News In Pics : చిత్రం చెప్పే సంగతులు - 2 (23-11-2022)

Updated : 23 Nov 2022 22:33 IST
1/21
గతంలో చాలాసార్లు ఆర్టీసీ డ్రైవర్లకు ట్రాఫిక్‌ రూల్స్‌ వివరించినా.. నిర్లక్ష్యం చేయడంతో బుధవారం ట్రాఫిక్‌ పోలీసులు రూ.వెయ్యి జరిమానా విధించారు. హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌ రోడ్డులో ట్రాఫిక్‌ పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించారు. ఈక్రమంలో రోడ్డుపై వాహనాన్ని నిలిపిన బస్సు డ్రైవర్లకు జరిమానా విధించారు. పలువురు డ్రైవర్లు ట్రాఫిక్‌ పోలీసులను ప్రాధేయపడినా ఫలితం లేకపోయింది. గతంలో చాలాసార్లు ఆర్టీసీ డ్రైవర్లకు ట్రాఫిక్‌ రూల్స్‌ వివరించినా.. నిర్లక్ష్యం చేయడంతో బుధవారం ట్రాఫిక్‌ పోలీసులు రూ.వెయ్యి జరిమానా విధించారు. హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌ రోడ్డులో ట్రాఫిక్‌ పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించారు. ఈక్రమంలో రోడ్డుపై వాహనాన్ని నిలిపిన బస్సు డ్రైవర్లకు జరిమానా విధించారు. పలువురు డ్రైవర్లు ట్రాఫిక్‌ పోలీసులను ప్రాధేయపడినా ఫలితం లేకపోయింది.
2/21
కార్తిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుచానూరు పద్మావతి అమ్మవారు బుధవారం సాయంత్రం హనుమంత వాహనంపై పట్టాభిరాముడి అలంకారంలో దర్శనమిచ్చారు. ఆలయ వీధుల్లో ఊరేగుతున్న అమ్మవారిని భక్తులు దర్శించుకొని పరవశించిపోయారు. కార్తిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుచానూరు పద్మావతి అమ్మవారు బుధవారం సాయంత్రం హనుమంత వాహనంపై పట్టాభిరాముడి అలంకారంలో దర్శనమిచ్చారు. ఆలయ వీధుల్లో ఊరేగుతున్న అమ్మవారిని భక్తులు దర్శించుకొని పరవశించిపోయారు.
3/21
విజయవాడలోని మారిస్‌ స్టెల్లా కళాశాలలో ‘తెలుగు అమ్మాయి షో’ నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు విద్యార్థినులు పాల్గొని సంప్రదాయ వస్త్రధారణతో నృత్య ప్రదర్శనలు, ర్యాంప్‌ వాక్‌ చేసి ఆకట్టుకున్నారు. విజయవాడలోని మారిస్‌ స్టెల్లా కళాశాలలో ‘తెలుగు అమ్మాయి షో’ నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు విద్యార్థినులు పాల్గొని సంప్రదాయ వస్త్రధారణతో నృత్య ప్రదర్శనలు, ర్యాంప్‌ వాక్‌ చేసి ఆకట్టుకున్నారు.
4/21
రాయదుర్గం నాలెడ్జ్‌ సిటీలోని ఐటీ కారిడార్‌ విద్యుద్దీపాల కాంతులతో జిగేల్‌మంటోంది. ఇటీవల పూర్తయిన అద్దాల భవనాలు ఈ వెలుగుల్లో చూపరులను మరింత ఆకట్టుకుంటున్నాయి. రాయదుర్గం నాలెడ్జ్‌ సిటీలోని ఐటీ కారిడార్‌ విద్యుద్దీపాల కాంతులతో జిగేల్‌మంటోంది. ఇటీవల పూర్తయిన అద్దాల భవనాలు ఈ వెలుగుల్లో చూపరులను మరింత ఆకట్టుకుంటున్నాయి.
5/21
కార్తిక మాసం సందర్భంగా విజయవాడలోని కనకదుర్గ ఆలయంలో సహస్ర లింగార్చన సేవ నిర్వహించారు. భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కార్తిక మాసం సందర్భంగా విజయవాడలోని కనకదుర్గ ఆలయంలో సహస్ర లింగార్చన సేవ నిర్వహించారు. భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
6/21
మహా కుంభాభిషేక మహోత్సవంలో భాగంగా కాకినాడ కుంబాభిషేకం చేపల రేవు వద్ద ఉన్న శ్రీ ఆది కుంభేశ్వరస్వామి ఆలయంలో చిన్న చిన్న శివలింగాలతో మహా శివలింగాన్ని ఏర్పాటు చేశారు. మహా కుంభాభిషేక మహోత్సవంలో భాగంగా కాకినాడ కుంబాభిషేకం చేపల రేవు వద్ద ఉన్న శ్రీ ఆది కుంభేశ్వరస్వామి ఆలయంలో చిన్న చిన్న శివలింగాలతో మహా శివలింగాన్ని ఏర్పాటు చేశారు.
7/21
నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కి ఘనవిజయం సాధించిన సినిమా ‘అఖండ’. ఈ చిత్రాన్ని గోవాలో నిర్వహిస్తున్న 53వ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా(ఇఫి)లో గురువారం ప్రదర్శించనున్నారు. నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కి ఘనవిజయం సాధించిన సినిమా ‘అఖండ’. ఈ చిత్రాన్ని గోవాలో నిర్వహిస్తున్న 53వ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా(ఇఫి)లో గురువారం ప్రదర్శించనున్నారు.
8/21
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎఫ్‌ఆర్వో శ్రీనివాసరావు హత్యను ఖండిస్తూ ఆదిలాబాద్‌లో అటవీశాఖ అధికారులు ద్విచక్రవాహనాలపై నిరసన ర్యాలీ నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎఫ్‌ఆర్వో శ్రీనివాసరావు హత్యను ఖండిస్తూ ఆదిలాబాద్‌లో అటవీశాఖ అధికారులు ద్విచక్రవాహనాలపై నిరసన ర్యాలీ నిర్వహించారు.
9/21
హైదరాబాద్‌లోని అమీర్‌పేట్‌లో ‘వైశ్య లైమ్‌లైట్‌ ఫర్‌ వుమెన్‌’ అవార్డుల ప్రదానోత్సవం కోసం నామినేషన్లు స్వీకరించారు. కార్యక్రమంలో పలువురు మోడల్స్‌ పాల్గొని ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు. ఈ పురస్కారాల ప్రదానోత్సవం ఈ నెల 26న నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లోని అమీర్‌పేట్‌లో ‘వైశ్య లైమ్‌లైట్‌ ఫర్‌ వుమెన్‌’ అవార్డుల ప్రదానోత్సవం కోసం నామినేషన్లు స్వీకరించారు. కార్యక్రమంలో పలువురు మోడల్స్‌ పాల్గొని ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు. ఈ పురస్కారాల ప్రదానోత్సవం ఈ నెల 26న నిర్వహించనున్నారు.
10/21
11/21
విశాఖ జిల్లా పద్మనాభంలో అనంత పద్మనాభుని కార్తిక దీపోత్సవానికి ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి సుమారు 2లక్షల మంది భక్తులు తరలివచ్చారు. రాష్ట్రంలోనే అతి పురాతనమైన అనంత పద్మనాభునికి కార్తికమాసం చివరి రోజున దీపోత్సవం  నిర్వహించడం ఆనవాయితీ. దీంతో మెట్ల మార్గం పూర్తిగా భక్తులతో నిండిపోయింది. సుమారు 2వేల మెట్లపై అంతటా భక్తులే కనిపిస్తున్నారు. విశాఖ జిల్లా పద్మనాభంలో అనంత పద్మనాభుని కార్తిక దీపోత్సవానికి ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి సుమారు 2లక్షల మంది భక్తులు తరలివచ్చారు. రాష్ట్రంలోనే అతి పురాతనమైన అనంత పద్మనాభునికి కార్తికమాసం చివరి రోజున దీపోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. దీంతో మెట్ల మార్గం పూర్తిగా భక్తులతో నిండిపోయింది. సుమారు 2వేల మెట్లపై అంతటా భక్తులే కనిపిస్తున్నారు.
12/21
13/21
మంత్రి రోజా చారిత్రక ప్రదేశమైన లేపాక్షిని సందర్శించారు. ఈ అవకాశం తనకు కలిగినందుకు సంతోషంగా ఉందని ఆమె తెలిపారు. మంత్రి రోజా చారిత్రక ప్రదేశమైన లేపాక్షిని సందర్శించారు. ఈ అవకాశం తనకు కలిగినందుకు సంతోషంగా ఉందని ఆమె తెలిపారు.
14/21
డిసెంబర్ మూడో తేదీన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకొని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో మంత్రి సత్యవతి రాథోడ్‌ జిల్లాస్థాయి దివ్యాంగుల క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె ఇలా క్యారమ్స్‌ ఆడుతూ కనిపించారు. డిసెంబర్ మూడో తేదీన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకొని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో మంత్రి సత్యవతి రాథోడ్‌ జిల్లాస్థాయి దివ్యాంగుల క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె ఇలా క్యారమ్స్‌ ఆడుతూ కనిపించారు.
15/21
ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లిలోని పత్తి పంటలను, జిన్నింగ్‌ తీరును జర్మనీ, ఫ్రాన్స్‌, నెదర్లాండ్స్‌ దేశాల ప్రతినిధులు పరిశీలించారు. ఆదిలాబాద్‌ జిల్లాలో పండించే పత్తి నాణ్యతగా ఉందని వారు తెలిపారు. ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లిలోని పత్తి పంటలను, జిన్నింగ్‌ తీరును జర్మనీ, ఫ్రాన్స్‌, నెదర్లాండ్స్‌ దేశాల ప్రతినిధులు పరిశీలించారు. ఆదిలాబాద్‌ జిల్లాలో పండించే పత్తి నాణ్యతగా ఉందని వారు తెలిపారు.
16/21
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ‘జగనన్న భూహక్కు- భూరక్ష’ పథకం రెండో దశను సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. మరోవైపు సభకు వచ్చిన వారి నుంచి పోలీసులు పెన్నులు, వాటర్‌ బాటిల్స్‌ స్వాధీనం చేసుకున్నారు. నలుపు దుస్తులు ధరించిన వారిని సైతం అనుమతించకపోవడంతో పలువురు ఇబ్బందులు పడ్డారు.. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ‘జగనన్న భూహక్కు- భూరక్ష’ పథకం రెండో దశను సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. మరోవైపు సభకు వచ్చిన వారి నుంచి పోలీసులు పెన్నులు, వాటర్‌ బాటిల్స్‌ స్వాధీనం చేసుకున్నారు. నలుపు దుస్తులు ధరించిన వారిని సైతం అనుమతించకపోవడంతో పలువురు ఇబ్బందులు పడ్డారు..
17/21
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ఘనంగా ఉర్సు ఉత్సవాలు నిర్వహించారు. మేళతాళాలు, వాయిద్యాలు, కోలాటాల నడుమ నృత్యాలు చేస్తూ సత్యనారాయణపురం దర్గాకు వెళ్లారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ఘనంగా ఉర్సు ఉత్సవాలు నిర్వహించారు. మేళతాళాలు, వాయిద్యాలు, కోలాటాల నడుమ నృత్యాలు చేస్తూ సత్యనారాయణపురం దర్గాకు వెళ్లారు.
18/21
మాదాపూర్‌ హైటెక్స్‌లో 14వ పౌల్ట్రీ ఇండియా ఎక్స్‌పో నిర్వహించారు. ఈ ఎక్స్‌పోను వీక్షించేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రతినిధులు, సందర్శకులు వచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ రంజిత్‌రెడ్డి అక్కడ ప్రదర్శనకు ఉంచిన కోడి పిల్లలను పరిశీలించారు. మాదాపూర్‌ హైటెక్స్‌లో 14వ పౌల్ట్రీ ఇండియా ఎక్స్‌పో నిర్వహించారు. ఈ ఎక్స్‌పోను వీక్షించేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రతినిధులు, సందర్శకులు వచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ రంజిత్‌రెడ్డి అక్కడ ప్రదర్శనకు ఉంచిన కోడి పిల్లలను పరిశీలించారు.
19/21
తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. నాలుగో రోజైన నేటి ఉదయం కల్పవృక్ష వాహనంపై రాజమన్నార్‌ అలంకారంలో అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు.	తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. నాలుగో రోజైన నేటి ఉదయం కల్పవృక్ష వాహనంపై రాజమన్నార్‌ అలంకారంలో అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు.
20/21
ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌.. దిగ్గజ దర్శకుడు కె.విశ్వనాథ్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. హైదరాబాద్‌లోని కె.విశ్వనాథ్‌ నివాసానికి వెళ్లిన కమల్‌ ఆయన యోగక్షేమాలు తెలుసుకున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో స్వాతిముత్యం, సాగరసంగమం, శుభసంకల్పం వంటి హిట్‌ చిత్రాలు వచ్చిన విషయం తెలిసిందే.	ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌.. దిగ్గజ దర్శకుడు కె.విశ్వనాథ్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. హైదరాబాద్‌లోని కె.విశ్వనాథ్‌ నివాసానికి వెళ్లిన కమల్‌ ఆయన యోగక్షేమాలు తెలుసుకున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో స్వాతిముత్యం, సాగరసంగమం, శుభసంకల్పం వంటి హిట్‌ చిత్రాలు వచ్చిన విషయం తెలిసిందే.
21/21
అక్కినేని నాగ చైతన్య హీరోగా దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న చిత్రం టైటిల్‌&ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న ఈ సినిమాకు ‘కస్టడీ’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. నేడు చైతూ పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్‌ను చిత్రబృందం సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది.	అక్కినేని నాగ చైతన్య హీరోగా దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న చిత్రం టైటిల్‌&ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న ఈ సినిమాకు ‘కస్టడీ’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. నేడు చైతూ పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్‌ను చిత్రబృందం సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది.

మరిన్ని

ap-districts
ts-districts