News In Pics : చిత్రం చెప్పే సంగతులు -1 (22-11-2022)

Updated : 22 Nov 2022 13:29 IST
1/18
నార్త్ కరోలినాలోని మెరైన్‌ కార్ప్స్‌ ఎయిర్‌ స్టేషన్‌ చెర్రీ పాయింట్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మిలటరీ సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారితో ముచ్చటిస్తూ ఇలా సెల్ఫీ తీసుకున్నారు. నార్త్ కరోలినాలోని మెరైన్‌ కార్ప్స్‌ ఎయిర్‌ స్టేషన్‌ చెర్రీ పాయింట్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మిలటరీ సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారితో ముచ్చటిస్తూ ఇలా సెల్ఫీ తీసుకున్నారు.
2/18
ఇండోనేసియా దేశం పశ్చిమ జావాలోని చియాంజుర్‌లో సోమవారం భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కూలిపోయిన తన ఇంట్లోని వస్తువుల కోసం ఓ వ్యక్తి ఇలా శోధిస్తూ కనిపించాడు.  ఇండోనేసియా దేశం పశ్చిమ జావాలోని చియాంజుర్‌లో సోమవారం భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కూలిపోయిన తన ఇంట్లోని వస్తువుల కోసం ఓ వ్యక్తి ఇలా శోధిస్తూ కనిపించాడు.
3/18
హైదరాబాద్‌ నగరంలో నిత్యం రద్దీగా ఉండే చాదర్‌ఘాట్‌-కోఠి ఉమెన్స్‌ కళాశాల రోడ్డుపై ఓ ఆర్టీసీ బస్సు మొరాయించి నిలిచిపోయింది. దీంతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. అక్కడే ఉన్న ట్రాఫిక్‌ పోలీస్‌ సిబ్బంది, మరికొందరు బస్సును పక్కకి నెట్టడంతో మిగిలిన వాహనాలు ముందుకు కదిలాయి. హైదరాబాద్‌ నగరంలో నిత్యం రద్దీగా ఉండే చాదర్‌ఘాట్‌-కోఠి ఉమెన్స్‌ కళాశాల రోడ్డుపై ఓ ఆర్టీసీ బస్సు మొరాయించి నిలిచిపోయింది. దీంతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. అక్కడే ఉన్న ట్రాఫిక్‌ పోలీస్‌ సిబ్బంది, మరికొందరు బస్సును పక్కకి నెట్టడంతో మిగిలిన వాహనాలు ముందుకు కదిలాయి.
4/18
యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ఓ బ్రాండ్‌ షూట్‌లో పాల్గొన్నారు. ఆయన లుక్‌ను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయగా అభిమానులు ఫిదా అవుతున్నారు. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ఓ బ్రాండ్‌ షూట్‌లో పాల్గొన్నారు. ఆయన లుక్‌ను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయగా అభిమానులు ఫిదా అవుతున్నారు.
5/18
 కొలంబియాలోని మెడెల్లిన్‌లో సోమవారం ఓ చిన్న విమానం ఇళ్లపై కూలిపోవడంతో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. శిథిలమైన భవనాల వద్ద అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.. కొలంబియాలోని మెడెల్లిన్‌లో సోమవారం ఓ చిన్న విమానం ఇళ్లపై కూలిపోవడంతో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. శిథిలమైన భవనాల వద్ద అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు..
6/18
అమెరికాలోని న్యూయార్క్‌ ఎరీ కౌంటీ ఆర్చర్డ్‌పార్క్‌ పట్టణంలో మంచులో చిక్కుకుపోయిన కారు అమెరికాలోని న్యూయార్క్‌ ఎరీ కౌంటీ ఆర్చర్డ్‌పార్క్‌ పట్టణంలో మంచులో చిక్కుకుపోయిన కారు
7/18
ప్రస్తుతం ప్రపంచమంతా ఫిఫా ప్రపంచకప్‌ ఫుట్‌బాల్‌ సందడి నెలకొంది. ఈ నేపథ్యంలో పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతాలోని ఓ మిఠాయి దుకాణం ఇలా ప్రపంచకప్, ప్రముఖ ఫుట్‌బాల్‌ క్రీడాకారులైన మెస్సీ, రొనాల్డోలను పోలిన కేక్‌ను రూపొందించి వినియోగదారులను ఆకర్షిస్తోంది. ప్రస్తుతం ప్రపంచమంతా ఫిఫా ప్రపంచకప్‌ ఫుట్‌బాల్‌ సందడి నెలకొంది. ఈ నేపథ్యంలో పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతాలోని ఓ మిఠాయి దుకాణం ఇలా ప్రపంచకప్, ప్రముఖ ఫుట్‌బాల్‌ క్రీడాకారులైన మెస్సీ, రొనాల్డోలను పోలిన కేక్‌ను రూపొందించి వినియోగదారులను ఆకర్షిస్తోంది.
8/18
కొల్లేరుకు వలస వచ్చే విహంగాల్లో  చూపరులను కట్టిపడేసే అతిథి ఎర్రముక్కు జంబుకోడి (కామన్‌ మూర్‌హెన్‌). 32 సెం.మీ. పొడవు, తలపైనుంచి ముక్కు వరకు ఎరుపు, మిగిలిన శరీర భాగం బూడిదరంగుతో ఉండి రెక్కల చివర తెల్లటి చారలు కలిగి కోడిపెట్ట ఆకారంలో వింతగా కనిపిస్తుంది. ఇది 310 నుంచి 456 గ్రాముల వరకు బరువు పెరుగుతుంది. ఆహారంగా చిన్నచిన్న పురుగులు, నత్తలు, చిన్న చేపలను తీసుకుంటుంది. మన దేశంతోపాటు మలేసియా, బంగ్లాదేశ్, కంబోడియా, ఇండోనేషియా, హాంగ్‌కాంగ్, జపాన్‌ దేశాల్లో మంచినీరు ఉన్న ప్రాంతాల్లో సంచరిస్తూ ఉంటాయి. కొల్లేరుకు వలస వచ్చే విహంగాల్లో చూపరులను కట్టిపడేసే అతిథి ఎర్రముక్కు జంబుకోడి (కామన్‌ మూర్‌హెన్‌). 32 సెం.మీ. పొడవు, తలపైనుంచి ముక్కు వరకు ఎరుపు, మిగిలిన శరీర భాగం బూడిదరంగుతో ఉండి రెక్కల చివర తెల్లటి చారలు కలిగి కోడిపెట్ట ఆకారంలో వింతగా కనిపిస్తుంది. ఇది 310 నుంచి 456 గ్రాముల వరకు బరువు పెరుగుతుంది. ఆహారంగా చిన్నచిన్న పురుగులు, నత్తలు, చిన్న చేపలను తీసుకుంటుంది. మన దేశంతోపాటు మలేసియా, బంగ్లాదేశ్, కంబోడియా, ఇండోనేషియా, హాంగ్‌కాంగ్, జపాన్‌ దేశాల్లో మంచినీరు ఉన్న ప్రాంతాల్లో సంచరిస్తూ ఉంటాయి.
9/18
కార్తిక మాసం ఆఖరి సోమవారం సందర్భంగా ఉభయ పశ్చిమలో శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆయా ప్రాంతాల్లోని దేవాలయాల్లో  శివయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తిక మాసం ఆఖరి సోమవారం సందర్భంగా ఉభయ పశ్చిమలో శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆయా ప్రాంతాల్లోని దేవాలయాల్లో శివయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
10/18
 కార్తిక సోమవారం సందర్భంగా  శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. అమరావతి, కోటప్పకొండకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. స్వామివారికి అభిషేకాలు చేశారు. పలు దేవాలయాల్లో శివపార్వతులకు కల్యాణోత్సవం జరిపారు. సాయంత్రం ఆలయ ప్రాంగణాల్లో దీపోత్సవం నిర్వహించారు. మహిళలు దీపాలు వెలిగించి పూజలు చేశారు. కార్తిక సోమవారం సందర్భంగా శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. అమరావతి, కోటప్పకొండకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. స్వామివారికి అభిషేకాలు చేశారు. పలు దేవాలయాల్లో శివపార్వతులకు కల్యాణోత్సవం జరిపారు. సాయంత్రం ఆలయ ప్రాంగణాల్లో దీపోత్సవం నిర్వహించారు. మహిళలు దీపాలు వెలిగించి పూజలు చేశారు.
11/18
 తుపాను హెచ్చరికల నేపథ్యంలో రైతుల్లో ఆందోళన నెలకొంది. రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెప్పడంతో ధాన్యాన్ని ఒబ్బిడి చేసుకునేందుకు పొలాలకు పరుగులు పెడుతున్నారు.  సాలూరు మండలం మామిడిపల్లి, బాగువలస, కందులపథం తదితర ప్రాంతాల్లో రోడ్లపై ఆరబోసిన ధాన్యాన్ని ఇలా కాపాడుకునే పనిలో ఉన్నారు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో రైతుల్లో ఆందోళన నెలకొంది. రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెప్పడంతో ధాన్యాన్ని ఒబ్బిడి చేసుకునేందుకు పొలాలకు పరుగులు పెడుతున్నారు. సాలూరు మండలం మామిడిపల్లి, బాగువలస, కందులపథం తదితర ప్రాంతాల్లో రోడ్లపై ఆరబోసిన ధాన్యాన్ని ఇలా కాపాడుకునే పనిలో ఉన్నారు.
12/18
శ్రీశైలం ఆలయం.. శివపార్వతుల వేషధారణలో దీపారాధన


శ్రీశైలం ఆలయం.. శివపార్వతుల వేషధారణలో దీపారాధన
13/18
పుంగనూరులో కార్తిక మాసం చివరి సోమవారం సందర్భంగా లక్ష దీపోత్సవం నిర్వహించారు. దీపాలతో పట్టణంలోని కల్యాణ వేంకటరమణస్వామి ఆలయ పుష్కరిణి కొంగొత్తశోభను సంతరించుకుంది. హిందూజాగరణ సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. పుంగనూరులో కార్తిక మాసం చివరి సోమవారం సందర్భంగా లక్ష దీపోత్సవం నిర్వహించారు. దీపాలతో పట్టణంలోని కల్యాణ వేంకటరమణస్వామి ఆలయ పుష్కరిణి కొంగొత్తశోభను సంతరించుకుంది. హిందూజాగరణ సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
14/18
అనకాపల్లి గవరపాలెం శ్రీగౌరీ  పంచాయతన దేవాలయంలో సోమవారం లక్ష్మీనారాయణుల కల్యాణం వైభవంగా జరిగింది. ముందుగా పూర్ణాహుతి, శాంతికల్యాణం, వసంతోత్సవం నిర్వహించారు. యాగశాలలోని కోటి తులసి పత్రిని పురవీధుల్లో ఊరేగింపుగా తీసుకువెళ్లి శారదా నదిలో కలిపారు. ఆలయంలో బాలికల కూచిపూడి నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. గౌరీ సంఘం అధ్యక్షులు బొడ్డేడ సన్యాసినాయుడు, కార్యదర్శి బుద్ద రమణాజీ, కోశాధికారి శివసూర్యనారాయణ పాల్గొన్నారు. అనకాపల్లి గవరపాలెం శ్రీగౌరీ పంచాయతన దేవాలయంలో సోమవారం లక్ష్మీనారాయణుల కల్యాణం వైభవంగా జరిగింది. ముందుగా పూర్ణాహుతి, శాంతికల్యాణం, వసంతోత్సవం నిర్వహించారు. యాగశాలలోని కోటి తులసి పత్రిని పురవీధుల్లో ఊరేగింపుగా తీసుకువెళ్లి శారదా నదిలో కలిపారు. ఆలయంలో బాలికల కూచిపూడి నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. గౌరీ సంఘం అధ్యక్షులు బొడ్డేడ సన్యాసినాయుడు, కార్యదర్శి బుద్ద రమణాజీ, కోశాధికారి శివసూర్యనారాయణ పాల్గొన్నారు.
15/18
అమీన్‌పూర్‌ చెరువులో క్యాట్‌ఫిష్‌ పెరుగుతుండటంతో మత్స్యకారులు ఆందోళనకు గురవుతున్నారు. ఇవి ఇతర చిన్న చేపలను తినేయడమే కారణం. బయోడైవర్సిటీ(జీవ వైవిధ్యం) కింద గుర్తించిన చెరువు ఇది. గతంలో మాజీ డీజీపీ అనురాగ్‌కౌర్‌ జల వనరు సంరక్షణకు చర్యలు తీసుకున్నారు. నీరు స్వచ్ఛంగా ఉండటంతో స్వేచ్ఛగా విహరించాల్సిన చేపలు క్యాట్‌ఫిష్‌ ధాటికి మృత్యువాతపడుతున్నాయి. ఈ విషయమై సంగారెడ్డి జిల్లా మత్స్యశాఖ అధికారి సతీష్‌ను వివరణ కోరగా.. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. నీరు ఎండిపోయే వరకు ఏమీ చేయలేని పరిస్థితి అని పేర్కొన్నారు. అమీన్‌పూర్‌ చెరువులో క్యాట్‌ఫిష్‌ పెరుగుతుండటంతో మత్స్యకారులు ఆందోళనకు గురవుతున్నారు. ఇవి ఇతర చిన్న చేపలను తినేయడమే కారణం. బయోడైవర్సిటీ(జీవ వైవిధ్యం) కింద గుర్తించిన చెరువు ఇది. గతంలో మాజీ డీజీపీ అనురాగ్‌కౌర్‌ జల వనరు సంరక్షణకు చర్యలు తీసుకున్నారు. నీరు స్వచ్ఛంగా ఉండటంతో స్వేచ్ఛగా విహరించాల్సిన చేపలు క్యాట్‌ఫిష్‌ ధాటికి మృత్యువాతపడుతున్నాయి. ఈ విషయమై సంగారెడ్డి జిల్లా మత్స్యశాఖ అధికారి సతీష్‌ను వివరణ కోరగా.. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. నీరు ఎండిపోయే వరకు ఏమీ చేయలేని పరిస్థితి అని పేర్కొన్నారు.
16/18
 హైదరాబాద్‌; నగరంలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు తగ్గుతూ చలి తీవ్రత ఎక్కువవు తోంది. నిత్యం ఉదయం ఎనిమిది గంటలైనా మంచు తెరలు వీడడం లేదు. ఖైరతాబాద్‌లో జనాలు చలిమంట కాచుకుంటున్న చిత్రమిది. హైదరాబాద్‌; నగరంలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు తగ్గుతూ చలి తీవ్రత ఎక్కువవు తోంది. నిత్యం ఉదయం ఎనిమిది గంటలైనా మంచు తెరలు వీడడం లేదు. ఖైరతాబాద్‌లో జనాలు చలిమంట కాచుకుంటున్న చిత్రమిది.
17/18
ఈ వృద్ధురాలి వయస్సు 80 ఏళ్లకుపైనే ఉంటుంది. పేరు బండి చిలుకమ్మ, ఊరు కమలాపూర్‌ మండలంలోని శనిగరం. ప్రత్యేకత ఏంటంటే ఉండటానికి పెంకుటిళ్లు కూడా సరిగా లేదు. వర్షం పడితే మట్టిగోడలు ఎప్పుడు కూలుతాయో తెలియని పరిస్థితి. వర్షం నీళ్లు ఇంట్లోకి రాకుండా ఇంటిపై కప్పును పరదా కప్పి ఉంటుంది. పరిశుభ్రత, స్వచ్ఛతలో గ్రామంలో ఆదర్శంగా నిలుస్తోంది. ఆర్థిక స్థోమత లేకున్నా ప్రభుత్వం అందించే సాయంతో మరుగుదొడ్డి నిర్మించుకుని శభాష్‌ అనిపించుకుంది. ఆమె గురించి తెలుసుకున్న ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు ఇటీవల అభినందించి పూల మొక్కను బహూకరించి శాలువాతో సన్మానించారు. ఈమెను ‘న్యూస్‌టుడే’ పలకరించగా రెండేళ్ల క్రితం మరుగుదొడ్డిని నిర్మించుకున్నానని చెప్పింది. ఈ వృద్ధురాలి వయస్సు 80 ఏళ్లకుపైనే ఉంటుంది. పేరు బండి చిలుకమ్మ, ఊరు కమలాపూర్‌ మండలంలోని శనిగరం. ప్రత్యేకత ఏంటంటే ఉండటానికి పెంకుటిళ్లు కూడా సరిగా లేదు. వర్షం పడితే మట్టిగోడలు ఎప్పుడు కూలుతాయో తెలియని పరిస్థితి. వర్షం నీళ్లు ఇంట్లోకి రాకుండా ఇంటిపై కప్పును పరదా కప్పి ఉంటుంది. పరిశుభ్రత, స్వచ్ఛతలో గ్రామంలో ఆదర్శంగా నిలుస్తోంది. ఆర్థిక స్థోమత లేకున్నా ప్రభుత్వం అందించే సాయంతో మరుగుదొడ్డి నిర్మించుకుని శభాష్‌ అనిపించుకుంది. ఆమె గురించి తెలుసుకున్న ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు ఇటీవల అభినందించి పూల మొక్కను బహూకరించి శాలువాతో సన్మానించారు. ఈమెను ‘న్యూస్‌టుడే’ పలకరించగా రెండేళ్ల క్రితం మరుగుదొడ్డిని నిర్మించుకున్నానని చెప్పింది.
18/18
ఆదిలాబాద్‌ జిల్లా భీంపూర్‌ మండలం తాంసి (కె) శివారు అటవీప్రాంతంలో మేతకు వెళ్లిన పశువుల మందపై పులి పంజా విసిరింది. పులి గాండ్రింపులు వినిపించడంతో బేస్‌ క్యాంపు సిబ్బంది ఇలా చెట్లు ఎక్కి వాటి కదలికలను గమనిస్తున్నారు. ఆదిలాబాద్‌ జిల్లా భీంపూర్‌ మండలం తాంసి (కె) శివారు అటవీప్రాంతంలో మేతకు వెళ్లిన పశువుల మందపై పులి పంజా విసిరింది. పులి గాండ్రింపులు వినిపించడంతో బేస్‌ క్యాంపు సిబ్బంది ఇలా చెట్లు ఎక్కి వాటి కదలికలను గమనిస్తున్నారు.

మరిన్ని

ap-districts
ts-districts