్‌  అభిమానులకు కొత్త జోష్‌ తెచ్చింది. ఆటగాళ్ల విన్యాసాలు చూస్తూ ప్రేక్షకులు కేకలతో సందడిచేశారు గచ్చిబౌలి స్టేడియంలో శుక్రవారం జరిగిన మూడు మ్యాచ్‌లనూ ఆస్వాదించారు. నటుడు సుడిగాలి సుధీర్‌ వ్యాఖ్యానంతో ఆకట్టుకున్నాడు. మూడేళ్ల తర్వాత నగరంలో జరుగుతున్న ప్రొ కబడ్డీ లీగ్‌ అభిమానులకు కొత్త జోష్‌ తెచ్చింది. ఆటగాళ్ల విన్యాసాలు చూస్తూ ప్రేక్షకులు కేకలతో సందడిచేశారు గచ్చిబౌలి స్టేడియంలో శుక్రవారం జరిగిన మూడు మ్యాచ్‌లనూ ఆస్వాదించారు. నటుడు సుడిగాలి సుధీర్‌ వ్యాఖ్యానంతో ఆకట్టుకున్నాడు.
14/26
బోడుప్పల్‌లోని బొమ్మకు శాంతమ్మ గార్డెన్‌ సమీపంలో మినీ వ్యాన్‌పై యువకుడు నిల్చొని ప్రమాదకరంగా ప్రయాణించాడు. ట్రాఫిక్‌ పోలీసులు అలాంటి వాహనాలపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. బోడుప్పల్‌లోని బొమ్మకు శాంతమ్మ గార్డెన్‌ సమీపంలో మినీ వ్యాన్‌పై యువకుడు నిల్చొని ప్రమాదకరంగా ప్రయాణించాడు. ట్రాఫిక్‌ పోలీసులు అలాంటి వాహనాలపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
15/26
విశాఖపట్నంలోని రుషికొండ వద్ద సాగిన తవ్వకాలు వివాదాస్పదంగా మారాయి. అక్కడ కడుతున్న నిర్మాణాలపైనా ఎన్నో సందేహాలు రేగుతున్నాయి. తవ్వకాలు సాగిన ప్రాంతంలో రాళ్లు, మట్టి కిందికి జారకుండా ఇనుప వల ఏర్పాటు చేసే పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ పనులను అటుగా వెళ్లేవారు ఆసక్తిగా చూస్తున్నారు. విశాఖపట్నంలోని రుషికొండ వద్ద సాగిన తవ్వకాలు వివాదాస్పదంగా మారాయి. అక్కడ కడుతున్న నిర్మాణాలపైనా ఎన్నో సందేహాలు రేగుతున్నాయి. తవ్వకాలు సాగిన ప్రాంతంలో రాళ్లు, మట్టి కిందికి జారకుండా ఇనుప వల ఏర్పాటు చేసే పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ పనులను అటుగా వెళ్లేవారు ఆసక్తిగా చూస్తున్నారు.
16/26
 అరుణాచల్‌ ప్రదేశ్‌ రాజధాని ఈటానగర్‌లోని హొల్లంగిలో నిర్మించిన తొలి గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయం. ప్రధాని మోదీ దీన్ని శనివారం ప్రారంభించనున్నారు. అరుణాచల్‌ ప్రదేశ్‌ రాజధాని ఈటానగర్‌లోని హొల్లంగిలో నిర్మించిన తొలి గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయం. ప్రధాని మోదీ దీన్ని శనివారం ప్రారంభించనున్నారు.
17/26
 ప్రపంచంలోనే అత్యంత పొడవైన మీసాలు కలిగిన గిర్ధర్‌ వ్యాస్‌తో రాజస్థాన్‌ బికానేర్‌లోని జునాగఢ్‌ కోటలో ఫొటో దిగుతున్న విదేశీ పర్యాటకురాలు. ప్రపంచంలోనే అత్యంత పొడవైన మీసాలు కలిగిన గిర్ధర్‌ వ్యాస్‌తో రాజస్థాన్‌ బికానేర్‌లోని జునాగఢ్‌ కోటలో ఫొటో దిగుతున్న విదేశీ పర్యాటకురాలు.
18/26
రూట్స్‌ కొలీజియం గ్రాడ్యుయేషన్‌, ఫ్రెషర్స్‌ డే-2022 వేడుకలను శుక్రవారం అమీర్‌పేటలోని గ్రీన్‌పార్క్‌ మ్యారీగోల్డ్‌ హోటల్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల ఆటాపాట, సాంస్కృతిక  ప్రదర్శనలు అట్టహాసంగా సాగాయి. విద్యార్థులు నాటికలు, హస్యోక్తులు, ఫ్యాషన్‌ షో,  క్యాట్‌వాక్‌లతో ఆకట్టుకున్నారు. ఫ్రెషర్స్‌ డే సందర్భంగా మిస్టర్‌ అండ్‌ మిస్‌ ఫ్రెషర్స్‌ను ఎంపిక చేసి సన్మానించారు. రూట్స్‌ కొలీజియం గ్రాడ్యుయేషన్‌, ఫ్రెషర్స్‌ డే-2022 వేడుకలను శుక్రవారం అమీర్‌పేటలోని గ్రీన్‌పార్క్‌ మ్యారీగోల్డ్‌ హోటల్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల ఆటాపాట, సాంస్కృతిక ప్రదర్శనలు అట్టహాసంగా సాగాయి. విద్యార్థులు నాటికలు, హస్యోక్తులు, ఫ్యాషన్‌ షో, క్యాట్‌వాక్‌లతో ఆకట్టుకున్నారు. ఫ్రెషర్స్‌ డే సందర్భంగా మిస్టర్‌ అండ్‌ మిస్‌ ఫ్రెషర్స్‌ను ఎంపిక చేసి సన్మానించారు.
19/26
కోనసీమ కొబ్బరిచెట్లు రైతుల ఆదాయానికే కాదు...అందాలకు నిలయం. అంబాజీపేటలో శుక్రవారం సాయంసంధ్య వేళ కనిపించిన సుందర దృశ్యమిది. లేత బంగారు వర్ణంలో ఆకాశం ఉంటే.. దానికి నిచ్చెన వేసినట్టుగా ఈ కొబ్బరిచెట్లు వర్ణరంజితంగా  చూపరులకు కనువిందు చేస్తున్నాయి. కోనసీమ కొబ్బరిచెట్లు రైతుల ఆదాయానికే కాదు...అందాలకు నిలయం. అంబాజీపేటలో శుక్రవారం సాయంసంధ్య వేళ కనిపించిన సుందర దృశ్యమిది. లేత బంగారు వర్ణంలో ఆకాశం ఉంటే.. దానికి నిచ్చెన వేసినట్టుగా ఈ కొబ్బరిచెట్లు వర్ణరంజితంగా చూపరులకు కనువిందు చేస్తున్నాయి.
20/26
తిరుపతిలోని తితిదే పరిపాలన భవనం వెనుక ఉన్న క్రీడా మైదానంలో శుక్రవారం రాత్రి కార్తిక మహా దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పెద్దఎత్తున భక్తులు పాల్గొన్నారు. తిరుపతిలోని తితిదే పరిపాలన భవనం వెనుక ఉన్న క్రీడా మైదానంలో శుక్రవారం రాత్రి కార్తిక మహా దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పెద్దఎత్తున భక్తులు పాల్గొన్నారు.
21/26
మన్యంలో చలి తీవ్రత కొనసాగుతోంది. చింతపల్లిలో శుక్రవారం ఉదయం 9.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనాస్థానం వాతావరణ విభాగం నోడల్‌  అధికారి డాక్టర్‌ ఎం.సురేష్‌కుమార్‌ తెలిపారు. మన్యంలో చలి తీవ్రత కొనసాగుతోంది. చింతపల్లిలో శుక్రవారం ఉదయం 9.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనాస్థానం వాతావరణ విభాగం నోడల్‌ అధికారి డాక్టర్‌ ఎం.సురేష్‌కుమార్‌ తెలిపారు.
22/26
భారత నౌకా దళ దినోత్సవాల్లో భాగంగా కృష్ణపట్నం పోర్టుకు వచ్చిన ‘ఐఎన్‌ఎస్‌ సుకన్య యుద్ధనౌకను తిలకించేందుకు జిల్లా ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. శుక్రవారం ఉదయం 11 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు అధికారులు సందర్శనకు అనుమతించారు. భారత నౌకా దళ దినోత్సవాల్లో భాగంగా కృష్ణపట్నం పోర్టుకు వచ్చిన ‘ఐఎన్‌ఎస్‌ సుకన్య యుద్ధనౌకను తిలకించేందుకు జిల్లా ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. శుక్రవారం ఉదయం 11 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు అధికారులు సందర్శనకు అనుమతించారు.
23/26
నెల్లూరు కేవీఆర్‌ పెట్రోల్‌ బంకు కూడలిలోని ఓ నర్సరీలో ఉన్న మొక్క ఇది. అక్కడికి వచ్చిన వారు దాన్ని చూసి ఔరా అని అంటున్నారు. కారణం.. ఓ చిన్న మొక్కకు పనస కాయలు కాస్తుండటమే. ఇది బోన్సాయ్‌ మొక్క అని నర్సరీ యజమాని తెలిపారు. ఈ మొక్కను కేరళ నుంచి అమ్మకానికి తెప్పించినట్లు తెలిపారు. నెల్లూరు కేవీఆర్‌ పెట్రోల్‌ బంకు కూడలిలోని ఓ నర్సరీలో ఉన్న మొక్క ఇది. అక్కడికి వచ్చిన వారు దాన్ని చూసి ఔరా అని అంటున్నారు. కారణం.. ఓ చిన్న మొక్కకు పనస కాయలు కాస్తుండటమే. ఇది బోన్సాయ్‌ మొక్క అని నర్సరీ యజమాని తెలిపారు. ఈ మొక్కను కేరళ నుంచి అమ్మకానికి తెప్పించినట్లు తెలిపారు.
24/26
తమిళనాడులోని తాంబరం ఎయిర్‌ ఫోర్స్‌ స్టేషనులో శుక్రవారం పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌ వేడుకగా జరిగింది. 841 ఎయిర్‌ వారియర్స్‌ (వాయు యోధులు) వివిధ సాంకేతిక విభాగాల్లో శిక్షణ పొందారు. శిక్షకులు ఏరోబిక్స్‌, పలు రకాలైన విన్యాసాలు ప్రదర్శించారు. తమిళనాడులోని తాంబరం ఎయిర్‌ ఫోర్స్‌ స్టేషనులో శుక్రవారం పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌ వేడుకగా జరిగింది. 841 ఎయిర్‌ వారియర్స్‌ (వాయు యోధులు) వివిధ సాంకేతిక విభాగాల్లో శిక్షణ పొందారు. శిక్షకులు ఏరోబిక్స్‌, పలు రకాలైన విన్యాసాలు ప్రదర్శించారు.
25/26
నాగర్‌కర్నూల్‌ జిల్లా తెలకపల్లి మండలం చిన్న ముద్దునూర్‌ వద్ద రైతు నరేందర్‌రెడ్డి తన పొలంలో నాటిన మామిడి మొక్కలను సంచులతో కప్పేశారు. అంతర పంటగా వేసిన వేరుశనగకు తెగుళ్లు సోకకుండా రసాయన మందు పిచికారీ చేయాల్సి ఉండటంతో ఈ ఏర్పాటు చేశారు. ఇలా తనకు ఉన్న 8 ఎకరాలలో  సుమారు 560 మొక్కలకు సంచులు కప్పి ఉంచడంతో అటుగా వెళ్తున్న వారు ఆసక్తిగా వివరాలు అడిగితెలుసుకుంటున్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా తెలకపల్లి మండలం చిన్న ముద్దునూర్‌ వద్ద రైతు నరేందర్‌రెడ్డి తన పొలంలో నాటిన మామిడి మొక్కలను సంచులతో కప్పేశారు. అంతర పంటగా వేసిన వేరుశనగకు తెగుళ్లు సోకకుండా రసాయన మందు పిచికారీ చేయాల్సి ఉండటంతో ఈ ఏర్పాటు చేశారు. ఇలా తనకు ఉన్న 8 ఎకరాలలో సుమారు 560 మొక్కలకు సంచులు కప్పి ఉంచడంతో అటుగా వెళ్తున్న వారు ఆసక్తిగా వివరాలు అడిగితెలుసుకుంటున్నారు.
26/26
హైదరాబాద్‌లో గచ్చిబౌలి ఓఆర్‌ఆర్‌ నుంచి శిల్పా లేఅవుట్‌ వరకు రూ.190 కోట్లతో చేపట్టిన నాలుగు వరుసల ఫ్లైఓవర్‌ నిర్మాణం పూర్తయింది. 823 మీటర్ల పొడవు, 16.60 మీటర్ల వెడల్పుతో నిర్మితమైన ఇది పొడవైన పైవంతెనల్లో ఒకటిగా నిలవనుంది. అద్దాల, భారీ భవంతుల నడుమ ఈ వంతెన కొత్త అందాలను సంతరించుకుంది. దీన్ని ఈ నెల 23న ప్రారంభించడానికి అధికారులు సిద్ధమవు తున్నారు. హైదరాబాద్‌లో గచ్చిబౌలి ఓఆర్‌ఆర్‌ నుంచి శిల్పా లేఅవుట్‌ వరకు రూ.190 కోట్లతో చేపట్టిన నాలుగు వరుసల ఫ్లైఓవర్‌ నిర్మాణం పూర్తయింది. 823 మీటర్ల పొడవు, 16.60 మీటర్ల వెడల్పుతో నిర్మితమైన ఇది పొడవైన పైవంతెనల్లో ఒకటిగా నిలవనుంది. అద్దాల, భారీ భవంతుల నడుమ ఈ వంతెన కొత్త అందాలను సంతరించుకుంది. దీన్ని ఈ నెల 23న ప్రారంభించడానికి అధికారులు సిద్ధమవు తున్నారు.

మరిన్ని