News In Pics : చిత్రం చెప్పే సంగతులు -2 (21-11-2022)

Updated : 21 Nov 2022 22:27 IST
1/17
గచ్చిబౌలిలో నిర్వహిస్తున్న ప్రొ కబడ్డీ లీగ్‌ పోటీలను సోమవారం సాయంత్రం నటీనటులు రాజ్‌తరుణ్‌, శివానీ రాజశేఖర్‌ వీక్షించి సందడి చేశారు. వీరిద్దరు కలిసి నటించిన వెబ్‌సిరీస్‌ ‘అహ నా పెళ్ళంట’ 
ఇటీవల జీ5వేదికగా విడుదలై ప్రేక్షకులను అలరిస్తోంది. గచ్చిబౌలిలో నిర్వహిస్తున్న ప్రొ కబడ్డీ లీగ్‌ పోటీలను సోమవారం సాయంత్రం నటీనటులు రాజ్‌తరుణ్‌, శివానీ రాజశేఖర్‌ వీక్షించి సందడి చేశారు. వీరిద్దరు కలిసి నటించిన వెబ్‌సిరీస్‌ ‘అహ నా పెళ్ళంట’ ఇటీవల జీ5వేదికగా విడుదలై ప్రేక్షకులను అలరిస్తోంది.
2/17
రాజమహేంద్రవరంలోని ఉమాకోటి లింగమేశ్వరస్వామి దేవస్థానంలో లక్ష దీపోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి పెద్దఎత్తున భక్తులు తరలివచ్చి దీపాలు వెలిగించి శివనామసర్మణ చేశారు.. రాజమహేంద్రవరంలోని ఉమాకోటి లింగమేశ్వరస్వామి దేవస్థానంలో లక్ష దీపోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి పెద్దఎత్తున భక్తులు తరలివచ్చి దీపాలు వెలిగించి శివనామసర్మణ చేశారు..
3/17
4/17
ఫిఫా ప్రపంచకప్‌ పోటీలు జరుగుతున్న నేపథ్యంలో కోల్‌కతాలోని అభిమానులు అక్కడి ఓ వీధిలో గోడలపై ఫుట్‌బాల్‌ పోటీలకు సంబంధించిన చిత్రాలను వేసి ఆకట్టుకున్నారు. ఆదివారం ఖతార్‌లో ఫిఫా వరల్డ్‌ కప్‌ పోటీలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఫిఫా ప్రపంచకప్‌ పోటీలు జరుగుతున్న నేపథ్యంలో కోల్‌కతాలోని అభిమానులు అక్కడి ఓ వీధిలో గోడలపై ఫుట్‌బాల్‌ పోటీలకు సంబంధించిన చిత్రాలను వేసి ఆకట్టుకున్నారు. ఆదివారం ఖతార్‌లో ఫిఫా వరల్డ్‌ కప్‌ పోటీలు ప్రారంభమైన సంగతి తెలిసిందే.
5/17
పర్యావరణ హితం కోసం రిలీఫ్‌ రైడర్స్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని హిమాయత్‌ నగర్‌లో ‘చేతిలో సంచి’ కార్యక్రమం నిర్వహించారు. వివిధ సంస్థల సిబ్బందికి చేతి సంచులను అందజేసి.. ప్లాస్టిక్‌ సంచులను వినియోగించకూడదని అవగాహన కల్పించారు. పర్యావరణ హితం కోసం రిలీఫ్‌ రైడర్స్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని హిమాయత్‌ నగర్‌లో ‘చేతిలో సంచి’ కార్యక్రమం నిర్వహించారు. వివిధ సంస్థల సిబ్బందికి చేతి సంచులను అందజేసి.. ప్లాస్టిక్‌ సంచులను వినియోగించకూడదని అవగాహన కల్పించారు.
6/17
కార్తిక మాసం పురస్కరించుకొని జనగామలోని దుర్గామాత ఆలయంలో ఓ భక్తురాలు శివపార్వతుల చిత్రాన్ని వేసి భక్తిని చాటారు. కార్తిక మాసం పురస్కరించుకొని జనగామలోని దుర్గామాత ఆలయంలో ఓ భక్తురాలు శివపార్వతుల చిత్రాన్ని వేసి భక్తిని చాటారు.
7/17
హైదరాబాద్‌లోని మాదాపూర్‌ ఎన్‌ కన్వెన్షన్‌లో లాలా ల్యాండ్‌ కార్నివాల్‌ నిర్వహించారు. ఇందులో భాగంగా వివిధ రకాల స్టాల్స్‌, ఆటల కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. సీరియల్ నటి అశ్మిత, సోషలైట్స్‌, నగరవాసులు పాల్గొని సందడి చేశారు. హైదరాబాద్‌లోని మాదాపూర్‌ ఎన్‌ కన్వెన్షన్‌లో లాలా ల్యాండ్‌ కార్నివాల్‌ నిర్వహించారు. ఇందులో భాగంగా వివిధ రకాల స్టాల్స్‌, ఆటల కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. సీరియల్ నటి అశ్మిత, సోషలైట్స్‌, నగరవాసులు పాల్గొని సందడి చేశారు.
8/17
యానాంలో ప్రపంచ మత్స్య దినోత్సవ సంబరాలు అంబరాన్నంటాయి. 8 గ్రామాలకు చెందిన 20 పెద్ద బోట్లు, 200 చిన్న నావలకు మువ్వన్నెల జెండాలను అలంకరించి గోదావరిలో.. మత్స్యకారులు విన్యాసాలు చేశారు. మత్స్యకారుల ప్రాముఖ్యతను చాటి చెప్పేందుకు ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. యానాంలో ప్రపంచ మత్స్య దినోత్సవ సంబరాలు అంబరాన్నంటాయి. 8 గ్రామాలకు చెందిన 20 పెద్ద బోట్లు, 200 చిన్న నావలకు మువ్వన్నెల జెండాలను అలంకరించి గోదావరిలో.. మత్స్యకారులు విన్యాసాలు చేశారు. మత్స్యకారుల ప్రాముఖ్యతను చాటి చెప్పేందుకు ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.
9/17
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆక్వా యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారు. ప్రపంచ మత్స్య దినోత్సవం పురస్కరించుకొని పలువురు సీఎంను సభావేదికపై మత్స్యకారుల టోపీ, వలతో సత్కరించారు.. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆక్వా యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారు. ప్రపంచ మత్స్య దినోత్సవం పురస్కరించుకొని పలువురు సీఎంను సభావేదికపై మత్స్యకారుల టోపీ, వలతో సత్కరించారు..
10/17
న్యూజిలాండ్‌తో జరగనున్న మూడో టీ20 మ్యాచ్‌ కోసం భారత జట్టు నేపియర్‌ చేరుకుంది. ఈ సందర్భంగా సూర్యకుమార్‌ యాదవ్‌, యజువేంద్ర చాహల్‌, కుల్దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ సిరాజ్‌, భువనేశ్వర్‌ కుమార్‌ ఇలా అక్కడి రోడ్లపై చక్కర్లు కొడుతూ కనిపించారు. న్యూజిలాండ్‌తో జరగనున్న మూడో టీ20 మ్యాచ్‌ కోసం భారత జట్టు నేపియర్‌ చేరుకుంది. ఈ సందర్భంగా సూర్యకుమార్‌ యాదవ్‌, యజువేంద్ర చాహల్‌, కుల్దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ సిరాజ్‌, భువనేశ్వర్‌ కుమార్‌ ఇలా అక్కడి రోడ్లపై చక్కర్లు కొడుతూ కనిపించారు.
11/17
మధ్యప్రదేశ్‌లోని రేవా సైనిక్‌ స్కూల్‌ డైమండ్‌ జూబ్లీ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టోర్నడో బృందానికి చెందిన సైనికులు ద్విచక్రవాహనాలపై ఆకట్టుకునే విన్యాసాలు చేశారు. మధ్యప్రదేశ్‌లోని రేవా సైనిక్‌ స్కూల్‌ డైమండ్‌ జూబ్లీ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టోర్నడో బృందానికి చెందిన సైనికులు ద్విచక్రవాహనాలపై ఆకట్టుకునే విన్యాసాలు చేశారు.
12/17
ఈ చిత్రం చూసి కార్‌ను ఫోమ్‌ వాష్‌ చేస్తున్నారనుకుంటున్నారేమో.. అలా అయితే మీరు తప్పులో కాలేసినట్లే..! డెన్మార్క్‌లోని తూర్పు జట్లాండ్‌లో భారీగా కురుస్తున్న మంచు కారును ఇలా కప్పేసింది. ఈ చిత్రం చూసి కార్‌ను ఫోమ్‌ వాష్‌ చేస్తున్నారనుకుంటున్నారేమో.. అలా అయితే మీరు తప్పులో కాలేసినట్లే..! డెన్మార్క్‌లోని తూర్పు జట్లాండ్‌లో భారీగా కురుస్తున్న మంచు కారును ఇలా కప్పేసింది.
13/17
రాష్ట్రంలో రైతుల సమస్యలు, ధరణి లోపాలు పరిష్కరించాలని కోరుతూ టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ నేతలు సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలో రైతుల సమస్యలు, ధరణి లోపాలు పరిష్కరించాలని కోరుతూ టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ నేతలు సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు.
14/17
కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం నిమిత్తం గుజరాత్ రాష్ట్రం సూరత్‌లో అడుగుపెట్టారు. మధ్యప్రదేశ్‌లో కొనసాగుతున్న ‘భారత్ జోడో యాత్ర’కు కాస్త విరామం ఇచ్చి రాహుల్ ఇక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం నిమిత్తం గుజరాత్ రాష్ట్రం సూరత్‌లో అడుగుపెట్టారు. మధ్యప్రదేశ్‌లో కొనసాగుతున్న ‘భారత్ జోడో యాత్ర’కు కాస్త విరామం ఇచ్చి రాహుల్ ఇక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.
15/17
ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ గారాలపట్టి అర్హ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా చిన్నారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ‘శాకుంతలం’ చిత్రబృందం ఈ పోస్టర్‌ విడుదల చేసింది. సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్‌ తెరకెక్కించిన ఈ ప్రేమకావ్యంలో అర్హ నటిస్తోంది. 
ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ గారాలపట్టి అర్హ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా చిన్నారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ‘శాకుంతలం’ చిత్రబృందం ఈ పోస్టర్‌ విడుదల చేసింది. సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్‌ తెరకెక్కించిన ఈ ప్రేమకావ్యంలో అర్హ నటిస్తోంది.
16/17
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు పెద్దశేషవాహనంపై శ్రీ వైకుంఠ నారాయణుడి అలంకారంలో అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. అడుగడుగునా భక్తులు కొబ్బరికాయలు, కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు.	తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు పెద్దశేషవాహనంపై శ్రీ వైకుంఠ నారాయణుడి అలంకారంలో అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. అడుగడుగునా భక్తులు కొబ్బరికాయలు, కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు.
17/17
ప్రముఖ సంగీత దర్శకుడు తమన్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ ఉదయం ఆయన శ్రీవేంకటేశ్వరస్వామి సేవలో పాల్గొన్నారు.	ప్రముఖ సంగీత దర్శకుడు తమన్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ ఉదయం ఆయన శ్రీవేంకటేశ్వరస్వామి సేవలో పాల్గొన్నారు.

మరిన్ని