News In Pics : చిత్రం చెప్పే సంగతులు - 1 (23-11-2022)

Updated : 23 Nov 2022 14:16 IST
1/30
తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. నాలుగో రోజైన నేటి ఉదయం కల్పవృక్ష వాహనంపై రాజమన్నార్‌ అలంకారంలో అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు.  తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. నాలుగో రోజైన నేటి ఉదయం కల్పవృక్ష వాహనంపై రాజమన్నార్‌ అలంకారంలో అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు.
2/30
ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌.. దిగ్గజ దర్శకుడు కె.విశ్వనాథ్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. హైదరాబాద్‌లోని కె.విశ్వనాథ్‌ నివాసానికి వెళ్లిన కమల్‌ ఆయన యోగక్షేమాలు తెలుసుకున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో స్వాతిముత్యం, సాగరసంగమం, శుభసంకల్పం వంటి హిట్‌ చిత్రాలు వచ్చిన విషయం తెలిసిందే. ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌.. దిగ్గజ దర్శకుడు కె.విశ్వనాథ్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. హైదరాబాద్‌లోని కె.విశ్వనాథ్‌ నివాసానికి వెళ్లిన కమల్‌ ఆయన యోగక్షేమాలు తెలుసుకున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో స్వాతిముత్యం, సాగరసంగమం, శుభసంకల్పం వంటి హిట్‌ చిత్రాలు వచ్చిన విషయం తెలిసిందే.
3/30
బతుకు దెరువు కోసం ఈ దంపతులు  సరికొత్తగా ఆలోచించారు. తమకు తెలిసిన బిస్కట్ల తయారీకి అనువుగా ద్విచక్ర వాహన రూపు మార్చారు. దీనిని రద్దీ ప్రాంతాలకు తీసుకువెళ్తారు. అక్కడికక్కడే తయారీకి తగినట్లు పొయ్యిని కూడా వాహనంపైనే అమర్చారు. మంగళవారం విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీలో మద్దిలపాలెం నుంచి పెదవాల్తేరు వైపు వెళ్లే మార్గంలో విక్రయిస్తూ కనిపించారిలా. బతుకు దెరువు కోసం ఈ దంపతులు సరికొత్తగా ఆలోచించారు. తమకు తెలిసిన బిస్కట్ల తయారీకి అనువుగా ద్విచక్ర వాహన రూపు మార్చారు. దీనిని రద్దీ ప్రాంతాలకు తీసుకువెళ్తారు. అక్కడికక్కడే తయారీకి తగినట్లు పొయ్యిని కూడా వాహనంపైనే అమర్చారు. మంగళవారం విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీలో మద్దిలపాలెం నుంచి పెదవాల్తేరు వైపు వెళ్లే మార్గంలో విక్రయిస్తూ కనిపించారిలా.
4/30
విశాఖపట్నం కైలాసగిరికి సమీపంలోని తెన్నేటిపార్కుకు నిత్యం పర్యాటకులు వస్తుంటారు. దాని చెంతనే సాగరంలో కొట్టుకువచ్చిన నౌక ‘ఎంవీ మా’ను చూసేందుకు ఇటీవల చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. ఇంత ఆదరణ ఉన్న ఈ ప్రాంతానికి నిత్యం ‘పొగ గండం’ తప్పటం లేదు. ఉద్యానవనంలో సేకరించిన వ్యర్థాలను సాగర తీరంలోనే కాల్చివేస్తుండటంతో భారీగా పొగ కమ్ముకుంటోంది. 

విశాఖపట్నం కైలాసగిరికి సమీపంలోని తెన్నేటిపార్కుకు నిత్యం పర్యాటకులు వస్తుంటారు. దాని చెంతనే సాగరంలో కొట్టుకువచ్చిన నౌక ‘ఎంవీ మా’ను చూసేందుకు ఇటీవల చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. ఇంత ఆదరణ ఉన్న ఈ ప్రాంతానికి నిత్యం ‘పొగ గండం’ తప్పటం లేదు. ఉద్యానవనంలో సేకరించిన వ్యర్థాలను సాగర తీరంలోనే కాల్చివేస్తుండటంతో భారీగా పొగ కమ్ముకుంటోంది.
5/30
అడవిలో సంచరించే ఈ పక్షి విశాఖ జిల్లాలోని సింహగిరి పునరావాస కాలనీ గోశాల లేఅవుట్లో కనువిందు చేసింది. ఇవి సింహగిరి కొండవాలు ప్రాంత కాలనీకి తరచూ వస్తుంటాయని, పండ్ల చెట్ల వద్ద వాలి ఫలాలను ఆరగిస్తుంటాయని స్థానికులు పేర్కొన్నారు.  అడవిలో సంచరించే ఈ పక్షి విశాఖ జిల్లాలోని సింహగిరి పునరావాస కాలనీ గోశాల లేఅవుట్లో కనువిందు చేసింది. ఇవి సింహగిరి కొండవాలు ప్రాంత కాలనీకి తరచూ వస్తుంటాయని, పండ్ల చెట్ల వద్ద వాలి ఫలాలను ఆరగిస్తుంటాయని స్థానికులు పేర్కొన్నారు.
6/30


మద్యం మత్తులో ఉన్న ఓ ప్రయాణికుడు మంగళవారం విశాఖపట్నం నుంచి ఎలమంచిలి వెళ్లే బస్సులో ప్రయాణించి కండక్టర్‌కు, ప్రయాణికులకు చుక్కలు చూపించాడు. బస్సులో ప్రయాణికులు నడిచే మార్గంలో పడిపోయాడు. పక్కకు వెళ్లమన్నా వినే స్థితిలో లేకపోవడంతో అతడిని దాటుకొని వెళ్లాల్సి వచ్చింది.  

మద్యం మత్తులో ఉన్న ఓ ప్రయాణికుడు మంగళవారం విశాఖపట్నం నుంచి ఎలమంచిలి వెళ్లే బస్సులో ప్రయాణించి కండక్టర్‌కు, ప్రయాణికులకు చుక్కలు చూపించాడు. బస్సులో ప్రయాణికులు నడిచే మార్గంలో పడిపోయాడు. పక్కకు వెళ్లమన్నా వినే స్థితిలో లేకపోవడంతో అతడిని దాటుకొని వెళ్లాల్సి వచ్చింది.
7/30
వెల్దుర్తి- డోన్‌ మార్గంలోని రైల్వే గేటులో ఆటోలు వెళ్లాలంటే ప్రయాణికులు దిగి తోయాల్సిన పరిస్థితి నెలకొంది. రైల్వేగేటు మార్గంలోని పట్టాల మధ్య కంకర రాళ్లు అధికంగా వేయడంతో ఆటోలు ముందుకు కదల్లేని పరిస్థితి. రాళ్ల మధ్య ఇరుక్కుపోవడంతో ఆటోను ప్రయాణికులు కిందకు దిగి తోస్తున్నారు. ఆటోలు నిలిచిపోవడంతో ఇతర వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు. వెల్దుర్తి- డోన్‌ మార్గంలోని రైల్వే గేటులో ఆటోలు వెళ్లాలంటే ప్రయాణికులు దిగి తోయాల్సిన పరిస్థితి నెలకొంది. రైల్వేగేటు మార్గంలోని పట్టాల మధ్య కంకర రాళ్లు అధికంగా వేయడంతో ఆటోలు ముందుకు కదల్లేని పరిస్థితి. రాళ్ల మధ్య ఇరుక్కుపోవడంతో ఆటోను ప్రయాణికులు కిందకు దిగి తోస్తున్నారు. ఆటోలు నిలిచిపోవడంతో ఇతర వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు.
8/30
కోనసీమలోని పలు గ్రామాల్లో పంట విరామం ప్రకటించిన పొలాల్లో కలుపు పెరిగి, బీడువారి పోయాయి. ఆ పొలాలను సాగులోకి తెచ్చేందుకు రైతులు శ్రమించాల్సివస్తోంది. మంగళవారం ఉప్పలగుప్తం మండలంలోని వాడపర్రులోని  ఓ రైతు నారుమడి కోసం దమ్ము చేస్తున్న సమయంలో ట్రాక్టరు చక్రాలు దిగబడి ప్రమాదకరంగా పైకిలేచాయిలా. కోనసీమలోని పలు గ్రామాల్లో పంట విరామం ప్రకటించిన పొలాల్లో కలుపు పెరిగి, బీడువారి పోయాయి. ఆ పొలాలను సాగులోకి తెచ్చేందుకు రైతులు శ్రమించాల్సివస్తోంది. మంగళవారం ఉప్పలగుప్తం మండలంలోని వాడపర్రులోని ఓ రైతు నారుమడి కోసం దమ్ము చేస్తున్న సమయంలో ట్రాక్టరు చక్రాలు దిగబడి ప్రమాదకరంగా పైకిలేచాయిలా.
9/30
వాయుగుండం ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. తుపాను నేపథ్యంలో కెరటాలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. తుపాను తీవ్రత దృష్ట్యా మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దాంతో ఓడలరేవు జెట్టీ వద్ద వివిధ ప్రాంతాలకు చెందిన మత్స్యకారులు తమ బోట్లను నిలిపివేశారు. వాయుగుండం ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. తుపాను నేపథ్యంలో కెరటాలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. తుపాను తీవ్రత దృష్ట్యా మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దాంతో ఓడలరేవు జెట్టీ వద్ద వివిధ ప్రాంతాలకు చెందిన మత్స్యకారులు తమ బోట్లను నిలిపివేశారు.
10/30
మన్యంలోవర్షా కాలంలోనే కాదు, ప్రతిరోజు జలపాతాలు నీటితో ఉరకలేస్తున్నాయి. వాటిని చూసిన వారు మంత్రముగ్ధులు కాక తప్పదు. హుకుంపేట మండలంలో సుమారు 10 గ్రామాల్లో జలపాతాలు ఉన్నాయి. సరసపాడు వద్ద పెదబయలు జలపాతాలు అందాలు ఇట్టే కట్టిపడేస్తున్నాయి. పర్యాటకులు స్నానాలుచేస్తూ సరదాగా గడుపుతున్నారు.  మన్యంలోవర్షా కాలంలోనే కాదు, ప్రతిరోజు జలపాతాలు నీటితో ఉరకలేస్తున్నాయి. వాటిని చూసిన వారు మంత్రముగ్ధులు కాక తప్పదు. హుకుంపేట మండలంలో సుమారు 10 గ్రామాల్లో జలపాతాలు ఉన్నాయి. సరసపాడు వద్ద పెదబయలు జలపాతాలు అందాలు ఇట్టే కట్టిపడేస్తున్నాయి. పర్యాటకులు స్నానాలుచేస్తూ సరదాగా గడుపుతున్నారు.
11/30
అక్కినేని నాగ చైతన్య హీరోగా దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న చిత్రం టైటిల్‌&ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న ఈ సినిమాకు ‘కస్టడీ’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. నేడు చైతూ పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్‌ను చిత్రబృందం సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది. అక్కినేని నాగ చైతన్య హీరోగా దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న చిత్రం టైటిల్‌&ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న ఈ సినిమాకు ‘కస్టడీ’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. నేడు చైతూ పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్‌ను చిత్రబృందం సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది.
12/30
అనంతపురం జిల్లా రాయదుర్గంలోని కోట నగరేశ్వరస్వామిని మాస శివరాత్రిని పురస్కరించుకొని ఎండుఫలాలతో అలంకరించారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలోని కోట నగరేశ్వరస్వామిని మాస శివరాత్రిని పురస్కరించుకొని ఎండుఫలాలతో అలంకరించారు.
13/30
మేఘా ఇంజినీరింగ్‌ కంపెనీ అధినేత కృష్ణారెడ్డి సతీమణి సుధారెడ్డి.. గ్లోబల్‌ గిఫ్ట్‌ ఫౌండేషన్‌లో భాగస్వామురాలైన తొలి భారతీయ మహిళగా గుర్తింపు పొందారు. పారిస్‌లో తాజాగా జరిగిన ది గ్లోబల్‌ గిఫ్ట్‌ గాలా ఎడిషన్‌లో ఆమె భారత్‌ తరఫున పాల్గొన్నారు. మేఘా ఇంజినీరింగ్‌ కంపెనీ అధినేత కృష్ణారెడ్డి సతీమణి సుధారెడ్డి.. గ్లోబల్‌ గిఫ్ట్‌ ఫౌండేషన్‌లో భాగస్వామురాలైన తొలి భారతీయ మహిళగా గుర్తింపు పొందారు. పారిస్‌లో తాజాగా జరిగిన ది గ్లోబల్‌ గిఫ్ట్‌ గాలా ఎడిషన్‌లో ఆమె భారత్‌ తరఫున పాల్గొన్నారు.
14/30
ప్రమాదంలో ఎవరైనా రోడ్డుపై పడిపోయి ఉంటే ఏమాత్రం పట్టించుకోకుండా ఎవరి దారిన వారు పోతున్న రోజులివి. కష్టాల్లో ఉన్న సాటివారి పట్ల మానవత్వం చూపించడం లేదు. కానీ శునకం మాత్రం సాటి కుక్క చనిపోతే ఎంతగానో చలించింది. గుంటూరు శివారులోని నాయుడుపేటవద్ద జాతీయ రహదారిపై వాహనం ఢీకొని కుక్క చనిపోయింది. అక్కడే ఉన్న మరో కుక్క వచ్చి ఆ కళేబరం వద్ద చాలాసేపు ఉంది. ప్రమాదంలో ఎవరైనా రోడ్డుపై పడిపోయి ఉంటే ఏమాత్రం పట్టించుకోకుండా ఎవరి దారిన వారు పోతున్న రోజులివి. కష్టాల్లో ఉన్న సాటివారి పట్ల మానవత్వం చూపించడం లేదు. కానీ శునకం మాత్రం సాటి కుక్క చనిపోతే ఎంతగానో చలించింది. గుంటూరు శివారులోని నాయుడుపేటవద్ద జాతీయ రహదారిపై వాహనం ఢీకొని కుక్క చనిపోయింది. అక్కడే ఉన్న మరో కుక్క వచ్చి ఆ కళేబరం వద్ద చాలాసేపు ఉంది.
15/30
అక్రమార్కుల చేతుల్లో కొండలు సైతం కరిగిపోతున్నాయి. యథేచ్ఛగా మట్టి తవ్వి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. వైయస్‌ఆర్‌ జిల్లా కడప నగరం సమీపంలో ఉన్న కొండ.. మట్టి తవ్వకాలతో రూపుకోల్పోయింది. సుమారు పది కిలోమీటర్ల పొడవున ఉన్న ఈ కొండ మరో రుషికొండను తలపిస్తోంది.  అక్రమార్కుల చేతుల్లో కొండలు సైతం కరిగిపోతున్నాయి. యథేచ్ఛగా మట్టి తవ్వి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. వైయస్‌ఆర్‌ జిల్లా కడప నగరం సమీపంలో ఉన్న కొండ.. మట్టి తవ్వకాలతో రూపుకోల్పోయింది. సుమారు పది కిలోమీటర్ల పొడవున ఉన్న ఈ కొండ మరో రుషికొండను తలపిస్తోంది.
16/30
ప్రో కబడ్డీ తొమ్మిదో సీజన్‌ పోటీలతో గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో కోలాహలం నెలకొంది. మంగళవారం తెలుగు టైటాన్స్‌-పట్నాపైరేట్స్‌ మధ్య మ్యాచ్‌ను అభిమానులు ఆసక్తిగా తిలకించారు. పోటీలను చూసేందుకు నటి సంగీత వచ్చారు. వ్యాఖ్యాత రాధికారెడ్డితో కలిసి సందడి చేశారు. ప్రో కబడ్డీ తొమ్మిదో సీజన్‌ పోటీలతో గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో కోలాహలం నెలకొంది. మంగళవారం తెలుగు టైటాన్స్‌-పట్నాపైరేట్స్‌ మధ్య మ్యాచ్‌ను అభిమానులు ఆసక్తిగా తిలకించారు. పోటీలను చూసేందుకు నటి సంగీత వచ్చారు. వ్యాఖ్యాత రాధికారెడ్డితో కలిసి సందడి చేశారు.
17/30
ఫార్ములా-ఈ రేస్‌ కోసమని ఎన్టీఆర్‌ మార్గ్‌లో ప్రత్యేకంగా రోడ్లు వేసిన విషయం తెలిసిందే. రేస్‌ ముగియడంతో ఆయా రోడ్లపై ట్రాఫిక్‌ వదిలారు. కొత్తగా వేసిన రోడ్డు ఎత్తుగా ఉండటంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు ఫార్ములా-ఈ రేస్‌ కోసమని ఎన్టీఆర్‌ మార్గ్‌లో ప్రత్యేకంగా రోడ్లు వేసిన విషయం తెలిసిందే. రేస్‌ ముగియడంతో ఆయా రోడ్లపై ట్రాఫిక్‌ వదిలారు. కొత్తగా వేసిన రోడ్డు ఎత్తుగా ఉండటంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు
18/30
ఐకియా నుంచి గచ్చిబౌలి ఓఆర్‌ఆర్‌ వరకు రూ.190 కోట్లతో నిర్మిస్తున్న నాలుగులైన్ల శిల్పా లేఅవుట్‌ ఫ్లైఓవర్‌ నిర్మాణం పూర్తయింది. 823 మీటర్ల పొడవు, 16.60 మీటర్ల వెడల్పుతో నగరంలో పొడవైన వంతెనల్లో ఒకటిగా నిలవనుంది. వీధి దీపాల ఏర్పాటు పూర్తయింది. ఐకియా నుంచి గచ్చిబౌలి ఓఆర్‌ఆర్‌ వరకు రూ.190 కోట్లతో నిర్మిస్తున్న నాలుగులైన్ల శిల్పా లేఅవుట్‌ ఫ్లైఓవర్‌ నిర్మాణం పూర్తయింది. 823 మీటర్ల పొడవు, 16.60 మీటర్ల వెడల్పుతో నగరంలో పొడవైన వంతెనల్లో ఒకటిగా నిలవనుంది. వీధి దీపాల ఏర్పాటు పూర్తయింది.
19/30
రూ.లక్షలు వెచ్చించి బస్సుల కోసం బస్‌బేలు నిర్మిస్తే డ్రైవర్లు మాత్రం అక్కడ కాకుండా ఎక్కడ పడితే అక్కడ నిలిపి ప్రయాణికులను ఇబ్బంది పెడుతున్నారు. నిజాంపేట్‌ రోడ్డులో కనిపించిందీ చిత్రం. రూ.లక్షలు వెచ్చించి బస్సుల కోసం బస్‌బేలు నిర్మిస్తే డ్రైవర్లు మాత్రం అక్కడ కాకుండా ఎక్కడ పడితే అక్కడ నిలిపి ప్రయాణికులను ఇబ్బంది పెడుతున్నారు. నిజాంపేట్‌ రోడ్డులో కనిపించిందీ చిత్రం.
20/30
సీఎం నివాసానికి వెళ్లే మార్గం అంటే ఎంతో అందంగా సుందరంగా ఉంటుందని భావిస్తారు. కానీ ఆ మార్గంలోని డివైడర్‌ మధ్య ఏర్పాటు చేసిన మొక్కలను ఇలా అడ్డంగా నరికివేసి కళావిహీనంగా మార్చారు. సీఎం నివాసానికి వెళ్లే మార్గం అంటే ఎంతో అందంగా సుందరంగా ఉంటుందని భావిస్తారు. కానీ ఆ మార్గంలోని డివైడర్‌ మధ్య ఏర్పాటు చేసిన మొక్కలను ఇలా అడ్డంగా నరికివేసి కళావిహీనంగా మార్చారు.
21/30
భీమవరం పట్టణంలోని గునుపూడి సోమేశ్వరజనార్దనస్వామి ఆలయం ఎదుట మంగళవారం రాత్రి నందమూరి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో సామూహిక కార్తిక దీపోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. 1500 మంది భక్తులు ఈ పూజల్లో పాల్గొన్నారు. భీమవరం పట్టణంలోని గునుపూడి సోమేశ్వరజనార్దనస్వామి ఆలయం ఎదుట మంగళవారం రాత్రి నందమూరి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో సామూహిక కార్తిక దీపోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. 1500 మంది భక్తులు ఈ పూజల్లో పాల్గొన్నారు.
22/30
తిరుపతిలో శ్రీవారి భక్తుల ట్రాఫిక్‌ కష్టాలు తీర్చడానికి శ్రీనివాససేతు మొదటి, రెండోదశ పనులు పూర్తయ్యాయి. వంతెనలను పై నుంచి చూస్తే నగరం మధ్య ఆకట్టుకుంటున్నాయి. తిరుపతిలో శ్రీవారి భక్తుల ట్రాఫిక్‌ కష్టాలు తీర్చడానికి శ్రీనివాససేతు మొదటి, రెండోదశ పనులు పూర్తయ్యాయి. వంతెనలను పై నుంచి చూస్తే నగరం మధ్య ఆకట్టుకుంటున్నాయి.
23/30
 సాలూరు మండలంలోని దండిగాం నుంచి శిఖపరువు వెళ్లే మార్గంలో ఉన్న గిరిశిఖరాలు పర్యాటకులతో కిటకిటలాడుతున్నాయి. స్థానికంగా ఉన్న జలపాతాల వద్ద యువత సందడి చేస్తున్నారు. మంగళవారం వివిధ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున తరలివచ్చి, డ్యాన్సులేశారు. సాలూరు మండలంలోని దండిగాం నుంచి శిఖపరువు వెళ్లే మార్గంలో ఉన్న గిరిశిఖరాలు పర్యాటకులతో కిటకిటలాడుతున్నాయి. స్థానికంగా ఉన్న జలపాతాల వద్ద యువత సందడి చేస్తున్నారు. మంగళవారం వివిధ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున తరలివచ్చి, డ్యాన్సులేశారు.
24/30
తుపాను హెచ్చరికలు.. వాతావరణంలో మార్పులు రావడం, అక్కడక్కడా చిరుజల్లులు పడుతుండటంతో సంతకవిటి మండలంలోని మందరాడలో పనలను తీసుకెళ్తున్న రైతులు.. తుపాను హెచ్చరికలు.. వాతావరణంలో మార్పులు రావడం, అక్కడక్కడా చిరుజల్లులు పడుతుండటంతో సంతకవిటి మండలంలోని మందరాడలో పనలను తీసుకెళ్తున్న రైతులు..
25/30
డిసెంబరు నాలుగో తేదీన విశాఖలో జరిగే నౌకాదళ దినోత్సవానికి రంగం సిద్ధమవుతోంది. ఆర్కేబీచ్‌ వద్ద తీరంలో యుద్ధనౌకలు, జలాంతర్గాములతో మంగళవారం సాయంత్రం నిర్వహించిన నమూనా విన్యాసాలను ప్రజలు ఆసక్తిగా తిలకించారు. డిసెంబరు నాలుగో తేదీన విశాఖలో జరిగే నౌకాదళ దినోత్సవానికి రంగం సిద్ధమవుతోంది. ఆర్కేబీచ్‌ వద్ద తీరంలో యుద్ధనౌకలు, జలాంతర్గాములతో మంగళవారం సాయంత్రం నిర్వహించిన నమూనా విన్యాసాలను ప్రజలు ఆసక్తిగా తిలకించారు.
26/30
పచ్చని క్రికెట్‌ మైదానం.. ఆ పక్కనే పేర్చినట్లున్న ఇళ్లు.. చూడగానే ఆకట్టుకుంటున్న ఈ దృశ్యం భాగ్యనగరంలోని నాగోలు డివిజన్‌ ఫతుల్లాగూడలోనిది. ఒకప్పుడు ఇక్కడ వ్యర్థాల గుట్ట ఉండేది. స్థానికుల ఫిర్యాదులతో  చెత్తను తరలించగా ఏర్పడిన ఖాళీ స్థలంలో విపత్తు నివారణ బృందం ఆధ్వర్యంలో క్రికెట్‌ స్టేడియాన్ని నిర్మించారు. ఆ పక్కనే ఓ కాలనీ సైతం ఏర్పాటు కావడంతో ఆ ప్రాంతం రూపురేఖలే మారిపోయాయి. పచ్చని క్రికెట్‌ మైదానం.. ఆ పక్కనే పేర్చినట్లున్న ఇళ్లు.. చూడగానే ఆకట్టుకుంటున్న ఈ దృశ్యం భాగ్యనగరంలోని నాగోలు డివిజన్‌ ఫతుల్లాగూడలోనిది. ఒకప్పుడు ఇక్కడ వ్యర్థాల గుట్ట ఉండేది. స్థానికుల ఫిర్యాదులతో చెత్తను తరలించగా ఏర్పడిన ఖాళీ స్థలంలో విపత్తు నివారణ బృందం ఆధ్వర్యంలో క్రికెట్‌ స్టేడియాన్ని నిర్మించారు. ఆ పక్కనే ఓ కాలనీ సైతం ఏర్పాటు కావడంతో ఆ ప్రాంతం రూపురేఖలే మారిపోయాయి.
27/30
తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ బస్సుపై చార్మినార్‌ చిత్రాన్ని ఇలా తీర్చిదిద్దడంతో అందరినీ ఆకర్షిస్తోంది. పబ్లిక్‌ గార్డెన్‌ రోడ్డులో కనిపించిందిలా. తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ బస్సుపై చార్మినార్‌ చిత్రాన్ని ఇలా తీర్చిదిద్దడంతో అందరినీ ఆకర్షిస్తోంది. పబ్లిక్‌ గార్డెన్‌ రోడ్డులో కనిపించిందిలా.
28/30
పాతబస్తీ చాంద్రాయణగుట్ట సీఆర్‌పీఎఫ్‌ గ్రూప్‌ సెంటర్‌ మెన్స్‌క్లబ్‌లో మంగళవారం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ‘రోజ్‌గార్‌ మేళా’ జరిగింది. వివిధ విభాగాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన 200 మంది యువతీ, యువకులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా యువతులు ప్రధాని నరేంద్ర మోదీ కటౌట్‌ వద్ద ఉద్యోగ నియామకపత్రాలు తీసుకుంటూ ఫొటోలు దిగారు. పాతబస్తీ చాంద్రాయణగుట్ట సీఆర్‌పీఎఫ్‌ గ్రూప్‌ సెంటర్‌ మెన్స్‌క్లబ్‌లో మంగళవారం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ‘రోజ్‌గార్‌ మేళా’ జరిగింది. వివిధ విభాగాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన 200 మంది యువతీ, యువకులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా యువతులు ప్రధాని నరేంద్ర మోదీ కటౌట్‌ వద్ద ఉద్యోగ నియామకపత్రాలు తీసుకుంటూ ఫొటోలు దిగారు.
29/30
30/30
 బాపట్ల జిల్లాలో మాస శివరాత్రి సందర్భంగా మంగళవారం శివుడికి ప్రత్యేక పూజలు చేశారు. స్వామి వారికి అన్నాభిషేకాలు చేసి అన్న ప్రసాద వితరణ చేశారు.  సాయంత్రం ఆలయాల్లో దీపోత్సవం ఘనంగా నిర్వహించారు. దీప కాంతుల వెలుగుల్లో ఆలయాలు కాంతులీనాయి. బాపట్ల జిల్లాలో మాస శివరాత్రి సందర్భంగా మంగళవారం శివుడికి ప్రత్యేక పూజలు చేశారు. స్వామి వారికి అన్నాభిషేకాలు చేసి అన్న ప్రసాద వితరణ చేశారు. సాయంత్రం ఆలయాల్లో దీపోత్సవం ఘనంగా నిర్వహించారు. దీప కాంతుల వెలుగుల్లో ఆలయాలు కాంతులీనాయి.

మరిన్ని