News In Pics : చిత్రం చెప్పే సంగతులు - (21-11-2022)

Updated : 21 Nov 2022 12:03 IST
1/28
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు పెద్దశేషవాహనంపై శ్రీ వైకుంఠ నారాయణుడి అలంకారంలో అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. అడుగడుగునా భక్తులు కొబ్బరికాయలు, కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు.  తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు పెద్దశేషవాహనంపై శ్రీ వైకుంఠ నారాయణుడి అలంకారంలో అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. అడుగడుగునా భక్తులు కొబ్బరికాయలు, కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు.
2/28
జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతంలో ఆదివారం పర్యటకులు బారులుదీరారు. సందర్శకులతో జలపాతం పరిసరాలు కిక్కిరిశాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో వచ్చిన పర్యటకులతో ఇక్కడ సందడి వాతావరణం నెలకొంది. పెద్దలు, చిన్నలు జలపాతంలో దిగి స్నానాలు చేస్తూ సరదాగా గడిపారు. జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతంలో ఆదివారం పర్యటకులు బారులుదీరారు. సందర్శకులతో జలపాతం పరిసరాలు కిక్కిరిశాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో వచ్చిన పర్యటకులతో ఇక్కడ సందడి వాతావరణం నెలకొంది. పెద్దలు, చిన్నలు జలపాతంలో దిగి స్నానాలు చేస్తూ సరదాగా గడిపారు.
3/28
తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణకు ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి తన వాహనంపై సీపీఎస్, నెప్‌ 2020 రద్దు చేయాలని కోరుతూ పలు డిమాండ్లను రాయించుకున్నారు. తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణకు ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి తన వాహనంపై సీపీఎస్, నెప్‌ 2020 రద్దు చేయాలని కోరుతూ పలు డిమాండ్లను రాయించుకున్నారు.
4/28
మూడు చక్రాల కుర్చీలో భర్త.. పిల్లలను నెట్టుకొస్తున్న ఈమె పేరు కామేశ్వరి. ఊరు నెల్లూరు గ్రామీణ మండలంలోని దేవరపాళెం. భర్త వడ్డికాసులు కూలి పనులు చేసి కుటుంబాన్ని పోషించేవారు. కొన్నాళ్ల కిందట జరిగిన ప్రమాదంలో కాళ్లు కోల్పోయారు. దాంతో జీవనం భారంగా మారింది. భర్త సంరక్షణతో పాటు కుటుంబ పోషణ భారాన్ని భార్య ఇలా తలకెత్తుకున్నారు.  మూడు చక్రాల కుర్చీలో భర్త.. పిల్లలను నెట్టుకొస్తున్న ఈమె పేరు కామేశ్వరి. ఊరు నెల్లూరు గ్రామీణ మండలంలోని దేవరపాళెం. భర్త వడ్డికాసులు కూలి పనులు చేసి కుటుంబాన్ని పోషించేవారు. కొన్నాళ్ల కిందట జరిగిన ప్రమాదంలో కాళ్లు కోల్పోయారు. దాంతో జీవనం భారంగా మారింది. భర్త సంరక్షణతో పాటు కుటుంబ పోషణ భారాన్ని భార్య ఇలా తలకెత్తుకున్నారు.
5/28
ఓదేలు అనే రైతు.. చంటిపిల్లాడిని ఒడిలో వేసుకొని లాలిస్తున్న తల్లి ఆకృతిని మిరప చేనులో ఏర్పాటు చేయించారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం అంకుషాపూర్‌ శివారులోని మిరప పంటలో కనిపించిన ఈ దృశ్యాన్ని ‘న్యూస్‌టుడే’ క్లిక్‌ మనిపించింది.  ఓదేలు అనే రైతు.. చంటిపిల్లాడిని ఒడిలో వేసుకొని లాలిస్తున్న తల్లి ఆకృతిని మిరప చేనులో ఏర్పాటు చేయించారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం అంకుషాపూర్‌ శివారులోని మిరప పంటలో కనిపించిన ఈ దృశ్యాన్ని ‘న్యూస్‌టుడే’ క్లిక్‌ మనిపించింది.
6/28
కృష్ణా జిల్లా అవనిగడ్డలోని కొండవీటి సందీప్‌ ఆన్‌లైన్‌లో బెంగళూరు నుంచి ఎయిర్‌ పొటాటో విత్తనాలను తెప్పించి నాటారు. మొక్కలు మొలవగా పందిరి వేసి వాటి తీగను పాకించారు. ప్రస్తుతం తీగలకు కాస్తున్న బంగాళా దుంపలు పలువురిని ఆకర్షిస్తున్నాయి. కృష్ణా జిల్లా అవనిగడ్డలోని కొండవీటి సందీప్‌ ఆన్‌లైన్‌లో బెంగళూరు నుంచి ఎయిర్‌ పొటాటో విత్తనాలను తెప్పించి నాటారు. మొక్కలు మొలవగా పందిరి వేసి వాటి తీగను పాకించారు. ప్రస్తుతం తీగలకు కాస్తున్న బంగాళా దుంపలు పలువురిని ఆకర్షిస్తున్నాయి.
7/28
ఇదేదో చెరువు కాదు. జగనన్న లేఅవుట్‌.గతంలో కురిసిన వర్షాలకు ఇప్పటికీ ఈ ప్రాంతంలో నీరు నిల్వ ఉంది. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులో 3 ఎకరాలను మెరక చేయకుండా ఇవ్వడంతో అందులోని మొత్తం 130 ప్లాట్లు వర్షపు నీటిలో మునిగిపోయాయి. ఇదేదో చెరువు కాదు. జగనన్న లేఅవుట్‌.గతంలో కురిసిన వర్షాలకు ఇప్పటికీ ఈ ప్రాంతంలో నీరు నిల్వ ఉంది. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులో 3 ఎకరాలను మెరక చేయకుండా ఇవ్వడంతో అందులోని మొత్తం 130 ప్లాట్లు వర్షపు నీటిలో మునిగిపోయాయి.
8/28
విశాఖ, అరకు ప్రాంతాలకు వచ్చే పర్యాటకుల సంఖ్య భారీగా పెరుగుతోంది. అలాంటి వారి కోసమే సరికొత్త గుడారాలు అందుబాటులోకి వచ్చాయి. రెండు మంచాలు, కుర్చీలు, స్నానాల గది, వంటసామగ్రి, చిన్న పాటి సిలిండర్‌, స్టౌవ్‌ ఏర్పాటుకు తగినట్లు ఈ టెంట్‌ ఉంటుంది. విశాఖ బీచ్‌ రోడ్డులో జోడుగుళ్లపాలెం నుంచి సాగర్‌నగర్‌కు వెళ్లే దారిలో సముద్రతీరంలో శుక్రవారం వాటి విక్రేతలు నమూనాగా ఉంచారు.  విశాఖ, అరకు ప్రాంతాలకు వచ్చే పర్యాటకుల సంఖ్య భారీగా పెరుగుతోంది. అలాంటి వారి కోసమే సరికొత్త గుడారాలు అందుబాటులోకి వచ్చాయి. రెండు మంచాలు, కుర్చీలు, స్నానాల గది, వంటసామగ్రి, చిన్న పాటి సిలిండర్‌, స్టౌవ్‌ ఏర్పాటుకు తగినట్లు ఈ టెంట్‌ ఉంటుంది. విశాఖ బీచ్‌ రోడ్డులో జోడుగుళ్లపాలెం నుంచి సాగర్‌నగర్‌కు వెళ్లే దారిలో సముద్రతీరంలో శుక్రవారం వాటి విక్రేతలు నమూనాగా ఉంచారు.
9/28
శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం పట్టణ నడిబొడ్డున ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రత్యేక చొరవ చూపించి సమీకృత కూరగాయల మార్కెట్‌, వ్యాపార సముదాయాన్ని రూ.23 కోట్లతో నిర్మించారు. కానీ కాంప్లెక్స్‌ ప్రహరీ పక్కన దుకాణాలను, తోపుడు బండ్లను ఏర్పాటు చేసుకున్నారు. వినియోగదారులు ఇందులోకి రావడం లేదంటున్నారు. దీంతో మార్కెట్‌ సముదాయం లక్ష్యానికి దూరంగా ఉండిపోయింది. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం పట్టణ నడిబొడ్డున ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రత్యేక చొరవ చూపించి సమీకృత కూరగాయల మార్కెట్‌, వ్యాపార సముదాయాన్ని రూ.23 కోట్లతో నిర్మించారు. కానీ కాంప్లెక్స్‌ ప్రహరీ పక్కన దుకాణాలను, తోపుడు బండ్లను ఏర్పాటు చేసుకున్నారు. వినియోగదారులు ఇందులోకి రావడం లేదంటున్నారు. దీంతో మార్కెట్‌ సముదాయం లక్ష్యానికి దూరంగా ఉండిపోయింది.
10/28
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలోని గోదావరి గట్టు ఇటీవల వరదలకు భారీగా కోతకు గురైంది. అప్పటికప్పుడు కర్రలు, ఇసుక బస్తాల సాయంతో తాత్కాలిక రక్షణ ఏర్పాటు చేశారు. వరద తీవ్రత తగ్గిన తరువాత పట్టించుకున్న నాథుడే లేడు. సోమవారం సీఎం పర్యటన నేపథ్యంలో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలోని గోదావరి గట్టు ఇటీవల వరదలకు భారీగా కోతకు గురైంది. అప్పటికప్పుడు కర్రలు, ఇసుక బస్తాల సాయంతో తాత్కాలిక రక్షణ ఏర్పాటు చేశారు. వరద తీవ్రత తగ్గిన తరువాత పట్టించుకున్న నాథుడే లేడు. సోమవారం సీఎం పర్యటన నేపథ్యంలో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.
11/28
ప్రముఖ సంగీత దర్శకుడు తమన్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ ఉదయం ఆయన శ్రీవేంకటేశ్వరస్వామి సేవలో పాల్గొన్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు తమన్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ ఉదయం ఆయన శ్రీవేంకటేశ్వరస్వామి సేవలో పాల్గొన్నారు.
12/28
అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ మనవరాలు నయోమీ బైడెన్‌ వివాహం ఘనంగా జరిగింది. వైట్‌హౌస్‌లో జరిగిన 19వ వివాహం ఇది. ఇందులో ఒక అధ్యక్షుడి మనవరాలి వివాహం జరగడం ఇదే తొలిసారి. నయోమి కంటే నీల్‌ మూడేళ్లు చిన్న కావడం గమనార్హం. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ మనవరాలు నయోమీ బైడెన్‌ వివాహం ఘనంగా జరిగింది. వైట్‌హౌస్‌లో జరిగిన 19వ వివాహం ఇది. ఇందులో ఒక అధ్యక్షుడి మనవరాలి వివాహం జరగడం ఇదే తొలిసారి. నయోమి కంటే నీల్‌ మూడేళ్లు చిన్న కావడం గమనార్హం.
13/28
నెక్లెస్‌ రోడ్డులోని ఎన్టీఆర్‌ గార్డెన్‌ సమీపంలో జరుగుతున్న ఫార్ములా-ఇ రేస్‌ లీగ్‌ పోటీలను తిలకించేందుకు వచ్చే సందర్శకులకు ఏర్పాటు చేసిన గ్యాలరీలు, పందెం జరిగే ట్రాక్‌ నిర్మాణ పనుల్లో పలువురు కార్మికులు శ్రమిస్తున్నారు. రేసు జరిగే సమయంలో గ్యాలరీల కింద స్తంభాలకు దోమ తెరలు కట్టుకొని నిద్రిస్తుండగా తీసిన చిత్రాలు. నెక్లెస్‌ రోడ్డులోని ఎన్టీఆర్‌ గార్డెన్‌ సమీపంలో జరుగుతున్న ఫార్ములా-ఇ రేస్‌ లీగ్‌ పోటీలను తిలకించేందుకు వచ్చే సందర్శకులకు ఏర్పాటు చేసిన గ్యాలరీలు, పందెం జరిగే ట్రాక్‌ నిర్మాణ పనుల్లో పలువురు కార్మికులు శ్రమిస్తున్నారు. రేసు జరిగే సమయంలో గ్యాలరీల కింద స్తంభాలకు దోమ తెరలు కట్టుకొని నిద్రిస్తుండగా తీసిన చిత్రాలు.
14/28
రేసింగ్‌ పోటీలు ఆదివారం రెండో రోజు ఉత్సాహంగా సాగాయి. నగర వాసులు పోటీలు తిలకించేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.  దీంతో సాగర్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ ఇబ్బందులు ఎదురయ్యాయి. రేసింగ్‌ పోటీలు ఆదివారం రెండో రోజు ఉత్సాహంగా సాగాయి. నగర వాసులు పోటీలు తిలకించేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో సాగర్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ ఇబ్బందులు ఎదురయ్యాయి.
15/28
శిల్పారామంలో శ్రీసాయి నటరాజ అకాడమీ ఆఫ్‌ కూచిపూడి డ్యాన్స్‌ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం రసోల్లాస్‌ పేరిట నిర్వహించిన నృత్యోత్సవం చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. కళాకారుల బృందం ప్రదర్శించిన కథక్, కూచిపూడి, భరతనాట్యం, ఆంధ్రనాట్యం, మొహినియట్టం నృత్యాలు నయనానందకరంగా సాగాయి. శిల్పారామంలో శ్రీసాయి నటరాజ అకాడమీ ఆఫ్‌ కూచిపూడి డ్యాన్స్‌ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం రసోల్లాస్‌ పేరిట నిర్వహించిన నృత్యోత్సవం చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. కళాకారుల బృందం ప్రదర్శించిన కథక్, కూచిపూడి, భరతనాట్యం, ఆంధ్రనాట్యం, మొహినియట్టం నృత్యాలు నయనానందకరంగా సాగాయి.
16/28
మూసీ ఒడ్డున ఉన్న ఉప్పల్‌ భగాయత్‌ అంటేనే ఎటూ చూసినా గడ్డి పొలాలు. ఇది ఒకప్పటి మాట. ప్రస్తుతం హెచ్‌ఎండీఏ లే అవుట్‌తో దాని రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఇదే లే అవుట్‌ లో నిర్మిస్తున్న ఓ భవనం ఆకట్టుకుంటోంది. దాన్ని పూర్తిగా ఇనుము, అద్దాలతో నిర్మించారు. చుట్టూ కంచె, వెదురుతో ఇతర నిర్మాణాలు చేపట్టడంతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. మూసీ ఒడ్డున ఉన్న ఉప్పల్‌ భగాయత్‌ అంటేనే ఎటూ చూసినా గడ్డి పొలాలు. ఇది ఒకప్పటి మాట. ప్రస్తుతం హెచ్‌ఎండీఏ లే అవుట్‌తో దాని రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఇదే లే అవుట్‌ లో నిర్మిస్తున్న ఓ భవనం ఆకట్టుకుంటోంది. దాన్ని పూర్తిగా ఇనుము, అద్దాలతో నిర్మించారు. చుట్టూ కంచె, వెదురుతో ఇతర నిర్మాణాలు చేపట్టడంతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
17/28
ఫిఫా ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ నేపథ్యంలో ఇజ్రాయెల్‌.. ఖతర్‌కు నేరుగా విమాన సేవలను ప్రారంభించింది. దీన్ని పురస్కరించుకుని బోర్డింగ్‌ పాస్‌ను పోలినట్లు ప్రత్యేక కేక్‌ను రూపొందించారు. ఫిఫా ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ నేపథ్యంలో ఇజ్రాయెల్‌.. ఖతర్‌కు నేరుగా విమాన సేవలను ప్రారంభించింది. దీన్ని పురస్కరించుకుని బోర్డింగ్‌ పాస్‌ను పోలినట్లు ప్రత్యేక కేక్‌ను రూపొందించారు.
18/28
నిత్యం రద్దీగా ఉండే మాదాపూర్‌ మెట్రోస్టేషన్‌ వద్ద మ్యాన్‌హోల్‌పై ఉన్న రాయి కారణంగా.. అటు ట్రాఫిక్‌  స్తంభించడంతోపాటు వాహనదారులకు ప్రమాదకరంగా ఉంది. నిత్యం రద్దీగా ఉండే మాదాపూర్‌ మెట్రోస్టేషన్‌ వద్ద మ్యాన్‌హోల్‌పై ఉన్న రాయి కారణంగా.. అటు ట్రాఫిక్‌ స్తంభించడంతోపాటు వాహనదారులకు ప్రమాదకరంగా ఉంది.
19/28
విజయనగరం జిల్లా భామిని మండలంలోని అనంతగిరి తోటలో వనవిహారం విజయనగరం జిల్లా భామిని మండలంలోని అనంతగిరి తోటలో వనవిహారం
20/28
నటనలో నవరసాలు పలికిస్తూ సాగిన చిన్నారుల నాటికలు.. జుంబారే అంటూ జానపద నృత్యాలతో ఉర్రూతలూగిస్తూ సాగిన నృత్యాలు... తమలోని సృజనను పోస్టర్లుగా తీర్చిదిద్దిన ప్రదర్శనలు.. ఇలా ఒకటి కాదు రెండు కాదు పదమూడు అంశాల్లో ఎంతోమంది చిన్నారులు తమ ప్రతిభ చాటారు. కాకినాడ జేఎన్‌టీయూ ప్రాంగణంలోని క్రియ పిల్లల పండగ పేరిట రాష్ట్రస్థాయి అంతర పాఠశాలల సాంస్కృతిక పోటీలు ఆదివారం రెండో రోజు కొనసాగాయి. నటనలో నవరసాలు పలికిస్తూ సాగిన చిన్నారుల నాటికలు.. జుంబారే అంటూ జానపద నృత్యాలతో ఉర్రూతలూగిస్తూ సాగిన నృత్యాలు... తమలోని సృజనను పోస్టర్లుగా తీర్చిదిద్దిన ప్రదర్శనలు.. ఇలా ఒకటి కాదు రెండు కాదు పదమూడు అంశాల్లో ఎంతోమంది చిన్నారులు తమ ప్రతిభ చాటారు. కాకినాడ జేఎన్‌టీయూ ప్రాంగణంలోని క్రియ పిల్లల పండగ పేరిట రాష్ట్రస్థాయి అంతర పాఠశాలల సాంస్కృతిక పోటీలు ఆదివారం రెండో రోజు కొనసాగాయి.
21/28
అనకాపల్లి జిల్లా సిరసపల్లి చింతామణి గణపతి దత్తక్షేత్రాన్ని ఆదివారం గురుకుల పాఠశాల విద్యార్థులు సందర్శించారు. ఈ సందర్భంగా 500 మంది బాలలకు యోగాపై అవగాహన కల్పించి, వివిధ ఆసనాలు వేయించారు. అనకాపల్లి జిల్లా సిరసపల్లి చింతామణి గణపతి దత్తక్షేత్రాన్ని ఆదివారం గురుకుల పాఠశాల విద్యార్థులు సందర్శించారు. ఈ సందర్భంగా 500 మంది బాలలకు యోగాపై అవగాహన కల్పించి, వివిధ ఆసనాలు వేయించారు.
22/28
కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. దీంతో ఆలయ పశ్చిమ రాజగోపురంవద్ద కొన్ని గంటలపాటు తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. రద్దీ అధికంగా ఉండటం, భక్తుల మధ్య తోపులాట, వ్రత మండపాలు, క్యూలైన్లలో భక్తులు బారులుదీరడంతో కొంత సమయంపాటు వ్రత టికెట్ల విక్రయాలను నిలిపేశారు. కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. దీంతో ఆలయ పశ్చిమ రాజగోపురంవద్ద కొన్ని గంటలపాటు తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. రద్దీ అధికంగా ఉండటం, భక్తుల మధ్య తోపులాట, వ్రత మండపాలు, క్యూలైన్లలో భక్తులు బారులుదీరడంతో కొంత సమయంపాటు వ్రత టికెట్ల విక్రయాలను నిలిపేశారు.
23/28
యాదాద్రి పుణ్యక్షేత్రం ఆదివారం భక్తజనులతో కిటకిటలాడింది. 60 వేల మంది భక్తులు పుణ్యక్షేత్రాన్ని సందర్శించినట్లు ఆలయవర్గాల అంచనా. శ్రీ లక్ష్మీనరసింహస్వామి ధర్మ దర్శనానికి అయిదు గంటలు పట్టిందని భక్తులు చెప్పారు. సామూహిక శ్రీ సత్యనారాయణస్వామి వ్రతాల్లో 1900 జంటలు పాల్గొని మొక్కులు తీర్చుకున్నాయి.
యాదాద్రి పుణ్యక్షేత్రం ఆదివారం భక్తజనులతో కిటకిటలాడింది. 60 వేల మంది భక్తులు పుణ్యక్షేత్రాన్ని సందర్శించినట్లు ఆలయవర్గాల అంచనా. శ్రీ లక్ష్మీనరసింహస్వామి ధర్మ దర్శనానికి అయిదు గంటలు పట్టిందని భక్తులు చెప్పారు. సామూహిక శ్రీ సత్యనారాయణస్వామి వ్రతాల్లో 1900 జంటలు పాల్గొని మొక్కులు తీర్చుకున్నాయి.
24/28
రహదారి భద్రతపై అవగాహన కల్పించేందుకు తవాంగ్‌లో ఆదివారం బైక్‌ ర్యాలీలో పాల్గొన్న అరుణాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి పెమా ఖండూ రహదారి భద్రతపై అవగాహన కల్పించేందుకు తవాంగ్‌లో ఆదివారం బైక్‌ ర్యాలీలో పాల్గొన్న అరుణాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి పెమా ఖండూ
25/28
 తిమింగలం ఆకారంలో ఉన్న సూపర్‌ ట్రాన్స్‌పోర్టర్‌ ఎయిర్‌బస్‌ బెలూగా ఆదివారం కోల్‌కతా విమానాశ్రయంలో దిగింది. ప్రపంచంలోనే అతి పెద్ద విమానాల్లో ఒకటైన దీనిని సరకు రవాణా కోసం ఉపయోగిస్తారు. తిమింగలం ఆకారంలో ఉన్న సూపర్‌ ట్రాన్స్‌పోర్టర్‌ ఎయిర్‌బస్‌ బెలూగా ఆదివారం కోల్‌కతా విమానాశ్రయంలో దిగింది. ప్రపంచంలోనే అతి పెద్ద విమానాల్లో ఒకటైన దీనిని సరకు రవాణా కోసం ఉపయోగిస్తారు.
26/28
శీతల గాలుల కారణంగా తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ఆదిలాబాద్‌ జిల్లా భీంపూర్‌ మండలం అంతర్గాం, అర్లి-టి గ్రామాల మధ్య ఉదయం 10 గంటలైనా తొలగని మంచు దుప్పటి. శీతల గాలుల కారణంగా తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ఆదిలాబాద్‌ జిల్లా భీంపూర్‌ మండలం అంతర్గాం, అర్లి-టి గ్రామాల మధ్య ఉదయం 10 గంటలైనా తొలగని మంచు దుప్పటి.
27/28
ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ హైదరాబాద్‌ సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం మాదాపూర్‌ హైటెక్స్‌ మైదానంలో నిర్వహించిన యోగాథాన్‌ ఉత్సాహంగా సాగింది.  16-75 ఏళ్ల వయసున్న 3వేల మంది హాజరయ్యారు. సూర్య నమస్కార్‌ ఛాలెంజ్‌లో పాలుపంచుకొన్నారు. ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ హైదరాబాద్‌ సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం మాదాపూర్‌ హైటెక్స్‌ మైదానంలో నిర్వహించిన యోగాథాన్‌ ఉత్సాహంగా సాగింది. 16-75 ఏళ్ల వయసున్న 3వేల మంది హాజరయ్యారు. సూర్య నమస్కార్‌ ఛాలెంజ్‌లో పాలుపంచుకొన్నారు.
28/28
హైదరాబాద్‌లో అలరించిన మొట్టమొదటి స్ట్రీట్‌ ట్రాక్‌ రేసింగ్‌.. కనువిందు చేస్తూ వెళ్తున్న కార్లు.. హైదరాబాద్‌లో అలరించిన మొట్టమొదటి స్ట్రీట్‌ ట్రాక్‌ రేసింగ్‌.. కనువిందు చేస్తూ వెళ్తున్న కార్లు..

మరిన్ని

ap-districts
ts-districts