News In Pics : చిత్రం చెప్పే సంగతులు (24-11-2022)

Updated : 24 Nov 2022 13:35 IST
1/28
మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌తో తీసుకున్న ఫొటోను ప్రముఖ హెయిర్‌ స్టైలిస్ట్‌ అలీం హకీం సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘RC15’ సినిమాలో చరణ్‌ లుక్‌ను ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం షెడ్యూల్ నిమిత్తం వీరు న్యూజిలాండ్‌లో ఉన్నారు. మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌తో తీసుకున్న ఫొటోను ప్రముఖ హెయిర్‌ స్టైలిస్ట్‌ అలీం హకీం సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘RC15’ సినిమాలో చరణ్‌ లుక్‌ను ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం షెడ్యూల్ నిమిత్తం వీరు న్యూజిలాండ్‌లో ఉన్నారు.
2/28
కార్తిక మాసం ముగింపు సందర్భంగా యానాం రాజీవ్‌ బీచ్‌లోని పుష్కర స్నాన ఘాట్‌, శివం బాత్‌ పరిసరాలు భక్తుల రద్దీతో కిక్కిరిశాయి.
కార్తిక మాసం ముగింపు సందర్భంగా యానాం రాజీవ్‌ బీచ్‌లోని పుష్కర స్నాన ఘాట్‌, శివం బాత్‌ పరిసరాలు భక్తుల రద్దీతో కిక్కిరిశాయి.
3/28
కార్తికమాసం ముగింపు, పోలి స్వర్గం సందర్భంగా ఇవాళ తెల్లవారుజామున విజయవాడ కృష్ణానదీ తీరంలోని పున్నమిఘాట్‌, భవానీ ఘాట్‌లు దీపకాంతులతో మెరిసిపోయాయి. మహిళలు అరటి దొప్పలలో దీపాలు వెలిగించి భక్తితో నమస్కరించి నదిలో వదిలి మొక్కులు చెల్లించుకున్నారు. కార్తికమాసం ముగింపు, పోలి స్వర్గం సందర్భంగా ఇవాళ తెల్లవారుజామున విజయవాడ కృష్ణానదీ తీరంలోని పున్నమిఘాట్‌, భవానీ ఘాట్‌లు దీపకాంతులతో మెరిసిపోయాయి. మహిళలు అరటి దొప్పలలో దీపాలు వెలిగించి భక్తితో నమస్కరించి నదిలో వదిలి మొక్కులు చెల్లించుకున్నారు.
4/28
కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర మధ్యప్రదేశ్‌లో సాగుతోంది. ఈ యాత్రలో రాహుల్ సోదరి ప్రియాంక.. ఆమె భర్త రాబర్ట్ వాద్రా పాల్గొన్నారు. 
కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర మధ్యప్రదేశ్‌లో సాగుతోంది. ఈ యాత్రలో రాహుల్ సోదరి ప్రియాంక.. ఆమె భర్త రాబర్ట్ వాద్రా పాల్గొన్నారు.
5/28
సహజంగా మొక్కజొన్న మొక్కకు రెండు కణుపుల వద్ద రెండు పొత్తులు వస్తాయి. కూనవరం మండలం టేకులబోరులోని ఓ ఇంటి ఆవరణలో మొక్కజొన్న మొక్కకు ఒకే ప్రాంతంలో మూడు పొత్తులు వచ్చాయి. దీన్ని పలువురు ఆసక్తిగా తిలకించారు. సహజంగా మొక్కజొన్న మొక్కకు రెండు కణుపుల వద్ద రెండు పొత్తులు వస్తాయి. కూనవరం మండలం టేకులబోరులోని ఓ ఇంటి ఆవరణలో మొక్కజొన్న మొక్కకు ఒకే ప్రాంతంలో మూడు పొత్తులు వచ్చాయి. దీన్ని పలువురు ఆసక్తిగా తిలకించారు.
6/28
ప్రతి రోజూ ట్రాఫిక్‌ పోలీసులు విధించే జరిమానాల నుంచి తప్పించుకునేందుకు ఆకతాయిలు విభిన్న మార్గాలను ఎంచుకుంటున్నారు. బుధవారం హనుమకొండ అశోకా జంక్షన్‌ నుంచి రాంగ్‌ రూట్‌లో ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఓ యువకుడు.. ట్రాఫిక్‌ పోలీసులు, నిఘా నేత్రాల నుంచి తప్పించుకునేందుకు ఇలా వాహన నంబరు ప్లేట్‌కు పేపర్‌ చుట్టి తిరుగుతూ కనిపించాడు. ప్రతి రోజూ ట్రాఫిక్‌ పోలీసులు విధించే జరిమానాల నుంచి తప్పించుకునేందుకు ఆకతాయిలు విభిన్న మార్గాలను ఎంచుకుంటున్నారు. బుధవారం హనుమకొండ అశోకా జంక్షన్‌ నుంచి రాంగ్‌ రూట్‌లో ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఓ యువకుడు.. ట్రాఫిక్‌ పోలీసులు, నిఘా నేత్రాల నుంచి తప్పించుకునేందుకు ఇలా వాహన నంబరు ప్లేట్‌కు పేపర్‌ చుట్టి తిరుగుతూ కనిపించాడు.
7/28
దారుణ హత్యకు గురైన ఎఫ్‌ఆర్‌వో శ్రీనివాసరావు మంగళవారం ఉద్యోగ విధుల్లో ఉన్న చివరి క్షణాలివి. పోకలగూడెం బీట్‌ పరిధిలో కూలీలకు సూచనలిస్తున్న ఈ చిత్రాన్ని అధికారులు బుధవారం విడుదల చేశారు.   దారుణ హత్యకు గురైన ఎఫ్‌ఆర్‌వో శ్రీనివాసరావు మంగళవారం ఉద్యోగ విధుల్లో ఉన్న చివరి క్షణాలివి. పోకలగూడెం బీట్‌ పరిధిలో కూలీలకు సూచనలిస్తున్న ఈ చిత్రాన్ని అధికారులు బుధవారం విడుదల చేశారు.
8/28
అనంతపురం మండలం కాట్నేకాలువ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి అధ్వానంగా మారింది. అడుగుకో గుంతతో ప్రమాదాలు జరుగుతున్నాయని వాహన చోదకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  అనంతపురం మండలం కాట్నేకాలువ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి అధ్వానంగా మారింది. అడుగుకో గుంతతో ప్రమాదాలు జరుగుతున్నాయని వాహన చోదకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
9/28
గుర్రంపై ఉన్న మక్కువతో దానిని కొనుగోలు చేసి శివుడిగా నామకరణం చేసి ఇష్టంగా పెంచుకుంటున్నారు మునుగోడు మండలం ఇప్పర్తి గ్రామానికి చెందిన వెన్న మధుసూదన్‌రెడ్డి. 7 నెలల క్రితం రూ.20వేలతో ఓ గుర్రాన్ని కొని సొంత పనులకు వాడుకుంటున్నారు. నిత్యం గుర్రంపై స్వారీ చేస్తున్న మధుసూదన్‌రెడ్డిని చూసి స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గుర్రంపై ఉన్న మక్కువతో దానిని కొనుగోలు చేసి శివుడిగా నామకరణం చేసి ఇష్టంగా పెంచుకుంటున్నారు మునుగోడు మండలం ఇప్పర్తి గ్రామానికి చెందిన వెన్న మధుసూదన్‌రెడ్డి. 7 నెలల క్రితం రూ.20వేలతో ఓ గుర్రాన్ని కొని సొంత పనులకు వాడుకుంటున్నారు. నిత్యం గుర్రంపై స్వారీ చేస్తున్న మధుసూదన్‌రెడ్డిని చూసి స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
10/28
తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దు ఆదిలాబాద్‌ జిల్లా భీంపూర్‌ మండలంలో ఒకవైపు పులులు భయపెడుతుంటే.. మరో వైపు చలి వణికిస్తోంది. రాష్ట్ర చరిత్రలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు 2.7 డిగ్రీలు నమోదైన మండలం ఇది. ప్రజలతోపాటు మూగజీవాలు చలితీవ్రతను తట్టుకోలేపోతున్నాయి. వాటిపై దుప్పట్లు, కంబళ్లు వేసి అక్కడే చలిమంటలు వేస్తున్నారు.  తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దు ఆదిలాబాద్‌ జిల్లా భీంపూర్‌ మండలంలో ఒకవైపు పులులు భయపెడుతుంటే.. మరో వైపు చలి వణికిస్తోంది. రాష్ట్ర చరిత్రలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు 2.7 డిగ్రీలు నమోదైన మండలం ఇది. ప్రజలతోపాటు మూగజీవాలు చలితీవ్రతను తట్టుకోలేపోతున్నాయి. వాటిపై దుప్పట్లు, కంబళ్లు వేసి అక్కడే చలిమంటలు వేస్తున్నారు.
11/28
అరుణాచల్‌ ప్రదేశ్‌లోని పశ్చిమ సియాంగ్‌ జిల్లా బిరు గ్రామం స్వర్ణోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి పెమా ఖాండూ ఇలా ప్రత్యేక ఆహార్యంతో దర్శనమిచ్చారు. 
అరుణాచల్‌ ప్రదేశ్‌లోని పశ్చిమ సియాంగ్‌ జిల్లా బిరు గ్రామం స్వర్ణోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి పెమా ఖాండూ ఇలా ప్రత్యేక ఆహార్యంతో దర్శనమిచ్చారు.
12/28
కృష్ణా జిల్లా ఘంటసాల మండలం కొడాలి గ్రామానికి చెందిన ఆదర్శ రైతు గుమ్మడి ఫణి.. పెరట్లో భారీ సొరకాయ కాసింది. వారణాసి నుంచి తెచ్చిన నాటు విత్తనాన్ని రెండు నెలల క్రితం పెరట్లో నాటారు. అది ఏకంగా 5.5 అడుగుల పొడవు పెరిగి అందరినీ అబ్బురపరుస్తోంది.  కృష్ణా జిల్లా ఘంటసాల మండలం కొడాలి గ్రామానికి చెందిన ఆదర్శ రైతు గుమ్మడి ఫణి.. పెరట్లో భారీ సొరకాయ కాసింది. వారణాసి నుంచి తెచ్చిన నాటు విత్తనాన్ని రెండు నెలల క్రితం పెరట్లో నాటారు. అది ఏకంగా 5.5 అడుగుల పొడవు పెరిగి అందరినీ అబ్బురపరుస్తోంది.
13/28
విదేశాలకు వెళ్లేందుకు పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసేందుకు విజయవాడ ఎంజీ రోడ్డులో పాస్‌పోర్టు కార్యాలయానికి నిత్యం వందల సంఖ్యలో వస్తుంటారు. స్లాట్‌ బుక్‌ చేసుకొని నెల రోజుల తర్వాత దరఖాస్తులు ఇచ్చాక, పరిశీలన చేస్తారు. దీని కోసం నిల్చున్నవారే వీరంతా. ఉదయం 7 గంటల నుంచే కార్యాలయం కింద సెల్లార్‌లోనూ, గోడలపైనా, మొక్కలకు ఏర్పాటు చేసిన కుండీల వద్ద, ద్విచక్ర వాహనాలపైనా, మెట్లపైనా కూర్చుంటారు. సరైన వసతులు లేక ఇబ్బందిపడుతున్నారు. విదేశాలకు వెళ్లేందుకు పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసేందుకు విజయవాడ ఎంజీ రోడ్డులో పాస్‌పోర్టు కార్యాలయానికి నిత్యం వందల సంఖ్యలో వస్తుంటారు. స్లాట్‌ బుక్‌ చేసుకొని నెల రోజుల తర్వాత దరఖాస్తులు ఇచ్చాక, పరిశీలన చేస్తారు. దీని కోసం నిల్చున్నవారే వీరంతా. ఉదయం 7 గంటల నుంచే కార్యాలయం కింద సెల్లార్‌లోనూ, గోడలపైనా, మొక్కలకు ఏర్పాటు చేసిన కుండీల వద్ద, ద్విచక్ర వాహనాలపైనా, మెట్లపైనా కూర్చుంటారు. సరైన వసతులు లేక ఇబ్బందిపడుతున్నారు.
14/28
నల్లకుంట డివిజన్‌ శివంలో సత్యసాయిబాబా జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం అందించిన బ్యాటరీ వాహనాల్లో బుధవారం వేడుకలకు నాదర్‌గుల్‌ నుంచి దివ్యాంగులు వెళ్లారు. నల్లకుంట డివిజన్‌ శివంలో సత్యసాయిబాబా జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం అందించిన బ్యాటరీ వాహనాల్లో బుధవారం వేడుకలకు నాదర్‌గుల్‌ నుంచి దివ్యాంగులు వెళ్లారు.
15/28
సిటీ బస్సుల్ని నిర్ణీత స్టాపుల్లో కాకుండా రోడ్డుపై నిలిపితే  ట్రాఫిక్‌ పోలీసులు రూ.వెయ్యి జరిమానా విధిస్తున్నారు. దాంతో మాపై అంత భారమా అంటూ ఆర్టీసీ క్రాస్‌ రోడ్డులో  పోలీసులను బతిమాలుతున్న ఓ డ్రైవర్‌. సిటీ బస్సుల్ని నిర్ణీత స్టాపుల్లో కాకుండా రోడ్డుపై నిలిపితే ట్రాఫిక్‌ పోలీసులు రూ.వెయ్యి జరిమానా విధిస్తున్నారు. దాంతో మాపై అంత భారమా అంటూ ఆర్టీసీ క్రాస్‌ రోడ్డులో పోలీసులను బతిమాలుతున్న ఓ డ్రైవర్‌.
16/28
నిమ్మకాయ కంటే తక్కువ ధరకు కమల (సంత్రా) పండ్లు లభిస్తున్నాయి. కొత్తపేట మార్కెట్‌ వద్ద  శీతాకాలంలో విరివిగా దొరికే ఈ ఫలాలను రూపాయికి ఒకటి చొప్పున తోపుడు బండిపై అమ్ముతున్నారు. నిమ్మకాయ కంటే తక్కువ ధరకు కమల (సంత్రా) పండ్లు లభిస్తున్నాయి. కొత్తపేట మార్కెట్‌ వద్ద శీతాకాలంలో విరివిగా దొరికే ఈ ఫలాలను రూపాయికి ఒకటి చొప్పున తోపుడు బండిపై అమ్ముతున్నారు.
17/28
ఆదిభట్ల పురపాలిక గంగానగర్‌ కాలనీలో ఓపెన్‌ జిమ్‌ ఆవరణ అపరిశుభ్రతకు ఆనవాలుగా మారుతోంది. పిచ్చిమొక్కలు పెరుగుతున్నాయి. పరికరాల విడి భాగాలు ఊడిపోయాయి. అధికారులు సమస్యలు పరిష్కరించి జిమ్‌ను వినియోగంలోకి తేవాలని స్థానికులు కోరుతున్నారు. ఆదిభట్ల పురపాలిక గంగానగర్‌ కాలనీలో ఓపెన్‌ జిమ్‌ ఆవరణ అపరిశుభ్రతకు ఆనవాలుగా మారుతోంది. పిచ్చిమొక్కలు పెరుగుతున్నాయి. పరికరాల విడి భాగాలు ఊడిపోయాయి. అధికారులు సమస్యలు పరిష్కరించి జిమ్‌ను వినియోగంలోకి తేవాలని స్థానికులు కోరుతున్నారు.
18/28
విశాఖపట్నం జిల్లా పద్మనాభ క్షేత్రంలో శ్రీఅనంత పద్మనాభస్వామి వారి కొండ మెట్ల దీపోత్సవం బుధవారం వైభవంగా జరిగింది. భారీగా తరలివచ్చిన భక్తులు అనంతుని గిరిపై కొలువై ఉన్న అనంతపద్మనాభుని, కొండ దిగువున కుంతీమాధవున్ని, నారాయణేశ్వరస్వామిని దర్శించుకున్నారు. విశాఖపట్నం జిల్లా పద్మనాభ క్షేత్రంలో శ్రీఅనంత పద్మనాభస్వామి వారి కొండ మెట్ల దీపోత్సవం బుధవారం వైభవంగా జరిగింది. భారీగా తరలివచ్చిన భక్తులు అనంతుని గిరిపై కొలువై ఉన్న అనంతపద్మనాభుని, కొండ దిగువున కుంతీమాధవున్ని, నారాయణేశ్వరస్వామిని దర్శించుకున్నారు.
19/28
పంచారామ క్షేత్రమైన కుమార రామ భీమేశ్వరాలయం కార్తిక శోభ సంతరించుకుంది. కోటి దీపోత్సవం కనులపండువగా జరిగింది. పంచారామ క్షేత్రమైన కుమార రామ భీమేశ్వరాలయం కార్తిక శోభ సంతరించుకుంది. కోటి దీపోత్సవం కనులపండువగా జరిగింది.
20/28
మిడ్జిల్‌ మండలం వెలుగోముల, కొత్తూరు గ్రామాల నడుమ ప్రవహిస్తున్న దుందుభి వాగుపై ఏడాదిన్నర కిందట చెక్‌డ్యాం నిర్మించారు. అక్కడ ఎప్పుడూ నీరు నిల్వ ఉండడంతో పలు రకాల పక్షులు చేరి సందడి చేస్తున్నాయి. మిడ్జిల్‌ మండలం వెలుగోముల, కొత్తూరు గ్రామాల నడుమ ప్రవహిస్తున్న దుందుభి వాగుపై ఏడాదిన్నర కిందట చెక్‌డ్యాం నిర్మించారు. అక్కడ ఎప్పుడూ నీరు నిల్వ ఉండడంతో పలు రకాల పక్షులు చేరి సందడి చేస్తున్నాయి.
21/28
22/28
నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన సాయుధ పోరాటానికి గుర్తుగా హనుమకొండ జిల్లా పరకాల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన అమరధామం ఇది. దీని చుట్టూ దాదాపు 160 శిల్పాలకు ఇటీవల రంగులు వేశారు. దీంతో నాటి యోధుల పోరాట పటిమ ఈ శిల్పాల్లో కనిపిస్తోంది. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన సాయుధ పోరాటానికి గుర్తుగా హనుమకొండ జిల్లా పరకాల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన అమరధామం ఇది. దీని చుట్టూ దాదాపు 160 శిల్పాలకు ఇటీవల రంగులు వేశారు. దీంతో నాటి యోధుల పోరాట పటిమ ఈ శిల్పాల్లో కనిపిస్తోంది.
23/28
వరంగల్‌ నిట్ కళాశాలలో బీటెక్‌ కోర్సు పలు విభాగాల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు నృత్యంలో శిక్షణ.. వరంగల్‌ నిట్ కళాశాలలో బీటెక్‌ కోర్సు పలు విభాగాల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు నృత్యంలో శిక్షణ..
24/28
పాల్వంచ మండల పరిధిలోని పాయంకారు యానంబైలు పంచాయతీ పరిధిలోని పుల్లాయిగూడానికి చెందిన గొడుగు వెంకటేశ్వర్లు ఇంట్లో మొక్కజొన్న ఏకంగా 14 అడుగులు పెరిగింది. చివర్లో కంకి ఉండటంతో మరింత ఆకర్షణగా కనిపిస్తోంది. అటుగా రాకపోకలు సాగించేవారంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు. పాల్వంచ మండల పరిధిలోని పాయంకారు యానంబైలు పంచాయతీ పరిధిలోని పుల్లాయిగూడానికి చెందిన గొడుగు వెంకటేశ్వర్లు ఇంట్లో మొక్కజొన్న ఏకంగా 14 అడుగులు పెరిగింది. చివర్లో కంకి ఉండటంతో మరింత ఆకర్షణగా కనిపిస్తోంది. అటుగా రాకపోకలు సాగించేవారంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు.
25/28
26/28
గ్రామాల్లో కోతులు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రోడ్డు మీద వెళ్లే ప్రయాణికులను ఇబ్బంది పెడుతున్నాయి. ఇంటి ముందు ఆరబోసిన ధాన్యాన్ని పాడు చేస్తున్నాయి.  అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం చిన్నరావిరాలకు చెందిన లక్ష్మమ్మ ఓ స్పీకర్‌ చేత పట్టుకొని వింత శబ్దాలు చేస్తుండటంతో భయపడిపారిపోతున్నాయి. లేకుంటే ఒక్క గింజ కూడా చేతికి రానివ్వవని లక్ష్మమ్మ వాపోయారు. గ్రామాల్లో కోతులు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రోడ్డు మీద వెళ్లే ప్రయాణికులను ఇబ్బంది పెడుతున్నాయి. ఇంటి ముందు ఆరబోసిన ధాన్యాన్ని పాడు చేస్తున్నాయి. అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం చిన్నరావిరాలకు చెందిన లక్ష్మమ్మ ఓ స్పీకర్‌ చేత పట్టుకొని వింత శబ్దాలు చేస్తుండటంతో భయపడిపారిపోతున్నాయి. లేకుంటే ఒక్క గింజ కూడా చేతికి రానివ్వవని లక్ష్మమ్మ వాపోయారు.
27/28
సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు, వీడియోలు ఉంచడం కోసం కొందరు సాహసాలు చేస్తున్నారు. నగర శివారు కొహెడ సమీపంలోని ప్రసన్నాంజనేయస్వామి దేవాలయం వద్ద చిత్రమిది. యువకులు తమ సెల్‌ఫోన్లలో ఫొటోలు, వీడియోలు తీసుకోవడం కోసం కొండ చివరకు వెళ్లారు. ప్రమాదకర ప్రదేశంలో పోజులిస్తూ ఫొటోలు దిగారు. సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు, వీడియోలు ఉంచడం కోసం కొందరు సాహసాలు చేస్తున్నారు. నగర శివారు కొహెడ సమీపంలోని ప్రసన్నాంజనేయస్వామి దేవాలయం వద్ద చిత్రమిది. యువకులు తమ సెల్‌ఫోన్లలో ఫొటోలు, వీడియోలు తీసుకోవడం కోసం కొండ చివరకు వెళ్లారు. ప్రమాదకర ప్రదేశంలో పోజులిస్తూ ఫొటోలు దిగారు.
28/28
కార్తిక మహాదీపోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం విద్యుద్దీపాలంకరణలో అరుణాచలేశ్వరస్వామి ఆలయం. కార్తిక మహాదీపోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం విద్యుద్దీపాలంకరణలో అరుణాచలేశ్వరస్వామి ఆలయం.

మరిన్ని